Glass bridge
-
గాల్లో తేలుతున్నట్లు.. నీటిపై నడయాడుతున్నట్లు..
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ పర్యాటకసిగలో మరో కలికితురాయి చేరనుంది. పర్యాటక ప్రియులకు గాల్లో తేలుతున్నట్లు..నీటిలో నడయాడుతున్నట్లనిపించేలా.. అద్భుత అనుభూతిని కలిగించే ‘గాజు వంతెన’ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఎంతో ఎత్తైన ప్రదేశంలో నిర్మించే ఈ గాజువంతెనపై నడుసూ్త..కింద నీటి ప్రవాహాన్ని చూస్తూ ప్రకృతి అందాలను వీక్షించడం అంటే ఆ మజానే వేరు. చదవండి: అయ్యో.. మొబైల్ పోయిందా? ఇలా చేయండి నంద్యాల జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై ఈ గాజు వంతెన నిర్మితం కానుంది. రూ.703.68 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు 167కేఏ జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై గాజు వంతెనను నిర్మించనున్నారు. 800 మీటర్ల పొడవుతో నేషనల్ హైవేస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ వంతెనకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలి రెండు అంతస్తుల కేబుల్ బ్రిడ్జి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంగమేశ్వరం వద్ద రెండు అంతస్తుల కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. నదులపై వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గం, రైళ్లు వెళ్లేందుకు మరో మార్గం నిర్మిస్తారు. పర్యాటకులు అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేందుకు ప్రత్యేక కారిడార్‌తో కూడిన గాజు వంతెన నిర్మిస్తారు. స్తంభాలు లేని వంతెన ఏపీలోని సంగమేశ్వరం, తెలంగాణలోని మల్లేశ్వరం తీర ప్రాంతాలను అనుసంధానిస్తూ రెండు భారీ పైలాన్లను నిర్మిస్తారు. తీరం నుంచి 160 మీటర్ల తర్వాత పైలాన్లు ఉంటాయి. రెండు పైలాన్ల మధ్య 460 మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 90 జతల భారీ కేబుల్స్ ఏర్పాటు చేసి వాటి ఆలంబనగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. ఇందులో సెంట్రల్ మీడియన్ భాగంలో గాజు ప్యానల్ కారిడార్ ఉంటుంది. దానికి రెండు వైపులా వాక్‌వేస్ ఉంటాయి. ఆ చివర, ఈ చివర గాజు ప్యానల్స్ ఉంటాయి. వీటి నుంచి దిగువన కృష్ణానది సోయగాలను చూడవచ్చు. గాజువంతెనపై నడుస్తూ నదిలో నడుస్తున్న అనుభూతినీ పొందవచ్చు. -
గాజు వంతెన కింద గలగలా కృష్ణమ్మ!
సాక్షి, హైదరాబాద్: గలగలాపారే కృష్ణా నది.. చుట్టూ పాపికొండలను తలపించే పచ్చిక కొండలు.. పక్షుల కిలకిలారావాలు.. ప్రశాంత వాతావరణం.. ఇది సోమశిల వద్ద సీన్. ఇంతకాలం నది ఇవతలో, ఆవలి తీరం వద్దో నిలబడి ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సి వచ్చేది. కానీ నదిపై గాజు వంతెన మీదుగా నడుస్తూ కింద నీటి ప్రవాహాన్ని చుట్టూ ఉన్న అందాలను వీక్షించడమంటే.. ఆ మజానే వేరు. త్వరలోనే సోమశిల వద్ద కృష్ణా నదిపై గాజు వంతెన ఏర్పాటు కానుంది. దానిపైనే వాహనాలు వెళ్లేందుకు వీలుగా మరో వంతెన ఏర్పాటు చేయనున్నారు. అంటే రెండంతస్తుల వంతెన అన్నమాట. ఇందుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదించినట్టు తెలిసింది. ఈ ఏడాదిలోనే పనులు షురూ రెండు వరసల (మల్టీ లెవల్) వంతెనలు చాలా కనిపిస్తాయి. నదులపై వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గం, రైలు ట్రాక్ కోసం మరో మార్గం ఒకదాని పైన ఒకటి ఉండేలా నిర్మించినవి కనిపిస్తాయి. కానీ పర్యాటకులు అక్కడి ప్రకృతిని వీక్షించేందుకు ప్రత్యే క కారిడార్‌తో కూడిన బహుళ అంతస్తుల వంతెన లు విదేశాల్లో ఉన్నా, మనదేశంలో లేవు. తొలిసారి అలాంటి రెండంతస్తుల ఐకానిక్ సస్పెన్షన్ వంతెన (కేబుల్ బ్రిడ్జి)ను సోమశిల వద్ద నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మించిన తరహాలో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఇందులో పైన నాలుగు వరసల రోడ్డు, దిగువున పర్యాటకుల కోసం చుట్టూ గాజు ప్యానెల్స్‌తో కూడిన వంతెన ఉంటుంది. దాదాపు 800 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మిస్తారు. ఇందుకు దాదాపు రూ.650 కోట్ల వరకు ఖర్చు కానుంది. ఈ సంవత్సరమే పనులు మొదలు కానున్నాయి. కొల్లాపూర్ మీదుగా నంద్యాలకు.. తెలంగాణ నుంచి నంద్యాల, తిరుపతిలకు వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణానదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గుతుంది. అందుకే గతంలో ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి, విస్తరించాలని ప్రతిపాదించారు. కానీ రకరకాల కారణాలతో అటకెక్కిన ఈ ప్రా జెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్ నుంచి కల్వ కుర్తి, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్ మీదుగా కృష్ణాతీ రంలోని మల్లేశ్వరం (సోమశిల సమీపంలోని) వర కు ప్రస్తుతం రోడ్డు ఉంది. ఇందులో కొల్లాపూర్ వరకు డబుల్ రోడ్డు ఉండగా, అక్కడి నుంచి కృష్ణా తీరం వరకు సింగిల్ రోడ్డే ఉంది. ఇప్పుడు కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని నంద్యాల వరకు 173.73 కి.మీ. మేర నాలుగు వరసల రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ జాతీయ రహదారికి 167కె నంబరు కేటాయించారు. ఈ రోడ్డులో భాగంగానే కృష్ణా నది మీద వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతం అద్భుత సౌందర్యానికి ఆలవాలం కావ డంతో అక్కడ నిర్మించే వంతెనను సాధారణంగా కాకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని నిర్ణయించారు. స్తంభాలు లేని వంతెన.. సోమశిలకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. పాపికొండలను మించిన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సేద తీరుతుంటారు. ఇప్పుడు గాజు వంతెన అందుబాటులోకి వస్తే పర్యాటకులు పోటెత్తే అవకాశం ఉంది. ఇది స్తంభాలు లేని వంతెన. ఇటు తెలంగాణ వైపు మల్లేశ్వరం తీరం, అటు ఏపీలోని సంగమేశ్వరం తీరంను అనుసంధానిస్తూ రెండు భారీ పైలాన్లను నిర్మిస్తారు. తీరం నుంచి 160 మీటర్ల తర్వాత పైలాన్లు ఉంటాయి. రెండు పైలాన్ల మధ్య 460 మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 30 జతల భారీ కేబు ల్స్ ఏర్పాటు చేసి వాటి ఆలంబనగా వంతెన నిలి చేలా నిర్మిస్తారు. ఇందులో సెంట్రల్ మీడియన్ భాగంలో గాజు ప్యానెల్ కారిడార్ ఉంటుంది. దానికి రెండు వైపులా వాక్ వేస్ ఉంటాయి. మళ్లీ ఆ చివర, ఈ చివర గాజు ప్యానెల్స్ ఉంటాయి. దీనిద్వారా చుట్టూ ప్రకృతిని, గాజు ప్యానెల్స్ నుంచి దిగువ కృష్ణమ్మ సోయగాలను వీక్షించొచ్చు. నదిలో నడుస్తున్న అనుభూతిని పొందొచ్చు. వంతెన ప్రారంభంలోని యాంకర్ బ్లాక్ వద్ద మెట్లు నిర్మించి, అక్కడి నుంచి పాదచారులు దిగువ వరసలోకి (గాజు కారిడార్) ప్రవేశించే ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటకంగా ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారనుంది. సోమశిలకు 10 కి.మీ దూరంలోని మల్లేశ్వరం వద్ద ఈ నిర్మాణం ఉంటుంది. -
గాజు వంతెన.. గుండె జారేనా!
అర కిలోమీటరు ఎత్తులో ఉన్న వంతెనను చూస్తేనే ‘అమ్మో..!’ అంటాం. అలాంటిది అంత ఎత్తులో ఉన్న వంతెన అడుగు భాగం గాజుతో నిర్మిస్తే..! నడవడానికి గజగజలాడిపోమా. కానీ వియత్నాం ప్రజలు మాత్రం తమ దేశంలో కట్టిన గాజు వంతెనను చూసేందుకు, దానిపై నడిచేందుకు ఎగబడుతున్నారు. సోన్ లా ప్రావిన్స్‌లో 632 మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన ఈ వంతెనను ఇటీవలే ప్రారంభించారు. దీనికి బాచ్ లాంగ్ (తెల్ల డ్రాగన్) పెడెస్ట్రియన్ వంతెన అని పేరు పెట్టారు. చైనాలోని గువాంగ్డాంగ్ వంతెన కన్నా (526 మీటర్లు) ఇది పొడవైనది. ఫ్రాన్స్‌లో ఉత్పత్తి చేసిన టెంపర్డ్ గ్లాస్‌ను ఈ వంతెనకు వాడారు. ఒకేసారి 450 మంది వరకు దీనిపై నడవొచ్చు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
చైనాకు ధీటుగా మరో కట్టడం.. అబ్బురపరుస్తున్న వీడియో
ప్రపంచంలోని ఎన్నో వింతల్లో మరో విశేష కట్టడం చేరబోతోంది. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించేందుకు వియత్నాం వేదికైంది. ప్రపంచంలోనే అతిపొడవైన గాజు వంతెనను వియత్నాంలోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో నిర్మించారు. ఈ గాజు వంతెన పొడవు 2,073.5 అడుగులు ఉండగా.. భూమి నుంచి వంతెన ఎత్తు సుమారుగా 500 అడుగుల ఎత్తులో ఉంది. కాగా, ఈ వంతెనను ఏప్రిల్ 30వ తేదీన ఓపెన్ చేయబోతున్నారు. ఈ వంతెనపై ఇప్పటికే అధికారులు భద్రతను పరిశీలించారు. అనంతరం సోన్ లా ప్రావిన్స్‌లోని మోక్ చౌ ఐలాండ్ టూరిస్ట్ ఏరియా అధికారులు.. ఈ గాజు వంతెన అధికారిక పొడవు ప్రపంచంలోనే ఎక్కువగా ఉండటంతో వంతెన గుర్తింపు కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు సమర్పించినట్లు తెలిపారు. ఇక, ఈ వంతెనపైకి ఒక్కసారి 500 మంది మాత్రమే నడవడానికి అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ వంతెన నిర్మాణానికి ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ సెయింట్ గోబైన్ ఉత్పత్తి చేసిన సూపర్ టెంపర్డ్ గ్లాస్‌ను ఉపయోగించారు. ఇక, చైనాలో కూడా ఓ గాజు వంతెనను నిర్మించిన విషయం తెలిసిందే. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్జియాజీ గ్రాండ్ కాన్యన్‌పై 1,410.7 అడుగుల పొడవుతో గాజు వంతెన ఉంది. ఈ వంతెన ప్రస్తుతం పొడవైనదిగా గిన్నిస్ రికార్డుల్లో ఉంది. కాగా, ఈ వంతెనను 2016లో ఓపెన్ చేశారు. అప్పటి నుంచి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ వంతెనకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. -
ప్రపంచంలోనే పొడవైన గాజు వంతెన
కొందరు నాలుగో అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే వణికిపోతారు. వారిని పదో అంతస్తుకి తీసుకెళ్తే.. అది కూడా గాజు వంతెన అయితే.. ప్రపంచంలోనే గాజుతో తయారుచేసిన ఇలాంటి వంతెనలకు చైనా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఇవే చైనాలో ప్రధాన పర్యాటక ఆకర్షణలు. యోగా ప్రదర్శనల దగ్గర నుంచి, వివాహాల వరకు అనేక కార్యక్రమాలు ఈ వంతెనలపై వినూత్నంగా జరుపుకొని చైనీయులు కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా చైనా ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనను నిర్మించింది. గతంలో నిర్మించిన 488 మీటర్లు (1,601 అడుగులు) రికార్డును తనే బద్దలు కొట్టి 550 మీటర్ల పొడవు( 1,804 అడుగులు) గల వంతెనను చైనా నైరుతి ప్రాంతంలోని హుయాంగ్సు ప్రావిన్స్‌లో నిర్మించింది. ఈ ప్రాంతం సుందరమైన జలపాతాలకు, సున్నపురాయి నిర్మాణాలకు ప్రసిద్ధి. వచ్చే నెలలో గాజువంతెనను ప్రారంభిస్తామని ప్రాజెక్టు డైరెక్టర్ పాన్ జావోఫు వెల్లడించారు. ప్రకృతిని ఆస్వాదించేవారికి ఈ ప్రదేశం నచ్చి తీరుతుందని తెలిపారు. ‘ఎత్తైన ప్రాంతంలో నడవాలనుకునే వారికి గాజువంతెనపై నడక ఒక ఛాలెంజింగ్‌గా ఉంటుంది. విశ్రాంతి, వినోదం, ప్రేరణ, క్రీడలు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలను వినూత్నంగా అందించడం ద్వారా పర్యాటకులను అలరించడానికి ఓ రిసార్ట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడి గుహలో రెస్టారెంట్ కూడా ఉంది’ అని పేర్కొన్నారు. మార్చిలో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యేసరికి 1 మిలియన్ డాలర్లు వ్యయం అయింది. -
గాజువంతెనపై ఈడ్చుకుంటూ వెళ్లాడు
-
అర కిలోమీటర్ ఎత్తులో ఈడ్చుకుంటూ..
బీజింగ్ : గాజు వంతెలనకు పెట్టింది పేరు చైనా. సాధారణ వంతెనల నిర్మాణం కంటే ఇప్పుడక్కడ ఎత్తయిన కొండ ప్రాంతాల్లో కొండ చివరన గాజువంతెనల నిర్మాణమే అధికం. ఎందుకంటే ఇవి విపరీతంగా టూరిస్టులను ఆకర్షించి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అయితే, అక్కడికి వచ్చిన టూరిస్టులు మాత్రం చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదుర్కొంటున్నారు. వంతెన వరకు వచ్చి దానిపై అడుగుపెట్టేందుకు భయపడేవారు కొందరైతే.. దానిపై కొంతమేరకు నడిచి అంత ఎత్తునుంచి కిందికి చూసి కళ్లు తిరిగి ఇక మాత్రం ముందుకు కదలకుండా వంతెనకు వేలాడేవారు ఇంకొందరు. తాజాగా ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చెక్కర్లు కొడుతోంది. ఇటీవల ప్రారంభించిన ఐజాయ్ అనే 500 మీటర్ల ఎత్తయిన గాజు వంతెనపై కొద్ది దూరం మాత్రం రెండడుగులు వేసిన ఓ మహిళా టూరిస్టు అనంతరం గజగజా వణికిపోతూ దానిపై కూర్చొని ఇక కదలలేనంటూ మొండికేసింది. దీంతో ఆమెతో వచ్చిన వ్యక్తి ఈడ్చుకుంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన అక్కడి వారంతా కడుపుబ్బేలా నవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ వీడియో తెగ ఆకర్షిస్తోంది.. మీరూ ఓ లుక్కేయండి మరీ! -
ఆ వంతెన పరీక్ష ఫెయిలైతే..ప్రాణాలు గాల్లోనే!
-
పరీక్ష ఫెయిలై బద్ధలయిందో..
బీజింగ్ : గాజు వంతెనలు అనగానే టక్కున గుర్తొచ్చేది చైనా.. పెద్దపెద్ద గాజు పలకలతో కొండల అంచున వంతెనలు నిర్మించడంలో, స్కైవాక్స్ ఏర్పాటుచేయడంలో ఇప్పటికే ఆ దేశం గుర్తింపు పొందింది. దాదాపు మిలియన్ల కొద్ది డబ్బును వీటిని నిర్మించేందుకు చైనా ఉపయోగిస్తుంది. ఇటీవలె చైనాలోని హెక్కి నగరంలో అతి పొడవైన గాజు వంతెనను పూర్తి చేసిన చైనా ఫిబ్రవరిలో ప్రారంభించనుంది. అయితే, 600మీటర్ల ఎత్తున్న ఆ వంతెన ప్రారంభానికి ముందు కార్మికులు గాజు పలకలకు తుది పరీక్షలు పెట్టడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియోలు, ఛాయా చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో వారు పెద్ద పెద్ద సుత్తెలను, గాజును పగల కొట్టే వస్తువులను తీసుకొని తమ శక్తిమేరకు వాటిని బలంగా మోదుతున్నారు. బాగా సుత్తెతో కొట్టిన తర్వాత వాటిపై గెంతులు పెడుతూ ఎగిరి దూకుతూ వాటిని పరీక్షిస్తున్నారు. సాధారణంగా వీటిపై నడవడమే కొంత భయానకంగా అనిపిస్తుంటుంది. అలాంటిది అంత ఎత్తుమీద ఉన్న గాజు పలకలపై నిల్చొని వాటినే పగులకొట్టే ప్రయత్నం చేయడానికి ఎంత సాహసం చేయాలో కదా మరీ! -
ఆకాశ గాజు వంతెన.. అడుగేస్తే పగుళ్లు.. బెంబెలెత్తిన జనం!
-
ఆకాశ గాజు వంతెన.. అడుగేస్తే పగుళ్లు.. బెంబెలెత్తిన జనం!
బీజింగ్: చైనా ఆకాశ వంతెనలకు ప్రసిద్ధి. అక్కడ ఇప్పుడు ఎక్కడా చూసినా గాజు బ్రిడ్జీలు దర్శనమిస్తున్నాయి. ఆకాశంలో అత్యంత ఎత్తున గాజు బ్రిడ్జీలపై నడవడమంటే సాహసమే.. ఆ గాజు బ్రిడ్జీలపై నడుస్తూ కిందకు చూసేందుకు చాలామంది జడుసుకుంటున్నారు. అలా చూస్తే.. ఒళ్లు జలదరించే అనుభవం. ఆ అనుభవాన్ని చైనా పర్యాటకులు తాజాగా ఆస్వాదివిస్తున్నారు. కానీ, ఉత్తర చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో 3,800 అడుగుల ఎత్తులో ఆకాశ గాజు వంతెనను ఇటీవల ప్రారంభించారు. ఈ వంతెనపై నడిచిన సందర్శకులు దిమ్మతిరిగే షాక్ తగిలింది. గాజు వంతెనపై అడుగులు వేస్తూ అల్లాడిపోయారు. భయంతో కేకలు వేసి.. గుండె చిక్కబట్టుకొని నడిచారు. అందుకు కారణం.. ఆ గాజు వంతెనపై అడుగులు వేస్తుండగా.. అమాంతం పగుళ్లు రావడం.. పగులుతున్నట్టు సౌండ్ వినిపించడడమే.. ఇలా పగుళ్లు కనిపించి.. ధ్వని కూడా వినిపించడంతో గాజు వంతెనపై నడిచిన వాళ్లు బెంబెలెత్తిపోయారు. అసలు విషయం తెలిసి సందర్శకులు షాక్ తిన్నారు. వంతెన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గాజు వంతెనపై నిజంగా పగుళ్లు రాలేదు. కానీ, సందర్శకులను భయపెట్టేందుకు అంటూ సెన్సర్లతో పగుళ్లు వచ్చేలా ఏర్పాటుచేశారు. సందర్శకులు అడుగులు వేస్తుండగా.. ఆ అడుగులకు అనుగుణంగా పగుళ్లు వస్తున్నట్టు కనిపించేలా సెన్సార్లు అమర్చారు. అందుకు అనుగుణంగా పగులుతున్న శబ్దం కూడా వచ్చేలా ఏర్పాటుచేశారు. అయితే, వంతెన చివరిలో కొద్దిదూరం మాత్రమే ఈ ఏర్పాటు చేశారు. తొలిసారి నడువాలన్న ఉత్సాహంతో గాజు వంతెనపైకి ఎక్కి.. జామ్ జామ్ అంటూ అడుగులు వేసుకుంటూ వెళ్లిన వారు.. చివర్లో పగుళ్లు రావడంతో బెంబేలెత్తిపోయారు. భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని అడుగులు వేశారు. ఇది సరదాకు చేశారని తెలిసి.. వంతెన నిర్వాహకులపై సందర్శకులు మండిపడుతున్నారు. గాజు వంతెనపై సందర్శకులు భయోత్పాతంతో పడిపోతున్న వీడియోలను షేర్ చేస్తున్న నెటిజన్లు.. ఇదేం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పగుళ్ల గురించి ముందే తెలిసి.. వంతెన ఎక్కుతున్న సందర్శకులు.. నడిచేటప్పుడు వాటిని చూసి ఆస్వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మూతపడింది
-
ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మూతపడింది
బీజింగ్ : చైనాలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ మూత పడింది. ఆగస్టు 22న ప్రారంభమైన గ్లాస్ వంతెనను కేవలం 13రోజుల్లో మూసివేశారు. మెయింటినెన్స్ కారణాల రీత్యా మూసివేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అత్యవసరంగా నిర్వహించాల్సిన మెయిన్టెనెన్స్ పనుల కోసం బ్రిడ్జ్‌ను మూసివేస్తున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పునః ప్రారంభ సమయాన్ని మళ్లీ ప్రకటిస్తామని అధికారులు ప్రకటించారు. హునన్ ప్రావిన్స్‌లో రెండు కొండల మధ్య ఉన్న ఈ అతి ఎత్తైన, అతి పొడువైన గ్లాస్ బ్రిడ్జ్ (430 మీ. పొడవు) ప్రపంచంలో అతి పెద్ద గాజు వంతెనగా పేరొంది. బ్రిడ్జ్‌ను ప్రారంభించిన తర్వాత టూరిస్టుల తాకిడి మరింత పెరగడంతో ఈ నిర్ణయ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి రోజు 8 వేల మంది టూరిస్టులను తట్టుకునే శక్తి బ్రిడ్జ్‌కు ఉంది. కానీ రికార్డు స్థాయిలో అత్యధిక సంఖ్యలో సుమారు 10 రెట్ల పర్యాటకుల తాకిడి పెరగడంతో తక్షణమే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 'తాము ప్రతిదీ బుక్ చేసుకున్నామని, ఇప్పుడు మూసివేశామంటున్నారు. ..తమాషా చేస్తున్నారా? తదితర కమెంట్లు వెల్లువెత్తాయి. -
చైనాలో ఈ అద్భుతం అదరహో
-
చైనాలో ఈ అద్భుతం అదరహో
బీజింగ్: ప్రపంచంలోనే ఎత్తయిన ప్రాంతాల్లో అరుదైన కట్టడాలు నిర్మించి తన ప్రత్యేకతను చాటుకునే చైనా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దాదాపు వంద మీటర్ల ఎత్తులో ఓ పెద్ద కొండ చుట్టూ మరో ఫుట్ పాత్ లాంటి గ్లాస్ వంతెనను ఏర్పాటుచేసి అబ్బురపరిచింది. ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దీనిపైకి సోమవారం నుంచే పర్యాటకులకు అనుమతిస్తున్నారు. జాంగ్జియాజి సెనిక్ ప్రాంతంలోని టియాన్ మెన్ పర్వతాల్లో 1.6 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించి పర్యాటకంలో భాగంగా ప్రారంభించారు. దీంతో అందరూ దీనిపై నడిచే సాహసం చేసేందుకు బయలుదేరడంతోపాటు ఏం చక్కా సెల్ఫీలు దిగేందుకు సెల్ఫీ స్టిక్ లతో బయలుదేరారు. ఆకాశాన్ని అంటుకుందా అన్నట్లుగా ఈ పర్వతం ఉంటుంది. పై నుంచి కింది వరకు దాదాపు రాతి పొరతోనే కనిపించే ఈ పర్వతంపై మాత్రం చూడముచ్చటయ్యేలా పెద్ద పెద్ద చెట్లు ఉండటం విశేషం. ఈ వంతెనపై కొంతమంది ధైర్యంగా పరుగులు పెట్టేంతగా నడుస్తుండగా.. మరికొందరు తమ గుండెలు అరచేతపట్టుకొని సాగుతున్నారు. ప్రేమికులు ఏం చక్కా దానికి ఉంచిన రెయిలింగ్ పట్టుకొని సెల్ఫీలు తీసుకుంటుండగా కొంతమంది యువతులు సరదాగా గాల్లో వేలాడుతున్నట్లు ఫొటోలకు ఫోజులిస్తున్నారు. -
అమ్మో.. అద్దాల బ్రిడ్జి..
చైనాలో ఇటీవల ప్రారంభించిన ఈ వంతెన ప్రస్తుతం అక్కడ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. ఇది గ్లాస్ బ్రిడ్జి.. అంటే కింద అంతా గ్లాసుతో పారదర్శకంగా ఉంటుందన్నమాట. పింగ్జియాంగ్లో రెండు పర్వతాల మధ్య 984 అడుగుల మేర నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జిపై నడవాలంటే చాలా మంది భయపడతారు. 590 అడుగుల ఎత్తులో లోయ మధ్య ఉన్న ఈ వంతెనపై నడుస్తున్నప్పుడు కిందకు చూస్తే.. కళ్లు తిరగడం ఖాయం. అందుకే.. అలా భయపడేవారి కోసం ఈ బ్రిడ్జి మీద అక్కడక్కడా సహాయకులు కూడా ఉంటారు. వారు దగ్గరుండి బ్రిడ్జిని దాటిస్తారు. ఈ బ్రిడ్జిలో ఎక్కువ భాగం అద్దాలతో పారదర్శకంగా.. కొంత దూరం మామూలుగా ఉంటుంది.