
హార్వీ ఎఫెక్ట్: భారత విద్యార్థి మృతి
హోస్టన్: అమెరికాలోని హూస్టన్ వరదల్లో భారత విద్యార్థి మరణించాడు. హార్వీ తుపాను ధాటికి బ్రేన్ సరస్సులో చిక్కుకుపోయిన టెక్సాస్ ఏఅండ్‌ఎం వర్సిటీ విద్యార్థి నిఖిల్ భాటియా, మరో భారత విద్యార్థిని షాలినీ సింగ్‌ను అధికారులు రక్షించారు. అయితే తీవ్రగాయాలతో భాటియా మరణించగా, షాలిని పరిస్థితి ఇంకా విషమంగా ఉందని కాన్సులేట్ అధికారులు వెల్లడించారు.
బాధిత కుటుంబ సభ్యులకు తాము ఎప్పటికప్పుడు వారి సమాచారం చేరవేస్తున్నామని అధికారులు చెప్పారు.జైపూర్‌కు చెందిన భాటియా, ఢిల్లీకి చెందిన అతని ఫ్రెండ్ షాలినీ పబ్లిక హెల్త్‌లో మాస్టర్స్ చేస్తున్నారు. వరద బీభత్సంలో వారు సరస్సుకు ఎందుకు వెళ్లారన్నది తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.