ప్రతీకాత్మక చిత్రం
దుబాయ్: దుబాయ్‌లోని ఒక భారతీయ విద్యార్థి (16)కి కోవిడ్ -19 (కరోనా వైరస్) సోకినట్టు నిర్ధారణ అయింది. విదేశాలకు వెళ్ళిన విద్యార్థి తల్లిదండ్రుల నుంచి అతనికి ఇన్‌ఫెక్షన్ సోకిందని గల్ఫ్ న్యూస్ గురువారం దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్‌ఎ) ను ఉటంకిస్తూ పేర్కొంది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మొత్తం కరోనా బాధిత కేసుల సంఖ్య 27 కి చేరిందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
విదేశాలకు వెళ్లిన దుబాయ్‌కు తిరిగి వచ్చిన ఐదు రోజుల తరువాత బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కరోనా వైరస్ లక్షణాలతో బాధడ్డారు. దీంతో మొత్తం కుటుంబాన్ని క్వారంటైన్ చేసిన ఆరోగ్య అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో విద్యార్థికి పాజిటివ్ రాగా, మిగిలి కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా గురువారం నుంచి స్కూలు మూసివేస్తున్నట్టు ఇండియన్ హై గ్రూప్ ఆఫ్ స్కూ ప్రకటించింది. పాఠశాల విద్యార్థులు, సిబ్బందికి డిహెచ్‌ఎ అధికారులు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment