సాక్షి, హైదరాబాద్: కరోనా చిన్నా, చితకా వ్యా పారాల్ని చిదిమేసింది. గల్లీ చివరి బడ్డీకొట్లను గల్లంతు చేసింది. తోపుడుబండిని కష్టాల్లోకి తోసేసింది. మెస్‌లు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంట ర్ల నిర్వాహకుల కడుపుకొట్టింది. కర్రీ పాయిం ట్లకు వర్రీనే మిగిల్చింది. నగరంలో ఏ వీధిలో చూసినా అడుగడుగునా కనిపించే టిఫిన్ సెం టర్లలో చాలావాటిని మాయం చేసింది. లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి చిరువ్యాపారుల కు కష్టాలు మొదలయ్యాయి. రోజులు గడుస్తున్నకొద్దీ పరిస్థితుల్లో మార్పులొచ్చినా వీరి వ్యాపారాలు çపుంజుకుంటున్న దాఖలాల్లేవు. దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.
ఫూర్తిగా భిన్నమైన పరిస్థితులు...
రోజూ ఉదయం 6 నుంచే టీ, టిఫిన్ల కోసం వచ్చేవారితో సందడిగా కనిపించే టిఫిన్ సెం టర్లు, బడ్డీకొట్లు ఇప్పుడు కొడిగట్టిన దీపాల య్యాయి. వ్యాపారాలు సాగక, ఆర్థికభారాన్ని భరించలేక ఇప్పటికే కొందరు టిఫిన్ సెంటర్ల ను మూసేయగా, మరికొందరు ఇతర వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. మరికొందరు కూరగాయలు, ఇతర సరుకులమ్మే దుకాణాలుగా మారుస్తున్నారు.
ముందైనా మంచి కాలముందా?
ఈ విపత్కర పరిస్థితులు మున్ముందు మారితే మళ్లీ తమ వ్యాపారాలు పట్టాలెక్కుతాయనే ఆశాభావంతో కొందరు టిఫిన్ సెంటర్ల యాజమానులు రోజులు నెట్టుకొస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి వ్యాపారాలు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పది మంది పనివాళ్లు పనిచేసే చోట ఇప్పుడు ఒకరిద్దరితోనే నడిపిస్తున్నారు. అనుభవమున్న మాస్టర్లు, సర్వింగ్ సిబ్బంది వెళ్లిపోతే భవిష్యత్‌లో కష్టమని, గిరాకీ లేకపోయినా కొంతమం ది యజమానులు కొంత డబ్బు అడ్వాన్స్‌గా ఇచ్చి వారిని కాపాడుకుంటున్నారు.
మాస్టర్లు, కార్మికులు పల్లెబాట
అనేక టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వేలసం ఖ్యలో మాస్టర్లు, కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు పనిలేకపోవడంతో అనేకమంది మాస్టర్లు, కార్మికులు పల్లెబాట పట్టారు. ఒకప్పుడు బేగంబజార్‌లో ఎక్కుడ చూసినా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ క్యాబిన్లు, టిఫిన్ సెంటర్ల సామాను కొనుగోలు చేసేవారి సందడి ఉండేది. కానీ, ఇప్పుడు అక్కడ కుప్పలుకుప్పలుగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల క్యాబిన్లు సెకెండ్‌హ్యాండ్‌లో అమ్మకానికి పెట్టారు.
చికెన్ సెంటర్‌గా మార్చాం..
గత జనవరిలోనే కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టాం. రెండు నెలలపాటు మంచిగానే నడిచింది. మూడు నెలలుగా షాపు మూసివేసి ఉన్నా అద్దె కడుతూనే ఉన్నాం. ఇప్పుడు వినియోగదారులు రాకపోవడంతో దానిని చికెన్ సెంటర్‌గా మార్చాం. –స్వప్న, కోఠి
Comments
Please login to add a commentAdd a comment