Indian student
-
విదేశీ చదువుల క్రేజ్
-
US: అమ్మాయి అనుకుని చాటింగ్.. భారత విద్యార్థికి 12 ఏళ్ల జైలు
న్యూయార్క్: ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి బుద్ధి వక్రీకరించి 12 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు ఓ భారత విద్యార్థి. స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లిన ఉపేంద్ర ఆడూరు(32) భారత విద్యార్థి సోషల్ మీడియాలో 13 ఏళ్ల బాలిక అనుకుని ఓ వ్యక్తితో చాటింగ్ మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు మభ్యపెట్టే విధంగా సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాకు అశ్లీల చిత్రాల మెసేజ్‌లు కూడా పెట్టాడు. ఏకంగా ఓ రోజు టైమ్ ఫిక్స్ చేసుకుని ఆ బాలికను కలవడానికి వెళ్లాడు. ఇక్కడే అతడికి ఎదురైంది పెద్ద ట్విస్టు. ఉపేంద్ర అనుకున్నట్లు ఆ ఖాతా 13 ఏళ్ల బాలికది కాదు.మైనర్ల మీద లైంగికనేరాలకు పాల్పడే వారిని వలపన్ని పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ క్రియేట్ చేసిన నకిలీ ఖాతా. ఉపేంద్ర బాలికను కలిసేందుకు మీటింగ్ స్పాట్‌కు వెళ్లగానే పోలీసులు పట్టుకున్నారు. అతడి ఫోన్ లాక్కుని అందులోని అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా 2022 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6 మధ్యలో జరిగింది. ఈ కేసులో ఉపేంద్రకు 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు రిలీజ్ అయిన తర్వాత మరో 10 ఏళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు తీర్పిచ్చింది. -
ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు
యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) జూన్ 10 నుంచి 14 వరకు కాలిఫోర్నియాలో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గోవాలోని బిట్స్ పిలానీ కేకే బిర్లా కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవను కుక్ కలిశారు.టిమ్ కుక్.. భారతీయ విద్యార్థి, డెవలపర్ అయిన అక్షత్ శ్రీవాస్తవతో జరిపిన పరస్పర చర్యను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్'లో గెలిచిన విద్యార్థి డెవలపర్లతో మాట్లాడాను. వారి క్రియేటివిటీ, ప్రదర్శనను చూడటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.నేను గత సంవత్సరం భారతదేశాన్ని సందర్శించినప్పుడు చాలా మంది గొప్ప డెవలపర్లను కలిశాను. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అనేక మార్గాలు వారిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ వారం అక్షత్‌ని కలవడం కూడా అంతే ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్లాసిక్ గేమ్‌ల పట్ల తనకున్న ప్రేమను తరువాత తరంతో పంచుకోవడానికి సరికొత్త మార్గాన్ని సృష్టించారు అని వెల్లడించారు.శ్రీవాస్తవ యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో భాగంగా మైండ్‌బడ్ అనే యాప్‌ను సమర్పించారు. ఇది తన మేనల్లుడితో పంచుకున్న ఉల్లాసభరితమైన క్షణాల నుంచి ప్రేరణ పొంది, ఈ యాప్‌ను రూపొందించినట్లు సమాచారం. మైండ్‌బడ్ పిల్లలు తమ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఆనందించడానికి రూపొందించిన నాలుగు ఆకర్షణీయమైన చిన్న గేమ్‌లను కలిగి ఉంది.శ్రీవాస్తవ మైండ్‌బడ్‌ని సృష్టించడానికి స్విఫ్ట్‌యుఐ, ఎవికిట్ (ఆడియో), పెన్సిల్‌కిట్, ఫైల్‌మేనేజర్‌లను ఉపయోగించారు. కొత్త టెక్నాలజీలు అనుగుణంగా దీనిని రూపొందించారు.అక్షత్ శ్రీవాస్తవ కోవిడ్ సంక్షోభ సమయంలో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోని సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పడకలను ట్రాక్ చేయడానికి ఒక యాప్‌ను అభివృద్ధి చేశారు. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీల మీద ఆసక్తి కనపరిచిన శ్రీవాస్తవ యాపిల్ పార్క్‌లో జరిగే కార్యక్రమానికి 50 మంది విద్యార్థులలో ఒకరుగా వెళ్లారు.Kicking off #WWDC24 in the best way possible—meeting with student developers who won our Swift Student Challenge. It’s amazing to see their creativity and determination on full display! pic.twitter.com/b56k8kcGZs— Tim Cook (@tim_cook) June 9, 2024 -
అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
అమెరికాలో వరుస హత్యలు, రోడ్డు ప్రమాదాలు, అదృశ్యం, అనూహ్యమరణాలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో అదృశ్యం కావడం ఆందోళన రేపింది. ఎన్నో కలలతో ఉన్నత చదువులకోసం అమెరికా పయనం కాబోతున్న భారతీయ యువతకు, అందులోనూ తెలుగు విద్యార్థులకు, తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.హైదరాబాద్‌కు చెందిన కందుల నితిషా (23) మే 28 నుంచి కనిపించకుండా పోయింది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలోని శాన్ బెర్నార్డినోకు చెందిన విద్యార్థిని నితిషా కనిపించడం లేదన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కందుల నితిషా కాలిఫోర్నియాలోని లాసె ఏంజెల్స్ నుంచి కనిపించ కుండా పోయిందని, ఆమె ఆచూకీ లభిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటించారు. కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్‌తో 2021 టయోటా కరోలాకారులో వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని CSUSB చీఫ్ ఆఫ్ పోలీస్ జాన్ గుట్టీరెజ్ ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటన జారీ చేశారు.ఆచూకీ తెలిసినవారు (909) 537-5165 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. కాగా ఇటీవల క్లీవ్ ల్యాండ్ నగరంలో అదృశ్యమైన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ (25) తర్వాత శవమై కనిపించాడు. అలాగే చికాగోలో తెలంగాణకు చెందిన విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం లాంటి అనేక ఘటనలు అమెరికాలో మన విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. -
అమెరికాలో మరో విషాదం, తెలుగు విద్యార్థి దుర్మరణం
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థులు వరుస మరణాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బెలెం అచ్యుత్ (సన్నీ) బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.న్యూయార్క్‌లోని ‘స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్’లో చదువుతున్న అచ్చుత్ బైక్‌పై వెళ్తుండగా మరో వాహనం వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.Saddened to learn about the untimely demise of Shri Belem Atchyuth, a student at SUNY who met with a bike accident and passed away yesterday evening; our deepest condolences to the family; @IndiainNewYork is in touch with the bereaved family & local agencies to extend all…— India in New York (@IndiainNewYork) May 23, 2024 అచ్యుత్ మృతి పట్ల అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. అతని మృతదేహాన్నిభారతదేశానికి తిరిగి పంపడం లాంటి ఇతర సహాయాన్ని అందించడానికి వారి కుటుంబ సభ్యులు, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ వెల్లడించింది. కాగా అమెరికాలో 2024లోనే పదకొండు మందికి పైగా విద్యార్థులు మరణించారు . అనేక మంది తీవ్ర దాడులను ఎదుర్కొన్నారు. ఇటీవల జార్జియాలోని అల్ఫారెట్టా నగరంలో జరిగిన ఘోరురోడ్డు కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ సంతతి విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. -
కెనడాలో కాల్పులు
ఒట్టావా: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాల ఘటనలు ఆగట్లేవు. తాజాగా కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్ ప్రాణాలు కోల్పోయారు. వాంకోవర్ సిటీ పరిధిలో 12వ తేన రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వాంకోవర్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం హరియాణాలోని సోనిపట్ నుంచి చిరాగ్ కెనడాకు వచ్చారు. విద్యార్థి వీసా మీద కెనడాకు వచ్చి ఎంబీఏ చేసి ఇక్కడే తాత్కాలిక ఉద్యోగంలో చేరారు. ఏప్రిల్ 12వ తేదీన చిరాగ్ తన కారులో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి చిరాగ్ తన కారులో విగతజీవిగా పడి ఉన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్ట్‌చేయలేదు. చిరాగ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు భారత సర్కార్ సాయపడాలంటూ చిరాగ్ కుటుంబం ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తిచేసింది. -
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి కిడ్నాప్.. విషాదం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ అరాఫత్.. విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడ్ని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని, కాపాడాలంటూ అతని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అరాఫత్‌ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాదీ విద్యార్థి మృతిని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సెర్చ్ ఆపరేషన్ ద్వారా తీవ్రంగా యత్నించారని.. కనిపించకుండా పోయిన మూడు వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అబ్దుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది. Anguished to learn that Mr. Mohammed Abdul Arfath, for whom search operation was underway, was found dead in Cleveland, Ohio. Our deepest condolences to Mr Mohammed Arfath’s family. @IndiainNewYork is in touch with local agencies to ensure thorough investigation into Mr… https://t.co/FRRrR8ZXZ8 — India in New York (@IndiainNewYork) April 9, 2024 ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని, విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. అదే చివరిసారి.. నాచారంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన మహ్మద్ సలీమ్ కుమారుడు అబ్దుల్ మహ్మద్ అరాఫత్(25) 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం ఫోన్లో మాట్లాడే అతను చివరిసారి మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి స్పందనలేదు. ఆ మరుసటిరోజునే అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దీనిని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మార్చి 9వ తేదీన ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీమ్ బంధువులు క్లీవ్‌లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ అరాఫత్ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్‌లాండ్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. చివరకు.. మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ సహాయం కోరిన బాధిత కుటుంబం తండ్రికి వాట్సాప్ కాల్ ఆ వెంటనే.. మార్చి 19వ తేదీన అబ్దుల్ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అబ్దుల్‌ను తాము కిడ్నాప్ చేశామని.. 1200 అమెరికా డాలర్లు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే డబ్బులిచ్చేందుకు అంగీకరించిన సలీం.. అబ్దుల్ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగారు. దీనికి ఆగ్రహించిన కిడ్నాపర్లు ఫోన్ పెట్టేడయంతో సలీం ఆందోళన చెందారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనూ తమ కుమారుడిని రక్షించాలంటూ మీడియా సాక్షిగా అధికారులు కోరారాయన. అయితే.. చివరకు ఆ తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. Telangana | A resident of Hyderabad's Nacharam Mohammed Abdul Arfath, who went to the United States to pursue his master's degree has gone missing from his residence in the USA after March 7. Abdul's father, Mohammed Saleem said "My son went to USA on May 23 to pursue a… pic.twitter.com/1iSxywKgyv — ANI (@ANI) March 21, 2024 ఇదిలా ఉంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన విద్యార్థులే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. -
'అమెరికాలో ఇలా చెయ్యొద్దు'!.. భారతీయ విద్యార్థులకు ఇంద్రానూయి సూచనలు!
అమెరికాలో వెలుగు చూసిన భారత సంతతి విద్యార్థుల ఘటనలపై పెప్పికో మాజీ సీఈవో ఇంద్రానూయి స్పదించారు. ఈ ఘటనలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దయచేసి యూఎస్‌కి వచ్చే భారతీయ విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే కార్యకలాపాల జోలికి వెళ్లొద్దని సూచిస్తూ పది నిమిషాల నిడివిగల వీడియోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఇంద్రనూయి.."అక్కడ దురదృష్టకర పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులకు సంబంధించిన వార్తల గురించి విన్నాను. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియోని రికార్డు చేశాను. అమెరికాలో సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలనేది తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ చట్ట పరిధికి లోబడి ఉండండి. రాత్రిపూట ఒంటరిగా చీకటి ప్రదేశాల్లోకి వెళ్లొద్దు. మాదకద్రవ్యాల జోలికి, అతిగా మద్యపానం సేవించడం వంటివి అస్సలు చెయ్యొద్దు. ఇవన్నీ మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టెవే. ముఖ్యంగా ఇక్కడకు వచ్చే విద్యార్థులు తగిన యూనివర్సిటీని, కోర్సును ఎంపిక చేసుకోండి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు యూఎస్‌కి రావడం చాలా మంచిది. ఇది గొప్ప సాంస్కృతిక మార్పు కూడా. పైగా వారు తమ కుటుంబాలు, బంధువులు, పర్యావరణ పరిస్థితులకు చాలా దూరంగా చదువు కోసం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అప్రమత్తతో వ్యవహరించాలి. అమెరికాలో దిగిన క్షణం నుంచే తగిన స్నేహితులను ఎంచుకోండి. కొత్తగా రావడంతో మీకు ఇక్కడి అలవాట్లు, జీవనశైలి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వీటి వ్యామోహంలో పడి చెడు స్నేహాల్లో చిక్కుకోవద్దు. కొంతమంది విద్యార్థులు సరదాగా మాదక ద్రవ్యాలకు ట్రై చేయాలని చూస్తున్నారు. ఇలాంటివి అస్సలు వద్దు ప్రాణంతకం, పైగా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అదీగాక ఇందులో చిక్కకుంటే మీ కెరీర్ నాశనం అవుతుంది. ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో అస్సలు పాల్గొనవద్దు. మీ చర్యల వల్ల జరిగే పరిణామలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామందికి ఈ ఆతిథ్య దేశం చట్టాలు, నిబంధనలు అస్సలు తెలియవు. అంతేగాదు మీ వీసా స్థితి, పార్ట్ టైం ఉద్యోగం విషయంలో దానికున్న చట్ట బద్ధత అర్థం చేసుకోవాలి. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించవద్దు. యూఎస్‌లో ఉన్నప్పుడూ విదేశీ విద్యార్థిగా హద్దుల్లోనే ఉండాలనే విషయం మరిచిపోవద్దు. అలాగే మీరు నివశించే ప్రాంతాల గురించి పూర్తిగి తెలుసకోవాలి. సమూహంగా లేదా స్నేహితులతోనే తప్పక వెళ్లండి." అని సూచించారు ఇంద్రానూయి. అలాగే ఇక్కడ విశ్వవిద్యాలయాలు, స్థానిక కమ్యూనిటీల గురించి అవగాహన ఉండాలన్నారు. ఇక్కడ ఉండే స్థానిక భారతీయ అమెరికన్లతోనూ, భారతీయ కాన్సులేట్తోనూ టచ్‌లో ఉండాలని చెప్పారు. సామాజిక మాధ్యమాలతో సహా వివిధ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా, ఇటీవలే అమెరికాలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహమ్మద్ సలీం పేర్కొనడం గమనార్హం. అలాగే అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు కూడా చెప్పారు. కొద్దివారాల క్రితం వివేక్ సైనీ అనే విద్యార్థి నిరాశ్రయుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఫిబ్రవరి నెలలో పర్డ్యూ యూనివర్శిటీకి చెందిన భారతీయ-అమెరికన్ సమీర్ కామత్ (23) అనే విద్యార్థి తలపై తానే తుపాకీతో కాల్చుకుని మరణించాడని అధికారులు తెలిపారు. ఇవేగాక మరి కొందరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పలు దిగ్బ్రాంతికర ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. For Indian students studying/planning to study in the United States of America 🇺🇸 : a very useful video message by Ms. @Indra_Noooyi, former Chairman & CEO of PepsiCo @DrSJaishankar @MEAIndia @EduMinOfIndia @binaysrikant76 @IndianEmbassyUS @CGI_Atlanta @cgihou… pic.twitter.com/EWTrdKd4tg — India in New York (@IndiainNewYork) March 22, 2024 (చదవండి: US: అమెరికాలో ఇంత భక్తి ఉందా?) -
అమెరికాలో హైదరాబాద్ యువకుడు కిడ్నాప్..$1200 లు డిమాండ్
-
ఎన్ఆర్ఐ అభిజిత్‌ది హత్యా? ఆత్మహత్యా? పోలీసుల ప్రకటన ఆంతర్యం ఏమిటి?
అమెరికాలో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన 20 ఏళ్ల భారతీయ విద్యార్థి పరుచూరి అభిజిత్‌ది హత్యకాదని అమెరికా పోలీసులు తేల్చారు. హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు తమ ప్రాథమిక విచారణలో హత్య అని అనుమానించేందుకు ఆధారాలేవీ లేవని చెప్పినట్లు న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు. అభిజిత్ అకాల మరణంపై విచారాన్ని వ్యక్తం చేసిన కాన్సులేట్, అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు అన్ని ఏర్పాటు చేశామని, ఈ విషయంలో స్థానిక అధికారులతో పాటు భారతీయ-అమెరికన్ కమ్యూనిటీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ ఎక్స్( ట్విటర్) పోస్ట్‌లో పేర్కొంది. దీంతో అభిజిత్ ఆత్మహత్య చేసుకున్నాడా?అనే అనుమానాలు తలెత్తెతున్నాయి. అదే నిజమైతే అభిజిత్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అసలు డెడ్ బాడీ అడవిలోకి ఎలా వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తమ తనయుడు అభిజిత్‌ను మార్చి 11న యూనివర్శిటీ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని కారులో అడవిలో వదిలివెళ్లారని ఆరోపించిన సంగతి తెలిసిందే. చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులు చాన్నాళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు అతని సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అదే రోజు గుర్తించడం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిజిత్ భౌతిక కాయానికి స్వస్థలం బుర్రిపాలెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఏడాది (2024) ప్రారంభం నుండి, అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు తొమ్మిది మంది మరణించడం విషాదం. Deeply saddened to learn about the unfortunate demise of Mr. Abhijeeth Paruchuru, an Indian student in Boston. Mr. Puruchuru’s parents, based in Connecticut 🇺🇸, are in direct touch with detectives. Initial investigations rule out foul play. @IndiainNewYork rendered… — India in New York (@IndiainNewYork) March 18, 2024 -
జాహ్నవి కేసు.. భారత్ కీలక ప్రకటన
సీటెల్: రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అధికారికి అక్కడి కోర్టు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లేనందున ఆ అధికారిపై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. అయితే జాహ్నవి కందుల కేసులో భారత్ కీలక ప్రకటన చేసింది. తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సీటెల్‌లోని భారత దౌత్య కార్యాలయం ధృవీకరించింది. ‘‘దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందుల కేసులో.. ఇటీవలె కింగ్ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. న్యాయం జరిగేంతవరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంటాం అని దౌత్య కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీటెల్ పోలీసులతో సహా స్థానిక అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తీర్పుపై సమీక్ష కోసం ఇప్పటికే సీటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేశామని పేర్కొంది. సీటెల్ పోలీస్ విచారణ ముగింపు కోసం ఎదురు చూస్తున్నామని, అప్పటిదాకా కేసు పురోగతిని పరిశీలిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. On the recently released investigation report of the King County Prosecution Attorney on the unfortunate death of Jaahnavi Kandula, Consulate has been in regular touch with the designated family representatives and will continue to extend all possible support in ensuring justice… — India In Seattle (@IndiainSeattle) February 23, 2024 ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో ఇంటికి వెళ్లబోతూ రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వేగానికి వంద అడుగుల ఎత్తులో ఎగిరిపడి తీవ్రంగా గాయపడి జాహ్నవి మృతి చెందింది. ఆ టైంలో వాహనం నడుపుతున్న కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. ఇంకోవైపు.. ఇదీ చదవండి: జాహ్నవికి అన్యాయం.. కేటీఆర్ ఆవేదన సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. ప్రమాదం గురించి పైఅధికారికి సమాచారం చేరవేస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె(జాహ్నవి) జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. పరిహారంగా కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. ఈ వ్యవహారం వీడియోతో సహా బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే తాను అవమానించేందుకు అలా మాట్లాడలేదంటూ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు ఆర్డరర్. అంతేకాదు.. జాహ్నవి మృతికి కారణమైన కెవిన్‌కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు కూడా. ఇక కెవిన్‌పై ఇప్పటికిప్పుడు క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు తప్పవు. -
మరో భారతీయ విద్యార్థి అమెరికాలో దుర్మరణం
న్యూయార్క్: ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెడుతున్న కొందరు భారతీయ విద్యార్థుల భవిత అర్ధంతరంగా ముగిసిపోతోంది. ఆ విషాదపర్వంలో మరో ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. భారతీయ మూలాలున్న విద్యార్థి సమీర్ కామత్ సోమవారం సాయంత్రం ఇండియానా రాష్ట్రంలో విగతజీవిగా కనిపించారు. 23 ఏళ్ల సమీర్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. క్రోవ్స్ గ్రో ప్రాంతంలోని స్థానిక నేచర్ ప్రిసర్వ్లో సమీర్ మృతదేహాన్ని కనుగొన్నట్లు వారెంట్ కౌంటీ అధికారి వెల్లడించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చాకే మరణానికి కారణాలపై అంచనాకు రాగలమన్నారు. హైదరాబాద్ విద్యార్థిపై దాడి అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజహర్ అలీ అనే విద్యారి్థపై దుండుగులు దాడికి పాల్పడ్డారు. అతను ఇండియానా వెస్లియాన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చదువుతూ షికాగోలో నివసిస్తున్నాడు. ఈ నెల 4న ఇంటి సమీపంలో ముగ్గురు దండగులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఇటీవల పలువురు భారత విద్యార్థులు అమెరికాలో హత్యకు గురవడం తెలిసిందే. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నెల రోజుల వ్యవధిలో అమెరికాలో చోటుచేసుకున్న నాలుగో ఘటన ఇది. ఓహియో రాష్ట్రం సిన్సినాటిలో లిండ్నెర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకుంటున్న శ్రేయస్ రెడ్డి బెనిగెరి అనే తెలుగు విద్యార్థి చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారని, అతడి మరణం వెనక ఎటువంటి కుట్ర లేదని భావిస్తున్నట్లు న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం గురువారం తెలిపింది. శ్రేయస్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, సాధ్యమైనంత మేర వారికి సాయం అందజేస్తామని పేర్కొంది. శ్రేయస్ రెడ్డి తండ్రి త్వరలోనే అమెరికా రానున్నారని తెలిపింది. -
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలోని సిన్సినాటిలో భారతీయ విద్యార్థి ఒకరు చనిపోయారు. అతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇండియానా రాష్ట్రంలోని పర్డూ యూనివర్సిటీలో చదువుకుంటున్న నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. ఇతడు మృతి చెందినట్లు పోలీసులు సోమవారం ధ్రువీకరించారు. వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన ఇది రెండోది కావడం గమనార్హం. మూడు రోజుల క్రితం ఎంబీఏ చదువుకుంటున్న వివేక్ సైనీ(25) అనే భారతీయ విద్యార్థిని జూలియన్ ఫాక్నర్ అనే డ్రగ్స్ బానిస సుత్తితో కొట్టి దారుణంగా పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. -
అమెరికాలో భారత విద్యార్థుల వరుస మరణాలు
అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మూడో విద్యార్థి మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా అమెరికాలోని సిన్సినాటిలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. ఆయన గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. వివేక్ సైనీ ఇటీవలే వివేక్ సైనీ(25 ) అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడై ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్‌నర్ అనే నిరాశ్రయునికి సైనీ సహాయం చేశాడు. అయినప్పటికీ సైనీని ఫాల్క్‌నర్ హత్య చేశాడు. నీల్ ఆచార్య ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం రోజుల క్రితం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య. కాగా గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆదిత్య అద్లాఖా గత ఏడాది నవంబర్‌లో ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని దారుణంగా హత్యకు గురయ్యాడు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు. ఇదీ చదవండి: Jordan Attack: అంతటి అమెరికా సైన్యమే పొరబడింది! ఫలితంగా ముగ్గురు మృతి -
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
అమెరికాలో భారతీయుల విద్యార్ధుల మరణాలు కలకలం రేపుతున్నాయి. జార్జియాలోని లిథోనియా నగరంలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్ సైనీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు సైనీ తలపై 50 సార్లు సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్ధి అమెరికాలో ప్రాణాలు విడిచాడు. ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్‌లో మాస్టర్స్చేస్తున్న ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే క్యాంపస్ నుంచి అదృశ్యమైన ఆచార్య మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. క్యాంపస్‌లోని మారిస్ జే జుకక్రో లాబొరేటరీస్ సమీపంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం వద్దనున్న ఐడీ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు. పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి క్రిస్ క్లిఫ్టన్ కూడా నీల్ ఆచార్య మరణాన్ని ధృవీకరించారు. అయితే నీల్ ఆచార్యను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు 10 రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు అమెరికాలో ప్రాణాలు విడవడం కలకలం రేపుతోంది. Our son Neel Acharya is missing since yesterday Jan 28( 12:30 AM EST) He is studying in Purdue University in the US. He was last seen by the Uber driver who dropped him off in Purdue university. We are looking for any info on him. Please help us if you know anything. pic.twitter.com/VWIS5uyJde — Goury Acharya (@AcharyaGoury) January 29, 2024 తల్లి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే.. తన కొడుకు ఆచూకీ కనుక్కోవాలని ఆదివారం నీల్ తల్లి గౌరీ ఆచార్య ఇన్‌స్టాగగ్రామ్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ కొడుకు జనవరి 28 నుంచి కనిపించడం లేదని, అతను యూఎస్‌లోని పర్డ్యూ యూనివర్సిటీలో చదవుతున్నట్లు తెలిపారు. తమ కుమారుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే చెప్పాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమయ్యారు. తాము పర్డ్యూ విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అనంతరం నీల్ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూయార్క్: అమెరికాలో భారతీయ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. డ్రగ్స్‌కు బానిసైన ఒకడు ఆయన్ను సుత్తితో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హరియాణాకు చెందిన వివేక్ సైనీ బీటెక్ పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవలే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీయే పూర్తి చేసిన అతడు..జార్జియా రాష్ట్రం లిథోనియా నగరంలో ఉంటూ ఓ స్టోర్‌లో పార్ట్–టైం క్లర్కుగా పనిచేస్తున్నాడు. అదే స్టోర్ వద్ద నిలువ నీడ లేని జులియన్ ఫాల్క్‌నర్ అనే డ్రగ్ అడిక్ట్ ఉంటున్నాడు. వివేక్ అతడికి రెండు రోజులుగా నీళ్లు, చిప్స్, కోక్ ఇస్తున్నాడు. చలి నుంచి కాపాడుకునేందుకు జాకెట్ సైతం అతడికి ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీన ఫాల్క్‌నర్ ఇంటికి వెళ్తున్న వివేక్‌కు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగకుంటే పోలీసులకు చెబుతా నంటూ హెచ్చరించాడు. అతడు లక్ష్యపెట్టక సుత్తితో వివేక్‌పై దాడికి దిగాడు. వివేక్ తలపై 50సార్లు సుత్తితో మోదాడు. సమాచారం అందుకుని పోలీసులు వచ్చే సరికి వివేక్ మృతదేహం వద్దే ఆ ఉన్మాది ఉండటం గమనార్హం. -
NRI: జాలి చూపడమే అతని తప్పైంది!
న్యూయార్క్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రయం లేని వ్యక్తిపై జాలి చూపించిన క్రమంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. సాయం చేశాడన్న కృతజ్ఞత మరిచిన ఆ వ్యక్తి.. భారతీయ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు. జార్జియాలో జనవరి 16న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లోని హర్యానాకు చెందిన 25 ఏళ్ల వివేక్ సైనీ రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవల ఎంబీఏ పట్టా కూడా పొందాడు. జార్జియాలోని ఓ స్టోర్‌లో పార్ట్ టైమ్ క్లర్క్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల తాను పనిచేస్తున్న స్టోర్ వద్ద అతనికి జూలియన్ ఫాల్కెనర్ అనే వ్యక్తి కన్పించాడు. అతడిని చూస్తే నిలువ నీడలేనట్టు కనిపించాడు. దీంతో చలించిపోయిన వివేక్ మానవత్వంతో అతన్ని చేరదీశాడు. రెండు రోజుల పాటు తినడానకి ఫుడ్ ఇస్తూ సాయం చేశాడు. ఇక.. అక్కడ చలి ఎక్కువగా ఉండటంతో వేసుకొనేందుకు తనవద్ద ఉన్న జాకెట్‌ను కూడా ఇచ్చాడు. రోజూలాగే జనవరి 16న కూడా జూలియన్ స్టోర్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే దుకాణం మూసేసి ఇంటికి వెళ్తున్న వివేక్.. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. వివేక్ మాటలను అతను పట్టించుకోలేదు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తానని అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన జూలియన్ తన వెంట ఉన్న సుత్తితో విచక్షణారహితంగా వివేక్ తలపై కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే వివేక్ మృతి చెందాడు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జూలియన్ మత్తుపదార్థాలకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివేక్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: మాల్దీవుల పర్యాటకం.. తగ్గిన భారత టూరిస్టులు -
ఇటలీలో భారతీయ విద్యార్థి మృతి
రాంచీ: ఇటలీలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ మరణించాడని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి రౌత్ తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రౌత్ ఎంబీఏ చదివేందుకు ఇటలీ వెళ్లాడు. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రౌత్ తల్లిదండ్రులు అతని వసతి గృహ యజమానిని సంప్రదించారు. విద్యార్థి మరొక ఇంటి వాష్‌రూమ్‌లో శవమై కనిపించాడని గుర్తించారు. అతని మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి జార్ఖండ్‌లోని సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను రౌత్ కుటుంబం సంప్రదించింది. ఈ సంఘటనపై వెస్ట్ సింగ్భమ్ డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్ మాట్లాడుతూ.. రామ్ రౌత్ మరణం గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు. అవసరమైన చర్యల కోసం హోం శాఖ, రాష్ట్ర మైగ్రేషన్ విభాగానికి తెలియజేసినట్లు చెప్పారు. ఈ కేసులో అన్ని పరిణామాలను తాను పర్యవేక్షిస్తున్నానని, బాధిత కుటుంబంతో కూడా టచ్‌లో ఉన్నానని మిట్టల్ తెలిపారు. ఇదీ చదవండి: ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం -
భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ విద్యార్థి నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు. అయితే ఆ యువతి జాడ తెలిపిన వారికి 10 వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 8.32 లక్షలు) ఇవ్వనున్నట్లు యూఎస్ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రకటించింది. వివరాలు.. 29 ఏళ్ల మయూషీ భగత్.. 2019, ఏప్రిల్ 29వ తేదీన జెర్సీ సిటీలోని తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయింది. తల్లిదండ్రులు ఫోన్ చేస్తేమో స్విచ్చాఫ్ వచ్చింది. ఆమె స్నేహితుల్ని సంప్రదించినా ఎలాంటి సమాచారం లభించలేదు.దీంతో కూతురు అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు మే 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మయూషీ ఇంటి నుంచి వెళ్లిన సమయంలో కలర్ పైజామా, బ్లాక్ టీ షర్ట్ ధరించింది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి మిస్సింగ్‌పై న్యూజెర్సీలోని ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీసు శాఖ ఆమె కోసం గత నాలుగేళ్లుగా కోసం వెతుకుతూనే ఉంది. పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినా.. ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే మయూషీ ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో తాజాగా ఎఫ్‌బీఐ ఓ ప్రకటన చేసింది. యువతి సమాచారం ఇచ్చిన వారికి పదివేల డాలర్ల రివార్డు ఇవ్వనున్నట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..! ఎవరీ మయూషీ భగత్ మయూషీ భగత్.. భారతీయ విద్యార్థి. 1994లో వడోదరాలో జన్మించింది. 2016లో ఎఫ్ 1 స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లిన ఆమె అక్కడ న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తోంది. మయూషి భగత్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుందని. గోధుమ రంగు కళ్ళు, నల్లటి జుట్టు కలిగి ఉంటుందని అధికారులు వివరాలు వెల్లడించారు. ఆమె 2016లో ఎఫ్1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చింది. FBI గత ఏడాది జూలైలో తన వెబ్‌సైట్‌లోని ‘మోస్ట్ వాంటెడ్’ పేజీలో మయూషీ ‘తప్పిపోయిన వ్యక్తుల’ పోస్టర్‌ను ప్రదర్శించింది. -
యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!
లండన్: గత వారం యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ సరస్సులో శవమై కనిపించాడు. డిసెంబర్ 14న అదృశ్యమైన గురష్మాన్ సింగ్ భాటియా(23 ) మృతదేహాన్ని కానరీ వార్ఫ్ సరస్సులో డైవర్లు బుధవారం గుర్తించారు. లాఫ్‌బరో యూనివర్శిటీకి చెందిన విద్యార్థి గురష్మాన్ సింగ్ భాటియా డిసెంబర్ 14న రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ క్రమంలో కానరీ వార్ఫ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చివరిసారిగా సౌత్ క్వే ప్రాంతంలోని సీసీటీవీలో డిసెంబర్ 15న కనిపించాడు. కానీ ఆ తర్వాత ఆయన జాడ తెలియలేదు. చివరగా బుధవారం కానరీ వార్ఫ్ ప్రాంతంలోని సరస్సులో డైవర్లకు గురష్మాన్ సింగ్ మృతదేహం కనిపించింది. గురష్మాన్ సింగ్ మరణవార్త సమాచారాన్ని పంజాబ్‌లోని ఆయన కుటుంబానికి అందించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేపడుతామని డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ జేమ్స్ కాన్వే చెప్పారు. గురష్మాన్ సింగ్ అదృశ్యంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పందించారు. గత నెలలో కూడా యూకేలో భారతీయ విద్యార్థి థేమ్స్ నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇదీ చదవండి: కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు? -
అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి
-
అమెరికాలో తెలుగు యువతి మృతి.. ఎవరీ జాహ్నవి కందుల?
సియాటెల్: గత జనవరిలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. జాహ్నవి కందుల అనే యువతి రోడ్డు దాటుతుండగా కెవిన్ డేవ్ అనే అధికారి 911 పోలీస్ వాహనాన్ని అతివేగంతో నడిపి ఆమెను ఢీకొట్టాడు. దీంతో ఆమె 100 అడుగులు ఎగిరి దూరంపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎవరీ జాహ్నవి కందుల? ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి జాహ్నవి (23) అమెరికాలో సియాటెల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. 2021లో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం మీద బెంగుళూరు నుంచి యూఎస్ వెళ్లింది. ఈ డిసెంబర్లో ఆమె మాస్టర్స్ పూర్తి కానుంది. ఇంతలోనే జాహ్నవి మరణ వార్త తెలియడంతో కందుల కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోంది. తన మనవరాలును దూరం చేసుకున్న భాధ నుంచి కోలుకోక ముందే పోలీసు ప్రవర్తన గురించి తెలియడం మరింత దిగ్బ్రాంతికి గురిచేస్తందని ఆమె తాత ఆవేదన వ్యక్తం చేశారు. విషాదకరమైన ప్రమాదం తర్వాత ఎవరైనా అలా ఎలా మాట్లాడగలరని వాపోయారు. చదవండి: జాహ్నవి మృతి: కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ లేఖ పోలీస్ వెకిలి నవ్వులు అయితే జాహ్నవి మృతి పట్ల అక్కడి పోలీస్ అధికారి చులకనగా మాట్లాడిన వీడియో తాజాగా బయటికి రావడంతో తీవ్ర దుమారానికి దారీతీసింది. జాహ్నవి మరణం విషయం తెలిసి దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసు అధికారి డానియెల్ అడరర్.. పైఅధికారికి వివరాలు చెప్తూ జాహ్నవి పట్ల వెకిలిగా మాట్లాడారు. గట్టిగా నవ్వుతూ ‘ఆమె చచ్చిపోయింది. ఆ ఓ మామూలు వ్యక్తేలే. ‘ఏముంది. ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు రాస్తే చాలు.. ఆమెకు 26 ఏళ్లు ఉంటాయేమో..విలువ తక్కువే..’ అని పగలబడి నవ్వుతూ మాట్లాడారు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డవ్వగా వీటిని సోమవారం సియాటెల్ పోలీసులు బయటకు విడుదల చేశారు. దీనిపై సియాటెల్ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని పేర్కొంది. సదరు పోలీసు అధికారి నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అదే విధంగా కారు బాడీకామ్ వీడియోపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆందోళన వ్యక్తం చేసింది. జాహ్నవి మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. అతివేగమే ప్రమాదానికి కారణం ప్రమాదం జరిగినప్పుడు కెవిన్ డేవ్ గంటకు 119 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ నివేదికలో తెలిపింది. వాహనం ఢీకొనడానికి అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. డేవ్ జాహ్నవిని ఢీకొట్టే నికి ఒక సెకను ముందు బ్రేకులు వేయడంతో ఆ వేగం ధాటికి ఆమె 100 అడుగుల ముందుకు ఎగిరిపడింది. వాస్తవానికి ప్రమాదం జరిగిన వీధిలో వేగ పరిమితి గంటకు 25 మైళ్లు లేదా గంటకు 40 కి.మీ మాత్రమే. అయితే జాహ్నవిని ఢీకొని ఆమె మరణానికి కారణమైన తోటి పోలీసు అధికారి కెవిన్‌ను కాపాడేందుకు డానియెల్ ప్రయత్నించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కెవిన్ కారును గంటకు 50 మైళ్ల వేగంతోనే నడుపుతున్నాడని, కారు అదుపు తప్పలేదని డానియల్ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నాడు. తప్పు జాహ్నవిదే అన్నట్టుగా చూపడానికి ప్రయత్నించాడు. -
పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి..
అమెరికాలోని సీటెల్‌లో 2023 జనవరిలో పోలీస్ వాహనం ఢీకొని తెలుగు యువతి కందుల జాహ్నవి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇది అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ యువతి కుటుంబంలో విషాదం నింపింది. తాజాగా ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో కీలకంగా మారింది. నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరిగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతున్న జాహ్నవి గత జనవరి 23న రోడ్డు దాటుతుండగా ఆమెను ఒక పోలీస్ వాహనం ఢీకొంది. ఆ సమయంలో పోలీసుల వాహనంలో సీటెల్ పోలీస్ విభాగానికి చెందిన కెవిన్ డేవ్ ఉన్నారు. కెవిన్ డేవ్ బాడీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను గమనిస్తే.. నాటి కారు స్పీడో మీటర్ గంటకు 74 మైళ్ల వేగాన్ని చూపుతోంది. అదే స్పీడ్‌లో వాహనం జాహ్నవిని థామస్ స్ట్రీట్ కూడలి వద్ద ఢీకొంది. ప్రమాదంలో గాయాలపాలైన ఆమెను వెంటనే స్థానికులు, పోలీసు అధికారులు హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో కెవిన్ ఓ ఎమర్జెన్సీ కాల్ మాట్లాడుతున్నట్లు సమాచారం. అందుకే అతను వాహనం సైరన్‌ను తగ్గించాడని తెలుస్తోంది. అయితే ఈ అత్యవసర పరిస్థితి గురించి ఆమెకు హెచ్చరించడంలో కెవిన్ విఫలమయ్యాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతంపై కెవిన్ మాట్లాడుతూ ఆ సమయంలో తాను సైరన్ మోగించానని, అప్పుడు జాహ్నవి క్రాస్ వాక్‌లో ఉందన్నారు. తమ కారును చూసి కూడా ఆమె క్రాస్ వాక్ గుండా వేగంగా పరిగెత్తిందని కెవిన్ తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన ఆరు నెలల తర్వాత బాడీ క్యామ్‌లో రికార్డ్ అయిన నాటి ఘటన దృశ్యాలు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లి సీటెల్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేరారు. గత జనవరి 23న ఆమె కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇది కూడా చదవండి: ఇన్ని చిరుకప్పలు ఎక్కడి నుంచి Body cam footage shows Kevin Dave hitting and killing Jaahnavi Kandula in a crosswalk at 8 p.m. on Jan. 23. Dave had chirped his siren, but did not have it running consistently, as he plowed into Kandula, a 23 Y/O master’s student at Northeastern University’s Seattle campus pic.twitter.com/IeTVuUA7cK — That Guy Shane (@ProfanityNewz) July 24, 2023 -
కెనడాలో హత్యకు గురైన భారతీయ విద్యార్థి
టొరంటో: కెనడాలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న భారతీయ విద్యార్థి ఒకరు దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని కరీంపూర్ చావ్లా గ్రామానికి చెందిన గుర్విందర్ నాథ్(24) టొరంటోలోని బ్రామ్టన్లో ఉంటూ బిజినెస్ స్కూల్లో చదువుకుంటున్నాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మిస్సిస్సౌగాలో ఈ నెల 9న అర్థరాత్రి దాటాక 2.10 గంటల సమయంలో నాథ్ ఒక ఇంట్లో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా కొందరు దుండగులు తీవ్రంగా కొట్టి అతడి దగ్గరున్న విలువైన వస్తువులతోపాటు, కారును తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన నాథ్‌ను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 14న నాథ్ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచాడు. దుండగులు అతడి కారును అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో వదిలేసి వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కారులో పలు ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. నాథ్, దుండగులకు మధ్య గతంలో ఎటువంటి పరిచయం లేదన్నారు. అతడి కారు ఎత్తుకెళ్లేందుకే దుండుగులు పిజ్జా డెలివరీ చేసినట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై టొరంటోలోని భారత్ కాన్సుల్ జనరల్ సిద్ధార్థ నాథ్ విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. ఈ నెల 27న నాథ్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2021 జులైలో కెనడా వెళ్లిన నాథ్ చివరి సెమిస్టర్లో ఉన్నాడని, చదువు పూర్తయ్యాక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నాడని అతడి స్నేహితులు తెలిపారు. ఆదివారం నాథ్ స్మత్యర్థం సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసౌగాలో కొవ్వొత్తులతో నివాళులరి్పంచారు.