ముంబై: పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త తాను కట్టుకున్న భార్యను సుత్తితో కొట్టి చంపి, తాను ఉరేసుకుని చనిపోయిన దారుణ ఘటన ముంబై శివార్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేశ్ బీజ్ ముంబైలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ఇతనికి ప్రీతితో పెళ్లయింది. ఇంత కాలమైనా పిల్లలు లేరని భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
బుధవారం సాయంత్రం వీరి ఇంటికి వచ్చిన కొంతమంది బంధువులు తలుపులు మూసి ఉండటంతో తలుపు తట్టారు. ఎంతకూ తెరవకపోవడంతో తలుపులు తెరిచి లోపలి వెళ్లగా.. కిందపడి చనిపోయి ఉన్న ప్రీతిని చూసి షాకయ్యారు. ఆమె పక్కనే భర్త కూడా ఫ్యాన్ కు ఉరేసుకుని ఉండటం చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు.
ప్రీతి తలపై సుత్తితో బలంగా మోది, ఆమె చేతి నరాలు తెంచినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులకు చెప్పారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్షలో ఆమె తలపై సుత్తితో బలంగా మోదినట్లు రిపోర్టులు వచ్చాయని చెప్పారు. సురేశ్ ఉరేసుకుని చనిపోయినట్లు రిపోర్టుల్లో ఉందని తెలిపారు. రిపోర్టుల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
పిల్లలు లేరని.. భార్య తలపై సుత్తితో మోది..
Published Thu, Jun 30 2016 11:42 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement