న్యూఢిల్లీ: భవిష్యత్‌లో భారత జనాభా భారీగా తగ్గుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 141కోట్లుగా ఉన్న మన దేశ జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు పడిపోతుందని తెలిపింది. జనాభా పెరుగుదల ఎంత ప్రతికూలమో.. క్రమంగా తగ్గినా అంతే ప్రమాదమని పేర్కొంది. జ్ఞానం, జీవన ప్రమాణాలు పడిపోయి క్రమంగా జనాభా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుందని స్టాండ్‌ఫోర్డ్ అధ్యయనం పేర్కొంది. రానున్న రోజుల్లో భారత జనసాంద్రత ఆందోళనకర స్థాయిలో పడిపోతుందని చెప్పింది.
జనాభా విషయంలో భారత్, చైనా దాదాపు ఒకేలా కన్పిస్తున్నప్పటికీ.. జనసాంద్రతకు వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంది. భారత్‌లో ప్రతి చదరపు కిలోమీటర్‌కు 476మంది నివసిస్తారు. చైనాలో మాత్రం ఆ సంఖ్య 148 మంది మాత్రమే. 2100 నాటికి భారత్‌లో జనసాంద్రత 335కి పడిపోతుందని, ఇది ప్రపంచం మొత్తంతో పోల్చితే చాలా ఎక్కువ అని అధ్యయనం అంచనా వేసింది.
భారత్‌తో పాటు చైనా, అమెరికాలో వచ్చే 78 ఏళ్లలో జనాభా తగ్గిపోనుంది. ముఖ్యంగా చైనా జనాభా 2100 నాటికి 49 కోట్లకు పడిపోనుంది. సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. 2050 నాటికే మొత్తం సంతానోత్పత్తి 0.5 శాతానికే పరిమితం అవుతుందని అంచనా.
భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2032నాటికి 1.76శాతం నుంచి 1.39శాతానికి తగ్గనుంది. 2052నాటికి 1.28శాతానికి, 2082 నాటికి 1.2శాతానికి, 2100 నాటికి 1.19శాతానికి పడిపోతుందనే అంచనాలున్నాయి.
చదవండి: మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు
Comments
Please login to add a commentAdd a comment