affected
-
మేటల తొలగింపు మాటల వరకే
వరద బారినపడి పొట్టదశకు వచ్చిన వరి పంట నాశనమైపోయింది. పొలాల్లో వేసిన ఇసుకమేటలు నెలలు గడుస్తున్నా అలాగే ఉన్నాయి. ఇంతవరకూ అధికారులుగానీ, నాయకులుగానీ పట్టించుకోలేదు. కనీసం అంచనాలు కూడా వేయలేదు. ఒకపక్క పంట పోయింది. వేరేపంట వేద్దామంటే పొలం నిండా ఇసుక, మట్టి మేటలు వేసి ఉంది. దాన్ని తొలగించాలంటే ఎకరానికి రూ.30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చవుతుంది. కాలువలకు పడిన గండ్లు కూడా ఇంకా పూడ్చలేదు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. – ముప్పిడి శ్రీనివాసరెడ్డి, కౌలురైతు, రాపర్తి, పిఠాపురం మండలంపిఠాపురం: ఏటా మూడు పంటలు పండే మాగాణి ఇసుక దిబ్బలా కనిపిస్తోంది. వరద సమయంలో వచ్చి మేమున్నామని హామీ ఇచ్చిన నాయకులు, అధికారులు పత్తాలేకుండా పోయారు. నెలలు గడిచిపోతున్నాయి. పొలానికి వెళ్తే కాలువకు పడిన గండ్లు వెక్కిరిస్తున్నాయి. పంట పోయి, పొలం నాశనమై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంటే.. సర్కారు నాలుక మడతెట్టింది. ఇసుకమేటలు తొలగించేందుకు పరిహారం ఇచ్చేది లేదని, ఉపాధి హామీ ద్వారా పనులు చేయిస్తామంటూ చేతులెత్తేయడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు.సెప్టెంబర్ నెలలో కురిసిన భారీవర్షాల కారణంగా ఏలేరు కాలువ ముంచెత్తడంతో కాకినాడ జిల్లాలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, పెద్దాపురం, కిర్లంపూడి తదితర మండలాల్లో సుమారు 80 వేల ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏలేరు కాలువకు గండ్లుపడి సుమారు 500 ఎకరాల్లో ఇసుక, మట్టి భారీఎత్తున మేటలు వేశాయి. పిఠాపురం మండలం రాపర్తి ఏరియాలోని వరి పొలాల్లో సుమారు 2 అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. దీంతో ఇసుక తొలగిస్తే తప్ప తరువాతి పంట వేయలేమని రైతులు వాపోతున్నారు. హెక్టారుకు రూ. 17 వేలు ఇస్తామన్నారు.. వరద ప్రభావం వల్ల పంటలు నాశనమైన పొలాలకు ఎకరానికి రూ.10వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, ఇసుక మేటలు వేసిన పొలాలకు హెక్టారుకు రూ.17 వేలు ఇస్తామని అప్పట్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రకటించారు. 3 అంగుళాల మేర ఇసుక మేట ఉంటే పరిహారానికి అర్హులుగా పరిగణిస్తామన్నారు. అయితే పొలాల్లో 8 నుంచి 10 అంగుళాల మేర ఇసుక మేటలు ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు నీట మునిగాయని, 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని తెలిపారు. ప్రత్యేక బృందాలతో పంటనష్టం అంచనాలు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. రైతులు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇసుకమేటలకు పరిహారం రాదనడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పొట్టదశలో పంట తుడిచిపెట్టుకుపోయింది సకాలంలో వర్షాలు కురవడంతో ఈ ఏడాది పంటలు బాగా పండుతాయన్న ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేశాను. అంతా బాగుంది, పంట పొట్టదశకు చేరుకుంటుందన్న సమయంలో వరద ఒక్కసారిగా పంటను తుడిచిపెట్టేసింది. పెట్టుబడి అంతా నీటి పాలయ్యి అప్పులు మిగిలాయి. ప్రభుత్వం చూస్తే ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇస్తారో ఇవ్వరోకూడా తెలియదు. పంట పోతే పోయింది. పొలాల్లో వేసిన ఇసుక మేటలు మాపై మరింత భారాన్ని వేశాయి. నిబంధనల పేరుతో ఇసుకమేటలు తొలగింపుకు పరిహారం ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. గతంలో హెక్టారుకు రూ. 17 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు లేదంటున్నారు. పొలాల్లో వేసిన ఇసుకమేటలు తొలగించాలంటే ఎకరాకి రూ. 40 వేలకు పైనే ఖర్చవుతుంది. – చింతపల్లి నీలారెడ్డి, రైతు, రాపర్తి, పిఠాపురం మండలం మట్టి, ఇసుక మేటలకు పరిహారం రాదు వరద వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిన రైతులకు పరిహారం వచ్చే అవకాశం లేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట పొలాల్లో ఇసుక, మట్టి మేటలు తొలగించడానికి చర్యలు తీసుకుంటారు. అది ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. – ఎ.అచ్యుతరావు, వ్యవసాయశాఖ అధికారి, పిఠాపురం మండలం -
ఢిల్లీవాసుల హాహాకారాలు.. ఒకవైపు వాయు కాలుష్యం.. మరోవైపు నీటి ఎద్దడి
న్యూఢిల్లీ: ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు నీటి ఎద్దడి.. ఢిల్లీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితి అక్కడి ప్రజల ఆనందాన్ని హరింపజేస్తోంది.దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే పటాసులు కాల్చడంపై నిషేధం కొనసాగుతుండగా, తాజాగా అక్టోబర్ 31 వరకు నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటుందని ఢిల్లీ జల్ బోర్డు ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. ఢిల్లీలో గాలి ఇప్పటికే పూర్ కేటగిరీలో ఉంది. పలు ప్రాంతాల్లో గాలినాణ్యత(ఏక్యూఐ) 400గా ఉంది. ఈ నేపధ్యంలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించే అవకాశం ఉంది.అక్టోబర్ 31 వరకు ఢిల్లీలోని 60కి పైగా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనున్నదని ఢిల్లీ జల్ బోర్డు తెలిపింది. ఢిల్లీకి పలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి నీరు సరఫరా అవుతుంది. 110 ఎంజీడీ భార్గతి ప్లాంట్, 140 ఎంజీడీ సోనియా విహార్ ప్లాంట్‌కు నీరు ప్రధానంగా గంగా కెనాల్ నుండి వస్తుంది. యూపీ నీటిపారుదల బోర్డు దీనికి అక్టోబర్ 12 నుండి 31 వరకు మరమ్మతు పనులు చేయనుంది.ఈ కారణంగా ఈ ప్లాంట్లను మూసివేయనున్నారు. అటువంటి పరిస్థితిలో యమునా నది నుండి ఢిల్లీకి నీటిని సరఫరా చేయనున్నారు. అయితే యమునా నీటిలో అమ్మోనియా స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నీటిని పరిశుభ్రపరిచేందుకు ఇబ్బందులు ఎదురువుతుంటాయి. ఫలితంగా ఢిల్లీకి నీటి సరఫరా తగ్గిపోయింది. ఇదే ఢిల్లీలో నీటి ఎద్దడికి కారణంగా నిలుస్తోంది. అయితే అవసరమైన ప్రాంతాలకు ట్యాంకార్ల ద్వారా ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తుంటుంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల -
వరదబాధితులకు జగన్ పరామర్శ.. పిఠాపురంలో జననేతకు జన నీరాజనం (ఫొటోలు)
-
భీకర వరదల ధాటికి ఆంధ్రప్రదేశ్ విలవిల... వేలాది హెక్టార్లలో పంటలు నీటిపాలు... కేంద్రం నుంచి సాయం అందగానే సహాయక చర్యలు ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
-
Bangladesh: భారీ వర్షాలు, వరదలకు 20 మంది మృతి
బంగ్లాదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నదులు ఉప్పొంగి వరదలు సంభవిస్తున్నాయి. వరదల బారినపడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 52 లక్షల మందికి పైగా జనం వరదల కారణంగా నిరాశ్రయులయ్యారని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. వీరికి ఆహారం, తాగునీరు, మందులు, దుస్తులు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే మారుమూల ప్రాంతాల్లో రోడ్లు మూసుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది.తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులు కాస్త మెరుగువుతున్నాయని అన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు.కాగా దేశంలోని 11 వరద ప్రభావిత జిల్లాల్లో ఏర్పాటు చేసిన 3,500 షెల్టర్లలో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకుంటున్నారని అధికారులు తెలిపారు. 750 వైద్య బృందాలు వారికి వైద్య సహాయం అందిస్తున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. -
ప్రతికూల వాతావరణం.. 80 శాతం రైతులు కుదేలు
ఊహకందని రీతిలో మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులను నిరాశలోకి నెట్టేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి విపత్తులతో రైతులు భారీ స్థాయిలో పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు.గత ఐదేళ్లలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశంలో 80 శాతం మంది రైతులు తమ పంటలను నష్టపోయారు. పలు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో నాట్లు వేయడం, విత్తనాలు విత్తడంలో జాప్యం జరుగుతున్నదని, ఇది పంటల దిగుబడిపై ప్రభావం చూపుతున్నదని నిపుణులు అంటున్నారు. ఫోరమ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఫర్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ (ఫీడ్) తాజాగా విడుదల చేసిన నివేదికలో దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.దేశంలోని 21 రాష్ట్రాల్లోని 6,615 మంది రైతుల నుంచి ఫీడ్ పలు వివరాలు సేకరించింది. దేశంలో సంభవించిన పంట నష్టాల్లో 41 శాతం కరువు కారణంగా, 32 శాతం సక్రమంగా వర్షాలు కురియక, 24 శాతం రుతుపవనాల ముందస్తుగా లేదా ఆలస్యంగా వచ్చిన కారణంగా సంభవించినట్లు ఫీడ్ సర్వేలో తేలింది.సర్వేలో పాల్గొన్న రైతులలో 43 శాతం మంది తమ పంటలో కనీసం సగం పంట నష్టపోయామని తెలిపారు. ముఖ్యంగా వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు అధిక వర్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వరి పొలాల్లో కొత్తగా నాటిన మొక్కలకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా తక్కువ వర్షపాతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లను ప్రభావితం చేసింది. బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, వేరుశనగ తదితర పంటల విత్తనాలు నాటడంలో ఆలస్యం జరిగింది. ఇది పంట దిగుబడులపై ప్రభావం చూపనున్నదని నిపుణులు అంటున్నారు. -
ఆ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన 30 శాతం జనాభా
నోటి క్యాన్సర్ విషయంలో దేశంలోని రాజస్థాన్ మూడవ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జనాభాలో 30 శాతం మంది నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నోటి క్యాన్సర్ అనేది గుట్కా, బీడీ, సిగరెట్, పొగాకు మొదలైన మత్తుపదార్థాలు తీసుకోవడం వలన వస్తుంది. ఈ మత్తు పదార్థాలను తీసుకున్నప్పుడు నోటిలో పుండు ఏర్పడి, అది ఎంతకీ నయంకానపుడు, అది క్యాన్సర్‌గా పరిణమిస్తుంది. మరోవైపు నోటిలోపల అల్సర్లు ఉండటం సాధారణమేనని అనిపించినా, ఇది తీవ్రమైనప్పుడు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. నోటి పుండు అనేది చాలా సాధారణ సమస్యే అయినప్పటికీ, దానిని విస్మరించడం ప్రాణాంతకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ ఆశిష్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 30 శాతం మంది నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెడు అలవాట్లు. అయితే ఈ వ్యాధికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా నోటి క్యాన్సర్‌కు కారణంగా నిలుస్తున్నాయి. నోటి లోపల ఏర్పడే పుండ్లు దీర్ఘకాలం ఉంటే అది క్యాన్సర్‌గా మారే అవకాశం 50 నుంచి 60 శాతం వరకూ ఉంటుందని డాక్టర్ ఆశిష్ జోషి తెలిపారు. 43 ఏళ్లుగా దంతవైద్యునిగా సేవలందిస్తున్న డాక్టర్ ఆశిష్ ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు నోటి క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. -
అయోధ్య రూట్లో రైళ్లు రద్దు.. కారణమిదే!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్ (సింగిల్ ట్రాక్ డబ్లింగ్), విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో జనవరి 16 నుండి 22 వరకు అయోధ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ రూటులో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా మొత్తం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. అలాగే డూన్ ఎక్స్‌ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రేఖా శర్మ మీడియాతో మాట్లాడుతూ అయోధ్య కాంట్ నుండి ఆనంద్ విహార్ (ఢిల్లీ)కి వెళ్లే వందే భారత్ రైలును ట్రాక్ నిర్వహణ కారణంగా జనవరి 15 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. అయితే ఈ రైలు రద్దును జనవరి 22 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్‌లల్లా పవిత్రోత్సవానికి జరుగున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని, అయోధ్య రైల్వే సెక్షన్లో ట్రాక్ డబ్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలావుండగా అయోధ్యలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభోత్సవానికి ముందే హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. జనవరి 22కు ముందుగానే భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభమవుతుందని యూపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించి నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు. అయోధ్యలో రామ మందిరాన్ని ఈనెల 22న ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరగనుంది. రాజకీయ నేతలు మొదలుకొని, సినిమా, క్రీడా ప్రపంచానికి చెందిన పులువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి! -
అండగా నేనున్నా
సాక్షి తిరుపతి: అధైర్యపడొద్దు.. అండగా నేనున్నానంటూ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించి బాధితులను స్వయంగా కలుసుకుని పరామర్శించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతన్నకు జరిగిన అపార నష్టాన్ని చూసి సీఎం జగన్ చలించిపోయారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తామన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తీసుకొచ్చిన వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు వేళ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు తీసుకుందన్నారు. గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ తొలుత తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిలాల్లోని తుపాన్ బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం కోట మండలం విద్యానగర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామానికి చేరుకుని కోతకు గురైన స్వర్ణముఖి నది, వరి పంటలను పరిశీలించారు. స్వర్ణముఖి కోతకు గురి కావటానికి కారణాలను ఆరా తీశారు. బాలిరెడ్డిపాళెంలో తుపాను బాధితులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. చెప్పలేనంత బాధగా ఉంది.. 'ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు జిల్లా మొత్తం సగటుతో పోల్చుకుంటే అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిసింది. దాదాపు 40 – 60 సెంటీమీటర్ల వర్షం కురిసిన పరిస్థితి. మనందరికీ జరిగిన ఈ నష్టం, కష్టం చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 92 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 8,364 మందిని తరలించాం. 25 కిలోల రేషన్ బియ్యం, కేజీ కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, లీటరు పామాయిల్ చొప్పున దాదాపు 60 వేల మందికి పైగా బాధితులకు అందచేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది.. వలంటీర్ వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ. అందువల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఆందోళన చెందాల్సిన పనిలేదు.' అని సీఎం జగన్ తెలిపారు. 'ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చి చెబుతున్నా. నాకు నష్టం జరిగింది.. కానీ ఎదుటివాడికి మాత్రమే సాయం వచ్చింది.. నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. ఏ ఒక్కరినీ నష్ట పోనివ్వం. ప్రతి ఒక్కరికీ మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది. పంపిణీ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 62 వేల కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 చొప్పున డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల ఇళ్లలోకి నీళ్లు వచి్చన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. ఇవాళ మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 చొప్పున డబ్బులిచ్చే కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళతారు. ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఊరట. పంటలు వేసి నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలను అందచేస్తాం. అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఈ రోజు నుంచి వారంలోగా ప్రతి ఒక్కరికీ జరగాల్సిన మంచి జరుగుతుంది.' అని సీఎం జగన్ చెప్పారు. రెట్టించిన వేగంతో యంత్రాంగం 'తుపాన్ ప్రాంతాల్లో విద్యుత్తును చాలా వేగంగా పునరుద్ధరించారు. యంత్రాంగం అంతా ఇక్కడే నిమగ్నమై రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. ఇంకా కొన్ని కాలనీల్లో విద్యుత్తు లేని పరిస్థితి ఉంటే వలంటీర్ల ద్వారా వివరాలను సేకరించి కలెక్టర్లు సమస్యను పరిష్కరిస్తారు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని మరోసారి చెబుతున్నా. ' అని అన్నారు. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు సీఎం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్‌రెడ్డి, తానేటి వనిత, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, మేకపాటి విక్రమ్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్సీలు చంద్రశేఖరరెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళీధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, స్వచ్ఛాంధ్ర రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మీదే.. 'ఇక్కడికి రాకముందు స్వర్ణముఖి నదిలో కోత కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో స్వయంగా చూశా. దానికి శాశ్వత పరిష్కారం వెతకాలని చెప్పా. హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని, అందుకోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ సమస్యను తీరుస్తూ హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా. జిల్లాలో 110 చెరువులు ఉండగా కొన్ని చోట్ల కోతకు గురయ్యాయి. రోడ్లు మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుడతాం. రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతుల కోసం రూ.32 కోట్ల ప్రతిపాదనలు అందాయి. యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేపట్టే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం మీది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ మంచే జరుగుతుంది. అంతేకానీ చెడు అనేది ఎప్పుడూ జరగదు. ఏ చిన్న సమస్యైనా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వెంటనే ‘జగనన్నకు చెబుదాం’ 1902 నంబర్‌కు ఫోన్ కొట్టండి. నా ఆఫీస్‌కే ఫోన్ వస్తుంది. తుపాన్ బాధిత ప్రాంతాల్లో అందరికీ అన్నీ అందించే బాధ్యతను కలెక్టర్ తీసుకుంటారు. నాలుగైదు రోజుల్లో వారి దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా.' అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఆ పత్రికలు చదవొద్దు.. అపోహలు నమ్మొద్దు: సీఎం జగన్ -
ఎగిరెగిరి పడ్డ టమాటా.. ఇప్పుడు ఢీలా!
సాక్షి, కర్నూలు జిల్లా: తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావం రాష్ట్రంలో టమాటా ధరలపై పడింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మార్కెట్లకు టమాటా చేరడం లేదు. దీంతో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా రూ. 4 నుంచి 10 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ప్యాపిలి మార్కెట్లోనూ టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో టమాటా రూ.3 మాత్రమే పలుకుతోంది. ధరలు లేకపోవడంతో టమాటాలను రైతులు మార్కెట్‌కు ఆరుబయటే పారేసి వెళ్లిపోతున్నారు. పచ్చి పంట కావడంతో ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటాలను రోడ్లపైనే పారబోస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కనీస ధర లేకపోవడంతో డోన్ జాతీయ రహదారిపైనే టమాటాలను ఓ రైతు పారబోశాడు. పారబోసిన టమాటాలను పశువులు తింటున్నాయి. రవాణా ఖర్చులు కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చి పంట అయినందున ఎక్కడా దాచలేమని రైతులు దిగులు పడుతున్నారు. మొన్నటి వరకు కిలో రూ. 200 వరకు పలికిన కిలో టమాటా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇప్పటివరకు ఎన్నో ఆశలతో ఉన్న టమాటా రైతులు.. వర్షాలతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయని చెబుతున్నారు. గత రెండు నెలలుగా ఎగిరెగిరి పడ్డ టమాటా ఇప్పుడిలా ఉల్టా కావడం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఇదీ చదవండి: అలా.. ఆంధ్రప్రదేశ్‌కు బోలెడు అవకాశాలు -
వరద నీటి దిగ్బంధంలో భద్రకాళి అమ్మవారి టెంపుల్ ప్రాంతం
-
గుర్తు తెలియని వైరస్ సోకడంతో ఇంగ్లాండ్ క్రికెటర్లకు అస్వస్థత
-
అఫర్డబుల్ హౌస్ లోన్స్ .. వారికి కష్ట కాలమే!
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణరంగ వ్యయాలు పెరిగి పోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అదిప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1-6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8-13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడిసరుకు ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20-25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
కరోనాతో భర్తను కోల్పోయిన బామ్మ.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కరోనాతో ఆప్తులను కోల్పోయిన బాధతోపాటు, తీరని ఆర్థిక ఇబ్బందులు వారిని కోలుకోలేని దెబ్బతీశాయి. అయితే స్వయంగా కరోనా బాధితురాలు, ఈ కష్టాలను స్వయంగా చూసిన 87 ఏళ్ల బామ్మ ‘పెద్దమనసు’ విశేషంగా నిలిచింది. ఆ వివరాలు.. కోవిడ్-19కారణంగా భర్త రాజ్‌కుమార్‌ను కోల్పోయిన ఉషాగుప్తా (87) మొదట్లో చాలా కృంగిపోయారు. ఆరు దశాబ్దాల తమ ప్రేమ సౌధం ఒక సెకనులో కూలిపోయినట్టుగా పుట్టెడు దుఃఖం ఆవిరించింది. చివరికి ఆ బాధను దిగమింగి, కరోనా బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు నడుం బిగించారు. నడుం ఒంగిపోయిన తన వల్ల ఏమవుతుందిలే అని మిన్నకుండిపోలేదు. తన చేతనైన విద్య ద్వారా అసహాయులకు ఆపన్న హస్తం అందించేందుకు నిర్ణయించారు. అలా రూపుదిద్దుకున్నదే ‘పికెల్డ్ విత్ లవ్’ వ్యాపారం. ఉషా గుప్తా, రాజ్‌కుమార్ దంపతుల 60 ఏళ్ల వైవాహిక జీవితాన్ని చూసి ఆ కరోనాకు కన్నుకుట్టిందేమో.. ఇద్దరికీ ఒకేసారి మహమ్మారి వైరస్ సోకింది. అయితే ఉష కోలుకున్నప్పటికీ, ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో 27 రోజులపాటు పోరాడిన ఆమె భర్త రాజ్‌కుమార్ కన్నుమూశారు. దీంతో ఉషాగుప్తా ఒక్కసారిగా అగాధంలోకి కూరుకు పోయినంత ఆవేదన చెందారు. భర్త మరణానికి తోడు, ఆక్సిజన్ కొరత, బెడ్లు దొరక్క ఢిల్లీ ఆసుపత్రిలో కరోనా బాధితుల కష్టాలను గుర్తు చేసుకుని మరింత చలించిపోయారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న రోగులు, వారి బంధువుల నిస్సహాయతను చూసి కలత చెందారు. హాస్పిటల్లో చుట్టూ చాలా కష్టాలు చూశాను. ఆక్సిజన్ కొరత ఒకటైతే.. అక్కడున్నవారంతా ఏదో యుద్ధంలో ఉన్నట్టనిపించింది. అందరిలో చాలా అందోళన అంటూ తన అనుభవాలను ఉష గుర్తుచేసుకున్నారు “నా భర్తను కోల్పోయిన తరువాత సర్వం కోల్పోయిన వేదన అనుభవించాను. అదే సందర్భంలో కరోనా కుటుంబాలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేసిందో ఈ సందర్భంగా చూశాను, ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి అండ లేనివారిని చూస్తే బాధ అనిపింది. అందుకే తోచినంత సహాయపడాలని అనిపించింది’’ అని ఉషా చెప్పారు. పికెల్డ్ విత్ లవ్ ఉషాకుమొదటినుంచి రుచికరమైన వంటలు, పచ్చళ్లు చేయడం అలవాటు. అందుకే దాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. ‘పికెల్డ్ విత్ లవ్’ పేరుతో ఈ నెలలోనే ( 2021, జూలై) పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను బాధితులను అందిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందులో ఉషా కుమార్తె తోడ్పాటుతో పాటు, మనవరాలు, ఢిల్లీకి చెందిన శిశువైద్యురాలు డా. రాధిక బాత్రా పాత్ర కూడా చాలా ఉంది. వాస్తవానికి భర్త పోయిన వేదనలో ఉన్న అమ్మమ్మకు స్వాంతనివ్వడంతోపాటు, బాధితుల కష్టాలను చూసి చలించిపోతున్న ఆమెకు ఊరట కలిగేలా ఏదైనా చేయాలని ఆలోచించారు. అలా పుట్టిందే ‘పికెల్డ్ విత్ లవ్’. చిన్నప్పటినుంచీ అమ్మమ్మ చేతి కమ్మనైన వంటలు, రకరకాల పచ్చళ్లేరుచే రాధికను ఈ వ్యాపారం వైపు ఆలోచించేలా చేసింది. ఎందుంటే అమ్మమ్మ చేతివంట ఎంత రుచిగా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మను ఆ వైపుగా ప్రోత్సహించారు. అంతేకాదు దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా స్వయంగా రాధిక దగ్గరుండి పూర్తి చేశారు. సంబంధిత వ్యక్తులు అనేక మందితో చర్చించి, బాటిల్స్ ఎక్కడ సేకరించాలి, లేబుల్స్, ఇలాంటి వ్యాపారానికి అవసరమైన అన్ని అనుమతులు, తదితర విషయాలపై సమాచారాన్ని సేకరించారు. వెంచర్ పేరు, లోగో సిద్ధం చేశారు. అంతే.. వెంచర్ అలా మొదలైందో లేదో, చీఫ్ చెఫ్ నానీకి అంతులేని క్రేజ్ వచ్చేసింది. సాధారణంగానే ప్రారంభ ఆర్డర్లన్నీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండే వచ్చాయి. కానీ, అనూహ్యంగా వారికి తెలియకుండానే 180 సీసాల ఊరగాయలు, చట్నీలు విక్రయించారు. ఇది వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. అమ్మమ్మ సాయంతో ఒకేసారి పది కిలోల మామడికాయ పచ్చడి పెట్టే సామర్థ్యం తనకు వచ్చిందంటూ డా. రాధిక సంతోషం వ్యక్తం చేశారు. మొదట్లో ఖట్టా ఆమ్ (పుల్ల మామిడి), తురిమిన మామిడి పచ్చడి, గులాబీ మీఠా ఆచార్ అనే మూడు రుచులతో ప్రారంభమైన ప్రస్తానం మిక్స్డ్ వెజిటబుల్ పికెల్, చింతకాయ పచ్చడి దాకా విస్తరించింది. ఇపుడు వీటికే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని డాక్టర్ రాధిక చెప్పారు. ప్రతి పచ్చడి బాటిల్‌ను అందమైన రిబ్బన్‌తో , ఉషా చేతితో రాసిన నోట్‌తో పంపించడం తమ పికెల్డ్ విత్ లవ్ స్పెషాల్టీ అని ఆమె చెప్పారు. అమ్మమ్మ గారి టాలెంట్ ఇంతటితో ఆగిపోలేదు. పలు రెసిపీలతో ‘ఇండియన్ శాకాహారీ వంజన్’ అనే కుక్‌బుక్ కూడా రాశారు ఉష. 200 గ్రాముల ఊరగాయను 150 రూపాయలకు విక్రయిస్తామని, ఇప్పటికి 20 వేల రూపాయలు సమకూరాయని ఉషా చెప్పారు. తనకు ప్రతి రూపాయి అపురూపమే.. చిన్న మొత్తంలో అయినా ఒకరికి సాయం చేయడం ఎంతో ఆనందాన్నిస్తోందంటారు ఉషా. అలాగే తన పచ్చళ్లకు లభిస్తున్న ఆదరణకు కూడా మరింత ఉత్సాహానిస్తోందన్నారు. ఆ శక్తి నిజంగా ప్రేమకు ఉండి ఉంటే.. కరోనాను తరిమికొట్టే శక్తి నిజంగా ప్రేమకు ఉండి ఉంటే.. తాతగారు చనిపోయేవారు కాదని, ఎపుడో రికవరీ అయ్యి ఇంటికి చేరేవారంటారు రాధిక భావోద్వేగంగా. ఎందుకంటే ఆసుపత్రిలో చేరిన తరువాత ఒక్క క్షణం కూడా ఆయనను విడిచి ఉండలేదు. అలా అమ్మమ్మ కోవిడ్‌నుంచి కోలుకుంటూ తాతగారిని కంటికి రెప్పలా చూసుకున్నా కానీ ఫలితం లేక పోయిందన్నారు తాత రూపాన్ని కళ్లనిండా నింపుకుంటూ... (ద బెటర్ ఇండియా కథనం ఆధారంగా) -
సమ్మర్ ఎఫెక్ట్: కరెంట్ మోత.. బిల్లుల వాత!
సాక్షి, సిటీబ్యూరో: ఎండలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సగటున40 డిగ్రీలు దాటుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం నగరవాసులు ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లో కరెంట్ మోత మోగుతోంది. సాధారణంగా ఫిబ్రవరి వరకు నెలకు 150 యూనిట్లలోపు వాడే వినియోగదారులు ప్రస్తుతం 250– 300 యూనిట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా మీటరు గిర్రున తిరిగి.. స్లాబ్‌రేట్ మారి నెలసరి విద్యుత్ బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల వినియోగదారుల చేతికందిన మార్చి నెల బిల్లులే ఇందుకు నిదర్శనం. భారీగా పెరిగిన బిల్లులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అసలే కరోనా కాలం.. ఆపై ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డ సగటు జీవులకు ఇవి మరింత భారంగా మారుతున్నాయి. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో.. ►నగరంలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లున్నాయి. గత మార్చి వరకు రోజూ పగటిపూట పీక్ అవర్‌లో కరెంట్ డిమాండ్ 2500 నుంచి 2700 మెగావాట్లకు మించలేదు. తాజాగా ఇది 2900 నుంచి 3000 మెగావాట్లు నమోదవుతోంది. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ►సామర్థ్యానికి మించి డిమాండ్ నమోదవుతుండటంతో విద్యుత్ ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. కరెంట్ సరఫరా నిలిచిపోతోంది. ఎప్పకప్పుడు డీటీఆర్లను పెంచకపోవడం, లూజ్లైన్లను సరిచేయక పోవడమే ఇందుకు కారణం. వేసవిలో తలెత్తే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు పీక్ అవర్‌లోనూ ఇంజినీర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. -
రిటైల్ రుణ గ్రహీతలకు కష్ట కాలమే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల రిటైల్ కస్టమర్లకు ప్రత్యేకించి దిగువ ఆదాయ రుణ గ్రహీతలకు కష్టాలు కొనసాగుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు రుణ వ్యయాలు అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలిపింది. మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ వడ్లమాని తెలిపిన ముఖ్యాంశాలు చూస్తే... కరోనా ప్రారంభ దశలో ఊహించినదానికన్నా మెరుగ్గా ప్రస్తుత బ్యాంకింగ్ రుణ నాణ్యత ఉంది. ప్రత్యేకించి కార్పొరేట్ రుణాల విషయంలో బ్యాంకింగ్ బాగుంది. మొండిబకాయిలకు సంబంధించి తగినకేటాయింపులు జరపడం దీనికి ఒక కారణం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మొండిబకాయిలు తగ్గుతున్నాయి. మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల వల్ల మధ్య, చిన్న తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) రుణ గ్రహీతలు ఇబ్బందులు పడ్డారు. ఎకనమీ రికవరీ దశలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విభాగానికి సంబంధించి రుణ నాణ్యతలో సవాళ్లు తలెత్తకుండా ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు తగిన ఫలితాన్ని ఇచ్చాయి. ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు రంగం బ్యాంకింగ్ రుణ నాణ్యత బాగుంటుంది. అయితే కేంద్రం నుంచి తాజా మూలధన కల్పన కొంత ఊరటనిచ్చే అంశం. 2021 చివరి ఆరు నెలల కాలంలో బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రుణ నాణ్యత మరింత దెబ్బతినవచ్చు. 2022లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే వీలుంది. ఆటో, చిన్న వ్యాపారాల్లో ఒడిదుడుకులు దీనికి కారణంగా మారే వీలుంది. తగిన స్థాయిలో వృద్ధి, ద్రవ్యలోటు అంచనాలు వృద్ధి, ద్రవ్యలోటు అంచనాల విషయంలో 2021-22 బడ్జెట్ వాస్తవికతకు అద్దం పడుతోందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రసంగంలో 2021-22లో ప్రభుత్వ ఆదాయ– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 6.8 శాతానికి కట్టడి చేస్తామని పేర్కొంటూ, వృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ద్రవ్యపరమైన బలహీన పరిస్థితి భారత్‌కు 2021కు ‘క్రెడిట్’ సవాళ్లను విసురుతుందనీ మూడీస్ పేర్కొంది. ద్రవ్యలోటును బడ్జెట్ ప్రతిపాదనలకన్నా తక్కువగా ఉంచాల్సిన అవసరాన్ని మూడీస్ సూచించింది. అలాగే భారత్ రుణ భారాన్నీ మూడీస్ ప్రస్తావించింది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలన్నింటినీ తీసుకోవాలి. వ్యత్యాసం– ద్రవ్యలోటు అంచనాలను 9.5 శాతానికి (2020-21 స్థూల దేశీయోత్పిత్తి-జీడీపీలో) సవరిస్తున్నట్లు బడ్జెట్ పేర్కొంది. 2020-21 బడ్జెట్ ప్రకారం 3.5 శాతం వద్ద (రూ. రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యం. ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 6.8 శాతానికి కట్టడి చేయాలన్నది బడ్జెట్ లక్ష్యమని వివరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళతామని ఆర్థికమంత్రి భరోసాను ఇచ్చారు. 2019-20లో ద్రవ్యలోటు 4.6 శాతం. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021-22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023-24 నాటికి 5 శాతానికి, 2024-25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. జీడీపీలో రుణ నిష్పత్తి 90 శాతానికి దాటిపోయే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. 2019లో ప్రభుత్వ రుణ–జీడీపీ నిష్పత్తి 72 శాతంగా ఉంది. రేటింగ్ విషయంలో ఈ అంశం చాలా కీలకమైనది. వృద్ధి అంచనాలు 13.7 శాతానికి పెంపు భారత్ ఎకానమీ 2021–22లో 13.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణత ఏడు శాతానికి పరిమితం అవుతుందని విశ్లేషించింది. ఈ మేరకు నవంబర్ అంచనాలను గణనీయంగా మెరుగుపరచింది. అప్పట్లో 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధిని 10.8 శాతంగా అంచనావేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణతను 10.6 శాతంగా పేర్కొంది. సాధారణ పరిస్థితులు నెలకొనడం, వ్యాక్సినేషన్ వేగవంతంతో మార్కెట్లో విశ్వాసం మెరుగుపడ్డం తన క్రితం అంచనాల తాజా సవరణకు కారణమని మూడీస్ వివరించింది. సంస్కరణల అమలు ఇప్పటికీ భారత్‌కు సవాళ్లు విసురుతున్న అంశమేనని తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే విషయంలో ఇంకా అస్పష్టత ఉందని విశ్లేషించింది. -
‘వేతన’ ఉద్యోగాలపై కోవిడ్ ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి వేతనజీవుల(శాలరీడ్ జాబ్స్) పాలిట శాపమైంది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఐదునెలల క్రితం దేశవ్యాప్తం గా తొలిసారిగా విధించిన లాక్‌డౌన్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. అయితే, కోల్పోయిన ఆ అవకాశాలు తిరిగి సాధించుకోవడం కొంతమేర కష్టసాధ్యం కావొచ్చని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇం డియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా వేస్తోంది. ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయం, కొనుగోలు శక్తి తగ్గిపోయి పరోక్షంగా ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోందని ఈ సంస్థ భావిస్తోంది. జూలైలోనే 50 లక్షల జాబ్స్‌కు ఎసరు.. కోవిడ్–19 ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగా ఇప్పటివరకు 1.89 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సీఎఈంఐఈ తాజాగా వెల్లడించింది. ఒక్క జూలైలోనే 50 లక్షల మంది తమ జాబ్స్‌ను వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ పరిస్థితుల కారణంగా పెద్ద కంపెనీలు, సంస్థల మార్కెట్ వాటా పెరగడంతోపాటు కార్మి కులు, పనివారిపై ఆధారపడటం తగ్గొచ్చ ని, అదే సమయంలో చిన్న, మధ్యతరహా కంపెనీలు, సంస్థలు వంటివి నష్టపోయి క్రమంగా మూతపడే పరిస్థితులు తలెత్త వచ్చని, ఉద్యోగుల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోవచ్చని సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ చెబుతున్నారు. అయితే నెలవారీ వేతనాలు, జీతాల్లేని, అనియత రంగాల్లో ఉద్యోగాలు (ఇన్ఫార్మల్ జాబ్స్) పెరిగినట్టు సీఎంఐఈ వెల్లడించింది. ఒక్క వ్యవసాయరంగంలోనే 1.5 కోట్ల ఉపాధి అవకాశాలు పెరిగినట్టు పేర్కొంది. అకస్మాత్తుగా ఏదైనా జరిగితే.. కరోనా, లాక్డౌన్ మాదిరిగా అకస్మాత్తుగా ఏదైనా జరిగితే మోటార్‌మెకానిక్, కార్పెం టర్, తాపీ మేస్త్రీ వంటి వారు వెంటనే తమ ఉపాధి అవకాశాలు కోల్పోతారని, లాక్డౌన్ ఎత్తేశాక మళ్లీ వారికి ఆ పనులు దొరుకుతాయని సీఎంఐఈ విశ్లేషిస్తోంది. -
టిఫిన్ సెంటర్లకు ‘లాక్’!
సాక్షి, హైదరాబాద్: కరోనా చిన్నా, చితకా వ్యా పారాల్ని చిదిమేసింది. గల్లీ చివరి బడ్డీకొట్లను గల్లంతు చేసింది. తోపుడుబండిని కష్టాల్లోకి తోసేసింది. మెస్‌లు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంట ర్ల నిర్వాహకుల కడుపుకొట్టింది. కర్రీ పాయిం ట్లకు వర్రీనే మిగిల్చింది. నగరంలో ఏ వీధిలో చూసినా అడుగడుగునా కనిపించే టిఫిన్ సెం టర్లలో చాలావాటిని మాయం చేసింది. లాక్డౌన్ విధించిన నాటి నుంచి చిరువ్యాపారుల కు కష్టాలు మొదలయ్యాయి. రోజులు గడుస్తున్నకొద్దీ పరిస్థితుల్లో మార్పులొచ్చినా వీరి వ్యాపారాలు çపుంజుకుంటున్న దాఖలాల్లేవు. దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఫూర్తిగా భిన్నమైన పరిస్థితులు... రోజూ ఉదయం 6 నుంచే టీ, టిఫిన్ల కోసం వచ్చేవారితో సందడిగా కనిపించే టిఫిన్ సెం టర్లు, బడ్డీకొట్లు ఇప్పుడు కొడిగట్టిన దీపాల య్యాయి. వ్యాపారాలు సాగక, ఆర్థికభారాన్ని భరించలేక ఇప్పటికే కొందరు టిఫిన్ సెంటర్ల ను మూసేయగా, మరికొందరు ఇతర వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. మరికొందరు కూరగాయలు, ఇతర సరుకులమ్మే దుకాణాలుగా మారుస్తున్నారు. ముందైనా మంచి కాలముందా? ఈ విపత్కర పరిస్థితులు మున్ముందు మారితే మళ్లీ తమ వ్యాపారాలు పట్టాలెక్కుతాయనే ఆశాభావంతో కొందరు టిఫిన్ సెంటర్ల యాజమానులు రోజులు నెట్టుకొస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి వ్యాపారాలు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పది మంది పనివాళ్లు పనిచేసే చోట ఇప్పుడు ఒకరిద్దరితోనే నడిపిస్తున్నారు. అనుభవమున్న మాస్టర్లు, సర్వింగ్ సిబ్బంది వెళ్లిపోతే భవిష్యత్‌లో కష్టమని, గిరాకీ లేకపోయినా కొంతమం ది యజమానులు కొంత డబ్బు అడ్వాన్స్‌గా ఇచ్చి వారిని కాపాడుకుంటున్నారు. మాస్టర్లు, కార్మికులు పల్లెబాట అనేక టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వేలసం ఖ్యలో మాస్టర్లు, కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు పనిలేకపోవడంతో అనేకమంది మాస్టర్లు, కార్మికులు పల్లెబాట పట్టారు. ఒకప్పుడు బేగంబజార్‌లో ఎక్కుడ చూసినా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ క్యాబిన్లు, టిఫిన్ సెంటర్ల సామాను కొనుగోలు చేసేవారి సందడి ఉండేది. కానీ, ఇప్పుడు అక్కడ కుప్పలుకుప్పలుగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల క్యాబిన్లు సెకెండ్హ్యాండ్లో అమ్మకానికి పెట్టారు. చికెన్ సెంటర్‌గా మార్చాం.. గత జనవరిలోనే కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టాం. రెండు నెలలపాటు మంచిగానే నడిచింది. మూడు నెలలుగా షాపు మూసివేసి ఉన్నా అద్దె కడుతూనే ఉన్నాం. ఇప్పుడు వినియోగదారులు రాకపోవడంతో దానిని చికెన్ సెంటర్‌గా మార్చాం. –స్వప్న, కోఠి -
పొగ తాగితే పగబడతది
సాక్షి, హైదరాబాద్: ధూమపానం అలవాటున్న వారికి కరోనా వైరస్ సోకితే నాలుగు రెట్లు ఎక్కువ ప్రమాదమని జాతీయ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. పొగతాగే వారితో పాటు ఆ పొగ పీల్చే వారి (పాసింగ్ స్మోకర్) పరిస్థితి సైతం కాస్త ఆందోళనకరమేనని చెబుతోంది. ధూమపానం చేసేవారిలో శ్వాసకోశ నాళాలు బలహీనమవుతాయి. ఊపిరితిత్తుల పనితీరు నెమ్మదిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్–19 వ్యాప్తి చెంది తీవ్రమైతే సంకటస్థితిలో పడినట్టే. ప్రస్తుతం శ్వాసకోశ సంబంధ లక్షణాలు తీవ్రమై మరణిస్తున్న వారిలో 63శాతం మంది స్మోకర్స్ ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన గణితాత్మక విశ్లేషణలో తేలింది. ఈ క్రమంలో ధూమపానం, హుక్కా పీల్చే అలవాటును మానుకోవా లని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.పొగాకు అలవాటున్న వారు వైరస్ సంక్రమిత వ్యాధుల బారినపడితే వేగంగా నీరసించిపోతారని వైద్యులు చెబుతున్నారు. నీరసం నుంచి ఉత్తేజితమయ్యేందుకు ఎక్కువసార్లు పొగ తాగేందుకు ఇష్టం చూపే అవకాశాలున్నా యి. ఇలా పొగతాగే అలవాటింకా పెరిగి కార్డియోవాస్క్యులర్, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులు దాడిచేస్తాయి. వీరిలో క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఈ దశకు చేరుకున్న వారికి కోవిడ్–19 సోకితే ఒక్కసారిగా శరీరం కుప్పకూలి పోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులున్న వారు కోవిడ్ బారినపడితే.. జాతీయ స్థాయిలో దాదాపు 10శాతం మంది హైరిస్క్ లోకి వెళ్తున్నట్లు గుర్తించారు. తక్షణమే ధూమపానాన్ని మానేసిన 24 గంటల్లోనే వారి రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ తీవ్రత భారీగా తగ్గుతుంది. అలాగే, 2 నుంచి 12 వారాల్లో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడతాయని, 9 నెలల తర్వాత శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని కేంద్ర వైద, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు పొగాకు ఉత్పత్తులైన గుట్కా, ఖైనీ, పాన్, జర్దా తినే వారు బహిరంగంగా ఉమ్మివేస్తుంటారని, వీరంతా కోవిడ్–19 వ్యాప్తికి కారకులయ్యే అవకాశం ఉందని చెబుతోంది. అలాంటి అలవాట్లకు చెక్‌పెడితే వారిలో అనారోగ్య సమస్యలు సైతం తగ్గుతాయని సూచిస్తోంది. -
చిరు వ్యాపారులపై కోవిడ్ పిడుగు!
రాజారాం గృహావసర వస్తువులను ఊరూరా తిరిగి విక్రయిస్తుంటాడు. జనాలకు ఏయే వస్తువులు కావాలో ముందే చెబితే, వాటిని వారికి అందజేయడంతో పాటు ఇతర వస్తువులు తెచ్చి విక్రయించడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇప్పుడు కరోనా వైరస్‌తో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ బయటకు వెళ్లినా వైరస్ సోకుతుందన్న కారణంతో తమతమ ఊళ్లలోకి గ్రామస్తులు రానివ్వడంలేదు. రహీం ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతుంటాడు. మంచి డిమాండ్ ఉండటంతో సుమారు నాలుగైదు గ్రామాల్లో తిరుగుతుంటాడు. వారంలో ఐదారు గ్రామాలు చుట్టబెట్టడమే కాకుండా వారాంతపు సంతలో సైతం విక్రయిస్తాడు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ఎక్కడికి వెళ్లలేకపోతున్నాడు. వెళ్దామన్నా ఇతర గ్రామాల్లోకి రాకుండా గ్రామస్తులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వ్యాపారం మరింత ఇబ్బందిగా మారింది. సాక్షి, హైదరాబాద్: చిన్న వ్యాపారాలకు దెబ్బ... ప్రస్తుత కోవిడ్ సంక్షోభ పరిస్థితుల్లో ఇది కేవలం రాజారాం, రహీమ్ అనే ఒకరిద్దరు చిరు వ్యాపారులకే పరిమితమైన సమస్య కాదు. మధ్య తరగతి, దిగువ తరగతికి చెందిన వారికి తక్కువ ధరలకే వివిధ పరికరాలు, వస్తువులు, సరుకులు అమ్ముకునే ‘హర్ ఏక్ మాల్’ చిరు వ్యాపారులు, వీధివీధినా తిరిగి ఆయా వస్తువులు విక్రయించే సంచార వ్యాపారులు ఇలా చిన్నా, చితకా వ్యాపారాలు చేసుకునే వారందరి జీవితాలు తలకిందులై పోయాయి. కస్టమర్లు కోరుకునే వివిధ రకాల సరుకులు కొనుగోలు చేసేందుకు అవసరమైన పెట్టుబడి అందుబాటులో లేక కొం దరు చిరు వ్యాపారులు ఇబ్బందిపడుతున్నారు. అప్పోసొప్పో చేసి ఆయా వస్తువులను తెచ్చి, ఊరూరా తిరిగి అమ్మే ప్రయ త్నం చేసినా కొనేందుకు ఎవరూ ముం దుకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గ్రామాల్లోకి రానివ్వడం లేదు... చిన్నచిన్న తోపుడుబండ్లు, సైకిళ్లు, మోపెడ్లపై రోజువారీ వ్యాపారాలు చేసుకునే వారికి కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరుకులు తీసుకుని వెళుతున్న వారిని కరోనా భయంతో గ్రామాల్లోకి అడుగుపెట్టకుండా ఊరి బయటే అడ్డుకుంటున్నారు. దీంతో వస్తువులు, సరుకులు అమ్ముడుపోక నిరాశగా ఇళ్లబాట పట్టాల్సి వస్తోంది. గతంలో ఊళ్లల్లో ఏర్పాటు చేసిన సంతల్లో సంచార వ్యాపారులు వస్తువులను విక్రయించుకునే వీలుండగా, ఇప్పుడు కోవిడ్ భయంతో ఈ సంతలు కూడా నిలిచిపోవడంతో వీరి వ్యాపారాలు ముందుకు సాగడం లేదు. బకాయిలతో మరో కష్టం... అప్పులుచేసి తీసుకొచ్చిన వస్తువులు అమ్ముడుపోక ఒకవైపు, తీసుకొచ్చిన స్టాక్‌కు డబ్బు కట్టాలంటూ గుత్త వ్యాపారుల బెదిరింపులు మరోవైపు. స్టాక్ అమ్ముడుపోనందున మరికొన్ని రోజులు గడువు కావాలంటూ చిరువ్యాపారులు ప్రాధేయపడుతున్నా, డబ్బు కట్టాల్సిందేనంటూ వారిపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు సొంత ఊరిలోనైనా సరుకులు, వస్తువులు అమ్ముకుందామంటే, గ్రామాల్లోకి సరుకులను తీసుకొచ్చేవారిని రానివ్వకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కుంటున్నారు -
దిమాఖ్ ఖరాబ్
సాక్షి, హైదరాబాద్: దేశ పౌరుల జీవనశైలి, అలవాట్లు, ఆహార పద్ధతులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో భారతీయులు గతంలో ఎన్నడూ లేనివి ధంగా ఒత్తిళ్లు, కుంగుబాటు వంటి వాటిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు ఉంటాయా లేదా అన్న ఆందోళనలు, లే ఆఫ్‌లు, ఆరోగ్యంతో ముడిపడిన భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఫలితంగా చాలా మందిలో మానసిక సమస్యలు బయటపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు కరోనా వైరస్ వ్యాప్తితో తలెత్తిన కొత్త, అనూహ్య పరిస్థితులను ఏ మేరకు అర్థం చేసుకున్నారు? వాటికి ఏ మేరకు అలవాటు పడ్డారు? అనే అంశంపై ‘జీవోక్యూఐఐ’–స్మార్ట్‌టెక్ ఆధారిత హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం సంస్థ దేశవ్యాప్తంగా 10 వేల మందినిపైగా సర్వే చేసినప్పుడు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది మానసిక కుంగుబాట్లతో బాధపడుతున్నట్లు, 59 శాతం మందిలో పనులపట్ల ఆసక్తి తగ్గిపోయినట్లు, 57 శాతం మంది అలసిపోయినట్లు పేర్కొన్నారని సర్వే సంస్థ వివరించింది. ఐదు నెలల్లో ఎంతో తేడా... దేశంలో మొదటి వైరస్ కేసు నమోదయ్యాక గత ఐదు నెలల్లో పెద్ద సంఖ్యలోనే ప్రజల మానసిక స్థితి ఒడిదొడుకులకు గురైనట్లు జీవోక్యూఐఐ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. మారిన పరిస్థితుల్లో జీవనశైలి, వ్యాయామం, పనులు, పోషకాహారం, నిద్ర, ఒత్తిళ్లు, కుంగుబాటు, కొనుగోలు అలవాట్లలో మార్పు, మానసిక ఒత్తిళ్లు పెరిగి బయటి తిండి ఎక్కువ తినడం వంటివి తీవ్రంగా ప్రభావితమైనట్లు తేలింది. రోజువారీ కార్యకలాపాలు, తిండిపై ఆసక్తి, తినగలిగే స్థాయి, నిద్రపోతున్న తీరు, ఏ విషయంపైనైనా మనసు లగ్నం చేయగలిగే లక్షణం, ఏదైనా పని చేసేందుకు శక్తియుక్తుల స్థాయి వంటి అం«శాలపై ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. సర్వేలోని కీలకాంశాలు... ► వివిధ స్థాయిల్లో కుంగుబాటు, మానసిక ఒత్తిళ్లకు గురైన వారు 43 శాతం మంది ► చేసే పనుల్లో ఎలాంటి ఉత్సాహం ఉండట్లేదన్న వారు 59 శాతం మంది ► అలసట, శక్తి తగ్గిపోయినట్లు భావిస్తున్న వారు 57 శాతం మంది ► నిరాశ, నిస్పృహలతో ఉన్నవారు 44 శాతం మంది ► నిద్రపోవడంలో ఇబ్బందులు లేదా అతినిద్ర సమస్య ఎదుర్కొంటున్న వారు 49 శాతం మంది పెరుగుతున్న అనిశ్చితితో ఒత్తిళ్లు కరోనా వైరస్ వ్యాప్తి, సుదీర్ఘ లాక్డౌన్ విధింపు ప్రభావం ప్రజల్లో ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమైంది. దీనివల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. అంతటా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ఒత్తిళ్ల స్థాయి పెరుగుతోంది. జీవనశైలిని మార్చుకోవడంతోపాటు సమతుల ఆహారం, సరైన నిద్ర అలవాట్లను పాటిస్తే ఈ సమస్యను అధిగమించొచ్చు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోతే దాని ప్రభావం వ్యక్తి పూర్తి ఆరోగ్యంపై పడుతుంది. అందువల్ల జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా ఈ సమస్యలన్నింటినీ అధిగమించొచ్చు. – జీవోక్యూఐఐ ఫౌండర్, సీఈవో విశాల్ గోండల్ -
రిజిస్ట్రేషన్ల ఆదాయంపై కరోనా దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ పుణ్యమాని రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఒక్క నెలలో రావాల్సిన ఆదాయం వచ్చేందుకు మూడు నెలలు పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మరో రెండు రోజుల్లో ముగియనుండగా ఆ శాఖ ఆదాయం రూ. 600 కోట్ల మార్క్ చేరింది. లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ నెల పూర్తిగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో ఆ నెలలో రూ.12 కోట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వచ్చాయి. ఇక, మే నెల ఆరో తేదీ నుంచి మళ్లీ కార్యాలయాలు పూర్తి స్థాయిలో ప్రారంభం అయినా ఆ నెలలో సెలవు దినాలు పోను కేవలం రూ.200 కోట్లకుపైగా మాత్రమే రాబడి వచ్చింది. జూన్ నెలలో కొంత మేర రియల్ లావాదేవీలు పుంజుకోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.400 కోట్లకు చేరింది. వెరసి మూడు నెలల్లో రూ.1500–1800 కోట్లు రావాల్సి ఉండగా అతికష్టంగా రూ.600 కోట్లు ఖజానాకు సమకూరాయి. కాగా, జూన్ నెల రాబడులు ఆశాజనకంగానే ఉన్నాయని, రాజధాని హైదరాబాద్ శివార్లలో క్రమంగా రియల్ ఎస్టేట్ రంగం కుదుటున పడుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే జూలై మాసం నుంచి సాధారణ పరిస్థితుల్లో వచ్చే ఆదాయం వస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడో నెలలో ముచ్చటగా... వాస్తవానికి, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం నెలకు రూ. 500–600 కోట్ల వరకు వస్తుంది. రోజుకు 5 వేల వరకు లావాదేవీలు జరిగి, రూ.20 కోట్ల వరకు రాబడి వచ్చేది. కానీ, కరోనా వైరస్ ప్రభావంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు బయటకు వచ్చే అవకాశం లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిచిపోవడం, ప్రజల వద్ద తగినంత నగదు లభ్యత లేకపోవడంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాయిదా పడ్డ రియల్ లావాదేవీలు మళ్లీ ప్రారంభం కాలేకపోయాయి. అంతకన్నా ముందు జరిగిన ఒప్పందాలూ ఆగిపోయాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా ఉండే వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు కూడా జరగలేదు. దీంతో దాదాపు మార్చి నెలలో సగ భాగం, ఏప్రిల్, మే నెలలు పూర్తిగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాల్లో స్తబ్దత నెలకొంది. మళ్లీ ఇప్పుడు గాడిలోకి.. కరోనా లాక్డౌన్ ఎత్తేసిన రెండో నెలలో భూ లావాదేవీలు మళ్లీ కోలుకున్నాయని జూన్ నెల రిజిస్ట్రేషన్ ఆదాయ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రియల్ లావాదేవీలు ఊహించిన దానికన్నా ఎక్కువ పెరిగాయని, ప్రజల వద్ద నగదు లభ్యత పెరగడంతో పాటు బ్యాంకులు కూడా రుణాలిచ్చే దిశలో ఉదారంగా వ్యవహరిస్తుండటం, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై తెలంగాణలో ఆంక్షలు తొలగించిన కారణంగా గతంలో వేసిన పెద్ద వెంచర్లు, జరిగిన ఒప్పందాల్లో కదలిక వచ్చింది. దీంతో జూన్ నెలలో సగటున రోజుకు రూ.14 కోట్ల మేర రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం సమకూరింది. ఇందులో 70 శాతానికిపైగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చిందేనని ఆ శాఖ ఉన్నతాధికారులంటున్నారు. అందుకే జూన్ నెలలో రాబడి రూ.400 కోట్లకు చేరిందని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో జూలై నెలలో ఆదాయం మరింత పెరిగి మునుపటిలా యథాతథ స్థితికి చేరుతుందనే ధీమా రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
పట్నం బతుకు.. కష్టం పొదుపు
రవిచంద్ర (రామంతాపూర్) ఓ మాల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్. లాక్‌డౌన్‌కు ముందు తనకొచ్చే రూ.25 వేల నెల జీతంలో రూ.5 వేలైనా పొదుపు చేసేవాడు. అలా దాచుకున్న డబ్బులో కొంత లాక్డౌన్ సమయంలో అవసరాలకు ఉపయోగపడ్డాయి. కానీ, లాక్డౌన్ తర్వాత వ్యాపారం సరిగా లేదంటూ యజమాని సగం జీతమే ఇస్తున్నాడు. దీంతో అవసరాలు తీరక అప్పులుచేసి నెట్టుకొస్తున్నాడు. మల్లికార్జున్ (యూసుఫ్‌గూడ బస్తీ) ఓ సినీ స్టూడియోలో పనిచేస్తూ నెలకు రూ.30 వేలు సంపాదించే వాడు. పిల్లల ఫీజులు, ఇతర అవసరాలన్నీ వాటితోనే.. కూడబెట్టుకున్న డబ్బులేక లాక్డౌన్ టైమ్‌లో కుటుంబపోషణకు అప్పు చే శాడు. లాక్డౌన్లో జీతాల్లేక, అన్‌లాక్ సమయంలో పనిలేక ఇబ్బంది పడుతున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కృష్ణ ఆటోడ్రైవర్. లాక్‌డౌన్‌తో ఆటో తిరగక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రభుత్వం ఇచ్చిన రూ.3 వేలు, 30 కిలోల బియ్యంతో బండి లాగాడు. లాక్డౌన్ తరువాత ఆటో నడుపుతూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా అవి పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోవట్లేదు. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగానూ దెబ్బతీస్తోంది. పట్టణ పేద, దిగువ మధ్య తరగతి వర్గాల బతుకుల్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ ఉధృతి కారణంగా ఇంకా కోలుకోని వ్యాపారాలు, జీతభత్యాలు, ఉద్యోగాల్లో కోతలు, పె రుగుతున్న ధరలు పట్టణ ప్రజల నడ్డివిరుస్తున్నాయి. ఆదాయ మార్గాలు తగ్గడం, నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో పొదుపు మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. దీంతో నెల చివరికొచ్చే సరికి చేతుల్లో చిల్లిగవ్వ లేకుండాపోతోంది. దీంతో అప్పుల కోసం వెంపర్లాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో లాక్డౌన్ దాదాపుగా ఎత్తేసినా ఇంకా చాలా వ్యాపారాలు పుంజుకోలేదు. వస్త్ర వ్యాపారం పడిపోగా, హోటళ్లు, రెస్టారెంట్లకు వచ్చే వా రు 10 శాతానికి మించట్లేదు. మాల్స్‌కు వచ్చేవారు లేక వ్యాపారం తగ్గిపోయింది. దీంతో చాలాచోట్ల సేల్స్‌మన్, వాచ్‌మన్, టెలీ ఆపరేటర్లు, సర్వర్లు, బ్యాంకు కన్సల్టెంట్లు వంటి ఉద్యోగాలు భారీగా ఊడిపోయాయి. సెలూ న్లు, ఐరన్ షాపులు, టైలరింగ్ వంటి వాటిపై ఆధారపడి బతికే వారి ఆదాయాలు దారు ణంగా పడిపోయాయి. తోపుడుబండ్ల వ్యాపారం మూలనపడగా, ఆటో, క్యాబ్‌ల్లో ప్రయాణాలు తగ్గి డ్రైవర్ల ఆదాయం పడిపోయింది. ఇవన్నీ పత్య్రక్షంగా, పరోక్షంగా పట్టణ ప్రాం త ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయి. ఆదాయం తగ్గి.. ఖర్చులు పెరిగి.. ప్రస్తుతం కూరగాయల ధరలు 30% మేర పెరగ్గా, పాలు, పెరుగు, పప్పులు, నూనెలు ఇతర నిత్యావసరాల ధరలు 15–20% పెరి గాయి. తగ్గిన ఆదాయాలు, పెరిగిన ఖర్చుల తో పట్టణ ప్రాంతాల్లో పొదుపు తగ్గింది. నెల కు వస్తున్న కొద్దిపాటి ఆదాయాన్ని ఆహారం, ఆరోగ్యం, అద్దె, విద్య, విద్యుత్, గ్యాస్ ఇతర నిత్యావసరాలకు వెచ్చిస్తుండటం, వాటి ధర లు గతంతో పోలిస్తే పెరగటంతో నెల చివరి కొచ్చే సరికి పట్టణ ప్రాంత ప్రజలకు ఖాళీ జే బులే మిగులుతున్నాయి. పట్టణ కుటుంబాల కు వచ్చే ఆదాయాలు తగ్గిపోవడంతో ఇప్పటివరకు పొదుపుచేసిన మొత్తాలతో నెట్టుకొస్తున్నారు. ఈ పొదుపు సొమ్ము అయిపోతే ఇక అప్పులే శరణ్యం కానున్నాయి. ఓ జాతీయ సర్వే సంస్థ ప్రకారం లాక్‌డౌన్‌కు ముందు రూ.10వేల వరకు ఆదాయమున్న ఇంట్లో నెలవారీ పొదుపు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు, అదే రూ.20వేలైతే రూ.2వేల నుంచి రూ.6వేలు, రూ.30వేల ఆదాయం ఉంటే రూ.4వేల నుంచి రూ.8వేలు ఉండగా, అది ప్రస్తుతం రూ.10వేలైతే సున్నా, రూ.20వేలైతే రూ.వెయ్యి నుంచి రూ.2వేలు, రూ.30వేల ఆదాయం ఉంటే రూ.3వేల నుంచి రూ.5వేల వరకు మాత్రమే ఉంటోంది. గ్రామీణ పేదలు కొంచెం మెరుగు.. ‘లాక్‌డౌన్‌కు ముందు వరకు పూర్తి జీతం ఇవ్వడంతో నెలకు రూ.5వేల వరకు పొదుపు ఉండేది. ఇప్పుడు జీతాల్లో 30శాతం కోతపెట్టారు. దీనికి తోడు నిత్యావసరాల ధరలు, కరెంట్ బిల్లులు పెరిగాయి. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు ఆరంభించడంతో ఖర్చు పెరిగింది. ఇప్పుడు నెల చివరకు మిగిలింది రూ.3వేలే’ అని ఖైరతాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి ప్రవీణ్ తెలిపాడు. అయితే, పట్టణ ప్రాంతాల తో పోలిస్తే గ్రామీణ పేదల ఆదాయం, పొదు పు కొంత మెరుగ్గా ఉన్నాయి. పీడీఎస్ బి య్యం, పప్పులకు తోడు కేంద్రం వ్యవసాయ భూములకు అందించిన రూ.2వేల సాయం, జన్‌ధన్ ఖాతాల్లో రూ.500 నగదు బదిలీ, ఉ పాధి పనులు, ధాన్యం అమ్మకాలతో వచ్చిన డబ్బుతో గ్రామీణ పేదల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ప్రభుత్వంలో కీలక స్థానం లో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి చెప్పారు. ► రాష్ట్రంలో పొదుపునకు దూరమైన పట్టణ ప్రజలు 40లక్షలు ► జాతీయ సర్వేల అంచనా ప్రకారం దేశంలో ఆదాయాన్ని కోల్పోవడం లేదా కోతను ఎదుర్కొంటున్న పట్టణ ప్రాంత కుటుంబాలు 84% ► కరోనా విపత్తు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొదుపును మరిచిపోయిన పట్టణ జనాభా 13.9కోట్లు -
మనసంతా కరోనా చింత
సాక్షి, హైదరాబాద్: వైరస్ బారి నుంచి ఎలా తప్పించుకోవాలోనన్న ఆదుర్దా.. భవిష్యత్తుపై బెంగ.. ఎలా.. ఏం చేయాలి?.. ఇదీ కరోనా నేపథ్యంలో దాదాపు అందరి మనస్థితి. ఒకపక్క కరోనా.. మ రోపక్క దాదాపు రెండున్నర నెలలుగా వివిధ దశ ల్లో అమల్లో ఉన్న లాక్డౌన్.. ఈ సమయంలో తమకెదురైన సమస్యలు, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుముందు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలోననే భయం, ఆందోళన అధికమవుతున్నాయి. వివిధ రంగాల్లో ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, చిన్న వ్యాపారాలు దెబ్బతినడం, ఇలా అన్నిస్థాయిల వ్యక్తులు, కు టుంబాలను, ముఖ్యంగా మధ్య, దిగువ మధ్య త రగతి, కింది తరగతి వర్గాలను భవిష్యత్‌పై ఆందో ళన ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తమలో గూడుకట్టుకుంటున్న భయాల్ని దూరం చేసుకునేందుకు వైద్యనిపుణులు, మానసి క విశ్లేషకులు, సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌ల çసూ చనలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. అందరిలో అదే ఆందోళన ప్రైమరీ స్కూళ్ల పిల్లలు మొదలుకుని వయోవృద్ధు ల వరకు దాదాపు అన్ని వర్గాలపై ప్రత్యక్షంగా, ప రోక్షంగా కరోనా పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. కొన్ని మినహాయింపులతో లాక్డౌన్ దాదాపుగా ఎత్తేసిన నేపథ్యంలో వివిధ పనులు, కార్యక్రమాలపై బయటకు వస్తున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో మాస్క్‌లు పెట్టుకున్నా, శానిటైజర్లు వాడుతున్నా, భౌతికదూరం పాటిస్తున్నా.. బహిరంగ ప్రదేశాల్లో కాంటాక్ట్‌లోకి వచ్చే వ్యక్తుల నుంచి తమకు వైరస్ సోకుతుందేమోననే భయాలు, ఆందోళనలు ఇటీవల మరింత గా పెరిగాయి. షుగర్, బీపీ, గుండెజబ్బులు, కిడ్నీ ఇతర సమస్యలున్న వారు అసలు కరోనా పరిస్థితుల్ని అధిగమించి మనగలుగుతామా?, వైరస్ సోకి ఆసుపత్రికి వెళ్తే మళ్లీ క్షేమంగా ఇంటికొస్తామా?, తమ తర్వాత కుటుంబం పరిస్థితి ఏమిటి? అనే భయాందోళనలతో గడుపుతున్నారు. మ రికొందరికి ఉద్యోగం ఉంటుందా పో తుందా? భవిష్యత్‌లో ఆర్థిక పరిస్థితి, ఆ రోగ్యం సంగతేమిటి?, పిల్లల చదువులెలా? అనే అనుమానాలు పట్టిపీడిస్తున్నా యి. ఆర్థిక, వ్యక్తిగత, ఇతర సమస్యలపై దంపతుల మధ్య వాదులాటలు పెరుగుతున్నా యి. వివిధ సమస్యలపై భిన్నమైన వ్యక్తులు, రంగాల నుంచి తనకు నెల, నెలన్నర రోజుల్లోనే 60 దాకా ఫోన్‌కాల్స్ వచ్చాయని సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్ తెలిపారు. పిల్లల ఆన్లైన్ చదువులు, పేరెంట్స్ చదువంటూ వెంటపడడంపై ఫిర్యాదు లు, ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు.. ఇలా కౌన్సెలింగ్‌కు వస్తున్న వారి సంఖ్య కూడా ఇటీవల బాగా పెరిగిందని ఆయన చెప్పారు. ఆసక్తికి తగ్గట్టు ప్రోత్సహిస్తే.. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు మొదలుకావడంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. పిల్లల్ని ఎలా ఎం గేజ్ చేయాలో తెలియక పెద్దలు అయోమయపడుతున్నారు. ఈ సమయంలో చదువంటూ పోరుతుండడం సరికాదు. పుట్టినప్పటి నుంచి ప్రతీ ఒక్కరిలో పదిరకాల తెలివితేటలుంటా యి.పెరిగే కొద్దీ వాటిలో 2–3 బలంగా మారతాయి. వాటిని గుర్తించి వారి అభిరుచికి తగ్గట్టు, వారు కోరుకునే రంగాల్లో ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో రాణించి ఉన్నతస్థాయికి చేరతారు. – డాక్టర్ సి.వీరేందర్, సైకాలజిస్ట్ -
మే నెలలో 61 శాతం పడిపోయిన నియామకాలు
ముంబై: దేశంలో ఉపాధి అవకాశాలను కరోనా దెబ్బతీసింది. ముఖ్యంగా మే నెలలో లాక్డౌన్ కారణంగా నియామకాలు 61 శాతం పడిపోయాయి. ఏప్రిల్ తర్వాత మే నెలలోనూ ఇదే పరిస్థితులు కొనసాగాయి. 2019 మే నెలలో 2,346 నియామకాలు చోటు చేసుకోగా.. ఈ ఏడాది మే నెలలో 910 నియామకాలు నమోదయినట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ తెలిపింది. నౌకరీ డాట్ కామ్ పోర్టల్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ల నమోదు ఆధారంగా ఈ సంస్థ నెలవారీగా నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ గణాంకాలను విడుదల చేస్తుంటుంది. మే నెలలో హోటల్ రంగంలో 91%, రెస్టారెంట్ రంగంలో 87%, ఆటో, ఆటో విడిభాగాల రంగంలో 76%, బీఎఫ్ఎస్ఐ విభాగంలో 70% మేర నూతన నియామకాల్లో క్షీణత కనిపించింది. కోల్‌కతా నగరంలో 68 శాతం, ఢిల్లీలో 67 శాతం, ముంబైలో 67 శాతం మేర నూతన ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ప్రారంభ స్థాయి ఉద్యోగ అవకాశాల్లో 66 శాతం తగ్గుదల నమోదైంది. దేశ ఉద్యోగ మార్కెట్లో నిరాశావహ పరిస్థితులు నెలకొన్నాయని.. వచ్చే మూడు నెలల కాలంలో (జూలై–ఆగస్ట్ త్రైమాసికంలో) మరింత మంది ఉద్యోగులను నియమించుకునే విషయంలో 5 శాతం కంపెనీలే సానుకూలంగా ఉన్నట్టు మ్యాన్‌పవర్ గ్రూపు ఎంప్లాయింట్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే స్పష్టం చేసింది.