
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టం ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని చర్యలను ‘నేర జాబితా’ నుంచి (డీక్రిమినైజేషన్) తప్పించే విషయంపై ఈ నెల 17న జరిపే అత్యున్నత స్థాయి మండలి చర్చించే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అలాగే ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించే పరిమితిని ప్రస్తుతం రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచడంపైనా మండలి చర్చించనున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
నిర్ణీత పరిమితికి (రూ.20 కోట్లు) దిగువన ఉన్న నేరస్తుల ఆస్తులను ఇకపై అటాచ్ చేయకుండా చేసే అంశంపైనా సమావేశం చర్చించనుందని అధికారులు తెలిపారు. స్నేహ పూర్వక పన్ను వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం దిశలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు. (సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్‌పై ఆర్థిక వేత్తల కీలక లేఖ)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎగవేత లేదా దుర్వినియోగం మొత్తం రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఉంటే అధికారులు ఈ నేరం పాల్పడిన వారిపై ప్రాసిక్యూషన్ ప్రారంభించవచ్చని సెప్టెంబర్‌లో ప్రభుత్వం తెలిపింది. అయితే జీఎస్‌టీ అధికారుల లా కమిటీ, చట్టాన్ని నేరరహితం చేసే కసరత్తులో భాగంగా చట్టంలోని సెక్షన్ 132లో మార్పులను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.
జీఎస్‌టీ చట్టం డీక్రిమినైజేషన్ ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించిన తర్వాత, డిసెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ఈ చట్టానికి సవరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు ఆమోదించిన తర్వాత, రాష్ట్రాలు తమ జీఎస్‌టీ చట్టాలను సవరించవలసి ఉంటుంది.ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీని ప్రస్తుత 18 శాతం నుంచి తగ్గించేందుకు పలు సూచనలు అందాయని కూడా అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి!
Comments
Please login to add a commentAdd a comment