Hammer
-
ముంబైలో దారుణం.. రోడ్డుపై ప్రియురాలి హత్య
ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పెద్ద ఇనుప రెంచీతో దారుణంగా హత్య చేశాడు. అక్కడున్న వారు ఈ దారుణాన్ని చూస్తూ నిల్చుండిపోయారు. ఆపేందుకు ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబయికి చెందిన రోహిత్ యాదవ్ ఓ యువతితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఏవో కొన్ని కారణాల వల్ల వారి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. దీంతో యువతి రోహిత్‌ను దూరం పెట్టింది. ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందేమోనని రోహిత్ అనుమానం పెంచుకున్నాడు.అదే యువతి పాలిట శాపంగా మారింది. మంగళవారం(జూన్18) ఉదయం పనికి వెళుతున్న ఆమెను రోహిత్ వెంబడించాడు. ఇనుప రెంచీతో ఆమెపై దాడికి దిగాడు. తలపై బలంగా కొట్టడంతో ఆమె నేలకొరిగింది. అయినా సరే యువతిని విడిచిపెట్టకుండా పలుమార్లు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. -
అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూయార్క్: అమెరికాలో భారతీయ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. డ్రగ్స్‌కు బానిసైన ఒకడు ఆయన్ను సుత్తితో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హరియాణాకు చెందిన వివేక్ సైనీ బీటెక్ పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవలే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీయే పూర్తి చేసిన అతడు..జార్జియా రాష్ట్రం లిథోనియా నగరంలో ఉంటూ ఓ స్టోర్‌లో పార్ట్–టైం క్లర్కుగా పనిచేస్తున్నాడు. అదే స్టోర్ వద్ద నిలువ నీడ లేని జులియన్ ఫాల్క్‌నర్ అనే డ్రగ్ అడిక్ట్ ఉంటున్నాడు. వివేక్ అతడికి రెండు రోజులుగా నీళ్లు, చిప్స్, కోక్ ఇస్తున్నాడు. చలి నుంచి కాపాడుకునేందుకు జాకెట్ సైతం అతడికి ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీన ఫాల్క్‌నర్ ఇంటికి వెళ్తున్న వివేక్‌కు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగకుంటే పోలీసులకు చెబుతా నంటూ హెచ్చరించాడు. అతడు లక్ష్యపెట్టక సుత్తితో వివేక్‌పై దాడికి దిగాడు. వివేక్ తలపై 50సార్లు సుత్తితో మోదాడు. సమాచారం అందుకుని పోలీసులు వచ్చే సరికి వివేక్ మృతదేహం వద్దే ఆ ఉన్మాది ఉండటం గమనార్హం. -
ఘోరం: అత్తను సుత్తితో కొట్టి..పది ముక్కలుగా చేశాడు
సాక్షి, జైపూర్: యావత్తు దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం మరువక మునుపే అచ్చం అలాంటి తీరులోనే మరో ఘటన కలకలం రేపింది. ఒక వ్యక్తి ఈవెంట్‌కి వెళ్లొద్దని అడ్డు చెప్పిందన్న కోపంతో అత్తను సుత్తితో కొట్టి చంపి ముక్కలుగా చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...32 ఏళ్ల అనూజ్ శర్మ అనే యువకుడు జైపూర్‌లోని విద్యానగర్‌లో తండ్రి, చెల్లి, మేనత్తతో కలిసి ఉంటున్నాడు. ఆ యువకుడి తల్లి గతేడాది కరోనా సమయంలో మృతి చెందింది. అతడి చెల్లి, తండ్రి ఇండోర్‌లో వెళ్లడంతో ఈ నెల డిసెంబర్ 11 నుంచి అనుజ్ అతడి మేనత్త సరోజ్ ఇద్దరే జైపూర్‌లో ఉంటున్నారు. వాస్తవానికి అనూజ్ మేనత్త సరోజ్ భర్త చనిపోవడంతో ఆమె అతడి కుటుంబంతోనే కలిసి ఉంటోంది. ఐతే ఒకరోజు అనూజ్ ఢిల్లీలోని ఒక ఈవెంట్‌కి వెళ్లాలనుకున్నాడు. ఆ విషయమై అతడి మేనత్తకు ఆమెకు మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో అనూజ్ కోపంతో ఒక సుత్తి తీసుకుని మేనత్తను కొట్టి చంపేశాడు. ఆతర్వాత ఆమె మృతదేహాన్ని ఒక మార్బుల్ కట్టర్‌తో సుమారు 10 ముక్కలుగా కోసేశాడు. ఆ భాగాలను బకెట్, సూట్‌కేసులలో పెట్టుకుని జైపూర్-సికర్ హైవే సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అత్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు. అతడు కేసును తప్పుదోవ పట్టించేందుకు పలు రకాలుగా ప్రయత్నించాడు. ఐతే అతడి చర్యలను అనుమానించిన పోలీసులు నిందితుడి ఇంటికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా..అతడు మాత్రమే ఇంటి నుంచి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. పైగా అతడి ఫ్లాట్‌లోని కిచెన్‌లో రక్తపు మరకలను గుర్తించారు పోలీసలు. సదరు యువకుడు బీటెక్ వరకు చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీసీటీవీలో బకెట్లు, సూట్‌కేసులతో అనూజ్ బయటకు వెళ్లినట్లు సాక్ష్యాధారాలు కూడా ఉండటంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...) -
Viral Video: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది
ఒక్కోసారి మనం అనుకున్నట్లుగా జరగదు. ఎంత ప్రీ ప్లాన్‌గా ఉన్న ఊహించిన విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అచ్చం అలానే ఒక జంట ఫ్రాంక్ వీడియో కోసం చేస్తుండగా ఊహించని విధంగా ప్రమాదం ఎదురైంది. ఐతే కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ...భార్యలకు తెలియకుండా ఫ్రాంక్ చేసేందుకు యత్నిస్తాడు. అందులో భాగంగానే విచిత్రమైన వేషధారణలో ఒక గదిలో ఉంటాడు. ఇంతలో అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో దాడి చేస్తుంది. ఐతే అతను జస్ట్ తప్పుకుంటాడు కాబట్టి సరిపోతుంది లేదంటే అతడి తల కచ్చితంగా పగిలిపోయేది. అతడి భార్య చేసిన దాడికి అక్కడే ఉన్న అద్దం పగిలిపోతుంది. పాపం అతడి భార్య ఐమ్ సారీ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. View this post on Instagram A post shared by NowThis (@nowthisnews) (చదవండి: విలన్ రేంజ్లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని...) -
వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేశావా?!
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఓటమి ఖాయమనుకున్న దశలో కెప్టెన్ బాబర్ అజమ్ అసాధారణ పోరాటానికి తోడు.. మహ్మద్ రిజ్వాన్ మెరుపు సెంచరీ.. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 96 పరుగులతో రాణించడంతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ టెస్టు ఫలితంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్న వేళ.. వార్నర్ చేసిన ఒక పని సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బౌలర్‌కు సుగమమైన ల్యాండింగ్ కోసం ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ సుత్తితో మట్టిని తొలిగించిన సంగతి తెలిసిందే. కాసేపు గ్రౌండ్‌మెన్ అవతారం ఎత్తిన కమిన్స్ పనిని క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా ట్రోల్ చేశారు. తాజాగా వార్నర్ కూడా ఐదో రోజు ఆటలో పాకిస్తాన్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉన్నప్పుడు సుత్తిని తీసుకొచ్చాడు. పిచ్‌పై ఉన్న ఫుట్‌మార్క్స్‌ను తొలగించే పనిలో మట్టిని సరిచేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన పాక్ అభిమానులు..'' ఏంటి వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నావా'' అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. అయితే వార్నర్ వీడియోపై అతని భార్య కాండీస్ స్పందించింది. '' ఇలాంటి పనిని మన ఇంటి పరిసరాల్లో కాస్త ఎక్కువగా చేస్తావని ఆశిస్తున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఇక తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియడంతో కీలకమైన మూడో టెస్టు లాహోర్ వేదికగా సోమవారం(మార్చి 21 నుంచి) జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా ఫలితం వస్తుందా లేక మళ్లీ డ్రా ఫలితమే కనిపిస్తుందా అనేది చూడాలి. చదవండి: AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ I wish @davidwarner31 would do this a little bit more around the house!! 🤣🤣 https://t.co/hFhdFGqPTA — Candice Warner (@CandiceWarner31) March 17, 2022 The Thor hammer made another cameo today. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/6LpKTUo554 — Pakistan Cricket (@TheRealPCB) March 16, 2022 -
మగపిల్లాడు పుడతాడని తలలో మేకు దించుకున్న గర్భిణి!
రోజుకో సరికొత్త టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో పలుచోట్ల మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మతున్నారంటే ఆశ్చర్యంగా అనిపించకమానదు. పైగా ఈ మూఢనమ్మకాల మాయలో అత్యంత క్రూరమైన పనులకు ఒడిగడుతున్నారు. అంతేకాదు ఈ మూఢనమ్మకాల మాయలో తమ జీవితాలను బలి చేసుకున్నవాళ్లు ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ మగపిల్లాడి కోసం భూతవైద్యుడి మాయమాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అసలు విషయంలోకెళ్తే... పాకిస్తాన్‌లోని పెషావర్‌లో నివశిస్తున్న ఒక గర్భిణికి ముగ్గురు ఆడపిల్లలు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో భూతవైద్యుడిని సంప్రదించింది. అయితే ఆ భూతవైద్యుడి మగపిల్లాడు కావాలంటే తలలో మేకు దించుకోవాలని చెప్పాడు. దీంతో ఆ మహిళ మగపిల్లాడి మీద ఆశ కొద్దీ అంగీకరించింది. ఈ మేరకు ఆ భూత వైద్యుడు ఆమె తలపై ఒక సుత్తితో మేకుని దించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయ్యి నొప్పికి తాళలేక పోయింది. పైగా ఆ భూత వైద్యుడు మేకు తీయడానికి ప్రయత్నిస్తే అది తలలోనే ఇరుక్కుపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆస్పత్రిలోని వైద్యులు ఆపరేషన్ చేసి ఆ మేకును తీసేశారు. అంతేకాదు మగపిల్లాడు కోసం తాను ఈ చర్యకు పాల్పడ్డానని, భూతవైద్యుడే సుత్తితో మేకుని తలలోకి దించాడని వైద్యులకు ఆ బాధితురాలు తెలిపింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పెషావర్ పోలీసులు రంగంలోకిదిగి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. Special team has been made to bring to justice the fake Pir who played with the life of an innocent woman & put a nail in her head, with a false promise of a male child. The team will also investigate why incident was not reported to police by the treating doctor. — Abbas Ahsan (@AbbasAhsan) February 8, 2022 -
కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే..
భోపాల్: ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు కూడా. అయితే వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయి ఒకచోట వివాహం చేసుకున్నారు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. వారి పెళ్లిపై అమ్మాయి కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కోపాన్ని కప్పిపెట్టి ఆ కొత్తజంట వద్దకు వెళ్లారు. ఇంటికి పదండి.. మీకు ఘనంగా పెళ్లి చేస్తాం’ అని నమ్మబలికారు. తీరా ఇంటికిచ్చాక అమ్మాయిని ఇంట్లో బంధించేసి ఆ యువకుడిని రోడ్డుపైకి లాక్కొచ్చి సుత్తెతో విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ వైరల్ మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా మక్సీ నగరానికి చెందిన పుష్పక్ భావ్సర్ (22). అదే ప్రాంతంలోని ఓ యువతిని ప్రేమించాడు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి ఇద్దరూ పారిపోయారు. ఒకచోట పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసీ ఇరు కుటుంబసభ్యులు వారిని ఇంటికి పిలిచారు. అందరి సమక్షంలో మీకు ఘనంగా పెళ్లి చేస్తామని ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆదివారం ఉదయం పుష్పక్ కటింగ్ కోసం సెలూన్‌కు వెళ్లాడు. అప్పటికే తీవ్ర కోపంతో ఉన్న యువతి తండ్రి, సోదరుడు వెంటనే సెలూన్‌కు వచ్చి పుష్పక్‌ను బయటకు లాగారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి అక్కడే కనిపించిన సుత్తెతో పాటు ఇనుప రాడ్‌తో విచక్షణా రహితంగా తండ్రి, కుమారుడు దాడి చేశారు. కాళ్లపై సుత్తితో దారుణంగా కొడుతున్న వీడియోలు భయాందోళన రేపుతున్నాయి. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఆ వీడియో ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. -
థానేలో బాలికపై అత్యాచారం..!
థానే: 15 ఏళ్ల బాలికపై సుత్తితో దాడి చేసి, అత్యాచారంచేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఘటన జరిగిందని, ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో ఉన్నాడని పోలీసులు ఆదివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి షిర్డీ నుంచి తన మిత్రులు ఇద్దరితో కలసి బాధిత బాలిక ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యంలో ఉల్హాస్నగర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడు శ్రీకాంత్ గైక్వాడ్ (30) వారిని అడ్డగించాడు. బాలికపై సుత్తితో దాడి చేశాడు. తోడుగా ఉన్న మిత్రులను కూడా బెదిరించాడు. అనంతరం బాలికను రైల్వే స్టేషన్ పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తప్పించుకోవాలని చూడగా మళ్లీ సుత్తితో దాడి చేశాడు. అయితే శనివారం ఉదయం అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే కల్యాణ్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని శనివారం రాత్రి అరెస్టు చేశారు. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
రఫేల్‌కు తోడుగా హ్యామర్
న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఆర్మీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు వస్తున్న సమయంలోనే వాటి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి హ్యామర్ క్షిపణుల్ని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలుకు సంబంధించిన అధికారాలను అత్యవసర పరిస్థితుల కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ సాయుధ బలగాలకు కట్టబెట్టింది. ఈ క్షిపణులు గగనతలం నుంచి ఉపరితలానికి 60–70 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలవు. తూర్పు లద్దాఖ్ పర్వత శ్రేణుల నుంచి సరిహద్దుల్లో బంకర్లు, ఇతర శిబిరాలపై దాడులు చేసే అవకాశం హ్యామర్ క్షిపణి ద్వారా వీలు కలుగుతుంది. ‘హ్యామర్ క్షిపణులు కొనుగోలుకి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. అత్యంత స్వల్ప వ్యవధిలోనే రఫేల్ యుద్ధ విమానాలతో పాటు ఈ క్షిపణుల్ని సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించింది’’అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు అత్యవసరంగా ఈ క్షిపణులు అవసరం ఉండడంతో ఇప్పటికే మరొకరికి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్న క్షిపణుల్ని ఫ్రాన్స్ అధికారులు మన దేశానికి తరలిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న ఫ్రాన్స్ నుంచి అయిదు రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. ‘ప్రశాంతతే బంధాలకు పునాది’ చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట శాంతి, సంయమనం నెలకొనడంపైననే ప్రధానంగా ఆధారపడి ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ విషయంలో చైనా నిజాయితీతో వ్యవహరిస్తుందనే ఆశిస్తున్నామని పేర్కొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపునకు సంబంధించి రెండు దేశాల మధ్య మరో విడత దౌత్య చర్చలు త్వరలో ప్రారంభమవుతాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. ఎల్ఏసీ వెంట యథాపూర్వ స్థితిలో ఎలాంటి ఏకపక్ష మార్పులను భారత్ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా జులై 5న భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి దాదాపు 2 గంటల పాటు ఫోన్లో చర్చలు జరిపిన అనంతరం జూలై 6 నుంచి గల్వాన్ లోయలోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. -
ఆ వంతెన పరీక్ష ఫెయిలైతే..ప్రాణాలు గాల్లోనే!
-
పరీక్ష ఫెయిలై బద్ధలయిందో..
బీజింగ్ : గాజు వంతెనలు అనగానే టక్కున గుర్తొచ్చేది చైనా.. పెద్దపెద్ద గాజు పలకలతో కొండల అంచున వంతెనలు నిర్మించడంలో, స్కైవాక్స్ ఏర్పాటుచేయడంలో ఇప్పటికే ఆ దేశం గుర్తింపు పొందింది. దాదాపు మిలియన్ల కొద్ది డబ్బును వీటిని నిర్మించేందుకు చైనా ఉపయోగిస్తుంది. ఇటీవలె చైనాలోని హెక్కి నగరంలో అతి పొడవైన గాజు వంతెనను పూర్తి చేసిన చైనా ఫిబ్రవరిలో ప్రారంభించనుంది. అయితే, 600మీటర్ల ఎత్తున్న ఆ వంతెన ప్రారంభానికి ముందు కార్మికులు గాజు పలకలకు తుది పరీక్షలు పెట్టడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియోలు, ఛాయా చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో వారు పెద్ద పెద్ద సుత్తెలను, గాజును పగల కొట్టే వస్తువులను తీసుకొని తమ శక్తిమేరకు వాటిని బలంగా మోదుతున్నారు. బాగా సుత్తెతో కొట్టిన తర్వాత వాటిపై గెంతులు పెడుతూ ఎగిరి దూకుతూ వాటిని పరీక్షిస్తున్నారు. సాధారణంగా వీటిపై నడవడమే కొంత భయానకంగా అనిపిస్తుంటుంది. అలాంటిది అంత ఎత్తుమీద ఉన్న గాజు పలకలపై నిల్చొని వాటినే పగులకొట్టే ప్రయత్నం చేయడానికి ఎంత సాహసం చేయాలో కదా మరీ! -
గాలిమరల టవర్‌పై నుంచి పడి టెక్నీషియన్ మృతి
రామగిరి: గాలిమరల టవర్‌పై పని చేస్తుండగా పట్టు తప్పి టెక్నీషియన్ కిందపడటంతో మృతి చెందాడు. ఎస్ఐ రామారావు తెలిపిన మేరకు.. విన్సోల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కంపెనీ దుబ్బార్లపల్లి వద్ద గాలిమరల ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం గాలిమరల టవర్‌పైకి ఎక్కి పనిచేస్తున్న టెక్నీషియన్ సహారా యోగేష్ (20) పట్టు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడు మహారాష్ట్రలోని వార్తాడు జిల్లాకు చెందిన పొరగామ్ గ్రామానికి చెందినవాడని ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సుత్తితో మోది హత్య
కుటుంబ కలహాలతో భర్తను కడతేర్చిన భార్య బొల్లారం: కుటుంబ కలహాల నేపథ్యంలో సుత్తితో తలపై మోది భర్తను హత్య చేసిందో మహిళ. తిరుమలగిరి ఠాణా పరిధిలోని పెద్ద కమేళాలో గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్ద కమేళా నివాసి సత్యనారాయణ పెయింటర్. ఇతనికి భా ర్య సోనీ, పిల్లలు కీర్తన రాజు(11), నవ్యశ్రీ (8) ఉన్నారు. సోనీ ఇళ్లలో పని చేస్తోంది. భార్యాభర్తలు పలుసార్లు గొడవపడి పోలీసుస్టేషన్‌కు కూడా వెళ్లారు. సత్యనారాయణ గురువారం పనికి వెళ్లొచ్చి రాత్రి ఇంట్లో పడుకున్నాడు. గొడవల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సోనీ రాత్రి 11 గంటలకు గాఢ నిద్రలో ఉన్న భర్త తలపై సుత్తెతో దాదాపు 18 సార్లు విచక్షణారహితంగా కొట్టింది. తల బద్దలై తీవ్రరక్తస్రావం కావడంలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు కట్టుకథ:తర్వాత సోనీ 100 నెంబర్‌కు ఫోన్ చేసి తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పింది. వెం టనే తిరుమలగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రాజు, ఎస్ఐ శ్రీనునాయక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. భార్యను విచారించగా తాను బాత్రూమ్ లో ఉండగా నలుగురు దుండగులు వచ్చి.. తన నోరు మూసి తన భర్తపై సుత్తెతో దాడి చేసి చంపేశారని చెప్పింది. కుమారుడు కీర్తన రాజుతో కూడా అలాగే చెప్పించింది. అయితే, సోనీ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. దీంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హతుడి తమ్ముడు మల్లేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలు లేరని.. భార్య తలపై సుత్తితో మోది..
ముంబై: పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త తాను కట్టుకున్న భార్యను సుత్తితో కొట్టి చంపి, తాను ఉరేసుకుని చనిపోయిన దారుణ ఘటన ముంబై శివార్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేశ్ బీజ్ ముంబైలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ఇతనికి ప్రీతితో పెళ్లయింది. ఇంత కాలమైనా పిల్లలు లేరని భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం సాయంత్రం వీరి ఇంటికి వచ్చిన కొంతమంది బంధువులు తలుపులు మూసి ఉండటంతో తలుపు తట్టారు. ఎంతకూ తెరవకపోవడంతో తలుపులు తెరిచి లోపలి వెళ్లగా.. కిందపడి చనిపోయి ఉన్న ప్రీతిని చూసి షాకయ్యారు. ఆమె పక్కనే భర్త కూడా ఫ్యాన్ కు ఉరేసుకుని ఉండటం చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రీతి తలపై సుత్తితో బలంగా మోది, ఆమె చేతి నరాలు తెంచినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులకు చెప్పారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్షలో ఆమె తలపై సుత్తితో బలంగా మోదినట్లు రిపోర్టులు వచ్చాయని చెప్పారు. సురేశ్ ఉరేసుకుని చనిపోయినట్లు రిపోర్టుల్లో ఉందని తెలిపారు. రిపోర్టుల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
పదేళ్లుగా టచ్ చేయకుండా పోర్న్ చూశాడని..
లాంక్ షైర్: పోర్న్ వీడియోలు చూస్తున్నాడనే ఆగ్రహంతో తన వృద్ధ భర్తను ఓ వృద్ధురాలైన భార్య కొట్టి చంపింది. ఆమె స్వయంగా ఈ హత్యను చేసినట్లు అంగీకరించింది. లాంక్ షైర్లోని ఓస్వాల్డ్ విజిల్లో లిండా హోమ్స్(70), గోర్డాన్(78) అనే ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వీరికి వివాహం అయ్యి కూడా దాదాపు 50 ఏళ్లు దాటింది. ఆమె ఒకసారి బయటకు వెళ్లి తిరిగి రాగా అతడు ఇంట్లో అశ్లీల చిత్రాలు చూస్తూ కనిపించాడు. ఆమె అడిగితే తాను చూడలేదని బుకాయించాడు. దీంతో వెంటనే చికెన్ లాంటి దాన్ని నుజ్జునుజ్జు చేసే సుత్తెలాంటి దాన్ని తీసుకొని పదేపదే అతడి తలపై కొట్టడంతో చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఆమె వివరణ ఇస్తూ 'అతడు పోర్న్ వీడియోలు చూస్తుండగా పట్టుకున్నాను. కానీ, ఆ విషయం నుంచి పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. నాకు తీవ్ర కోపం వచ్చింది. చంపేయాలనుకున్నాను. తీవ్రంగా కొట్టాను. నేను చేసేది ఓ హత్యలాగా ఉండాలని భావించాను. గడిచిన పదేళ్లలో అతడు నన్ను ఒక్కసారి కూడా తాకలేదు. కానీ, పోర్న్ మాత్రం చూస్తున్నాడు. అతడికి ఎంత ధైర్యం. నా పదేళ్ల జీవితంలోకి నేను తిరిగి ఎలా వెళ్లగలను? అని ఆమె చెప్పింది. అతడి ప్రవర్తన చూసి మానసిక ఆందోళనకు లోనయ్యే తాను ఈ హత్య చేసినట్లు చెప్పింది. పదిహనేళ్ల వయసులో ఒకరినొకరు కలిసిన వీరిద్దరు ఐదేళ్లు గడిచిన తర్వాత భార్యాభర్తలుగా జీవితాన్ని ప్రారంభించారు. ప్రేమతో మొదలైన వీరి జీవితం చరమాంకంలో మాత్రం విషాదంగా మిగిలింది. -
చర్చిలో ఉన్మాది బీభత్సం
-
చర్చిలో ఉన్మాది బీభత్సం
కర్నూలు : చర్చిలో ప్రార్థనలు జరుగుతన్న సమయంలో అక్కడకు వెళ్లిన ఓ సైకో తన చేతిలో ఉన్న సుత్తితో ఓ వైద్యురాలిపై దాడి చేశాడు. దీంతో తలకు బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ సంఘటన కర్నూలులోని సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న హిమబిందు(45) సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ప్రదీప్ కుమార్ అనే ఉన్మాది సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన తోటివాళ్లు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.