ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా జనభా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుత (2024 నాటికి) ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది బిలియన్లుగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడి పోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.
గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే జనాభా పెరుగుదల తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, పెరుగుతూనే ఉంది. వార్షిక జనాభా వృద్ధి రేటు కాలక్రమేణా క్షీణిస్తూ వస్తోంది. 20వ శతాబ్దం మధ్యలో ఇది దాదాపు 2 శాతంగా ఉండగా ఇదిపుడు ఒక శాతానికి పడిపోయింది.. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం , మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి వాటిని కారణాలుగా చెబుతున్నప్పటికీ, సంతానోత్పత్తి రేటు తగ్గడం కొంత ఆందోళన కలిగించే విషయం
గతంలో జనన , మరణాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా జనాభా పెరుగుదల నెమ్మదించింది. ప్రచార అవగాహన, అభివృద్ధి నేపథ్యంలో జనన రేట్లు తగ్గాయి. అలాగే శిశుమరణాల రేటు కూడా తగ్గింది.
ఆయుర్దాయం పెరగడం , జననాల రేటు తగ్గడం వల్ల, అనేక దేశాల్లో యువకుల సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల నిష్పత్తి పెరుగుతోంది. ఇది ఆరోగ్య సంరక్షణ , సామాజిక వ్యవస్థలకు సవాళ్లను విసురుతోంది.
పాపులేషన్ పిరమిడ్ (నిర్దిష్ట జనాభా వయస్సు ,లింగ కూర్పుతో ఏడిన గ్రాఫ్). అభివృద్ధి చెందిన దేశాలలో సమతుల్యాన్ని సూచిస్తూ దీర్ఘచతురస్రాకారంగా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువ ఉంటోంది. అందుకే ఇక్కడి పాపులేషన్ పిరమిడ్ , పిరమిడ్ ఆకారంలో ఉంటోంది.
ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ కూడా బాగా పెరింది. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 68 శాతం మంది నగరాల్లో నివరసిస్తారని అంచనా. పట్టణీకరణ మౌలిక సదుపాయాలు, పర్యావరణం, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
అధిక జనాభా ఆందోళనలు: ప్రపంచ జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, అధిక జనాభా గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. వనరుల కొరత, పర్యావరణ క్షీణత , అవస్థాపనపై ఒత్తిడి క్లిష్టమైన సమస్యలని మరి కొందరు వాదిస్తున్నారు.
సంతానోత్పత్తి రేటు
2021లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటు 1 (TFR) అంటే ఒక మహిళకు 2.3 మంది పిల్లలున్నారు. ఇదే 1965లో 5.1గా ఉంటే, 1970లో 4.8, 1980లో 3.7, 1990లో 3.3గా ఉండి 2000లో 2.8కి పడిపోయింది. 2000లో వేగం తగ్గింది. 2000-15 మధ్య 5 సంవత్సరాల సగటు 0.07తో పోలిస్తే, 2015- 2020 మధ్య ఒక్కో మహిళకు 0.17 మంది పిల్లలు తగ్గారు.
ఇటీవలి లాన్సెట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లోనూ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని, సంతానోత్పత్తి రేటు పడిపోతుందటమే దీనికి కారణం. అలాగే దేశంలో 1950లో 6.18గా సంతానోత్పత్తి రేటు, 2021నాటికి అది 2 కంటే దిగువకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, 2100నాటికి 1.04కు పడిపోవచ్చని కూడా హెచ్చరించింది.
మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వెరసి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సంతానోత్పత్తి రేటులో తగ్గుదల.. ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఆసియాలో సంతానోత్పత్తి రేట్లు
ప్రతి స్త్రీకి 0.9 పిల్లలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. 1.0 వద్ద ప్యూర్టో రికో , మాల్టా, సింగపూర్ ,హాంగ్‌కాంగ్‌లో ఒక్కో మహిళకు 1.1 చొప్పున పిల్లలున్నారు.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, చైనా (1.7) ,భారతదేశం (2.2) సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. ఈ రెండు గణాంకాలు ఈ దేశాలలో పునరుత్పత్తికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు, సాంస్కృతిక అంచనాల ద్వారా ప్రభావితమవుతాయి. ఉదాహరణకు చైనా సుమారు 1980 - 2016 వరకు ఒకటే బిడ్డ విధానాన్ని" కొనసాగించింది, అయితే ఆగస్టు 2021లో వివాహిత జంటలు ముగ్గురు పిల్లలను కలిగి ఉండవచ్చని అధికారికంగా ఒక చట్టాన్నిఆమోదించింది. ఇండియాలో కూడా అనధికారంగా చాలామంది జంటలు వన్ ఆర్ నన్ పద్ధతినే అవలంబిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment