నోటి క్యాన్సర్ విషయంలో దేశంలోని రాజస్థాన్ మూడవ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జనాభాలో 30 శాతం మంది నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నోటి క్యాన్సర్ అనేది గుట్కా, బీడీ, సిగరెట్, పొగాకు మొదలైన మత్తుపదార్థాలు తీసుకోవడం వలన వస్తుంది.
ఈ మత్తు పదార్థాలను తీసుకున్నప్పుడు నోటిలో పుండు ఏర్పడి, అది ఎంతకీ నయంకానపుడు, అది క్యాన్సర్‌గా పరిణమిస్తుంది. మరోవైపు నోటిలోపల అల్సర్లు ఉండటం సాధారణమేనని అనిపించినా, ఇది తీవ్రమైనప్పుడు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. నోటి పుండు అనేది చాలా సాధారణ సమస్యే అయినప్పటికీ, దానిని విస్మరించడం ప్రాణాంతకమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ ఆశిష్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 30 శాతం మంది నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెడు అలవాట్లు. అయితే ఈ వ్యాధికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా నోటి క్యాన్సర్‌కు కారణంగా నిలుస్తున్నాయి.
నోటి లోపల ఏర్పడే పుండ్లు దీర్ఘకాలం ఉంటే అది క్యాన్సర్‌గా మారే అవకాశం 50 నుంచి 60 శాతం వరకూ ఉంటుందని డాక్టర్ ఆశిష్ జోషి తెలిపారు. 43 ఏళ్లుగా దంతవైద్యునిగా సేవలందిస్తున్న డాక్టర్ ఆశిష్ ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు నోటి క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment