fertility
-
దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా?
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరొందిన భారత్ గత కొన్ని దశాబ్దాలుగా జనాభా పెరుగుదల విషయంలో గణనీయమైన మార్పులను చూసింది. నవంబర్ 2024 నాటికి దేశ జనాభా 145.56 కోట్లుగా ఉంది. ఈ సంఖ్య చైనాను అధిగమించింది. అయినప్పటికీ సంతానోత్పత్తి రేటులో చెప్పుకోదగిన క్షీణతను ఎదుర్కొంటోంది. ఈ ధోరణి భవిష్యత్తులో దేశానికి సానుకూల, ప్రతికూల పరిణామాలను తెచ్చిపెట్టనున్నదని నిపుణులు చెబుతున్నారు.రెండు శాతానికన్నా దిగువకు..1950లో దాదాపు 250 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు చేరుకుంది. పెరుగుతున్న ప్రపంచ జనాభా మంచిదా? కాదా అనే చర్చ ఒకవైపు జరగుతుండగా, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం 1950లో ఒక మహిళకు 6.2 మంది పిల్లలు ఉన్న భారతదేశంలో ఇప్పుడు సంతానోత్పత్తి రేటు రెండు శాతానికన్నా తక్కువకు పడిపోయింది. ఇదే ధోరణి భవిష్యత్‌లో కొనసాగితే భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2050 నాటికి 1.3 శాతానికి పడిపోనుంది.ఒకవైపు సవాళ్లు.. మరోవైపు అవకాశాలు2050 నాటికి ప్రపంచ సంతానోత్పత్తి రేటు 1.8 శాతానికి తగ్గుతుందని, అది 2100 నాటికి అది 1.6 శాతానికి తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ క్షీణత భారతదేశంతో పాటు పలు దేశాలకు ఒకవైపు సవాళ్లను, మరోవైపు అవకాశాలను అందిస్తుంది. 2021లో భారత్‌లో సుమారుగా రెండు కోట్ల మంది పిల్లలు జన్మించారు. 2050 నాటికి ఈ సంఖ్య కేవలం 1.3 కోట్లకు తగ్గుతుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రాబోయే కాలంలో సంతానోత్పత్తి రేటులో క్షీణతను చవిచూడనున్నాయి.కారణాలివే..దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం వెనుక అనేక కారణాలున్నాయి. ఆలస్యంగా వివాహాలు జరగడం, ఉన్నత విద్యావకాశాలు పెరగడం, కుటుంబ నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణను పాటిస్టున్నారు. ఈ పోకడలు భవిష్యత్‌లో కొనసాగి, కొన్ని దశాబ్దాల్లోనే దేశ జనాభా గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి.జీవన నాణ్యత కోణంలో మేలుసంతానోత్పత్తి రేటు క్షీణించడాన్ని ఒక సవాలుగా భావించినప్పటికీ, దీనివలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వనరుల నిర్వహణ, జీవన నాణ్యత కోణంలో మేలు జరగనుంది. ఆహారం, నీరు, ఇంధన శక్తి తదితర వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు తక్కువ పిల్లలను కలిగి ఉన్న మహిళలు సగటున ఎక్కువ కాలం జీవిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నియంత్రిత జనాభా దేశంలో దీర్ఘకాలికంగా మరింత స్థిరమైన వృద్ధిని సృష్టిస్తుంది.సామాజిక భద్రతా వ్యవస్థలపై ఒత్తిడిసంతానోత్పత్తి రేటు పడిపోతున్న దశలో సమాజంలో యువత నిష్పత్తి తగ్గుతుంది. వృద్ధుల జనాభా పెరుగుతుంది. ఫలితంగా కార్మిక మార్కెట్లో అసమతుల్యత, సామాజిక భద్రతా వ్యవస్థలపై ఒత్తిడి ఏర్పడుతుంది. భారతదేశంలో 0-14 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా ఇప్పటికే క్షీణిస్తూ వస్తోంది. ఇది 2001లో 36.4 కోట్ల నుండి 2024 నాటికి 34 కోట్లకు చేరుకుంది. ఇదేసమయంలో 60 అంతకంటే అధిక వయసు కలిగినవారి సంఖ్య 1991లో 6.1 కోట్ల నుండి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇది 2024 నాటికి 15 కోట్లుగా అంచనాలున్నాయి. పెరుగుతున్న వృద్ధాప్య జనాభా సామాజికంగా గణనీయమైన సవాళ్లను తెచ్చిపెడుతుంది.విస్తృత ప్రపంచ ధోరణిలో భాగంసంతానోత్పత్తి రేటు క్షీణత అనేది భారతదేశానికి మాత్రమే కాదు.. ఇది విస్తృత ప్రపంచ ధోరణిలో భాగం. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్నందున శ్రామికశక్తి, వృద్ధాప్య జనాభా మరిన్ని సవాళ్లను తెచ్చిపెడుతోంది. దీంతో తక్కువ ఆదాయ వనరులు కలిగిన దేశాలలో పరిస్థితి మరింత క్షిష్టంగా మారనుంది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు క్షీణత అటు అవకాశాలను, ఇటు సవాళ్లు రెండింటినీ అందించనుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లాంటి లక్ష్య వ్యూహాలతో ప్రభుత్వాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట -
జనాభా పెరుగుతోంది...కానీ సంతానోత్పత్తి రేటు పడిపోతోంది!
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా జనభా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుత (2024 నాటికి) ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది బిలియన్లుగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడి పోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే జనాభా పెరుగుదల తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, పెరుగుతూనే ఉంది. వార్షిక జనాభా వృద్ధి రేటు కాలక్రమేణా క్షీణిస్తూ వస్తోంది. 20వ శతాబ్దం మధ్యలో ఇది దాదాపు 2 శాతంగా ఉండగా ఇదిపుడు ఒక శాతానికి పడిపోయింది.. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం , మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి వాటిని కారణాలుగా చెబుతున్నప్పటికీ, సంతానోత్పత్తి రేటు తగ్గడం కొంత ఆందోళన కలిగించే విషయంగతంలో జనన , మరణాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా జనాభా పెరుగుదల నెమ్మదించింది. ప్రచార అవగాహన, అభివృద్ధి నేపథ్యంలో జనన రేట్లు తగ్గాయి. అలాగే శిశుమరణాల రేటు కూడా తగ్గింది.ఆయుర్దాయం పెరగడం , జననాల రేటు తగ్గడం వల్ల, అనేక దేశాల్లో యువకుల సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల నిష్పత్తి పెరుగుతోంది. ఇది ఆరోగ్య సంరక్షణ , సామాజిక వ్యవస్థలకు సవాళ్లను విసురుతోంది.పాపులేషన్ పిరమిడ్ (నిర్దిష్ట జనాభా వయస్సు ,లింగ కూర్పుతో ఏడిన గ్రాఫ్). అభివృద్ధి చెందిన దేశాలలో సమతుల్యాన్ని సూచిస్తూ దీర్ఘచతురస్రాకారంగా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువ ఉంటోంది. అందుకే ఇక్కడి పాపులేషన్ పిరమిడ్ , పిరమిడ్ ఆకారంలో ఉంటోంది.ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ కూడా బాగా పెరింది. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 68 శాతం మంది నగరాల్లో నివరసిస్తారని అంచనా. పట్టణీకరణ మౌలిక సదుపాయాలు, పర్యావరణం, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.అధిక జనాభా ఆందోళనలు: ప్రపంచ జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, అధిక జనాభా గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. వనరుల కొరత, పర్యావరణ క్షీణత , అవస్థాపనపై ఒత్తిడి క్లిష్టమైన సమస్యలని మరి కొందరు వాదిస్తున్నారు. సంతానోత్పత్తి రేటు2021లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటు 1 (TFR) అంటే ఒక మహిళకు 2.3 మంది పిల్లలున్నారు. ఇదే 1965లో 5.1గా ఉంటే, 1970లో 4.8, 1980లో 3.7, 1990లో 3.3గా ఉండి 2000లో 2.8కి పడిపోయింది. 2000లో వేగం తగ్గింది. 2000-15 మధ్య 5 సంవత్సరాల సగటు 0.07తో పోలిస్తే, 2015- 2020 మధ్య ఒక్కో మహిళకు 0.17 మంది పిల్లలు తగ్గారు.ఇటీవలి లాన్సెట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లోనూ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని, సంతానోత్పత్తి రేటు పడిపోతుందటమే దీనికి కారణం. అలాగే దేశంలో 1950లో 6.18గా సంతానోత్పత్తి రేటు, 2021నాటికి అది 2 కంటే దిగువకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, 2100నాటికి 1.04కు పడిపోవచ్చని కూడా హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వెరసి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సంతానోత్పత్తి రేటులో తగ్గుదల.. ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ఆసియాలో సంతానోత్పత్తి రేట్లుప్రతి స్త్రీకి 0.9 పిల్లలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. 1.0 వద్ద ప్యూర్టో రికో , మాల్టా, సింగపూర్ ,హాంగ్‌కాంగ్‌లో ఒక్కో మహిళకు 1.1 చొప్పున పిల్లలున్నారు.ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, చైనా (1.7) ,భారతదేశం (2.2) సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. ఈ రెండు గణాంకాలు ఈ దేశాలలో పునరుత్పత్తికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు, సాంస్కృతిక అంచనాల ద్వారా ప్రభావితమవుతాయి. ఉదాహరణకు చైనా సుమారు 1980 - 2016 వరకు ఒకటే బిడ్డ విధానాన్ని" కొనసాగించింది, అయితే ఆగస్టు 2021లో వివాహిత జంటలు ముగ్గురు పిల్లలను కలిగి ఉండవచ్చని అధికారికంగా ఒక చట్టాన్నిఆమోదించింది. ఇండియాలో కూడా అనధికారంగా చాలామంది జంటలు వన్ ఆర్ నన్ పద్ధతినే అవలంబిస్తుండటం గమనార్హం. -
మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా?
చలికాలం వచ్చినా లేదా కొందరి మగవాళ్లకు వేడినీటితోనే స్నానం చేయడం నచ్చుతుంది. అంతేగాదు కొందరికి అలా వేడినీటితో స్నానం చేస్తే హాయిగా రిలీఫ్ ఉంటుంది. నిద్ర కూడా గమ్మున పడుతుందన్న భావన కూడా ఎక్కువ. ముఖ్యంగా మగవాళ్లు రోజంతా బయట తిరిగి అలసటతో ఇంటికి వస్తారు కాబట్టి.. కాసేపు అలా వేడినీటితో స్నానం చేస్తే ప్రాణం హాయిగా ఉన్నట్లు ఫీలవ్వుతారు. కానీ ఇలా ఎట్టి పరిస్థితుల్లో చెయొద్దని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పైగా రోజూ మగవాళ్లు వేడినీటి స్నానాలు చేయకపోవడమే మంచిదని చెబతున్నారు. ఎందుకని? రీజన్ ఏంటీ? వేడినీటి స్నానం ఇష్టపడే పురుషులకు సంతానోత్పత్తి అవకాశాలను తక్కువగా ఉంటుందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దీని కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడం లేదా వాటి నాణ్యత తగ్గి సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తోందని చెప్పారు. వారానికి కనీసం 30 నిమిషాల పాటు అధిక ఉష్ణోగ్రతతో కూడిన నీటితో స్నానం చేసిన పురుషుల వీర్యాన్ని నమనాలను పరీక్షించగా..వాటి చలనశీలత రేటు పేలవంగా ఉండటమే గాక తక్కువ స్పెర్మ్ ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు యూనివిర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా యూరాలజిస్ట్లు సంతోనోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న పురుషులు వేడినీటితో ఎక్కువగా స్నానం చేయడం కారణంగానే ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నిర్థారించారు. ఇదేలా స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందంటే.. పరిశోధనల్లో ఉష్ణోగ్రత, టెస్టోస్టెరాన్, వృషణాలు, స్క్రోటమ్తో బంధన సంబధాన్ని కలిగి ఉంటుందని తేలింది. బాహ్యంగా ఉండే వృషణాలు సుమారు 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు సెర్మ్ , ఇతర హార్మోనలను విడుదల చేయగలదు. అయితే శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలోనే ఈ వృషణాల్లోని జెర్మ్ కణాలు ఉంటాయి. కాబట్టి కొద్ది మోతాదులోని ఉష్ణోగ్రత పెరుగుదలే స్పెర్మ్, టెస్టోస్టెరాన్‌ల రెండింటిపే గణనీయమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎప్పుడైతే అధిక వేడికి వృషణాలు గురవ్వుతాయో అప్పుడూ..డీఎన్ఏ నిర్మాణం, స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం చూపి వాటి పరిమాణాలలో అసాధారణతలకు దారితీస్తుంది. దీంతో స్పెర్మ్ సమర్థవంతంగా కదలక ఫలదీకరణం చెందించలేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ ఫలదీకరణం చెంది గర్భం దాల్చినా..పుట్టబోయే సంతానంలో జన్యుపరమైన లోపాలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అందువల్లో వేడినీటితో పదే పదే స్నానం చేయడం మగవాళ్లలోని వృషణాలపై అధిక ప్రభావం చూపి సంతానోత్పత్తి సమస్యను ఎదుర్కొనాల్సి ఉంటుందని అన్నారు. అంతేగాదు మగవాళ్లలోని వంధ్యత్వం అనే సమస్యకు పూర్తిస్థాయిలో చికిత్స లేనప్పటికీ ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు మార్గాలు మాత్రం ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వాటిలో కొన్ని.. క్రమం తప్పకుండా వ్యాయామం విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేయాలి. ఒత్తిడి మీ లైంగిక సామర్థ్యంపై అధికంగా ప్రభాం చూపిస్తుంది కాబట్టి సాధ్యమైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. జింక్ ఉండే మాంసం, చేపలు, గుడ్లు, షెల్ఫిష్ వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను , స్పెర్మ్ కౌంట్ పెంచే జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలి. అధిక బరువు కూడా వంధ్యత్వానికి ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు వైద్యులు మద్యం, సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. తదితర జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించగలరిని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: అక్కినేని ఫ్యామిలీ కిచెన్ గార్డెన్..వాళ్ల గ్లామర్ రహస్యం ఇదేనా!) -
దక్షిణ కొరియాకు కొత్త భయం
సరిహద్దుల్లో ఉత్తర కొరియా కవ్వింపు చర్యలతో సతమతమయ్యే దక్షిణ కొరియాకు కొత్త భయం పొంచి ఉంది!. అయితే అది బయటి నుంచి కాదు. దేశ అంతర్గత సమస్య కావటం గమనార్హం. దక్షిణ కొరియాలో జననాల రేటు క్షీణిస్తోంది. సంతానోత్పత్తి తగ్గుదల భవిష్యత్తులో దేశ జనాభా క్షీణించడంలో తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది. తాజా గణాంకాల ప్రకారం సగటు జననాల రేటు 0.72గా నమోదైంది. ఈ తగ్గుదల ఇలాగే 2025 వరకు కొనసాగితే 0.65గా నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకంతకు తగ్గుతున్న సంతానోత్పత్తి ఇలాగే కొనసాగితే దక్షిణ కొరియా జనాభా విషయంలో మరిన్ని ఇబ్బందలు ఎదుర్కోనుంది. ఇక 2022 ఏడాదిలో ప్రపంచంలో అతి అక్కువ సంతానోత్పత్తి 0.78 శాతంగా నమోదు చేసుకున్న దేశం దక్షిణ కొరియా కావడం గమనార్హం. దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గుదల.. ఆ దేశ అర్థిక వ్యవస్థ, శ్రాకమిక శక్తి, ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపనుందని అధికారులు పేర్కొన్నారు. అదీకాక ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉన్న దక్షిణ కొరియా.. సైనిక, రక్షణ రంగంలో కూడా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. జనాభా పరంగా చూసుకుంటే 2024లో 36.2 మిలియన్ల నమోదు కానుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జనాభా 51.7తో పోల్చుకుంటే దాదాపు 30 శాతం తగ్గుదల నమోదు కానున్నట్లు అంచనా. డిసెంబర్ నెల ప్రారంభంలో దక్షిణ కొరియా ఆర్థిక మంత్రి నామినీ చోయ్ సాంగ్ మాక్ దేశంలో జననాల రేటు క్షీణించడాన్ని ఓ ప్రమాదంగా పేర్కొన్నారు. చర్యలు చేపట్టడంలో చాలా ఆలస్యం జరిగిపోయిందని అన్నారు. చదవండి: హమాస్‌పై యుద్ధం: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక సూచన -
70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్దురాలు
సాధారణంగా 35-40 ఏళ్లు దాటితేనే ప్రెగ్నెన్సీ కష్టమనుకుంటున్న రోజుల్లో 70 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది.ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ వయసు 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. నముక్వాయా 1992లో భర్తను కోల్పోయింది. దీంతో నాలుగేళ్లకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సుమారు 20 ఏళ్లకు సఫీనా ఐవీఎఫ్ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన వెంటనే చనిపోవడంతో సఫీనా చాలా కుంగిపోయింది. దీంతో తల్లి కావలన్నా తన కోరికను 70 ఏళ్ల వయసులో తీర్చుకుంది. రెండోసారి కూడా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఆమె కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు పాప కాగా, మరొకరు బాబు ఉన్నారు. ప్రస్తుతం తల్లితో సహా పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది. A 70-year-old woman has given birth to twins following IVF treatment, a hospital in Uganda has said. Safina Namukwaya delivered a boy and a girl via caesarean at a fertility centre in the capital, Kampala. pic.twitter.com/XjGBgbkGPV — The Instigator (@Am_Blujay) December 1, 2023 -
300 ఏళ్లలో 200 కోట్లకు!
జన విస్ఫోటనంతో ప్రపంచమంతా అల్లాడుతోంది. గతేడాది ఈ సమయానికే ప్రపంచ జనాభా 800 కోట్లు దాటేసింది. అదే ఊపులో మరో 30 నుంచి 50 ఏళ్లలోపే ఏకంగా వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. మరి ఆ తర్వాత? అలా పెరుగుతూనే పోతుందా? పెరగకపోగా, బాగా తగ్గుముఖం పడుతుందట. ఎంతగా అంటే, ఓ 300 ఏళ్ల తర్వాత ప్రపంచ జనాభా మొత్తం కలిపి 200 కోట్లకు పరిమితమైపోతుందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది! ఇంకా మాట్లాడితే అంతకంటే భారీగా తగ్గినా ఆశ్చర్యం లేదంటోంది. కారణమేమిటో తెలుసా? ప్రాకృతిక విపత్తులనుకుంటున్నారా? కాదు. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు శరవేగంగా తగ్గిపోతుండటమే! ఈ జాబితాలోని దేశాల్లో భారత్ కూడా ముందు వరుసలో ఉండటం విశేషం... గత 200 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతూ వచి్చంది. ముఖ్యంగా 1950లో 250 కోట్లకు అటూ ఇటుగా ఉన్నది కాస్తా ఈ 70 ఏళ్లలో ఏకంగా మూడింతలైందన్నది ఐరాస అంచనా! మరి మున్ముందు జనాభా పెరుగుదల తీరుతెన్నులు ఎలా ఉండొచ్చు? ఈ ఆసక్తికర అంశంపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త డీన్ స్పియర్స్ లోతైన అధ్యయనం చేశారు. జనాభా ఊహాతీతంగా తగ్గిపోవడం ఖాయమని తేల్చారు. ‘‘2080 నుంచే ఈ ధోరణి మొదలవుతుంది. క్రమంగా ఊపందుకుంటుంది. అలా మరో 300 ఏళ్లలోపే ప్రపంచ జనాభా 200 కోట్లకు పరిమితమైపోతుంది. ఇంకా మాట్లాడితే అంతకంటే కూడా తగ్గుతుంది’’ అని బల్ల గుద్ది చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేట్–టీఎఫ్ఆర్)లో క్రమంగా వస్తున్న నమోదవుతున్న తగ్గుదలను ఆధారంగా స్పియర్స్ ఈ నిర్ధారణకు వచ్చారు. పలు దేశాల్లో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గుముఖమే ఇందుకు రుజువని ఆయన చెబుతున్నారు. ఐరాస అంచనాలు కూడా స్పిర్స్ వాదనను బలపరిచేలానే ఉన్నాయి. 2010లో 700 కోట్లున్న ప్రపంచ జనాభా 2022లో 800 కోట్లకు చేరింది. అంటే 12 ఏళ్లు పట్టింది. కానీ 900 కోట్లకు చేరేందుకు 15 ఏళ్లు పడుతుందని ఐరాస పేర్కొంది. అంటే 100 కోట్లు పెరిగేందుకు మూడేళ్లు ఎక్కువ సమయం పట్టనుంది! ఏమిటీ టీఎఫ్ఆర్...? ప్రతి మహిళ తన పునరుత్పత్తి సామర్థ్యం ముగిసేదాకా జీవించి, ఇతరత్రా పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే కనగలిగిన పిల్లల సంఖ్యే టీఎఫ్ఆర్. జనాభాలో పెరుగుదల నమోదు కావాలంటే ఇది కనీసం 2 కంటే ఎంతో కొంత ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం గ్లోబల్ టీఎఫ్ఆర్ 2.1గా ఉంది. 2026కల్లా ఇది 2కు తగ్గుతుందని అంచనా. అక్కణ్నుంచి స్థిరంగా తగ్గుతూ 2081 నాటికి ఏకంగా 1.4కు పడిపోనుంది. భారత్ విషయమే తీసుకుంటే, 2020 నాటికి టీఎఫ్ఆర్ 2కు దిగొచ్చింది. ప్రస్తుతం 1.8కి తగ్గిందని అంచనా. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాల్లో చాలావరకు టీఆఎఫ్ఆర్ ఇప్పటికే 2 కంటే దిగువకు వచ్చేసింది. గ్లోబల్ టీఎఫ్ఆర్ మున్ముందు ఏ 1.5 దగ్గరో స్థిరపడుతుందని, అంతకంటే తగ్గదని భావించినా జనాభా నానాటికీ తగ్గడమే తప్ప పెరిగే ప్రసక్తే ఉండదన్నది స్పియర్స్ అంచనా. ఆయన అధ్యయనంలో వెల్లడైన విశేషాలు... ► ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న 29 దేశాల్లో 2022 నాటికే 20 దేశాల్లో పునరుత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 2 కంటే తగ్గింది. ►జనాభాపరంగా పెద్ద దేశాల్లో టీఎఫ్ఆర్ 2కు పైగా ఉండేవాటి సంఖ్య 2050కల్లా 3కు తగ్గుతుంది. అవి కాంగో, నైజీరియా, టాంజానియా. ►2081 నాటికి అన్ని దేశాల్లోనూ టీఆఎఫ్ఆర్ 2 కంటే తగ్గిపోతుంది. ►జననాల విషయంలో ప్రపంచంలో అగ్ర స్థానం భారత్‌దే. దేశంలో ఏటా 2 కోట్ల జననాలు నమోదవుతున్నాయి. ఈ శతాబ్దాంతానికల్లా అది ఏకంగా నాలుగో వంతుకు, అంటే 50 ►చైనాలో 85 లక్షలుగా ఉన్న వార్షిక జననాల సంఖ్య కేవలం శతాబ్దాంతానికి 12 లక్షలకు పరిమితం కానుంది. ►ఒకసారి తగ్గుముఖం పట్టాక జనాభా మళ్లీ పెరగాలంటే గ్లోబల్ టీఎఫ్ఆర్ 2 కంటే పెరగాలి. కానీ అందుకు అవకాశాలు చాలా స్వల్పం. ఎందుకంటే చరిత్రలో ఇప్పటిదాకా ఏ దేశంలోనూ అలా జరగలేదు. ►ఏ దేశంలో చూసినా ఒక్క సంతానంతోనే సరిపెట్టుకుంటున్న వారు పెరుగుతున్నారు. ►జీవన శైలి, ఆహారపుటలవాట్ల వంటి కారణాలతో పిల్లలు పుట్టని దంపతుల సంఖ్యా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో తగ్గిన పునరుత్పత్తి రేటు మన దేశంలో చూసుకుంటే 40 ఏళ్ల క్రితం కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పునరుత్పత్తి రేటు కనీసం 3 నుంచి 5 దాకా ఉండేది. ఇప్పుడది విపరీతంగా తగ్గిపోయింది. హరియాణానే తీసుకుంటే 5 నుంచి ఏకంగా 2కు తగ్గింది! ఇప్పుడు పునరుత్పత్తి రేటు 2 కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బిహార్ (3), మధ్యప్రదేశ్ (2.6), యూపీ (2.7), రాజస్థాన్ (2.4), అస్సాం (2.1) మాత్రమే. పశి్చమబెంగాల్, తమిళనాడుల్లో 1.4 శాతం, మహారాష్ట్ర , పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో 1.5, కర్ణాటకలో 1.6, ఒడిశాలో టీఎఫ్ఆర్ 1.8గా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు!
ప్రపంచం మొత్తం దాదాపు 800 కోట్ల జనాభా ఉంది. ఇందులో నాలుగోవంతు భారత్, చైనాల్లోనే నివసిస్తోంది. ప్రస్తుతం చైనా జనాభా 141.7 కోట్లు, ఇండియా జనాభా 141.2 కోట్లు. ఈ ఏడాదిలోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. చైనా జనాభా 1990 నుంచి క్రమంగా తగ్గుతోంది. భారత్ జనసంఖ్య మాత్రం 2050 వరకు పెరుగుతూ 166.8 కోట్లకు చేరుతుందని సమాచారం. 2022-2050 మధ్య 46 పేద దేశాల్లో జనాభా పెరుగుతూ ఉంటే 61 దేశాల్లో ఏటా ఒకశాతం చొప్పున తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అనేక ఐరోపా దేశాల్లో జనాభా పెరుగుదల రేటు ఇప్పటికే బాగా క్షీణించింది. మున్ముందు మరింత క్షీణిస్తుందని సమాచారం. ఇదీ చదవండి: ‘రూ.1.8 లక్షలు చెల్లిస్తే రూ.5 కోట్లు’.. సీఈఓ ఏమన్నారంటే.. ప్రపంచంలో ప్రతిసెకనుకు దాదాపు నలుగురు, అంటే ప్రతి నిమిషానికి 259 మంది శిశువులు పుడుతున్నారని కొన్నిసర్వేల ద్వారా తెలుస్తోంది. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ అండ్ సోషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం.. ఏడాదిలో కొన్ని రోజుల్లోనే అధికంగా, మరికొన్ని రోజుల్లో తక్కువగా జననాలు నమోదవుతున్నాయని తెలుస్తోంది. అందుకు సంబంధించిన సర్వే వివరాలు ఆసక్తిగా మారాయి. సర్వే ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మంది సెప్టెంబర్‌లోనే పుడుతున్నారట.. నవంబర్, డిసెంబర్, జనవరి, జులై, ఫిబ్రవరిలోని ప్రత్యేక తేదీల్లో చాలా తక్కువ జననాలు నమోదవుతున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 9న చాలా మంది, ఫిబ్రవరి 29న తక్కువ మంది పుడుతున్నారని సర్వే వివరించింది. Most & least common day to be born: 1. Sept 9 2. Sept 19 3. Sept 12 4. Sept 17 5. Sept 10 6. July 7 7. Sept 20 8. Sept 15 9. Sept 16 10. Sept 18 357. Nov 25 358. Nov 23 359. Nov 27 360. Dec 26 361. Jan 2 362. July 4 363. Dec 24 364. Jan 1 365. Dec 25 366. Feb 29 According to… — World of Statistics (@stats_feed) November 25, 2023 -
ఆశాకిరణం ఆఫ్రికా! నైజర్ మహిళ జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మ
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : 19వ శతాబ్దం ప్రారంభంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న ప్రపంచ జనాభా ఆ తరువాత ఎనిమిది రెట్లు పెరిగింది. ప్రస్తుతం భూమి మీద 800 కోట్ల మంది నివసిస్తుండగా సగం జనాభా 1975 తర్వాతే పెరిగింది. 50 ఏళ్లలో ప్రపంచ జనాభా రెట్టింపు అయింది. దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన భారత్ సంతానోత్పత్తి రేటులో ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ దశకు చేరుకోగా 2.6 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా దేశం నైజర్ సంతానోత్పత్తి రేటులో అగ్రస్థానంలో ఉంది. జనాభా నిరంతర పెరుగుదలకు ప్రధాన కారణం నాణ్యమైన వైద్య, ఆరోగ్య సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పాటు పోషకాహార లభ్యత పెరగడం. అయితే క్రమంగా సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుండటంతో జనాభా వృద్ధికి అడ్డుకట్ట పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. 2100 నాటికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వివిధ దేశాల్లో సంతానోత్పత్తి రేటును విశ్లేషించి ఓ నివేదిక రూపొందించింది. ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’లో భారత్.. 1960లో ప్రపంచ సరాసరి సంతానోత్పత్తి రేటు 4.7 కాగా 2020 చివరి నాటికి 2.3కి పడిపోయింది. సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంటే జనాభాలో పెరుగుదల, తగ్గుదల నమోదు ఉండదు. ముందు తరం స్థానంలో తర్వాత తరం వచ్చి చేరుతూ ఉంటుంది. దీన్ని ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ లేదా ‘రీప్లేస్మెంట్ రేట్’గా వ్యవహరిస్తారు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే తక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు. మన దేశం కూడా ఈ కేటగిరీలోనే ఉంది. ప్రస్తుతం మన దేశంలో సంతానోత్పత్తి రేటు 2.05గా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. సంతానోత్పత్తి క్షీణించడానికి కారణాలు ♦ గర్భ నిరోధ అవకాశాలు పెరగడం ♦ శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ♦ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం దక్షిణ కొరియాలో అత్యల్పం ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో అత్యధిక సంతానోత్పత్తి రేటు నమోదవుతోంది. నైజర్ 6.9 సంతానోత్పత్తి రేటుతో నంబర్ 1 స్థానంలో ఉంది. అంటే నైజీరియాలో ఒక మహిళ తన జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మనిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ (14వ స్థానం) మినహా సంతానోత్పత్తిలో టాప్ 30 దేశాలన్నీ ఆఫ్రికాలోనే ఉన్నాయి. 2100 నాటికి ఆఫ్రికా 250 కోట్ల మందిని ప్రపంచ జనాభాకు జోడిస్తుందని అంచనా. మిగతా ఖండాల్లో జనాభా పెరుగుదల దాదాపుగా ఉండదు. ఇక అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. అక్కడ సంతానోత్పత్తి రేటు 0.84 మాత్రమే ఉంది. ఆసక్తికరంగా అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్, అమెరికాలో సంతానోత్పత్తి రేటు ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే దిగువన ఉండటం గమనార్హం. ఐరోపా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు 1970 నుంచి తక్కువ సంతానోత్పత్తి రేటుతో కొనసాగుతున్నాయి. తగ్గినా తిప్పలే.. సంతానోత్పత్తి రేటు క్షీణించడం వల్ల అనేక దేశాల్లో మెరుగైన సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమైంది. అయితే ఈ విజయగాథలు గత చరిత్రే. ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భారీ జనాభాతో ఇబ్బందులున్నప్పటికీ సంతానోత్పత్తి రేటు ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే తక్కువగా ఉన్నప్పుడు భిన్న సమస్యలు తలెత్తుతాయి. పని చేసేవారు, పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న వారి నిష్పత్తిలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంటుంది. వృద్ధుల వైద్య ఖర్చులు పెరగడంతో పాటు సంపాదించి పన్నులు చెల్లించేవారి సంఖ్య తగ్గిపోవడం లాంటి పరిణామాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. దీర్ఘ కాలంలో.. ఇతర దేశాల నుంచి వలసలను ప్రోత్సహించి తాత్కాలికంగా జనాభా తగ్గుదల, మానవ వనరుల కొరతను ఎదుర్కొన్నా దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమని ఐక్యరాజ్య సమితి సూచించింది. పిల్లలు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తెలుగు రాష్ట్రాల్లో సంతా‘నో’త్పత్తి! ఎస్ఆర్ఎస్ నివేదికలో కీలక విషయాలు
సాక్షి, అమరావతి: మహిళల్లో అక్షరాస్యత పెరుగుదల, ఆధునిక గర్భ నిరోధక పద్ధతులతో దేశవ్యాప్తంగా పదేళ్లలో సాధారణ సంతానోత్పత్తి రేటు (జీఎఫ్ఆర్) గణనీయంగా తగ్గింది. ఉమ్మడి రాష్ట్రంలో 2008–2010లో సగటు జీఎఫ్ఆర్ 63.8 కాగా 2018–20 నాటికి 52.9కి పడిపోయింది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) గణాంకాల నివేదిక 2020’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రతి వెయ్యి మంది మహిళలకు ఆ ఏడాదిలో జన్మించిన శిశువుల సంఖ్యను జీఎఫ్‌ఆర్‌గా వ్యవహరిస్తారు. 15–49 ఏళ్ల వయసు మహిళలను పరిగణలోకి తీసుకుని జీఎఫ్ఆర్ లెక్కిస్తారు. ► తెలుగు రాష్ట్రాల్లో నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే జీఎఫ్ఆర్ తగ్గుదల ఎక్కువగా ఉంది. 2008–10లో గ్రామాల్లో జీఎఫ్ఆర్ 66.9 ఉండగా 2018–20 నాటికి 54.7కి పరిమితమైంది. పట్టణాల్లో ఇదే సమయంలో 56.8 నుంచి 49.6కి తగ్గింది. దేశ వ్యాప్తంగా పదేళ్లలో 20.2 శాతం జీఎఫ్ఆర్ తగ్గింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతం, పట్టణ ప్రాంతాల్లో 15.6 శాతం తగ్గుదల నమోదైంది. అత్యధికంగా పదేళ్లలో జమ్మూ కశ్మీర్లో జీఎఫ్ఆర్ 29.2 శాతం తగ్గింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో జీఎఫ్ఆర్ చాలా ఎక్కువగా ఉంది. ► ఏపీలో 20 – 29 ఏళ్ల వయసు మధ్య సంతానోత్పత్తి రేటు మెరుగ్గా నమోదైంది. 20–24 ఏళ్ల మధ్య 113.6, 25–29 ఏళ్ల మధ్య 109గా సంతానోత్పత్తి రేటు ఉంది. 30–34 ఏళ్ల వయస్సు వారిలో 44.4 ఉండగా, 35–39 ఏళ్ల వయస్సు వారిలో 13.4గా సంతానోత్పత్తి రేటు ఉంది. జాతీయ స్థాయిలో 30–34 ఏళ్ల మధ్య 84.4 ఉండగా 35–39 ఏళ్ల మధ్య సంతానోత్పత్తి రేటు 35.6గా నమోదైంది. -
తగ్గనున్న భారత్ జనాభా.. నివేదికలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో భారత జనాభా భారీగా తగ్గుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 141కోట్లుగా ఉన్న మన దేశ జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు పడిపోతుందని తెలిపింది. జనాభా పెరుగుదల ఎంత ప్రతికూలమో.. క్రమంగా తగ్గినా అంతే ప్రమాదమని పేర్కొంది. జ్ఞానం, జీవన ప్రమాణాలు పడిపోయి క్రమంగా జనాభా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుందని స్టాండ్ఫోర్డ్ అధ్యయనం పేర్కొంది. రానున్న రోజుల్లో భారత జనసాంద్రత ఆందోళనకర స్థాయిలో పడిపోతుందని చెప్పింది. జనాభా విషయంలో భారత్, చైనా దాదాపు ఒకేలా కన్పిస్తున్నప్పటికీ.. జనసాంద్రతకు వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంది. భారత్‌లో ప్రతి చదరపు కిలోమీటర్‌కు 476మంది నివసిస్తారు. చైనాలో మాత్రం ఆ సంఖ్య 148 మంది మాత్రమే. 2100 నాటికి భారత్‌లో జనసాంద్రత 335కి పడిపోతుందని, ఇది ప్రపంచం మొత్తంతో పోల్చితే చాలా ఎక్కువ అని అధ్యయనం అంచనా వేసింది. భారత్‌తో పాటు చైనా, అమెరికాలో వచ్చే 78 ఏళ్లలో జనాభా తగ్గిపోనుంది. ముఖ్యంగా చైనా జనాభా 2100 నాటికి 49 కోట్లకు పడిపోనుంది. సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. 2050 నాటికే మొత్తం సంతానోత్పత్తి 0.5 శాతానికే పరిమితం అవుతుందని అంచనా. భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2032నాటికి 1.76శాతం నుంచి 1.39శాతానికి తగ్గనుంది. 2052నాటికి 1.28శాతానికి, 2082 నాటికి 1.2శాతానికి, 2100 నాటికి 1.19శాతానికి పడిపోతుందనే అంచనాలున్నాయి. చదవండి: మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు -
నా వంతు నేను చేస్తున్నా అబ్బా! మస్క్ మళ్లీ ఏసేశాడుగా!
సాక్షి, న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ తొమ్మిది మంది సంతానం వార్తలపై ట్విటర్‌ద్వారా స్పందించారు. అంత కంతకూ తరిగిపోతున్న జనాభా సంక్షోభానికి సాయంగా తన వంతు కృషి చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. తగ్గిపోతున్న జననాల రేటు సివిలైజేషన్కు అతిపెద్ద ప్రమాదమని పునరుద్ఘాటించారు. అంతేకాదు రాసి పెట్టుకోండి! ఇదొక చేదు నిజం అని ట్వీట్ చేశారు. అంగారక గ్రహంపై ప్రస్తుతం జనాభా సున్నా అంటూ ట్వీట్ చేశారు. ఎక్కువ మంది పిల్లలతో పెద్ద కుటుంబాలు ఉండాలని ఆశిస్తున్నాను. ఇప్పటికే బిగ్ ఫ్యామిలీ వున్న వారికి అభినందనలు అని పేర్కొనడం విశేషం. అమెరికా ఫెర్టిలిటీ రేటు 50 సంవత్సరాల స్థిరమైన స్థాయిల కంటే తక్కువగా ఉందన్న రిపోర్ట్‌ను పిన్ చేశారు. Mark my words, they are sadly true — Elon Musk (@elonmusk) July 7, 2022 ఈ రిపోర్టు ప్రకారం అమెరికాలో 1960లో 3.5 శాతంగా సంతానోత్పత్తి రేటు 2020లో 1.5 కంటే తక్కువకు పడిపోయింది. అలాగే 2050, 2100 నాటికి ప్రపంచ సంతానోత్పత్తి రేటు తగ్గే అవకాశం ఉందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ 2020 పేర్కొంది. ప్రపంచ సంతానోత్పత్తి రేటు 2017 లో దాదాపు 2.4 కి సగానికి పడిపోయింది. 2100 నాటికి 1.7 కి తగ్గుతుందని పేర్కొంది. ఇది కూడా చదవండి : Elon Musk: మరోసారి సెన్సేషన్‌గా ఈలాన్ మస్క్: అంత పిచ్చా? కాగా మస్క్ తన కంపెనీ న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ మస్క్, జిలిస్‌తో గత ఏడాది తమ కవల పిల్లలకు జన్మనిచ్చారని, తాజాగా వారి పేర్లను మార్చాల్సిందిగా టెక్సాస్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్న వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇపుడు మస్క్ సంతానం తొమ్మిదికి చేరిందనన్న వ్యాఖ్యలు వినిపించిన సంగతి తె లిసిందే. -
ఫెర్టిలిటీ తగ్గింది.. ఊబకాయం పెరిగింది
న్యూఢిల్లీ: భారత మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో విడత నివేదిక (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) వెల్లడించింది. జనాభా నియంత్రణ పద్ధతులను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో సంతానోత్పత్తి సామర్థ్యం 2.2 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తెలిపింది. ఇది బిహార్ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్ (2.35), జార్ఖండ్ (2.26), మణిపూర్ (2.17) రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2019–21 మధ్య దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు 707 జిల్లాల్లో 6.37 లక్షల ఇళ్లలో 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులతో మాట్లాడి నివేదిక రూపొందించారు. పలు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడేందుకు వీలుగా పౌరుల సామాజిక, ఆర్థిక, ఇతర నేపథ్యాలను కూడా సర్వేలో పొందుపరిచారు... సాధికారత సంకేతాలు... మహిళలు సాధికారత దిశగా దూసుకుపోతున్నారని సర్వే వివరాలు చెప్పకనే చెబుతున్నాయి. ► బ్యాంకు ఖాతాలున్న మహిళల సంఖ్య గత నాలుగేళ్లలో 53 నుంచి 79 శాతానికి పెరిగింది. ► కాలుష్యరహిత, పరిశుభ్రమైన వంట ఇంధనం వాడేవారి సంఖ్య 44 శాతం నుంచి 59 శాతానికి పెరిగింది. ► పారిశుద్ధ్య సౌకర్యాలు 49 నుంచి 70 శాతానికి పెరిగాయి. ► కరోనా కాలంలో చేతులు పరిశుభ్రం చేసుకోవడం అలవాటుగా మారింది. ► నీళ్లు, సబ్బు సదుపాయాలున్న వారి సంఖ్య 60 నుంచి 78 శాతానికి పెరిగింది! ► 15–49 మధ్య వయసు వివాహితల్లో ఉద్యోగుల సంఖ్య 31 శాతం నుంచి 32కు పెరిగింది. పెరిగిన ఊబకాయం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4తో పోలిస్తే ఊబకాయం సమస్య దేశాన్ని బాగా వేధిస్తోంది. ఊబకాయుల సంఖ్య మహిళల్లో 21 శాతం నుంచి 24 శాతానికి, మగవారిలో 19 నుంచి 23 శాతానికి పెరిగింది. కేరళ, అండమాన్ నికోబర్ దీవులు, ఆంధ్రప్రదేశ్, గోవా, సిక్కిం, మణిపూర్, ఢిల్లీ, తమిళనాడు, చండీగఢ్, లక్షద్వీప్, పాండిచ్చేరిల్లో మూడో వంతుకు పైగా మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు. పిల్లల్లో తగ్గిన కుంగుబాటు చిన్నారుల్లో కుంగుబాటు గత నాలుగేళ్లలో తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల్లో కుంగుబాటు 38 నుంచి 36 శాతానికి తగ్గినట్టు తేలింది. పట్టణాల (30 శాతం) కంటే గ్రామీణ బాలల్లో (37 శాతం) కుంగుబాటు ఎక్కువగా ఉంది. మహిళల్లో నాలుగో వంతు యుక్తవయసుకు ముందే పెళ్లాడారు దేశవ్యాప్తంగా 18–29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 25 శాతం మంది, 21–29 ఏళ్ల పురుషుల్లో 15 శాతం మంది యుక్త వయసుకు ముందే పెళ్లి చేసుకున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. భారత్‌లో అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు పెళ్లికి యుక్తవయసన్నది తెలిసిందే. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 42 శాతం మంది మహిళలకు యుక్తవయసుకు ముందే పెళ్లయింది. బిహార్ (40 శాతం), త్రిపుర (39), జార్ఖండ్ (35), ఏపీ (33), తెలంగాణ (27) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యుక్తవయసుకు ముందే తాళి కడుతున్న వాళ్ల అబ్బాయిల సంఖ్య బిహార్‌లో అత్యధికంగా 25 శాతంగా తేలింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్ (24 శాతం), జార్ఖండ్ (22), అరుణాచల్‌ప్రదేశ్ (21) ఉన్నాయి. మొత్తమ్మీద బాల్య వివాహాలు తగ్గుముఖం పడుతున్నాయని సర్వే పేర్కొంది. 12 ఏళ్లపాటు, అంతకుమించి చదువుకునే అమ్మాయిలు మిగతా వారికంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని తెలిపింది. టీనేజీ తల్లుల సంఖ్య ముస్లింల్లో ఎక్కవగా (8 శాతం) ఉంది. గర్భ నిరోధక పద్ధతుల వాడకం పెరిగింది ► గర్భనిరోధక పద్ధతుల వాడకం 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. ► కుటుంబ నియంత్రణ పాటించని వారి సంఖ్య 13 శాతం నుంచి 9 శాతానికి తగ్గింది. ► ఆస్పత్రి ప్రసవాల సంఖ్య కూడా 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. ► గ్రామీణ ప్రాంతాల్లో కూడా 87 శాతం గర్భిణులు ఆస్పత్రుల్లోనే పురుడు పోసుకుంటున్నారు. ఇది పట్టణ ప్రాంతాల్లో 94 శాతం. ► గర్భనిరోధం మహిళల బాధ్యతేనని 35.1 శాతం మంది పురుషులు భావిస్తున్నారు. వీరి సంఖ్య చండీగఢ్‌లో అత్యధికంగా (69) ఉంది. ► మహిళల్లో గర్భ నిరోధక పద్ధతుల వాడకం వివాహేతర సంబంధాలకు దారి తీయొచ్చని 19.6 శాతం మగవాళ్లు అనుమానిస్తున్నారు! ఇలా భావిస్తున్న వారి సంఖ్య కేరళలో అత్యధికంగా (44.1) ఉంది!! ► అబార్షన్ చేయించుకుంటున్న వారిలో దాదాపు సగం మంది అవాంఛిత గర్భాన్నే కారణంగా చెప్తున్నారు. ► వీరిలో 16 శాతం అబార్షన్ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలన్న ఆసక్తి ఉన్నా అవగాహన లేక, వాటి వాడకం తెలియక దంపతులు ఎక్కువ మందిని కనేవారు. ఆ పరిస్థితుల్లో మార్పు రావడం మంచి పరిణామం – కేంద్రం -
14 ఏళ్లకు మెచ్యూర్ అయ్యాను, పీరియడ్ వచ్చినప్పుడల్లా విపరీతమైన నొప్పి.. తగ్గేదెలా?
నా వయసు 22 సంవత్సరాలు. నేను 14 ఏళ్ల వయసులో మెచ్యూర్ అయ్యాను. నాకు రెగ్యులర్‌గా 45 రోజులకు పీరియడ్స్ వస్తాయి. వచ్చినప్పుడల్లా మొదటి రోజు విపరీతంగా కడుపునొప్పి ఉంటుంది. పీరియడ్స్‌లో కడుపు నొప్పి సాధారణమే అయినా, ఇలా విలవిలలాడేంతగా ఉండదని, ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? – శ్రుతి, విజయవాడ పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయ కండరాలు బాగా కుదించుకున్నట్లయి, అది పట్టి వదిలేస్తూ బ్లీడింగ్ బయటకు వస్తుంది. ఇది కొందరిలో పొత్తికడుపు నొప్పిగా అనిపిస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ప్రోస్టాగ్లాండిన్స్ విడుదలవ్వచ్చు. అవి విడుదలయ్యే మోతాదును బట్టి వాటి ప్రభావం వల్ల పీరియడ్స్‌లో నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కొందరిలో నొప్పి కొద్దిగా ఉంటుంది. కొందరిలో నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీని ప్రభావం వల్ల గర్భాశయం లోపలి ఎండోమెట్రియమ్ పొరకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కుంచించుకుపోయి, ఎండోమెట్రియమ్ పొర ఊడిపోయి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల కూడా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండే అవకాశాలు ఉంటాయి. పైన చెప్పిన కారణాల వల్ల వచ్చే పీరియడ్స్ నొప్పి వల్ల ఇబ్బందులేమీ ఉండవు. కాకపోతే నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అలాగే ఆ సమయంలో పొత్తికడుపు మీద వేడి కాపడం పెట్టవచ్చు. యోగా, ప్రాణాయామం వంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా ఉపశమనం దొరుకుతుంది. కాకపోతే కొందరిలో గర్భాశయంలో కంతులు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, ఇన్ఫెక్షన్స్, చాక్లెట్ సిస్ట్స్, అండాశయంలో సిస్ట్లు వంటి అనేక కారణాల వల్ల పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో విపరీతమైన నొప్పి, నడుం నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, పెల్విక్ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్య ఏదైనా ఉందా లేదా తెలుసుకోవడం మంచిది. సమస్య ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు. సమస్య ఏమీ కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. నా వయసు 28 ఏళ్లు. నాకు పీసీఓడీ సమస్య ఉంది. పెళ్లయి ఆరేళ్ళయినా ఇంతవరకు పిల్లలు లేరు. డాక్టర్‌ను సంప్రదిస్తే ఫోలిక్ యాసిడ్ మాత్రలు, ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు రాసిచ్చారు. నాలుగు నెలలు వాడినా ఫలితం ఏమీ కనిపించలేదు. నా సమస్యకు ఎలాంటి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది? – సౌజన్య, గుత్తి గర్భాశయం రెండువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అనేక చిన్న చిన్న అండాలు ఉండే ఫాలికిల్స్ పెరగకుండా నీటిబుడగల్లా ఏర్పడతాయి. వీటినే పీసీఓడీ (పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇందులో మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ వంటి ఆండ్రోజన్ హార్మోన్లు ఆడవారిలో విడుదలవుతాయి. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడి, దాని వల్ల పిల్లలు కలగడానికి ఇబ్బంది అవుతుంది. ఇందులో చికిత్సలో భాగంగా హార్మోన్ల అసమతుల్యత ఇంకా పెరగకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి వాడే సమయంలో గర్భం రాదు. అవి కొన్ని నెలలు వాడిన తర్వాతే అండం పెరగడానికి మందులు వాడుతూ గర్భం కోసం ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. మీ ఎత్తు, బరువు రాయలేదు. కొందరిలో కాంట్రాసెప్టివ్ మందులతో పాటు వాకింగ్, వ్యాయామాలు చేస్తూ, మితమైన ఆహార నియమాలు పాటిస్తూ, బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం వల్ల కూడా అవి ఆపేసిన కొన్ని నెలల తర్వాత హార్మోన్ల అసమతుల్యత తగ్గి, గర్భం అదే నిలుస్తుంది. ఒకవేళ ఆలస్యం అవుతుంటే అప్పుడు అండం పెరగడానికి, గర్భం నిలవడానికి మందులతో చికిత్స తీసుకోవచ్చు. బిడ్డలో కొన్ని అవయవ లోపాలు రాకుండా ఉండటానికి ఫోలిక్‌యాసిడ్ మాత్రలను గర్భం కోసం ప్రయత్నం చేసే మూడు నాలుగు నెలల ముందు నుంచే వాడమని సలహా ఇవ్వడం జరుగుతుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
Fertility Rate: ఇక్కడ తగ్గుతున్నారు.. అక్కడ పెరుగుతున్నారు
సాక్షి, అమరావతి: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జననాల సంఖ్య (బర్త్ రేట్) అమాంతం పెరుగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఊహించని విధంగా తగ్గిపోతోంది. దేశంలో జనాభా పెరుగుదల మధ్య తీవ్ర వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య సూచిక (టోటల్ ఫెర్టిలిటీ రేటు) తగ్గాల్సిన దానికంటే ఎక్కువగా తగ్గిపోతోంది. దీనివల్ల భవిష్యత్‌లో వృద్ధుల సంఖ్య పెరిగిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంతాన సాఫల్యత గల మహిళ ఆంధ్రప్రదేశ్‌లో 1.6 మందిని మాత్రమే కంటున్నారు. ఫెర్టిలిటీ రేటు తగ్గడం ఊహించని పరిణామంగా చెబుతున్నారు. 2006లో ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఒక మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేది. తాజా గణాంకాల ప్రకారం అది 1.6 కు మాత్రమే పరిమితమైంది. కనీసం 1.9 లేదా ఆ పైన జననాల సంఖ్య ఉంటేనే జనాభా పెరుగుదల ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలన్నిటిలోనూ ఫెర్టిలిటీ రేటు 1.7 కంటే తక్కువగా ఉంది. దీనివల్ల జనాభా పెరుగుదల కనీస స్థాయిలో కూడా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే.. దేశంలోనే అత్యంత తక్కువగా జననాల రేట 1.5 మాత్రమే ఉంది. ఉత్తరాదిన పెరుగుతున్న జనాభా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం సగటుకు మించి జనాభా పెరుగుతున్నారు. అత్యధికంగా బిహార్‌లో సగటున ఒక మహిళ 3.2 మందికి జన్మనిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచి్చన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియా సగటు బర్త్ రేటు 2.2గా ఉంది. తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే బిహార్‌లో నూరు శాతం ఎక్కువగా ఫెర్టిలిటీ రేటు నమోదవటం గమనార్హం. ఇద్దరంటే మొగ్గు చూపడం లేదు గతంలో ‘ఇద్దరు పిల్లలు.. ఇంటికి వెలుగు’ అనే నినాదాలు హోరెత్తేవి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఒక్కరే చాలు అనుకునే వాళ్లే ఎక్కువయ్యారు. చాలామంది యువతులు ఉద్యోగాలు, ఉపాధి వంటి కారణాల వల్ల ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో వారు ఇద్దరు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. మగవాళ్లు సైతం అదే భావంతో ఉంటున్నారు. పట్టణీకరణ నేపథ్యంలో కుటుంబ ఖర్చులు పెరిగిపోవడం, చదువుల వ్యయం కారణంగా ఆయా కుటుంబాలు పిల్లలకు జన్మనిచ్చే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతో పిల్లల పెంపకం భారంగా మారడం కూడా సంతాన సాఫల్యత తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ఇలా రకరకాల కారణాలతో సంతానోత్పత్తి తగ్గిపోతున్నట్టు చెబుతున్నారు. ఇలా తగ్గుతూ వెళితే.. జనాభా ప్రాతిపదికన ఏర్పాటయ్యే పార్లమెంటరీ స్థానాలను పునరి్వభజన చేస్తే ఒక ప్రాంతంలో భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని, మరో ప్రాంతంలో తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. -
ఇతర గ్రహలకు జీవుల రవాణా మరింత ఈజీ కానుందా..!
నాసాతో పాటు పలు అంతరిక్ష సంస్థలు ఇతర గ్రహలకు మానవులను పంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా చేసిన పరిశోధనలతో జీవరాశుల రవాణా ఇతర గ్రహలకు మరింత సులువుకానున్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అందుకోసం జపాన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాగా కొన్ని నెలలపాటు అంతరిక్షంలో అత్యధిక మోతాదులో కాస్మిక్ రేడియేషన్‌కు గురైన ఎలుకల వీర్యంతో భూమిపై ఎలుక పిల్లలను మొదటిసారిగా సృష్టించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సుమారు ఆరు సంవత్సరాల పాటు కాస్మిక్ రేడియేషన్‌కు ఎలుకల వీర్యం గురైంది. ఈ విషయాన్ని సైన్స్ అడ్వాన్స్‌లో జూన్ 11 న పబ్లిష్ చేశారు. ఐఎస్ఎస్లో ఫ్రిజ్ డ్రై ఫాంలో సుమారు ఆరు సంవత్సరాలపాటు నిలువ చేసిన ఎలుకల వీర్యంతో భూమిపై 168 ఎలుకలను ఐవిఎఫ్తో సృష్టించారు. కాగా ఎలుకల్లో ఎలాంటి జన్యుపరమైన సమస్యలు లేకపోవడం గమనార్హం. జీవశాస్త్రవేత్త, నివేదిక ప్రధాన రచయిత తెరుహికో వాకాయమా మాట్లాడుతూ..అంతరిక్ష వీర్యంతో ఫలదీకరణం చేయబడిన ఎలుకల మధ్య, భూగ్రహంపై ఫలదీకరణం చెందిన ఎలుకలకు పెద్దగా తేడా ఏమి లేదని తెలిపారు. స్పేస్‌లో ఉన్న వీర్యంతో ఏర్పడిన ఎలుకలు సాధారణ రూపానే కల్గి ఉన్నాయని, అంతేకాకుండా వాటిలో జన్యుపరంగా ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు. 2013లో జపాన్‌లోని యమనాషి విశ్వవిద్యాలయంలోని వాకాయమా అతని సహచరులు దీర్ఘకాలిక అధ్యయనం కోసం మూడు బాక్సులతో కూడిన ఫ్రీజ్డ్ డ్రైడ్ వీర్యాన్ని ఐఎస్ఎస్కు పంపారు.అంతరిక్షంలో రేడియేషన్‌కు దీర్ఘకాలికంగా గురికావడంతో పునరుత్పత్తి కణాలలో డీఎన్ఏ దెబ్బతింటుందా..! అలాగే ఫలదీకరణ విషయాలపై పరిశోధన చేయాలని భావించారు. భవిష్యత్తులో, ఇతర గ్రహాలకు వలస వెళ్లే సమయం వచ్చినప్పుడు, మానవులకు మాత్రమే కాకుండా, పెంపుడు జంతువులకు కూడా జన్యు వనరుల వైవిధ్యాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉందని వాకాయమా తన నివేదికలో తెలిపారు. ఈ విధంగా చేయడంతో ఇతర గ్రహల్లో మానవుల, జంతువులను సంఖ్యను పెంచడానికి ఉపయోగపడుతుందనీ పేర్కొన్నారు. ఇతర గ్రహాలకు సజీవ జంతువులను, మానవులను పంపే దానిలో భాగంగా రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందనీ వాకాయమా తమ నివేదికలో తెలిపారు. చదవండి: మరో కొత్త గ్రహన్ని గుర్తించిన నాసా..అచ్చం భూమిలాగే..! -
సంతానం.. పడిపోతోంది అమాంతం!
సాక్షి, అమరావతి: ‘పది మంది పిల్లా పాపలతో చల్లగా ఉండండి’.. అని పూర్వకాలంలో పెద్దలు దీవించేవారు. కానీ ఇప్పుడు అందరూ ఒకరిద్దరికే పరిమితమైపోతున్నారు. ఫలితంగా పునరుత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేటు–టీఎఫ్ఆర్) గణనీయంగా పడిపోయింది. జాతీయ సగటు కంటే రాష్ట్ర టీఎఫ్ఆర్ భారీగా తగ్గిపోయింది. దీనివల్ల భవిష్యత్‌లో జనాభా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క ఏపీలోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఈ రేటు తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక మహిళ సగటున 2.9 మందికి జన్మనిస్తుండగా.. ఏపీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకొచ్చేసరికి అది 1.7కంటే తగ్గిపోయింది. సాధారణంగా 2.1 శాతం కంటే ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతే జనాభా పెరగదు. ఈ నేపథ్యంలో.. కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ తాజాగా నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. అవి.. 70 ఏళ్ల క్రితం ఒక్కొక్కరు ఆరుగురికి జన్మ ► డెబ్భై ఏళ్ల క్రితం భారత్‌లో సగటున ఒక్కో మహిళ ఆరుగుర్ని కనేవారు. ఇప్పుడా సగటు 2.2కు పడిపోయింది. ► 2006–08 మధ్య కాలంలో భారత్ సగటు ఫెర్టిలిటీ రేటు 2.7 ఉండగా, తాజాగా అది 2.2కు దిగజారింది. ► సాధారణంగా 15 ఏళ్లు దాటి 49 ఏళ్లలోపు మహిళలను పునరుత్పత్తి ప్రక్రియకు అర్హులుగా భావిస్తారు. ► ప్రతి వెయ్యి మంది జనాభాకు 183 మంది పునరుత్పత్తి సామర్థ్యమున్న మహిళలు ఉంటారు. ► వీరు సరైన వయస్సులో పిల్లలకు జన్మనిస్తేనే జనాభా వయస్సుల్లో అసమానతలు లేకుండా ఉంటాయి. ఏపీలో భారీగా తగ్గిన సంతానోత్పత్తి కానీ, రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా సంతానోత్పత్తి ప్రక్రియ భారీగా తగ్గుతూ వస్తోంది. జాతీయ సగటు 2.2గా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 1.6గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహిళ సగటున 1.7 మందికి జన్మనిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఆ సంఖ్య 1.5 మాత్రమే. 2006–08 మధ్య కాలంలో సగటున 1.9గా ఉన్న సంఖ్య ఇప్పుడు మరింత తగ్గి 1.6కు చేరింది. నిజానికి.. 2.1 కంటే తగ్గితే జనాభా పెరుగుదలకు ఇబ్బందని నిపుణుల అభిప్రాయం. ఇద్దరు కాదు ఒకరే ముద్దు.. దక్షిణాదిలో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఒకరు కాదు.. ఇద్దరు ముద్దు అంటూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేవారు. ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల్లో ఇద్దరు వద్దు.. ఒకరే ముద్దు అంటూ దానినే పాటిస్తున్నారు. లేటు మ్యారేజీలు, పిల్లలను ఆలస్యంగా కనడం తదితర కారణాలతో సంతానోత్పత్తి సమస్యగా మారింది. దీనికి తోడు ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల కూడా అది తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇవీ నష్టాలు.. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. దక్షిణాదిలో ఏ రాష్ట్రం చూసుకున్నా 1.7 కంటే ఎక్కువ లేదు. ఇలా జనాభా తగ్గుతూపోతే యువత తగ్గిపోయి వర్క్ ఫోర్స్ (పనిచేసే వారి సంఖ్య) పడిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. చదవండి: స్మార్ట్ టౌన్ల ప్రాజెక్ట్ టేకాఫ్.. సకల వసతులతో లే అవుట్ల అభివృద్ధి రాజధానిలో రూ.3 వేల కోట్ల పనులకు ప్రభుత్వ గ్యారెంటీ -
దక్షిణ భారతదేశంలో తొలిసారి..
సాక్షి, నిర్మల్ : కనిపించిన చెట్టునల్లా మనిషి నరుక్కుంటూ పోవడంతో వానరానికి తీరని కష్టమొచ్చింది. వనాలు అంతరించి పోతుండటంతో అవి జనాల్లోకి వచ్చాయి. ఒకప్పుడు పచ్చని చెట్లపై.. నచ్చిన పండ్లు తింటూ అడవుల్లో హాయిగా బతికిన కోతులు.. ఇప్పుడు ఇళ్ల ముందు పడేసిన ఎంగిలి మెతుకులను ఏరుకుని తింటున్నాయి. ఆకలికి తాళలేక కొన్నిచోట్ల ఇళ్లలోకి చొరబడుతున్నాయి. పంటచేలపైనా దాడి చేస్తున్నాయి. దీనిపై నాలుగేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ పలు సభలు, సమావేశాల్లో కోతుల వల్ల దెబ్బతింటున్న పంటలపైన మాట్లాడారు. ఇల్లు పీకి పందిరి వేసినట్లే అటవీశాఖ 2016లో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి(బి) శివారులోని అటవీ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా కోతుల సంతాన నియంత్రణ కేంద్రానికి స్థల నిర్ధారణ చేసింది. ఆ కేంద్రం ఎట్టకేలకు ఈ నెల 8న(మంగళవారం) రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇది దక్షిణ భారత్‌లోనే తొలి కేంద్రం కానుంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వీటి సంఖ్య విపరీతంగా ఉంది. ఒక్కో జిల్లాలో ప్రతీ సీజన్లో దాదాపు 200–300 ఎకరాల వరకు పంట నష్టం చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. పెంకులు ఉన్న ఇంటిపై కోతులు పడ్డాయంటే ఇక ఇల్లు పీకి పందిరి వేసినట్లే. కూరగాయలు, పండ్ల తోటలకు కోతులతో మరింత నష్టం జరుగుతోంది. దేశంలో రెండో రాష్ట్రం.. మన రాష్ట్రంలో ఉన్నట్లే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కోతుల సంఖ్య విపరీతంగా ఇబ్బంది పెడుతోంది. విరివిగా ఆపిల్‌పండ్లను పండించే హిమాచల్‌ప్రదేశ్‌లో వానరాలతో నష్టాలు పెరగడంతో అక్కడి ప్రభుత్వం వాటి సంతానోత్పత్తి నియంత్రణకు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో సారంగపూర్ మండలం చించోలి(బి) వద్ద అటవీ ప్రాంతంలో 2016లో మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్(ఎంఆర్‌ఆర్‌సీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఎట్టకేలకు ఈ ఏడాది పూర్తయ్యాయి. కేంద్రంలో ఏర్పాట్లు ఇలా.. చించోలి(బి) వద్ద ఉన్న గండిరామన్న హరితవనంలో నిర్మించిన ఈ కేంద్రం లో ఒకేసారి 50 కోతులను ఉంచేలా ఎన్‌క్లోజర్స్‌ను ఏర్పాటు చేశారు. వారం పది రోజులుగా ట్రయల్స్‌లో భాగంగా 27 కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మూడు రోజుల వరకు కేంద్రంలో ఉంచి, మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. ప్రస్తుతానికి కోతులను ఇక్కడికి తీసుకురావాలి్సన బాధ్యత సంబంధిత గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలదే. ట్రయల్స్ ప్రారంభించాం ఇప్పటికే కోతుల ట్యూబెక్టమీ, వేసక్టమీ ఆపరేషన్ ట్రయల్స్ ప్రారంభించాం. రోజుకు ఆడ కోతులైతే 25–30 వరకు, మగ కోతులైతే 50 వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయవచ్చు. మూడు రోజుల వరకు కేంద్రంలోనే ఉంచి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలివేయవచ్చు. ఈనెల 8న అధికారికంగా ప్రారంభమైన తర్వాత రోజూ ఆపరేషన్లు కొనసాగిస్తాం. – డాక్టర్ శ్రీకర్రాజు, ఏడాదికి రెండు కాన్పులు... కోతులతో ఇబ్బందులు తగ్గాలంటే.. ముందుగా వాటి సంతతిని నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోతుల గర్భధారణ కాలం (గర్భం నుంచి ప్రసవం వరకు) 164 రోజులు. అంటే సగటున ఐదు నెలలకో వానరం పుడుతోంది. మన ప్రాంతాల్లో నివసించే కోతుల జీవితకాలం 15–20 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఆడ కోతి ఏడాదికి రెండు చొప్పున పిల్లలకు జన్మనిస్తూ పోతుండటంతో వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వెటర్నరీ డాక్టర్, ఎంఆర్‌ఆర్‌సీ -
67 ఏళ్లకు మాతృత్వం.. విచారణ తప్పదేమో..!
బీజింగ్ : మారుతున్న జీవన శైలితో చాలామంది మహిళలకు గర్భధారణ సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి వారికి మాతృత్వపు మమకారాన్ని అందించేందుకు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్..ఇన్ విట్రో ఫెర్టిలిటీ) విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే, చైనాలో టియాన్ (67) అనే వృద్ధురాలు మాత్రం సహజ గర్భం దాల్చి వార్తల్లో నిలిచారు. 67 ఏళ్ల వయసులో సహజ గర్భం దాల్చిన తొలి చైనా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె గత శుక్రవారం పడంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, టియాన్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో వారు విచారణ ఎదుర్కొనక తప్పేట్టు లేదు. ఎందుకంటే చైనాలో ‘ఇద్దరు పిల్లల విధానం’ అమల్లో ఉంది. (చదవండి : 74 ఏళ్ల వయసులో మాతృత్వం.. తీవ్ర విమర్శలు) ఇదిలాఉండగా.. 2016లో చైనా తీసుకొచ్చిన ‘ఇద్దరు పిల్లల విధానం’ సత్ఫలితాలను ఇవ్వలేదు. దశాబ్దాలుగా ‘ఒకే బిడ్డ ముద్దు.. రెండో బిడ్డ వద్దు’ విధానానికి అలవాటు పడిన అక్కడి ప్రజలు.. రెండో బిడ్డను కనేందుకు ఆసక్తి చూపడం లేదని ఓ రిపోర్టు వెల్లడించింది. చైనాలో మొదటి బిడ్డను కనే మహిళల సగటు వయసు 2016లో 24.3 సంవత్సరాలుగా ఉంటే.. అది 2019లో 26.9 కి చేరింది. చైనా తెచ్చిన ‘ఇద్దరు పిల్లల విధానం’ ఫలితంగా వృద్ధ దంపతులు రెండో సంతానాన్ని కనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ఇక 2017లో నమోదైన జననాల్లో 51 శాతం రెండో సంతానం కావడం విశేషం, 2016లో ఇది 40 శాతం మాత్రమే ఉంది. పెద్ద వయసులో రెండో బిడ్డను కనేందుకు వృద్ధులు ఆసక్తి చూపుతున్నారనడానికి టియాన్ దంపతులే ఉదాహరణ. అయితే, టియాన్ దంపతులపై విమర్శలు వస్తున్నాయి. ముసలి వయసులో బిడ్డకు జన్మనిచ్చారని, ఇప్పుడు ఆ చిన్నారి ఆలనాపాలనా మిగిలిన వారిద్దరి పిల్లలపై పడుతుంది కదా అని విమర్శిస్తున్నారు. మరోవైపు.. మూడో బిడ్డ తమకు దేవుడిచ్చిన వరమని టియాన్ దంపతులు అంటున్నారు. ఆమెకు ‘టియాన్సి’(స్వర్గం నుంచి వచ్చిన చిన్నారి)గా నామకరణం చేశారు. టియాన్ రిటైర్డ్ డాక్టర్ కావడం గమనార్హం. (చదవండి : తీరిన కల.. 52 ఏళ్ల వయసులో కవలలకు జననం) -
74 ఏళ్ల వయసులో మాతృత్వం.. తీవ్ర విమర్శలు
సాక్షి, అమరావతి: కృత్రిమ గర్భధారణ వైద్య రంగంలో అద్భుతం. ఎంతోమంది సంతానలేమితో బాధపడే వారు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్..ఇన్ విట్రో ఫెర్టిలిటీ) ద్వారా పిల్లలను కని మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. కానీ, తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలవర్తిపాడుకు చెందిన మంగాయమ్మ 74 ఏళ్ల వయస్సులో ఐవీఎఫ్ విధానం ద్వారా కవలలకు జన్మనివ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వయసులో కృత్రిమ గర్భధారణ చేసి బిడ్డలను పుట్టేలా చేయడంపై ఇప్పుడు పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరులోని అహల్య ఆస్పత్రి వైద్యులు అనైతిక చర్యలకు పాల్పడ్డారని ఆ రంగానికే చెందిన వైద్య నిపుణులు తప్పుబడుతున్నారు. ఇది పూర్తిగా అనైతిక చర్య అని.. ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. సైన్సు పది మందికీ ఉపయోగపడాలి గానీ, సంచలనం కోసం ఎప్పుడూ చేయకూడదని పలువురు వైద్యులు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక మహిళ ఏ వయసులో అయినా పిల్లల్ని కనే యంత్రం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మరికొంతమం తీవ్రంగా స్పందించారు. లీగల్.. ఎథికల్ అంశాలతో ముడిపడినది ఇందులో న్యాయపరమైన, నైతికపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ రెండింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత, మా కార్యవర్గంలోనూ చర్చించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం. – డా. బి.సాంబశివారెడ్డి, భారతీయ వైద్య మండలి ఏపీ అధ్యక్షులు ఆ వయస్సులో సరికాదు సాధారణంగా 18 ఏళ్ల నుంచి మొదలయ్యే పునరుత్పత్తి ప్రక్రియ 45 ఏళ్ల వరకూ బావుంటుంది. ఆ తర్వాత అండం విడుదల క్షీణిస్తుంది. కానీ, 74 ఏళ్ల వయసులో అనేది చాలా కష్టమైన పని. ఈ దశలో పిల్లలను కృత్రిమంగా పుట్టించడమనేది మంచిది కాదు. – డా. రాజ్యలక్షి్మ, ప్రొఫెసర్ ఆఫ్ గైనకాలజీ, ఉస్మానియా వైద్య కళాశాల విదేశాల్లో చట్టాలు కఠినం కృత్రిమ గర్భధారణ అంశంలో విదేశాలలో చట్టాలు కఠినంగా ఉంటాయి. బిడ్డలు కావాలనుకునే వారికి కొన్ని అంశాల్లో అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారికి తెలియజెప్పడం వైద్యుల బాధ్యత. తాజా ఉదంతంతో ఇప్పుడు వయసు బాగా పైబడిన వారు కూడా తాము బిడ్డలకు జన్మనివ్వవచ్చా అని ఫోన్లలో సంప్రదిస్తున్నారు. ఇది అంత మంచి పరిణామం కాదు. – డా. వై.స్వప్న, వైద్య నిపుణురాలు, విజయవాడ వృద్ధాప్యంలో పిల్లల్ని కనడం సరైంది కాదు... ఎలాంటి విధానంలో అయినా సరే యాభై ఏళ్లు దాటిన మహిళ గర్భం నుంచి పిల్లల్ని పుట్టించడమనేది సరైన విధానం కాదనేది వైద్య వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. డెబ్భై ఏళ్ల వయసులో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులకు ఆస్కారం ఉంటుందని.. రక్తనాళాలు బలంగా ఉండకపోవడం వంటి కారణాలవల్ల ఆ మహిళకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందంటున్నారు. మన దేశంలో ఐవీఎఫ్, సరోగసీ వంటి విధానాలకు సరైన చట్టం లేకపోవడం.. సంతాన సాఫల్య కేంద్రాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంవల్లే ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయని మరి కొందరు చెబుతున్నారు. ముందుముందు ఇలాంటివి ఎవరూ చేయకూడదు ‘పలు వార్తా పేపర్లు, టీవీ ఛానెళ్ల, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాం. ఇది పూర్తిగా అనైతిక చర్యగా భావిస్తున్నాం. ఏఆర్టీ (అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ) నిబంధనలను పూర్తిగా దుర్వినియోగ పరిచారని భావిస్తున్నాం. ఇలాంటివి భవిష్యత్‌లో ఎవరూ చేయకూడదని కూడా సూచిస్తున్నాం. దీనివల్ల అనర్థాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి మా సంఘాల తరఫున క్షమాపణలు కోరుతున్నాం’. – ఐఎస్‌ఏఆర్ (ఇండియన్ సొసైటీ ఆఫ్ రీ ప్రొడక్షన్) – ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ) – ఏసీఈ (అకాడెమీ ఆఫ్ క్లినికల్ ఎంబ్రాలజిస్ట్స్) -
నలబై ఏళ్లలో 44 మందికి జన్మనిచ్చింది
కంపాలా: ఈ రోజుల్లో ఒక్క బిడ్డని పెంచి పోషించడమే చాలా మందికి చాలా కష్టంగా మారిపోతోంది. అలాంటిది ఉగాండాలో ఓ మహిళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 44 మందికి జన్మనిచ్చింది. ఏ మహిళలైనా నలభై ఏళ్లకే నలభైనాలుగు మంది పిల్లల్ని కనడాన్ని ఎవరూ నమ్మలేకపోవచ్చు. కానీ అసాధ్యమైన అంశాన్ని ఆమె సుసాధ్యం చేసింది. అయితే అది ఆమె ఇష్టంతో చేసిన పనికాదు. ఒకవైపు దయనీయ పరిస్థితి, మరోవైపు తన శరీరంలో జన్యువుల అసాధారణ స్థితి. ఆమెను 44 మంది పిల్లలకు తల్లిని చేశాయి. ఆమె పేరు మరియమ్ నబాటాంజీ. నివాసముండేది అత్యంత వెనుకబడిన ఉగాండాలోని ముకనో జిల్లాలో. ఆమెకు 12 ఏళ్లకే వివాహమైంది. గత రెండు దశాబ్దాలలో ఏటా కనీసం ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో.. ఇప్పుడు ఆ సంఖ్య 44 మందికి పెరిగింది. దీంతో ఆమె ఆ దేశంలో ఓ సరికొత్త రికార్డును నమోదు చేశారు. మొట్ట మొదటి సంతానం 12 ఏళ్లకే సంభవించింది. తొలి సంతానమే కవలలు. అతంటితో ఆగకుండా ప్రతి ఏడాది పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఆమెకే ఎందుకిలా జరుగుతుందనే దానిపై దేశంలోని ప్రముఖ వైద్యలంతా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరంగా కూడా ఎంతో ప్రత్యేకమైన కేసుగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ఆమె ఒవేరియన్ పెద్దదిగా ఉండడమే దానికి కారణమని తెలిపారు. బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకునే అవకాశం ఉన్నా, అది అంత క్షేమకరం కాదనీ, ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడంతో కుటుంబ నియంత్రణ పాఠించలేదు. సాధారణంగా ఆఫ్రికాలో సరాసరిన ఓ మహిళ ఐదు నుండి ఆరుగురు పిల్లల వరకూ జన్మనిస్తుంటుంది. ప్రపంచ సగటు ఈ విషయంలో 2.4 మాత్రమేననీ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆమె కన్న 44 మంది పిల్లల్లో ఆరుగురు రకరకాల కారణాల వల్ల చనిపోగా, ప్రస్తుతం 38 మంది జీవించి ఉన్నారు. తన జీవితంలో ఇంతమంది పిల్లల్ని కనే విషయంపై ఆమె మాట్లాడుతూ 'నాకు 12 సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. అప్పటికే నా భర్త వయసు 28 సంవత్సరాలు. చిన్నప్పుడు చాలా పేదరికం అనుభవించాను. మాకు తిండి లేని సమయంలో అన్నంలో గాజుముక్కలు కలిపి తినిపించి పిల్లల్ని చంపేసింది. నేను మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత నన్ను బలవంతంగా ఓ వ్యక్తికి కట్టబెట్టారు. ఆయన నన్ను లైంగిక బానిసగా మార్చేశాడు' అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 18 మంది పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలని భావించానని, కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల అది వీలుపడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తోబుట్టువులను కోల్పోయిన నబతాంజీ తన పిల్లల్లోనే తన తోబుట్టువులను చూసుకోవాలని అనుకుంది. 38 మంది పిల్లలతో కనీస వసతులు సరిగా లేని ఓ ఇంట్లో ధైర్యంగా జీవిస్తోంది. ప్రతీరోజూ 25 కిలోల మైజ్ ఫ్లోర్ ఆహారంగా ఆ కుటుంబానికి అవసరం. చేపలు, మాంసం చాలా చాలా అరుదుగా మాత్రమే తింటారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. శనివారం అందరూ కలిసి పని చేసుకుంటారట. పిల్లలందర్నీ అలా చూస్తుంటే తాను జీవితంలో పడ్డ కష్టాలన్నింటినీ మర్చిపోతానంటోంది నబతాంజీ. రెండేళ్ల కిందట ఆమెకు కుటుంబ నియంత్రణ చికిత్స చేశారు. -
మగవారికి మద్యం మంచిదే !
రోమ్ : పురుషులు తగిన మోతాదులో మద్యం తీసుకోవటం వల్ల వీర్యోత్పత్తి మెరుగ్గా ఉంటుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. వీర్యోత్పత్తి, వీర్యకణాల సంఖ్యను మద్యం ప్రోత్సహిస్తుందని తేలింది. 323మంది రోగులపై జరిపిన ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మద్యం తాగని వారిలో కంటే.. వారానికి 4-7యూనిట్ల మద్యం తీసుకున్న వారిలో వీర్యోత్పత్తి బాగా ఉన్నట్లు గుర్తించారు. ఇటలీకి చెందిన పోలీక్లినికో ఆస్పత్రి వైద్యుడు ‘‘ఎలెనా రిచి’’ మాట్లాడుతూ.. చిన్న చిన్న మోతాదుల్లో మద్యం సేవించేవారిలో వీర్యోత్పత్తి చక్కగా ఉంటుందన్నారు. అతిగా మద్యం సేవించటం వల్ల అది విషంగా మారుతుందన్నారు. మద్యం ఎక్కువగా సేవించే మగవారిలో వీర్యోత్పత్తి క్షీణించటమే కాకుండా వ్యంధత్వం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. -
రెండు నెలలు ఒత్తిడికి గురైతే..
లండన్ : కేవలం రెండు నెలలు తీవ్ర ఒత్తిడికి గురైతే పురుషులు సంతాన సాఫల్యతను ప్రమాదకర స్థాయిలో కోల్పోతారని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఒత్తిడితో సహవాసం చేస్తే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడమే కాకుండా వీర్యకణాలు బలహీనమయ్యే ముప్పు 47 శాతం అధికమవుతుందని వెల్లడించింది. 11,000 వీర్య నమూనాలను పరిశీలించిన మీదట ఇజ్రాయెల్ పరిశోధకులు ఈ విషయాలు నిగ్గుతేల్చారు. కేవలం రెండు నెలల పాటు ఒత్తిడికి లోనైన పురుషుల వీర్యకణాలు బలహీనమవుతాయని, వారికి పిల్లలు పుట్టే అవకాశాలు సన్నగిల్లుతాయని పరిశోధనలో వెల్లడైంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సందర్భాల్లో, ఒత్తిడి లేని సమయాల్లో సేకరించిన వీర్య నమూనాలను విశ్లేషిస్తూ నెగెవ్‌కు చెందిన బెన్ గురియన్ యూనివర్సిటీ, సొరొక యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. తొలిసారి తండ్రయ్యే పురుషుల సగటు వయసు 32 ఏళ్ల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. మానసిక ఒత్తిడి సంతాన సాఫల్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని, దీర్ఘకాలం ఒత్తిడికి లోనైతే వీర్యకణాల నాణ్యతపై దుష్ర్పభావం చూపుతుందని తేలిందని అథ్యయన రచయిత డాక్టర్ లెవిటాస్ పేర్కొన్నారు. -
నైట్ షిఫ్ట్‌లో మహిళలు.. ఈ సమస్య తప్పదు!
న్యూయార్క్: మహిళలు ఉద్యోగం, లేదా ఏదైనా ఉపాధికోసం పని చేయడం మంచిదే.. అయితే కొన్ని విషయాలలో వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులు, శారీరక శ్రమ ఎక్కువగా చేసే మహిళల్లో సంతానోత్పత్తిపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని తాజా సర్వే (స్టడీ వెనస్ డే)లో తేలింది. గతంలో పనికి, సంతానోత్పత్తికి సంబంధించి అధ్యయనాలు జరిగాయి. అయితే తొలిసారిగా షిఫ్ట్ ల వారీగా పని, ఆ పని శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటే.. దాని ప్రభావం పుట్టబోయే సంతానంపై ప్రభావం చూపనుందా అనే కోణంలో అమెరికా రీసెర్చర్స్ ఈ అధ్యయనం చేశారు. మసాచుసెట్స్‌లో సంతాన సాఫల్య కేంద్రానికి వచ్చిన దాదాపు 400 మంది మహిళల(సగటు వయసు 35)పై ఈ సర్వే చేశారు. 40 శాతం మహిళలు శారీరక శ్రమ చేస్తున్నారని, 91 శాతం మహిళలు రెగ్యూలర్ ఆఫీస్ వేళల్లో జాబ్ చేస్తున్నట్లు వెల్లడైంది. శారీరక శ్రమ చేసేవారు, నైట్ షిఫ్ట్‌లో జాబ్ చేసేవారిలో అండాల ఉత్పత్తి రేటు తక్కువగా ఉంది. ప్రతి తొమ్మిది మందిలో ఐదుగురు మహిళలు సరైన ఆహార నియమాలు పాటించడం లేదని, ఇతరత్రా కారణాల వల్ల అండాల నాణ్యత తగ్గడంతో పాటు ఉత్పత్తిరేటుపై ప్రతికూల ప్రభావం ఉందని అమెరికా రీసెర్చర్స్ తెలిపారు. వీటితో పాటు స్మోకింగ్ అలవాటు ఉంటే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లండన్ చన్న జయసేన ఇంపీరియల్ కాలేజ్ బృందం వెల్లడించింది. -
నకిలీ బాబా హల్చల్
అట్లూరు: మండలంలో ఓ నకిలీ బాబా ఎనిమిది నెలలుగా హల్చల్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కొంత మందితో తెలంగాణ అంటాడు, మరి కొంత మందితో చిత్తూరు అంటాడు, ఇంకొందరితో మన జిల్లాలోని పెద్దముడియం అని చెబుతాడు. పేరు అడిగితే వెంకటసుబ్బయ్య అని, సుబ్రమణ్యంస్వామి అని పేర్కొంటాడు. ఈయన ఏం చేస్తాడో తెలియదు గానీ, కాషాయి వస్త్రాలు ధరించడం, గోచీ కట్టుకుని పంగనామాలు పెట్టుకుని ఉంటాడు. జాతకాలు, వాస్తుతోపాటు సంతానం లేని వారికి సంతానం కలుగజేస్తానని నమ్మబలుకుతాడు. అట్లూరు పునరావాస కాలనీలోని శివారులో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఈయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇతర జిల్లాల నుంచి కూడా సుమోలు, స్కార్పియోల్లో ఇలా ఖరీదైన వాహనాల్లో వచ్చి ఆయనతో మంతనాలు చేసి పోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే పూజలు చేస్తున్నాడా, ఏదైనా వ్యాపారం చేస్తున్నాడా, గుప్త నిధుల అన్వేషణ సాగిస్తున్నాడా? అనేది ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. ఆ నోటా ఈ నోటా ద్వారా ప్రచారం సాగింది. పోలీసుల అదుపులో... బాబాపై ప్రజల్లో అనుమానాలు బలపడటంతోపాటు పోలీసులకు కూడా అనుమానం రావడంతో తిరుపతికి చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అలాగే చిరుతపులి చర్మం, పొడదుప్పి చర్మంతోపాటు అమ్మవారి పంచలోహ విగ్రహం, మరికొన్ని చిన్న విగ్రహాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయనను విచారణ చేయాలని అట్లూరు పోలీస్‌స్టేçÙన్లో అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై అట్లూరు ఎస్ఐ చంద్రశేఖర్‌ను వివరణ అడుగగా.. నకిలీ బాబా అదుపులో ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. విచారణ పూర్తి కాలేదని, పూర్తి వివరాలు సోమవారం విలేకరుల సమావేశంలో నిర్వహించి తెలుపుతామని ఆయన పేర్కొన్నారు. బాబా ఫొటో మాత్రం తీయవద్దని నిరాకరించారు. -
పిల్లలు లేరని.. భార్య తలపై సుత్తితో మోది..
ముంబై: పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త తాను కట్టుకున్న భార్యను సుత్తితో కొట్టి చంపి, తాను ఉరేసుకుని చనిపోయిన దారుణ ఘటన ముంబై శివార్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేశ్ బీజ్ ముంబైలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ఇతనికి ప్రీతితో పెళ్లయింది. ఇంత కాలమైనా పిల్లలు లేరని భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం సాయంత్రం వీరి ఇంటికి వచ్చిన కొంతమంది బంధువులు తలుపులు మూసి ఉండటంతో తలుపు తట్టారు. ఎంతకూ తెరవకపోవడంతో తలుపులు తెరిచి లోపలి వెళ్లగా.. కిందపడి చనిపోయి ఉన్న ప్రీతిని చూసి షాకయ్యారు. ఆమె పక్కనే భర్త కూడా ఫ్యాన్ కు ఉరేసుకుని ఉండటం చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రీతి తలపై సుత్తితో బలంగా మోది, ఆమె చేతి నరాలు తెంచినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులకు చెప్పారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్షలో ఆమె తలపై సుత్తితో బలంగా మోదినట్లు రిపోర్టులు వచ్చాయని చెప్పారు. సురేశ్ ఉరేసుకుని చనిపోయినట్లు రిపోర్టుల్లో ఉందని తెలిపారు. రిపోర్టుల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.