Population ratio
-
మంచి పనిని కించపరుస్తారా?
జనాభా సమీకరణాల్లో వస్తున్నంత పరివర్తన సామాజికార్థిక పరిస్థితుల్లో రాకపోవడం దేశంలో ఏకరీతి ప్రగతికి సవాల్ విసురుతోంది. అసమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలే కారణమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘జనాభా ఆధారంగా చట్టసభలకు ప్రాతినిధ్య’ పద్ధతి సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా పరిణమించింది. నియోజకవర్గ పునర్విభజనతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగనుండగా, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనున్నాయి. జనాభా నియంత్రిస్తే తప్పయినట్టు, ఎక్కువ మంది పిల్లల్ని కనడమే గొప్పయినట్టు అధికారిక ప్రచారాలు, అమలు చర్యలు మొదలయ్యే ప్రమాదముంది. ఈ పరిస్థితులపై లోతైన సమగ్ర అధ్యయనం, దిద్దుబాటు చర్యలు తక్షణావసరం.మనమిపుడు 140 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్నాం. వనరులు, సదుపాయాలు, జనాభా నిష్పత్తిలో చూసినపుడు ఇదొక సంక్లిష్ట నమూనా! ఇటీవలి వరకు అధిక జనాభా దేశంగా ఉన్న చైనా కొన్నేళ్లుగా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలతో జనాభా వృద్ధిని నిలువరించింది. మనం కూడా నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన లక్ష్యాలు అందుకోలేకపోయాం. అయితే, దేశంలోని కొన్ని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో మంచి విజయాలు సాధించాయి. అర్థవంతమైన సంతానోత్పత్తి రేటు తరుగుదలను నమోదు చేశాయి. ఇది ప్రగతి సంకేతమే! కానీ, అదే తమ పాలిట శాపంగా పరిణమించిందని ఇప్పుడా రాష్ట్రాలు నెత్తి బాదుకుంటు న్నాయి. ప్రధానంగా రెండు సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఆ యా రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. ఒకటి, సంతానోత్పత్తి రేటు నియంత్రణ వల్ల పిల్లలు, యువ జనాభా తగ్గుతూ, వృద్ధుల జనాభా నిష్పత్తి పెరుగుతోంది. రెండోది, జనాభా నిలువరింపు కారణంగా, జాతీయ సగటు జనాభా ఆధారంగా జరిగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఆ యా రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గనుంది. ఇది దేశంలోని అత్యున్నత విధాన నిర్ణాయక సభలో ప్రాతినిధ్యం కోతగా భావిస్తూ వారు కలత చెందుతున్నారు. ఇంకోవైపు, జనాభాను అదుపు చేయక, సంతానోత్పత్తి రేటును అధికంగానే చూపుతున్న రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగనుండటం దేనికి సంకేతం? అనే ప్రశ్న పుట్టుకొస్తోంది.తగ్గిన సంతానోత్పత్తి రేటుదక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో రమారమి తరుగుదల నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ ఈ రేటు తక్కువగానే ఉంది. 2019–21 కాలంలో, దేశంలోనే అత్యల్పంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో సంతానోత్పత్తి రేటు 1.4గా ఉంటే... తెలంగాణ, ఏపీ, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఇది 1.5గా నమోదయినట్టు ‘భారత రిజిస్ట్రార్ జనరల్’ నివేదిక చెబుతోంది. ‘పిల్లలు కనే వయసు’ కాలంలో మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్య సగటును, ఆ ప్రాంతపు లేదా ఆ రాష్ట్రపు సంతా నోత్పత్తి రేటుగా పరిగణిస్తారు. అదే సమయంలో బిహార్ (3), ఉత్తర ప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అధి కంగా నమోదవుతోంది. ఎక్కువ సంతానోత్పత్తి రేటున్న రాష్ట్రాల్లో అభివృద్ధి మందగించడం సహజం.సంతానోత్పత్తి పరిమితుల్లో ఉండటం ప్రగతి సంకేతమే అయినా, మరో సమస్యకు అది కారణమవుతోంది. ఒక వంక పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంటే, మరోవంక శాస్త్ర సాంకేతికత పురోగతి పుణ్యమా అని మనిషి సగటు జీవనకాలం పెరగటం వల్ల వృద్ధుల సంఖ్య అధిక మవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా ఒక నిర్దిష్ట వయసు దాటినవారికి ప్రభుత్వమే కల్పించే సామాజిక భద్రత పథకాలు, కార్యక్రమాలు మనవద్ద లేకపోవడంతో వారి పోషణ, ఆరోగ్య నిర్వహణ కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తు న్నాయి. జనాభా ఆధారంగానే వివిధ కేంద్ర పథకాలు, సంక్షేమ కార్య క్రమాల నిధుల కేటాయింపులు, చివరకు చట్టసభల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య సంఖ్య ఖరారు కూడా జరగటం తమకు నష్టం కలిగిస్తోందని ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు.ఆధారపడే జనాభా రేటులో వృద్ధిప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కానీ, ఇటీవలి కాలంలో వృద్ధుల జనాభా శాతం క్రమంగా పెరుగుతున్నట్టు, మున్ముందు అది మరింత పెరుగనున్నట్టు ఐక్యరాజ్యసమితి విభాగమొకటి (యూఎన్‌ఎఫ్‌పీయే) తన నివేదికలో చెప్పింది. భారత వైద్య, కుటుంబ ఆరోగ్య విభాగం అందించిన సమాచారం ఆధారంగా అంచనాలు లెక్కగట్టిన ఈ విభాగం 2021లో 10.1 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా 2036 నాటికి 15 శాతానికి చేరవచ్చని చెప్పింది.అయితే, వృద్ధుల జనాభా పెరుగుదల రేటు సమస్య కాదు... సదరు జనాభా పనిచేసే వయస్కుల మీద ఆధారపడే స్థితి అధిక మవడం ఇబ్బంది. అంటే, వంద మంది పనిచేసే (18–59 ఏళ్లు) వయస్కులున్నపుడు, వారిపై ఆధారపడే వృద్ధుల జనాభా అధికంగా ఉండటం కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుందనేది అంతర్జాతీయ ప్రమాణాల లెక్క. ఆ నిష్పత్తి పెరుగుతోంది. అది 15 శాతాన్ని దాటితే సమస్యను ‘వృద్ధుల సంక్షోభం’గా లెక్కిస్తారు. భారత జాతీయ జనాభా కమిషన్ (ఎన్సీపీ) 2021 లెక్కల ప్రకారం, కేరళలో ఇది ఇప్పటికే 26.1 శాతంగా ఉంది. తమిళనాడు (20.5), హిమాచల్ ప్రదేశ్ (19.6), ఏపీ (18.5) శాతాలు కూడా అధికంగానే ఉన్నాయి. 2036 నాటికి అవి మరింత గణనీయంగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. సంతానన్పోత్తి రేటును, తద్వారా జనాభాను నియంత్రించినందుకు, సదరు కుటుంబాల్లో లభించే ఆ ప్రయోజనం... వృద్ధుల పోషణ, వారి ఆరోగ్య పరిరక్షణలోనే కరిగిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.కట్టడి చేసినందుకు కనీస స్థానాలా?2026 తర్వాతి జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్ట నిర్దేశ్యం ప్రకారం ఏపీ, తెలంగాణల్లోనూ సంఖ్య పెంపుతో పునర్విభజన జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా గడువు లోపల జనాభా తాజా లెక్కలు అందించడానికి వీలుగా జనగణన ప్రక్రియ సత్వరం చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. దశాబ్దానికి ఒకసారి జరిపే జనగణన, పాత సంప్రదాయం ప్రకారం 2020లో మొదలు కావాల్సింది. కోవిడ్ మహమ్మారి వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు 2025లో చేపట్టి, పదేళ్ల సైకిల్ని (ఇదివరకటిలా 2021 –2031 కాకుండా 2025 –2035గా) మారుస్తున్నారు. జనాభా వృద్ధి రేటు తీరుతెన్నుల్ని బట్టి కె.ఎస్. జేమ్స్, శుభ్ర కృతి జరిపిన అధ్యయనం ప్రకారం, వచ్చే పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరు గనుండగా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనుంది. ఉత్తరప్రదేశ్ (12), బిహార్ (10), రాజస్థాన్ (7) లలో లోక్‌సభ నియోజకవర్గాలు పెరుగ నున్నాయి. తమిళనాడు (9), కేరళ (6), ఏపీ (5) లలో తగ్గనున్నాయి. జాతీయ జనాభాలో వాటా పెరుగుదల, తరుగుదలను బట్టి ఈ సంఖ్య మారనుంది. ‘ఎక్కువ పిల్లలు కలిగిన తలిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వాలి, ఆ మేరకు చట్టం తేవాలని నేను ఆలోచిస్తున్నాను’ అంటూ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల అన్నారు. ఇటువంటి పంథా మంచిది కాదనీ, దాని వల్ల ఏ మంచీ జరుగదనేది ప్రపంచ వ్యాప్తంగా రుజువైన అంశమనీ సామాజికవేత్తలు అంటున్నారు. ప్రభుత్వాలిచ్చే ప్రాత్సాహకాలు అదనంగా పుట్టే సంతాన పోషణ, వారి విద్య –వైద్య అవసరాలు తీర్చవనీ, అధిక సంతానం కుటుంబ జీవన ప్రమాణాల పతనానికే కారణమవుతుందనీ విశ్లేషణలున్నాయి.ఈ పరిణామాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టాలి. జానాభా వృద్ధిని నిలుపుదల చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయాలుండాలి. సరైన జనాభా నిష్పత్తి ఉండేలా చూడాలి. వయసు మళ్లినవారు ఆయా కుటంబాలకు భారం కాకుండా సార్వత్రిక సాంఘిక భద్రతా పథకాలు ఉండాలి. ‘పనిచేసే వయసు’ కాలం నిడివి పెరిగేట్టు జీవన ప్రమాణాల వృద్ధికి చర్యలు తీసుకోవాలి. జనాభా నియంత్రణ తప్పు కాదు. ముసలితనం శాపం కాకూడదు. మంచి పనులకు ప్రోత్సాహం ఉండాలే తప్ప, శిక్షలు ఉండకూడదు.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
World Population Day 2024 : ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
జనాభా పెరుగుతోంది...కానీ సంతానోత్పత్తి రేటు పడిపోతోంది!
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా జనభా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుత (2024 నాటికి) ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది బిలియన్లుగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడి పోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే జనాభా పెరుగుదల తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, పెరుగుతూనే ఉంది. వార్షిక జనాభా వృద్ధి రేటు కాలక్రమేణా క్షీణిస్తూ వస్తోంది. 20వ శతాబ్దం మధ్యలో ఇది దాదాపు 2 శాతంగా ఉండగా ఇదిపుడు ఒక శాతానికి పడిపోయింది.. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం , మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి వాటిని కారణాలుగా చెబుతున్నప్పటికీ, సంతానోత్పత్తి రేటు తగ్గడం కొంత ఆందోళన కలిగించే విషయంగతంలో జనన , మరణాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా జనాభా పెరుగుదల నెమ్మదించింది. ప్రచార అవగాహన, అభివృద్ధి నేపథ్యంలో జనన రేట్లు తగ్గాయి. అలాగే శిశుమరణాల రేటు కూడా తగ్గింది.ఆయుర్దాయం పెరగడం , జననాల రేటు తగ్గడం వల్ల, అనేక దేశాల్లో యువకుల సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల నిష్పత్తి పెరుగుతోంది. ఇది ఆరోగ్య సంరక్షణ , సామాజిక వ్యవస్థలకు సవాళ్లను విసురుతోంది.పాపులేషన్ పిరమిడ్ (నిర్దిష్ట జనాభా వయస్సు ,లింగ కూర్పుతో ఏడిన గ్రాఫ్). అభివృద్ధి చెందిన దేశాలలో సమతుల్యాన్ని సూచిస్తూ దీర్ఘచతురస్రాకారంగా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువ ఉంటోంది. అందుకే ఇక్కడి పాపులేషన్ పిరమిడ్ , పిరమిడ్ ఆకారంలో ఉంటోంది.ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ కూడా బాగా పెరింది. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 68 శాతం మంది నగరాల్లో నివరసిస్తారని అంచనా. పట్టణీకరణ మౌలిక సదుపాయాలు, పర్యావరణం, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.అధిక జనాభా ఆందోళనలు: ప్రపంచ జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, అధిక జనాభా గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. వనరుల కొరత, పర్యావరణ క్షీణత , అవస్థాపనపై ఒత్తిడి క్లిష్టమైన సమస్యలని మరి కొందరు వాదిస్తున్నారు. సంతానోత్పత్తి రేటు2021లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటు 1 (TFR) అంటే ఒక మహిళకు 2.3 మంది పిల్లలున్నారు. ఇదే 1965లో 5.1గా ఉంటే, 1970లో 4.8, 1980లో 3.7, 1990లో 3.3గా ఉండి 2000లో 2.8కి పడిపోయింది. 2000లో వేగం తగ్గింది. 2000-15 మధ్య 5 సంవత్సరాల సగటు 0.07తో పోలిస్తే, 2015- 2020 మధ్య ఒక్కో మహిళకు 0.17 మంది పిల్లలు తగ్గారు.ఇటీవలి లాన్సెట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లోనూ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని, సంతానోత్పత్తి రేటు పడిపోతుందటమే దీనికి కారణం. అలాగే దేశంలో 1950లో 6.18గా సంతానోత్పత్తి రేటు, 2021నాటికి అది 2 కంటే దిగువకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, 2100నాటికి 1.04కు పడిపోవచ్చని కూడా హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వెరసి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సంతానోత్పత్తి రేటులో తగ్గుదల.. ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ఆసియాలో సంతానోత్పత్తి రేట్లుప్రతి స్త్రీకి 0.9 పిల్లలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. 1.0 వద్ద ప్యూర్టో రికో , మాల్టా, సింగపూర్ ,హాంగ్‌కాంగ్‌లో ఒక్కో మహిళకు 1.1 చొప్పున పిల్లలున్నారు.ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, చైనా (1.7) ,భారతదేశం (2.2) సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. ఈ రెండు గణాంకాలు ఈ దేశాలలో పునరుత్పత్తికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు, సాంస్కృతిక అంచనాల ద్వారా ప్రభావితమవుతాయి. ఉదాహరణకు చైనా సుమారు 1980 - 2016 వరకు ఒకటే బిడ్డ విధానాన్ని" కొనసాగించింది, అయితే ఆగస్టు 2021లో వివాహిత జంటలు ముగ్గురు పిల్లలను కలిగి ఉండవచ్చని అధికారికంగా ఒక చట్టాన్నిఆమోదించింది. ఇండియాలో కూడా అనధికారంగా చాలామంది జంటలు వన్ ఆర్ నన్ పద్ధతినే అవలంబిస్తుండటం గమనార్హం. -
World Population Day 2024 : జనం.. ప్రభంజనం..ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్!
ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటిస్తారు. నానాటికి పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, జనాభా పెరుగుదల సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ప్రపంచవ్యాప్తంగ ప్రజలలో అవగాహన తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది.1987, జూలై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న ("డే ఆఫ్ ఫైవ్ బిలియన్") రోజును పురస్కరించుకుని ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.ప్రపంచ జనాభా దినోత్సవం 2024 థీమ్యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సమన్వయంతో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంయుక్తంగా ప్రతీ ఏడాది ఒక్కో థీమ్‌ను నిర్ణయిస్తాయి ఈ సంవత్సరం థీమ్: 'ఎవరినీ వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరినీ లెక్కించండి (To Leave No One Behind, Count Everyone’)కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు ఐరాస లెక్కల ప్రకారం 20 ఏళ్ల తరువాత జూలై 11, 2007లో ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకుంది. .కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం , మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవ లక్ష్యం. ప్రపంచ జనాభా అధికారికంగా ప్రస్తుతం 8 బిలియన్లు దాటేసింది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే, భవిష్యత్ తరాలకు స్థిరమైన, స్నేహపూర్వక అభివృద్దికి అడ్డంకులను సృష్టిస్తుం దనేది ప్రధాన ఆందోళన. ప్రస్తుత ప్రపంచ జనాభా ఇరవయ్యవ శతాబ్దం మధ్యలో ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువ. అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు చైనా, భారతదేశం. ఈ రెండూ వందకోట్ల కంటే ఎక్కువ జనాభా ఈ దేశాల్లో ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2050నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుతుందని ఐరాస అంచనా. అలాగే 2080ల మధ్యలో 10.4 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. -
ఉడుతలకు, పావురాలకు గర్భనిరోధక మాత్రలు
పావురాలు, ఉడుతలు.. ప్రకృతికి, మనిషికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయనే సంగతి మీకు తెలుసా? అమెరికన్, యూరోపియన్ శాస్త్రవేత్తలు ఈ చిన్ని ప్రాణులు మనకు ఎంతో హాని చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ జంతువుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా పావురాలకు, కుందేళ్లకు గర్భనిరోధక మాత్రలు ఇవ్వాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు.పావురాలు, ఉడుతలేకాదు అడవి పందులు, చిలుకలు, జింకలు మొదలైనవి అటు ప్రకృతికి ఇటు మనుషులకు ముప్పుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజురోజుకు వీటి సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. ఉడుతలలోని గ్రే స్క్విరెల్ జాతిని 1800లో అమెరికా నుండి ఇంగ్లండ్‌కు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇక్కడ వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవి చెట్ల బెరడును తొలిచి కలపనునాశనం చేస్తున్నాయి. ఈ ఉడుతల వల్ల ఏటా దాదాపు రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు రాయల్ ఫారెస్ట్రీ సొసైటీ ఆఫ్ ఇంగ్లండ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.ఇక పావురాల విషయానికొస్తే అవి మనుషులకు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా మరికొన్ని జంతువులు మనుషులకు హాని కలిగిస్తున్నాయి. అందుకే వాటి సంఖ్యను నియంత్రించేందుకు వాటికి గర్భనిరోధక మాత్రలు ఇచ్చే ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాంటినెంటల్ యూరప్, స్కాండినేవియాలో గతంలో అడవి పందుల సంఖ్య దాదాపు 5 లక్షలు ఉండగా, 2020 నాటికి వాటి సంఖ్య 10 లక్షలకు పెరిగిందని ఇటలీ రైతు సంఘాలు చెబుతున్నాయి. వీటి కారణంగా పంటలు దెబ్బతినడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా పెరిగాయి.ఈ జంతువుల సంఖ్యను తగ్గించడానికి, వాటిని చంపడం కంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం ఉత్తమమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ది గార్డియన్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం ఈ జంతువులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, పర్యావరణ నష్టాలను కలిగిస్తున్నాయని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జియోవన్నా మాస్సే తెలిపారు. ఈ జంతువుల సంఖ్యను నియంత్రించేందుకు, వాటి ఆహార గింజల్లో గర్భనిరోధక మాత్రలు కలపాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.బ్రిటన్‌లో ఉడుతలకు హాజెల్‌నట్ అనే పండులో గర్భనిరోధక మాత్రలు ఉంచి వాటికి ఇస్తున్నారు. ఈ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పావురాలు, ఇతర పక్షుల సంఖ్యను నియంత్రించడానికి వాటికి అవి తినే గింజలలో గర్భనిరోధక మాత్రలు కలిపి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
విదేశాల్లో ‘మినీ ఇండియా’లు?
భారత్‌కు వెలుపల అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాలు ఏవో మీకు తెలుసా? మారిషస్, యూకే, యూఏఈ, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కొన్ని దేశాల్లో ‘మినీ ఇండియా’లు కూడా ఉన్నాయి. ఇక్కడ భారతీయుల ఇళ్లను సులభంగా గుర్తించవచ్చు. అవి ఏఏ దేశాలో ఇప్పుడు తెలుసుకుందాం. మారిషస్ మారిషస్‌లో 70శాతం జనాభా భారతీయులని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సాంస్కృతికరంగ స్వర్గధామం. ఇక్కడ భారతీయ ఆహార ఖజానా విరివిగా కనిపిస్తుంది. ఇది విదేశాల్లో స్థిరపడాలనుకున్న భారతీయుల ఉత్తమ ఎంపిక అని అంటారు. యూకే భారతదేశం- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. యూకేలో కనిపించే భారతీయ రెస్టారెంట్లు, దుకాణాలు దీనికి తార్కాణంగా నిలుస్తాయి. యూకేలో భారత సంస్కృతి కనిపిస్తుంది. యూకేలోని కొన్ని ప్రాంతాలు.. మనం భారత్‌లోనే ఉన్నామా అని అనిపించేలా ఉంటాయి. యూకేలోనూ భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్‌లో ఎక్కడికి వెళ్లినా భారతీయులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇక్కడ ఉంటే ఇండియాలో ఉన్నట్టేనని చాలామంది అంటుంటారు. యూఏఈ మొత్తం జనాభాలో భారతీయులు 42 శాతం ఉన్నారు. సౌదీ అరేబియా సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 10 శాతం నుంచి 13 శాతం వరకూ భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంగా సౌదీ అరేబియా గుర్తింపు పొందింది. కెనడా మెరుగైన ఉద్యోగావకాశాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తదితర అదనపు ప్రయోజనాలు భారతీయులను కెనడావైపు మళ్లేలా చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం కెనడాలో గణనీయ సంఖ్యలో భారతీయులున్నారు. ఒమన్ ఒమన్ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయులు దాదాపు 20 శాతం ఉన్నారు. 2023 నాటికి ఒమన్‌లో దాదాపు తొమ్మది లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఒమన్‌లోని భారతీయులు అక్కడి సాంస్కృతిక వైభవానికి తోడ్పాటునందిస్తున్నారు. సింగపూర్ 2023లో సింగపూర్‌లో భారతీయుల జనాభా ఏడు లక్షలు. సింగపూర్ ప్రభుత్వం ‘లిటిల్ ఇండియా’ ప్రాంత అభివృద్ధికి చేయూతనందిస్తోంది. సింగపూర్ సాంస్కృతిక వైభవానికి అక్కడి భారతీయులు తోడ్పాటునందిస్తున్నారు. అమెరికా అమెరికాలో అత్యధిక సంఖ్యలో భారతీయులున్నారు. ప్రపంచంలో తమది రెండవ అతిపెద్ద భారతీయ ప్రవాసులు కలిగిన దేశమని యునైటెడ్ స్టేట్స్ పేర్కొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కెరీర్‌ను మెరుగుపరుచుకోవడంలో పాటు పలు వ్యాపారాలు చేపడుతున్నారు. -
‘నైనిటాల్’లో పెరిగిన రెడ్ పాండా జనాభా
ఉత్తరాఖండ్‌లో సరస్సుల నగరంగా నైనిటాల్ పేరొందింది. స్థానిక గోవింద్ వల్లభ్ పంత్ జూ పార్కు .. రెడ్ పాండాల కేంద్రంగా మారింది. ఇక్కడి వాతావరణం రెడ్ పాండాలకు అనుకూలంగా ఉండటంతో వాటి జనాభా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ పాండాల సంఖ్య దాదాపు 10 వేలకు తగ్గగా, దీనికి భిన్నంగా నైనిటాల్లో రెడ్ పాండాల జనాభా పెరిగింది. కాగా రెడ్ పాండాను అంతరించిపోతున్న జంతువుల విభాగంలో చేర్చారు. రెడ్ పాండాలను ప్రపంచంలోనే అందమైన జంతువులుగా అభివర్ణిస్తారు. రెడ్ పాండాలు ఎవరికీ ఎటువంటి హాని చేయవు. పూర్వ కాలంలో చాలామంది రెడ్ పాండాలను వేటాడేవారు. వాటి చర్మంతో టోపీలు తయారు చేసేవారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు వచ్చే సందర్శకులు రెడ్ పాండాలను చూస్తూ, గంటల కొద్దీ సమయం గడుపుతుంటారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు చెందిన జీవశాస్త్రవేత్త అనూజ్ మాట్లాడుతూ 2014లో డార్జిలింగ్ జూ నుండి రెండు ఎర్ర పాండాలను ఇక్కడికి తీసుకువచ్చారని, నేడు వాటి సంఖ్య ఏడుకి పెరిగిందన్నారు. రెడ్ పాండాలు ఎత్తయిన ప్రదేశాలలోని చెట్లపై నివసించడానికి ఇష్టపడతాయన్నారు. అవి రింగల్ గడ్డిని ఇష్టంగా తింటాయని తెలిపారు. నైనిటాల్ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడి పాండాలకు వాటి ఆహారంలో ఆపిల్, అరటిపండ్లు, తేనె, పాలు ఇస్తారని తెలిపారు. కాగా రెడ్ పాండా సోమరి జంతువని, ఎప్పుడూ నిద్రిస్తూ ఉంటుందని అన్నారు. దీనిని జూపార్కులో ఉదయం, సాయంత్రం వేళల్లో చూడవచ్చన్నారు. -
ఆ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన 30 శాతం జనాభా
నోటి క్యాన్సర్ విషయంలో దేశంలోని రాజస్థాన్ మూడవ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జనాభాలో 30 శాతం మంది నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నోటి క్యాన్సర్ అనేది గుట్కా, బీడీ, సిగరెట్, పొగాకు మొదలైన మత్తుపదార్థాలు తీసుకోవడం వలన వస్తుంది. ఈ మత్తు పదార్థాలను తీసుకున్నప్పుడు నోటిలో పుండు ఏర్పడి, అది ఎంతకీ నయంకానపుడు, అది క్యాన్సర్‌గా పరిణమిస్తుంది. మరోవైపు నోటిలోపల అల్సర్లు ఉండటం సాధారణమేనని అనిపించినా, ఇది తీవ్రమైనప్పుడు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. నోటి పుండు అనేది చాలా సాధారణ సమస్యే అయినప్పటికీ, దానిని విస్మరించడం ప్రాణాంతకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ ఆశిష్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 30 శాతం మంది నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెడు అలవాట్లు. అయితే ఈ వ్యాధికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా నోటి క్యాన్సర్‌కు కారణంగా నిలుస్తున్నాయి. నోటి లోపల ఏర్పడే పుండ్లు దీర్ఘకాలం ఉంటే అది క్యాన్సర్‌గా మారే అవకాశం 50 నుంచి 60 శాతం వరకూ ఉంటుందని డాక్టర్ ఆశిష్ జోషి తెలిపారు. 43 ఏళ్లుగా దంతవైద్యునిగా సేవలందిస్తున్న డాక్టర్ ఆశిష్ ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు నోటి క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. -
చైనా జనాభా రెండో ఏడాదీ తగ్గింది
బీజింగ్: అధిక జనాభాతో మన దేశం జనభారత్గా దూసుకుపోతుంటే పొరుగుదేశం చైనా జనాభా క్షీణతను చవిచూస్తోంది. వరసగా రెండో ఏడాదీ అక్కడ జనాభా క్షీణత నమోదైంది. గత ఏడాదితో చూస్తే 2023 ఏడాదిలో చైనా జనాభా 20.8 లక్షలు తగ్గి 140.97 కోట్లకు పడిపోయింది. వార్షిక గణాంకాలను బుధవారం చైనా విడుదలచేయడంతో ఈ విషయం వెల్లడైంది. జనాభా నియంత్రణే లక్ష్యంగా ఒకే బిడ్డ విధానాన్ని కఠినంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అమలుచేయడంతో చైనాలో గత ఆరు దశాబ్దాల్లో ఎరుగని జనాభా క్షీణతను 2022 ఏడాది ఎదుర్కొంది. 2022లో చైనాలో 95.6 లక్షల మంది జని్మస్తే 2023లో 90.2 లక్షల మంది పుట్టారు. జననాల రేటు అత్యంత కనిష్టానికి పడిపోవడమూ ఇందుకు ఒక కారణం. కోవిడ్ కారణంగా 2023 ఏడాదిలో ఎక్కువ మంది చనిపోవడమూ జనాభా తగ్గుదలకు మరో కారణమైంది. గత ఏడాది ఏకంగా 1.11 కోట్ల మంది చైనాలో చనిపోయారు. -
2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? భారత్, చైనా పరిస్థితి ఏమిటి?
పెరుగుతున్న జనాభాపై ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారితీస్తుందని వాపోతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి అందించిన ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలోని వివరాలు మన ఊహలకు భిన్నంగా ఉన్నాయి. భవిష్యత్‌లో ప్రపంచ జనాభాలో తగ్గుదల కనిపించనున్నదని ఈ నివేదిక వెల్లడించింది. దీనికి వెనుకనున్న కారణాలేమిటో కూడా తెలియజేసింది. ప్రపంచంలో 2100 నాటికి మొత్తం జనాభా ఎంత ఉంటుందనే దానిపై ఈ నివేదికలో అంచనా అందించారు. దీనిలో భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్, అమెరికా, యూరోపియన్ దేశాల జనాభాకు సంబంధించి అంచనాలున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2021లో భారతదేశ జనాభా 153 కోట్లు. ప్రస్తుత జనాభా దాదాపు 140 కోట్లు. అంటే 2021కి.. ఇప్పటికి(2023) జనాభాలో తగ్గుదల కనిపించింది. దీని ప్రకారం చూస్తే వచ్చే 77 ఏళ్లలో అంటే 2100 నాటికి భారతదేశ జనాభా 13 కోట్ల మేరకు మాత్రమే పెరగనుంది. 2100వ సంవత్సరంలో ప్రపంచ జనాభాలో గణనీయమైన పెరుగుదల ఉండకపోవచ్చంటూ ఈ అంచనాలలో పేర్కొన్నారు. ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం చైనాతో ముడిపడివుంది. 2100 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుంచి దాదాపు 77 కోట్లకు తగ్గిపోనుంది. యూఎన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ (ఐఐఏఎస్‌ఏ)లు అందించిన డేటాలలోని అంశాలను క్రోడీకరించి 2100నాటి జనాభా అంచనాలను రూపొందించారు. ప్రపంచ జనాభా 2086 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేట్లు 2050కి ముందుగానే త్వరితగతిన తగ్గుతాయని ఈ అంచనాలలో వెల్లడయ్యింది. 2100కి వీటి స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు జనన రేటు తగ్గుతుంది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం, గర్భనిరోధకాల లభ్యత, కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం, అధిక సంతాన ఖర్చులు మొదలైనవి సంతానోత్పత్తి తగ్గుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి. 2100 నాటికి వివిధ దేశాల జనాభా ఎంత ఉండవచ్చనే అంచనాలను ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలో అందించారు. 2100 నాటికి ఏ దేశంలో ఎంత జనాభా(అంచనా)? భారతదేశం: 153 కోట్లు చైనా: 77 కోట్ల 10 లక్షలు నైజీరియా: 54 కోట్ల 60 లక్షలు పాకిస్తాన్: 48 కోట్ల 70 లక్షలు కాంగో: 43 కోట్ల 10 లక్షలు అమెరికా: 39 కోట్ల 40 లక్షలు ఇథియోపియా: 32 కోట్ల 30 లక్షలు ఇండోనేషియా: 29 కోట్ల 70 లక్షలు టాంజానియా: 24 కోట్ల 40 లక్షలు ఈజిప్ట్: 20 కోట్ల 50 లక్షలు బ్రెజిల్: 18 కోట్ల 50 లక్షలు ఫిలిప్పీన్స్: 18 కోట్లు బంగ్లాదేశ్: 17 కోట్ల 70 లక్షలు సూడాన్: 14 కోట్ల 20 లక్షలు అంగోలా: 13 కోట్ల 30 లక్షలు ఉగాండా: 13 కోట్ల 20 లక్షలు మెక్సికో: 11 కోట్ల 60 లక్షలు కెన్యా: 11 కోట్ల 30 లక్షలు రష్యా: 11 కోట్ల 20 లక్షలు ఇరాక్: 11 కోట్ల 10 లక్షలు ఆఫ్ఘనిస్తాన్: 11 కోట్లు మొజాంబిక్: 10 కోట్ల 60 లక్షలు వియత్నాం: 9 కోట్ల 10 లక్షలు కామెరూన్: 8 కోట్ల 70 లక్షలు మాలి: 8 కోట్ల 70 లక్షలు మడగాస్కర్: 8 కోట్ల 30 లక్షలు టర్కీ: 8 కోట్ల 20 లక్షలు ఇరాన్: 7 కోట్ల 90 లక్షలు దక్షిణాఫ్రికా: 7 కోట్ల 40 లక్షలు యెమెన్: 7 కోట్ల 40 లక్షలు జపాన్: 7 కోట్ల 40 లక్షలు ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు! -
2050 నాటికి ఏ దేశాల్లో హిందువులు అధికం? భారత్ పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో మతపరమైన జనాభాలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయమై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు వెలుగుచూశాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2015లో ఈ పరిశోధన నిర్వహించింది. రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన, పెను మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడయ్యింది. హిందూ మతంతో పాటు క్రైస్తవం, ఇస్లాం, అనేక ఇతర మతాలు కూడా పరిశోధన పరిధిలో చేరాయి. ఈ పరిశోధన ద్వారా రాబోయే 40 ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2050 నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో 15 శాతానికి చేరుకుంటుంది. అదే సమయంలో భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య అప్పటికీ అధికంగానే ఉంటుంది. అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా 2050 నాటికి 1.297 (ఒక బిలియన్.. 100 కోట్లు) బిలియన్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించేవారు ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 79 శాతానికి పైగా ఉంది. హిందువుల జనాభా పరంగా భారతదేశం తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది. నేపాల్‌లో హిందువుల జనాభా 3.812 కోట్లు. 2006కి ముందు నేపాల్ హిందూ దేశంగా ఉండేది. ఆ తర్వాత నేపాల్ సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం 2050నాటికి అమెరికాలో 47.8 లక్షల మంది హిందువులు ఉంటారు. 2015లో అమెరికాలో హిందువుల జనాభా 22.3 లక్షలు. ఇండోనేషియాలో వచ్చే 27 ఏళ్లలో హిందువుల జనాభా 41.5 లక్షలకు పెరగవచ్చని అధ్యయనంలో తేలింది. శ్రీలంక, మలేషియా, బ్రిటన్, కెనడాలలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగవచ్చని అధ్యయనంలో తేలింది. ఇది కూడా చదవండి: టన్నుల కొద్దీ బంగారమున్న గ్రహశకలం ఏది? -
అతి చిన్న స్వయం ప్రకటిత దేశం ఏది? జనాభా ఎంత?
విదేశీయులు భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారు వివిధ నియమాలను పాటించాల్సివుంటుంది. ఇటీవల కెనడా పౌరులకు భారతదేశం వీసాలపై నిషేధం విధించింది. అంటే ఇప్పుడు ఎవరైనా కెనడాకు చెందిన వ్యక్తి భారత్ వచ్చేందుకు అనుమతి లేదు. ఇతర దేశాల ప్రజలు భారతదేశానికి రావచ్చు. అయితే దీనికి భిన్నంగా.. ఆ దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆ దేశాధ్యక్షుడే స్వయంగా స్వాగతం పలుకుతాడు. కెవిన్ బాగ్ స్వయం ప్రకటిత దేశం. దీనిని రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా అని పిలుస్తారు. ఇది అమెరికాలోని నెవాడా సమీపంలో ఉంది. 30 మంది మనుషులు, 4 కుక్కలు ఉన్న ఈ చిన్న దేశానికి సొంత కరెన్సీ (వలోరా) కూడా ఉంది. 2.28 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బ్యాంక్ ఆఫ్ మొలోసియాలో నాణేలు, ముద్రించిన నోట్లను ఉపయోగిస్తారు. ఈ స్వయం ప్రకటిత దేశంలో కుక్కలకు కూడా పౌరసత్వం లభిస్తుంది. నియంత కెవిన్ బోగ్ తన భార్య, ముగ్గురు పిల్లలతో ఇక్కడ ఉంటున్నాడు. కెవిన్ బోగ్ ఎప్పుడూ సైనిక దుస్తులలో కనిపిస్తాడు. అతను తనను తాను స్వతంత్ర దేశానికి పాలకునిగా చెప్పుకుంటూ, దేశానికి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలుకుతాడు. 1990లలో రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా తూర్పు జర్మనీపై యుద్ధం ప్రకటించింది. 2006లో రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా ముస్టాచెస్టన్ అనే మరో మైక్రోనేషన్తో యుద్ధం చేసింది. దీనిలో కెవిన్ బాగ్ గెలిచాడు. బదులుగా ముస్టాచెస్టన్ పాలకుడు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. 2010లో ఈ చిన్న ‘దేశం’ మరో మైక్రోనేషన్తో యుద్ధం చేసింది. రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా తన జాతీయ గీతాన్ని రెండుసార్లు మార్చింది. ఈ దేశపు జెండా నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉంటుంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? -
దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క
గత ఏడాది అంటే 2022 నాటికి దక్షిణాఫ్రికా జనాభా పెరిగింది. మొత్తం జనాభా 60.6 మిలియన్లకు చేరింది. వీరిలో ఎక్కువ మంది (సుమారు 49.1 మిలియన్లు) నల్లజాతి ఆఫ్రికన్లు ఉన్నారు. భారతీయ లేదా ఆసియా నేపథ్యం కలిగిన వ్యక్తులు అతి చిన్న జనాభా సముదాయంగా ఏర్పడ్డారు. వీరి జనాభా సుమారు 1.56 మిలియన్లుగా ఉంది. దక్షిణాఫ్రికా సరిహద్దు ప్రాంతాలలో దాదాపు 59.3 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. దక్షిణాఫ్రికా.. ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన ఆరు దేశాలలో ఒకటిగా నిలిచింది. అతిపెద్ద జనావాస ప్రావిన్సుల విషయానికొస్తే గౌటెంగ్ ( రాజధాని నగరం జోహన్నెస్‌బర్గ్), క్వాజులు-నాటల్ (రాజధాని నగరం పీటర్‌మారిట్జ్‌బర్గ్) ఉన్నాయి. ఇక్కడి జనాభా వరుసగా దాదాపు 15.9 మిలియన్లు, 11.7 మిలియన్లుగా ఉంది. కేప్ టౌన్, డర్బన్, జోహన్నెస్‌బర్గ్ అతిపెద్ద కమ్యూనిటీలను కలిగిన నగరాలుగా నిలిచాయి. గృహాల సంఖ్యలో పెరుగుదల 2001- 2022 మధ్య కాలంలో దేశంలో మొత్తం గృహాల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ కాలంలో దక్షిణాఫ్రికా దాదాపు 60 శాతం గృహాల పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో (30.7 శాతం) కంటే పట్టణ ప్రాంతాలలో (38.2 శాతం) ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన కుటుంబాలు అధికంగా ఉన్నాయని తేలింది. మరోవైపు ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కలిగిన గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో 20.5 శాతంగా ఉన్నాయి. 2021లో కుటుంబాల సంఖ్య దాదాపు 17.9 మిలియన్లకు చేరుకుంది. దాదాపు ప్రతి మూడు ఇళ్లలో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రజలలో అత్యధికులు అధికారిక గృహాలలో నివసిస్తున్నారు. 2018 నాటికి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా మాట్లాడే భాష ఇసిజులు(isiZulu). తరువాతి స్థానంలో ఇసిక్సోసా (isiXhosa), అనంతరం ఇంగ్లీషు వస్తాయి. అత్యధిక ఆదాయ అసమాన దేశం ఆఫ్రికన్ దేశాలు ఆదాయ పంపిణీకి సంబంధించి గణనీయమైన అసమానతలను కలిగి ఉన్నాయి. ఈ విషయంలో దక్షిణాఫ్రికా.. ప్రపంచ ఆదాయ అసమానత ఇండెక్స్‌లో 63 శాతంగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ సూచికలో మెరుగుదల కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మరింత అసమానత నెలకొంది. దేశంలో నెలవారీ జాతీయ ఆహార దారిద్య్ర రేఖ 663 దక్షిణాఫ్రికా రాండ్లు కావడం గమనార్హం. 2019లో దక్షిణాఫ్రికాలోని అత్యధిక కుటుంబాలు జీతాలు లేదా గ్రాంట్లను ప్రధాన ఆదాయ వనరుగా కలిగి ఉన్నాయి. దాదాపు 10.7 మిలియన్ల ప్రజలు వేతనాల ద్వారానే ఆదాయాన్ని పొందుతున్నారు. 7.9 మిలియన్ల కుటుంబాలు ప్రభుత్వం చెల్లించే సామాజిక గ్రాంట్లను అందుకుంటున్నాయి. 2022లో ఆఫ్రికన్ ఖండంలో సగటు ఆయుర్దాయం మహిళలకు 64 సంవత్సరాలు. పురుషులకు 61 సంవత్సరాలు. దేశంలో పురుషుల కంటే మహిళల జనాభానే అధికం. 2021 నాటికి, దక్షిణాఫ్రికాలో సంతానోత్పత్తి రేటు 2.37. ఇది 2019 నుండి తగ్గుతోంది. శిశు మరణాల రేటు కూడా తగ్గుతోంది. ఇది మెరుగైన ఆరోగ్య సంరక్షణకు సూచిక. దేశంలో మరణాలకు ప్రధాన కారణం క్షయవ్యాధి, తరువాత మధుమేహంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
పాపం.. జపాన్ భవిష్యత్తు అలా ఏడ్చింది
జపాన్‌లో అంతకంతకూ పెరుగున్న వృద్ధుల సంఖ్యకు తోడు తగ్గుతున్న జనాభా ఆ దేశానికి అనేక సవాళ్లను విసురుతోంది. భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ప్రభుత్వ డేటాలోని వివరాల ప్రకారం జపాన్‌లోని ప్రతి ప్రావిన్స్‌లో మొదటిసారిగా రికార్డు స్థాయిలో జనాభా సంఖ్యలో తగ్గుదల నమోదయ్యింది. జపాన్‌లో విదేశీ నివాసితుల సంఖ్య దాదాపు 3 మిలియన్లకు పెరిగింది. గత 14 ఏళ్లుగా జపాన్‌లో జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జపాన్ పౌరుల మొత్తం జనాభా 122.4 మిలియన్లు. ఇది 2021 నాటి జనసంఖ్య కంటే ఎనిమిది లక్షలు తక్కువ. 1968 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. జనాభాను భర్తీ చేయడంలో విదేశీ పౌరుల పాత్ర జపాన్‌లోని మొత్తం 47 ప్రిఫెక్చర్(ప్రాంతం)లలో పౌరుల సంఖ్య తగ్గింది. సాధారణంగా అధిక జనన రేటు కలిగిన ఒకినావా ప్రిఫెక్చర్లో కూడా జనాభా సంఖ్య క్షీణించింది. అయితే క్షీణిస్తున్న జనాభాను భర్తీ చేయడంలో విదేశీ పౌరులు పెద్ద పాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా రెసిడెన్సీ కార్డులు కలిగిన విదేశీయుల సంఖ్య 10 శాతం పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకున్న అనంతరం ఈ సంఖ్య మూడేళ్లలో మొదటిసారిగా పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చి జపాన్‌లో నివసిస్తున్న వారి సంఖ్య 2013 తర్వాత అత్యధికంగా ఉందని తేలింది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ జననాల రేటును ఎదుర్కొంటున్నాయి. అయితే జపాన్‌లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. విదేశీ జనాభాకు నిలయంగా టోక్యో జపాన్‌లోని ప్రతీ ప్రావిన్స్‌లో విదేశీ నివాసితుల సంఖ్య పెరిగింది. రాజధాని టోక్యో విదేశీ పౌరుల జనాభాకు నిలయంగా మారింది. దాదాపు ఆరు లక్షల మంది విదేశీయులు ఇక్కడ నివసిస్తున్నారు. అదేసమయంలో టోక్యోలో జపాన్ పౌరుల జనాభా తగ్గింది. అయితే విదేశీయుల చేరిక కారణంగా ఈ ప్రావిన్స్ మొత్తం జనాభా పెరిగింది. అకిటా ప్రిఫెక్చర్ జనాభా అత్యధికంగా 1.65 శాతం మేరకు తగ్గింది. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం 2067 నాటికి జపాన్ జనాభాలో 10.2 శాతం విదేశీయులు ఉంటారని అంచనా. విదేశీ నివాసితుల సంఖ్య పెద్ద నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతోంది. నిబంధనలను సడలించడంతో.. జపాన్‌లో కఠినమైన ఇమ్మిగ్రేషన్ నియమాలు అమలులో ఉన్నాయి. అయితే కార్మికుల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వాటిని క్రమంగా సడలిస్తోంది. ఇది విదేశీయుల రాకకు మార్గం సుగమం చేసింది. ఇక్కడ జనాభాలో 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లల సంఖ్య 11.82 శాతంగా ఉంది. ఇది 0.18 శాతం తగ్గింది. 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 0.15 శాతం పెరిగి 29.15 శాతానికి చేరుకుంది. 92.4 శాతం ప్రిఫెక్చర్లలో జపాన్ జనాభా క్షీణించింది. ఈ సంవత్సరం జూన్‌లో దేశంలో పడిపోతున్న జనన రేటును అధిగమించడానికి జపాన్ ప్రభుత్వం $25 బిలియన్ల ప్రణాళికను ప్రారంభించింది. జపాన్‌లో జాతీయ విధానాలు జనాభా క్షీణతను ఆపడంలో విఫలమయ్యాయి. ఈ ధోరణి యువత,మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని సూచిస్తున్నది. ఇది కూడా చదవండి: మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా? -
నియంత్రించాం.. నష్టపోతున్నాం: స్టాలిన్
చెన్నై: దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణతో ఆయా రాష్ట్రాలు నియోజకవర్గాలను కోల్పోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ తాజాగా ‘ది వీక్’ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలుచేస్తూ దేశానికి మేలుచేస్తున్నాయి. కానీ అదేసమయంలో ఈ ప్రాంతంలో జనాభా క్షీణించడంతో నియోజకవర్గాల సంఖ్య తగ్గుతోంది. ఈ పరిణామం దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టం. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పథకాలను సరిగా అమలుచేయలేక చేతులెత్తేశాయి. అయినాసరే ఎక్కువ లోక్‌సభ స్థానాలను దక్కించుకోనున్నాయి. తమకు ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాలపై పగ తీర్చుకునేందుకు ఈ ‘జనాభా ప్రాతిపదికన సీట్లు’ విధానాన్ని అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే దీనిని అమలుచేసేందుకు బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. అయినాసరే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య బేదాభిప్రాయాలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రతిపక్షానికి ఏకైక నిర్వచనంగా కాంగ్రెస్ అవతరిస్తుంది. దేశానికి సరికొత్త నమ్మకంగా రాహుల్ గాంధీ నిలిచారు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
అవి ‘అర్ధం, పర్ధం లేని మాటలే’.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు!
ఎక్కువ మంది పిల్లలుంటే జనాభా సంక్షోభాన్ని తగ్గించొచ్చని అపరకుబేరుడు ఎలాన్ మస్క్ వాదిస్తున్నారు. అయితే, తాజాగా పిల్లలు, ఓటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు స్పందించిన మస్క్..సంతానం లేని వారు ఓటు వేసేందుకు అనర్హులుగా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ట్విటర్ యూజర్ డేటాహజార్డ్ ‘తల్లిదండ్రులకు ఓటు హక్కును పరిమితం చేయకుండా ప్రజాస్వామ్యంలో ఆచరణ సాధ్యం కాదంటూ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందించారు. ఆ కామెంట్‌ను సమర్ధిస్తూ మస్క్ రిప్లయి ఇచ్చారు. గత ఏడాది జననాల రేటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇన్ సమ్మిట్‌లో మాట్లాడుతూ .. కొంతమంది తక్కువ పిల్లలుంటే పర్యావరణానికి మంచిదని భావిస్తారు. ఇది అర్ధం లేని వ్యవహారం. జనాభా పెరుగుతున్నప్పటికీ పర్యావరణం బాగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. Democracy is probably unworkable long term without limiting suffrage to parents. Helps solve the procreation problem, too. https://t.co/9zZ6eV56W1 — ~~datahazard~~ (@fentasyl) July 2, 2023 అర్ధం పర్ధం లేని మాటలు అందుకు జపాన్‌లో క్షీణిస్తున్న జననాల రేటును ఉదహరించారు. 2021లో జపాన్ జనాభా 600,000 మంది క్షీణించిందని, తద్వారా తన ఉనికిని కోల్పేయే ప్రమాదం ఉందని అన్నారు.జనాభా ఎక్కువగా ఉంటే ప్రపంచ నాగరికత క్షీణించదని, పిల్లలను కలిగి ఉండటం పర్యావరణానికి హానికరం కాదని తన వైఖరిని కూడా స్పష్టం చేశారు. నాగరికతను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమని పేర్కొన్నారు. చైనాలో జనాభా చైనాలో జనాభా పెరుగుదల రేటు భారీ స్థాయిలో పడిపోతోందంటూ వచ్చిన పలు నివేదికలపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే చైనా జనాభా పతనాన్ని చవిచూడనుందని హెచ్చరించారు. చైనాలో జననాల రేటు గణనీయంగా క్షీణిస్తోందని .. రానున్న రోజుల్లో మరింత పతనం అవుతుందని అంచనా వేశారు. చదవండి👉 విడుదల కాకుండానే..మెటా ‘థ్రెడ్స్’కు ఎదురు దెబ్బ! -
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న బాలికల సంఖ్య..
ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఆదివాసీ–గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రసవాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడుతోంది. ఆదివాసీ మహిళల కాన్పులు ఇళ్లలో కాకుండా ఆసుపత్రుల్లో లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్ సీలు) జరిగేలా ఆరోగ్య సిబ్బంది చూస్తున్నారు. ఏపీలో మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారని, ఈ విషయంలో దేశంలో కేరళ తర్వాత రెండో స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. శ్రామిక శక్తికి (లేబర్ ఫోర్స్) సంబంధించిన 2021–2022 సర్వే ప్రకారం ఏపీలో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 2019–20లో 1021 మంది బాలికలు ఉండగా, ఈ సంఖ్య 2021–2022 నాటికి 1046కు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పుట్టిన ఆడపిల్లలు ఆరేళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా పెరగడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో పాటు వివిధ రకాల ప్రభుత్వ సిబ్బంది కృషిచేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పోషకాహారం అందజేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం చక్కటి ఫలితాలు అందిస్తుంది. దీనివల్ల 10,032మంది డాక్టర్లు వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంబీబీఎస్ డాక్టర్లు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ల ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తూ అవసరైన గైడెన్స్ అందజేస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ సభ్యులు -
దేశ జనాభా నియంత్రణపై బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో జనాభా నియంత్రణపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రస్తుతం దేశంలో జనాభా అత్యధికంగా ఉన్నదన్నారు. అందుకే దేశ జనాభా నియంత్రణకు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. దేశంలో జనాభా 140 కోట్లకు చేరుకున్నదని, ఇంతకుమించి అధికంగా జనాభా పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న జనాభాకు దేశంలో రైల్వే, ఎయిర్ పోర్టు, కాలేజీ, యూనివర్శిటీ, ఉపాధి కల్పన సేవలు అందించడమే చాలా ఎక్కువన్నారు. అందుకే పార్లమెంట్లో జనాభా నియంత్రణకు చట్టం చేయాలని, అప్పుడే దేశంపై అధికభారం పడదన్నారు. ఉత్తరాఖండ్‌కు తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందించినందుకు ప్రధాని మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌కు యోగా గురువు బాబా రామ్‌దేవ్ కృతజ్ఞతలు తెలిపారు. హరిద్వార్ అనేది ఉత్తరాఖండ్‌లో గర్వించదగిన ప్రాంతమని అన్నారు. ఢిల్లీ- డెహ్రాడూన్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడపడం ఆనందదాయకమన్నారు.ఇది దేవభూమికి దక్కిన గౌరవమని అన్నారు. గతంలోనూ బాబా రామ్ దేవ్ జనాభా నియంత్రణ గురించి మాట్లాడారు. ఏ కుటుంబంలోనైనా ఇద్దరికిమించి అధికంగా పిల్లలు ఉంటే వారికి కొన్ని హక్కులను వర్తింపజేయకూడదన్నారు. దేశంలో జనాభా పెరిగితే, ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందకు భారత్ సిద్ధంగా లేదన్నారు.దేశ జనాభా 150 కోట్లు దాటకుండా చూడాలని బాబా రామ్‌దేవ్ సూచించారు. -
జనాభాలో చైనాను అధిగమించిన భారత్
-
అశ్వాలేవీ..? లొట్టిపిట్టలెక్కడ
దేశంలో మొత్తంగా పశు సంపద కొంతమేర పెరిగినా.. ఒంటెలు, గుర్రాల వంటి జంతువుల సంఖ్యలో 9 శాతం క్షీణత నమోదైంది. 2.90 లక్షల గుర్రాలు తగ్గిపోగా.. 1.50 లక్షల ఒంటెలు కనుమరుగయ్యాయి. గాడిదలు, పందుల సంఖ్య సైతం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సంకర జాతి పశువుల సంఖ్య 26.9 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 6.60 లక్షల గ్రామాలు.. 89 వేల పట్టణాల్లోని 27 కోట్లకు పైగా గృహాలు, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన 20వ పశుగణన నివేదిక ఈ విషయాల్ని తేటతెల్లం చేసింది. పశుగణన ఏం తేల్చిందంటే.. ► 2012 – 2019 మధ్య మొత్తం పశువుల జనాభాలో 4.6 శాతం పెరుగుదల నమోదైంది. ► దేశంలో ఒంటెలు 84 శాతం రాజస్థాన్‌లో ఉండగా.. 11 శాతం గుజరాత్లో ఉన్నాయి. ► 2012 నుంచి 2019 సంవత్సరం నాటికి దేశంలో ఒంటెల జనాభా 4 లక్షల నుంచి 2.5 లక్షలకు తగ్గింది. ► ఇక 2012 నుంచి 2019 మధ్య గుర్రాల సంఖ్య 6.3 లక్షల నుంచి 3.4 లక్షలకు తగ్గింది. ► ఇతర దేశాలకు చెందిన, సంకర జాతి పశువుల జనాభా 2012తో పోలిస్తే 2019లో 26.9 శాతం పెరిగింది. ► 2012తో పోలిస్తే దేశీయ (దేశవాళీ) పశువులలో 6 శాతం క్షీణత ఉంది. ► గత గణనతో పోలిస్తే.. 2019లో దేశంలో మొత్తం పౌల్ట్రీ 851.81 మిలియన్లకు చేరటం ద్వారా 16.8 శాతం వృద్ధి నమోదు చేసింది. ► 2012తో పోలిస్తే 2019 నాటికి దేశంలో పెరటి కోళ్ల పెంపకం 48.8 శాతం పెరిగి.. 317.07 మిలియన్లకు చేరింది. తగ్గుదలకు కారణాలివీ.. ► ఒంటెలు, గుర్రాల సంఖ్య తగ్గిపోవడానికి వ్యవసాయ రంగంలో వాటి వినియోగం తగ్గటమే కారణమని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ► గతంలో రవాణాకు ఒంటెలను వినియోగించే వారు. ఇది క్రమంగా తగ్గుతోంది. ► రాజస్థాన్‌లో మేత భూములు తగ్గడంతో వాటి పెంపకం కష్టంగా మారింది. ► ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గుర్రాల పోషణకు పెట్టుబడి ఎక్కువగా అవుతోంది. దీంతో వీటి పెంపకం ఆర్థికంగా సాధ్యం కావడం లేదు. ► దేశీయ గుర్రపు జాతులను ఎక్కువగా పోలీస్ సేవలు లేదా వినోదాల కోసమే ఉపయోగిస్తున్నారు. – గుర్రాల పెంపకానికి పేరొందిన గుజరాత్లో తప్ప ఇతర రాష్ట్రాల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ► అయితే ఒంటె జాతిని రక్షించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఒంటెను రాష్ట్ర జంతువుగా ప్రకటించి పలు రక్షణ చర్యలు చేపట్టింది. అలాగే గుజరాత్ ప్రభుత్వం వాటి రక్షణకు చర్యలు తీసుకుంది. కచ్ ప్రాంతంలో ఒంటె పాల సేకరణ, ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దేశంలో పశు జనాభా ఇలా.. (మిలియన్లలో) ఏపీలో 15.79 శాతం వృద్ధి రాష్ట్రంలో పశు సంపదలో 15.79 శాతం వృద్ధి నమోదైంది. 2012 పశుగణనలో 2.94 కోట్ల పశు సంపద ఉండగా.. 2019 నాటికి 3.40 కోట్లకు పెరిగింది. పౌల్ట్రీ రంగంలోనూ భారీగా వృద్ధి నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 80.6 మిలియన్ పౌల్ట్రీ జనాభా ఉంటే.. 2019 గణన నాటికి 107.9 మిలియన్లకు చేరింది. అంటే 33.85 శాతం వృద్ధి నమోదైంది. గొర్రెల జనాభాలోనూ 30 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 13.6 మిలియన్లు గొర్రెలు ఉండగా.. 2019 నాటికి 17.60 మిలియన్లకు పెరిగాయి. అయితే గేదెల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 2012లో 6.50 మిలియన్లు గేదెలుంటే.. 2019 నాటికి 6.20 మిలియన్లకు తగ్గాయి. – సాక్షి, అమరావతి -
జన చైనాలో తగ్గిన జనాభా.. 1961 తర్వాత ఇదే తొలిసారి
బీజింగ్: జన చైనాలో జనాభా కాస్త తగ్గింది. అక్కడ జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 ఏడాది తర్వాత ఇదే తొలిసారి! 2021 ఏడాది జనాభా లెక్కలతో పోలిస్తే 2022ఏడాదిలో జనాభా 8,50,000 తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లు అని నేషనల్ బ్యూరో లెక్క తేల్చింది. జననాల వృద్ధిరేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే అంచనావేసిన దానికంటే ముందుగానే చైనాను దాటేసి భారత్ ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభాగల దేశంగా అవతరించనుంది. చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 శాతంగా నమోదైన ఈ తరుణంలో జనసంఖ్య సైతం వెనకడుగు వేస్తోంది. గత ఐదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదవడం ఇది రెండోసారి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం ఈ ఏడాదిలోనే చైనాను భారత్ జనసంఖ్యలో అధిగమించనుంది. 2050కల్లా భారత్ 166.8 కోట్ల మందితో కిటకిటలాడనుంది. 131.7 కోట్లతో చైనా రెండోస్థానానికి పడిపోనుంది. ► 2022లో చైనాలో 95.6 లక్షల మంది జన్మించారు. 2021లో 1.062 కోట్ల మంది జన్మించారు. 2021లో 7.52 శాతమున్న జననాల రేటు 2022లో 6.77 శాతానికి పడిపోయింది. ► చైనాలో 72.20 కోట్ల మంది పురుషులు, 68.96 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. మున్న 16– 59 ఏళ్ల వయసు వారు 87.56 కోట్ల మంది ఉన్నారు. ► దేశ జనాభాలో సీనియర్ సిటిజన్లు 62 శాతం. ► 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 28 కోట్లు దాటింది. జనాభాలో వీరు 19.8 శాతం. ► ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత దేశమైన చైనా ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా ఎదిగింది. దీంతో పరిశ్రమల్లో పనిచేసేందుకు జనం పట్టణాల బాటపట్టారు. దీంతో పట్టణాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 92.07 కోట్లకు ఎగబాకింది. -
కులగణనే సమస్యలకు పరిష్కారం
భారత దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థపై ఆధారపడి నిర్మితమయ్యాయి. భూమి మీద ఎవరికైతే హక్కు ఉందో వారే రాజ్యాధికారాన్నీ అనుభవించే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వంటి పై మూడు ఆధిపత్య కులాలవారితో పాటూ శూద్రులైన కొన్ని కులాల వారూ సంపదనూ, రాజ్యాధికారాన్నీ అనుభవించ గలుగుతున్నారు. అయితే రాజ్యాధికారంతో పాటూ దేశ సంపదను కులాల దామాషా ప్రకారం ఎవరికి దక్కాల్సింది వారికి దక్కినప్పుడే... రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కుకు సార్థకత్వం చేకూరుతుంది. ఇందుకు దేశంలో ఏ కులంవారు ఎంత మంది ఉన్నారనే లెక్కలు అవసరం. అందుకే కుల గణనను ప్రభుత్వం తక్షణం చేపట్టాలి. భారతదేశంలో సాంఘిక అసమానతలు తగ్గాలంటే కుల గణనతో పాటు కుల సంపద గణన కూడా జరగాల్సి ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కులగణనకు పూనుకోవడం అందుకు 500 కోట్లు కేటాయించడం ఒక సామాజిక పరిణామానికి తప్పక దోహదం చేస్తుంది. అంబేడ్కర్, లోహియాలు ఇరువురూ ఈ కులగణన విషయంలో గట్టిగా పట్టుపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ హిందువులే అనే వాదనలో బ్రాహ్మణవాదం ఉంది అని వీరు పసిగట్టారు. అది ఒక సందర్భంలో ఎస్సీలను హరిజనులు లేదా దేవుని బిడ్డలు అని చెప్పిన ప్పుడు అంబేడ్కర్ అంటరానివారు దేవుని బిడ్డలు అయితే మరి మిగిలిన వారందరూ దెయ్యం బిడ్డలా అని ప్రశ్నించాడు. ఈ సందర్భంలో మాట్లాడుతూ ఇప్పటికైనా భారతదేశాన్ని మనం మార్చు కోవాలి. సామాజిక న్యాయాన్ని పాలనలో తీసుకురావాలంటే తప్ప కుండా కులగణన జరగాలి. అందరికీ భూమి హక్కు వచ్చినప్పుడే సమానత చేకూరుతుంది. వ్యవసాయం ప్రభుత్వ పరిశ్రమగా ఉండాలి. ప్రభుత్వాధీనంలోకి దేశంలోని భూమిని తీసుకురావాలి. అప్పుడే భూస్వామి, భూమిలేని పేద వ్యవసాయ కూలీ, కౌలుదారు అనే భేదాలు తొలగి పోతాయ న్నాడు అంబేడ్కర్. హిందూ మత భావన జాతి వ్యతిరేకమైనదని ఆయన ప్రకటించాడు. సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజ కీయ ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు అని ప్రకటించాడు. దేన్నైనా అమ్ముకోండి గానీ ఆత్మాభిమానాన్ని మాత్రం అమ్ముకోవద్దని శూద్రు లకు, అతిశూద్రులకు చాటి చెప్పాడు. నిజానికి బిహార్ బౌద్ధ భూమి. అక్కడ బీసీలుగా చెప్పబడుతున్న అనేక కులాల వారు కొన్ని శతాబ్దాలు బౌద్ధులే. భారతదేశంలో ఉన్న శిల్పాలన్నీ దళితులు, బౌద్ధులు చెక్కారు. నిజానికి భారతదేశంలో దళితులు, బహుజనులు కొన్ని శతాబ్దాలు బౌద్ధంలోనే ఉన్నారు. పైగా వారు బౌద్ధ కవులుగా, బౌద్ధ తాత్వికులుగా, బౌద్ధ శిల్పులుగా, బౌద్ధ భిక్షువులుగా జీవించారు. బీసీలు హిందువులుగా మారింది క్రీ.శ. 6వ శతాబ్దం తరువాతే. క్రీ.శ. 6వ శతాబ్దం ప్రాంతంలో భాగవతాన్ని సృష్టించారు. అందులో కృష్ణుని పాత్ర సృష్టించారు. కృష్ణుడు యాదవు డని బహు భార్యాత్వాన్ని ఆయనకి ఆపాదించారు. భగవద్గీతను కూడా ఆయన చేత చెప్పించారు. అప్పటి నుండే యాదవులు హిందువులుగా మారడం ప్రారంభించారు. భగవద్గీత బుద్ధుని పరిణామ వాదానికీ, ప్రకృతివాదానికీ భిన్నంగా చెప్పబడింది. బుద్ధుడు ఏదీ నిత్యం కాదనీ, మిశ్రతమైనదేదీ శాశ్వతం కాదని చెప్పాడు. ఆ అంశాన్ని వివరిస్తూ అంబేడ్కర్ దీనికి అసంగుని వివరణ ఇలా ఇచ్చారు. ‘‘ఒక దాని ఆధారంగా మరొకటి ఏర్పడిన మిశ్రమంలో ఏ ఒక్కటీ స్వయం శక్తి కలిగి ఉండజాలదు. మిశ్రమం విడిపోయినప్పుడు అందలి ధాతువులు సహితం నాశనమైపోవడం అనివార్యం అవుతుంది.’’ మన్ను, నీరు, నిప్పు, వాయువుల మిశ్రమమే జీవి. ఈ నాలుగు ధాతువులు విడిపోయినప్పుడు జీవి విగతమౌతుందనీ, దానినే మిశ్రమ పదార్థ అనిత్యతత్వం అంటారనీ, ‘ఒక వ్యక్తి శాశ్వత మెలా అవుతాడన్నది’’ ఈ శాస్త్రం వివరిస్తుందని అంబేడ్కర్ శాస్త్రీ యంగా క్రోడీకరించాడు. నిజానికి యాదవులు వ్యవసాయ కులం గొర్రెల కాపరులుగా ఉన్నారు. భగవద్గీత వచ్చాక వారిలో భూస్వామ్య ఆధిపత్యం వచ్చింది. బౌద్ధ భావం తగ్గింది. నిజానికి కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి వారంతా శాతవాహనులుగా, రజకులుగా, నాయీ బ్రాహ్మణులుగా తమనుతాము ఆర్యీకరించుకోవడం, బ్రాహ్మణీకరించుకోవడం; భాగ వత, రామాయణ, భారతాల కథలు బుర్రలకు ఎక్కించుకొన్నాకే జరిగింది. అలా బీసీ కులాల వారు హిందువులుగా మారారు. జ్యోతి రావు ఫూలే బీసీలు హిందువులు కాదని చెప్పడం గమనార్హం. భూమిపై ఆధిపత్యం ఉన్నవారు ఆధిపత్య కులాలుగా అవతరించారు. వారే అధికారాన్ని చేపట్టగలుగుతున్నారు. బ్రాహణ, క్షత్రియ, వైశ్య కులాలవారితో పాటూ కొందరు శూద్రకులాలలో ఆధిపత్య కులాల స్థాయికి చేరినవారూ (తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి; బిహార్‌లో యాదవ) అధికార పీఠం ఎక్కగలుగుతున్నారు. వీరిదగ్గరే సంపద పోగుపడిపోతున్నది. కూలినాలీ చేసుకొనే వారికి 40 కోట్ల మందికి ఇళ్లే లేవు. ఆధిపత్య కులాలవారి సంపద తేలితేనే సమ సమాజ రూప కల్పనకు ప్రణాళిక రూపొందించుకునే వీలుంది. అయితే భూమి పంచడానికీ, ఇతర సంపద పంచడానికీ ఆధిపత్య కులాలు సిద్ధంగా లేవు. కాగా నామమాత్రపు రిజర్వేషన్లకు ఈర్ష్య పడుతున్నారు. బిహార్ జనాభా పన్నెండు కోట్ల 70 లక్షల మంది. 16 శాతం ఎస్సీలు, 48 శాతం ఓబీసీలు, 17 శాతం ముస్లింలు, 1.28 శాతం ఎస్టీలు జీవిస్తున్నారు. తాజా జనగణన తర్వాత కులాల శాతాలు కూడా బయటకు వస్తాయి. భారతదేశంలో 1871లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేపట్టింది? బ్రిటిష్‌వాళ్లకు భారతీయ కులవ్యవస్థపై ఒక అవగాహన వస్తే కానీ వారు ఇక్కడ మనలేరు. బహుశా అందుకే కులగణన చేసి ఉంటారు. ఈ కుల గణన వల్ల శూద్రులకు, అతి శూద్రులకు సామాజిక çస్పృహ వస్తుందని మహాత్మా ఫూలే నడిపిన సత్యశోధక్ సమాజ్ పేర్కొంది. అంబేడ్కర్ ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ ఆంత ర్యాన్ని కనిపెట్టాడు. రాముడు వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించడం కోసం శంబూకుణ్ణి చంపాడు కాబట్టి అన్ని విశ్వవిద్యాలయాల్లో శూద్ర, అతి శూద్ర, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. తామే చదువు కోవాలి, ఇంకొకరు చదువుకోకూడదు. తమకే భూములుండాలి, మరొ కరికి ఉండకూడదు; తమకే రాజ్యాధిపత్యం ఉండాలి, వేరే వారికి ఉండకూడదు అనే మనువాద భావాలను బాగా నమ్ముతున్నారు కనుక ఇటువంటి దాడులకు వారు తెగబడుతున్నారు ఆధిపత్య కులాల వారు. ఈ భావాలు ఏ కులం వారికి ఉన్నా అవి రాజ్యాంగ విరుద్ధమై నవే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవిస్తున్న అగ్రవర్ణ ఆధిపత్య బ్రాహ్మణవాదులు నిషేధిత సంస్థల నుండి ఆవిర్భవించినవారేవీరంతా. వారెప్పుడూ రాజ్యాంగానికి బాధ్యులుగా లేరు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మార్గంలో వారు నడుస్తున్నారు. మాట్లాడే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చిందని వారికి తెలియదు. ఈ మనువాదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే బౌద్ధాన్ని అంబేడ్కర్, లోహియా, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ అనుసరించారు. ఇప్పుడు మనం బౌద్ధ భారతాన్ని నిర్మించుకోవాలి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు ఉత్పత్తి శక్తులు. వారిని పేదరికంలోఉంచి, వారిని దుఃఖంలో ఉంచి ఎవరైనా రాజ్యాంగేతరులుగా పరిపాలించాలని అనుకుంటే అది వట్టి భ్రమే. రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్ ఈ విధంగా చెబుతుంది. కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశం కారణాలుగా వివక్షకు తావులేదు.1) కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై ఏ వ్యక్తినీ ప్రభుత్వం వివక్షకు గురి చేయరాదు. 2) కేవలం, మతం, జాతి, కులం, లింగం పుట్టిన ప్రదేశం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై పౌరులెవరికీ హక్కులను నిరాకరించటం, నియంత్రించటం, అర్హత లేకుండా చేయడం గాని చేయరాదు. భారతదేశ పునర్నిర్మాణానికి భారత రాజ్యాంగమే గీటురాయి. మతతత్వవాదులు తప్పక ఓడిపోతారు. ఒక మతం భారతదేశాన్ని ఎప్పటికీ పరిపాలించలేదు. ఒక కులం భారతదేశాన్ని ఎప్పటికీ పరిపా లించలేదు. భారతదేశం అంతర్గతంగా తీవ్రమైన సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక విద్యాపరమైన మార్పుకు గురవుతూ వస్తుంది. దళిత బహుజన మైనార్టీలు లౌకికవాదులు ఏకమై సమ సమాజ నిర్మాణానికి పోరాడాల్సిన యుగమిది. కులగణనే కాదు కులసంపద గణన కూడా జరగాల్సిందే. భారతదేశంలో ప్రజలందరూ సమానంగా బతికే రోజు కోసం పోరాడాల్సిందే. అదే అంబేడ్కర్, ఫూలే మార్గం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత -
జనాభా తగ్గినా డేంజరే..
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): జనాభా పెరగడమే అన్ని సమస్యలకు మూలమని ఇప్పటివరకు అందరిదీ అదే భావన. ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్‌లాంటి దేశమే ఇప్పుడీ సమస్య ఎదుర్కొంటోంది. ఆసియా ఖండంలో ప్రస్తుతం జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటుండగా.. ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడమంటే.. దేశ జనాభా సరాసరి వయసు పెరగడం. తద్వారా పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతుండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. అదే మన దేశంలో ప్రస్తుత సరాసరి వయసు 28.4ఏళ్లు. ఇది ఇప్పుడు మనకు కలిసొచ్చే అంశం. పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో మనోళ్లు 171 మంది ప్రపంచంలో ప్రతి నాలుగు నిమిషాలకు దాదాపు వెయ్యి మంది పుడుతున్నారు. వీరిలో అత్యధికంగా 171 మంది మన దేశంలోనే ఊపిరిపోసుకుంటున్నారు. ఆ తర్వాత 102 మందితో చైనా రెండో స్థానంలో.. 56 మందితో మూడో స్థానంలో నైజీరియా ఉన్నాయి. అలాగే, పాకిస్తాన్ 47 మందితో నాల్గో స్థానంలో.. 31 మందితో కాంగో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా టాప్–5లో ఆసియా, ఆఫ్రికా దేశాలే ఉన్నాయి. ► ఇక 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే.. ప్రపంచ సరాసరి బర్త్‌రేట్ కంటే కొద్దిగానే ఎక్కువ. మన దేశంలో బర్త్‌రేట్ 17.7 ఉంటే, ప్రపంచ బర్త్‌రేట్ 16.8 ఉంది. ► అదే చైనా ప్రపంచ జనాభాలో నంబర్‌వన్. కానీ, జననాల సంఖ్య మన కంటే తక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే జనాభా పెరుగుదల మందగించింది. ఇదే తీరు కొనసాగితే.. జనాభా పెరుగుదల ఆగిపోవడం ఎంతోదూరంలో లేదని నిపుణుల అంచనా. ► ఇక నైజీరియా కథ వేరు. ఇక్కడ బర్త్‌రేట్ (34.2) ప్రపంచ బర్త్‌రేట్‌కు రెట్టింపుగా ఉంది. పేదరికం ఎక్కువగా ఉండటం, మహిళలు విద్యకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. సంపద పెరిగితే జనాభా పెరుగుదల డౌన్ సంపద పెరిగిన దేశాల్లో బర్త్‌రేట్ తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుదల వేగం మందగించడం 1960లో మొదలైంది. ఇదే తీరు కొనసాగితే.. 2100 సంవత్సరానికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని, ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా తగ్గుదల మొదలైతే ప్రపంచ జనాభా సరాసరి వయసు పెరగడం మొదలవుతుంది. ఇది జరిగితే సమాజానికి వృద్ధఛాయలు వస్తాయి. చాలా దేశాలు ఇప్పుడీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో 20 దేశాల జనాభా ప్రమాదకరస్థాయిలో తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. కానీ, జనాభా తగ్గుదల అంశం మన దేశంలో కనుచూపుమేరలో లేదు. ► యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో పోలిస్తే పేద దేశంగా పరిగణించే బల్గేరియాలో జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ గత మూడు దశాబ్దాల్లో జనాభా 20 శాతం తగ్గిపోయింది. మరో 30 ఏళ్లలో 22.5 శాతం తగ్గుతుందని ఐరాస అంచనా. ► ఇక ఉక్రెయిన్లోనూ బర్త్‌రేట్ బాగా తగ్గుతోంది. దేశం నుంచి వలసలూ పెరుగుతున్నాయి. ఫలితంగా వచ్చే 30 ఏళ్లలో దాదాపు 20 శాతం జనాభా తగ్గొచ్చు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావాన్ని కలిపితే జనాభా మరింత వేగంగా తగ్గొచ్చు. మరోవైపు.. జనాభా తగ్గుతున్న దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్నవే. ఆసియాలో ఈ సమస్యలేదు. కానీ, జపాన్ కథ భిన్నంగా ఉంది. 2008లో 12.68 కోట్లు ఉన్న జనాభా ప్రస్తుతం 12 కోట్లకు తగ్గిపోయింది. 2050 నాటికి 10.58 కోట్లకు తగ్గుతుందని అంచనా. జనాభా తగ్గుదల అంటే.. దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. పుట్టుకలు తగ్గుతున్నకొద్దీ.. జనాభా సరాసరి వయసు పెరుగుతుంది. అంటే పనిచేయగలిగే వయస్సున్న జనాభా తగ్గుతారు. 1950లో జపాన్ జనాభా సరాసరి వయసు 22ఏళ్లు. అదే 2020లో 48కు, ఇప్పుడు 49 ఏళ్లకు పెరిగింది. ఈ విషయంలో జపాన్‌ది తొలిస్థానం. ఫెర్టిలిటీ రేట్ (ఒక మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య) ప్రస్తుతం 1.4 ఉంది. ఇది ప్రపంచ సరాసరిలో సగానికంటే తక్కువ. మన దేశానికి ప్రయోజనాలెన్నో.. మన దేశం విషయానికొస్తే.. ఇక్కడ జనాభా పెరుగుతోంది. 140.2 కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.7 శాతం. దేశంలో ఏటా ఒక శాతం చొప్పున పెరుగుతోంది. త్వరలోనే చైనాను అధిగమిస్తామని నిపుణుల అంచనా. జనాభా పెరుగుదలతో పాటే మన జనాభా సరాసరి వయసూ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ► 1970లో దేశ జనాభా సరాసరి వయసు 19.3 ఏళ్లుగా నమోదైంది. ► 2015లో 26.8 ఏళ్లకు.. 2022లో 28.4, 2025లో 30 ఏళ్లు, 2030లో 31.7, 2050లో 38.1 ఏళ్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. ► గట్టిగా పనిచేయగలిగే వయస్సున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతోంది. ► వీరికి పని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు. ► ఈ నేపథ్యంలో.. జనాభా తగ్గుదల సమస్య మనకు ఇప్పట్లో లేకపోయినా, శతాబ్దం తర్వాత మనదీ ఐరోపా దేశాల పరిస్థితే అని అంచనా. -
తగ్గనున్న భారత్ జనాభా.. నివేదికలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో భారత జనాభా భారీగా తగ్గుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 141కోట్లుగా ఉన్న మన దేశ జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు పడిపోతుందని తెలిపింది. జనాభా పెరుగుదల ఎంత ప్రతికూలమో.. క్రమంగా తగ్గినా అంతే ప్రమాదమని పేర్కొంది. జ్ఞానం, జీవన ప్రమాణాలు పడిపోయి క్రమంగా జనాభా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుందని స్టాండ్ఫోర్డ్ అధ్యయనం పేర్కొంది. రానున్న రోజుల్లో భారత జనసాంద్రత ఆందోళనకర స్థాయిలో పడిపోతుందని చెప్పింది. జనాభా విషయంలో భారత్, చైనా దాదాపు ఒకేలా కన్పిస్తున్నప్పటికీ.. జనసాంద్రతకు వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంది. భారత్‌లో ప్రతి చదరపు కిలోమీటర్‌కు 476మంది నివసిస్తారు. చైనాలో మాత్రం ఆ సంఖ్య 148 మంది మాత్రమే. 2100 నాటికి భారత్‌లో జనసాంద్రత 335కి పడిపోతుందని, ఇది ప్రపంచం మొత్తంతో పోల్చితే చాలా ఎక్కువ అని అధ్యయనం అంచనా వేసింది. భారత్‌తో పాటు చైనా, అమెరికాలో వచ్చే 78 ఏళ్లలో జనాభా తగ్గిపోనుంది. ముఖ్యంగా చైనా జనాభా 2100 నాటికి 49 కోట్లకు పడిపోనుంది. సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. 2050 నాటికే మొత్తం సంతానోత్పత్తి 0.5 శాతానికే పరిమితం అవుతుందని అంచనా. భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2032నాటికి 1.76శాతం నుంచి 1.39శాతానికి తగ్గనుంది. 2052నాటికి 1.28శాతానికి, 2082 నాటికి 1.2శాతానికి, 2100 నాటికి 1.19శాతానికి పడిపోతుందనే అంచనాలున్నాయి. చదవండి: మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు -
తగ్గుతున్న యువ భారతం!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా యువత జనాభా తగ్గుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే యువత భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ‘యూత్ ఇన్ ఇండియా–22’ నివేదికలో వెల్లడించింది. 2036 నాటికి యువ జనాభాపై నివేదిక రూపొందించింది. క్షీణిస్తున్న సంతానోత్పత్తి, ఆయుర్థాయం పెరుగుదల కారణంగా ఒకపక్క యువ జనాభా తగ్గుతుండగా మరో సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. 15 – 29 ఏళ్ల లోపు వారిని యువత కింద పరిగణించి నివేదిక రూపొందించారు. ► 2021 నాటికి ఏపీలో 1.32 కోట్ల మంది యువత ఉండగా 2036 నాటికి 1.05 కోట్లకు తగ్గనున్నట్లు నివేదిక అంచనా వేసింది. అంటే యువత శాతం 25.1 నుంచి 19.6 శాతానికి తగ్గనుంది. ఇదే సమయంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు 12.3 శాతం నుంచి 19 శాతానికి పెరగనున్నారు. ► దేశంలో ప్రస్తుత జనాభాలో యువత 27.3 శాతం ఉండగా 2036 నాటికి 22.7 శాతానికి తగ్గనుంది. ఇదే సమయంలో వృద్ధులు 10.1 శాతం నుంచి 15 శాతానికి పెరగనున్నారు. ► దేశంలో ప్రస్తుతం 14 సంవత్సరాల్లోపు జనాభా 25.7 శాతం ఉండగా 2036 నాటికి 20.2 శాతానికి తగ్గనుంది. ఇదే వయసు వారు రాష్ట్రంలో 20.5 శాతం నుంచి 15.7 శాతానికి తగ్గనున్నారు. ► దేశంలో 30 – 59 ఏళ్ల లోపు జనాభా 37 శాతం ఉండగా 2036 నాటికి 42.2 శాతానికి పెరగనుంది. ఇదే వయసు వారి జనాభా రాష్ట్రంలో 42 శాతం నుంచి 45.8 శాతానికి పెరగనున్నట్లు అంచనా.