small businesses
-
బడుగులపైకి బుల్డోజర్
సాక్షి, విశాఖపట్నం: రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే బడుగులపై జనసేన కార్పొరేటర్ తన ప్రతాపాన్ని చూపించారు. అధికారమే అండగా వారి దుకాణాలపైకి బుల్డోజర్ను పంపి కూల్చివేయించారు. వారి పొట్టకొట్టి రోడ్డున పడేలా చేశారు. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 22వ వార్డు పరిధిలో పిఠాపురం కాలనీలో ఉన్న సుమారు 500 చిన్నచిన్న దుకాణాల్ని శనివారం ఉదయం అధికారులు కూల్చిపారేశారు. పీతల మూర్తి యాదవ్ 2021లో కార్పొరేటర్‌గా గెలిచినప్పటి నుంచి ఈ వ్యాపారులతో నిరంతరం గొడవలకు దిగుతుండేవారు. ఎప్పటికైనా మీ షాపులన్నీ తొలగించేస్తానంటూ సవాల్ విసిరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చిరు దుకాణాలపై ఫిర్యాదు చేసినా అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న గత ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. దుకాణాలు తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చిరు వ్యాపారులకు వ్యతిరేకంగా పిటిషన్‌ఈ క్రమంలో ప్రభుత్వం మారిన వెంటనే జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ రెచ్చిపోయారు. చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాల్సిందేనంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కోర్టు ఆదేశాలు వచ్చాక.. చిరు వ్యాపారులకు ఎలాంటి నోటీసులివ్వకుండానే దుకాణాలు తొలగింపు ప్రక్రియని మొదలు పెట్టేశారు. ఏయూ గేట్‌ని ఆనుకొని ఉన్న షాపుల్ని బుల్డోజర్ల సాయంతో కూల్చివేశారు. మరికొన్ని చోట్ల చిరు వ్యాపారుల షెడ్లను పెకిలించిపారేశారు.దుకాణాలను కోల్పోయినవారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఆశ్రయించగా జీవీఎంసీ అధికారులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో దుకాణాల తొలగింపు ప్రక్రియని నిలిపివేశారు. ఎమ్మెల్యే పనులు నిలిపేశారని తెలుసుకున్న మూర్తి యాదవ్.. జీవీఎంసీ అధికారులకు ఫోన్ చేసి హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే కోర్టు ధిక్కరణ కేసులు పెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది. బాధిత వ్యాపారులు పిఠాపురం కాలనీ రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినదించారు.పన్ను చెల్లించినప్పుడు అక్రమమని గుర్తులేదా?నేను ఇక్కడ 30 ఏళ్లుగా సెలూన్ నడుపుతున్నా. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా దీన్ని నిర్వహిస్తున్నా. ట్రాఫిక్‌కు కూడా ఏ ఇబ్బందీ లేదు. జీవీఎంసీకి పదేళ్ల నుంచి పన్నులు కూడా కడుతున్నా. ఇప్పుడు జనసేన కార్పొరేటర్ చెప్పారని దుకాణాలు తొలగిస్తున్నారు. నా దుకాణం ఏర్పాటు అక్రమమైతే పన్నులు ఎందుకు కట్టించుకున్నారో అధికారులు, కార్పొరేటర్ చెప్పాలి. – కె.వెంకటరమణ, సెలూన్ షాప్ నిర్వాహకుడునోటీసులివ్వకుండా కూల్చారు నెల్లూరు నుంచి వలస వచ్చి.. రెండేళ్లుగా ఇక్కడ టిఫిన్ దుకాణాన్ని నడుపుతున్నాం. ఇంతకు ముందు.. కొంచెం లోపలకు పెట్టుకొండి.. లేదంటే పగలగొట్టేస్తామని జనసేన కార్పొరేటర్ మూర్తి చెప్పారు. మూడు రోజుల నుంచి చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నాం. ఇప్పుడు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారు. ఈ దుకాణంలో మా కుటుంబంతో పాటు మరో ఏడుగురు పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాం. ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితికి తీసుకొస్తారా? – కస్తూరయ్య, టిఫిన్ దుకాణం నిర్వాహకుడు -
చిన్న సంస్థలకు బీమాతో భరోసా - లాంబార్డ్ ఈడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద సంస్థలతో పోలిస్తే లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎదుర్కొనే సవాళ్లు విభిన్నంగా ఉంటాయని ఐసీఐసీఐ లాంబార్డ్ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. ప్రకృతిపరమైన లేదా వ్యాపారపరమైన విపత్తులు ఎలాంటి వాటినైనా ఎదుర్కొనేందుకు పెద్ద సంస్థలకు తగిన ఆర్థిక వనరులు ఉంటాయని.. కానీ స్వల్ప మార్జిన్లతో పని చేసే చిన్న సంస్థలకు వాటిని ఎదుర్కొనేంత ఆర్థిక సామర్థ్యాలు పెద్దగా ఉండవని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వాటికి బీమా ఉపయోగపడుతుందన్నారు. ఒక్కో ఎంఎస్ఎంఈ రిస్కులు ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి తమకు అనువైన, తగినంత కవరేజీ ఇచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దీన్ని వ్యయంగా గాకుండా భరోసాగా పరిగణించాలని పేర్కొన్నారు. దేశీయంగా 6.2 కోట్ల పైచిలుకు వ్యాపార సంస్థలు ఉన్నప్పటికీ ఎస్ఎంఈ బీమా తీసుకున్న వాటి సంఖ్య 3 శాతం కన్నా తక్కువే ఉంటుందని ఆయన చెప్పారు. బీమా ప్రయోజనాలపై అవగాహన తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని మంత్రి వివరించారు. దీనితో ఈ అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ మొదలుకుని కారు, ఫోన్ల వరకూ అన్నింటినీ ఇన్సూర్ చేయించుకోవచ్చని అర్థమైతే చిన్న సంస్థలు.. బీమాను ఒక వ్యయంగా కాకుండా రిస్కులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాధనంగా చూడటం మొదలుపెడతాయని మంత్రి చెప్పారు. టెక్నాలజీతో సెటిల్మెంట్ వేగవంతం.. ఇక, ఎస్ఎంఈల విశిష్ట అవసరాలను గుర్తించి తాము కృత్రిమ మేథ, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి ఉపయోగించి క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ. 5 లక్షల వరకు ప్రాపర్టీ, మెరైన్ క్లెయిమ్‌లను పది రోజుల్లోపే ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈల బీమా అవసరాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రూప్ హెల్త్, లయబిలిటీ, ఇంజినీరింగ్ ఇన్సూరెన్స్ వంటి పలు పాలసీలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
జీఎస్టీ డీక్రిమినైజేషన్‌పై కీలక చర్చ, వారికి భారీ ఊరట!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని చర్యలను ‘నేర జాబితా’ నుంచి (డీక్రిమినైజేషన్) తప్పించే విషయంపై ఈ నెల 17న జరిపే అత్యున్నత స్థాయి మండలి చర్చించే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అలాగే ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించే పరిమితిని ప్రస్తుతం రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచడంపైనా మండలి చర్చించనున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నిర్ణీత పరిమితికి (రూ.20 కోట్లు) దిగువన ఉన్న నేరస్తుల ఆస్తులను ఇకపై అటాచ్ చేయకుండా చేసే అంశంపైనా సమావేశం చర్చించనుందని అధికారులు తెలిపారు. స్నేహ పూర్వక పన్ను వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం దిశలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు. (సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్‌పై ఆర్థిక వేత్తల కీలక లేఖ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎగవేత లేదా దుర్వినియోగం మొత్తం రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఉంటే అధికారులు ఈ నేరం పాల్పడిన వారిపై ప్రాసిక్యూషన్ ప్రారంభించవచ్చని సెప్టెంబర్‌లో ప్రభుత్వం తెలిపింది. అయితే జీఎస్టీ అధికారుల లా కమిటీ, చట్టాన్ని నేరరహితం చేసే కసరత్తులో భాగంగా చట్టంలోని సెక్షన్ 132లో మార్పులను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. జీఎస్టీ చట్టం డీక్రిమినైజేషన్ ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించిన తర్వాత, డిసెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ఈ చట్టానికి సవరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు ఆమోదించిన తర్వాత, రాష్ట్రాలు తమ జీఎస్టీ చట్టాలను సవరించవలసి ఉంటుంది.ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని ప్రస్తుత 18 శాతం నుంచి తగ్గించేందుకు పలు సూచనలు అందాయని కూడా అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి! -
చిన్న సంస్థలకు... అమెజాన్ 1,873 కోట్లఫండ్
న్యూఢిల్లీ: దేశీయంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంబీ) డిజిటైజేషన్ ప్రయోజనాలు చేకూర్చడం అగ్రి–టెక్, హెల్త్–టెక్ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు తోడ్పాటు అందించడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరింతగా దృష్టి పెట్టనుంది. ఇందుకోసం 250 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 1,873 కోట్లు) ఫండ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. చాలా మటుకు ఆర్థిక వ్యవస్థలకు చిన్న, మధ్య తరహా వ్యాపారాలే దన్నుగా ఉంటాయని, వాటికి ఊతమిచ్చేందుకే అమెజాన్ సంభవ్ (ఎస్ఎంభవ్) వెంచర్ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సీఈవో ఆండ్రూ జస్సీ వెల్లడించారు. సరికొత్త వ్యాపారాలను నిర్మించడంలో మరిన్ని ఎస్ఎంబీలకు తోడ్పాటు అందించాలన్నది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సరికొత్త ఐడియాలను, ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ ఫండ్‌ను ఉద్దేశించినట్లు అమెజాన్ ఇండియా గ్లోబల్ ఎస్వీపీ అమిత్ అగర్వాల్ తెలిపారు. ‘ఈ ఫండ్ ప్రధానంగా ఎస్ఎంఈ డిజిటైజేషన్, రైతుల ఉత్పాదకతను పెంచగలిగే అగ్రిటెక్ ఆవిష్కరణలు, ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలకు ఉపయోగపడే హెల్త్–టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది‘ అని ఆయన వివరించారు. వెంచర్ ఫండ్ ద్వారా ఎం1ఎక్స్చేంజీ అనే స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. ఇది చిన్న వ్యాపార సంస్థలకు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మార్కెట్‌ప్లేస్ ఎక్సే్చంజీ తరహా సేవలు అందిస్తోంది. 2025కి ఆన్‌లైన్‌లోకి 10 లక్షల షాపులు.. లోకల్ షాప్స్ ప్రోగ్రాం కింద 2025 నాటికి పది లక్షల కిరాణా షాపులను ఆన్‌లైన్‌లోకి తేవాలని నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో ఈ ప్రోగ్రాం కింద ఆన్లైన్ బాట పట్టిన దుకాణాల సంఖ్య 10 రెట్లు పెరిగిందని ఆయన వివరించారు. సరఫరా వ్యవస్థలో భారత్‌కు ముఖ్య పాత్ర: ఇంద్రానూయి కోవిడ్ అనంతర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించగలిగే అవకాశాలు ఉన్నాయని పెప్సీకో మాజీ చైర్మన్ ఇంద్రా నూయి అభిప్రాయపడ్డారు. అయితే, కీలక ఉత్పత్తుల సరఫరాలో తన స్థానం గురించి, పోషించాల్సిన పాత్ర గురించి భారత్ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. తయారీకి సంబంధించి తన నియంత్రణలో ఉంచుకోవాల్సిన ఉత్పత్తులను, దేశీయంగా అవసరాల కోసం ఇక్కడే తయారు చేసుకోవాల్సిన కీలక ఉత్పత్తులను గుర్తించాలని సూచించారు. అమెజాన్ సంభవ్ కార్యక్రమం సందర్భంగా నూయి ఈ విషయాలు చెప్పారు. -
టిఫిన్ సెంటర్లకు ‘లాక్’!
సాక్షి, హైదరాబాద్: కరోనా చిన్నా, చితకా వ్యా పారాల్ని చిదిమేసింది. గల్లీ చివరి బడ్డీకొట్లను గల్లంతు చేసింది. తోపుడుబండిని కష్టాల్లోకి తోసేసింది. మెస్‌లు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంట ర్ల నిర్వాహకుల కడుపుకొట్టింది. కర్రీ పాయిం ట్లకు వర్రీనే మిగిల్చింది. నగరంలో ఏ వీధిలో చూసినా అడుగడుగునా కనిపించే టిఫిన్ సెం టర్లలో చాలావాటిని మాయం చేసింది. లాక్డౌన్ విధించిన నాటి నుంచి చిరువ్యాపారుల కు కష్టాలు మొదలయ్యాయి. రోజులు గడుస్తున్నకొద్దీ పరిస్థితుల్లో మార్పులొచ్చినా వీరి వ్యాపారాలు çపుంజుకుంటున్న దాఖలాల్లేవు. దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఫూర్తిగా భిన్నమైన పరిస్థితులు... రోజూ ఉదయం 6 నుంచే టీ, టిఫిన్ల కోసం వచ్చేవారితో సందడిగా కనిపించే టిఫిన్ సెం టర్లు, బడ్డీకొట్లు ఇప్పుడు కొడిగట్టిన దీపాల య్యాయి. వ్యాపారాలు సాగక, ఆర్థికభారాన్ని భరించలేక ఇప్పటికే కొందరు టిఫిన్ సెంటర్ల ను మూసేయగా, మరికొందరు ఇతర వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. మరికొందరు కూరగాయలు, ఇతర సరుకులమ్మే దుకాణాలుగా మారుస్తున్నారు. ముందైనా మంచి కాలముందా? ఈ విపత్కర పరిస్థితులు మున్ముందు మారితే మళ్లీ తమ వ్యాపారాలు పట్టాలెక్కుతాయనే ఆశాభావంతో కొందరు టిఫిన్ సెంటర్ల యాజమానులు రోజులు నెట్టుకొస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి వ్యాపారాలు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పది మంది పనివాళ్లు పనిచేసే చోట ఇప్పుడు ఒకరిద్దరితోనే నడిపిస్తున్నారు. అనుభవమున్న మాస్టర్లు, సర్వింగ్ సిబ్బంది వెళ్లిపోతే భవిష్యత్‌లో కష్టమని, గిరాకీ లేకపోయినా కొంతమం ది యజమానులు కొంత డబ్బు అడ్వాన్స్‌గా ఇచ్చి వారిని కాపాడుకుంటున్నారు. మాస్టర్లు, కార్మికులు పల్లెబాట అనేక టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వేలసం ఖ్యలో మాస్టర్లు, కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు పనిలేకపోవడంతో అనేకమంది మాస్టర్లు, కార్మికులు పల్లెబాట పట్టారు. ఒకప్పుడు బేగంబజార్‌లో ఎక్కుడ చూసినా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ క్యాబిన్లు, టిఫిన్ సెంటర్ల సామాను కొనుగోలు చేసేవారి సందడి ఉండేది. కానీ, ఇప్పుడు అక్కడ కుప్పలుకుప్పలుగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల క్యాబిన్లు సెకెండ్హ్యాండ్లో అమ్మకానికి పెట్టారు. చికెన్ సెంటర్‌గా మార్చాం.. గత జనవరిలోనే కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టాం. రెండు నెలలపాటు మంచిగానే నడిచింది. మూడు నెలలుగా షాపు మూసివేసి ఉన్నా అద్దె కడుతూనే ఉన్నాం. ఇప్పుడు వినియోగదారులు రాకపోవడంతో దానిని చికెన్ సెంటర్‌గా మార్చాం. –స్వప్న, కోఠి -
అందరికీ ఫ్రీ ఇంటర్నెట్ లక్ష్యం- గూగుల్
-
అందరికీ ఫ్రీ ఇంటర్నెట్ లక్ష్యం- గూగుల్
న్యూఢిల్లీ: భారత పర్యటనకు విచ్చేసిన ఇంటర్నెట్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చిన్న వ్యాపారస్తులకు ఆఫర్లను ప్రకటించారు. ఢిల్లీలో చిన్న మధ్య తరహా పరిశ్రమల సమావేశంలో బుధవారం పాల్గొన్న ఆయన గూగుల్ కంటే కూడా చిన్న వ్యాపారాల గురించి మాట్లాడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు. గూగుల్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారస్తులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ సమాఖ్య కంపెనీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సమావేశంలో పాల్గొన్న సుందర్ పిచాయి రాబో్యే మూడు సంవత్సరాలుగా భారతదేశంలో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్ లను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. భారతదేశ సమస్యల్ని అధిగమిస్తే ప్రపంచానికి పరిష్కారాలు చూపించినట్టేనని ఈ సందర్భంగా పిచాయ్ పేర్కొన్నారు. అందరికీ ఉచిత ఇంటర్నెట్ అందించడమే గూగుల్ లక్ష్యమన్నారు. దాదాపు ఇండియాలో దేశ వ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కృషిలో భాగంగా గడిచిన 18 ఏళ్ళలో మెజార్టీ ప్రజలకు తమ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇంటర్నెట్ ద్వారా ఏ వ్యాపారస్తుడైనా రిజిస్టర్ చేసుకొని శిక్షణ పొందొచ్చని తెలిపారు. అలాగే వారు ఉచితంగా సాధారణ వెబ్సైట్ సృష్టించుకోవచ్చన్నారు. దీనికోసం . వారు చేయవలసిందల్లా ఒక స్మార్ట్ ఫోన్ మరియు కొన్నినిమిషాల సమయాన్ని కేటాయింపు అని చెప్పారు. రిజిస్టర్ చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ సదుపాయాన్ని అందిస్తామని తెలిపారు. ముఖ్యాంశాలు చెన్నై లో చిన్నప్పుడు , నేను సమాచారం కోసం వెదుక్కున్నాను. నేడు చిన్న పిల్లవాడు వీలైనంత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. భారతదేశం లో చాలా చిన్న వ్యాపారులు ఇంటర్నెట్ ప్రతి ఒక్కరిదీ అనుకోవాలి. కావాలనుకున్నవారందరికీ నాణ్యమైన డిజిటల్ శిక్షణ అందుబాటులో డిజిటల్ అన్‌లాక్ ప్రోగ్రామ్ గా దీన్ని పిలుస్తున్నాం. భారతదేశం లో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్స్ -
కొనేవారు లేక వెలవెల బోతున్న దుకాణాలు
-
రోడ్డు సైడ్ దుకాణాలపై ఐటీ రైడ్స్
ముంబాయి : మోదీ ప్రభుత్వ పన్ను జాబితాలో తర్వాతి టార్గెట్ ఎవరో తెలుసా? రోడ్డు పక్కనున్న వడాపావ్ దుకాణాలు, దోసా సెల్లర్స్ అట. పన్ను ఎగవేతదారులపై కొరడా ఝళిపించేందుకు సిద్దమైన ప్రభుత్వం, చిన్న చిన్న బిజినెస్‌లను సైతం వదలడం లేదు. చిన్న వ్యాపారస్తులు, రోడ్డు పక్కన దుకాణాలపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్వహిస్తోంది. బ్లాక్ మనీని నిరోధించడానికి తీసుకొచ్చిన ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద ఆదాయ వివరాలను తెలుపాలని అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఒక్క ముంబాయిలోనే ఈ రైడ్స్ 50కి పైగా జరిగాయి. థానేలోని ప్రముఖ వడాపావ్ సెంటర్, ఘట్కోపూర్లోని దోసా సెంటర్, అంథేరిలోని శాండ్ విచ్ షాపులపై ఈ దాడులు నిర్వహించారు. అదేవిధంగా అహ్మదాబాద్‌లోనూ 100కు పైగా దుకాణాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝళించింది.. న్యూఢిల్లీ, కోల్‌కత్తాలోని ప్రముఖ దుకాణాలపై ఈ దాడులను చేపడుతున్నారు. గత ఆరు నెలలుగా ఆదాయపు పన్ను శాఖ సేకరించిన సమాచారం మేరకు అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు లక్ష వరకు చిన్న వ్యాపారులను, షాప్ కీపర్లను పన్ను ఎగవేతదారులుగా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రతి పట్టణాన్ని టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం ఈ దాడులు నిర్వహిస్తోంది. తన 25 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ ఇలాంటి రైడ్స్‌ను ఎరుగనని, అసలు పన్ను డీల్సే తెలియని వారికి మొదటిసారి అధికారులు చుక్కలు చూపిస్తున్నారని ముంబాయిలోని ఓ చార్టెడ్ అకౌంటెంట్ చెప్పారు. బ్లాక్‌మనీ నిరోధించడానికి మోదీ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. తాజాగా ముంబాయిలో పన్ను అధికారులు చేస్తున్న ఈ రైడ్స్ ద్వారా ఇప్పటికే రూ.2 కోట్లను సీజ్ చేసినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 30 లోపు దేశవ్యాప్తంగా ఇలాంటి రైడ్స్ వేయి వరకు జరుగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్‌కు ఇంకా 10 రోజులే మిగిలి ఉండటంతో ఈ రైడ్స్ మరింత ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 30ను ఆదాయపు రిటర్న్స్‌కు ప్రభుత్వం తుది గడువుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలను, వ్యక్తులను, షాపింగ్ బిల్లుల టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం ఈ దాడులు చేసింది. గడువు సమీపిస్తున్నందున్న పన్ను ఎగవేసిన చిన్న వ్యాపారులను సైతం వదిలేది లేదని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంటోంది. -
ఉపాధి @ అమీర్‌పేట్
అమీర్‌పేట్...కేరాఫ్ అమెరికా! ఔను...ఏ మారుమూల గ్రామం నుంచి ఎవరైనా ‘సాఫ్ట్’గా అమెరికా వెళ్లారంటే వయా అమీర్‌పేటే. ఇక్కడ ‘శిక్షణ’ పునాది వేసుకుంటే అమెరికా ప్రయాణం ఖాయమైనట్టు. యువతను సానబెడుతూ సాఫ్ట్వేర్ దిగ్గజాలను తయారుచేసే కేంద్రం అమీర్‌పేట్ అంటే అతిశయోక్తి కాదు. వాణిజ్య, వ్యాపార, విద్యా, రెసిడెంట్స్.. ఇలా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో విరాజిల్లుతోంది. ఒక నగరం.. ఒక రాష్ర్టం.. ఒక ప్రాంతంతో నిమిత్తం లేకుండా అంతర్జాతీయంగా ఇక్కడి నుంచి లావాదేవీలు జరుగుతుంటాయి. ‘అమీర్’పేటను నమ్ముకుంటే అమీరులవుతారని అంటుంటారు కొందరు. అందుకేనేమో అందరి చూపు ఇటు వైపే. చిరువ్యాపారి నుంచి కోట్లలో వ్యాపారాలు చేసే వారికి ఈ ప్రాంతం ఓ వేదిక. నిరుపేద నుంచి సంపన్నవర్గాల వరకు అవసరమైన ప్రతి వస్తువూ ఇక్కడ లభ్యమవుతోంది. - సనత్‌నగర్ నల్లభై ఏళ్ళ క్రితం అమీర్‌పేట ఒక మామూలు ప్రాంతం. పల్లెటూరు వాతావరణం దాని సొంతం. అక్కడక్కడ విసిరేసినట్లుగా ఉండే పెంకుటిల్లు. హోయ్...హోయ్...అంటూ గేదెల చావిళ్ల వద్ద సవ్వడి...అక్కడక్కడ చిన్న చిన్న దాబాలు...రారమ్మని ఆహ్వానించే ఢిల్లీ మిఠాయి దుకాణం...ప్రధాన రోడ్డు పక్కనే ఉడిపి హోటల్..సమీపంలో కూడా కంటికి కనిపించని ఎర్రబస్సులు...బస్సు కూడా దూరని దారులు...విజయలక్ష్మి గుడి.. శీష్ మహల్ థియేటర్...ఇవీ 40 ఏళ్ల క్రితం అమీర్‌పేట్‌లోని దృశ్యాలు. అంతకమునుపే అమీర్‌పేట్ కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది. క్రమేపీ రూపురేఖలు మార్చుకుంటూ వచ్చింది. భాగ్యనగరానికి సెంటర్ పాయింట్ అయ్యింది. నగరం నడిబొడ్డున ఉండడం చేత అమీర్‌పేట దశ మారింది. అలనాడు పచ్చదనంతో నిండిన అమీర్‌పేట్ ఇప్పుడు జనాల సందడితో బిజీగా మారిపోయింది. అన్ని రంగాలకు కేంద్ర బిందువుగా.. నెమ్మది నెమ్మదిగా పెంకుటిళ్లు మాయమయ్యాయి. ఆకాశహారా్మ్యాలను తలపించే భవన సముదాయాలు వెలిశాయి. వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అనువైన ప్రాంతంగా మారింది. ఒక్కొక్కటిగా కార్పొరేట్ సంస్థలు పాగా వేశాయి. పేరెన్నికగన్న వస్త్ర దుకాణాలు, ఆటోమొబైల్స్, హోటల్స్, విద్యా సంస్థలు, పారిశ్రామికం, సాఫ్ట్వేర్, సూపర్ మార్కెట్లు, ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని రంగాల వ్యాపారులు తమ కార్యకలాపాలను విస్తరించుకుంటూ వచ్చారు. ఆయా రంగాల్లో శిక్షణ, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చే వారికి సందడిగా ఉంటుంది. చిరువ్యాపారాలకు కేరాఫ్‌గా... ఒకవైపు బడా వ్యాపారుల కల్చర్...మరోవైపు చిరువ్యాపారుల బతుకుబండిని అమీర్‌పేట్ నడిపిస్తోంది. చాయ్...చాట్...చైనీస్ ఫుడ్....టిఫిన్ బండ్లు...ఇలా ఎన్నో రకాల చిరు వ్యాపారాలకు అమీర్‌పేట్ సెంటర్ అయ్యింది. ఇక్కడకు సామాన్యుడి నుంచి కుబేరుల వరకు వచ్చి రుచులను ఆస్వాదిస్తూనే ఉంటారు. సాయంత్రమైందంటే ఆయా సెంటర్ల వద్ద సందడి అంతా ఇంతా కాదు. ఈ చిరువ్యాపారాలు కోట్లలో ఉంటాయన్నది సుస్పష్టం. -
నగరంలో కన్నడిగులు...
మినీ భారత్: ఏళ్ల కిందటే భాగ్యనగరానికి వలస వచ్చిన కన్నడిగులు ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ఇడ్లీ, దోశ వంటి తినుబండారాల చిరు వ్యాపారాలు మొదలుకొని ట్రాన్స్పోర్ట్, వస్త్ర వ్యాపారాలు, బంగారు, వెండి ఆభరణాల వంటి బడా వ్యాపారాలు చేస్తున్న వారు కొందరైతే, ప్రైవేటు ఉద్యోగాల్లో కుదురుకున్న వారు ఇంకొందరు. ఉపాధి కోసం ఎలాంటి వృత్తి వ్యాపారాల్లో కొనసాగుతున్నా, కన్నడిగులు తమ సంప్రదాయాలను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 1972లో భారీ వలసలు... కన్నడిగుల్లో కొందరు నిజాం కాలంలోనే హైదరాబాద్ నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. అయితే, 1972లో కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా తదితర జిల్లాలతో పాటు సరిహద్దుల్లోని మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తీవ్రమైన కరువు వాటిల్లినప్పుడు పెద్దసంఖ్యలో కన్నడిగులు నగరానికి వలస వచ్చారు. నగరంలోని గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, మామాజుమ్లా పాఠక్, కోకర్‌వాడీ, చేలాపురా, గౌలిపురా, ఛత్రినాక, ఫిసల్‌బండ, బహదూర్‌పురా, జియాగూడ, బేగంబజార్, మిధాని, దిల్సుఖ్నగర్, కాచిగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. శాకాహారం... శైవాచారం... కన్నడిగుల్లో వీరశైవులు, లింగాయత్‌లు శివలింగానికి పూజచేయడంతో దినచర్య ప్రారంభిస్తారు. జొన్నరొట్టెలు, గోధుమరొట్టెలను ప్రధానంగా స్వీకరించే వీరు పూర్తిగా శాకాహారులు. విందు, వినోదాల్లో సైతం మాంసాహారానికి దూరంగా ఉంటారు. వీరశైవులకు జగద్గురు రేణుకాచార్య కులగురువు కాగా, లింగాయత్‌లకు మహాత్మా బసవేశ్వర కులగురువు. కన్నడిగుల్లో యువతరం ఆధునిక వస్త్రధారణకు అలవాటు పడినా, వయసు మళ్లిన వారు మాత్రం ఇప్పటికీ సంప్రదాయ వస్త్రధారణతోనే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కన్నడిగుల ప్రత్యేక పండుగ ‘యాడమాస్’ ఉగాది, దసరా, దీపావళి, నాగపంచమి పండుగులను తెలుగువారి మాదిరిగానే జరుపుకొనే కన్నడిగులు, ‘యాడమాస్’ పండుగను ప్రత్యేకంగా జరుపుకొంటారు. పంటలు చేతికొచ్చే సమయంలో జనవరిలో నిర్వహించే ఈ పండుగకు నగరంలోని కన్నడిగులందరూ తప్పనిసరిగా తమ తమ స్వస్థలాలకు వెళతారు. జొన్నరొట్టెలతో పాటు పిండివంటలు చేసుకుని, తమ తమ పొలాలకు వెళ్లి, చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడే సామూహికంగా విందుభోజనాలు చేసి, సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ఇక లింగాయత్‌లు తమ కులగురువైన మహాత్మా బసవేశ్వర జయంతిని వేడుకగా జరుపుకొంటారు. ఆ సందర్భంగా పతాకావిష్కరణ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లలో తలపాగా తప్పనిసరి మర్యాద... కన్నడిగుల పెళ్లిళ్లలో తలపాగా మర్యాద తప్పనిసరి. పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల్లో పురుషులందరికీ తప్పనిసరిగా తలపాగా కడతారు. మహిళలందరికీ చీర, పసుపు కుంకుమలు ఇస్తారు. వరుడి ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు వధువు తరఫు బంధుమిత్రులందరికీ ఈ మర్యాదలు చేస్తారు. ఇందులో చిన్నా పెద్దా తారతమ్యాలు ఉండవు. కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలి కన్నడిగులను లింగ్విస్టిక్ మైనారిటీలుగా గుర్తించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. నగర శివార్లలో మహాత్మా బసవేశ్వర ఆశ్రమ నిర్మాణానికి మూడెకరాల ఖాళీ స్థలాన్ని కేటాయించాలి. నగరంలోని ప్రధాన కూడలిలో బసవేశ్వర శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కన్నడిగుల కోసం ప్రత్యేక శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలి. - నాగ్నాథ్ మాశెట్టి, అధ్యక్షుడు, ఏపీ బసవ కేంద్రం,హైదరాబాద్ పిల్లి రాంచందర్