tourist center
-
నీలగిరి కొండల తొలి వెలుతురు
‘నీలగిరుల్లోని ప్రతి కొండ మాకు దేవునితో సమానం’ అంటుంది వాసమల్లి.నీలగిరిలో అంతరించిపోతున్న ‘తోడా’ తెగకు చెందిన వాసమల్లి ఆ తెగలో మొదటి గ్రాడ్యుయేట్. లిపిలేని తోడా భాషకు డిక్షనరీ తయారు చేసే పనిలో ఉంది. తోడా తెగ పాటలను సేకరిస్తే సాహిత్య అకాడెమీ ప్రచురించింది. ‘చంద్రునిలో ఉండే కుందేలు మా తెగదేనని మా విశ్వాసం’ అందామె.‘ఊటీ’ అని అందరూ పిలుచుకునే ‘టూరిస్ట్ కేంద్రం’లో తోడా తెగ విశిష్ట జీవనాన్ని నమోదు చేస్తున్న వాసమల్లి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడింది. ఆయుష్మంతులు తోడాలు కొండగొర్రెల్లా తిరుగుతూనే ఉంటారు. అడవి పళ్లు, ఆకుకూరలు తింటారు. ప్రశాంతంగా జీవిస్తారు. రోగాలు రావు. నూరేళ్లు సులువుగా బతుకుతారు. డబ్బు దాదాపుగా ఎవరి దగ్గరా ఉండదు. దానికి పెద్దగా విలువ లేదు. తోడాలు చేతి ఎంబ్రాయిడరీలో నిష్ణాతులు. తెలుపు, ఎరుపు, నలుపు రంగులు మాత్రమే వాడుతూ అందమైన ఎంబ్రాయిడరీ కంబళ్లు అల్లుతారు. తెలుపు బాల్యానికి, ఎరుపు యవ్వనానికి, నలుపు పరిణితికి గుర్తుగా భావిస్తారు. – వాసమల్లి ‘నీలగిరి కొండల్లో విహారానికి వచ్చేవాళ్లు మేం మాట్లాడుకునే భాష విని భలే ఉందే, ఇదేం భాష అనుకుంటారు. మా తర్వాతి తరాలు అలా అనుకోకూడదని తోడా భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. మా భాషకు లిపి లేదు. కాని యాభైకి మించిన ధ్వన్యక్షరాలు ఉన్నాయి. వాటిని నమోదు చేస్తున్నాను. తోడా డిక్షనరీ తయారు చేస్తున్నాను. తోడాలు పాడుకునే పాటలు, చెప్పుకునే కథలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని సేకరించి పుస్తకం వేశాను’ అంటుంది వాసమల్లి.అరవై ఏళ్లు దాటిన వాసమల్లి కేవలం 1500 మంది మాత్రమే మిగిలిన తోడా తెగకు ప్రతినిధి.‘నీలగిరుల్లో మొత్తం ఆరు తెగలు ఉన్నాయి. అన్నీ అంతరించిపోయే ప్రమాదపు అంచున ఉన్నాయి’ అంటుందామె. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో జానపదుల కథల గురించి మాట్లాడడానికి వచ్చిన వాసమల్లి ‘ఆదిమ తెగలు మానవ నాగరికతకు పాదముద్రలు. భాష మరణిస్తే సమూహం కూడా మరణిస్తుంది. మా తోడా భాష ఎంతో సుందరమైనది. మా తర్వాతి తరాలు దానిని కాపాడుకోవాలనేదే నా తపన’ అంది. బర్రెలే ఆస్తి ‘తోడాలకు బర్రెలే ఆస్తి. నీలగిరుల్లోని కొండ బర్రెలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని ‘ఇర్ర్’ అంటారు. వాటి పాల నుంచి తీసిన నెయ్యితో మాత్రమే మేము దేవుని దీపాలను వెలిగించాలి. వాటిని మేము దైవాంశాలుగా చూస్తాం. తోడాలు శాకాహారులు. ఇర్ర్లను కోయడం, తినడం చేయం. మా తోడాల్లో ఎవరైనా చనిపోతే ఒక బర్రెను ఎంపిక చేసి పడమరవైపు తోలేస్తాం. అది కూడా ఏదో ఒక రోజున మరణించి ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరకు తోడు కోసం వెళుతుందని మా నమ్మకం’ అని చెప్పిందామె. చంద్రుని పై కుందేలు ‘తోడాలు ఏది దొరికినా పంచుకుని తినాలి. ఒకసారి ఒక తోడా తేనె దొరికితే వెదురుబొంగులో తన కోసం దాచుకుని ఇంటికి బయలుదేరాడట. అతనిలోని దురాశ వెంటనే పాములా మారి వెంటబడింది. అతను పరిగెడుతూ చేతిలోని వెదురుబొంగును కింద పడేస్తే అది పగిలి తేనె కుందేలు మీద చిందింది. పాము ఆ కుందేలు వెంట పడింది. కుందేలు భయంతో సూర్యుడి వైపు పరిగెడితే నేను చాలా వేడి... చంద్రుడి దగ్గరకు వెళ్లి దాక్కో అన్నాడు. కుందేలు చటుక్కున చంద్రుడిలో వెళ్లి దాక్కుంది. అందుకని చంద్రుడిలోని కుందేలు మా పూర్వికురాలనుకుంటాం. చంద్రగ్రహణం రోజున చంద్రుణ్ణి రాహువు వదిలే వరకూ కుందేలు క్షేమం కోసం భోరున విలపిస్తాం’ అని తెలిపిందామె. మొదటి గ్రాడ్యుయేట్ నీలగిరి కొండల్లో గిరిజనవాడలను ‘మండ్’ అంటారు. అలాంటి మండ్‌లో పుట్టిన వాసమల్లి చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తితో హైస్కూల్ వరకూ చదువుకుంది. చిన్న వయసు పెళ్లి తప్పించుకోవడానికి ఇంటర్, డిగ్రీ చదివింది. తర్వాత ఊటీలోని ‘హిందూస్థాన్ ఫొటో ఫిల్మ్ ఫ్యాక్టరీ’లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యింది. ఆ సంస్థ ఉద్యోగినే పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు ఉద్యోగం చేస్తుంటే, మరో కొడుకు ఊటీలో గైడ్‌గా పని చేస్తున్నాడు. ‘నా పరిశోధనకు పెద్దగా సపోర్ట్ ఏమీ దొరకడం లేదు. మా నీలగిరుల్లో యాభై కొండలకు యాభై కథలు ఉన్నాయి. సేకరిస్తున్నాను. ఎలా ప్రచురించాలో ఏమిటో’ అంటున్న ఆమె ఒక తొలి వెలుగుగా అనిపించింది. ఆ దీపం నుంచి మరో దీపం వెలుగుతూ వెళ్లాలని కోరుకుందాం. - ఇంటర్వ్యూ: జైపూర్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
దాల్ సరస్సులో ఘోర అగ్ని ప్రమాదం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు హౌస్బోట్లలో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో విదేశీ ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మాడి మసైన హౌస్‌బోట్ శిథిలాల నుంచి గుర్తుపట్టలేని విధంగా కాలిన మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మృతులు బంగ్లాదేశ్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిని అనిందయ కౌశల్, మహ్మద్ మొయినుద్, దాస్ గుప్తా అని తెలిసిందన్నారు. వీరున్న సఫీనా అనే హౌస్‌బోట్ పూర్తిగా దగ్ధమైందన్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం అయిదు హౌస్బోట్లు, వాటికి పక్కనే ఉన్న ఏడు నివాస కుటీరాలు, కొన్ని ఇళ్లు కూడా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఘటనలో కోట్లలో ఆస్తినష్టం సంభవించింది. తొమ్మిదో నంబర్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంపై ఉదయం 5.15 గంటల సమయంలో ఫోన్లో సమాచారం అందగానే రంగంలోకి దిగి, ఎనిమిది మంది పర్యాటకులను రక్షించగలిగామని స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఫైర్ సర్వీస్) ఫరూక్ అహ్మద్ తెలిపారు. ఒక హౌస్‌బోట్‌లో చెలరేగిన మంటలు వేగంగా మిగతా బోట్లకు వ్యాపించాయన్నారు. అతికష్టమ్మీద మంటలను అదుపులోకి తేగలిగామని వివరించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. ఒక బోటులోని హీటింగ్ పరికరాల్లో లోపం కారణంగానే మంటలు అంటుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2022లోనూ డాల్, నగీన్ సరస్సుల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడు హౌస్బోట్లు బూడిదగా మారాయి. అప్పటి ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
Library On Trees: పుస్తకాలు కాసే చెట్లు!
చెట్లకు డబ్బులు కాస్తాయా! అంటారు. డబ్బులు కాదుగానీ పుస్తకాలు కాస్తాయి... అని సరదాగా అనవచ్చు. ఎలా అంటే... అస్సాంలోని జోర్హాట్ జిల్లాకు చెందిన మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. రకరకాల సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకసారి వీరి మధ్య గ్రంథాలయాల గురించి చర్చ జరిగింది. తమ చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ అయిపోగానే రోజూ ఊరి గ్రంథాలయానికి వెళ్లేవాళ్లు. లోపల పెద్దవాళ్లు న్యూస్‌పేపర్లు తిరగేస్తూనో, పుస్తకాలు చదువుకుంటూనో గంభీరంగా కనిపించేవారు. తాము మాత్రం ఆరుబయట పచ్చటిగడ్డిలో కూర్చొని బొమ్మలపుస్తకాలు చదువుకునేవారు. సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఈ ఇంటర్నెట్ యుగంలో చాలామంది పిల్లలు సెల్ఫోన్ల నుంచి తల బయట పెట్టడం లేదు. పాఠ్యపుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు వారి దగ్గర కనిపించడం లేదు. చదివే అలవాటు అనేది బాగా దూరం అయింది. ‘మన వంతుగా ఏం చేయలేమా’ అనుకుంది మహిళాబృందం. అప్పుడే ‘ట్రీ లైబ్రరీ’ అనే ఐడియా పుట్టింది. ప్రయోగాత్మకంగా మారియాని గర్ల్స్హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న చెట్లకు బాక్స్‌లు అమర్చి వాటిలో దినపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు పెట్టారు. స్పందన చూశారు. అద్భుతం. చెట్ల నీడన పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్న దృశ్యం కన్నుల పర్వం! ‘పిల్లలకు, లైబ్రరీలకు మధ్య దూరం ఉంది. ఆ దూరాన్ని దూరం చేయడమే మా ప్రయత్నం. సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా పఠనం అనేది మనకు ఎప్పుడూ అవసరమే. అది మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైనా దిపిల పొద్దార్. విశేషం ఏమిటంటే... జోర్హాట్ జిల్లా చుట్టుపక్కల గ్రామాలు ఈ ట్రీ లైబ్రరీని స్ఫూర్తిగా తీసుకొని, తమ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ‘ఈ ట్రీ లైబ్రరీ గురించి విని మా ఊరి నుంచి పనిగట్టుకొని వచ్చాను. నాకు బాగా నచ్చింది. పిల్లలను పుస్తకాల దగ్గరికి తీసుకురావడానికి అనువైన వాతావరణం కనిపించింది. మా ఊళ్లో కూడా ఇలాంటి లైబ్రరీ మొదలు పెట్టాలనుకుంటున్నాను’ అంటుంది భోగ్పూర్ సత్రా అనే గ్రామానికి చెందిన హిమంత అనే ఉపాధ్యాయిని. ఇక మజులి గ్రామానికి చెందిన నీరబ్ ఈ ‘ట్రీ లైబ్రరీ’ గురించి సామాజిక వేదికలలో విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ‘ఇలాంటివి మా ఊళ్లో కూడా మొదలుపెట్టాలనుకుంటున్నాము’ అంటూ మంచి స్పందన మొదలైంది. మూడు నెలలు వెనక్కి వెళితే... పశ్చిమబెంగాల్లోని అలీపూర్దౌర్ యూరోపియన్ క్లబ్ గ్రౌండ్‌లోని చెట్లకు అరలు తయారు చేసి పుస్తకాలు పెట్టారు. ఓపెన్ ఎయిర్ కాన్సెప్ట్‌తో మొదలైన ఈ ట్రీ లైబ్రరీ సూపర్ సక్సెస్ అయింది. ఇది పర్యాటక కేంద్రంగా మారడం మరో విశేషం! -
AP Special: బెలూం గుహలను చూసొద్దాం రండి..!
కోవెలకుంట్ల: భారతీయ సంస్కృతిలో గుహలు దేవుళ్లు, దేవతలకు నివాసమనే నమ్మకం వల్ల ఆ గుహలు పవిత్ర స్థలాలుగా విలసిల్లుతున్నాయి. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం సమీపంలో ప్రపంచంలోనే రెండవదిగా భారతదేశంలోనే పొడవైన అంతర్భాభాగ గుహలుగా బెలూం గుహలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమి లోపల, భూమికి సమాంతరంగా ఇక్కడ గుహలు ఏర్పడటం ప్రత్యేకత. ఈ గుహలలో క్రీ.పూ. 450 సంవత్సరాల కాలం నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు, రాతి కత్తి లభ్యం కావడంతో ఈ గుహలను ఆనాటి మానవులు నివాస స్థలాలుగా వినియోగించుకున్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. గుహల ఉనికిని చాటిన ఆంగ్లేయుడు: 1884వ సంవత్సరంలో హెచ్‌బీ ఫూటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా బెలూం గుహల ఉనికిని చాటాడు. తర్వాత 1982–1984 శీతాకాలాల్లో హెచ్డీ గేబర్ అనే జర్మనీ దేశస్తుడు సహచరులతో కలిసి 3225 మీటర్ల వరకు శోధించి ఒక పటాన్ని తయారు చేశాడు. వీరికి స్థానికులైన అప్పటి రిటైర్డ్ ఎస్పీ చలపతిరెడ్డి, ఆయన అల్లుడు రామసుబ్బారెడ్డి పూర్తి సహకారం అందించారు. 1988వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ గుహలను రక్షిత స్థలంగా ప్రకటించి అప్పటి నుంచి కొన్నేళ్లపాటు కాపలాదారుని నియమించింది. గుహలోని శివలింగాలు 1999వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ బెలూం గుహలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వీటి నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. సొరంగ మార్గాల్లో ఒకటిన్నర కిమీ పొడవున మట్టి దిబ్బలను తొలగించి నాపరాళ్లు పరిచి నడక దారిని ఏర్పాటు చేశారు. సొరంగ మార్గాల్లో 150 విద్యుద్దీపాలతో కాంతివంతం చేశారు. గుహల లోపలకు గాలిని పంపు బ్లోయర్లు ఏర్పాటు చేశారు. 2003వ సంవత్సరం నుంచి బెలూం గుహల సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. బెలూం గుహలు ఏర్పడిన ప్రదేశం బెలూం గుహల్లో చూడదగిన ప్రదేశాలు: బెలూం గుహల్లో 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల లోతు వరకు ఉన్న ఈ సొరంగాలు కొన్ని చోట్ల ఇరుకుగాను, మరికొన్ని చోట్ల విశాలమైన గదులుగాను ఉండి కొన్నిచోట్ల స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు అనబడే స్పటికాకృతులు ఏర్పడి ఉన్నాయి. ఈ కృత్రిమ శిలల ఆకృతుల ఆధారంగా కొన్ని ప్రదేశాలను వేయి పడగలు, కోటి లింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం, వంటి పేర్లు పెట్టారు. ఇవి కాకుండా ధ్యాన మందిరం, మండపం, కప్పులో ఉన్న బొంగరపు గుంతలు, గుహల చివరి వరకు పోతే పాతాళ గంగ అనే నీటి మడుగు అక్కడే రాతిలో మలచిన శివలింగం ఉన్నాయి. విద్యుద్దీప కాంతులతో ఈ సొరంగ సోయాగాలను తిలకిస్తూ, సొరంగాలు పయనిస్తూ ఉంటే మరో ప్రపంచంలో ఉన్నట్లు సందర్శకులను గుహలు మైమరపిస్తున్నాయి. బెలూం గుహలోకి వెళ్లే ద్వారం భూగర్భంలో దాగి ఉన్న ఊహాతీతమైన పకృతి సౌందర్యాలు పోయినంత దూరం సందర్శకులకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. గుహ లోపల సంవత్సరం పొడవున 33 డిగ్రీల దాదాపు స్థిరమైన ఉష్టోగ్రత ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెలూం గుహలను తిలకించేందుకు సందర్శకులకు అనుమతి ఉంది. కాగా ఆదివారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు రోజుల్లో బెలూం గుహలకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. గుహలోని పాతాళ గంగ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలతో పాటు విదేశీయులు బెలూం గుహలను సందర్శిస్తున్నారు. సందర్శకులు బెలూం గుహలను తిలకించేందుకు వస్తుండటంతో టూరిజం శాఖకు ప్రతి ఏటా రూ. 1.79 కోట్ల ఆదాయం చేకూరుతోంది. గుహలను సందర్శనకు వచ్చే ప్రజల నుంచి పెద్దలకు రూ. 65, పిల్లలకు రూ. 45 ప్రకారం టికెట్ వసూలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి గుహల సందర్శనకు వచ్చే వారికి గుహల ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఇక్కడ తమిళం, కన్నడ, హిందీ భాషలు తెలిసిన తెలుగు గైడ్లు అందుబాటులో ఉన్నారు. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాల కంటే బెలూం గుహల నుంచి టూరిజం శాఖకు అధిక ఆదాయం చేకూరుతుండటం విశేషం. బెలూం గుహలకు ఇలా చేరుకోవాలి: ►కర్నూలు నుంచి ఓర్వకల్లు, బేతంచెర్ల, బనగానపల్లె మీదుగా 110 కిమీ ప్రయాణించి బెలూం గుహలను చేరుకోవాలి. ►అనంతపురం నుంచి తాడిపత్రి మీదుగా 80 కిమీ దూరంలో బెలూం గుహలు ఉన్నాయి ►చెన్నై నుంచి 420 కిమీ ►బెంగుళూరు నుంచి 280 కిమీ ►తిరుపతి నుంచి 275 కిమీ దూరంలో బెలూం గుహలు ఉన్నాయి. -
అరచేతిలో అద్భుతం.. ఎప్పుడైనా చూశారా?
డానాంగ్: అర చేతుల్లో అద్భుతం.. ఈ ఫోటో చూసిన వెంటనే ఎవరికైనా ఇదే మాట తడుతుంది. దూరం నుంచి చూసే వారికి ఇంత పెద్ద భారీ వంతెనను పడిపోకుండా ఈ రెండు చేతులు కాపాడుతున్నాయేమో అన్పిస్తోంది. మరి ఆ అర చేతుల్లో మనం కూడా వాలిపోవాలంటే.. చలో వియత్నాం. ‘గోల్డెన్ హ్యాండ్స్’ అని పిలుచుకుంటున్న ఈ వంతెన వియత్నాంలోని బనా హిల్స్ రిసార్ట్ వద్ద నిర్మించారు. ఈ వంతెనను సముద్ర మట్టానికి సుమారు 4593 అడుగుల ఎత్తులో కట్టారు. వంతెనకు ఇరు పక్కల వంగపువ్వూ రంగులో ఉండే లోబిలియా చామంతి పూల మొక్కలను నాటారు. దూరం నుంచి చూసినప్పుడు అడవిలో నుంచి రెండు భారీ చేతులు వచ్చి ఈ వంతెనను పట్టుకున్నాయేమో అనిపిస్తోంది. జూన్ నెలలో ప్రారంభించిన ఈ వంతెనను చూడటానికి ఇప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అంతేనా ఈ వంతెనకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు వియత్నాం ప్రభుత్వం దాదాపు 10 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో భాగంగా ఈ ‘గోల్డెన్ బ్రిడ్జి’ని నిర్మించారు. ఈ వంతెనపై నిల్చోని చూస్తే ఆకాశానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అన్పిస్తోంది అంటున్నారు పర్యాటకులు. అయితే ఈ వంతెనపైకి కేవలం పాదచారులను మాత్రమే అనుమతిచ్చింది వియత్నాం ప్రభుత్వం. -
ఆ గుహ ఇక మ్యూజియం
మే సాయ్: వైల్డ్‌బోర్స్ సాకర్ జట్టుకు చెందిన 12 మంది పిల్లలు, కోచ్ చిక్కుకుపోయిన తామ్ లువాంగ్ గుహలో సహాయక చర్యలు చేపట్టిన ప్రాంతాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు చియాంగ్‌రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్‌సక్ తెలిపారు. ఈ ప్రాంతం త్వరలోనే థాయ్‌లాండ్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా నిపుణులు వాడిన పరికరాలు, డైవింగ్ సూట్లు, యంత్రాలను సందర్శనకు ఉంచనున్నట్లు నరోంగ్‌సక్ తెలిపారు. ఇక్కడ అమర్చిన భారీ పైపుల్ని, యంత్రాలను దాదాపు 50 మంది సిబ్బంది తొలగిస్తున్నారని, ఈ పనులు ఆదివారం వరకూ కొనసాగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం గుహలో నీటి ప్రవాహం పెరుగుతున్నందున లోపల యంత్రాలు ఉన్నప్పటికీ ఎవ్వరినీ అనుమతించడం లేదన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డైవర్, అనస్థీషియా నిపుణుడు రిచర్డ్ హారిస్ లేకుంటే ఈ మిషన్ విజయవంతం అయ్యేది కాదన్నారు. గుహలో 13 మంది సజీవంగా ఉన్నట్లు మొట్టమొదట గుర్తించిన బ్రిటిష్ డైవర్ జాన్ వాలంథెన్కు థాయ్ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. స్వదేశానికి వెళ్లేందుకు జాన్ బుధవారం సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడి ప్రజలందరూ లేచినిల్చుని కరతాళ ధ్వనులతో ఆయన్ను సాగనంపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లు, నిపుణుల్ని కీర్తిస్తూ పలు స్థానిక పత్రికలు కథనాలను ప్రచురించాయి. జూన్ 23న తామ్ లువాంగ్ గుహలోకి వెళ్లిన 13 మంది నీటి ప్రవాహం కారణంగా లోపల చిక్కుకున్నారు. చివర్లో తప్పిన పెనుముప్పు.. తామ్ లువాంగ్ గుహలో సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లు చివరి నిమిషంలో పెనుప్రమాదాన్ని ఎదుర్కొన్నారని థాయ్ నేవీ సీల్స్ సీనియర్ కమాండర్ ఒకరు తెలిపారు. గుహలో చివరి విద్యార్థి, కోచ్‌లను బయటకు తీసుకురాగానే నీటిని బయటకు పంపింగ్ చేసే యంత్రాలు ఆగిపోయాయి. ఆ సమయంలో గుహలో దాదాపు 20 మంది డైవర్లున్నారు. చివరికి పరిస్థితి చేయిదాటకముందే డైవర్లందరూ సురక్షితంగా బయటకు రాగలిగారని పేర్కొన్నారు. తామ్ లువాంగ్ ఘటన ఆధారంగా సినిమా తీస్తామని ‘ప్యూర్ ఫ్లిక్స్’ సంస్థ భాగస్వామి మైఖేల్ స్కాట్ ఇప్పటికే ప్రకటించారు. -
ఘల్లు ఘల్లు... ఓరుగల్లు
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రారంభమైన లోక్ జన్ ప్రథ ఉత్సవాలు అలరించిన వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లును దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతోందని రాష్ట్ర పర్యాటకశాఖ గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, న్యూఢిల్లీలోని సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న లోక్ జన ప్రథ ఉత్సవాలు హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి చందూలాల్ మాట్లాడుతూ గతంలో సమైక్య రాష్ట్రంలో పర్యాటకానికి తగిన వనరులు లేవని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా చోట్ల వనరులు కల్పిస్తున్నామని అన్నారు. ఈ మేరకు లోక్ జన ప్రథ ఉత్సవాల్లో తొమ్మిది రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటుచేశామని తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఓరుగల్లులో ఇప్పటి వరకు సంగీతనాటక అకాడమీ ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదని.. తెలంగాణ ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ కళాకారులందరూ తెలంగాణ రావాలని కోరుకున్నారని.. రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ కళాకారులకు గౌరవప్రదమైన స్థానం ఇస్తున్నారని అన్నా రు. వరంగల్‌లో మొదటిసారి కైట్ ఫెస్టివల్ జరిగిందని పద్మాక్షి గుట్ట వద్ద ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం నిర్మించనున్నామని వివరించారు. ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకళాకారుల ప్రదర్శనను చూసేందుకు మంచి అవకాశం లభించిందని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ఓరుగల్లు కళలకు పుట్టినిల్లని అన్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమి అధికారి సంజయ్‌కుమార్, డీఆర్వో శోభ, సమాచారశాఖ డీడీ డీఎస్.జగన్ పాల్గొనగా.. డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్, డాక్టర్ చుక్కా సత్తయ్యను ఘనంగా సన్మానించారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. లోక్ జన ప్రథ ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జానపద గిరిజన కళాకారులు అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించారు. అదిలాబాద్ జిల్లా ఇచోడ మండలం దూపర్పేట గ్రామానికి చెందిన తోటి గిరిజన కళాకారులు సీహెచ్. కృష్ణారావు æబృందం తమ కిక్రి, కుజ్జా, డాకి వాయిద్యాలతో గొండులు తమ ఇష్టదేవతలు భావించే పాండవుల కథను పాడి వినిపించారు, మహారాష్ట్ర లోని సాంగ్లి ప్రాంతానికి చెందిన వీరప్ప దేవుని కొలిచే శ్రీగిరిదేవ్మ గజనృత్య నవయువక మండల్ వారు అనిల్ కొలేకర్ అధ్వర్యంలో గొడుగులతో జండాలతో ధన్గరిగాజ ప్రదర్శన ఇచ్చారు. ఒరి స్సాలోని గంజాం ప్రాంతానికి చెందిన సబర్ గిరిజనులు 200 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన తమ అమ్మవారిని స్వాగతిస్తూ చడ్డేయ ప్రదర్శనతో ఉర్రూతలూగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పాడేరు నుండి వచ్చిన భగత గిరిజన కళాకారులు మోహన్ రావు బృందం థింస్సా స్త్రీల నృత్యంతో ఆకట్టుకున్నారు. జనగామ జిల్లాకు చెందిన గడ్డం శ్రీనివాస్ బృందం చిందుయక్షగాన ప్రదర్శన, భూపాలపల్లి జిల్లా కర్కపలికి చెందిన తాట సమ్మక్క బృందం కోలాటం నృత్యం అలరించాయి. -
పర్యాటక కేంద్రంగా అల్లూరి నివాసం
క్షత్రియ సేవా సమితి డిమాండ్ హైదరాబాద్: స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఇంటిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ కేవీఎల్ఎన్ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న అల్లూరి ఇంటిని పునర్ నిర్మించాలన్నారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ హైదరాబాద్‌లో అల్లూరి స్మృతి వనం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలసి కోరతామన్నారు. సమావేశంలో క్షత్రియ సేవా సమితి ఉపాధ్యక్షులు బీహెచ్ సత్యనారాయణ రాజు, కార్యదర్శి ఎం.పెద్దిరెడ్డి, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏడుపాయల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాపన్నపేట: ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా...ఆధ్యాత్మిక నిలయంగా మారుస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆమె హైదరాబాద్ - ఏడుపాయల బస్సును ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. ఏడుపాయల అభివృద్ధికోసం ఇప్పటికే ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అందుకనుగుణంగా పనులు ప్రారంభించినట్లు చెప్పారు. రోడ్డు వెడల్పు కోసం పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఏడుపాయల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కాటేజీలు నిర్మిస్తామన్నారు. ఘనపురం ఆనకట్టను అభివృద్ధి చేసి పర్యటన క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. స్నానఘాట్లు ఏర్పాటు చేస్తామని, హోమశాల నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మెదక్ జిల్లాలో తాగునీటికోసం మూడు గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు, ఆహారభద్రత కార్డులు అందజేయనున్నట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పింఛన్ల పంపిణీ ఏడుపాయల దుర్గమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మిన్పూర్లో తాగునీటి పథకానికి శంకుస్థాపన, తమ్మాయిపల్లిలో పింఛన్ల పంపిణీ, చీకోడ్, కొంపల్లి, రాంతీర్థం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్న, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్, కోకన్వీనర్, ఆశయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకట్రాములు, విజయలక్ష్మి , ప్రతాప్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఈఓ వెంకట కిషన్‌రావు, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, మంగ రమేష్, చింతల నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా భువనగిరి
భువనగిరి :ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భువనగిరి ఖిలాను పర్యాటక కేంద్రంగా త్వరలో ప్రారంభించనున్నట్లు ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి స్థానిక ఖిలా వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ చిరంజీవులుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి, యాదగిరిగుట్ట, కొలనుపాకలను కలుపుతూ పర్యాటక సర్కిల్‌గా తీర్చిదిద్దడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. భువనగిరి ఖిలాను అభివృద్ధి చేయడంలో భాగంగా ముందుగా రోప్‌వే నిర్మాణంతోపాటు ఖిలాపై పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ప్రాంతం హైదరాబాద్‌కు చేరువలో ఉన్నందున పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. రోజూ వెయ్యిమంది పర్యాటకులు వస్తారని చె ప్పారు. భువనగిరి డివిజన్లో పర్యాటక రంగం అభివృద్ధికి కలెక్టర్ చిరంజీవులు ప్రత్యేక చొరవ చూపాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలతోపాటు ఆదాయం పెరుగుతుందన్నారు. మన దేశ జాతీయాదాయంలో 7 శాతం పర్యాటక రంగం నుంచి వస్తుందన్నారు. వచ్చే పర్యాటక దినోత్సవం నాటికి రోప్‌వే పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా స్థానికులకు ఆదాయం పెరుగుతుందని చెప్పా రు. ఆర్డీఓ నూతి మధుసూదన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు వేముల భాగ్యవతి, ఎండీ నా సర్, పడమటి జగన్మోహన్రెడ్డి, పీఎస్. మంజుల, లతాశ్రీ ఉన్నారు. కాగా విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. -
పోచంపల్లి పర్యాటక కేంద్రం అభివృద్ధికి కృషి
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి పర్యాటక కేంద్రం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక అధికారి జి.కిషన్‌రావు తెలిపారు. గురువారం ఆయన పోచంపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ టూరిజం శాఖ, ఇండియన్ ట్రస్ట్ ఫర్ రూరల్ హెరిటేజ్ డెవలప్మెంట్(ఐటీఆర్హెడ్డీ) సంయుక్త భాగస్వామ్యంతోనే పోచంపల్లి గ్రామీణ టూరిజం పార్క్‌ను ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రత్యేక గుర్తింపు(ఐడియల్ డెస్టినేషన్ సెంటర్) తెచ్చేందుకు పాటుపడుతున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి శని, ఆదివారాలు పోచంపల్లికి విదేశీయులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విదేశీయులను ఆకర్షించేలా పోచంపల్లిలో చేనేత, చేతి వృత్తులతో పాటు గ్రామీణ వంటకాలు, చెరువులో బోటింగ్, లేజర్ షో, తెలంగాణ కళలు, గిరిజన నృత్యాలు, గ్రామీణ ప్రజల ఆచారాలు వారికి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అలాగే పోచంపల్లి, యాదగిరిగుట్ట, కొలనుపాకలను కలిపి టూరిజం క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి టూరిజం బస్సులు నడిపేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే సూరజ్ కుంభమేళాలో మొట్టమొదటి సారిగా తెలంగాణ థీమ్స్ స్టేట్ పేరిట చేనేత ఎగ్జిబిషన్ ఏర్పా టు చేస్తున్నామని పేర్కొన్నారు. జూలై మాసంలో ఫ్రాన్స్‌లో కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో టూరిజం శాఖను అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతానని చెప్పారు. ప్రజలు కూడా పర్యాటక శాఖకు సహకారం అందించాలని కోరారు. అనంతరం జిల్లా పర్యాటక శాఖ అధికారి మహీధర్ మాట్లాడుతూ మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా జిల్లా ప్రణాళికలో పోచంపల్లి టూరిజం పార్క్‌లో చేనేత ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ హెరిటేజ్ అసోసియేషన్ ఫర్ రూరల్ టూరిజం అంబాసిడర్ యమునా పాఠక్, పర్యాటక శాఖ ఆర్ఎం సత్యకుమార్‌రెడ్డి, పోచంపల్లి పర్యాటక కేంద్రం ఇన్చార్జ్ అంజనేయులు తదితరులు ఉన్నారు. -
పర్యాటక కేంద్రంగా టౌన్‌హాల్
సాక్షి, న్యూఢిల్లీ: చాందినీ చౌక్‌లోని చారిత్రాత్మక టౌన్‌హాల్ రూపురేఖలు మారనున్నాయి. దీన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలనే ప్రాథమిక ప్రతిపాదనను ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) సోమవారం ఆమోదించింది. టౌన్‌హాల్‌ను ఢి ల్లీ చరిత్ర, సంస్కృతిలకు అద్దంపట్టే సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా మార్చాలని ఎన్డీఎంసీ యోచిస్తోంది. సకుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా టౌన్‌హాల్‌ను తీర్చిదిద్దాలని, ఆ విధంగా దీనికి వైభవాన్ని తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. మొఘల్‌కాలం నాటి కళాకృతులు, ఆభరణాలు, దుస్తులు, ఆయుధాల ప్రదర్శనకు ఉంచేలా మ్యూజియం ఏర్పాటు, గ్రంథాలయంతో పాటు పిల్లల కోసం రకరకాల సృజనాత్మక కార్యకలాపాలతో కూడిన యాక్టివిటీ రూములు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియం, లైట్ అండ్ సౌండ్ షోలు, రెస్టారెంట్లతో టౌన్ హాల్‌ను పర్యాటక ఆకర్షక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళిక రూపొంది స్తోంది. సందర్శకులకు మ్యూజియంలో ప్రదర్శించే దుస్తులు, ఆభరణాలు నచ్చితే వాటి నకళ్లను తయారుచేయించుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. టౌన్‌హాల్ గ్రౌండ్ ఫ్లోర్లో మ్యూజియం, పిల్లల కోసం యూక్టివిటీ రూములు, బొటీక్ షాపులు మొదలైనవి ఉంటాయి. మొదటి అంతస్తులో నాలుగు రెస్టారెంట్లు ఉంటాయి. టౌన్‌హాల్ పునరాభివృద్ధికి 50 కోట్లు వ్యయమవుతుందని ఎన్డీఎంసీ అధికారులు అంచనా వేశారు. టౌన్‌హాల్ చరిత్ర సిపాయిల తిరుగుబాటు తర్వాత షాజహానాబాద్లో బ్రిటిష్‌వారు నిర్మించిన తొలి కట్టడాలలో టౌన్‌హాల్ ఒకటి. ఢిల్లీ మున్సిపల్ అధికారులు దీనిని ఏ గ్రేడ్ వారసత్వ క ట్టడాల జాబితాలో చేర్చి సంరక్షిస్తున్నారు. టౌన్‌హాల్ నిర్మాణానికి పూర్వం ఇక్కడ బేగమ్కీ సరాయ్, బేగమ్ కీ బాగ్ ఉండేవి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ పెద్ద కుమార్తె జహనారా బేగమ్ ఇక్కడ ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు. దీనిని బేగమ్కీ బాగ్ 1857 తిరుగుబాటు తర్వాత ఈ ఉద్యానవనాన్ని, సరాయ్‌ని తొలగించి 1860లో టౌన్‌హాల్‌ను నిర్మించారు. జహనారా ఏర్పాటుచేసిన ఉద్యానవనం స్థానంలో కొత్త ఉద్యానవనాన్ని రూపొందించారు. అంతకుముందు కం పెనీ బాగ్గా పిలిచిన ఉద్యానవనాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆజాద్ పార్క్‌గా పిలుస్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సివిక్ సెంటర్‌కు తరలించేంత వరకు టౌన్‌హాల్ ఎమ్సీడీ ప్రధాన కార్యాలయంగా ఉండేది. -
పర్యాటక కేంద్రంగా ‘కందకుర్తి’
కందకుర్తి(రెంజల్), న్యూస్‌లైన్: కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా పర్యాటక శాఖ అధికారి భిక్షు నాయక్ అన్నారు. శనివారం సీఎంఓ స్వర్ణలతతో కలిసి ఆయన రెంజల్ మండలంలోని కందకుర్తిని సందర్శించారు. ఇటీవల రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పుష్కర క్షేత్రాన్ని పరిశీలించారని అన్నారు. మంత్రి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. పర్యాటక స్థలాల అభివృద్ధికి నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. క్షేత్రాన్ని పరిశీలించిన అధికారులు గోదావరి నదిలో నెల రోజుల్లో బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. నదీ స్నానాలకు వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వంట గదులు, విశ్రాంతి గదులు, మూత్ర శాలులు, తాగు నీటి ట్యాంకులు నిర్మాణం చేపడతామని వివరించారు. వంటలపై అసంతృప్తి కందకుర్తి నుంచి రెంజల్‌లోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అధికారులు తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యలో బాలికలు వెనుకబడి ఉన్నట్లు గుర్తించిన అధికారులు సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలను సొంత కుటుంబ సభ్యులుగా చూడాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ తీరు మార్చుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. అలీసాగర్,అశోక్‌సాగర్ సందర్శన ఎడపల్లి(ఠాణాకలాన్): మండలంలోని అలీసాగర్ ఉద్యానవనాన్ని శనివారం జిల్లా పర్యాటక శాఖ అధికారి భిక్షు నా యక్ సందర్శించారు. గుట్ట పైభాగాన సుమారు 52 ఎకరాల స్థ లంలో నిర్మించనున్న పెలైట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను, స రిహద్దులను అడిగి తెలుసుకున్నారు. భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డు లను పరిశీలించారు. అనంతరం అశోక్‌సాగర్ ఉద్యానవనాన్ని ఆయన సందర్శించారు. ఉద్యాన వనానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.