అర కిలోమీటరు ఎత్తులో ఉన్న వంతెనను చూస్తేనే ‘అమ్మో..!’ అంటాం. అలాంటిది అంత ఎత్తులో ఉన్న వంతెన అడుగు భాగం గాజుతో నిర్మిస్తే..! నడవడానికి గజగజలాడిపోమా. కానీ వియత్నాం ప్రజలు మాత్రం తమ దేశంలో కట్టిన గాజు వంతెనను చూసేందుకు, దానిపై నడిచేందుకు ఎగబడుతున్నారు. సోన్ లా ప్రావిన్స్‌లో 632 మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన ఈ వంతెనను ఇటీవలే ప్రారంభించారు.
దీనికి బాచ్ లాంగ్ (తెల్ల డ్రాగన్) పెడెస్ట్రియన్ వంతెన అని పేరు పెట్టారు. చైనాలోని గువాంగ్‌డాంగ్ వంతెన కన్నా (526 మీటర్లు) ఇది పొడవైనది. ఫ్రాన్స్‌లో ఉత్పత్తి చేసిన టెంపర్డ్ గ్లాస్‌ను ఈ వంతెనకు వాడారు. ఒకేసారి 450 మంది వరకు దీనిపై నడవొచ్చు.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment