న్యూయార్క్: హ్యూస్టన్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ కశ్మీరీ పండిట్లతో భేటీ అయిన సందర్భంగా ఓ ఆత్మీయ ఘటన చోటుచేసుకుంది. ఒక కశ్మీరీ పండిట్ ప్రధాని మోదీ చేతిని ముద్దాడారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో.. 7 లక్షలమంది కశ్మీరీ పండిట్ల తరపున మీకు ధన్యవాదాలని ఆయన మోదీకి చెప్పారు. మోదీ మాట్లాడుతూ.. మీరు ఎంతగా బాధపడ్డారో నాకు తెలుసు... అంతా కలిసి నవ కశ్మీరాన్ని నిర్మిద్దామని పేర్కొన్నారు. పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు చాటిచెప్పారు. హ్యూస్టన్లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన చిన్న సంఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది. ఎయిర్‌పోర్ట్‌లో అమెరికా ప్రతినిధి ఒకరు ప్రధాని మోదీకి పుష్పగుచ్చం అందించగా.. అందులోంచి కొన్ని పూలు కిందపడిపోయాయి. అందరిని ఆశ్చర్యపరుస్తూ మోదీ కిందికి వంగి స్వయంగా ఆ పూలను తీసి సిబ్బందికి అందించారు.
ప్రత్యేక అతిథి జాతీయ గీతాలాపన..
హ్యూస్టన్‌లో ఎన్నారైలు నిర్వహిస్తున్న హౌడీ మోదీ కార్యక్రమంలో ప్రత్యేక అతిథి జాతీయ గీతాలాపన చేయనున్నారు. ఆయనే న్యూజెర్సీకి చెందిన 16 ఏళ్ల స్పర్శ్ షాహ్. తను పుట్టుకతోనే స్పర్శ్ ఆస్టియోజెన్సిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ అరుదైన వ్యాధి కారణంగా స్పర్శ్ నడవలేడు. అయినా మెండైన ఆత్మవిశ్వాసం అతని సొంతం. సింగర్, రచయిత, మోటివేషనల్ స్పీకర్‌గా పేరుపొందారు. హౌడీ మోడీలో జనగణమన పాడేందుకు న్యూజెర్సీ నుంచి హ్యూస్టన్ వచ్చాడు స్పర్శ్.
Comments
Please login to add a commentAdd a comment