Houston
-
అమెరికాలో మరో విమాన ప్రమాదం.. వణికిపోయిన ప్రయాణీకులు
హ్యూస్టన్: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే రెండు విమాన ప్రమాదాల సంభవించగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. అమెరికాలో హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. భారత స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా దాని రెక్కలలో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది విమానంలో నుంచి ప్రయాణీకులను దింపేసారు. ఈ క్రమంలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. A United Airlines flight from Houston to New York had to be evacuated after it caught fire during takeoff, according to the FAA.The FAA says that the crew of United Airlines Flight 1382 had to stop their takeoff from George Bush Intercontinental/Houston Airport due to a… pic.twitter.com/w0uJuvBdan— Breaking Aviation News & Videos (@aviationbrk) February 2, 2025 -
USA Presidential Elections 2024: కమలా హారిస్‌కు గాయని బియాన్స్ మద్దతు
హూస్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీకి దిగుతున్న కమలా హారిస్‌కు ప్రఖ్యాత గాయని బియాన్స్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం రాత్రి హూస్టన్‌లో జరిగిన డెమొక్రటిక్ ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ఒక సెలబ్రిటీకి ఇక్కడికి రాలేదు. ఒక రాజకీయ నాయకురాలిగా రాలేదు. ఒక తల్లిగా వచ్చాను. మన బిడ్డలు ప్రతిబంధకాలు, పరిమితులు లేకుండా పెరగాలంటే కమలా హారిస్‌కు ఓటు వేయాలి’’అని పిలుపునిచ్చారు. హూస్టన్ బియాన్స్ సొంత నగరం కావడం విశేషం. 2016లోనూ ఆమె అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు పలికారు. క్లీవ్‌లాండ్‌లో ప్రచార సభలో హిల్లరీకి మద్దుతుగా ఒక పాట కూడా పాడారు. ఈసారి మాత్రం పాడలేదు. కమలా హారిస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. హూస్టన్ సభలో కమలా హారిస్ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. మహిళల పునరుత్పత్తి హక్కుల విషయంలో గత 50 ఏళ్లలో సాధించిన ప్రగతిని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. మహిళలకు హక్కులు నిరాకరించారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
శుభాన్షు శుక్లా... ఎంటర్ ద ‘డ్రాగన్’
ప్రతిష్టాత్మక ఆక్సియం స్పేస్ ఏఎక్స్–4 మిషన్‌కు ఎంపికైన భారత వ్యోమగామి, వైమానిక దళ గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా తాము ప్రయాణించబోయే అత్యాధునిక డ్రాగన్ వ్యోమనౌకను తొలిసారి సందర్శించారు. అమెరికాలో హూస్టన్‌లోని స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిగతా ముగ్గురు సిబ్బందిని ముఖాముఖి కలుసుకున్నారు. వారంతా కలిసి వ్యోమనౌకలో కాసేపు గడిపారు. స్పేస్సూట్కు కొలతలివ్వడంతో పాటు ప్రెజరైజేషన్ తదితర తప్పనిసరి పరీక్షల్లో వారంతా పాల్గొన్నారు. దీంతో వారందరికీ శిక్షణ ప్రక్రియ లాంఛనంగా మొదలైనట్టయింది. ఈ మిషన్‌కు నాసా వ్యోమగామి పెగీ వాట్సన్ సారథ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 10 రోజుల పాటు పలు ప్రయోగాలు, పరిశోధనల్లో గడుపుతారు. ప్రైవేట్ వ్యక్తులు, పరిశోధకులకు ఐఎస్ఎస్ సందర్శనకు వీలు కలి్పచేందుకు స్పేస్ ఎక్స్ తలపెట్టిన నవతరం వాణిజ్య అంతరిక్ష యాత్రల్లో ఆక్సియం స్పేస్ మిషన్ నాలుగోది. ఆక్సియం స్పేస్, స్పేస్ ఎక్స్, నాసా భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరుగుతోంది. -
కుర్చీ మడతపెట్టి పాట NBA గేమ్ హాఫ్‌టైమ్‌లో ప్లే చేసారు
-
హూస్టన్ మహానగరంలో ఘనంగా దిపావళి వేడుకలు
-
అంతరిక్షం టూ భూలోకం.. ఏం గుట్టు విప్పుతుందో?
వాషింగ్టన్: అల్లంత దూరాన అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్ తాలూకు తొలి శాంపిల్‌ను అమెరికా భూమి మీదికి తీసుకొచ్చింది. ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం నుంచి విసిరేసిన శాంపిల్ క్యాప్సూల్ 4 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం అమెరికాలోని ఉటా ఎడారిలో సైనిక భూభాగంలో దిగింది. నమూనాను సోమవారం హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అనంతరం వాటిమీద పరీక్షలు, పరిశోధనలు చేస్తారు. అక్కడ గతంలో తెచ్చిన చంద్ర శిలలున్నాయి. వాటిని 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుని మీదికి వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తీసుకొచ్చారు. తాజా క్యాప్సూల్ లో కనీసం పావు కేజీ పరిమాణంలో ఆస్టరాయిడ్ తాలూకు శకలాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి ఎలా రూపొందిందో, దానిపై జీవం ఎలా వికసించిందో అర్థం చేసుకోవటానికి అవి మరింతగా ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటిదాకా జపాన్ ఒక్కటే ఆస్టరాయిడ్ శకలాలను భూమికి తెచ్చింది. Today's #OSIRISREx asteroid sample landing isn't just the end of a 7-year, 3.9-billion-mile journey through space. It takes us 4.5 billion years back in time. These rocks will help us understand the origin of organics and water that may have seeded life on Earth.… pic.twitter.com/sHLRrnWqAg — NASA (@NASA) September 24, 2023 ఏడేళ్ల ప్రయత్నం... ఆస్టరాయిడ్లపై పరిశోధన నిమిత్తం నాసా 2016లో 100 కోట్ల డాలర్ల ఖర్చుతో ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. రెండేళ్ల అనంతరం అది బెన్నూగా పిలిచే ఆస్టరాయిడ్ ఉపరితలంపై దిగింది. 2020లో దాని మీదినుంచి స్వల్ప పరిమాణంలో శకలాలను ఒక క్యాప్సూల్ లోకి సేకరించి వెనుదిరిగింది. అప్పటికే అది కోట్లాది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న బెన్నూ ఆస్టరాయిడ్ ప్రస్తుతం భూమికి 8.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది 2182 సంవత్సరంలో భూమికి అతి సమీపంగా వస్తుందని, అప్పుడది బహుశా మనను ఢీకొనే ప్రమాదమూ లేకపోలేదని అంచనా. ఓసిరిస్ ఎక్స్ ప్రస్తుతం అపోఫిస్‌గా పిలిచే మరో ఆస్టరాయిడ్ వైపు పయనిస్తోంది. బెన్నూ రైట్ ఛాయిస్ సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైంది. దీన్ని శోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చు. బెన్నూ.. కర్బన పదార్థాలు పుష్కలంగా ఉండే కార్బనేషియస్ తరగతి గ్రహశకలం. ఇలాంటి ఖగోళ వస్తువులు గ్రహాల నిర్మాణంలో ‘ఇటుకల్లా’ పనిచేసి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. దీనిపై సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఖగోళశాస్త్రంలో నేడున్న అతిపెద్ద ప్రశ్న.. జీవానికి ప్రధాన కారణమైన నీరు, సేంద్రియ పదార్థాలు భూమి మీద పుష్కలంగా ఉండటానికి కారణమేంటి? వందల కోట్ల ఏళ్ల కిందట బెన్ను వంటి గ్రహశకలాలు వీటిని భూమికి చేరవేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గుట్టును ఒసైరిస్-రెక్స్ నమూనాలు విప్పే అవకాశం ఉంది. చాలా గ్రహశకలాలు.. అంగారకుడు, గురుడు మధ్య ఉన్న గ్రహశకల వలయంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బెన్నూ మాత్రం ఆరేళ్లకోసారి భూమికి చేరువగా వచ్చి వెళుతుంటుంది. అందువల్ల ఆ గ్రహశకలం వద్దకు వ్యోమనౌకను పంపి, భూమికి తిరిగి రప్పించడం చాలా సులువు. ఉత్కంఠ ప్రయాణంలో.. రోదసిలో దాదాపు మూడేళ్ల ప్రయాణం తర్వాత ఒసైరిస్-రెక్స్.. భూమికి చేరువైంది. భూ ఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆదివారం సాయంత్రం ఈ వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్సూల్ విడిపోయింది. ఆ తర్వాత నాలుగు గంటలు ప్రయాణించాక క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది. గాలి రాపిడి వల్ల చెలరేగిన 3వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఉష్ణ రక్షణ కవచం సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో అది సురక్షితంగా దిగింది. హెలికాప్టర్లో వచ్చిన బృందాలు దీన్ని సేకరించి, సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్‌లోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు పంపుతారు. 50 ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకొచ్చిన నమూనాలు కూడా అక్కడే ఉన్నాయి. ఒసైరిస్-రెక్స్.. తన ఏడేళ్ల ప్రస్థానంలో.. సుమారు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. -
పబ్లిక్ లో రచ్చ చేసింది జైలు పాలయ్యింది
దుబాయ్: అమెరికా టిక్ టాకర్ ఎరక్కపోయి దుబాయ్ లో ఇరుక్కుపోయింది. తన స్నేహితుడితో జాలీ ట్రిప్ కోసం యూఏఈ వెళ్లిన టియెర్రా యంగ్ అలెన్ అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ చేసింది. తర్వాత అనవసరంగా అద్దె కార్ షోరూం యజమానిపై నోరు జారి న్యూసెన్స్ చేసి జైలు పాలయ్యింది. అమెరికాకు చెందిన టిక్ టాక్ స్టార్ టియెర్రా యంగ్ అలెన్(29) యూఏఈ పర్యటనకు వచ్చి చిక్కుల్లో పడింది. దుబాయ్ లో తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంటుకు గురి కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవింగ్ చేస్తున్నందుకు బాయ్ ఫ్రెండ్ ను అరెస్టు చేశారు. టిక్ టాకర్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు అద్దెకు కారు తీసుకున్నప్పుడు షోరూంలో ఇద్దరూ తమ గుర్తింపు కార్డులు అక్కడ వారికిచ్చారు. మరుసటి రోజున అమెరికా తిరిగి ప్రయాణమవ్వనున్న నేపథ్యంలో అలెన్ కారు షోరూంకి వెళ్లి తన ఐడెంటిటీ కార్డులు తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ ఆ కార్ షోరూం యజమాని కేసు తేలేంత వరకు అవి ఇవ్వడం కుదరదని చెప్పడంతో టిక్ టాకర్ రెచ్చిపోయింది. షోరూం యజమానిపై చిర్రుబుర్రులాడి గట్టి గట్టిగా అరుస్తూ గొడవ చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. Tierra Young Allen, Truck Driver TikTok Star, Is Detained in #Dubai! She is accused of ‘Screaming’ at a rental car agent. Will she get the #BrittneyGriner treatment and get her home sooner than later? 🤔 pic.twitter.com/GOIca0H58J — WOKEVIDEO (@wokevideo) July 16, 2023 ఇది కూడా చదవండి: ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు.. -
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
హ్యూస్టన్: హూస్టన్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకున్న కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఓ అపార్ట్మెంట్ భవనానికి నిప్పుపెట్టిన ఓ వ్యక్తి అందులోని వారు బయటకు రాగానే షాట్గన్తో కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో గాయపడిన ఐదుగురిలో ముగ్గురు చనిపోయారు. అగ్ని ప్రమాదం సంభవించేందనే సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బందిపైనా కాల్పులకు దిగాడు. పోలీసుల కాల్పుల్లో చివరికి అతడు హతమయ్యాడు. చదవండి: (3 నెలల పాటు వండారు.. 8 నెలలు తిన్నారు) -
తుపాకుల రాజ్యం.. జనాభా కంటే వాటి సంఖ్యే ఎక్కువ
అమెరికాలో బఫెలో నగరంలో ఆదివారం ఓ శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో 10 మంది నల్ల జాతీయులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం కూడా వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు బలయ్యారు. ఈ ఏడాది అక్కడ ఇప్పటికే ఇలాంటి మూకుమ్మడి కాల్పుల ఘటనలు ఏకంగా 198 జరిగాయి. అంటే సగటున వారానికి పదన్నమాట! 2017లో లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 56 మంది పౌరులు మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాలో ఈ నిత్య మారణకాండకు అక్కడి తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం. అమెరికాలో తుపాకుల సంస్కృతి దాదాపు ఆ దేశ పుట్టుకతోనే మొదలైందని చెప్పవచ్చు. బ్రిటిష్ పాలనలో ఉండగా అమెరికాలో పోలీసు వ్యవస్థ గానీ, చెప్పుకోదగ్గ భద్రతా వ్యవస్థ గానీ లేకపోవడంతో స్వీయరక్షణ కోసం పౌరులు తుపాకులు చేపట్టడం మొదలుపెట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ పౌరులకు తుపాకులు ధరించే స్వేచ్ఛ కల్పించింది. ఇన్నేళ్లలో తుపాకీ సంస్కృతికి దేశంలో లక్షలాది మంది బలైనా తుపాకుల చట్టానికి చిన్నాచితకా మార్పులతో సరిపెడుతూ వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ). ఏమిటీ ఎన్ఆర్ఏ? అమెరికా అంతర్యుద్ధంలో పాలుపంచుకున్న ఇద్దరు సైనికులు తుపాకుల సంస్కృతిని ప్రచారం చేసేందుకు 1871లో ఎన్ఆర్ఏను స్థాపించారు. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఈ సంస్థ లాబీయింగ్‌తో దాన్ని విజయవంతంగా అడ్డుకుంటూ వస్తోంది. సెనేటర్లను ప్రలోభపెట్టేందుకు, ప్రభావితం చేసేందుకు తన దగ్గరున్న అపార వనరులను ఏటా భారీగా వెదజల్లుతోంది. పైగా మాజీ అధ్యక్షులు, నేతలు, సినీ స్టార్ల వంటి ప్రముఖులెందరో ఈ సంస్థలో సభ్యులు. ఇటీవల పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. తుపాకుల నియంత్రణ కోసం కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్‌ఆర్‌ఏకు దీటుగా నిధులు సేకరించి తుపాకీ సంస్కృతి వ్యతిరేక ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ సంస్థలు 2018లో తొలిసారి ఎన్ఆర్ఏ కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు అంచనా. పౌరులదీ అదే దారి తుపాకుల వాడకం, నియంత్రణ విషయంలో అమెరికా పౌరులు కూడా రెండుగా చీలిపోయారు. తుపాకుల వాడకంపై గట్టి నియంత్రణ ఉండాలని కేవలం 52 శాతం మందే కోరుతున్నట్టు గాలప్ అనే సంస్థ 2020లో చేసిన సర్వేలో తేలింది. తుపాకుల వాడకానికి ఉన్న స్వేచ్ఛ ఇలాగే కొనసాగాలని 32 శాతం చెప్పారు. 11 శాతం మందైతే ప్రస్తుతమున్న కొద్దిపాటి నియంత్రణను కూడా ఎత్తేయాలంటున్నారు! చట్టసభ్యుల విషయానికొస్తే డెమొక్రాట్లలో 91 శాతం, రిపబ్లికన్లలో 24 శాతం తుపాకులపై నియంత్రణ డిమాండ్‌కు మద్దతిస్తున్నారు. అంగడి సరుకులు మన దగ్గర కూరగాయల దుకాణాల్లాగే అమెరికాలో అడుగడుగునా తుపాకుల దుకాణాలున్నాయి. తుపాకీ సంపాదించడం అమెరికా పౌరులకు చాలా సులువైన వ్యవహారం. 21 ఏళ్లు దాటి, నేరచరిత్ర, మానసిక సమస్యలు లేకుంటే చాలు. తుపాకీ లైసెన్సు దొరికేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో ప్రతి 100 మంది పౌరులకు ఏకంగా 120 తుపాకులున్నాయి! ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న యెమన్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరి వద్ద మాత్రమే తుపాకీ ఉంది. నలుగురు అధ్యక్షులు బలయ్యారు ఎక్కడపడితే అక్కడ అతి సులువుగా దొరుకుతున్న తుపాకులు అమెరికాలో విచ్చలవిడి హత్యలతో పాటు ఆత్మహత్యలకూ కారణమవుతున్నాయి. 2020లో 19,384 మంది కాల్పులకు బలైతే, కాల్చుకుని చనిపోయిన వారి సంఖ్య 24,292! నలుగురు అమెరికా అధ్యక్షులు కూడా తుపాకులకే బలైపోయారు. అబ్రహం లింకన్, జేమ్స్ ఎ.గార్ఫీల్డ్, విలియం మెకెన్లీ, జాన్ ఎఫ్.కెనెడీ తూటాలకు నేలకొరిగారు. రోనాల్డ్ రీగన్, ఆండ్రూ జాక్సన్, హారీ ఎస్.ట్రూమన్ తదితర అధ్యక్షులపై హత్యా ప్రయత్నాలు జరిగినా ప్రాణాలతో బయట పడ్డారు. తుపాకుల నీడలో ► అమెరికాలో సగటున రోజుకు 50 మందికి పైగా తుపాకులకు బలైపోతున్నారు. ► జనాభాలో 58 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో తుపాకుల బెదిరింపులకు లోనైనవారే. ► దేశంలో సగటున ఏటా 37 మంది టెర్రరిస్టుల దాడిలో చనిపోతుంటే, తుపాకుల సంస్కృతికి ఏకంగా 11,000 మంది బలవుతున్నారు. ► దేశంలో 63 వేల మంది లైసెన్సుడ్ ఆయుధ వ్యాపారులున్నారు. వీరు ఏటా 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులు అమ్ముతున్నారు. అమెరికాలో మళ్లీ కాల్పులు మరో ముగ్గురి దుర్మరణం లాగునావుడ్స్: అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం కొనసాగుతూనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా చర్చి, హూస్టన్‌లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా చర్చిలో మధ్యాహ్న భోజన సమయంలో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులకు సమాచారమంది వారు వచ్చేలోపే కాల్పులకు ఒకరు బలవగా ఐదుగురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం భక్తులు దుండగున్ని బంధించారు. కాల్పులకు దిగిన వ్యక్తి 60 ఏళ్ల ఆసియా సంతతికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనుక ఉద్దేశం తెలియరాలేదు. ఇంకో ఘటనలో హూస్టన్ మార్కెట్లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. వీటిలో ఇద్దరు మరణించగా ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బఫెలోలో ఓ శ్వేతజాతి యువకుడు పదిమందిని కాల్చిచంపిన విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెక్సాస్ మ్యూజిక్ ఫెస్ట్‌లో తొక్కిసలాట
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక మ్యూజిక్ ఫెస్టివల్లో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ చూడడానికి జనం ఎగబడడంతో ఈ ఘోరం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 50 వేల మంది హాజరయ్యారు. వారంతా ఒకే సారి వేదికపైకి దూసుకురావడంతో ఒకరి మీద మరొకరు పడి జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు హూస్టన్ చీఫ్ శామ్ పేన శనివారం మీడియాకు వెల్లడించారు. అమెరికన్లలో మంచి క్రేజ్ ఉన్న ర్యాపర్ స్కాట్ ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్‌ను గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తే టిక్కెట్లు మే నెలలోనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఫెస్టివల్చూడడానికి వచ్చిన జనం స్టేజీ వైపుగా వెళ్లడానికి చేసే ప్రయత్నాల్లో తొక్కిసలాట జరిగినట్టు అమెరికన్ మీడియా వెల్లడించింది. ఆ అభిమానుల్ని కట్టడి చేయడంలో భద్రతా సిబ్బంది విఫలం కావడంతో ఈ దారుణం జరిగింది. జనం భయాందోళనకు గురై పరుగులు పెట్టడంతో చాలా మందికి గాయాలయ్యాయి. దీంతో అప్పటికప్పుడు ఫెస్టివల్‌ని రద్దు చేశారు. ఆ పక్కనే తాత్కాలికంగా ఆస్పత్రి ఏర్పాటు చేసి 300 మందికి పైగా చికిత్స చేసినట్టుగా శామ్ వెల్లడించారు. -
వైరల్: అధైర్యం వద్దు.. నీకు నేనున్నా..
హూస్టన్ : కరోనా బాధితుడి ఆవేదన విని కరిగిపోయి ఆలింగనం చేసుకున్న వైద్యుడి ఫొటో అమెరికా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన సేవల పట్ల జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హూస్టన్‌లోని యునైటెడ్ మెమోరియల్ మెడికల్ సెంటర్లో డాక్టర్ జోసెఫ్ వరోన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పని చేస్తున్నారు. 252 రోజులుగా కరోనా బాధితుల సేవలోనే నిమగ్నమయ్యారు. థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా తనకు సెలవు అయినప్పటికీ పీపీఈ కిట్ ధరించి, విధులకు హాజరయ్యారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు తన గోడు చెప్పుకోగా, డాక్టర్ జోసెఫ్ తీవ్రంగా చలించిపోయారు. వెంటనే ఆ బాధితుడిని సానుభూతితో ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాన్ని ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో వెంటనే సోషల్ మీడియాలో పాకిపోయింది. (స్వల్ప అస్వస్థతకు గురైన బైడెన్) -
శృంగార ఔషధంతో కరోనా కట్టడి!
హ్యూస్టన్: అంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్ఎఫ్-100 (అవిప్టడిల్) ఔషధం కరోనాకు విరుగుడుగా ఉపయోగపడుతోందని పరిశోధనల్లో తేలింది. దీనిని సాధారణంగా ముక్కు ద్వారా పీల్చడం ద్వారం అంగస్తంభన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ ఔషదాన్ని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా బాధితులకు బహుళ క్లినికల్ సైట్లలో అత్యవసరంగా ఉపయోగించడం కోసం ఎఫ్‌డీఏ చేత ఆమోదించబడింది. చికిత్సలో వాడిన తర్వాత వెంటిలేటర్లపై ఉన్న కరోనా బాధితులు వేగంగా కోలుకున్నట్లు హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ నివేదించింది. ఈ మందు పేటెంట్ హక్కులు కలిగి ఉన్న స్విట్జర్లాండ్ కంపెనీ రిలీఫ్ థెరపాటిక్స్, ఇజ్రాయెలీ-అమెరికన్ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఈ ఔషధాన్ని ఉపయోగించి కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు జూన్ నెలలో అనుమతులు లభించాయి. (కరోనా; అద్భుతమైన వ్యాక్సిన్ తయారు) అమెరికాలోని హ్యూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 54 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విఫలం కావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో అతనికి కరోనా సోకింది. ఈ క్రమంలో తీవ్ర శ్వాసకోశ సమస్య తలెత్తడంతో అతనికి ఆర్ఎల్ఎఫ్-100 ఔషదాన్ని ఇచ్చారు. అతడి ఆరోగ్యం నాలుగు రోజుల వ్యవధిలోనే మెరుగుపడి వెంటిలేటర్‌పై నుంచి జనరల్ వార్డుకు మారారు. మరో 15 మంది కూడా ఇదే విధంగా త్వరగా కోలుకున్నారు. దీంతో మరి కొందరిపై ప్రయోగాలు చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగ ఫలితాలు మరింత సానుకూలంగా వస్తే కరోనా నుంచి వేగంగా కోలుకునే అవకాశం ఉంది. కాగా.. ఆర్ఎల్ఎఫ్-100 ఔషదం వాడటం వల్ల మోనోసైట్స్‌లో తెల్లరక్తకణాల సంఖ్య వృద్ధి చెందకుండా నిరోధిస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
ప్రతీకార చర్యలు ప్రారంభించిన చైనా
బీజింగ్: అమెరికా, చైనా మధ్య దౌత్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్‌ను మూసివేయించడంతో చైనా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆగ్నేయ సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్‌ను మూసివేయాలని ఆదేశించినట్టు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘చైనా అమెరికా మధ్య సంబంధాలు ఇలా క్షీణించాలని మేము కోరుకోవడం లేదు. దీనికంతటికీ అమెరికాదే బాధ్యత. అమెరికా తన తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకొని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం’’అని ఆ ప్రకటన పేర్కొంది. భద్రతకు భంగం కలిగిస్తున్నారు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ గూఢచర్య ఆరోపణలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించినట్టుగానే చైనా కూడా అదే బాటలో నడిచింది. చెంగ్డూ కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకుంటూ దేశ భద్రతా ప్రయోజనాలకు హాని తలపెడుతున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. హ్యూస్టన్‌లో కాన్సులేట్ మూసివేయాలన్న అమెరికా నిర్ణయానికి ఇది సరైన ప్రతిస్పందనని ఆయన అన్నారు. తమ నిర్ణయం చట్టబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకి వ్యూహాత్మక ప్రాంతం చెంగ్డూలో అమెరికా కాన్సులేట్‌ని 1985లో ప్రారంభించారు. అందులో 200మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 150 మందికిపైగా స్థానికులే. సమస్యాత్మక ప్రాంతమైన టిబెట్ గురించి సమాచారాన్ని సేకరించడానికి చెంగ్డూలో కాన్సులేట్ అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. అంతేకాదు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ ఎంత పెద్దదో, ఎందరు ఉద్యోగులు ఉంటారో, సరిగ్గా చెంగ్డూలో కూడా అంతే మంది పనిచేస్తారు. వాటి ప్రాధాన్యాలు కూడా ఒకటే. తొలుత వూహాన్లో అమెరికా కాన్సులేట్ మూసివేయాలన్న ఆదేశాలిస్తారని భావించారు కానీ చెంగ్డూ అయితేనే దెబ్బకి దెబ్బ తీసినట్టు అవుతుందని చైనా ప్రభుత్వం భావించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో చైనా విద్యార్థుల అరెస్ట్ వీసాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నలుగురు చైనీయులపై కేసు నమోదు చేసింది. వీరు చైనా సైన్యంలో పనిచేసినప్పటికీ, ఆ వివరాలు దాచిపెట్టి, రీసెర్చ్ కోసం అమెరికాకి వచ్చినట్టు ఆరోపించింది. ఇందులో ముగ్గురిని ఎఫ్‌బీఐ అరెస్టు చేయగా, నాలుగో వ్యక్తి శాన్ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్ కార్యాలయంలో ఆశ్రయం పొందినట్లు వారు చెప్పారు. వీరందరిపై వీసా మోసానికి సంబంధించిన కేసు నమోదయ్యింది. నేర నిరూపణ అయితే పదేళ్ల జైలు శిక్ష, రూ.1.88 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
చైనా కాన్సులేట్‌లో పత్రాల కాల్చివేత
హ్యూస్టన్: అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య వాణిజ్య, దౌత్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో నుంచి మంటలు, పొగలు కనిపించాయి. దీంతో అగ్ని ప్రమాదం జరుగుతోందని భావించిన స్థానికులు రాత్రి 8 గంటలకు(అక్కడి కాలమానం ప్రకారం) పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. This video shared with us by a viewer who lives next to the Consulate General of China in #Houston shows fire and activity in the courtyard of the building. DETAILS SO FAR: https://t.co/2cOeKoap96 pic.twitter.com/0myxe6HIlC — KPRC2Tulsi (@KPRC2Tulsi) July 22, 2020 వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడి దృశ్యాన్ని చూసి నివ్వెర పోయారు. కాన్సులేట్ కార్యాలయ అధికారులు కావాలనే కొన్ని పత్రాలను తగులబెడుతున్నట్లు కనిపించింది. ఈమేరకు స్థానిక మీడియా కొన్ని వీడియో క్లిప్పింగ్‌లను ప్రసారం చేసింది. అందులో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పత్రాలను తగలబెట్టడం స్పష్టమవుతోంది. అయితే వారు ఏ పత్రాలను తగులబెట్టారు? ఎందుకు వాటిని బూడిద చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది. (చైనాకు షాక్: భారత్-అమెరికా యుద్ధ విన్యాసాలు) .@HoustonFire and @houstonpolice are responding to reports of documents being burned at the Consulate General of China on 3417 Montrose Boulevard. Here's what the scene looks like there right now. pic.twitter.com/grUHhqmUz4 — KPRC2Tulsi (@KPRC2Tulsi) July 22, 2020 చదవండి: హ్యాండ్సప్.. డోంట్ షూట్! -
ఫ్లాయిడ్‌కు కన్నీటి వీడ్కోలు
హ్యూస్టన్/వాటికన్ సిటీ: పోలీస్ అధికారుల దాష్టీకానికి బలైన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలు మంగళవారం ఘనంగా ముగిశాయి. వందలాది మంది మద్దతుదారులు ముఖానికి మాస్కులు ధరించి మరీ హ్యూస్టన్‌లోని ఓ చర్చిలో ఫ్లాయిడ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఫ్లాయిడ్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం కాగా.. అమెరికాలో జాతివివక్షకు ఇకనైనా చరమగీతం పాడాల్సిందేనని పిలుపునిచ్చారు. గత నెల 25న మినియాపోలిస్‌లో డెరెక్ ఛావెన్ అనే శ్వేతజాతీయుడైన పోలీస్ అధికారి అరెస్ట్ చేసే క్రమంలో గొంతుపై మోకాలిని ఉంచడం.. దీంతో ఊపిరిఆడక ఫ్లాయిడ్ మరణించడం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ఒక రోజంత ఉంచిన తరువాత మంగళవారం తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్‌ను ఖననం చేశారు. ఫ్లాయిడ్ హత్యపై స్పందించిన పోప్: ఫ్లాయిడ్ హత్య అనంతరం జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఆందోళనల్లో అమెరికా బిషప్ ఒకరు పాల్గొని, ప్రార్థనలు చేయడాన్ని పోప్ ఫ్రాన్సిస్ సమర్ధించారు. ఈ సందర్భంగా జార్జ్ ఫ్లాయిడ్ పేరును రెండు సార్లు ప్రస్తావించారు. సాధారణ పరిస్థితుల్లో శ్వేతజాతి పోలీసు అధికారి చేతుల్లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు గురవడం, దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తదితర ఘటనలపై వాటికన్ అంతగా స్పందించదు. కానీ, ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల సంవత్సరం నడుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ మరోసారి బరిలో నిలిచారు. ఈ సమయంలో జాత్యహంకార వ్యతిరేక ప్రదర్శలకు పోప్ తదితరులు మద్దతివ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ సారి అమెరికన్ కేథలిక్స్ ఎవరికి మద్దతివ్వనున్నారనేది చర్చనీయాంశమైంది. (అతడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు) -
హ్యాండ్సప్.. డోంట్ షూట్!
హ్యూస్టన్: జార్జ్ ఫ్లాయిడ్‌కు సంఘీభావంగా హ్యూస్టన్‌లో జరిగిన ర్యాలీలో సుమారు అరవై వేల మంది పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకానికి బలైన ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించేందుకు ఉద్దేశించిన ఈ ర్యాలీలో ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగర మేయర్ సిల్వస్టర్ టర్నర్, ఎంపీ షీలా జాక్సన్, లిజ్జీ ఫ్లెచర్, సిల్వియా గార్సియా అల్ గ్రీన్‌లతోపాటు కొంతమంది ర్యాప్ గాయకులు ర్యాలీలో పాల్గొని తమ నివాళులు అర్పించారు. ‘హ్యాండ్స్ అప్.. డోంట్ షూట్’, ‘నో జస్టిస్, నో పీస్’అని నినదిస్తూ ర్యాలీ హ్యూస్టన్ నగరం గుండా సాగింది. డిస్కవరీ గ్రీన్ పార్క్ నుంచి సిటీహాల్ వరకూ ఉన్న మైలు దూరం ఈ ర్యాలీ నడిచింది. అయితే సూర్యాస్తమయం తరువాత ఈ ర్యాలీ కాస్తా ఆందోళనలకు దారితీసిందని, ఖాళీ నీటిబాటిళ్లతో విసరడంతో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ర్యాలీ ప్రారంభానికి ముందు అందరూ మోకాళ్లపై నిలబడి కాసేపు ప్రార్థనలు చేయగా హ్యూస్టన్ పోలీస్ అధికారులు ఇదే తరహాలో వ్యవహరించడం విశేషం. పోలీస్ అధికారి ఆర్ట్ ఎసివిడో ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. జార్జ్ ఫ్లాయిడ్ భార్య రాక్సీ వాషింగ్టన్ మాట్లాడుతూ ఆరేళ్ల తన కుమార్తె గియానా మంచి తండ్రిని కోల్పోయిందన్న విషయాన్ని ప్రపంచం గుర్తించాలని వాపోయింది. వీధుల్లో ప్రశాంతత.. వారం రోజులపాటు అల్లర్లు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన అమెరికన్ నగర వీధుల్లో ఎట్టకేలకు కొంత ప్రశాంతత నెలకొంది. మంగళవారం ప్రదర్శనలు జరిగినా చాలావరకూ అవి శాంతియుతంగా సాగాయి. ఆందోళనలకు సంబంధించి బుధవారంనాటికి మొత్తం 9,000 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. పౌరహక్కుల విచారణ.. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంబంధించి మినసోటా రాష్ట్రం మినియాపోలిస్ పలీస్ విభాగంపై పౌర హక్కుల విచారణ చేపట్టింది. మినసోటా మానవహక్కుల విభాగం కమిషనర్ రెబెకా లూసిరో, గవర్నర్ టిమ్ వాల్ట్జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విచారణ ద్వారా పోలీసుల వివక్షాపూరిత చర్యలను గుర్తించి తాత్కాలికంగానైనా పరిష్కార చర్యలను అమల్లోకి తేవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. అందరికీ న్యాయం అందించాలన్న అమెరికా సిద్ధాంతం ఎక్కడ? ఎందుకు విఫలమైందో పరిశీలించాల్సిన సమయం వచ్చిందని, జార్జ్ ఫ్లాయిడ్ మరణోదంతం ఇందుకు కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘లారా (బుష్ భార్య)తోపాటు నేను ఫ్లాయిడ్ ఉదంతంపై ఎంతో బాధపడ్డాం. అన్యాయమైన వ్యవహారాలు దేశం ఊపిరి తీసేస్తున్నాయి. అయినాసరే.. ఇప్పటివరకూ మాట్లాడకూడదనే నిర్ణయించాం. ఎందుకంటే ఇది లెక్చర్ ఇచ్చే సమయం కాదు. వినాల్సిన సమయం’అని బుష్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా తన వైఫల్యాలను పరిశీలించాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు. శాంతియుతంగా ఉండాలి: మెలానియా ఫ్లాయిడ్ మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా స్పందించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలవారు, పౌరులందరూ సురక్షితంగా ఉండాలంటే శాంతి ఒక్కటే మార్గమని ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని మెలానియా ట్వీట్ చేశారు. ఒక రోజు ముందు మెలానియా ఇంకో ట్వీట్ చేస్తూ.. ఫ్లాయిడ్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ మతం ముసుగులో తనకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో ట్రంప్ మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తి ఏమీ కాదని, ప్రస్తుతం పదేపదే చర్చిలకు వెళ్లడం, బైబిల్ పట్టుకుని పోజులు ఇవ్వడం మత విశ్వాసాలు ఉన్న వారిని తమవైపు ఆకర్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా మీడియా విమర్శిస్తోంది. -
కరోనా కట్టడి: చిగురిస్తున్న ఆశలు
హ్యూస్టన్: ప్రాణాంతక ఎబోలా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమిడిస్‌విర్ మందు కోవిడ్ రోగులపై జరగుతున్న క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరిన్ని ప్రయోగాలు పూర్తయితేగానీ ఈ మందును కోవిడ్ చికిత్సకు సిఫారసు చేసే అవకాశాల్లేవు. టెక్సస్‌లోని హ్యూస్టన్ మెథాడిస్ట్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు వెల్లడించిన దాని ప్రకారం.. అప్పుడప్పుడే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వారికి రెమిడిస్‌విర్ మందును ఇచ్చారు. రెమిడెస్‌విర్‌ను ఎబోలా వైరస్‌కు చికిత్స కల్పించేందుకు తయారు చేశారు. చైనాలో జరిగిన అధ్యయనంలోనూ ఈ మందు కోవిడ్ బాధితులకు సాంత్వన చేకూరుస్తున్నట్లు స్పష్టమైంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఇటీవల ఒక పరిశోధన వ్యాసం ప్రచురిస్తూ రెమిడిస్‌విర్ తీసుకున్న కోవిడ్–19 బాధితుడు 24 గంటల్లోనే మెరుగైన ఆరోగ్య స్థితికి వెళ్లడాన్ని వివరించింది. కాగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి కోవిడ్-19కు వ్యాక్సిన్ వచ్చే అవకాశముందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ ప్రకటించారు. వచ్చే నెలకల్లా 500 మందిపై కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షిస్తారని బ్లూమ్‌బెర్గ్ సంస్థ తెలిపింది. 2020 అక్టోబర్ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యాన్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. 1994 నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో గిల్బర్ట్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. తాజా సమాచారం కరోనా బాధితుల సంఖ్య 25 లక్షలు దాటగా, మృతుల సంఖ్య లక్షా 70 వేలు దాటింది. కోవిడ్ సోకి ఇప్పటివరకు 658,956 మంది కోలుకున్నారు. చదవండి: కరోనాకు ముందే దారుణ పరిస్థితులు! -
జుకర్‌బర్గ్ విరాళం రూ.187 కోట్లు
హూస్టన్: కరోనా సంక్షోభంతో ప్రపంచమే స్తంభించిపోయింది. ఆర్థికం, వర్తకం, వాణిజ్యం, క్రీడా రంగం ఇలా ఏ రంగాన్ని అయినా కరోనా మహమ్మారి వదల్లేదు. ఈ ప్రాణాంత వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాగా, కరోనా వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణిస్తుండడం పట్ల ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నివారణపై పరిశోధనలకు ఆ ఫౌండేషన్‌కు 25 మిలియన్ డాలర్ల (రూ.187.19 కోట్లు) విరాళం ప్రకటించారు. (కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు..) చదవండి: వేతనం వదులుకునేందుకు రొనాల్డో సై NEW: Mark Zuckerberg and Priscilla Chan's foundation @ChanZuckerberg is partnering with @gatesfoundation and will donate $25 million to help combat the #coronavirus.@GayleKing spoke exclusively with Mark and Priscilla about the effort. pic.twitter.com/AqiyhqhzaA — CBS This Morning (@CBSThisMorning) March 27, 2020 -
అమెరికాలో తెలంగాణ వాసి మృతి
సాక్షి, కామారెడ్డి : అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరుణ్‌కుమార్ మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బూర్ల అరుణ్ కుమార్(21) భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బూర్ల చంద్రశేఖర్, పద్మల కుమారుడైన అరుణ్ కుమార్ 16 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి హ్యూస్టన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడడడంతో ఆయన మరణించినట్లు బంధువులు వెల్లడించారు. అరుణ్‌కుమార్‌కు భార్య రజనీ, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అరుణ్ కుమార్ మృతదేహాన్ని భారత్ తెప్పించేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. -
హ్యూస్టన్‌లో నాట్స్ బాలల సంబరాలు
హ్యూస్టన్ : విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో బాలల సంబరాలను హ్యూస్టన్‌లో నిర్వహించింది. హ్యూస్టన్ రాష్ట్రంలోని మిస్సోరిలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్ననాట్స్ చిన్నారులకు మ్యాథ్స్ ఛాలెంజ్,తెలుగు మాట్లాట, స్పెల్లింగ్ బీ పోటీలు నిర్వహించింది. 8 ఏళ్ల లోపు చిన్నారులను జూనియర్, సీనియర్ల విభాగాలుగా విభజించి ఈ పోటీలు నిర్వహించింది. మూడు విభాగాలలోను దాదాపుగా 120 మంది పిల్లలు తమ ప్రజ్ఞపాటవాలను ప్రదర్శించారు. వీటిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి నాట్స్ బహుమతులు అందచేసింది. హ్యూస్టన్, గ్రేటర్ హౌస్టన్ నుండి దాదాపుగా 300 పైగా తెలుగువారు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దాదాపుగా నెల రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని నాట్స్ వాలంటీర్లు విజయవంతం చేశారని నాట్స్ హౌస్టన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ కాకుమాను అన్నారు. హ్యూస్టన్ నాట్స్ కోర్ కమిటీ సభ్యులు వీరూ కంకటాల,చంద్ర తెర్లి, విజయ్ దొంతరాజు తదితరుల పాల్గొన్నారు. ఈ కార్యాక్రమాన్ని విజయవంతం కావడంలో సహకరించిన తెలుగు భవనం, హ్యుస్టన్ తెలుగు సాంస్కృతిక కమిటీ(టీసీఏ), తెలంగాణ గ్రేటర్ హౌస్టన్ సంఘం(టీఏజీహెచ్) సభ్యులకు నాట్స్ హౌస్టన్ విభాగం కృతజ్ఞతలు తెలిపింది. -
హౌడీ మోడీలో.. పక్కా లోకల్చల్
ఏదైనా ఒక చరిత్రాత్మక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. చాలా అరుదుగా దొరికే అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతివారూ విశేషమైన కృషి చేస్తారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో సెప్టెంబరు 22వ తేదీన ‘హౌడీ మోడీ’ (ఎలా ఉన్నారు మోదీ) అనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరిగింది. మన ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇద్దరూ చేతులు కలిపి, స్టేడియమంతా కలియతిరిగారు. ఇదంతా ఒక ఘట్టం. వీరి ప్రసంగానికి ముందు సుమారు మూడు గంటలపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో గుజరాతీలు వారి సంప్రదాయ నాట్యంతో ఎరుపు తెలుపు దుస్తులతో ముచ్చటగొలుపుతూ, కన్నుల పండుగ చేశారు. కార్యక్రమం సిక్కుల ప్రార్థనతో ప్రారంభమైంది. ఆ తరవాత పాఠశాల విద్యార్థులు హిందీ పాటకు నాట్యం చేశారు. కేరళ వారు వారి సంప్రదాయమైన మోహినీ ఆట్టం నాట్యం చేశారు. ఒరియన్లు ఒడిస్సీ. బెంగాలీలు బెంగాలీ ఫోక్ డాన్స్. పంజాబీలు భాంగ్రా. వీళ్లతో పాటు అమెరికన్లు పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇన్ని సంప్రదాయ నృత్యాల మధ్య మన తెలుగువారు.. ‘నేను పక్కా లోకల్’ అంటూ జనతా గ్యారేజీ చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేశారు! సంప్రదాయ విరుద్ధమైన ఒక సినిమా పాటకు నాట్యం చేసి, మంచి అవకాశాన్ని జారవిడుచుకోవడం విజ్ఞత గల పనేనా?! -
వైరల్: ఇద్దరితో సెల్ఫీనా అదృష్టమంటే ఇదే!
హూస్టన్: దేశ ప్రధానితో ఓ సెల్ఫీ దిగాలని ఎవరైనా కోరుకుంటారు. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడితో ఓ ఫోటో దిగాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఓ కుర్రాడిని అనుకోని అదృష్టం అనూహ్యంగా వరించింది. భారత నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఒకేసారి సెల్ఫీ దిగే అవకాశం వచ్చింది. హ్యూస్టన్‌లో జరిగిన హౌడీమోదీ కార్యక్రమానికి ట్రంప్, మోదీ హాజరైన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికీ ఆహ్వానం పలికేందుకు కొంతమంది ప్రవాస భారతీయ బాలికలు అక్కడ ఉన్నారు. వీరితో పాటు ఓ బాలుడు కూడా వారితో కలిసి స్వాగతం పలికాడు. రెండు అగ్రరాజ్యాల అధినేతలను ఒక్కసారే ప్రత్యక్షంగా చూసేసరికి అతడికి ఆనందం అంతపట్టలేదు. ఇక ఆగలేక, ధైర్యం తెచ్చుకుని ట్రంప్‌ను ఓ సెల్ఫీ అడిగాడు ఆ పిల్లవాడు. అనుకోకుండా ఓకే అన్న ట్రంప్ వెంట ఉన్న మోదీని కూడా పిలిచి.. ఫోటోకి ఓ స్టిల్ ఇవ్వు అంటూ సైగ చేశాడు. దీంతో ఇద్దరినీ తన ఫోన్లో బందించాడు. అయితే ఈ తతంగమంతా దగ్గరలోని ఓ కెమెరాలో రికార్డయింది. అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొద్ది సమయానికే వైరల్‌గా మారిన ఈ వీడియోకి విపరీతమైన స్పందన, కామెంట్లు వస్తున్నాయి. ఆ బాలుడు చాలా అదృష్టవంతుడంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. హౌడీ మోదీ కార్యక్రమానికి వేలాది మంది భారతీయులు తరలివచ్చిన విషయం తెలిసిందే. కిక్కిరిసిపోయిన జన సందోహంతో ఆదివారం ఎన్ఆర్జీ స్టేడియంలో పండుగ వాతావరణం కనిపించింది. భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డోళ్ల మోతలు, మోదీ, మోదీ అనే నినాదాలు, కేకలతో ఎన్ఆర్జీ స్టేడియం హోరెత్తిపోయింది. Tweeples, Can you find that epic selfie ? Let’s see how connected we really are😎 https://t.co/zh1VY8bUjU — Anurag Thakur (@ianuragthakur) September 23, 2019 -
‘హౌడీ మోదీ’పై ప్రశాంత్ కిషోర్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: రెండు అగ్రరాజ్యల (భారత్-అమెరికా) అధినేతలు కలిసి వేదిక పంచుకున్న హ్యూస్టన్ హౌడీ మోదీ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యకక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. మోదీ, ట్రంప్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ఈ కార్యక్రమం ట్రంప్‌కు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ.. ఈ కార్యక్రమానికి ట్రంప్ హాజరవడం ఎంతో వ్యూహత్మకమైన, తెలివైన చర్యగా అని ట్విటర్ వేదికగా ఆయన పేర్కొన్నారు. కాగా రానున్న ఎన్నికల్లో మరోసారి అమెరికా ప్రజలు, ప్రవాస భారతీయులు ట్రంప్‌కే ఓటు వేయాలని మోదీ పిలుపునివ్వడాన్ని రాజకీయ ఎత్తుగడగా ప్రశాంత్ కిషోర్ వర్ణించారు. హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీ ప్రసంగం ట్రంప్‌కు రానున్న ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కాగా ఈ ఈవెంట్లో మోదీ మాట్లాడుతూ.. ‘ట్రంప్ నాకు మంచి మిత్రుడు. అమెరికా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే చెబుతున్నా.. అబ్ కీ బార్.. ట్రంప్ కీ సర్కార్ (మళ్లీ ట్రంప్ ప్రభుత్వమే)’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ట్రంప్‌కు అనుకూలంగా మోదీ చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
‘క్షమించండి.. మీ భర్త నాతోనే ఉండాల్సి వచ్చింది’
హ్యూస్టన్: ‘ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత’ పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం విజయవంతమైంది. మోదీ నినాదాలతో, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అట్టహసంగా ప్రారభమైన కార్యక్రమం ఘనంగా ముగిసింది. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఐక్యత ఈ కార్యక్రమం ద్వారా మరోసారి ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ కేవలం ట్రంప్‌తో మాత్రమే కాక ఇతర అమెరికా నాయకులతో కూడా ఉల్లాసంగా గడిపారు. ముఖ్యంగా యూఎస్ సెనెటర్ జాన్ కార్నిన్‌తో సరదాగా సంభాషించారు. ఈ సందర్భంగా సెనెటర్ భార్యకు మోదీ క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే ఆదివారం కార్నిన్ భార్య పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో మోదీ కార్నిన్ భార్యను ఉద్దేశిస్తూ.. ‘నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఈ రోజు మీ పుట్టినరోజు.. కానీ అనివార్య కారణాల వల్ల ఈ రోజు మీ భర్త నాతో ఉండాల్సి వచ్చింది. అందుకు నన్ను క్షమించండి. ఇది మీకు ద్వేషాన్ని కలిగించవచ్చు’ అన్నారు. అంతేకాక వారిద్దరి జీవితాలు సంతోషంగా సాగాలని.. కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతుంది. Here is what happened when PM @narendramodi met Senator @JohnCornyn. pic.twitter.com/O9S1j0l7f1 — PMO India (@PMOIndia) September 23, 2019 ఐదు కుటుంబాలను భారత్‌కు పంపండి: మోదీ అంతేకాక కార్యక్రమానికి హాజరైన భారతీయులను ఉద్దేశిస్తూ మోదీ.. ‘ఈ వేదిక మీదుగా నేను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల్ని ఓ చిన్న కోరిక కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు.. ఆయ దేశాలకు చెందిన ఐదు కుటుంబాలను ఇండియా పర్యటనకు పంపండి’ అని కోరారు మోదీ. -
మిన్నంటిన కోలాహలం
హూస్టన్(టెక్సాస్): భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని వినేందుకు ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి వేలాది మంది భారతీయులు తరలివచ్చారు. కిక్కిరిసిపోయిన జన సందోహంతో ఆదివారం ఎన్ఆర్జీ స్టేడియంలో పండుగ వాతావరణం కనిపించింది. భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డోళ్ల మోతలు, మోదీ, మోదీ అనే నినాదాలు, కేకలతో ఎన్ఆర్జీ స్టేడియం హోరెత్తిపోయింది. చాలామంది తమ ముఖాలపై భారత్, అమెరికా జాతీయ పతాకాలను ముద్రించుకుని వచ్చారు. 400 మంది కళాకారులు ప్రదర్శించిన భారతీయ సంప్రదాయ, జానపద నృత్యాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. భాంగ్రా, మోహినీఅట్టం, భరతనాట్యం, గార్భా వంటి నృత్యాలను ఆసాంతం ఆస్వాదించారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ దాదాపు వెయ్యి మంది గుజరాతీలు సంప్రదాయ దాండీయా నృత్యం ప్రదర్శించారు. ఎన్ఆర్జీ స్టేడియం అమెరికాలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుగాంచింది. టెక్సాస్ ఇండియా ఫోరమ్(టీఐఎఫ్) నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమానికి కొన్ని వారాల క్రితమే టిక్కెట్లు విక్రయించారు. 50 వేల మంది భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు అంచనా. చరిత్రాత్మకమైన ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి భారతీయులు తరలివచ్చినట్లు ‘హౌదీ మోడీ’ నిర్వాహకుల్లో ఒకరైన ప్రణవ్ దేశాయ్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమం జరగడం అమెరికాలో ఇదే మొదటిసారి అని టెక్సాస్ ఇండియా ఫోరమ్ ప్రతినిధి గీతేశ్ దేశాయ్ చెప్పారు. అవీ.. ఇవీ..! ► భారత కాలమానం ప్రకారం రాత్రి 9.40 గంటలకు ప్రధాని మోదీ ఎన్ఆర్జీ స్టేడియంలోకి ప్రవేశించారు. ► స్టేడియంలోని దాదాపు 50 వేల మంది భారతీయ అమెరికన్లు మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. ఆయన వేదికపైకి రాగానే.. కొన్ని నిమిషాల పాటు మోదీ, మోదీ నినాదాలతో హోరెత్తించారు. ► మోదీకి హ్యూస్టన్ మేయర్, టెక్సాస్ గవర్నర్ సహా టెక్సస్ చట్ట ప్రతినిధులు, భారతీయ–అమెరికన్ చట్ట ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ► అంతకుముందు గంటన్నరకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. భారతీయ అమెరికన్ బృందాలు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహూతులను ఉర్రూతలూగించారు. ► భారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల కళా ప్రదర్శనలకు కార్యక్రమంలో చోటు కల్పించారు. ► ఓ ప్రదర్శనలో ’నేను పక్కా లోకల్(జనతా గ్యారెజ్ సినిమా)’ అనే తెలుగు పాట పల్లవిని ఉపయోగించుకున్నారు. ► మోదీ స్టేడియంలోకి రావడం కొంత ఆలస్యమైనా.. భారతీయ అమెరికన్లు ఓపిగ్గా వేచి చూశారు. ► మోదీకి స్వాగతం పలికిన తరువాత అమెరికా అధ్యక్షుడు వచ్చేవరకు మళ్లీ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. గాంధీజీ 150వ జయంతి వేడుకల గుర్తుగా ’వైష్ణవ జనతో’ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. -
నమో థాలి, నమో మిఠాయి థాలి!
హ్యూస్టన్: హ్యూస్టన్ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ కోసం ‘నమో థాలి, నమో మిఠాయి థాలి’లతో విందు భోజనం ఎదురుచూస్తోంది. హ్యూస్టన్‌లో కిరణ్స్ అనే రెస్టారెంట్ నడుపుతున్న ఒడిశాకు చెందిన చెఫ్ కిరణ్ వర్మకు హ్యూస్టన్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీకి భోజనం అందించే అవకాశం లభించింది. మోదీకే కాకుండా, హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరవుతున్న భారతీయులకు భారతీయ వంటకాలను బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లను ఆమే అందించనున్నారు. ఈ అవకాశం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘గత 25 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. మాది ఒడిశా. ప్రధాని మోదీకి భోజనం సమకూర్చే అవకాశం రావడం గొప్పగా ఉంది. ఆయన కోసం ప్రత్యేకంగా నమో థాలి, నమో మిష్టి/మిఠాయి థాలిలను రూపొందించాం. ఈ డిషెస్ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. ఇటీవలి ఆయన పుట్టిన రోజు కోసం వారి అమ్మగారు ఏ వంటలు చేశారో కనుక్కున్నాను. నమో థాలిలో మేథీ తెప్లా, పుదీనా చట్నీతో సమోసా, చింతపండు చట్నీతో కచోరి, పప్పు, కిచిడీ, ఖాండ్వి.. సహా పలు ఇతర వంటకాలు ఉంటాయి. మిఠాయి థాలిలో గాజర్ హల్వా, రస్‌మలాయి, శ్రీఖండ్, గులాబ్ జామూన్, పాయసం.. సహా మరికొన్ని స్వీట్లు ఉంటాయి. వీటిలో ఏ వంటకాలను మోదీ ఆస్వాదించారో ఆయన విందు ఆరగించిన తరువాతే చెప్తాను. ఈ రెండు డిషెస్‌ను మా రెస్టారెంట్లో రెగ్యులర్ డిషెస్గా అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం’అని వివరించారు. -
సరిహద్దు భద్రతే కీలకం
హ్యూస్టన్: కరడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాకు సరిహద్దు భద్రతే అత్యంత కీలకమని చెప్పారు. హౌడీ మోదీ కార్యక్రమంలో ఆయన 25 నిమిషాలపాటు ప్రసంగించారు. భారత్–అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసే దిశగా త్వరలో పలు రక్షణ ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. తమ పౌరులను భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం భారత్, అమెరికాకు ఉందన్నారు. అలాగే మన సరిహద్దులను రక్షించుకోవాలన్నారు. సరిహద్దు భద్రత భారత్‌కు కీలకాంశమని, దాన్ని అమెరికా గుర్తించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ దక్షిణ సరిహద్దు(మెక్సికో) రక్షణకు కనీవినీ ఎరుగని చర్యలు చేపడుతున్నామని, అక్రమ వలసలకు సమర్థంగా అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. అక్రమ వలసలతో ముప్పు తప్పదని హెచ్చరించారు. మాకు గర్వకారణం మోదీ అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణను ట్రంప్ ప్రశంసించారు. ఈ సంస్కరణలతో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. భారత్, అమెరికాలో అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని నిర్మూలించడంలో ఎన్నడూ లేనంతగా ప్రగతి సాధిస్తున్నారన్నారు. అమెరికాలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ట్రంప్ వివరించారు. టెక్సాస్‌లో తయారీ రంగంలో 70 వేల కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. అమెరికా నుంచి ఏటా 5 మిలియన్ టన్నుల ఎన్ఎన్జీని కొనుగోలు చేసేందుకు ఇండియా కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. దీనివల్ల రాబోయే రోజుల్లో వందల కోట్ల డాలర్ల విలువైన ఎల్ఎన్జీని తాము భారత్‌కు ఎగుమతి చేయబోతున్నామని అన్నారు. భారత్ అమెరికాలో ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ పెట్టుబడులు పెట్టలేదన్నారు. అమెరికా కూడా భారత్‌లో పెట్టుబడుల వరద పారిస్తోందన్నారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర మరువలేనిదని ట్రంప్ శ్లాఘించారు. తమ సంస్కృతిని, విలువలను వారు మరింత సుసంపన్నం చేస్తున్నారని కొనియాడారు. వారు అమెరికన్లుగా ఉండడం తమకు గర్వకారణమని చెప్పారు. -
హ్యూస్టన్ టు హైదరాబాద్...
హ్యూస్టన్: ఎన్ఆర్జీ స్టేడియంలోకి 10.30 గంటల సమయంలో(భారత కాలమానం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేడియంలోకి వచ్చారు. అనంతరం మోదీ, ట్రంప్ కలిసి వేదిక పైకి వచ్చారు. వస్తూనే స్నేహితుడిలా ట్రంప్ చేతిని మోదీ పైకి చేపి ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఆ తరువాత త్రివర్ణ వస్త్రధారణలో ఉన్న బాలబాలికలు భారత జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మోదీ గుడ్ మార్నింగ్ హ్యూస్టన్, గుడ్ మార్నింగ్ టెక్సస్, గుడ్ మార్నింగ్ అమెరికా.. గుడ్ ఈవినింగ్ భారత్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తన తొలి ప్రసంగం(ట్రంప్ ప్రసంగించిన తరువాత మోదీ మరోసారి ప్రసంగించారు)లో ట్రంప్‌ను మోదీ పొగడ్తల్లో ముంచెత్తారు. తదుపరి ఎన్నికల్లోనూ ట్రంప్ విజయభేరీ మోగిస్తారని జోస్యం చెప్పారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. హ్యూస్టన్ టు హైదరాబాద్ ‘‘ఈ రోజు మనతో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. పరిచయం అక్కర్లేని పేరు, ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతీ రాజకీయ చర్చలోనూ ఏదో ఒక సందర్భంలో ప్రస్తావనకు వచ్చే పేరు.. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఆయనకు స్వాగతం పలకడం గౌరవంగా భావిస్తున్నాను. ట్రంప్ నాకు మంచి మిత్రుడు. అమెరికా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే చెబుతున్నా.. అబ్ కీ బార్.. ట్రంప్ కీ సర్కార్ (మళ్లీ ట్రంప్ ప్రభుత్వమే). ఈ కార్యక్రమం రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అనుబంధానికి తార్కాణం. హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ వరకు, బోస్టన్ నుంచి బెంగళూరు వరకు, షికాగో నుంచి షిమ్లా వరకు, లాస్ ఏంజెలిస్ నుంచి లూధియానా వరకు, న్యూజెర్సీ నుంచి న్యూఢిల్లీ వరకు ఈ అనుబంధం పెనవేసుకుని ఉంది. నేను మొదటిసారి వైట్‌హౌజ్‌కు వచ్చినప్పుడు మీరు(ట్రంప్) నాకు మీ కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఇప్పుడు నేను మీకు నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను. ఎదురుగా ఉందే(స్టేడియంలోని ప్రజలను చూపిస్తూ).. అదే నా కుటుంబం. 130 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం. మీకు(స్టేడియంలోని వారికి) భారత్‌కు అత్యంత గొప్ప మిత్రుడిని పరిచయం చేస్తాను. ఈయనే ది గ్రేట్ డొనాల్డ్ ట్రంప్’’ అంటూ పరిచయం చేశారు. మోదీకి హ్యూస్టన్ తాళాలు హ్యూస్టన్: మోదీ రాక సందర్భంగా హ్యూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ వినూత్న స్వాగతం పలికారు. ఆ నగర తాళాలను మోదీకి బహూకరించారు. చాలా కాలంగా కొనసాగుతున్న భారత–హ్యూస్టన్ సంబంధాల నేపథ్యంలో గౌరవార్థం దీన్ని అందజేశారు. అనంతరం మేయర్ టర్నర్ మాట్లాడుతూ తమ దేశంలోకెల్లా హ్యూస్టన్ నగరం అత్యంత భిన్నత్వం కలిగిందని తెలిపారు. హౌడీ అన్న పదాన్ని ఇక్కడ 140 భాషల్లో చెప్పుకుంటారని వెల్లడించారు. ఈ రోజు హౌడీని మోదీకి చెబుతున్నామని అన్నారు. దాదాపు 12 మంది గవర్నర్లు, యూఎస్కాంగ్రెస్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమెరికాలో భారతీయులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో హ్యూస్టన్ కూడా ఒకటి. దేశం బయటా ‘స్వచ్ఛత’ దేశంలోనే కాదు, వెలుపల కూడా ప్రధాని మోదీ శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారనడానికి ఈ ఘటనే ఉదాహరణ. వివరాలివీ.. శనివారం రాత్రి హ్యూస్టన్‌లోని జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీకి అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. వారిచ్చిన పుష్పగుచ్ఛం నుంచి ఓ పువ్వు జారి కింద పడిపోయింది. ప్రధాని మోదీ వెంటనే ఆ పువ్వును కిందికి వంగి తీసుకున్నారు. ప్రధానే స్వయంగా ఇలా చేయడం చూసి, అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. హ్యాపీ బర్త్‌డే మోదీ హూస్టన్: హౌడీ మోదీలో ట్రంప్ ప్రసంగిస్తూ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన మోదీ 69వ జన్మదిన వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు ప్రసంగించేందుకు ఉపయోగించిన బల్లపై అధ్యక్షుడి ముద్రకు (ప్రెసిడెన్షియల్ సీల్) బదులు ఇరుదేశాల జెండాలతో కూడి చిత్రాన్ని ఉంచారు. -
భారత్‌కు ట్రంప్ నిజమైన ఫ్రెండ్
అమెరికా ‘హౌడీ మోదీ’ అని నినదించింది. టెక్సాస్ మినీ భారత్‌లా మారింది. హ్యూస్టన్ త్రివర్ణ శోభితమయింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ‘ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత’ పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్ఆర్జీ స్టేడియంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. మోదీ, మోదీ అనే నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాల వెలుగుజిలుగుల మధ్య కోలాహలంగా సాగింది. ట్రంప్ ప్రసంగిస్తున్నంత సేపు ‘యూఎస్ఏ.. యూఎస్ఏ’ అని సభికులు నినదించారు. హ్యూస్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఆదివారం హ్యూస్టన్‌లో జరిగిన మెగా ఈవెంట్ హౌడీ మోదీలో ప్రధాని మోదీ.. ఇక ఉగ్రవాదంపై యుద్ధమే అని గర్జించారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్‌ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు. ‘అమెరికాలో జరిగిన 9/11 దాడుల వెనుక, భారత్‌లో జరిగిన 26/11(ముంబై దాడులు) నరమేథం వెనుక కుట్రదారులెవరో ప్రపంచం మొత్తానికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. దాదాపు అరగంట పాటు సాగిన ప్రసంగంలో ఇప్పటివరకు ఐదేళ్ల తమ పాలన సాధించిన విజయాలను మోదీ ఏకరువు పెట్టారు. 60 ఏళ్లలో సాధించలేని వాటిని ఐదేళ్లలో సాధించగలిగామన్నారు. భారత్, అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందన్న మోదీ.. వారి కోసం భారత్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. భారత్, అమెరికాల దోస్తీ 21వ శతాబ్దంలో మరిన్ని ఆవిష్కరణలతో అభివృద్ధి పథంలో సాగాల్సి ఉందన్నారు. మోదీ.. ట్రంప్.. మోదీ కార్యక్రమం ప్రారంభంలో మొదట మోదీ ప్రసంగించి, ట్రంప్ ను భారత్‌కు నిజమైన స్నేహితుడంటూ ఆహూతులకు పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగించారు. అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోని దాదాపు 4 మిలియన్ల భారతీయులపై తనకెంతో గౌరవం ఉందన్నారు. ‘వి.. ద పీపుల్’ అనే వాక్యంతోనే భారత్, అమెరికాల రాజ్యాంగ పీఠిక ప్రారంభమవుతుందని, ఇదే ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాలకు రుజవని పేర్కొన్నారు. ట్రంప్ ప్రసంగ సమయంలో ‘యూఎస్ఏ.. యూఎస్ఏ’ అంటూ ప్రేక్షకులు నినదించడం విశేషం. ట్రంప్ ప్రసంగం అనంతరం మోదీ మరోసారి కీలక ప్రసంగం చేశారు. మోదీ తన మొదటి ప్రసంగాన్ని ఇంగ్లీష్‌లో, తదుపరి ప్రసంగాన్ని హిందీలో చేయడం విశేషం. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. హౌడీ మై ఫ్రెండ్స్! టెక్సాస్ అంటే విశాలత్వం.. ఆ విశాలత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మీరు 50 వేలకు పైగా ఉన్నారు. ఇది కేవలం సంఖ్య కాదు. ఇదో చరిత్ర. కొత్త చరిత్ర. ఎన్ఆర్జీ స్టేడియంలో నెలకొన్న ఎనర్జీ. భారత్, అమెరికాల మధ్య పెరుగుతున్న మైత్రికి, సమన్వయానికి నిదర్శనం. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రావడం మనకెంతో గర్వకారణం. ఆయన రాక భారతీయ అమెరికన్ల సామర్థ్యానికి ప్రశంస. ఈ కార్యక్రమం పేరు ‘హౌడీ మోదీ’ అని పెట్టారు. హౌ డు యు డూ మోదీ? అని. మోదీ ఒంటరిగా ఒక శూన్యం.. ఒక సామాన్య వ్యక్తి.. 130 కోట్ల భారతీయుల ఆదేశాలు పాటిస్తున్న సాధారణ వ్యక్తి. అయినా మీరు హౌడీ మోదీ అంటుంటే నాకొకటే అనిపిస్తోంది. నా జవాబు ఒకటే.. భారత్‌లో అంతా బావుంది(భారత్ మే సబ్ అచ్చాహై). (అనంతరం తెలుగులో అంతా బావుంది సహా వివిధ భారతీయ భాషల్లో ఆ పదాన్ని మోదీ ఉచ్ఛరించారు. దాంతో స్టేడియంలో మోదీ నినాదాలు మిన్నంటాయి) ► మేం అధికారంలోకి వచ్చిన తరువాత గత 60 ఏళ్లలో సాధించలేనివెన్నో సాధించాం. న్యూ ఇండియా లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. డేటా భారత్‌లోనే అత్యంత చవక. డిజిటల్ ఇండియాగా భారత్‌ను తీసుకువెళ్తున్నాం. ► 2, 3 రోజుల్లో ట్రంప్‌తో చర్చలు జరపనున్నాం. భారత్, అమెరికాలకు ప్రయోజనం చేకూర్చే మరిన్ని అంశాలపై చర్చించనున్నాం. ఆయన చర్చలు జరపడంలో సిద్ధహస్తుడు. ఆయన నుంచి నేను కూడా నేర్చుకుంటున్నా. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు 21వ శతాబ్దంలో అభివృద్ధి పథంలో సాగేందుకు భారత్, అమెరికాలు కలసి సాగాల్సి ఉంది. చివరగా థాంక్యూ హ్యూస్టన్.. థాంక్యూ అమెరికా.. గాడ్ బ్లెస్ యూ ఆల్.. ► కశ్మీరీల కోసం.. ముఖ్యంగా 70 ఏళ్ల సమస్యకు ఫేర్వెల్ పలికాం.. జమ్మూకశ్మీర్ ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తున్న ఆర్టికల్ 370కి వీడ్కోలు పలికాం. అక్కడి ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేశాం. 370 రద్దుపై పార్లమెంటులో పెద్ద చర్చే జరిగింది. ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆ బిల్లు విజయం సాధించింది. ఇందుకు మన పార్లమెంటేరియన్లకు మనం నిల్చుని హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలుపుదాం.(స్టేడియంలో స్టాండింగ్ ఒవేషన్). ఇది కొన్ని ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలవారికి(పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి) నచ్చట్లేదు. ఇప్పుడు సమయమొచ్చింది. ఉగ్రవాదంపై, దానికి మద్దతిచ్చే వారిపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి ట్రంప్ నేతృత్వం వహించాలి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హ్యూస్టన్‌లో కార్యక్రమం అనంతరం చేతులు పట్టుకుని ముందుకు సాగుతున్న మోదీ, ట్రంప్ సంప్రదాయం హౌడీ మోదీ వేదికపై నృత్య ప్రదర్శన మేము సైతం కార్యక్రమానికి హాజరైన ముస్లింలు గాంధేయం ఎన్నార్జీ స్టేడియం వద్ద గాంధీజీ వేషధారి అభిమానం భారత సంతతి వారితో ప్రధాని ముచ్చట్లు -
హ్యూస్టన్‌లో అరుదైన దృశ్యాలు
న్యూయార్క్: హ్యూస్టన్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ కశ్మీరీ పండిట్లతో భేటీ అయిన సందర్భంగా ఓ ఆత్మీయ ఘటన చోటుచేసుకుంది. ఒక కశ్మీరీ పండిట్ ప్రధాని మోదీ చేతిని ముద్దాడారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో.. 7 లక్షలమంది కశ్మీరీ పండిట్ల తరపున మీకు ధన్యవాదాలని ఆయన మోదీకి చెప్పారు. మోదీ మాట్లాడుతూ.. మీరు ఎంతగా బాధపడ్డారో నాకు తెలుసు... అంతా కలిసి నవ కశ్మీరాన్ని నిర్మిద్దామని పేర్కొన్నారు. పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు చాటిచెప్పారు. హ్యూస్టన్‌లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన చిన్న సంఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది. ఎయిర్‌పోర్ట్‌లో అమెరికా ప్రతినిధి ఒకరు ప్రధాని మోదీకి పుష్పగుచ్చం అందించగా.. అందులోంచి కొన్ని పూలు కిందపడిపోయాయి. అందరిని ఆశ్చర్యపరుస్తూ మోదీ కిందికి వంగి స్వయంగా ఆ పూలను తీసి సిబ్బందికి అందించారు. ప్రత్యేక అతిథి జాతీయ గీతాలాపన.. హ్యూస్టన్‌లో ఎన్నారైలు నిర్వహిస్తున్న హౌడీ మోదీ కార్యక్రమంలో ప్రత్యేక అతిథి జాతీయ గీతాలాపన చేయనున్నారు. ఆయనే న్యూజెర్సీకి చెందిన 16 ఏళ్ల స్పర్శ్ షాహ్. తను పుట్టుకతోనే స్పర్శ్ ఆస్టియోజెన్సిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ అరుదైన వ్యాధి కారణంగా స్పర్శ్ నడవలేడు. అయినా మెండైన ఆత్మవిశ్వాసం అతని సొంతం. సింగర్, రచయిత, మోటివేషనల్ స్పీకర్‌గా పేరుపొందారు. హౌడీ మోడీలో జనగణమన పాడేందుకు న్యూజెర్సీ నుంచి హ్యూస్టన్ వచ్చాడు స్పర్శ్. -
హ్యూస్టన్‌లో నేడే హౌడీ మోదీ
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో భారతీయ అమెరికన్లు ఆదివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హౌడీ, మోదీ!’కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. భారత ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు నిర్వాహకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క పోప్ మినహా మరే విదేశీ నేత కూడా అమెరికాలో ఇప్పటి వరకు ఇంత భారీ కార్యక్రమం చేపట్టలేదు. దాదాపు 50 వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటైన ఎన్నార్జీ ఫుట్‌బాల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం మూడు గంటలపాటు జరిగే ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ‘న భూతో న భవిష్యతి’అన్నట్లుగా నిర్వహించేందుకు 1,500 మంది వలంటీర్లు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటూ ‘నమో ఎగైన్’ అని ఉన్న టీషర్టులు ధరించిన వలంటీర్లు, నిర్వాహకులు 200 కార్లతో శుక్రవారం ర్యాలీ చేపట్టారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య నేతలు మొదటి సారిగా ఇలాంటి కార్యక్రమానికి హాజరవుతున్నారు. రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుంది’అని టెక్సాస్ ఇండియన్ ఫోరం ప్రతినిధులు వెల్లడించారు. ‘ఈ కార్యక్రమానికి దేశంలోని 50 రాష్ట్రాలకు చెందిన సెనెటర్లు, గవర్నర్లు, మేయర్లు, ప్రముఖ నేతలు హాజరవుతున్నారు. భారతీయ సమాజం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేలా 400 మంది కళాకారులతో గంట పాటు సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. హిందీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మోదీ, ట్రంప్‌ల ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి’అని తెలిపారు. అనంతరం మోదీ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని, ఐరాస సమావేశాల కోసం న్యూయార్క్ బయలుదేరనున్నారు. కాగా, అమెరికాకు వెళ్లే దారిలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో శనివారం కాసేపు ఆగారు. ఆయన ప్రయాణించే ఎయిర్ ఇండియా ఒన్ విమానం సాంకేతిక కారణాలతో అక్కడ రెండు గంటలపాటు ఆగింది. ప్రధాని ఆ సమయంలో అక్కడి చమురు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి శనివారం రాత్రి మోదీ హ్యూస్టన్ చేరుకున్నారు. జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ అమెరికన్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
హౌడీ మోదీకి వర్షం ముప్పు?
హ్యూస్టన్/వాషింగ్టన్: అమెరికాలో ప్రతిష్టాత్మకం గా నిర్వహించతలపెట్టిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే హ్యూస్టన్ నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది. టెక్సాస్ రాష్ట గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ 13 కౌంటీలలో అత్యవసర పరిస్థితి విధించారు. దక్షిణ టెక్సాస్‌లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండటంతో ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరికలు జారీచేశారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యే ఈ కార్యక్రమంపై భారీ అంచనాలున్నాయి. 50 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించే కార్యక్రమానికి ట్రంప్ రావడానికి అంగీకరించడంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. హౌడీ మోదీ కార్యక్రమం జరిగే ఎంజీఆర్ స్టేడియం కూడా వాన నీటితో నిండిపోయింది. దాదాపు 1,500 మంది వలంటీర్లు ఈ సభ ఏర్పాట్లలో నిమగ్నమైఉన్నారు. ఈ నెల 23న సదస్సు ఉండడంతో అప్పటి వరకు పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నిర్వాహకులు అంటున్నారు. మంగోలియా, భారత్ బంధానికి నిదర్శనం ప్రధాని మోదీ, మంగోలియా అధ్యక్షుడు ఖాల్ట్‌మాగ్గిన్ బట్టుల్గా ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లోని గందన్ బౌద్ధారామంలో గౌతమబుద్ధుడి విగ్రహాన్ని మంత్రోచ్ఛరణల నడుమ ఇరువురు నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఖరీదైన కార్యక్రమం హౌడీ మోదీపై రాహుల్ వ్యాఖ్య ‘రూ. 1.4 లక్షల కోట్ల ఖర్చుతో హౌడీ మోదీ కార్యక్రమమా?.. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ఉత్సవం అనుకుంటా. అయితే ఇలాంటి ఏ కార్యక్రమం కూడా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత దురవస్థను దాచలేదు’ అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపుతో ప్రభుత్వం కోల్పోతున్న రూ.1.4లక్షల కోట్ల ఆదాయాన్ని రాహుల్ వ్యంగ్యంగా ఇలా ప్రస్తావించారు. -
‘హౌడీ మోదీకి రాలేకపోతున్నాను.. క్షమించండి’
వాషింగ్టన్: నమస్తే.. అమెరికా పర్యటనకు విచ్చేసిన మోదీ గారికి హృదయపూర్వక ఆహ్వానం.. ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు.. నన్ను క్షమించండి అన్నారు హిందూ మహిళా నేత, డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి తులసి గబ్బార్డ్. ప్రస్తుతం డెమోక్రటిస్ పార్టీ సభ్యురాలైన తులసి గబ్బార్డ్.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిదే. ఈ క్రమంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో.. హౌడీ మోదీ కార్యక్రమానికి రాలేకపోతున్నాని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు తులసి గబ్బార్డ్. ‘భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశం.. ఆసియా-పసిఫిక్ భూభాగంలో భారత్, అమెరికాకు గొప్ప మిత్రుడు. ఈ రెండు దేశాలు కలిసి వాతావరణ మార్పులు, అణు యుద్ధాన్ని ఎదుర్కొవడం, అణు విస్తరణను నివారించడం, ఇరు దేశాల ప్రజల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడం వంటి సమస్యలతో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేయాల్సిందిగా కోరుతున్నాను అన్నారు. పురాతన వసుధైవ కుటుంబ సూత్రాన్ని ప్రస్తావిస్తూ.. ఇరు దేశాల మధ్య బలమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు గబ్బార్డ్. రెండు రోజుల క్రితం గబ్బార్డ్ కావాలనే హౌడీ మోదీ కార్యక్రమానికి రావడం లేదంటూ ప్రచురించిన ఓ కథనాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ.. ‘ఇది పూర్తిగా అవాస్తవం. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వలన నేను దీనికి హాజరు కాలేకపోతున్నాను. కానీ మోదీ అమెరికా పర్యటన ముగిసేలోపు ఆయనను కలవాలనుకుంటున్నాను’ అంటూ గబ్బార్డ్ ట్వీట్ చేశారు. -
హౌడీ మోదీ కలిసొచ్చేదెవరికి
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో జరగనున్న హౌడీ మోదీ కార్యక్రమానికి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ హాజరవడానికి అంగీకరించడంతో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా సక్సెస్ అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతలు ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడంతో అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. హ్యూస్టన్ ర్యాలీలో కీలక ప్రకటనకు అవకాశం ఉందంటూ ట్రంప్ సంకేతాలిచ్చారు. గురువారం కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ వెళుతుండగా ప్రత్యేక విమానంలో విలేకరుల హ్యూస్టన్ ర్యాలీలో ఏదైనా ప్రకటన ఉంటుందా అన్న ప్రశ్నకు ఉండొచ్చునని బదులిచ్చారు. భారత్, పాక్‌ల మధ్య కశ్మీర్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడడంతో అమెరికా భారత్ పక్షమే వహిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులనుద్దేశించి టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో ఈ నెల 22న మోదీ ప్రసంగించనున్నారు. వాణిజ్య బంధాల బలోపేతమే మోదీ లక్ష్యం గత కొద్ది నెలలుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా వాణిజ్య ప్రతినిధి రోబర్ట్ లైటింగర్ భారత్ ఎగుమతులపై కొన్ని ప్రయోజనాలను రద్దు చేశారు. దీనికి ప్రతిగా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారత్ సుంకాలను పెంచింది. ఇలాంటి సమయంలో రెండు దేశాల అధినేతలు ఒకే వేదికను పంచుకోవడం వల్ల రెండు దేశాల మ«ధ్య వాణిజ్య రంగంలో విభేదాలు సమసిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ రాకతో అమెరికా సమాజ ఆర్థిక పురోగతికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తోందని మోదీ భావిస్తున్నారు. ఇంధన, వాణిజ్య రంగాల్లో సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఓటు బ్యాంకు కోసం ట్రంప్ అమెరికాలో నివసించే భారతీయులు ఏర్పాటు చేసిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి ట్రంప్ హాజరుకావడం ఇదే తొలిసారి. 2020 అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న ట్రంప్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హాజరవుతున్నారని భావిస్తున్నారు. ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఆసియన్ అమెరికన్లలో అయిదో వంతు మంది భారతీయులే. అందులోనూ టెక్సాస్‌లో భారతీయుల ఓటుబ్యాంకు బలంగా ఉంది. 2 లక్షల 70 వేల మందికిపైగా ఓటర్లు టెక్సాస్‌లో ఉన్నారు. హౌడీ మోదీ కార్యక్రమానికి 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరుకానున్నారు. అమెరికా ఎన్నికల్లో భారతీయులు సంప్రదాయంగా డెమొక్రాట్లకే మద్దతుగా ఉంటూ వస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంపై రాజకీయంగా రిపబ్లికన్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో డెమోక్రాట్లు పట్టుకు యత్నిస్తున్నారు. -
భారతీయుల ఇళ్లే టార్గెట్.. దోషిగా తేలిన మహిళ
వాషింగ్టన్ : అమెరికాలో భారత సంతతికి చెందినవారి ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన ఘటనలో హ్యూస్టన్‌కు చెందిన చక క్యాస్ట్రో(44) అనే మహిళను మిచిగన్ కోర్టు దోషిగా తేల్చింది. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ముందుగా ఎంపిక చేసి కొన్ని ఇళ్లను చక క్యాస్ట్రో టార్గెట్‌గా నిర్దేశించేది. అనంతరం ముఠాగా ఏర్పడి దోపిడీకి పాల్పడేది. ముఖ్యంగా ఆసియా సంతతికి చెందిన వారు, భారతీయులని లక్ష్యంగా చేసుకుని చక క్యాస్ట్రో లక్ష్యాలను నిర్దేశించేది. 2011 నుంచి 2014 మధ్యలో అమెరికాలోని జార్జియా, న్యూయార్క్, ఒహియో, మిచిగన్, టెక్సాస్‌లలో వరుస దోపిడీలకు పాల్పడింది. బాధితులను తుపాకులు, మారణాలయుధాలతో బెదిరించి ఈ ముఠా దోపిడీ చేసేది. గుర్తుపట్టకుండా మారువేషాలతో చోరీలు చేసేవారు. వరుస చోరీల కేసులో చక క్యాస్ట్రోను దోషిగా తేల్చిన మిచిగన్ కోర్టు సెప్టెంబర్‌లో శిక్ష ఖరారు చేయనుంది. -
హ్యూస్టన్‌లో 'యాత్ర' సంబరాలు
హ్యూస్టన్ : మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చుట్టూ సాగే ఈ ‘యాత్ర’ ఆయన అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. యాత్ర చిత్ర విడుదల సందర్భంగా హ్యూస్టన్‌లో 200 కార్లతో వైఎస్సార్ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొని కేటీలోని సినేమార్క్ థియేటర్లో యాత్ర చ్రిత విడుదలను సంబరంగా జరుపుకున్నారు. సినిమా అయిపోయిన తరువాత అందరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ సందర్బంగా వారు చిత్ర దర్శకునికి, నిర్మాతలకు, చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర చిత్రాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, ఒక మనిషి మాట ఇచ్చిన తర్వాత ఎంత వరకైనా వెళ్లగలను అనడానికి వైఎస్సార్ ఒక గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. ఈ వేడుకల్లో సుమారు 300 మంది వైఎస్సార్ అభిమానులు పాల్గొని యాత్ర కేక్ కట్ చేశారు. జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో థియేటర్ మొత్తాన్ని హోరెతించారు. సినిమా విజయవంతం అయినందుకు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమాకి వచ్చిన అందరికి డిస్ట్రిబ్యూటర్ రఘువీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు . -
హోస్టన్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తల సంబరాలు
-
హోస్టన్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తల సంబరాలు
హోస్టన్ : హోస్టన్‌లో వైఎస్సార్సీపీ కార్య కర్తలు అందరు ఒక్క చోట చేరి వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా పూర్తైన సందర్భాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కార్య కర్తలు అందరూ వైఎస్ జగన్ పట్టుదలను, మొక్కవోని ధైర్యాన్ని కొనియాడారు. పాదయాత్రలో దాదాపు పద్నాలుగు నెలలు అయన పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. అందరు రాబోయే ఎన్నికల గురుంచి, పార్టీకి ఎలా తోడ్పాటు అందించాలి అనే అంశాన్ని చాలా సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే కార్య క్రమాల ప్రణాలికను కూడా చర్చించారు. తరువాత అందరు కేక్ కట్ చేసి, జోహార్ వైఎస్సార్, జై జగన్, రావాలి జగన్ కావాలి జగన్ నినాదాలతో హోరెత్తించారు. -
షాకింగ్ వీడియో : మహిళను కారుతో తొక్కించి..
టెక్సాస్, హ్యూస్టన్ : బ్యాంకులో భారీ మొత్తంలో నగదు డ్రా చేసిన ఓ మహిళను వెంబడించి కొందరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో చోటుచేసుకున్న పెనుగులాటలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వ్యాపార అవసరాల కోసం 75 వేల డాలర్లలను (దాదాపు 52 లక్షల రూపాయలు) బ్యాంకు నుంచి ఓ మహిళ డ్రా చేశారు. హ్యుస్టన్‌లోని బ్యాంకు నుంచి బయటకు రాగానే దుండగులు ఆమెను వెంబడించడం ప్రారంభించారు. తనకు చెందిన వలేరో గ్యాస్ స్టేషన్ వద్దకు మహిళ రాగానే, మరో కారులో నుంచి ఓ దుండగుడు దిగి పరుగున ఆమె దగ్గరకు వచ్చి బ్యాగులాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే మహిళ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో పెనుగులాట చోటుచేసుకుంది. ఇంతలోనే మహిళ భర్త కూడా వచ్చి దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో దుండగుడికి, మహిళ భర్త పెనుగులాడుతుండగానే మహిళ అక్కడి నుంచి పక్కకు వెళ్లాలని చూశారు. ఇంతలోనే దుండగులకు చెందిన మరో కారు కూడా అక్కడికి వచ్చింది. అందులో నుంచి దిగిన మరో వ్యక్తి మహిళ, అమె భర్తపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారి ముందుభాగంలో నిలిపిన కారును వేగంగా వెనక్కు తీసుకువచ్చి మహిళపైకి ఎక్కించి ముందుకు వెళ్లడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. చోరీకి పాల్పడిన డేవిడ్ మిచెల్గానూ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. రెండో నిందితుడిని ట్రావెన్ జాన్సన్‌గా పోలీసులు గుర్తించి అతడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మరికొందరి పాత్రపై కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉంది. -
వెంటపడి మరీ వికృత చేష్టలు...
టెక్సాస్: సైకిల్‌పై వృద్ధురాలి వెంటపడి మరీ వికృత చేష్టలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అయితే అతని వ్యవహారాన్ని భరించలేకపోయిన సదరు వృద్ధురాలు అతన్ని తుపాకీతో కాల్చేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని హౌస్టన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రానీ జీన్(68) అనే వృద్ధురాలు మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సైకిల్‌పై ఆమెను వెంబడించాడు. కాస్త దూరం వెళ్లాక ప్యాంట్ విప్పి ఆమెను చూస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. భయంతో ఆమె ఇంటికి పరిగెత్తగా.. ఆమెను వెంటాడాడు. చివరకు ఆమె ఇంటి డోర్ వద్దకు చేరి మరీ తన చేష్టలను కొనసాగించాడు. భయంతో సదరు వృద్దురాలు అతన్ని హెచ్చరించినట్లు చెబుతోంది. ‘ఆ సమయంలో ఇంట్లో నా మనవరాలు ఒక్కతే ఉంది. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. వెళ్లిపో.. లేకపోతే కాల్చి పడేస్తా అని చెప్పాను. అతను అయినా వినలేదు. భయంతో అతన్ని కాల్చేశా’ అని జీన్ చెబుతున్నారు. గాయపడ్డ అతను కాస్త దూరం వెళ్లాక కుప్పకూలిపోయాడు. కాగా, గాయపడిన సదరు వ్యక్తి(38) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోలుకున్నాక అతన్ని అరెస్ట్ చేస్తామని ‘ల్యారీ క్రౌసన్’ అనే అధికారి వెల్లడించాడు. గతంలో ఓసారి నగ్నంగా రోడ్లపై తిరిగిన నేరంలో అతగాడిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జీన్‌పై ఎలాంటి కేసును నమోదు చేయలేదు. -
హ్యూస్టన్‌లో పాలపిట్ట పుస్తకావిష్కరణ
టెక్సాస్, హ్యూస్టన్ : ప్రవాస తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేక సంచిక 'పాలపిట్ట'ను తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి హ్యూస్టన్‌లో ఆవిష్కరించారు. ప్రపంచ తెలంగాణ మహా సభల సందర్భంగా ప్రచురించిన ఈ ప్రత్యేక సంచికలో రైతే రాజు, సినారే ఘన నివాళి, నాలుగేళ్ల తెలంగాణ, హ్యూస్టన్ తెలుగు భవనం, బోనాలు, బతుకమ్మ పండుగ, తెలంగాణంతో పాటు మరెన్నో విశేషాలు పొందుపరిచారు. ఈ పుస్తక ప్రచురణకు ప్రొఫెసర్ సాంబరెడ్డి ముఖ్య సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎంపీ జితేందర్ రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ నాయకులు కృష్ణ సాగర్ రావు, అమెరికా తెలంగాణ సంఘం కార్య వర్గం, తెలంగాణ రాష్ట్రం నుండి విచ్చేసిన పలువురు కళాకారులు పాల్గొన్నారు. -
షాకింగ్ : గన్‌తో పేల్చుకున్న రెండేళ్ల చిన్నారి
టెక్సాస్ : చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారు తెలిసీ తెలియకుండా చేసే పనులు ఒక్కోసారి ప్రాణాలు మీదకు తెస్తాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా హోస్టన్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి.. అక్కడే బుల్లెట్లు లోడ్ చేసి ఉన్న గన్‌తో తనకు తానుగా కాల్చుకున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నప్పటికీ వారేమీ చేయలేకపోయారు. చిన్నారిని టెక్సాస్‌లోని పిల్లల ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ఏ ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చేర్చిన ఒక రోజు అనంతరం చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడని తెలిసింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం హోస్టన్‌లో జరిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం, సురక్షితం కాని లోడెడ్ గన్‌తో తనకు తానుగా పేల్చుకోవడం వల్లే చిన్నారి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. లోడ్ చేసిన 9 ఎంఎం పిస్టల్‌ను ఈ చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో పట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. చిన్నారి ఆ గన్‌తో ఆడుకుంటూ తలకు గురిపెట్టుకుని ట్రిగర్ నొక్కుకున్నాడని.. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారి గన్‌తో పేల్చుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిన్నారిని కాపాడుకోలేకపోయారు. వారికి ఏమైనా శిక్ష విధించాలా? అనే విషయంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి ఓ పాఠంలా ఉందని పలువురు అంటున్నారు. -
ప్రొఫెసర్ సాంబరెడ్డికి తెలంగాణ సైన్స్ ఎక్సలెన్స్ పురస్కారం
హ్యూస్టన్ : అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలంగాణ మహాసభల్లో ప్రొఫెసర్ దూదిపాల సాంబ రెడ్డికి ప్రతిష్టాత్మక 'తెలంగాణ సైన్స్ ఎక్సలెన్స్ పురష్కారం' ప్రదానం చేశారు. అమెరికాలో హ్యూస్టన్ మహానగరంలో జూన్ 29 నుండి జులై 2 వరకు జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో జరగిన ద్వితీయ తెలంగాణ ప్రపంచ మహాసభలల్లో టెక్సాస్ ఏ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. సాంబ రెడ్డిని 'తెలంగాణ మహాసభల' బృందం తెలుగు సంప్రదాయాలతో ఘనంగా సత్కరించింది. శాస్త్ర సాంకేతిక రంగంలో నిస్వార్ధంగా గత 20 సంవత్సరాలుగా ప్రొఫెసర్ సాంబ రెడ్డి చేసిన పరిశోధనలకు, సేవ నిరతకు గుర్తింపుగా ఈ విశిష్ట పురష్కారాన్ని ఇస్తున్నట్లు మహాసభల నాయకత్వ బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని పాల పిట్ట సావెనీర్లో కూడా విడుదల చేశారు. వేల మందితో కిక్కిరిసిన ఈ మహాసభలకు అమెరికా అన్ని రాష్ట్రాలనుండి తెలుగు ప్రవాసులు, ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్‌తో పాటు ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చారు. తెలంగాణ మహాసభల ఎగ్జిక్యూటివ్, కన్వెన్షన్ బృంద నేతృత్వంలో అత్యంత వైభవంగా జరిగిన ప్రారంభ డిన్నర్ వేడుక సభలో మఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ జితేందర్ రెడ్డి, సత్కారాన్ని డా. సాంబ రెడ్డికి అందజేశారు. 'తెలంగాణ సైన్స్ పురస్కారం' ఇంతచిన్న వయసులోనే అందుకోవడం అదృష్టంగా భావిన్నాను. ఒక తెలంగాణ బిడ్డగా ఇంతటి గౌరవవం నాకు ఇవ్వడానికి సహకరించిన వారందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ముందుముందు మరెన్నో శాస్త్ర విజయాలు సాధించి తెలంగాణ గడ్డకి, మనభారతీయులందరి కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా నావంతు కృషి చేస్తా. ఈ అవార్డును నా మాతృ మూర్తుల జ్ఞాపకంగా వారికీ అంకితం చేస్తున్నా' అని డా. సాంబ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలంగాణ మహాసభల ఆర్గనైజర్లు కరుణాకర్ మాధవారపు (చైర్మన్), సత్యనారాయణ రెడ్డి కందిమల్ల (ప్రెసిడెంట్), శ్రీధర్ కాంచనకుంట్ల (డైరెక్టర్), వినోద్ కుకునూర్ (ప్రెసిడెంట్-ఎలెక్ట్), బంగారెడ్డి ఆలూరి (కన్వీనర్), జగపతి రెడ్డి వీరటి (కోఆర్డినేటర్), డా. రాజేందర్ అపారసు (అవార్డు చైర్), బోర్డు మెంబర్లు, కన్వెన్షన్ సభ్యులు, కన్వెన్షన్ కమిటి చైర్మన్లు, తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హ్యూస్టన్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ హ్యూస్టన్ సభ్యులలతోపాటూ పలువురు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పరకాల మండల పరిధిలోని చెర్లపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో డా. సాంబ రెడ్డి జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో ఆరు బంగారు పతకాలతో పట్ట భద్రులయ్యారు. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో పీహెడీ చేసి, అత్యధిక శాస్త్ర అధ్యయనాలు ప్రచురించి లింకా రికార్డు సృష్టించారు. అయన కనిపెట్టిన ఎన్నో ఫార్మసిటికల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిపొందాయి. డా. సాంబ రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయం వైద్య శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. అమెరికాలోని అత్యంత ప్రసిద్ధిచెందిన శాస్త్ర సంస్థలైన ఏఏఏఎస్ (అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ సైన్స్), ఏఏపీఎస్ (అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫార్మాస్యూటికల్ సొసైటీ), ఏఈఎస్ (అమెరికన్ ఎపిలెప్సీ సొసైటీ ) నుంచి "ఫెల్లో" (శాశ్వత సభ్యత్వము) అనే అతి కొద్దీ శాస్త్రవేత్తలకిచ్చే ముఖ్యమైన పురస్కారాలు అందుకున్న మొట్ట మొదటి తెలుగు భారతీయుడు. ఫార్మసీ మెడికల్ రంగాల్లో 180 పేపర్స్, డజన్ కు పైగా మెడికల్ పుస్తకాలు రచించిన ఆయన ఇంటెర్నేషనల్ సైన్స్ పండిత డాక్టర్లలో ఒక అసామాన్యుడుగా ప్రసిద్ధి పొందారు. ఆయన గత 24 సంవత్సరాల నుండి మెదడు జబ్బులపై అధ్యాయనం చేస్తున్నారు. ఫీట్స్ వ్యాధికి ఓ మెడిసిన్ కూడా కనిపెట్టారు. మెదడులోని ఉత్ప్రేరకాలు, సరఫరా వ్యవస్థ విధానంలో ఎన్నో పరిశోధనలు చేసి, ఎపిలెప్సీ రోగ నిర్మూలనం కోసం 'న్యూరో కోడ్' కనిపెట్టి చరిత్ర సృష్టించారు. మెదడు దెబ్బల నుంచి న్యూరోలాజికల్ జబ్బులు రాకుండా ఒక కొత్త 'ఏపిజెనెటిక్' చికిత్స విధానాన్నిఇటీవలే ప్రకటించారు. ఈ మెడికల్ విధానాలు విశ్వవ్యాప్తంగా ఎన్నో వేల మంది న్యూరోలాజికల్ రోగులకు ఉపయోగపడుతున్నాయి. ఫిట్స్, తల దెబ్బలు, న్యూరోటాక్సిసిటీ, ఇతర మెదడు జబ్బులకు కొత్త మందులు కనిపెట్టి న్యూరోలాజికల్ రోగులకు అధునాతన చికిత్స అందిస్తూ, వారి జబ్బుల నియంత్రణకు సహాయం చేయడమే తన జీవిత ధ్యేయంగా మలచుకున్నారు. 2012, 2013, 2014 లో వరుసగా అమెరికాలోని ప్రముఖ తెలుగు అసోసియేషన్స్ 'నాటా', 'తానా', 'ఆటా' సంస్థల నుంచి రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు సాధించి, హ్యాట్రిక్ సృష్టించిన ఏకైక తెలుగు ప్రవాస భారతీయుడిగా నిలిచారు. శాస్త్రవేత్తగా బిజీగా ఉంటూనే సామజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. -
హ్యూస్టన్‌లో భద్రాద్రి రాముడి కల్యాణం
హ్యూస్టన్ : అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ (ఆటా) నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ ద్వితీయ మహాసభల చివరి రోజు వేడుకల్లో భద్రాద్రి రాముడి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. హ్యూస్టన్ లోని జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన సభలకు భద్రాచలం నుంచి ఉత్సవ మూర్తులను తీసుకొచ్చిన పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలో భాగంగా నిర్వహించిన సాహిత్య, సంగీత కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు సత్యనారాయణ కందిమళ్ల, నిర్వహాణ కార్యదర్శి బంగారు రెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ వినోద్ కుకునూర్, సహాయ సమన్వయ కర్త జగపతి వీరేటి, వివిధ కమిటీల ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ప్రత్యేక విశిష్ట అతిథులుగా ఎంపీ జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్, బీజేపీ రాష్ట్ర నాయకులు కృష్ణప్రసాద్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. (చదవండి: హ్యూస్టన్‌లో ఘనంగా ఆటా మహాసభలు) -
హ్యూస్టన్‌లో ఘనంగా ఆటా మహాసభలు
హ్యూస్టన్ : అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ (ఆటా) నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ ద్వితీయ మహాసభలు హ్యూస్టన్ లోని జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రారంభమయ్యాయి. వేడుకలను తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. దీపారాధన, గణపతి ప్రార్థన, తెలంగాణ పాటలు, కూచిపూడి భరత నాట్యం లాంటి భారతీయ నృత్యాలతో వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. సామాజిక పలకరింపులు, అలాయి బలాయిలు జరిగాయి. సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ కందిమళ్ల, నిర్వహణ కార్యదర్శి బంగారు రెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ వినోద్ కుకునూర్, సహాయ సమన్వయ కర్త జగపతి వీరేటి, వివిధ కమిటీల ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ప్రత్యేక విశిష్ట అతిథులుగా ఎంపీ జితేందర్ రెడ్డి, సాంస్కృతిక రాయబారి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర నాయకులు కృష్ణప్రసాద్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా18 దేశాల నుంచి అనుబంధ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వాణిజ్య వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, గాయకులూ, కళాకారులూ, మీడియా ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు. పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖులను వేడుకల్లో అవార్డులతో సత్కరించారు. కమ్యూనిటీ సర్వీస్‌లో శ్రీధర్ కాంచనచర్ల, రామచంద్రారెడ్డి, జీవిత సాఫల్య అవార్డు డాక్టర్ పద్మజారెడ్డి, డాక్టర్ రత్నకుమారి, చేనేత రంగంలో గజం అంజయ్య అందుకున్నారు. తెలంగాణ ఆర్టిస్టులతో రూపొందించిన చార్మినార్, దాని చుట్టూ పాతబస్తీని తలపించేలా వాణిజ్య అంగళ్లు, హైదరాబాదీ వంటకాలతో తొలి రోజు సంబరంగా జరిగింది. తెలంగాణ, తెలుగు కళలు ఉట్టిపడేలా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. -
పవన్‌కు సంఘీభావంగా ప్రవాసాంధ్రుల మౌన నిరసన
హ్యూస్టన్ : తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మీడియా సంస్థలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా హ్యూస్టన్‌లోని 'రే మిల్లర్ పార్కు (రవింద్రనాథ్ ఠాగూర్ పార్క్)'లో జనసేన కార్యకర్తలు ఫ్లకార్డులతో మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు. రాజేష్ యాళ్లబండి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కి తమ సంఘీభావం తెలుపుతూ, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మీడియా సంస్థలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా 'సైలెంట్ ప్రొటెస్ట్' చేశారు. ఈ కార్యక్రమానికి సాన్ ఆంటోనియో నుంచి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు, సోషల్ మీడియా యాక్టివ్ కాంట్రిబ్యూటర్ విష్ణు నాగిరెడ్డి వచ్చారు. ప్రతీ కార్యకర్త ఎల్లో మీడియాని బాయ్ కాట్ చేయాలని విష్ణు నాగిరెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలు మరింత బాధ్యతతో జనసేన సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పవణ్ కళ్యాణ్ సహకారంతో నాలుగేళ్లకిందట అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం, అదే పవణ్ కళ్యాణ్‌ని రాజకీయంగా, మానసికంగానే కాకుండా చివరకు కుటుంబ పరంగా కూడా ఎల్లో మీడియాతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాను సామాజిక మాధ్యమాల్లో కూడా అన్‌ఫాలో కావాలని, ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో ఏ విధంగా 'బ్లాక్ / అన్-ఫాలో' కావాలో వివరించారు. నవసమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక వహించవలసిన బాధ్యత మీడియా పై ఉందని వెంకట్ శీలం పేర్కొన్నారు. మీడియా తీరుమారవలసిన సమయమాసన్నమైందన్నారు. మీడియా తప్పుడు ప్రచారాలతో, అభూత కల్పనలతో ప్రజలని, రాజకీయాలని గణనీయంగా ప్రభావితం చేస్తున్నారని కృష్ణ చిరుమామిళ్ల తెలిపారు. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పైపైకి అని శ్రీ శ్రీ స్పూర్తిని శశి లింగినేని మరోసారి జనసేన కార్యకర్తలను ఉత్తేజపరిచారు. నవసమాజంకోసం ప్రస్తుత మీడియాలో మార్పు అవసరమన్నారు. మెరుగైన సమాజం కోసం నీతీ, నిబద్ధత, నిజాయితీతో పనన్ కళ్యాణ్ కష్టపడుతున్నారని, వారికి ఎన్ఆర్ఐలందరూ సహకరిస్తారని వీరా కంబాల చెప్పారు. ప్రతీ కార్యకర్త జనసేన సిద్ధాంతాలను, స్పెషల్ స్టేటస్ ఆవశ్యకతను పల్లెపల్లెకి, ప్రతీ పౌరుడికీ చేర్చాలని రాజేష్ యాళ్లబండి కోరారు. ఈ కుళ్లు రాజకీయాలని తిప్పికొట్టాలని, 'స్వచ్ఛ మీడియా' కోసం ప్రస్తుత అవసరమైతే ఎల్లోమీడియాను బాన్ చేయాలని కోరారు. అమ్ముడుపోయిన మీడియాలతో రాష్ట్ర ప్రజలు అశాంతికి గురవుతున్నారన్నారు. ప్రస్తుత కలుషిత మీడియా ప్రధాన సమస్యలను ప్రక్కతోవ పట్టించడంలో సఫలీకృతమౌతుందని శేషాద్రి మంచం అన్నారు. అలాంటి చానళ్ళని బ్యాన్ చేయవలసినదిగా జనసేన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జగన్ రాయవరపు, శేషగిరి రావు యల్లాప్రగడ, కిరణ్ వర్రే, శశి లింగినేని, సందీప్ రామినేని, రాం సింహాద్రి, కిషోర్ అధికారి, రమేష్ వరంగంటి, వెంకట్ బోనం, సుబ్రమణ్యం వంగల, వెంకట్ శీలం, వీరా కంబాల, దుర్గారావ్ నుప్పులేటి, శేషద్రి మంచెం, నాగ్ మేకల, సురేష్ సత్తి, చైతన్య కూచిపూడి, మహేష్ ముద్దాల, కృష్ణ చిరుమామిళ్ళ, రాజేష్ యాళ్లబండి, విష్ణు నాగిరెడ్డి, శ్రీకాంత్, హ్యూస్టన్‌లోని జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలందరూ, జనసేన పార్టీ నిర్మాణానికి బలోపేతానికీ తమ పూర్తి సహాయసహకారలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. -
డొనేషన్ల పేరిట మోసం..
హూస్టన్: హరికేన్ హార్వీ ధాటికి అమెరికాలోని హూస్టన్ నగరం చిగురుటాకులా వణుకుతుండగా మరో వైపు దుండగలు డొనేషన్ల పేరిట రెచ్చిపోతున్నారు. వరదల్లో చిక్కుకోని నిరాశ్రయులైన వారికి అండగా అనేక మంది డొనేషన్లు ఇస్తుండగా వీరినే ఆసరాగా చేసుకుంటున్నారు. అయితే డొనేషన్లు ఇచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని జస్టిస్ డిపార్ట్మెంట్ నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ ఫ్రాడ్ డైరెక్టర్ వాల్ట్ గ్రీన్ హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడల్లా సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఫేక్ యూఆర్‌ఎల్‌లతో సైబర్ నేరగాళ్లు డొనేషన్ ఇచ్చేవారి నుంచి డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది జాతీయ వాతావరణ శాఖ ఆ ఏట విడుదల చేసే తుఫాను పేర్ల వివరాలను తెలుసుకొని వాటిపై ఆన్లైన్ డొమైన్స్( ప్రభుత్వానికి చెందినది) రిజిస్టర్ చేసుకుంటున్నారని వాల్ట్ గ్రీన్ పేర్కొన్నారు. కొందరు డొమైన్స్ ద్వారా కాకుండా వ్యక్తిగత ఈ మెయిల్ ద్వారా డబ్బులు అడుగుతారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాల్ట్ గ్రీన్ సూచించారు. విపరీతంగా వర్షం కురుస్తుండడంతో ప్రభుత్వం ఇప్పటికే అక్కడ కర్ఫ్యూ విధించింది. లూటీలు, దొంగతనాలు, ఇతర నేరాలను అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించినట్లు హూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ పేర్కొన్న విషయం తెలిసిందే. వరదలో చిక్కుకున్నవారికి సహాయం చేసేందుకు వెళ్లే బృందాలు, వ్యక్తులకు మినహాయింపు ఇచ్చారు. -
పదివేల కుటుంబాలకు హార్వీ పరేషాన్
హౌస్టన్: అమెరికాలోని హూస్టన్‌ను అతలాకుతలం చేసిన హరికేన్ హార్వీ అక్కడి తెలుగు వారికీ తీరని విషాదం మిగిల్చింది. హూస్టన్ ప్రాంతంలో పలు తెలుగు కుటుంబాలు నివసిస్తుండగా, వారి ఇళ్లు దెబ్బతినడం ఇతరత్రా పెద్దమొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రేటర్ హూస్టన్ పరిథిలో తెలుగు కుటుంబాలకు హార్వీతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ తరహా ప్రకృతి వైపరీత్యాలకు బీమా కవరేజ్ వర్తించకపోవడం వారిలో ఆందోళన రేకెత్తిస్తున్నది. హరికేన్ ప్రభావానికి గురైన బాధిత కుటుంబానికి రూ 30 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లివచయ్చని భావిస్తున్నారు.మరోవైపు పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలో వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. భారీ విలయం సంభవించిన క్రమంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే అవకాశం ఉన్నా ఇతమిద్దంగా దానిపై ఎవరూ హామీ ఇచ్చే పరిస్థితి లేదు.హార్వీ ఎఫెక్ట్ ఉన్న గ్రేటర్ హౌస్టన్ పరిథిలోని కాటీ, సుగర్ ల్యాండ్, సైప్రస్, బెలైరె ప్రాంతాల్లో 50,000 జనాభాతో పదివేల తెలుగు కుటుంబాలున్నాయి. వీరిలో చాలావరకూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్య వృత్తిలో ఉన్నవారే అధికం. వీరు తమ ఇళ్లు పునర్నిర్మించుకోవాలంటే రుణాలపై ఆధారపడాల్సిందే. ఇక ఉన్నత విద్య ముగించి ఉద్యోగాల కోసం అన్వేషించేవారి పరిస్థితి మరింత దయనీయం. విద్యార్థులూ ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తుపాన్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోని తెలుగువారు షెల్టర్ హోమ్స్‌లో తలదాచుకున్నారు. హార్వీ ప్రకంపనలతో అక్కడ తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి కుటుంబీకులు ఇక్కడ వారి గురించి ఆందోళన చెందుతున్నారు. -
హార్వీ ఎఫెక్ట్: భారత విద్యార్థి మృతి
హోస్టన్: అమెరికాలోని హూస్టన్ వరదల్లో భారత విద్యార్థి మరణించాడు. హార్వీ తుపాను ధాటికి బ్రేన్ సరస్సులో చిక్కుకుపోయిన టెక్సాస్ ఏఅండ్ఎం వర్సిటీ విద్యార్థి నిఖిల్ భాటియా, మరో భారత విద్యార్థిని షాలినీ సింగ్‌ను అధికారులు రక్షించారు. అయితే తీవ్రగాయాలతో భాటియా మరణించగా, షాలిని పరిస్థితి ఇంకా విషమంగా ఉందని కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులకు తాము ఎప్పటికప్పుడు వారి సమాచారం చేరవేస్తున్నామని అధికారులు చెప్పారు.జైపూర్‌కు చెందిన భాటియా, ఢిల్లీకి చెందిన అతని ఫ్రెండ్ షాలినీ పబ్లిక హెల్త్‌లో మాస్టర్స్ చేస్తున్నారు. వరద బీభత్సంలో వారు సరస్సుకు ఎందుకు వెళ్లారన్నది తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. -
చిగురుటాకులా వణుకుతున్న హూస్టన్
► నగరంలో కర్ఫ్యూ విధించిన అధికారులు ► రికార్డు స్థాయిలో వర్షం వాషింగ్టన్: హరికేన్ హార్వి ధాటికి అమెరికాలోని హూస్టన్ నగరం చిగురుటాకులా వణుకుతోంది. ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. విపరీతంగా వర్షం కురుస్తుండడంతో ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధించింది. లూటీలు, దొంగతనాలు, ఇతర నేరాలను అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించినట్లు హూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ పేర్కొన్నారు. వరదలో చిక్కుకున్నవారికి సహాయం చేసేందుకు వెళ్లే బృందాలు, వ్యక్తులకు మినహాయింపు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఇక్కడ వర్షపాతం నమోదైంది. హూస్టన్ సిటీలో పలు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. చాలా ఇళ్లు ధ్వంసంకాగా.. 15 మంది చనిపోయారు. వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ షెల్టర్లలో కాలం గడుపుతున్నారు. -
బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్(సీనియర్) (92) అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో గల ఓ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆయనను చేర్పించినట్లు అక్కడి కేహెచ్ఓయూ అనే టెలివిజన్ సంస్థ తెలిపింది. కొద్ది రోజుల తర్వాత ఆయనను ఆస్పత్రి వర్గాలు ఇంటికి పంపించే అవకాశం ఉందని జీన్ బెకర్ అనే వ్యక్తి తెలిపారు. అయితే, ఆయనను ఏ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం మాత్రం బయటకు తెలియనివ్వలేదు. అలాగే, ఆయన ఆస్పత్రిలో అనూహ్యంగా చేరడానికి గల కారనాలు కూడా చెప్పలేదు. గతంలో ఓ సారి ఆయన కిందపడి ఆయన మెడలోని ఎముక విరిగిపోవడంతో తనకుమారుడు జార్జ్ బుష్ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుర్చీకే పరిమితం అయిన సీనియర్ బుష్ ఇప్పటికే తన మెడకు పట్టీని కొనసాగిస్తున్నారు. -
ఉత్కంఠ రేపిన 'రోప్ వాక్' వెడ్డింగ్!
ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి అంటూ పెళ్ళిళ్ళు అట్టహాసంగా చేసేవారిని వర్ణిస్తుంటాం. అలాగే అందరికీ భిన్నంగా, కాస్తంత వెరైటీగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని తహతహలాడేవారినీ చూస్తాం. కానీ జీవనాధారం కోసం ప్రాణాలతో చెలగాటమాడే సర్కస్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అదే సర్కస్ ఫీట్ తో పెళ్ళి చేసుకోవడం ఇప్పుడు చరిత్రను సృష్టించింది. ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో.. తాడుపై నడిచే రోప్ వాక్ ఫీట్ చేస్తూ.. పెళ్లి చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాదు.. ఆ రోప్ వాక్ వెడ్డింగ్ అతిథుల్లో ఉత్కంఠను కూడా రేపింది. సర్కస్ లో రోప్ వాక్ చేస్తూనే... వినూత్నంగా వివాహ వేడుకను నిర్వహించుకున్నారు హోస్టన్ కు చెందిన ముస్తాఫా డాంగ్విర్, అన్నా లెబెదేవాలు. ప్రపంచ ప్రఖ్యాత సర్కస్ రింగ్లింగ్ బ్రోస్ లో పనిచేసే ఆ ఇద్దరూ భూమి నుంచి 30 అడుగుల ఎత్తులో గట్టిగా కట్టిన తాడుపై నడుస్తూ దంపతులయ్యారు. 1884 లో అమెరికాలో మొత్తం ఏడుగురు రింగ్లింగ్ సోదరుల్లో ఐదుగురితో ప్రారంభమైన ఈ ప్రముఖ సర్కస్.. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ షో గా ప్రఖ్యాతి పొందింది. అటువంటి రింగ్లింగ్ బ్రోస్, బార్నమ్ అండ్ బైలీ స్థానిక ఎన్ఆర్జీ స్టేడియంలో సంయుక్తంగా నిర్వహించిన సర్కస్ షోలో.. అందులోనే పనిచేచే ముస్తాఫా డాంగ్విర్, అన్నా లెబెదేవాలు తమ వివాహాన్నినిర్వహించుకోవడం ఇప్పుడు సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. వైట్ టెక్సిడో కోట్ ధరించి, ఒంటెపై ఊరేగుతూ వివాహ వేదికకు వచ్చిన వరుడు.. పక్కనే ఉన్న నిచ్చెన మీదుగా అప్పటికే సిద్ధంగా ఉన్న సర్కస్ వాక్ రోప్ మీదకు చేరుకున్నాడు. తెల్లని ఆకట్టుకునే అందమైన పెళ్ళి గౌను, హైహీల్స్ వేసుకొని గుర్రంపై వచ్చిన వధువు.. సైతం సర్కస్ రోప్ పైకి చేరుకున్న అనంతరం.. రోప్ మధ్య భాగంలో కూర్చొని వధూవరులు ఉంగరాలు మార్చుకొని, అతిథుల ఆనందోత్సాహాలు, హర్షధ్వానాలమధ్య ఒక్కటయ్యారు. పెళ్ళికి హాజరైనవారిని చిరుమందహాసంతో పలుకరిస్తూ ఏడడుగులూ నడిచారు. -
టేకాఫ్ తీసుకోగానే కూలిన విమానం
హ్యూస్టన్: టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఓ విమానం కూలిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని హ్యూస్టన్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న 'పైపర్ పీఏ-32' రకానికి చెందిన విమానం వెస్ట్ హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్పోర్ట్ సమీంపలోని చెట్ల పొదల్లో విమానం కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నేలను తాకగానే భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో విమానం తునాతునకలైనట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మృతిచెందిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విమానం కూలిపోవటానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. -
కుప్పకూలిన విమానం..నలుగురి మృతి
హూస్టన్: అమెరికాలో ఓ చిన్నవిమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు మరణించారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. నలుగురితో బయలుదేరిన సింగిల్ ఇంజీన్ పీఏ- 32 ప్రయివేట్ హూస్టన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జనావాసాలపై కుప్పకూలింది. శుక్రవారం సాయంత్రం వెస్ట్ హూస్టన్ విమానాశ్రయంనుంచి గాల్లోకి లేచిన కొద్ది సేపటికే నేలపై పడిపోయి పూర్తిగా ధ్వంసమైంది. అయితే మంటల్లో చిక్కుకున్న విమానంనుంచి చిన్నచిన్న పేలుళ్లను గమనించామని ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదని, ప్రమాదానికి కారణాలను విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
ప్లీజ్ అమ్మ.. వద్దు అమ్మ అని వేడుకున్నా..
తను బిడ్డల్ని ఎంతగానో ప్రేమించేది. వారి గురించి గర్వంగా చెప్పుకొనేది. ఆ రోజు పర్పుల్ రంగు డ్రేస్ వేసుకొంది. కానీ ఏం జరిగిందో ఏమో తానే చేజేతులా ఇద్దరు కూతుళ్లనీ తుపాకీతో పొట్టనబెట్టుకుంది. ఇది అమెరికాలోని హూస్టన్‌లో తన ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపి.. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో చనిపోయిన క్రిష్టీ షీట్స్ గురించి ఆమె బంధువులు, స్నేహితులు ఆన్లైన్లో వెల్లడించిన విషయం. క్రిష్టీ తన కూతుళ్లు మాదిసన్ (17), టైలర్ (22)లను ఎందుకు చంపింది అనే దానిపై స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరానప్పటికీ.. కాల్పులు జరిగిన రోజు ఏం జరిగింది అనే దానిపై పోలీసులు తాజాగా కొన్ని విషయాలు వెల్లడించారు. కాల్పుల గురించి తెలిపేందుకు క్రిష్టీ ఇంటి నుంచి 911 కాల్స్ వచ్చాయని, ఆ కాల్స్‌లో క్రిష్టీ కూతుళ్లు ఏడుస్తూ వేడుకుంటున్న ధ్వనులు స్పష్టంగా వినిపించాయని పోలీసులు తెలిపారు. ఈ కాల్స్ ప్రకారం.. ఇద్దరు కూతుళ్లు బిగ్గరగా ఏడుస్తూ.. తమను ప్రాణాలతో విడిచిపెట్టామని తల్లిని వేడుకున్నారు. ‘ప్లీజ్ క్షమించి.. ప్లీజ్ మమ్మల్ని షూట్ చేయకు’ అని ఇద్దరూ కూతుళ్లు అభ్యర్థించారు. ‘ప్లీజ్! క్షమించు.. తుపాకీతో నావైపు గురిపెట్టకు’ అని ఓ కూతురు వేడుకోగా.. ‘నేను నీకు మాట ఇస్తున్నాను. ఏం చేయమంటే అది చేస్తాను’ అని మరో కూతురు వేడుకుంది. (ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన మహిళ) ఆ తర్వాత గట్టిగా అరుపులు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఫోన్ పెట్టేయకుండా ఆన్‌లో ఉన్న ఈ కాల్స్‌తో వెంటనే స్పందించిన పోలీసులు త్వరగానే క్రిష్టీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికీ క్రిష్టీ ఇద్దరు కూతుళ్లు నెత్తుటి మడుగులో కూలిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వారు చేసిన అభ్యర్థనలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు వచ్చినప్పటికీ క్రిష్టీ తుపాకీ కిందపడేయకపోవడంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. అమెరికా వాసులను షాక్ గురిచేసిన ఈ కాల్పుల ఉదంతంపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అమెరికాలో నెలకొన్న విచ్చలవిడి తుపాకీ సంస్కృతిని కట్టడి చేయాలని, అమెరికన్లకు మానసిక ఆరోగ్యం, కుటుంబబాంధవ్యాలపై సామాజికంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని నిపుణులు చెప్తున్నారు. -
ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన మహిళ
హూస్టన్: ఇంట్లో మొదలైన చిన్న వాగ్వాదం తీవ్ర విషాదానికి దారితీసింది. కన్న తల్లే తన టీనేజ్ కూతుళ్లపై తుపాకీ గురిపెట్టింది. కనిపెంచిన బిడ్డలపై కనీస మమకారం చూపించకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపింది. ఆ తర్వాత పోలీసులు వచ్చినా చేతిలో తుపాకీని వదిలేయలేదు. వారినీ తుపాకీతో బెదిరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసుల తూటాకు రాక్షసిగా మారిన ఆ తల్లి కూడా చనిపోయింది. ఈ దారుణం అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్‌లో జరిగింది. ప్రశాంత పట్టణంగా పేరొందిన హూస్టన్‌లో కాల్పుల మోత మోగింది. 42 ఏళ్ల క్రిష్టీ షిట్స్ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లను తుపాకీతో అమానుషంగా కాల్చిచంపింది. చేతికి అందివచ్చిన 19 ఏళ్ల టైలర్ షీట్స్‌ను, 17 ఏళ్ల మాదిసన్ షీట్స్‌ను తుపాకీతో పొట్టనబెట్టుకుంది. క్రిష్టీ తుపాకుల మోత ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులకు కాల్ వెళ్లింది. పోలీసులు వచ్చేసరికి పెద్ద కూతురు టైలర్‌కు తూటాలకు కుప్పకూలిపోయింది. మరో కూతురు మాదిసన్ కూడా తూటా గాయాలతో నెత్తురోడుతోంది. ఆ సమయంలో వచ్చిన పోలీసులు తుపాకీ కింద పడేయాలని క్రిష్టీని కోరినా ఆమె వినిపించుకోలేదు. దీంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. క్షణికావేశంలో ఇంట్లో రక్తపాతం సృష్టించిన క్రిష్టీ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు విడిచింది. కొన ఊపిరితో ఉన్న మాదిసన్ ను హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించే ప్రాణాలు వదిలింది. ఈ దారుణం జరుగుతున్న సమయంలో ఇంట్లోనే క్రిష్టీ భర్త ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. కానీ, అతడు మానసికంగా షాక్‌లో ఉండటంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇంట్లో మొదలైన చిన్న వాగ్వాదం ఇంత దారుణానికి కారణమైందని ప్రాథమికంగా తెలుస్తున్నదని, క్రిష్టీ భర్త కోలుకుంటేగానీ అసలు ఏం జరిగిందనేది తెలిసే అవకాశముందని హుస్టన్ పోలీసులు చెప్తున్నారు. -
అమెరికాలోనూ భారీగా..
అందరూ ఇళ్ల నుంచి చాపలు తెచ్చుకున్నారు. చకచకా వాటిని క్రమపద్ధతిలో పరిచేసుకున్నారు. వాటిమీద పడుకుని రకరకాల భంగిమలలో యోగాసనాలు వేయడం మొదలుపెట్టారు. ఇదంతా ఢిల్లీలోనో, ముంబైలోనో అనుకుంటున్నారా.. అమెరికాలో. మంగళవారం అంతర్జాతయ యోగా దినోత్సవం సందర్భంగా ఇప్పటినుంచే అమెరికాలో ప్రాక్టీసు మొదలుపెడుతున్నారు. హ్యూస్టన్‌లోని పలు పాఠశాలలు, పతంజలి యోగపీఠం, ప్రళయ యోగా స్టూడియోల సహకారంతో భారతీయ కాన్సులేట్ జనరల్ ఈ కార్యక్రమాన్ని డిస్కవరీ గ్రీన్ ప్రాంతంలో నిర్వహిస్తోంది. హ్యూస్టన్‌లో భిన్నవర్గాలకు చెందిన వారిని పెద్ద సంఖ్యలో ఇక్కడకు తీసుకొస్తున్నామని, అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని మంచి పద్ధతిలో చేస్తున్నామని భారత కాన్సల్ జనరల్ అనుపమ్ రే తెలిపారు. హ్యూస్టన్ వాసులంతా పెద్దసంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, యోగాతో శాంతి సామరస్యాల సందేశాన్ని అందరికీ పంచాలని ఆయన కోరారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
కారు డోర్లు లాక్..బాలుడి మృతి
హోస్టన్: కారు డోర్లు లాక్ అవ్వడంతో అందులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు లోపలున్న వేడికి, ఊపిరాడక మృతిచెందాడు. బొమ్మ కోసం కారులోకి వెళ్లిన ఇవాన్ ట్రాంపోలినో(3) ప్రమాదవశాత్తూ డోర్లు లాక్ అవ్వడంతో అందులోనే ఇరుక్కు పోయాడు. కారు అద్దాలు పూర్తిగా మూసి ఉండటంతో బాలుడికి లోపల గాలి అందక పోవడం, ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండటంతో వేడికి బాలుడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఈ విషాద ఘటన యూఎస్ లోని హోస్టన్‌లో చోటుచేసుకుంది. ఇంటి సమీపంలో పార్కింగ్ చేసిన కారులో బొమ్మను తీసుకుందామని ఇవాన్ ఎక్కాడు. అయితే అదే సమయంలో డోర్లు లాక్ అయ్యాయి. దీంతో ఆ బాలుడు వెనక సీటులో ఉన్న బొమ్మను తీసుకుని బయటకురావడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. అరగంట తర్వాత కారులో పడిపోయిన బాలున్ని తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే కృత్రిమ శ్వాస అందించి ఆసుపత్రికి తరలించారు. లేడన్ లోని జాన్సన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే బాలుడు మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. -
ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిన విమానం..
వాషింగ్టన్: ఓ విమానం కుప్పుకూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. అమెరికాలోని హౌస్టన్ హాబీ ఎయిర్ పోర్ట్ సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సిర్రస్ గ్రూప్ డిజైన్ చేసిన సింగిల్ ఇంజిన్ విమానం పార్కింగ్ చేస్తుండగా ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మోడల్ ఎస్ఆర్20 విమానం గట్టిగా శబ్ధం చేస్తూ అకస్మాత్తుగా పేలిపోయిందని ఆ సమయంలో అందులో ఉన్న వారు చనిపోయారని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. -
వరుసగా తొమ్మిదిసార్లు తాగి పట్టుబడి..
టెక్సాస్: వరుసగా తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తికి అమెరికా కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది. 56 ఏళ్లు ఉన్న ఆ వ్యక్తి బయట ఉంటే ప్రమాదం అని పేర్కొంటూ ఇక జైలులో ఉండటమే సరైన శిక్ష అని చెప్పింది. హ్యూస్టన్‌కు చెందిన డోనాల్డ్ మిడిల్టన్ అనే 56 ఏళ్ల వ్యక్తి 1980 నుంచి ఇప్పటి వరకు పీకలదాకా మద్యం తాగి వాహనం నడుపుతూ తొమ్మిదిసార్లు పోలీసుల చేతికి చిక్కాడు. గత 2015 మే నెలలో కూడా ఫుల్లుగా తాగి ఓ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. అనంతరం పారిపోయి ఓ దుకాణంలో దాక్కొని పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలకు అతడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టుకు తరలించారు. ఈ ఒక్కసారి తనను క్షమించాలని అతడు వేడుకున్నప్పటికీ కోర్టు నిరాకరించింది. జీవిత కారాగార శిక్ష విధించింది. అంతకుముందే తాగి వాహనం నడిపిన కేసులోనే నాలుగుసార్లు అతడు జైలు శిక్ష అనుభవించాడు. -
బాబోయ్.. బాతు!
అమెరికాలోని హూస్టన్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ‘సమ్మర్’పై ఓ తల్లిబాతు దాడి చేస్తున్న చిత్రాలు... భీతిల్లిన సమ్మర్ పరుగెడుతూ కిందపడిపోయిన దృశ్యాలు గతవారం ట్విటర్లో హల్చల్ చేశాయి. ఓ చిన్నారి అంత భయపడిపోతే... చూసి ఆనందిస్తారా? అంటూ ముఖం చిట్లించకండి. ఆమెకు ఏమీ కాలేదు. పైగా ఈ ఫోటోలను పోస్ట్ చేసింది స్వయంగా ఆమె సోదరి స్టీవీ గిడెన్. ఓ రోజు సాయంత్రం స్టీవీ, సమ్మర్లు వ్యాహ్యళికి వెళ్లినపుడు రోడ్డు పక్కన చిన్న బాతు పిల్లలు కనిపించాయట. ముద్దొస్తుండటంతో చూద్దామని కాసింత దగ్గరగా వెళ్లారంతే. తల్లిబాతుకు కోపం వచ్చి సమ్మర్‌పై ఇలా ప్రతాపం చూపింది. చిన్నారి సమ్మర్ కాసేపు హడలిపోయినా... గాయాలేమీ లేకుండా క్షేమంగా బయటపడింది. -
నడిరోడ్డుపై నగ్నంగా డాన్స్.. గంటసేపు హల్ చల్!
ఓ మహిళ చేసిన నిర్వాకంతో హైవే మొత్తం ఓ గంటపాటు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంది. ఆమె చేష్టలతో అరవై నిమిషాలు ఆ మార్గాన్ని మూసివేయాల్సి వచ్చిందంటే ఆమె ఏ స్థాయిలో రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. టెక్సాస్ లోని హోస్టన్ లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అసలు విషయం ఇది... ఓ మహిళ తన కారులో హోస్టన్ ఏరియాలో హైవే 290పై వెళ్తోంది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, ఆమె కారుతో పాటు మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఆ వెంటనే ఆమె ఓ పెద్ద వాహనంపైకి ఎక్కింది. క్షణాల్లో నగ్నంగా మారిపోయింది. కొద్దిసేపు అలాగే డాన్స్ చేసింది. అనంతరం అలాగే కూర్చుండిపోయింది. తన శరీరాన్ని సాధ్యమైనంతవరకు చేతులు, కాళ్లతో కప్పి ఉంచే ప్రయత్నాలు చేస్తూ నానా తిప్పలు పడిందట. ఆమె డాన్స్ చేయడం ఆపిన వెంటనే కొందరు అధికారులు ఆమెను అతికష్టం మీద ఆ వాహనంపై నుంచి కిందగి దింపారు. అంతకుముందు గంటసేపు ప్రయత్నించిన ఆమె చేష్టలను ఆపలేకపోవడం గమనార్హం. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సుమారు ఉదయం 10గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని హోస్టన్ అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. అయితే గంటపాటు ఆ ప్రాంతంలో దారిని మూసివేయడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు వచ్చాయట. జెర్సీ ఏరియాలో అంతకుముందు కూడా ఆమె ఓ యాక్సిడెంట్ చేసిందని అనుమానాలు వ్యక్తం చేశారు. -
'అవమానించినందుకు రూ.100 కోట్లు ఇవ్వండి'
హ్యూస్టన్: తనను అరెస్టు చేసి అవమానించిన వారు దాదాపు రూ.వందకోట్లు (రూ.99,54,81,179.1)-(15 మిలియన్ డాలర్లు)) చెల్లించాలని, లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఎనిమిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ డిమాండ్ చేశాడు. అమెరికాలోని టెక్సాస్ లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలుడు సొంత తెలివి తేటలతో అలారం గడియారాన్ని తయారు చేసి స్కూల్ కి తీసుకురాగా దానిని బాంబు అనుకొని భ్రమపడి ఆ విద్యార్థిని అరెస్టు చేశారు. ఈ విషయం మీడియాకు తెలిసి ఆ విద్యార్థి ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యాడు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ ఆ బాలుడి తెలివి తేటలకు ముగ్దులై అతడిని కలిసేందుకు ఆహ్వానించారు కూడా. వైట్ హౌస్ ఇప్పటికే అతడిని సత్కరించింది. అయితే, ఖతార్ లోని ఓ ముస్లిం ఫౌండేషన్ ఆ విద్యార్థిని చదివించేందుకు ముందుకు రావడంతో అతడు త్వరలో అక్కడికి వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసిన ఇర్వింగ్ సిటీ పోలీసులు, మేయర్ క్షమాపణలు చెప్పాలని పది మిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా చెల్లించాలని, అలాగే, తనను తప్పుగా అర్థం చేసుకొని ఓ ముస్లిం విద్యార్థిపట్ల వివక్ష చూపించారని ఆరోపిస్తూ ఐదు మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించడంతో పాటు తనకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆ విద్యార్థి తరుపు న్యాయవాది సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించారు. -
సృజనాత్మకతకు సంకెళ్లు!
అమెరికాలో పాఠశాల విద్యార్థి అరెస్టు, విడుదల హూస్టన్: తన సృజనాత్మకతను మెచ్చుకుని మాస్టారు తన చేతిలో బహుమతి పెడతారనుకున్న ఓ విద్యార్థికి చేతులకు సంకెళ్లు వేసిన సంఘటన ఇది. అమెరికాలోని ఇర్వింగ్ నగరంలోని మాక్ఆర్థర్ హైస్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థి.. స్కూలు ప్రాజెక్టులో భాగంగా సొంతంగా డిజిటల్ గడియారాన్ని తయారుచేసి పాఠశాలకు తీసుకెళ్లాడు. ముస్లిం విద్యార్థి తెచ్చిన వాచీని ‘టైమ్ బాంబు’గా భావించిన మరో మాస్టారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. ఉగ్రదాడులంటేనే అమెరికా వణికిపోతున్న ఈ తరుణంలో.. స్కూల్లో ఉగ్రవాది ఉన్నాడని సమాచారం రావడంతో, రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని అరెస్టుచేసి బేడీలు వేసి తీసుకెళ్లారు. విద్యార్థిని మూడు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్కూలు యాజమాన్యం ప్రకటించింది. తర్వాత అసలు విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిని విడుదలచేశారు. విద్యార్థి అరెస్టు, సస్పెన్షన్ వార్తలతో సోషల్‌మీడియాలో అహ్మద్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విద్యార్థిని పొగుడుతూ ట్వీట్‌చేశారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, హిల్లరీ క్లింటన్ సహా ఎంతోమంది ప్రముఖులు అహ్మద్‌ను కొనియాడారు. -
వైద్యుడ్ని కాల్చి ఆపై యువకుడు ఆత్మహత్య
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఎల్ పెసో వీఏ హెల్త్ కేర్ సెంటర్లో ఓ వ్యక్తి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో వైద్యుడు మృతి చెందాడు. అనంతరం ఆ వ్యక్తి తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆసుపత్రి వాతావరణ భయానకంగా మారింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని... మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పిన్న వయసు... భిన్న స్వరం...
అదితీ అయ్యర్ 2004 ఆగస్టు 5న ఢిల్లీలో పుట్టింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు 18 నెలల పాపగా ఉన్నప్పుడే అదితి రాగాలు ఆలపించడం మొదలు పెట్టింది. నాలుగేళ్ళ వయసులోనే సెలిన్ డియోన్, ఎంజె డబ్ల్యూ హౌస్టన్ మొదలైన పాశ్చాత్య గాయకుల పాటలు విన్న అదితి వారి పాటలు నేర్చుకోవడంలో అత్యంత ఆసక్తిని చూపింది. వారినే ప్రేరణగా తీసుకుంది. ఆరేళ్ల వయసులోనే సంప్రదాయ, సమకాలీన పాశ్చాత్య సంగీతం తనకు తానే నేర్చుకోవడం ప్రారంభించి, అద్భుతమైన గాయనిగా ఎదిగింది. గుర్గావ్లోని ఎక్సెల్షియర్ అమెరికన్ స్కూల్ విద్యార్థిని అయిన అదితి ప్రతిభను ప్రముఖ గాయకుడు జ్యోత్స్నా రాణా గుర్తించారు. గుర్గావ్ ఆర్టెమిస్ ఆడిటోరియం వద్ద మహిళా దినోత్సవం రోజు జరిగిన సమావేశానికి అదితిని ఆహ్వానించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రఖ్యాత శాంతి హరినంద్ను వేదిక మీదకు ఆహ్వానిస్తూ ‘పవర్ ఆఫ్ లవ్’ అనే పాటను అదితి పాడింది. మరొకసారి అక్కడే రిషి నిత్యప్రజ్ఞ (ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ శిష్యుడు) కోసం స్వాగత గీతాన్ని ఆలపించింది. అదితి గౌరవనీయమైన, ప్రఖ్యాత వాయిస్ శిక్షకులు సీతూ సింగ్ బ్యూహ్లర్ దగ్గర ఒపేరా నేర్చుకుంది. ఆయన దగ్గర శిక్షణ పొందిన వారందరిలోకీ చిన్న వయసు విద్యార్థిని అదితి మాత్రమే. ఆమెకు ఒక అధికారిక యూ ట్యూబ్ ఛానల్ ఉంది. దాని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సంగీత నిపుణులు, గాయకుల నుండి అధిక ప్రశంసలు, సానుకూల వ్యాఖ్యలు, స్పందనలు అందాయి. ఆమె కేవలం 5 నెలల కాలంలో సుమారు 700 చందాదారులను, 1,20,000 వీక్షణలను పొందింది. ఎనిమిది సంవత్సరాల వయసులోనే మధురమైన, శక్తిమంతమైన గళాన్ని, అందులోనూ గొప్ప శ్వాస నియంత్రణ కలిగిన ఒక ఒపేరా గళాన్ని కలిగిన గాయకురాలిగా అదితి పేరు తెచ్చుకున్న తీరు నిజంగా ప్రశంసనీయమే. చిన్న వయసు వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకమే. -
విమానంలో ఓ ముద్దు... జైలు పాలు చేసింది !
న్యూయార్క్: ఆయన వయస్సు 62 ఏళ్లు... విమానంలో ప్రయాణిస్తూ... తన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టేశాడు. అక్కడితో ఆగకుండా... ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి తోటి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన అమెరికాలో హ్యూస్టన్ నుంచి నెవార్క్‌కు యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో వెళ్తుండగా చోటు చేసుకుంది. నిందితుడి ఎన్నారై దేవేందర్ సింగ్‌గా గుర్తించామని... అతడి స్వస్థలం ల్యూసియానా అని చెప్పారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దేవేందర్ సింగ్‌కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 250,000 అమెరికన్ డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. నిందితుడు దేవేందర్ సింగ్‌ను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఉలిక్కిపడిన అమెరికా
హ్యూస్టన్: అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి కన్నబిడ్డలనే కడతేర్చాడు. మొత్తం ఆరుగురుని హత్య చేశాడు. ఇంట్లోనే ఉన్న తన నలుగురు చిన్న పిల్లలతోపాటు మరో ఇద్దరిని తుపాకీతో కాల్చి చంపాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఉత్తర హ్యూస్టన్ నగరం శివార్లలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. హత్యకు గురైనవారిలో 4, 14 సంవత్సరాల ఇద్దరు బాలురు, 7,9 సంవత్సరాల ఇద్దరు బాలికలు, 33 ఏళ్ల మహిళ, 39 ఏళ్ల మరో వ్యక్తి ఉన్నారు. ఉన్మాది కాల్పులలో తీవ్రంగా గాయపడిన వారు సమాచారం తెలియజేయడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతమందిని హత్య చేసిన తరువాత అతను పోలీసులకు మూడు గంటలపాటు ముప్పుతిప్పలుపెట్టాడు. చివరకు అతనే లొంగిపోయాడు. అయితే హంతకుడి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించలేదు. భార్యాభర్తల మధ్య గొడవే ఇంతమంది హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. -
సెమీస్‌లో దీపిక
టెక్సాస్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ హౌస్టన్ (అమెరికా): భారత నెంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం నికోలెట్ ఫెర్నాండెజ్ (గయానా)తో హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 11-4, 11-6, 10-12, 10-12, 11-5 తేడాతో గెలుపొందింది. ప్రపంచ 12వ ర్యాంకర్ దీపిక ఇక సెమీస్‌లో ఎనిమిదో ర్యాంకర్ మెడలిన్ పెర్రీ (ఐర్లాండ్)తో తలపడనుంది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో మెడలిన్ పెర్రీ 11-7, 9-11, 11-6, 11-8 తేడాతో ఎమ్మా బెడ్డోస్ (ఇంగ్లండ్)పై గెలుపొందగా, ఈజిప్టు అన్‌సీడెడ్ క్రీడాకారిణి నౌర్ ఎల్ షెర్బిని చేతిలో టాప్‌సీడ్ లో వీ వర్న్ (మలేసియా) 3-11, 8-11, 12-10, 6-11 తేడాతో కంగుతింది. -
భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు రూ.5.40 కోట్లు
హూస్టన్: మెదడుపై కీలక పరిశోధన చేస్తున్న భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఖలీల్ రెజాక్కు ‘నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్ఎఫ్సీ)’ భారీ మొత్తంలో రూ 5.40 కోట్ల(8.66 డాలర్లు) గ్రాంటును ప్రకటించింది. రోజువారీ జీవితంలో శబ్దాలను మెదడు ఎలా విశ్లేషిస్తుంది? అన్న కోణంలో తదుపరి పరిశోధన నిర్వహించేందుకుగాను ‘ఫేకల్టీ ఎర్లీ కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ కింద ఖలీల్‌కు ఈ మొత్తం గ్రాంటు లభించింది. ఈ నిధులను దశలవారీగా ఐదేళ్లలో ఎన్ఎఫ్సీ అందించనుంది. ఖలీల్ పరిశోధనలు ఓ కొలిక్కి వస్తే గనక... వయసు రీత్యా వచ్చే వినికిడి సమస్యలకు కొత్త చికిత్సలు కనుగొనేందుకు మార్గం సుగమం కానుంది. -
యూఎస్‌లో కాల్పులు: ముగ్గురు మృతి
అమెరికాలోని హ్యూస్టస్ నగరంలో అపరిచితుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. ఆ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారని, అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అపరిచితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ... నిన్న సాయంత్రం 5.00 గంటల ప్రాంతంలో హ్యూస్టన్‌లోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోకి అపరిచితుడు ప్రవేశించి, పలువురి వ్యక్తుల తలలపై గురి పెట్టి తుపాకితో కాల్చాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆ ఘటనతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారని పోలీసులకు వివరించారు. -
పుట్టినరోజు వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి
హూస్టన్: అగ్రరాజ్యం అమెరికా కాల్పుల సంస్కృతి కొనసాగుతోంది. తాజాగా హూస్టన్‌లో ఓ పుట్టినరోజు వేడుకలో దుండగులు జరిపిన మహిళ సహా ఇద్దరు మృతి చెందారు. 22 మంది గాయపడ్డారు. సిప్రస్ ప్రాంతంలోని క్రీక్ డ్రైవ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపినట్టు భావిస్తున్న ఇద్దరు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. కాల్పులు జరిగినప్పుడు పుట్టినరోజు వేడుకలో వందమందిపైగా యువతీ యువకులున్నారని అధికారులు తెలిపారు. పార్టీలో జరిగిన గొడవ కాల్పులకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు కాల్పులకు దిగడంతో అక్కడున్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. కొంత మంది రెండో అంతస్థు నుంచి అద్దాలు పగులగొట్టుకుని కింద దూకేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.