యూఎస్లో కాల్పులు: ముగ్గురు మృతి | Three killed in US apartment shooting | Sakshi
Sakshi News home page

యూఎస్లో కాల్పులు: ముగ్గురు మృతి

Published Thu, Nov 21 2013 9:16 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

Three killed in US apartment shooting

అమెరికాలోని హ్యూస్టస్ నగరంలో అపరిచితుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. ఆ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారని, అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

అపరిచితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ... నిన్న సాయంత్రం 5.00 గంటల ప్రాంతంలో హ్యూస్టన్లోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి అపరిచితుడు ప్రవేశించి, పలువురి వ్యక్తుల తలలపై గురి పెట్టి తుపాకితో కాల్చాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆ ఘటనతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారని పోలీసులకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement