డానాంగ్: అర చేతుల్లో అద్భుతం.. ఈ ఫోటో చూసిన వెంటనే ఎవరికైనా ఇదే మాట తడుతుంది. దూరం నుంచి చూసే వారికి ఇంత పెద్ద భారీ వంతెనను పడిపోకుండా ఈ రెండు చేతులు కాపాడుతున్నాయేమో అన్పిస్తోంది. మరి ఆ అర చేతుల్లో మనం కూడా వాలిపోవాలంటే.. చలో వియత్నాం. ‘గోల్డెన్ హ్యాండ్స్’ అని పిలుచుకుంటున్న ఈ వంతెన వియత్నాంలోని బనా హిల్స్ రిసార్ట్ వద్ద నిర్మించారు.
ఈ వంతెనను సముద్ర మట్టానికి సుమారు 4593 అడుగుల ఎత్తులో కట్టారు. వంతెనకు ఇరు పక్కల వంగపువ్వూ రంగులో ఉండే లోబిలియా చామంతి పూల మొక్కలను నాటారు. దూరం నుంచి చూసినప్పుడు అడవిలో నుంచి రెండు భారీ చేతులు వచ్చి ఈ వంతెనను పట్టుకున్నాయేమో అనిపిస్తోంది.
జూన్ నెలలో ప్రారంభించిన ఈ వంతెనను చూడటానికి ఇప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అంతేనా ఈ వంతెనకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు వియత్నాం ప్రభుత్వం దాదాపు 10 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో భాగంగా ఈ ‘గోల్డెన్ బ్రిడ్జి’ని నిర్మించారు. ఈ వంతెనపై నిల్చోని చూస్తే ఆకాశానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అన్పిస్తోంది అంటున్నారు పర్యాటకులు. అయితే ఈ వంతెనపైకి కేవలం పాదచారులను మాత్రమే అనుమతిచ్చింది వియత్నాం ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment