
బీజింగ్ : గాజు వంతెనలు అనగానే టక్కున గుర్తొచ్చేది చైనా.. పెద్దపెద్ద గాజు పలకలతో కొండల అంచున వంతెనలు నిర్మించడంలో, స్కైవాక్స్ ఏర్పాటుచేయడంలో ఇప్పటికే ఆ దేశం గుర్తింపు పొందింది. దాదాపు మిలియన్ల కొద్ది డబ్బును వీటిని నిర్మించేందుకు చైనా ఉపయోగిస్తుంది. ఇటీవలె చైనాలోని హెక్కి నగరంలో అతి పొడవైన గాజు వంతెనను పూర్తి చేసిన చైనా ఫిబ్రవరిలో ప్రారంభించనుంది.
అయితే, 600మీటర్ల ఎత్తున్న ఆ వంతెన ప్రారంభానికి ముందు కార్మికులు గాజు పలకలకు తుది పరీక్షలు పెట్టడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియోలు, ఛాయా చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో వారు పెద్ద పెద్ద సుత్తెలను, గాజును పగల కొట్టే వస్తువులను తీసుకొని తమ శక్తిమేరకు వాటిని బలంగా మోదుతున్నారు. బాగా సుత్తెతో కొట్టిన తర్వాత వాటిపై గెంతులు పెడుతూ ఎగిరి దూకుతూ వాటిని పరీక్షిస్తున్నారు. సాధారణంగా వీటిపై నడవడమే కొంత భయానకంగా అనిపిస్తుంటుంది. అలాంటిది అంత ఎత్తుమీద ఉన్న గాజు పలకలపై నిల్చొని వాటినే పగులకొట్టే ప్రయత్నం చేయడానికి ఎంత సాహసం చేయాలో కదా మరీ!
Comments
Please login to add a commentAdd a comment