న్యూయార్క్: అమెరికాలో భారతీయ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. డ్రగ్స్‌కు బానిసైన ఒకడు ఆయన్ను సుత్తితో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హరియాణాకు చెందిన వివేక్ సైనీ బీటెక్ పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవలే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీయే పూర్తి చేసిన అతడు..జార్జియా రాష్ట్రం లిథోనియా నగరంలో ఉంటూ ఓ స్టోర్‌లో పార్ట్–టైం క్లర్కుగా పనిచేస్తున్నాడు. అదే స్టోర్ వద్ద నిలువ నీడ లేని జులియన్ ఫాల్క్‌నర్ అనే డ్రగ్ అడిక్ట్ ఉంటున్నాడు.
వివేక్ అతడికి రెండు రోజులుగా నీళ్లు, చిప్స్, కోక్ ఇస్తున్నాడు. చలి నుంచి కాపాడుకునేందుకు జాకెట్ సైతం అతడికి ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీన ఫాల్క్‌నర్ ఇంటికి వెళ్తున్న వివేక్‌కు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగకుంటే పోలీసులకు చెబుతా నంటూ హెచ్చరించాడు. అతడు లక్ష్యపెట్టక సుత్తితో వివేక్‌పై దాడికి దిగాడు. వివేక్ తలపై 50సార్లు సుత్తితో మోదాడు. సమాచారం అందుకుని పోలీసులు వచ్చే సరికి వివేక్ మృతదేహం వద్దే ఆ ఉన్మాది ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment