GST Council
-
త్వరలో జీఎస్టీ శ్లాబ్‌ల సరళీకరణ
వస్తు, సేవల పన్ను (GST) శ్లాబ్‌లను మరింత సరళీకరించాలని జీఎస్టీ కౌన్సిల్ యోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సరళమైన, క్రమబద్ధమైన పన్నుల వ్యవస్థ లక్ష్యంగా చేసుకుని జీఎస్టీ శ్లాబుల సంఖ్యను తగ్గించడం, రేట్లను హేతుబద్ధీకరించడాన్ని కౌన్సిల్ పరిశీలిస్తోందని మంత్రి హింట్ ఇచ్చారు.ప్రస్తుతం జీఎస్టీ వ్యవస్థలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు అంచెలు ఉన్నాయి. ప్యాక్ చేసిన ఆహారం వంటి నిత్యావసర వస్తువులపై అత్యల్పంగా 5 శాతం, లగ్జరీ వస్తువులు వంటివాటిపై అత్యధికంగా 28 శాతం పన్ను విధిస్తున్నారు. ఇప్పటికే కొన్ని శాఖలు, వ్యాపార సంఘాల నుంచి ఈ శ్లాబ్‌ల సవరణకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ శ్లాబ్‌ల సంఖ్యను తగ్గించేలా రానున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తారని అభిప్రాయపడుతున్నారు.సామాన్యులపై భారం పడకుండా..జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడం, వాటిని సరళతరం చేసే కార్యక్రమాలు దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్నట్లు ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. జీఎస్టీ రేట్లలో మార్పులు, శ్లాబులను తగ్గించేందుకు మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులపై రేట్ల సవరణ వల్ల సామాన్యులపై భారం పడకుండా పన్ను వ్యవస్థను నిష్పక్షపాతంగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. జీఎస్టీ సమీక్ష పరిధిని విస్తృతం చేశామని పేర్కొన్నారు. ప్రతిపాదిత మార్పులపై జీఎస్టీ కౌన్సిల్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: 5జీ స్పెక్ట్రమ్ వేలానికి మార్గం సుగమంఎన్నికల వేళ నిర్ణయాలపై విమర్శలు2025-26 కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఆదాయపు పన్ను ఉపశమనం లభించింది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని, నిర్మాణాత్మక ఆర్థిక మందగమనం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేయడమే లక్ష్యంగా పన్ను మినహాయింపు ఉందన్న ఊహాగానాలను ఆమె తోసిపుచ్చారు. జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో నిత్యావసర వస్తువులు, సేవల ధరలు తగ్గడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. పన్ను వ్యవస్థను సరళతరం చేసి మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ విస్తృత లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. -
పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు
పాలసీబజార్(Policybazaar) మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ గురుగ్రామ్ కార్యాలయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) సోదాలు నిర్వహించింది. పాలసీబజార్ ఆఫ్‌లైన్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగమైన పీబీ పార్టనర్స్‌తో కలిసి కొందరు విక్రేతల ద్వారా పన్ను ఎగవేతకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. దాంతో జీఎస్టీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.ఈ సోదాల్లో భాగంగా అధికారులు కంపెనీ ఆవరణలోని డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జీఎస్టీ ఫైలింగ్‌లో వ్యత్యాసాలు, ఎగవేతలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సోదాలపై పీబీ ఫిన్‌టెక్ స్పందించింది. జీఎస్టీ అధికారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించినట్లు, తదుపరి ఏవైనా సమాచారం కావాల్సి వచ్చినా పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. ఈ సోదాల వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ పైసాబజార్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ సోదాలకు సంబంధించి జీఎస్టీ అధికారిక వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?తనిఖీలు ఎందుకు..?పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి, ఏదైనా పన్ను ఎగవేతను కనుగొనడానికి జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తూంటారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఫ్రేమ్‌వర్క్ కింద ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ఈ సోదాలు చేస్తారు. అయితే ఇలా నిర్వహించే సోదాలకు చాలా కారణాలున్నాయి. జీఎస్టీ ఫైలింగ్‌లో వ్యత్యాసాలను గుర్తించడానికి, పన్ను ఎగవేతను వెలికితీయడానికి ఇవి సహాయపడతాయి. తనిఖీల సమయంలో మోసపూరిత కార్యకలాపాలను సూచించే పత్రాలు, రికార్డులు, ఇతర సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. పన్నులు ఎగవేయాలని భావించే వ్యాపారాలు, వ్యక్తులకు ఈ తనిఖీలు అడ్డంకిగా మారుతాయి. -
పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. నెట్టింట చర్చ
పాప్‌కార్న్‌లోని చక్కెర, మసాలా స్థాయుల ఆధారంగా విభిన్న పన్ను స్లాబ్‌లను అమలు చేయడంపట్ల నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇటీవల రాజస్థాన్‌లోని జసల్మేర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో జీఎస్టీను హేతుబద్దీకరించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా పాప్‌కార్న్(Popcorn)లోని చక్కెర, మసాలా స్థాయులను అనుసరించి విభిన్న రేట్లను నిర్దేశించారు.సాల్ట్, మసాలాలతో కూడిన నాన్ బ్రాండెడ్ పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎస్టీ, ప్రీ ప్యాకేజ్డ్, బ్రాండెడ్ పాప్‌కార్న్‌పై 12 శాతం, కారామెల్ పాప్‌కార్న్, చక్కెర కంటెంట్ ఉన్న పాప్‌కార్న్‌పై 18 శాతం జీఎస్టీను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రేట్లు వెంటనే అమలు చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఆదివారం పాప్‌కార్న్ కొనుగోలు చేసివారు వాటిపై జీఎస్టీ(GST) విధించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.Complexity is a bureaucrat’s delight and citizens’ nightmare. https://t.co/rQCj9w6UPw— Prof. Krishnamurthy V Subramanian (@SubramanianKri) December 22, 2024ఇదీ చదవండి: ‘గూగులీనెస్’ అంటే తెలుసా? సుందర్ పిచాయ్ వివరణఅదనపు చక్కెర, మసాలాలతో కూడిన ఉత్పత్తులపై వేర్వేరుగా పన్ను విధిస్తున్నట్లు కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఏదేమైనా ఈ నిర్ణయం వల్ల ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మద్దతుదారుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. నెట్టింట ఈ వ్యవహారంపై తీవ్రంగానే చర్చ జరుగుతోంది. జీఎస్టీ హేతుబద్దీకరణ పేరుతో సాధారణ పౌరులపై పన్నుల రూపంలో భారీగా ఆర్థిక భారం మోపుతున్నట్లు విమర్శకులు వాదిస్తున్నారు. -
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం: ఆ లావాదేవీలపై జీఎస్టీ లేదు
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో.. ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇందులో రూ. 2000లోపు లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ మినహాయింపులు లభించనున్నట్లు.. ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' వెల్లడించారు. అయితే ఈ మినహాయింపు.. ఫిన్‌టెక్ సేవలకు వర్తించదు.రుణగ్రహీత రుణ నిబంధనలను పాటించనందుకు, అంటే.. ఈఎంఐ చెల్లింపు లేదా రీపేమెంట్ షెడ్యూల్‌లను ఉల్లంఘించిన్నప్పుడు బ్యాంకులు & నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా విధిస్తుంది. అయితే ఈ జరిమానాలపై కూడా ఎటువంటి జీఎస్టీ విధింపు ఉండదని సీతారామన్ ప్రకటించారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదాబీమా ప్రీమియంపై జీఎస్టీ వాయిదాజీఎస్టీ కౌన్సిల్.. ఆరోగ్య, జీవిత బీమాతో సహా ఇన్సూరెన్స్ ప్రీమియంలకు జీఎస్టీ రేట్లను తగ్గించే నిర్ణయాన్ని వాయిదా వేసింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆరోగ్య & జీవిత బీమా ప్రీమియంలకు GST తగ్గించడంపై చర్చ జరుగుతుండగా.. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరింత చర్చ అవసరమని అన్నారు. తరువాత జనవరిలో జరగనున్న సమావేశంలో బహుశా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో మెరుగ్గానే నమోదయ్యాయి. సమీక్షా నెలలో 8.5 శాతం పురోగతితో (2023 ఇదే నెలతో పోలిస్తే) రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ 9.4 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై పన్ను ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 6 శాతం పెరిగి రూ.42,591 కోట్లకు చేరుకుంది.రిఫండ్స్ రూ.19,259 కోట్లునవంబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,82 కోట్లలో రూ.19,259 కోట్ల రిఫండ్స్ జరిగాయి. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 8.9 శాతం క్షీణతను నమోదు చేసింది. రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ.1.63 లక్షల కోట్లకు చేరాయి.విభాగాల వారీగా..→ మొత్తం వసూళ్లు రూ.1,82 కోట్లు→ సెంట్రల్ జీఎస్టీ రూ.34,141 కోట్లు → స్టేట్ జీఎస్టీ రూ.43,047 కోట్లు → ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ విలువ రూ.91,828 కోట్లు → సెస్ రూ.13,253 కోట్లు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంమరోవైపు డిసెంబర్ 21న జైసల్మేర్‌లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కౌన్సిల్ మొదట నవంబర్‌లో సమావేశం కావాలని నిర్ణయించారు. కానీ మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు శీతాకాల సమావేశాల కారణంగా వాయిదా పడింది. -
జులైలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు
భారత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జులైలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.3 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జులై 1వ తేదీన కొత్త పరోక్ష పన్ను వసూళ్ల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇవి మూడో అత్యధిక వసూళ్లు.ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం..జులైలో మొత్తం రీఫండ్లు రూ.16,283 కోట్లుగా ఉన్నాయి. రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర వస్తు, సేవల పన్ను (జీఏస్టీ) సేకరణ రూ.1.66 లక్షల కోట్లుగా ఉంది. స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,82,075 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.32,386 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.40,289 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.96,447 కోట్లు, సెస్ రూ.12,953 కోట్లు ఉన్నాయి. ఇదీ చదవండి: పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. కారణం..దేశీయ కార్యకలాపాల పన్నుల ద్వారా ఆదాయం 8.9 శాతం వృద్ధి చెంది జులైలో రూ.1.34 లక్షల కోట్లుకు చేరింది. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 14.2 శాతం పెరిగి రూ.48,039 కోట్లకు చేరింది. స్థూల జీఎస్టీ రాబడులు ఏప్రిల్ 2024లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏప్రిల్ 2023లో ఇది రూ.1.87 లక్షల కోట్లు. తాజాగా వసూలైన జీఎస్టీ రూ.1.82 లక్షల కోట్లు మూడో భారీగా వసూళ్లుగా నమోదయ్యాయి. -
ఏడు నెలల తర్వాత జరుగబోతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 53వ సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జూన్ 22న దిల్లీలో నిర్వహించనున్నట్లు ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.కౌన్సిల్ అక్టోబర్ 2023లో చివరిసారిగా సమావేశం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరిగి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ఇటీవల ఎన్నికల పలితాలు వెలువడి మంత్రిత్వశాఖలు కేటాయించడంతో జూన్ 22న తిరిగి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పింది. ఎన్నికల తరుణంలో ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి పూర్తికాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జులైలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జూన్ 22న జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారనుంది. ఏయే వస్తువులపై ఏమేరకు ట్యాక్స్‌లో మార్పులుంటాయో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.ఇదీ చదవండి: తెలుగు వెబ్‌సిరీస్ తొలగించాలని కోర్టులో పిటిషన్కౌన్సిల్ సమావేశపు ఎజెండా ఇంకా వెలువడలేదు. ఈసమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సెక్రటరీలు హాజరవుతారు. ఇదిలాఉండగా, గత పదేళ్లుగా చేపట్టిన సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని కేంద్ర ఆర్థికమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనను వేగవంతం చేసే దిశగా చర్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, జీవనాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్లో కీలక నిర్ణయాలు వెలువడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలనే జీఎస్టీ కౌన్సిల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోదని తెలుస్తోంది.జీఎస్టీ కౌన్సిల్ గతేడాది ఆన్లైన్ గేమింగ్, కాసినో, హార్స్ రేసింగ్‌లపై 28 శాతం చొప్పున జీఎస్టీ అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు 2022 నుంచి గతేడాది అక్టోబర్ నాటికి రూ. 1,12,332 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ గేమింగ్ కంపెనీలకు మొత్తం 71 షోకాజ్ నోటీసులందించింది. అయితే దీనిపై గేమింగ్ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ తరుణంలో గేమింగ్ కంపెనీల సమస్యపై రివ్వ్యూ జరగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జీఎస్టీ కౌన్సిల్ 28శాతం జీఎస్టీని ఉపసంహరించుకునే అవకాశం లేదు. గతంలో జారీ చేసిన నోటీసులపై కౌన్సిల్ పరిశీలించవచ్చు. ఎందుకంటే అనేక గేమింగ్ కంపెనీలు ఈ నోటీసులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యపై చాలా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ తీర్పు కోసం గేమింగ్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..
జీఎస్టీ వసూళ్లు ప్రతినెల భారీగా వసూలు అవుతున్నాయి. మార్చి నెలకుగాను రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన దానితో పోలిస్తే ఇది 11.5 శాతం అధికం. అలాగే జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రెండో అతిపెద్ద వసూళ్లు కూడా ఇదే కావడం విశేషం. గరిష్ఠంగా ఏప్రిల్ 2023లో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇదే ఏడాది ఫిబ్రవరిలో వసూలైన రూ.1.68 లక్షలకోట్ల కంటే ఈసారి అధికంగానే జీఎస్టీ ఖజానాకు చేరింది.ఈసారి సెంట్రల్ జీఎస్టీ కింద రూ.34,532 కోట్లు వసూలవగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.43,746 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.87,947 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.20.14 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అంతక్రితం ఏడాదికంటే 11.7 శాతం అధికం.గత నెలలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. ఏడాది క్రితం మార్చి నెలలో రూ.4,804 కోట్లు వసూలవగా, ఈసారి ఇది రూ.5,399 కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో జీఎస్టీ వసూళ్లు 16 శాతం ఎగబాకి రూ.3,532 కోట్ల నుంచి రూ.4,082 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది. -
ఎల్ఐసీకి రూ.806 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) జీఎస్టీ నుంచి రూ.806 కోట్లకు సంబంధించిన డిమాండ్ ఆర్డర్ కమ్ పెనాల్టీ నోటీసును అందుకున్నట్లు సంస్థ రిగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇందులో రూ.365 కోట్లు జీఎస్టీ చెల్లింపులుకాగా, రూ.405 కోట్లు జరిమానా, రూ.36 కోట్లు వడ్డీతో కలిపి మొత్తం రూ.806 కోట్లకు పైగా చెల్లించాలని తెలిపింది. ఇందుకు సంబంధించి జనవరి 1న నోటీసు అందినట్లు సంస్థ చెప్పింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నోటీసులు అందినట్లు సమాచారం. నిర్దేశించిన గడువులోగా ఆర్డర్‌కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది. ప్రస్తుతం వచ్చిన నోటీసులతో ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ అధికారులు తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రీఇన్సూరెన్స్ నుంచి పొందిన ఐటీసీ రివర్సల్, జీఎస్టీఆర్కు చెల్లించిన ఆలస్య రుసుంపై వడ్డీ, అడ్వాన్స్‌పై వడ్డీ కలిపి సంస్థకు రూ.806 కోట్లకు నోటీసులు పంపించినట్లు తెలిసింది. -
రూ.13.83 కోట్ల జీఎస్టీ నోటీసు.. ఆ తేడాలే కారణం..
ఏషియన్ పెయింట్స్ కంపెనీ రూ.13.83 కోట్ల జీఎస్టీ, రూ.1.38 కోట్ల పెనాల్టీ చెల్లించాలని కేంద్ర పన్నుల డిప్యూటీ కమిషనర్ డిమాండ్ నోటీసు పంపినట్లు సంస్థ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో తేడాలపై 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈ డిమాండ్ నోటీసు వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ నోటిసుకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఏషియన్ పెయింట్స్ కంపెనీ చేసిన సరఫరాలపై ఐటీసీని పొందడానికి వర్తించే అన్ని పన్నులను చెల్లించినట్లు కంపెనీ చెప్పింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 సంబంధిత నిబంధనల ప్రకారం ఈ నోటీసులు వచ్చినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు.. ఏషియన్ పెయింట్స్ కంపెనీను 1942లో చంపక్లాల్ చోక్సీ, చిమన్లాల్ చోక్సీ స్థాపించారు. 1965 వరకు ఏషియన్ ఆయిల్ అండ్ పెయింట్ కంపెనీ ఉన్న సంస్థ పేరును ఏషియన్ పెయింట్స్‌గా మార్చారు. ఇండియాలో మొత్తం 10 తయారీ కేంద్రాలున్నాయి. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని పటాన్చెరు, విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి. -
జీఎస్టీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు డిసెంబర్లో రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 ఇదే నెలతో పోలిస్తే ఈ విలువ 10 శాతం అధికం. ఏప్రిల్–డిసెంబర్ 2023 మధ్య జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగి రూ.14.97 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో వసూళ్లు సగటున 12 శాతం వృద్ధితో రూ.1.66 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలో తీరిది... ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్ నెలల్లో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు ఒనగూరాయి. జూలై వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు. ఆగస్టు వసూళ్లు రూ. 1.59 లక్షల కోట్లుకాగా, సెప్టెంబర్‌లో రూ. 1.63 లక్షల కోట్ల జీఎస్టీ రాబడి నమోదయ్యింది. ఇక అక్టోబర్ విషయానికి వస్తే. వసూళ్లు భారీగా రూ.1.72 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలైలో ప్రారంభం తర్వాత ఇవి రెండవ భారీ స్థాయి వసూళ్లు (2023 ఏప్రిల్ తర్వాత). నవంబర్‌లో వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు. ఎకానమీ క్రియాశీలత, పన్నుల ఎగవేతలను అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు, వసూళ్ల వ్యవస్థలో సామర్థ్యం పెంపు, పండుగల డిమాండ్ జీఎస్టీ భారీ వసూళ్లకు కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న నెలల్లో సైతం ఇదే ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం ఆదాయం రూ.1,64,882 ఇందులో సీజీఎస్టీ రూ.30,443 ఎస్జీఎస్టీ రూ.37,935 ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 84,255 సెస్ రూ.12,249 -
తెలంగాణను దాటేసిన ఏపీ..!
దేశంలో మరోసారి భారీగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. నవంబరు నెలలో జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31%, తెలంగాణలో 18% వృద్ధి నమోదు చేశాయి. కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన నవంబరు నెల లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వసూళ్లు గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో రూ.3,134 కోట్ల నుంచి రూ.4,093 కోట్లకు పెరిగాయి. ఈ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,67,929 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ వాటా రూ.30,420 కోట్లు, ఎస్జీఎస్టీ వాటా రూ.38,226 కోట్లు. ఐజీఎస్టీ రూపంలో రూ.87,009 కోట్ల సమకూరగా.. సెస్సుల రూపంలో రూ.12,274 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. ఐజీఎస్టీ రూపంలో వచ్చిన వసూళ్లను రూ.37,878 కోట్లు సీజీఎస్టీకి, రూ.31,557 కోట్లు ఎస్జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 15 శాతం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఆరోసారి. రాష్ట్రాల వారీగా రూ.25,585 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో రూ.4,093 కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాది రూ.3,134 కోట్లతో పోలిస్తే 31 శాతం అధికం. తెలంగాణలో గతేడాది రూ.4,228 కోట్లు వసూళ్లు ఈ సారి 18 శాతం వృద్ధితో రూ.4,986 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. ఎస్జీఎస్టీని కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన తర్వాత ఏప్రిల్-నవంబరు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన వాటా 2022తో (రూ.18,742కోట్లు) పోలిస్తే 2023లో (రూ.20,952కోట్లు) 12% పెరిగింది. తెలంగాణకు దక్కిన వాటా రూ.24,460 కోట్ల నుంచి రూ.26,691 కోట్లకు (9%) పెరిగింది. ఎస్జీఎస్టీ వాటా అన్ని రాష్ట్రాలకూ సగటున 12% వృద్ధి చెందింది. -
రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు
దిగ్గజ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) నోటీసులు జారీ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం.. జొమాటో, స్విగ్గీ వరుసగా రూ.400 కోట్లు, రూ.350 కోట్ల విలువైన జీఎస్టీ నోటీసులు అందుకున్నాయి. ఫుడ్ డెలివరీ అనేది ఒక సర్వీస్ కాబట్టి దాని ట్యాక్స్‌స్లాబ్‌కు తగినట్లు జొమాటో, స్విగ్గీ జీఎస్టీ చెల్లించాలని డీజీజీఐ తెలిపింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గీ డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేస్తాయి. 'డెలివరీ ఛార్జీ' అనేది ఇంటింటికీ ఆహారాన్ని తీసుకెళ్లే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు. కంపెనీలు ఆ ధరను కస్టమర్ల నుంచి సేకరించి వారి డెలివరీ భాగస్వాములకు అందిస్తాయి. అయితే ఈ విషయంలో జీఎస్టీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2022లో స్విగ్గీ, జొమాటో తమ ఆర్డర్లపై 5 శాతం రేటుతో పన్ను వసూలు చేసి జమ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అంతకు ముందు జీఎస్టీ కింద నమోదైన రెస్టారెంట్లు మాత్రమే పన్ను వసూలు చేసి జమ చేసేవి. గత నెలలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ల ప్లాట్‌ఫారమ్ చార్జీను రూ.2 నుంచి రూ.3కి పెంచింది. జొమాటో షేర్లు బుధవారం 1.07 శాతం నష్టపోయి రూ.115.25 వద్ద ముగిశాయి. -
GST Council: పేదల నుంచే జీఎస్టీ గరిష్ఠ వసూళ్లు
సాధారణ ప్రజలపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వారి ఆదాయ, వ్యయ విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పరోక్ష పన్నుల వల్ల దేశం, సమాజం ఎంతో ప్రభావితం చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకొనేందుకు పరోక్ష పన్నులపై ఆధారపడుతోంది. ప్రభుత్వ ఉత్పత్తుల అమ్మకం, గ్రాంట్లు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్‌లు, వ్యవసాయ ఆధారిత రాబడి, ప్రభుత్వ కాంట్రాక్టులు, పర్యాటకం, హాస్పటాలిటీ..వంటివి కేంద్రానికి ఎన్ని ఆదాయ మార్గాలున్నా అన్నింటిలో జీఎస్టీ వాటాయే అధికం. దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. రాబడిలో వృద్ధి ఆశాజనకంగా ఉంది. సగటున నెలకు సుమారు రూ.1.6 లక్షల కోట్లకుపైనే ఖజానాకు జమ అవుతోంది. తాజాగా అక్టోబర్ నెలకుగాను రూ.1.72లక్షల కోట్లు జీఎస్టీ వసూలైంది. అయితే ఇది రెండో అత్యధిక జీఎస్టీ వసూళ్లుగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.87లక్షల కోట్లలో గరిష్ఠస్థాయికి చేరింది. ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, యుద్ధం, అనిశ్చితి భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆర్థిక కార్యకలాపాల నమోదు పరిమాణం పెరుగుతోంది. అందుకు సంకేతంగా రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూలవుతుంది. అయితే ఇది ఇండియాతో పాటు ప్రపంచానికీ సానుకూల సంకేతమే. కానీ మొత్తం జీఎస్టీ రాబడిలో అధికభాగాన్ని సమకూరుస్తున్నది మాత్రం పేదలేనని ఆక్స్‌ఫామ్ నివేదించింది. ఇదీ చదవండి: పోస్ట్ ద్వారా 2,000 నోట్ల మార్పిడి కరోనా సమయంలో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ కొవిడ్ అనంతరం పుంజుకుంటుంది. కానీ లాక్డౌన్ సమయంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. చిన్నగా పరిస్థితులు మెరుగవగానే ఒక్కొక్కటిగా ధరలు పెంచడం ప్రారంభించాయి. ఖాళీగా ఉన్న రోజుల్లోని లోటును సైతం భర్తీ చేసేలా సామాన్యులపై ధరల భారాన్నిమోపాయనే వాదనలు ఉన్నాయి. దాంతో కిరాణా సామగ్రి నుంచి పెట్రో ఉత్పత్తుల వరకు పెరిగిన ధరల భారాన్ని భరిస్తున్న పేద కుటుంబాలే దేశ ఖజానాను నింపుతున్నాయి. కరోనా పరిణామాలు, ద్రవ్యోల్బణం ప్రభావంతో వినిమయ వస్తువుల ధరలన్నీ రెండేళ్లుగా పరుగులు తీస్తున్నాయి. ఆహారం, దుస్తులు, ఇంధనం, ఉక్కు సహా అన్నింటి ధరలూ పెరిగాయి. అధిక జీఎస్టీ వసూళ్లకు దారితీసిన అసలు పరిణామమిదేనని కొందరు చెబుతున్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అమెరికాలో సైతం ద్రవ్యోల్బణ భయాలున్నాయి. గ్లోబల్‌గా ఉన్న మిగతా పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. దేశీయంగా వినియోగిస్తున్న వస్తువులు, దిగుమతులు చేసుకుంటున్న వస్తువులపై విధిస్తున్న జీఎస్టీ అనేది విలువ ఆధారిత పన్ను. ఆ వస్తువులు పరిమాణం పెరుగుతున్న కొద్దీ జీఎస్టీ రాబడులూ పెరుగుతుంటాయి. దానికితోడు ధరల పెరుగుదలతో పతాకస్థాయి జీఎస్టీ వసూళ్లవుతున్నాయి. ఇటీవలి కాలంలో మన దిగుమతులు, ఎగుమతులకంటే వేగంగా పెరుగుతున్నాయి. గతేడాది 6 శాతం ఎగుమతులు పెరిగితే, దిగుమతులు మాత్రం 16.5 శాతం హెచ్చయ్యాయి. వస్తువుల వినియోగం, పెరుగుతున్న ధరల వల్ల జీఎస్టీ నంబర్లు భారీగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది పేదలపాలిట భారంగా మారుతుంది. సంపన్నులు వినియోగించే వస్తు సేవలపై పన్ను రేట్లు అధికంగా, పేదలు ఉపయోగించే వాటిపై తక్కువగా ఉంటాయి. వస్తువులకు అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్న సంపన్నులు జీఎస్టీ చెల్లించడం సులువే. కానీ కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, సంఘటిత, అసంఘటిత రంగాల్లోని ప్రజలు వారికి కేటాయించిన జీఎస్టీ చెల్లించాలంటే అవస్థలు పడాల్సిందే. అయితే ధనికుల కంటే పేద కుటుంబాల సంఖ్య అధికంగా ఉండడంతో జీఎస్టీ భారంలో ఎక్కువ వాటాను పేదలే భరిస్తున్నారని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. పేదలు వినియోగించే వాటిలో ఎక్కువగా నిత్యావసర వస్తువులే అధికంగా ఉంటాయి. ధరలు పెరిగినా వీటికి డిమాండ్ తగ్గదు. దాంతో ఈ వస్తువులు, సేవలకు తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ జీఎస్టీ భారంలో ఎక్కువ వాటా కలిగి ఉంటుంది. ఇదీ చదడండి: ఉద్యోగ నియామకాలపై జొమాటో కీలక వ్యాఖ్యలు ఉదాహరణకు ప్యాకింగ్, లేబుళ్లు వేసిన ఆహార ఉత్పత్తులపై అయిదు శాతం జీఎస్టీ ఉంది. ఇందులో పాల ఉత్పత్తులు, గోధుమపిండి వంటివి వస్తాయి. స్టీల్(18 శాతం), సిమెంటు(28 శాతం) వంటి నిర్మాణ సామగ్రిపై అధిక పన్ను భారాన్ని పేదలే భరిస్తున్నారు. సంపన్నులు వినియోగిస్తున్న వస్తువుల తయారీకి ఖర్చు అధికమైనా, ధరలను పెంచేందుకు కంపెనీలు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయి. ఫలితంగా వాటి ధరలు నెమ్మదిగానే పెరుగుతుంటాయి. మరోవైపు, ధనికులు చెల్లించే ఆదాయపు పన్ను రేట్లను పెంచడం కూడా పూర్తిగా సరికాదు. ఎందుకంటే గరిష్ఠ ఆదాయ పన్ను స్లాబులో ఉన్నవారిపై సెస్, సర్ఛార్జీలతో కలిపి విధిస్తున్న రేటు ఇప్పటికే చాలా ఎక్కువ. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి పరిస్థితుల్లో ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంటుంది. దాంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రైవేటు పెట్టుబడులు అంతంతమాత్రంగా ఉన్నాయి. దానికితోడు కార్పొరేట్ పన్ను రేట్లు పెంచడమూ సత్పలితాలను ఇవ్వదు. గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంలేదు. పెట్రోలియం ఉత్పత్తులకు జీఎస్టీ వర్తించదు. కానీ ముడిచమురు ధరలు, ఇంధనాలపై కేంద్రం విపరీతంగా విధించే ఎక్సైజ్ సుంకంతో పాటు, రాష్ట్రాలు వడ్డించే విలువ జోడింపు పన్ను(వ్యాట్) ఉంటుంది. ఇవన్నీ కలిసి రవాణా ఖర్చుల్ని పెంచుతాయి. రవాణా సేవలపై 18శాతం జీఎస్టీ పడుతుంది. అధిక రవాణా వ్యయం ప్రతి రంగంలోనూ ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. రోడ్లు, వంతెనల పనుల కాంట్రాక్టులపై 12శాతం జీఎస్టీ ఉంది. ఇది టోల్, ప్రయాణ ఛార్జీలను పెంచుతుంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వస్తువులపై విధిస్తున్న పన్నులు, దిగుమతి సుంకాలన్నీ ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, పన్నుల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ధనికుల కంటే పేదలపైనే అధికంగా ఉంటుంది. ప్రభుత్వం దిగుమతి చేసుకునే కనీస అవసరాలకు సంబంధించిన వస్తువులపై సుంకాన్ని తగ్గిస్తే వాటి ధరలు కుంగి కొంత మేరకు ప్రజలపై భారం తగ్గుతుంది. మొత్తం పన్ను భారాన్ని తగ్గించే వస్తుసేవలపై అదనపు పన్ను, సర్ఛార్జీలను తొలగించినా కొంత ఉపశమనం కలుగుతుంది. ఆహార పదార్థాలు, ఔషధాలపై పన్ను తొలగిస్తే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చౌకగా లభ్యమవుతాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై పన్నుల భారం తగ్గించడం ద్వారా తక్కువ ఆదాయ కుటుంబాలతో పాటు వినియోగదారులందరికీ మేలు జరుగుతుందనే వాదనలు ఉన్నాయి. కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయ పన్ను వంటి ప్రత్యక్ష పన్నులకు సంబంధించి విధానాలు మారాలి. దేశీయ ఉత్పత్తి తగ్గకుండా చూసి ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడం, ఇంధన పన్నులు తగ్గించడం వంటివీ ఉపకరిస్తాయి. -
డెల్టా కార్ప్‌కు మరో రూ.6,384 కోట్ల జీఎస్టీ నోటీస్
న్యూఢిల్లీ: డెల్టా కార్ప్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రూ. 6,384 కోట్ల షార్ట్ పేమెంట్ కోసం ఒక జీఎస్టీ నోటీసును అందుకుంది, దీనితో కంపెనీపై మొత్తం పన్ను డిమాండ్ దాదాపు రూ. 23,000 కోట్లు దాటింది. పన్ను డిమాండ్లు ఏకపక్ష మైనవని, చట్ట విరుద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వీటిని సవాలు చేయనున్నట్లూ వెల్లడించింది. సంస్థ ప్రకటన ప్రకారం, డీజీజీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్), కోల్‌కతా విభాగం అక్టోబర్ 13న డెల్టా కార్ప్ అనుబంధ సంస్థ అయిన డెల్టాటెక్ గేమింగ్‌కు జీఎస్టీ నోటీసు పంపుతూ, జనవరి 2018 నుండి నవంబర్ 2022 కాలానికి సంబంధించి రూ. 6,236.8 కోట్ల పన్ను చెల్లింపుల డిమాండ్ చేసింది. జూలై 2017 నుండి అక్టోబర్ 2022 వరకు మరో 147.5 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసునూ అందించింది. రూ. 16,800 కోట్ల షార్ట్ పేమెంట్ నిమ్తి్తం కంపెనీకి గత నెలలో షోకాజ్ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, కాసినోలు తమ ప్లాట్‌ఫారమ్‌లపై ఉంచిన స్థూల పందెం విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుందని ఆగస్టులో జీఎస్టీ అత్యున్నత స్థాయి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీకి తాజా జీఎస్టీ నోటీసులు వెలువడ్డం గమనార్హం. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్ కంపెనీలకు రెట్రాస్పెక్టివ్ ప్రాతిపదికన జీఎస్టీ పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వస్తున్నట్లు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో డెల్టా కార్ప్ షేర్ ధర 9 శాతం పడిపోయి రూ.120కి పడింది. -
‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట?
జీఎస్టీతో అన్ని రకాల వస్తువుల రేట్లు పెరిగిపోయాయని ఓవైపు దేశ ప్రజలు గగ్గోలు పెడుతుంటే మరోవైపు ప్రధాన మంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ మాత్రం జీఎస్టీ వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోందని వ్యాఖ్యానించారు. ఒకే రేటుతో ఆదాయం తటస్థంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా కలకత్తా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీలో చాలా సరళీకరణ జరిగిందన్నారు. "ఆదర్శ జీఎస్టీ అనేది ఒకే రేటును కలిగి ఉండాలి. దీని ప్రభావం ప్రభుత్వ ఆదాయం మీద పడకూడదు. జీఎస్టీని మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం, సగటు పన్ను రేటు కనీసం 17 శాతం ఉండాలి. కానీ, ప్రస్తుత జీఎస్టీ 11.4 శాతం. జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోంది’’ అని బిబేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు. అత్యధికంగా ఉన్న 28 శాతం జీఎస్టీ రేటు తగ్గాలని ప్రజలతోపాటు జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు కోరుకుంటున్నారని, అయితే అత్యల్పంగా ఉన్న సున్నా, 3 శాతం జీఎస్టీ రేట్లు పెరగాలని మాత్రం ఎవరూ కోరుకోవడం లేదని బిబేక్ అన్నారు. అందుకే మనకు సరళీకృత జీఎస్టీ అసాధ్యమని చెప్పారు. అలాగే జీఎస్టీ నిబంధనల్లోనూ చాలా దుర్వినియోగం జరుగుతోందన్నారు. ఇదీ చదవండి: Renters Insurance: ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం? -
జీఎస్టీ పెంపు: ఇలా అయితే డిజిటల్ ఎకానమీ ఎలా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయం.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. 2025 నాటికి 1 లక్ష కోట్ల డిజిటల్ ఎకానమీ కావాలన్న భారత్ ఆకాంక్షలకు ఎదురుదెబ్బలాంటిదని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమపై పన్ను భారం 1,000 శాతం మేర పెరుగుతుందని ఐఏఎంఏఐ తెలిపింది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్) ఫలితంగా 2.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ స్టార్టప్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. కొత్తగా రాబోయే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పూర్తిగా నిలిచి పోయే అవకాశం ఉందని వివరించింది. చట్టబద్ధమైన ఆన్లైన్ గేమింగ్ రంగంపై .. గ్యాంబ్లింగ్ కార్యకలాపాకు సమాన స్థాయిలో పన్ను విధించడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఐఏఎంఏఐ పేర్కొంది. కాగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సంబంధిత కంపెనీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా డెల్టా కార్ప్ ఎన్నడూ లేనంతగా నష్టాలను ఎదుర్కొంది. -
కేంద్రంపై విమర్శలు.. రాజకీయాల్లోకి అష్నీర్ గ్రోవర్?
ఫిన్‌టెక్ దిగ్గజం భారత్ పే మాజీ ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ రాజకీయాల్లోకి రానున్నారా? లేదంటే రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు. కేంద్రం ఆన్లైన్ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీని విధించింది. ఈ నిర్ణయాన్ని అష్నీర్ గ్రోవర్ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ కుప్పకూలే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో తమ వాణిని వినిపించేందుకు టెక్నాలజీ స్టార్టప్ ఫౌండర్లు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. RIP - Real money gaming industry in India. If the govt is thinking people will put in ₹100 to play on ₹72 pot entry (28% Gross GST); and if they win ₹54 (after platform fees)- they will pay 30% TDS on that - for which they will get free swimming pool in their living room come… — Ashneer Grover (@Ashneer_Grover) July 11, 2023 గ్రోవర్ మాత్రమే కాదు ఇండియా గేమింగ్ ఫెడరేషన్తో పాటు ఈ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS), ఆన్లైన్ స్కిల్ గేమ్‌లపై జీఎస్టీని 18 శాతం నుండి 28 శాతానికి పెంచడంపై కౌన్సిల్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. నేనే రాజకీయ నాయకుడిని అయితే అష్నీర్ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం వసూలు చేసే టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధానాన్ని వ్యతిరేకించారు. అందులో లోపాల్ని సవరించాలని అన్నారు. అదే సమయంలో తాను రాజకీయ నాయకుడిని అయితే, దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. తాజాగా, మరోమారు పాలిటిక్స్‌పై హాట్ కామెంట్స్ చేయడంపై అష్నీర్ గ్రోవర్ పాలిటిక్స్‌లోకి అడుగు పెడతారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ! -
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం - ధరలు తగ్గేవి & పెరిగేవి ఇవేనా?
నేటి జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి 'నిర్మలా సీతారామన్' అధ్యక్షత ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయనే విషయాలు అధికారికంగా వెల్లడవుతాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ రోజు సమావేశంలో ప్రధానంగా ఆన్లైన్ గేమింగ్, మల్టి యుటిలిటీ వాహనాలు, క్యాసినో, గుర్రపు పందాలు వంటి వాటి మీద చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రియం కానున్నాయి. కాగా సినిమా హాళ్లలో తినుబండారాల ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ధరలు పెరిగేవి.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలు మరింత ప్రియం కానున్నాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని కమిటీ ఈ మూడింటి మీద ట్యాక్స్ పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. వీటి పైన జీఎస్టీ 28 శాతం పెరిగే అవకాశం ఉంది. మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం & రాష్ట్ర అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ వీటి మీద 22 శాతం సెస్ వసూలు చేయాలని సిఫార్సు చేసింది. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) ధరలు తగ్గేవి.. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా హాళ్ల యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండస్ట్రీ లాబీ గ్రూప్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) పన్నులను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సినిమా హాళ్లలో ఆహార పానీయాలపై 18 శాతం జీఎస్టీ కాకుండా 5 శాతం వర్తిస్తుందని కౌన్సిల్ ఈ రోజు స్పష్టం చేసిందని రెవెన్యూ కార్యదర్శి 'సంజయ్ మల్హోత్రా' అధికారికంగా తెలిపారు. శాటిలైట్ సర్వీస్ లాంచ్ కూడా చౌకగా మారే అవకాశం ఉంది. కమిటీ దీనిపైనా కూడా ట్యాక్ తగ్గింపుని కల్పించడానికియోచిస్తోంది. మెడిసిన్స్ మీద కూసే ధరలు తగ్గే అవకాశం ఉంది. రోగులు సాధారణంగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బును సేకరిస్తున్నందున రూ. 36 లక్షల ఖరీదు చేసే మందులను GST నుండి మినహాయించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు చేసింది క్యాన్సర్ ఔషధం (dinutuximab/qarziba) వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్నప్పుడు 12% ఇంటిగ్రేటెడ్ GST (IGST) నుండి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. -
జీఎస్టీ డీక్రిమినైజేషన్‌పై కీలక చర్చ, వారికి భారీ ఊరట!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని చర్యలను ‘నేర జాబితా’ నుంచి (డీక్రిమినైజేషన్) తప్పించే విషయంపై ఈ నెల 17న జరిపే అత్యున్నత స్థాయి మండలి చర్చించే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అలాగే ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించే పరిమితిని ప్రస్తుతం రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచడంపైనా మండలి చర్చించనున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నిర్ణీత పరిమితికి (రూ.20 కోట్లు) దిగువన ఉన్న నేరస్తుల ఆస్తులను ఇకపై అటాచ్ చేయకుండా చేసే అంశంపైనా సమావేశం చర్చించనుందని అధికారులు తెలిపారు. స్నేహ పూర్వక పన్ను వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం దిశలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు. (సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్‌పై ఆర్థిక వేత్తల కీలక లేఖ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎగవేత లేదా దుర్వినియోగం మొత్తం రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఉంటే అధికారులు ఈ నేరం పాల్పడిన వారిపై ప్రాసిక్యూషన్ ప్రారంభించవచ్చని సెప్టెంబర్‌లో ప్రభుత్వం తెలిపింది. అయితే జీఎస్టీ అధికారుల లా కమిటీ, చట్టాన్ని నేరరహితం చేసే కసరత్తులో భాగంగా చట్టంలోని సెక్షన్ 132లో మార్పులను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. జీఎస్టీ చట్టం డీక్రిమినైజేషన్ ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించిన తర్వాత, డిసెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ఈ చట్టానికి సవరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు ఆమోదించిన తర్వాత, రాష్ట్రాలు తమ జీఎస్టీ చట్టాలను సవరించవలసి ఉంటుంది.ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని ప్రస్తుత 18 శాతం నుంచి తగ్గించేందుకు పలు సూచనలు అందాయని కూడా అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి! -
అద్దెదారులకు షాక్: కొత్త జీఎస్టీ గురించి తెలుసా?
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద ఇకపై అద్దెదారులకు భారీ షాక తగలనుంది. దీని ప్రకారం ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే, పన్నుచెల్లింపుదారుల ఐటీ రిటర్న్‌లలో దీనిని మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అద్దెదారులు రివర్స్ ఛార్జ్ మెకానిజం (RCM) కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై) Claim: 18% GST on house rent for tenants #PibFactCheck ▶️Renting of residential unit taxable only when it is rented to business entity ▶️No GST when it is rented to private person for personal use ▶️No GST even if proprietor or partner of firm rents residence for personal use pic.twitter.com/3ncVSjkKxP — PIB Fact Check (@PIBFactCheck) August 12, 2022 ఎవరు జీఎస్టీ చెల్లించాలి? అయితే ఈ వార్తపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే రెసిడెన్షియల్ యూనిట్ అద్దెకు పన్ను చెల్లించాలి. వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రైవేట్ వ్యక్తికి అద్దెకు ఇచ్చినప్పుడు GST లేదు. వ్యక్తిగత ఉపయోగం కోసం యజమాని లేదా సంస్థ పార్టనర్ నివాసాన్ని అద్దెకు తీసుకున్నప్పటికీ GST ఉండదు అని స్పష్టం చేసింది. ఇది చదవండి : Anand Mahindra: వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, భార్య జంప్, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్ మింట్ అందించిన కథనం ప్రకారం జూలై 13, 2022న జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం జూలై 18 నుంచి దేశంలో కొత్త జీఎస్టీ పన్నులు అమలులోకి వచ్చాయి. ఈ జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం.. జీఎస్టీ కింద నమోదైన అద్దెదారు.. రెసిడెన్షియల్ ప్రాపర్టీని అద్దె చెల్లిస్తున్న దానిపై 18 శాతం వస్తుసేవల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు, అద్దెదారు లేదా భూస్వామి నమోదు చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా జూలై 17, 2022 వరకు రెసిడెన్షియల్ ప్రాపర్టీల అద్దెను జీఎస్టీ నుంచి మినహాయించిన సంగతి తెలిసిదే. కానీ ఈ ఏడాది జూలై 18 నుండి, నమోదు చేసుకున్న అద్దెదారు అద్దె ఆదాయంపై 18 శాతం పన్ను చెల్లించాలి. దీనిపై స్పందించిన క్లియర్ వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్ గుప్తా సాధారణ జీతం పొందే వ్యక్తి రెసిడెన్షియల్ హౌస్ లేదా ఫ్లాట్ అద్దెకు తీసుకున్నట్లయితే, వారు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే జీఎస్టీ కింద నమోదైన వ్యాపారులు, గృహ యజమానుల, నమోదిత వ్యక్తి యజమానికి చెల్లించే అద్దెపై తప్పనిసరిగా 18 శాతం GST చెల్లించాలని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ ఎంటిటీ, లేదా వ్యాపారులు ఏడాదికి రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అద్దె ఆదాయం ఉన్నట్లయితే వారు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలు లేదా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో వ్యాపారులకు ఈ లిమిట్ రూ.10 లక్షలుగా ఉందన్నారు. ఇదీ చదవండి : ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు -
ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ
సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. ప్యాకేజీ ఫుడ్స్, ఆసుపత్రి బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడుపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో జీఎస్టీ వర్తించని కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు. జీఎస్టీపై గందరగోళం నెలకొనడంతో సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ప్రీప్యాకింగ్ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే జీఎస్టీ వర్తిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, పప్పు, బియ్యం, రవ్వ, సెనగపిండి, పెరుగు, లస్సీ, మరమరాలు వంటి నిత్యావసర వస్తువులను బ్రాండెడ్‌గా, ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రమే పన్ను ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు. ఇవే ఉత్పత్తులను విడిగా, ప్యాక్ చేయకుండా, విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ఆర్థికమంత్రి వెల్లడించారు. లూజ్‌గా లేదా, బహిరంగ విక్రయాలపై జీఎస్టీ వర్తించదు అంటూ 14 వస్తువుల జాబితాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ట్వీట్ చేశారు. లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై జీఎస్టీ ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వరుస ట్వీట్లలో స్పందించిన నిర్మలా సీతారామన్ గత నెలలో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం ఏకగ్రీవ నిర్ణయం ప్రకారం చర్య తీసుకున్నామంటూ పన్ను పెంపును సమర్ధించుకున్నారు. The @GST_Council has exempt from GST, all items specified below in the list, when sold loose, and not pre-packed or pre-labeled. They will not attract any GST. The decision is of the @GST_Council and no one member. The process of decision making is given below in 14 tweets. pic.twitter.com/U21L0dW8oG — Nirmala Sitharaman (@nsitharaman) July 19, 2022 -
హాస్పిటల్ బెడ్స్‌పై జీఎస్టీ బాదుడు: మరింత నరకం!
సాక్షి, ముంబై: ‘ఒకే దేశం ఒకే పన్ను’ అంటూ కేంద్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ ఇపుడికి రోగులను కూడా చుట్టుకుంది. కార్పొరేట్ ఆసుపత్రుల బాదుడుకు తోడు బీజేపీ సర్కార్ మరో భారాన్ని మోపింది. జూన్ చివరలో జరిగిన 47వ సమావేశంలో హాస్పిటల్ బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీని కౌన్సిల్ సిఫార్సు చేసింది. దీని కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో నేటి(జూలై 18, 2022) రూ.5 వేలకు పైగా చార్జీ ఉండే పడకలపై అదనపు భారం పడనుంది. ఐసీయూ మినహాయించి, ఆసుపత్రిలో ఒక రోగికి రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ ఉండే బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడు తప్పదు. ఇన్పుట్ ట్యా ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన దూరం చేయడం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి గది అద్దెపై జీఎస్టీ రోగుల ఆరోగ్య సంరక్షణ భారాన్ని పెంచుతుందని, అలాగే పరిశ్రమకు పెను సవాళ్లతోపాటు, ఆస్పత్రుల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. Instead of learning from the havocking results of its failed healthcare system during COVID, the Modi govt is hell-bent on making it more disastrous. #GabbarSinghStrikesAgain pic.twitter.com/M4KNPnn5LB — Congress (@INCIndia) July 18, 2022 ఈ రోజునుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్నులపై కాంగ్రెస్ మండిపడింది. చివరికి ఆసుపత్రి పడకలపై కూడా పన్ను బాదుడుపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆవస్పత్రి పడకలపై కూడా పన్నుతో గబ్బర్ సింగ్ మరో బాదుడుకు తెరతీశాడని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. కేంద్రం నిర్ణయం దేశ ప్రజలపై పెను భారం మోపుతుందని ట్విటర్లో మండిపడింది. అసలే కోవిడ్-19 మహమ్మారిసంక్షోభంతో ఆరోగ్య సంరక్షణకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి, ముఖ్యంగా పేద ప్రజలను మరింత నరకంలో నెట్టేసిందని ట్వీట్ చేసింది. కాగా దేశంలో హెల్త్‌కేర్ సేవలను జీఎస్టీ కిందకు తీసుకురావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో సహా అనేక వస్తువులపై జీఎస్టీ వసూలుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
సీతారామన్ టంగ్ స్లిప్: కేటీఆర్ కౌంటర్, వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుర్రపు పందాలపై జీఎస్టీ అంశం గురించి మాట్లాడుతున్నపుడు నిర్మలా సీతారామన్ పొరపాటున హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్టీ అన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో రెబల్ ఎమ్మెల్యేల రగడ, బేరసారాలు, రాజకీయ సంక్షోభం రగులుతున్న నేపథ్యంలో దీన్ని అవకాశంగా తీసుకున్న నెటిజన్లు ఒక రేంజ్లో విమర్శిస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురురాజకీయనాయకులు, నెటిజన్లు ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ వ్యంగ్యంగా కమెంట్ చేస్తున్నారు. ఫ్రూడియన్ స్లిప్, మనసులో మాట అంటూ కొందరు విమర్శించారు. అంతేకాదు హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్టీ అనేదే నిజమైతే.. బీజేపీనే ఎక్కువ టాక్స్ కట్టాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అసలు సామాన్య ప్రజలు ఇక పన్నులు కట్టాల్సిన అవసరమే లేదంటూ పేర్కొంటున్నారు. ఈ కోవలో తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కూడా నిలిచారు. దీన్నే ఇంగ్లీషులో ఫ్రూడియన్ స్లిప్ అని హిందీలో మన్‌కీ బాత్ అంటారు అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా జీఎస్టీ కౌన్సిల్ ప్రెస్ మీట్ (జూన్ 29 బుధవారం) సందర్భంగా 'హార్స్ రేసింగ్'పై జీఎస్టీకి బదులుగా 'హార్స్-ట్రేడింగ్'పై జీఎస్టీ అన్నారు నిర్మలా సీతారామన్. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌పై జీఎస్టీ గురించి ఆమె మాట్లాడారు. In English, this is called the Freudian slip of tongue In Hindi, it’s called “Mann Ki Baat” 😁#GSTonHorseTrading https://t.co/m2CGG23Sp0 — KTR (@KTRTRS) June 30, 2022 -
క్రిప్టో కరెన్సీపై టీడీఎస్, సీబీడీటీ ఏం చెప్పిందంటే!
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య (పీర్ టు పీర్/పీటూపీ) నడిచే క్రిప్టో లావాదేవీలలో టీడీఎస్ మినహాయించి, ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సిన బాధ్యత కొనుగోలుదారులపై ఉంటుంది. ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) క్రిప్టో పన్నులపై ఈ మేరకు మరోసారి స్పష్టత ఇచ్చింది. సెక్షన్ 194 ఎస్ కింద.. పీర్‌టుపీర్ లావాదేవీల్లో వర్చువల్ డిజిటల్ అస్సెట్ (వీడీఏ/క్రిప్టోలు,ఎన్ఎఫ్టీలు) కొనుగోలు చేసే వారు టీడీఎస్‌ను మినహాయించి, మిగిలిన మొత్తాన్నే విక్రయదారుకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీర్‌టూపీర్ అంటే ఎక్సే్ఛంజ్ ప్రమేయం లేకుండా వ్యక్తులు చేసుకునే లావాదేవీలు. ఎక్సే్ఛంజ్‌ల్లో అయితే ఆయా ప్లాట్‌ఫామ్‌లు క్లయింట్ల తరఫున టీడీఎస్ మినహాయిస్తాయి. ఒకవేళ వీడీఏలను ఇద్దరు వ్యక్తులు మార్పిడి చేసుకుంటే (ఒకరి వద్దనున్న డిజిటల్ అసెట్స్‌ను అవతలి వ్యక్తికి ఇచ్చి, అవతలి వ్యక్తి వద్దనున్న వేరే వీడీఏలను తీసుకోవడం) అప్పుడు ఇద్దరు సైతం కొనుగోలుదారులు, విక్రయదారుల కిందకు వస్తారని సీబీడీటీ తెలిపింది. అప్పుడు ఇద్దరూ టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో టీడీఎస్ బాధ్యతను కొనుగోలుదారుపై పెట్టినట్టయింది. క్రిప్టోల లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ నిబంధన 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. -
జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు
న్యూఢిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మండలి సిఫార్సుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మండలి చేసే సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంది. అయితే, మనం సహకార సమాఖ్య వ్యవస్థలో ఉంటున్నందున ఆ సిఫార్సులకు తగిన విలువ ఇవ్వాలని పేర్కొంది. జీఎస్టీ సిఫార్సుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన హక్కులు ఉన్నాయని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం గురువారం వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246ఏ ప్రకారం.. పన్నుల వ్యవహారాల్లో చట్టాలు చేయడంపై పార్లమెంట్‌కు, రాష్ట్రాల శాసన సభలకు సమాన హక్కులు ఉన్నట్లు గుర్తుచేసింది. ఆర్టికల్ 279 ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరించకూడదని తెలిపింది. జీఎస్టీ అమల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలకు జీఎస్టీ మండలి పరిష్కార మార్గాలు సూచించాలని ధర్మాసనం తెలిపింది. ఒకరి అభిప్రాయాలను మరొకరిపై బలవంతంగా రుద్దకూడదని, కలిసి చర్చించుకోవాలని వివరించింది. నేపథ్యం సముద్రంలో సరుకు రవాణాపై 5 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ) విధిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను గుజరాత్ హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. కాగా, సుప్రీం తీర్పుతో ‘ఒక దేశం.. ఒకే పన్ను’ విధానంపై ఎలాంటి ప్రవేశం పడే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ çఅన్నారు. పన్నుపై మండలి సిఫార్సులను అమోదించడం లేదా తిరస్కరించడంపై రాష్ట్రాలకు కూడా హక్కు ఉందని కోర్టు చెప్పిందన్నారు. చదవండి: కేంద్రం భారీ షాక్, ఆన్లైన్ గేమ్స్‌పై జీఎస్టీ బాదుడు! ఎంతంటే! -
జీఎస్టీ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
-
ఏప్రిల్ జీఎస్టీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పోర్టల్‌లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఏప్రిల్ నెల జీఎస్టీఆర్–3బీ ఫారం దాఖలుకు గడువును మే 24 వరకూ కేంద్రం పొడిగించింది. అలాగే సమస్యలను సత్వరం పరిష్కరించాలంటూ పోర్టల్‌ను తీర్చిదిద్దిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ను ఆదేశించింది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ మేరకు ట్వీట్ చేసింది. అంతకు ముందు .. ఏప్రిల్ నెల జీఎస్టీఆర్–2బీ జనరేట్ కావడంలోనూ, జీఎస్టీఆర్–3బీ ఆటోమేటిక్‌గా రూపొందటంలోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఇ న్ఫీ రిపోర్ట్ చేసినట్లు సీబీఐసీ తెలిపింది. దీం తో సదరు లోపాలను సరిచేయాలంటూ కంపెనీని ప్రభుత్వం ఆదేశించిందని, సాంకేతిక బృందం దీనిపై పని చేస్తోందని ఒక ట్వీట్లో పేర్కొంది. వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ప్రతి నెలా 20, 22, 24 తారీఖుల్లో జీఎస్టీఆర్–3బీని దాఖలు చేయాల్సి ఉంటుంది. విక్రయాలకు సంబంధించిన జీఎస్టీఆర్–1 ఆధారంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) స్టేట్మెంట్ అయిన జీఎస్టీఆర్–2బీ రూపొందుతుంది. ఇది తదుపరి నెల 12వ రోజు నాటికి వ్యాపార సంస్థలకు అందుబాటులోకి వస్తుంది. పన్నుల చెల్లింపు సమయంలో ఐటీసీని క్లెయిమ్ చేయడానికి, జీఎస్టీఆర్–3బీని దాఖలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. చదవండి: పప్పు, ఉప్పు, సబ్బు.. ధరలన్నీ మండుతున్నాయ్ -
ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు కేంద్రం భారీ షాక్!
రిలాక్సేషన్ కోసం ఆడే ఆన్లైన్ గేమ్స్ ఇకపై మరింత ఖరీదు కానున్నాయి. ఆన్లైన్ గేమ్స్‌పై ప్రస్తుతం కేంద్రం విధిస్తున్న జీఎస్టీని పెంచనుంది. ఇప్పటికే జీఎస్టీ పెంపు అంశంపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( ఐఏఎంఏఐ) ఆన్లైన్ గేమింగ్‌పై 18శాతం జీఎస్టీని కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. ఒకవేళ జీఎస్టీ రేట్లను ఇంకా పెంచితే ఆ ప్రభావం గేమింగ్ ఇండస్ట్రీతో పాటు దేశ ఎకానమీపై పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే త్వరలో కేంద్రం పెంచనున్న జీఎస్టీ ఏ గేమ్స్‌కు వర్తిస్తుందనే అంశంపై క్లారిటీ లేదని ఐఏఎంఏఐ తెలిపింది. ఫ్రీగా ఆడే గేమ్స్‌తో పాటు డబ్బులు చెల్లించే ఆడి ఆన్లైన్ గేమ్స్‌పై జీఎస్టీ విధిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాలంటే కొద్ది రోజు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీపై జీఎస్టీ పెంపు అంశం ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీని కలవరానికి గురిచేస్తుంది. జీఎస్టీని పెంచితే.. గేమింగ్ ఇండస్ట్రీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ షట్ డౌన్ అయితే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు. మే 18లోపు జీఎస్టీపై క్లారిటీ జీఎస్టీ పెంపు అంశంపై సమీక్షించేందుకు మంత్రులతో కూడిన బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ బృందం సభ్యులకు చైర్మన్‌గా కాన్రాడ్ సంగ్మా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మంత్రుల బృందం ఇప్పటికే మే 2న తొలి సమావేశం నిర్వహించింది. మే18న రెండో దఫా భేటీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న 18శాతం పన్నును 28శాతానికి పెంచేందుకు మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా కాన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ..బుధవారం (మే18)న జరగనున్న సమావేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రాస్ గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై పన్ను వేయాలా..లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకోతగిన మొత్తం ప్రైజ్‌పై వేయాలా..? అన్నది చర్చిస్తామన్నారు. చదవండి👉నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు! -
జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ ఇంకా నిర్ణయించలేదు
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ నియమించిన మంత్రుల బృందం జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణపై ఇంకా చర్చించలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై అధ్యక్షతన ఏడుగురు సభ్యుల బృందం పరిశీలనలో ఈ ప్రతిపాదన ఉంది. జీఎస్టీలో 5, 8, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. దీనికి అదనంగా బంగారం, బంగారం ఆభరణాలపై 3 శాతం రేటు అమలవుతోంది. ఇందులో 5 శాతం శ్లాబ్‌ను ఎత్తివేసి, అందులో ఉన్న వాటిని 3, 8 శాతం శ్లాబుల్లోకి మార్చేసే ప్రతిపాదన మంత్రుల బృందం పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. చదవండి: ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యపడకుండా..జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న భారత్..! -
జీఎస్టీ శ్లాబులో మార్పులు, చేర్పులు... దానిని తొలగించే అవకాశం...!
వచ్చే నెలలో జరిగే జీఎస్టీ సమావేశంలో కౌన్సిల్ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీఎస్టీలోని 5 శాతం శ్లాబ్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉంది. ఈ శ్లాబ్స్ లోని కొన్ని వస్తువులను 3 శాతానికి, మిగిలినవి 8 శాతం గా నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్టీ అనేది 5, 12, 18, 28 శాతం నాలుగు అంచెల నిర్మాణంగా ఉంది. అంతేకాకుండా బంగారం, బంగారు ఆభరణాలపై 3 శాతం పన్ను విధిస్తారు. అదనంగా, లెవీని ఆకర్షించని బ్రాండెడ్, ప్యాక్ చేయని ఆహార పదార్థాలు వంటి వస్తువులపై కూడా మినహాయింపు ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని ఆహారేతర వస్తువులను 3 శాతం శ్లాబ్‌కు తరలించడం ద్వారా మినహాయింపు వస్తువుల జాబితాను తగ్గించే నిర్ణయం కౌన్సిల్ తీసుకోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక 5 శాతం శ్లాబ్‌ను 7 లేదా 8 లేదా 9 శాతానికి పెంచడంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్టి కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. లెక్కల ప్రకారం, ప్రధానంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌తో కూడిన 5 శాతం శ్లాబ్‌లో ప్రతి 1 శాతం పెరుగుదల సుమారుగా ఏటా రూ. 50,000 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందుతుంది. దీంతో ఆయా ప్యాకేజ్డ్ ఫుడ్ ధర పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం వచ్చే నెల ప్రారంభంలో మార్పులకు సంబందించిన సిఫార్సులను ఖరారు చేసే అవకాశం ఉంది, ఇక తుది నిర్ణయం కోసం మే మధ్యలో జరిగే తదుపరి సమావేశంలో కౌన్సిల్ ముందు ఉంచబడుతుంది. -
జీఎస్స్టీ నుంచి లబ్ధిపొందేలా వేలకోట్ల ఫేక్ ఇన్వాయిస్లు
జీఎస్స్టీ నుంచి లబ్ధి పొందే వేలకోట్ల ఫేక్ ఇన్వాయిస్లు జారీ చేసిన నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వస్తు,సేవల పన్ను కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనాలను పొందేందుకు రూ.4,521కోట్ల ఫేక్ ఇన్వాయిస్లు జారీ చేసేందుకు సిండికేట్‌ను నిర్వహిస్తున్న ఓ నిందితుణ్ని జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సిండికేట్ ద్వారా 636 సంస్థల ఆడిట్ నిర్వహిస్తున్నట్లు పరిశీలనలో తేలిందని, ఈ సంస్థల్లో కేవలం ఇన్వాయిస్లు మాత్రమే జారీ చేశామని, వాటికి వ్యతిరేకంగా ఎలాంటి వస్తువులను సరఫరా చేయలేదని సిండికేట్ నిర్వహించే సూత్రధారి అంగీకరించారని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. నిందితులు దాదాపు రూ.4,521 కోట్ల పన్ను విలువతో కూడిన ఇన్వాయిస్లను జారీ చేశారు. ఇందులో దాదాపు రూ. 741 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రభావం ఉందని ప్రకటన పేర్కొంది. విచారణ సమయంలో ఈ సంస్థల ఐటీసీ లెడ్జర్లో అందుబాటులో ఉన్న ఐటీసీని తిరిగి మార్చడం ద్వారా రూ.4.52 కోట్ల జీఎస్టీ జమ చేయబడింది. ఇంకా, ఇప్పటి వరకు, ఈ సంస్థల యొక్క వివిధ బ్యాంకు ఖాతాలలో ఉన్న సుమారు రూ. 7 కోట్లను స్తంభింపజేసినట్లు పేర్కొంది. జనవరి 13న నిందితుల అరెస్ట్ ఈ నకిలీ సంస్థల వెనుక సూత్రధారిని పట్టుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు జనవరి 6న ఢిల్లీలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రొప్రైటర్ తన సర్వర్లలో 'క్లౌడ్ స్టోరేజ్' సేవలను వివిధ కస్టమర్లకు వారి ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు తాము గుర్తించిన తెలిపారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న సర్వర్లలో పరిశీలించగా అందులో కొన్ని సంస్థల వివరాలు టాలీ డేటాలో వెలుగులోకి వచ్చాయని సోదా నిర్వహించిన అధికారులు తెలిపినట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. కోల్‌కతా కేంద్రంగా ఉన్న ఒక సిండికేట్ ఈ ఆడిట్ డేటాను నిర్వహిస్తోందని, దాని తర్వాత జనవరి 10న కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు జీఎస్టీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతేకాదు నిందితుల నుంచి భారీఎత్తున సిమ్‌కార్డ్‌లు, కుంభకోణాలకు పాల్పడినట్లు గుర్తించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: సీనియర్ సిటిజన్స్ కోసం అదిరిపోయే స్కీమ్, రిస్క్ లేకుండా అధిక వడ్డీతో.. -
చేనేతకు ఊరట.. జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా
న్యూఢిల్లీ: చేనేత వస్త్రాలపై పన్నులు పెంచే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. జీఎస్టీ పెంపు నిర్ణయం వెలువడినప్పటి నుంచి దేశం నలుమూలల విమర్శలు రావడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. దీంతో చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే విషయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. వాయిదా న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 2021 డిసెంబరు 31 జరుగుతోంది. ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సభ్యులందరూ టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ పెంచడం సరికాదంటూ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షలు జీఎస్టీ పెంపుపై విమర్శలు ఎక్కు పెట్టాయి. దీంతో టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. On behalf of the #Telangana Govt, I hereby once again request Hon'ble Union Finance Minister & Head of GST Council Smt @nsitharaman Ji to immediately withdraw the plans of revising GST from 5 per cent to 12 per cent on Textiles and Handlooms sector from January 1, 2022 1/n — KTR (@KTRTRS) December 30, 2021 -
జనవరి 1 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ధరలు పెరగనున్నాయి?
కొత్త ఏడాది 2022 జనవరి 1 నుంచి జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఫుడ్ యాప్స్ ద్వారా వినియోగదారులు ఆహారం ఆర్డర్ చేస్తే సంస్థలు5 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. లఖ్‌నవూ వేదికగా సెప్టెంబర్ 17న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ సంస్థలు పన్ను చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ సమావేశంలో ఫుడ్ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్స్ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 1, 2022 నుంచి జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ సంస్థలు అందించే సేవలపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలిపారు. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5 శాతం జీఎస్టీ పన్ను విధించనున్నారు. రెస్టారెంట్లలో భోజనం చేసినప్పుడు ఆయా సంస్థలు 5 శాతం పన్ను విధిస్తున్నాయి. కానీ స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్ చేసినప్పుడు పన్ను ఎగవేత జరుగుతోందని కేంద్రం గుర్తించింది. రెండేళ్లలో దాదాపు రూ.2 వేల కోట్లు నష్టపోయినట్టు కూడా తెలిపింది. దీంతో పన్ను ఆదాయం తగ్గుతోందని భావించి ఫుడ్ అగ్రిగేటర్లే ఇకపై తమకు వచ్చే ఆర్డర్లపై పన్ను చెల్లించాలని ఆదేశించింది. అంటే రెస్టారెంట్లు సొమ్ము చేసుకుంటున్న పన్నును వారి నుంచి వసూలు చేసి స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ అగ్రిగేటర్ సంస్థలు కేంద్రానికి చెల్లించాలన్నమాట. ఈ లావాదేవీలో వినియోగదారుడిపై ఎలాంటి అదనపు భారం మోపడం లేదు అని కేంద్రం పేర్కొంది. (చదవండి: ఒమిక్రాన్ పంజా..! మరో కీలక భేటీ వాయిదా...!) -
సెంచరీ దాటిన లీటరు డీజిల్ ధర
Petrol Price: హైదరాబాద్ : చమురు సంస్థల ధరల పెంపు నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో లీటరు డీజిల్ ధర సెంచరీ మార్క్‌ని క్రాస్ చేసింది. గురువారం పెంచిన ధరలతో దాదాపు రెండు రాష్ట్రాల్లో అన్ని లీటరు డీజిల్ ధర వంద రూపాయలను దాటేసింది. జూన్‌లోనే లీటరు పెట్రోలు ధర వందను దాటింది. పెంపు ఇలా పెట్రో వడ్డన కార్యక్రమం షురూ అయ్యింది. వరుసగా మూడో రోజు పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, లీటరు డీజిల్‌పై 38 పైసల వంతున ధరలు పెంచాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర రూ. 107.36లకు పెరగగా డీజిల్ ధర 100.09లుగా నమోదు అయ్యింది. అక్టోబరు తొలి వారంలో ఏకంగా మూడు సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. మాటలకే పరిమితం పెట్రోలు ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామంటూ కేంద్రం ఫీలర్లు వదలడమే తప్ప ఆ దిశగా ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రాలకు తగ్గిపోయే ఆదాయం, అందుకు తగ్గ ప్రత్యామ్నాయం చూపించడంలో కేంద్రం విఫలమవుతోంది. ఫలితంగా పెట్రోలు ధరల భారం సామాన్యులపై పడుతోంది. చదవండి : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
మరోసారి జీఎస్టీ సమీక్షకు కేంద్రం రెడీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ సమీక్షకు రాష్ట్రాల మంత్రులతో కూడిన రెండు కీలక కమిటీలను కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. ఒక కమిటీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వం వహిస్తారు, మరొక కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యం వహిస్తారు. వీటిపైనే దృష్టి రేట్ స్లాబ్‌లు– విలీనం, జీఎస్టీ మినహాయింపు వస్తువుల సమీక్ష, పన్ను ఎగవేతల గుర్తింపు, ఎగవేతలు నివారించడానికి మార్గాల అన్వేషణ, ట్యాక్స్ బేస్ పెంపు తత్సంబంధ అంశాలపై ఈ కమిటీలు సమీక్ష జరపనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. క్లిష్టమైన పరోక్ష పన్ను రేట్ల వ్యవస్థలు అన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకువస్తూ, నాలుగేళ్ల క్రితం (2017 జూలై నుంచి) జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థను మరింత సరళతరం చేయడంపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కమిటీలు ఇలా... బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీలో పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిశ్రా, కేరళ ఆర్థికమంత్రి కేఎన్ బాలగోపాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ తదితరులు సభ్యులుగా ఉంటారు. మరో ఎనిమిది సభ్యులతో కూడిన కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వం వహిస్తారు. వీరిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగ రాజన్, ఛత్తీస్‌గఢ్ ఆర్థికమంత్రి టీఎస్ సింగ్ డియో ఉన్నారు. ఈ నెల 17న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ ఈ కమిటీల ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత రేట్ల వ్యవస్థ ఇదీ... ప్రస్తుతం ప్రధానంగా నాలుగు జీఎస్టీ రేట్ల వ్యవస్థ అమలవుతోంది. నిత్యావసరాలపై కనిష్టంగా 5 శాతం పన్ను అమలవుతుండగా, కార్లపై అత్యధికంగా 28 శాతం పన్ను విధింపు ఉంది. 12 శాతం, 18 శాతం పన్ను స్లాబ్స్ కూడా ఉన్నాయి. లగ్జరీ, పొగాకు వంటి డీమెరిట్, సిన్ గూడ్స్‌పై ఉన్న అత్యధిక 28 శాతంపై సెస్ విధింపు కూడా అమలు జరుగుతోంది. 12 శాతం 18 శాతం శ్లాబ్‌లను ఒకటిగా చేయాలన్న డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తోంది. మినహాయింపుల కేటగిరీ నుంచి కొన్ని ఉత్పత్తులను తొలగించి, స్లాబ్‌ల హేతుబద్ధీకరణ వల్ల జరిగే రెవెన్యూ నష్టాలను పూడ్చుకోవాలని కూడా కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక తుది వస్తువులపై దాని ఇన్పుట్లపై విధించే పన్ను కంటే తక్కువ రేటును విధింపు (ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్) విషయంలో పన్ను వ్యత్యాసాలను ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ తొలగించింది. మొబైల్ హ్యాండ్సెట్, పాదరక్షలు, వస్త్రాల విషయంలో ఈ రేటు వ్యత్యాసాలను సరిచేస్తూ సవరణలు జరిగాయి. పెట్రోలు విషయంలో.. జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువు, క్రూడ్ ఆయిల్‌ను ఈ విధానం నుంచి మినహాయించారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కొనసాగించడానికి ఈ విధానం దోహదపడుతోంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోనికి తీసుకుని రావాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి విధాయక మండలి అసలు ఆ అంశంపైనే చర్చించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనివల్ల ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండడమే కౌన్సిల్ నిర్ణయానికి కారణం. చదవండి : సెప్టెంబర్ వరకూ కేంద్ర రుణం రూ.7.02 లక్షల కోట్లు -
పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో భారతీయ మంత్రిత్వ శాఖ ప్యానెల్ దేశీయంగా ఒకే రేటు కింద పన్ను విధించడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 17న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగబోయే 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పెట్రోలియం ఉత్పత్తుల(పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఏవియేషన్ టర్బైన్)ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, కోవిడ్-చికిత్స ఔషధాలపై పన్ను రాయితీలను డిసెంబర్ 31 వరకు పొడగించడం, 8 మిలియన్ రిజిస్టర్డ్ సంస్థలకు ఆధార్ ప్రమాణీకరణను తప్పనిసరి చేసే విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ చేర్చాలని జూన్ లో కేరళ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 17న జరిగే సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. జీఎస్టీ వ్యవస్థలో ఏదైనా మార్పు చేయాలంటే ప్యానెల్‌లోని 3/4 ప్రతినిదుల ఆమోదం అవసరం. ఈ జీఎస్టీ ప్యానెల్లో అన్ని రాష్ట్రాలు, భూభాగాల ప్రతినిధులు ఉన్నారు. దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. చాలా వరకు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొని రావడాన్ని గతంలో వ్యతిరేకించాయి. (చదవండి: జీఎస్టీ సమావేశానికి మంత్రి హరీశ్‌కు ఆహ్వానం) అయితే, గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకడంతో ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరలను 39 సార్లు, డీజిల్ ధరను 36 సార్లు పెంచినట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే లోకసభలో వెల్లడించింది. ఈ కాలంలో ఒక ఒకసారి పెట్రోల్ ధరను, రెండుస్లారు డీజిల్ ధరను తగ్గించగా, మిగిలిన రోజుల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అని నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేల అదే నిజమైతే! ఇది సామాన్యుడికి భారీ ఊరటే అని చెప్పుకోవాలి. నిజంగానే పెట్రోల్, డీజిల్ గనుక జీఎస్టీ పరిధిలోకి వస్తే చాలా వరకు ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంది. -
జీఎస్టీ సమావేశానికి మంత్రి హరీశ్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈనెల 17న జరిగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 45వ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి తరుణ్ బజాజ్.. హరీశ్‌రావుకు లేఖ ద్వారా ఆహ్వానం పంపారు. లక్నో గోమతినగర్‌లోని తాజ్ వివాంటాలో జరిగే ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యుడి హోదాలో హాజరు కావాలని, కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రతి రాష్ట్రం నుంచి కౌన్సిల్ సభ్యుడితో పాటు ఇద్దరు అధికారులను మాత్రమే సమావేశానికి తీసుకురావాలని ఆ లేఖలో తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: జులైకి సంబంధించి వస్తు సేవల పన్ను ఆదాయం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2021 జులై నెలకు సంబంధించి రికార్డు స్థాయిలో 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వసూళ్లు ఇలా జులైకి సంబంధించి మొత్తం 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అవగా ఇందులో సీజీఎస్టీ 22.19 వేల కోట్లు, ఎస్జీఎస్టీ 28.53 వేల కోట్లుగా ఉన్నాయి. ఇక దిగుమతులకు సంబంధించి ఐజీఎస్టీ రూ. 57.86 వేల కోట్లు వసూలు అయినట్టు మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గతేడాదితో పోల్చితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2020 జులైలో ఏపీలో జీఎస్టీ వసూళ్లు రూ.2,138 కోట్లు ఉండగా ఈ ఏడాది రూ 2,730 కోట్లు వచ్చాయి. తెలంగాణకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు రూ.2,876 కోట్ల నుంచి రూ. 3,610 కోట్లకు పెరిగాయి. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 26 శాతం పెరగగా ఏపీలో 28 శాతం పెరిగాయి. కరోనా తగ్గడంతో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్డడంతో క్రమంగా జన జీవితం సాధారణ స్థితికి చేరుకుంటుందన్నారు ఆర్థిక మంత్రి. గత రెండు నెలలుగా ఆర్థిక కార్యాకలాపాలు పుంజుకుంటున్నాయని చెప్పడానికి జీఎస్టీ వసూళ్లే నిదర్శనమని ఆర్థికక శాఖ పేర్కొంది. అంతకు ముందు కోవిడ్ కారణంగా మే, జూన్లలో జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. -
జీఎస్టీతో తగ్గిన పన్నుల భారం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 66 కోట్లకు పైగా జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయని.. పన్ను రేట్లు తగ్గడంతో నిబంధనలను పాటించే వారు పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బహుళ పన్నుల విధానం స్థానంలో జీఎస్టీని కేంద్రం 2017 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పెట్రోలియం, లిక్కర్ తదితర కొన్ని మినహా అధిక శాతం వస్తు, సేవలను జీఎస్టీలో భాగం చేశారు. 1.3 కోట్ల పన్ను చెల్లింపుదారులు ‘‘వినియోగదారు, పన్ను చెల్లింపుదారులకూ జీఎస్టీ అనుకూలమైనదని నిరూపణ అయింది. జీఎస్టీకి పూర్వం అధిక పన్నుల రేట్లు నిబంధనల అమలు విషయంలో నిరుత్సాహకరంగా ఉండేవి. ప్రతీ రాష్ట్రం భిన్నమైన పన్ను రేటును వసూలు చేసేది. దీంతో అసమర్థత, వ్యయాలకు దారితీసింది. జీఎస్టీ æవిధానంలో తక్కువ రేట్ల కారణంగా పన్ను నిబంధనలను పాటించేవారి సంఖ్య క్రమంగా పెరిగింది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ ట్విట్టర్‌పై పేర్కొంది. ఒక కంపెనీ వ్యాపారం చేయడం కోసం కరోనాకు ముందు నాటి విధానంలో కనీసం 495 భిన్నమైన పత్రాలను దాఖలు చేయాల్సి వచ్చేదంటూ.. జీఎస్టీలో ఇది 12కు తగ్గినట్టు వివరించింది. జీఎస్టీ కింద నాలుగు రకాల రేట్లు అమలవుతుండడం తెలిసిందే. నిత్యావసరాలపై 5 శాతం, విలాసవంతం, సమాజానికి చేటు చేసేవాటిపై 28 శాతం పన్ను అమలు చేస్తుండగా.. మిగిలిన వస్తు, సేవలపై 12, 18 శాతం పన్ను అమలవుతోంది. వీరికి పన్ను భారం తక్కువ వార్షికంగా రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న (విక్రయాల ఆదాయం) వ్యాపారాలు, పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. అలాగే వార్షికంగా రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్నవి కాంపోజిషన్ పథకాన్ని ఎంపిక చేసుకుని టర్నోవర్‌పై 1 శాతం జీఎస్టీ చెల్లిస్తే చాలు. సేవల వ్యాపారం నిర్వహించే సంస్థలకు వార్షికంగా రూ.20 లక్షల వరకు టర్నోవర్ ఉంటే జీఎస్టీ వర్తించదు. రూ.50లక్షల వరకు టర్నోవర్ ఉన్న సేవల సంస్థలు కాంపోజిషన్ స్కీమ్ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. 54,439 మందికి అభినందనలు జీఎస్టీ 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ విధానం విజయవంతం కావడంలో భాగమైన పన్ను చెల్లింపుదారులను గౌరవించాలని నిర్ణయించాం. సకాలంలో రిటర్నులను దాఖలు చేయడమే కాకుండా, గణనీయమైన పన్ను చెల్లింపులు చేసిన వారిని గుర్తించేందుకు పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం (సీబీఐసీ) డేటా అన్‌లిటిక్స్ (సమాచార విశ్లేషణ)ను చేపట్టింది. ఇందులో భాగంగా 54,439 మంది పన్ను చెల్లింపుదారులను గుర్తించింది. ఇందులో 88 శాతానికి పైగా ఎంఎస్ఎంఈలే ఉన్నాయి. సూక్ష్మ పరిశ్రమలు 36 శాతం, చిన్న తరహా పరిశ్రమలు 41 శాతం, మధ్య తరహా పరిశ్రమలు 11 శాతం చొప్పున ఎంపికైన వాటిల్లో ఉన్నాయి. వీటిని అభినందిస్తూ సర్టిఫికేట్లను సీబీఐసీ ఇవ్వనుంది. – కేంద్ర ఆర్థిక శాఖ మైలురాయి భారత ఆర్థిక ముఖచిత్రంలో జీఎస్టీ ఒక మైలురాయి. జీఎస్టీ పన్నుల సంఖ్యను తగ్గించింది. నిబంధనల అమలు భారాన్ని, సామాన్యునిపై మొత్తం మీద పన్ను భారాన్ని తగ్గించింది. పారదర్శక, నిబంధనల అమలు, పన్ను వసూలు గణనీయంగా పెరిగింది. – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి -
ధరలకు ఇంధన సెగ!
న్యూఢిల్లీ: అటు టోకుగా ఇటు రిటైల్‌గా భారత్‌లో సామాన్యునిపై ధరా భారం తీవ్రంగా ఉంది. మే నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏకంగా 12.94 శాతంగా నమోదయ్యింది (2020 మే నెల ధరతో పోల్చితే) లో బేస్‌కు తోడు తాజాగా ఇంధన, తయారీ ఉత్పత్తుల ధరల తీవ్రత ఇందుకు ప్రధాన కారణం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 మే నెలలో, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో టోకున అసలు ధరలు పెరక్కపోగా ప్రతి ద్రవ్యోల్బణం (–3.37%) నమోదయ్యింది. 2021 ఏప్రిల్ నెలతో పోల్చినా (10.49%) టోకు ద్రవ్యోల్బణం మరింత పెరగడం గమనార్హం. ఇంధనం, విద్యుత్ ధరలు 37.61% పెరిగాయి. ఏప్రిల్‌లో ఈ పెరుగుదల రేటు 20.94 శాతం. సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు మేలో 10.83 శాతం పెరిగిగే, ఏప్రిల్‌లో 9.01 శాతం ఎగశాయి. అయితే ఆహార ధరల తీవ్రత 4.31%గా ఉంది. ట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తేవాలి ద్రవ్యోల్బణంపై ప్రధానంగా అధిక ఇందన ధరల ప్రభావం పడుతోంది. ఇది సామాన్యుని నుంచి పరిశ్రమ వరకూ ధరా భారం మోపుతోంది. దేశీయ ఉత్పత్తులకు భారత్‌తోపాటు అటు అంతర్జాతీయంగానూ పోటీ పరంగా తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంధన ధర ల్లో హేతుబద్దత తీసుకువచ్చు, ద్రవ్యోల్బణాన్ని అదుపులోనికి తీసుకుని రావడానికి పెట్రోలి యం ప్రొడక్టులను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోనికి తీసుకుని రావాలి. ఈ విషయాన్ని పరిశీలించమని కేంద్రాన్ని కోరుతున్నాం. – సంజయ్ అగర్వాల్, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ చదవండి: పుకార్లు షికార్లు,అదానీ ‘ఫండ్స్’ కలకలం! -
కోవిడ్ రాయితీపై చర్చ, నేడే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జీఎస్టీ మండలి సమావేశం కానుంది. బ్లాక్ ఫంగస్ మందులు, కోవిడ్ 19 అత్యవసరాలపై పన్ను రాయితీ అంశాన్ని మండలిలో చర్చించవచ్చని తెలుస్తోంది. 44వ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రితో సహా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. కోవిడ్ 19 చికిత్సకు అవసరమైన ఆక్సీజన్, ఆక్సీమీటర్లు, హాండ్ శానిటైర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతరాలపై జీఎస్టీ రాయితీలిచ్చే విషయమై మేఘాలయ డిప్యుటీ సీఎం ఆధ్వర్యంలోని కమిటీ ఇచ్చిన నివేదిక సమావేశంలో చర్చకురానుంది. పలు రాష్ట్రాల మంత్రులు కరోనా ఎసెన్షియల్స్‌పై పన్నురాయితీలకు సుముఖంగా ఉన్నారు. ప్రస్తుతం కరోనా ముందులు, ఆక్సీజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం, వాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. చదవండి : వామ్మో రూ. 3,500 కోట్లు ఎగ్గొట్టేశారు..! -
కోవిడ్ ఔషధాల ధరలు తగ్గేనా?
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జూన్ 12వ తేదీన అత్యున్నత స్థాయి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కోవిడ్, బ్లాక్ ఫంగస్ ఆవశ్యక ఔషధాలపై పన్నులను తగ్గించే అంశంపై ఈ సమావేశం ప్రధానంగా చర్చించనున్నదని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ కౌన్సిల్లో రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా ఉంటారు. మే 28 కోవిడ్ ఔషధాల తగ్గింపు మే 28వ తేదీన జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. కోవిడ్ ఔషధాల ధర తగ్గింపుపై ఆ సమావేశంలో చర్చించినా ... ఏకాభిప్రాయం రాకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి జీఎస్టీ కౌన్సిల్ ఇదే అంశం ప్రధానంగా సమావేశం కానుంది. ధరలు తగ్గుతాయి పీపీఈ కిట్లు, మాస్క్‌లు , వ్యాక్సిన్లుసహా కోవిడ్ ఆవశ్యక ఔషధాలకు పన్ను రాయితీ అంశాలపై సిఫారసులు చేయడానికి మంత్రిత్వ స్థాయి గ్రూప్ (జీఓఎం) ఏర్పాటైంది. దేశీయ తయారీ వ్యాక్సిన్లపై ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ ఉంది. కోవిడ్ మందులు, ఆక్సిజన్ కాన్సెంట్రేషన్లపై ఈ రేటు 12 శాతంగా ఉంది. జీఎస్టీ తొలగిస్తే వీటి ధరలు తగ్గుతాయి. -
తగ్గనున్న కొవిడ్ వ్యాక్సిన్ ధరలు?
న్యూఢిల్లీ: త్వరలో టీకాల ధరలు తగ్గబోతున్నాయా అంటే అవుననే జవాబు వస్తోంది. వ్యాక్సిన్లపై ప్రస్తుతం ఉన్న పన్నులను తగ్గించే యోచనలో ఉంది కేంద్రం. వ్యాక్సిన్లపై పన్నులతో పాటు కొవిడ్ చికిత్సలో ఉపయోగిస్తున్న ఇతర ఔషధాలు, వైద్య పరికరాలపై విధిస్తున్న పనులు తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. 28న మంత్రి మండలి కొవిడ్ టీకాపై ప్రస్తుతం ఉన్న పన్నులు తగ్గించే అంశంపై చర్చించేందుకు ఈనెల 28న జీఎస్టీ మండలి సమావేశం కానుంది. కరోనా టీకాలపై పన్ను అంశమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగబోతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. టీకాలతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, , మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, మెడికల్ గ్రేడ్ పరికరాలపై పన్ను తగ్గింపు అంశాలను జీఎస్టీ మండలి పరిశీలించనుంది. ధరలు తగ్గుతాయి కరోనా సెకండ్ వేవ్ విలయంతో ప్రైవేటు సెక్టార్లో వ్యాక్సినేషన్‌కి కేంద్రం అనుమతి ఇచ్చింది. దేశంలో అందుబాటులో ఉన్న కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల ధరలను ఆయా కంపెనీలు ప్రకటించాయి. దాదాపుగా అన్ని కంపెనీల వ్యాక్సిన్ల ధరలు ఒక డోసు వెయ్యి రూపాయలకు పైగానే ఉన్నాయి. దీంతో జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తే వ్యాక్సిన్ల ధర తగ్గి ప్రజలకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఇక్కడే తయారీ రష్యా తయారీ స్పుత్నిక్-వి టీకా ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభించారు. ఆర్డీఐఎఫ్తో కుదిరిన ఒప్పందం ప్రకారం టీకా ఉత్పత్తిని పానేషియా బయోటెక్ సంస్థ చేపట్టగా ఇప్పటికే తొలి బ్యాచ్ టీకాలు సిద్ధమయ్యాయి. నాణ్యతా పరీక్షల కోసం తొలిబ్యాచ్ టీకాలను రష్యాలోని గామలేయ సెంటర్ ఫర్ క్వాలిటీ కంట్రోల్‌కు పంపించనున్నట్లు పానేషియా బయోటెక్ వెల్లడించింది -
జూన్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
జీఎస్టీ కౌన్సిల్ 40వ సమావేశం ఈ జూన్12న జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుగనుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుండటం ఇదే తొలిసారి. పన్ను ఆదాయాలపై కోవిడ్-19 వ్యాధి ప్రభావం గురించి చర్చించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల ఆదాయాలపై కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ఆదాయాలన్ని పెంచుకునే మార్గాలపై కౌన్సిల్ చర్చించే అవకాశం ఉంది. లాక్డౌన్ అనంతరం కేవలం నిత్యావసర వస్తువులకే కాకుండా అన్ని రకాల వస్తువులకు డిమాండ్‌ను పెంచి ప్రతి రంగంలో ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపర్చాల్సిన అవసరమున్నదని కౌన్సిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసుల కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన జీఎస్టీ ఆదాయ వసూళ్ల గణాంకాలను కేంద్రం విడుదల చేయలేదు. భారీగా పడిపోయిన వసూళ్లు, రిటర్నులను దాఖలు చేయడానికి గడువు పొడగింపుతో కేంద్రం తీవ్రమైన కష్టాలను ఎదుర్కోంటుంది. జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం మార్చి 14న జరిగింది. కాంపెన్‌సన్ అవసరాలను తీర్చుకునేందుకు మార్కెట్ నుండి జీఎస్టీ కౌన్సిల్ రుణాలు తీసుకునేందుకు చట్టబద్ధతను కేంద్రం పరిశీలిస్తుందని సమావేశం సందర్భంగా ఆర్థికమంత్రి సీతారామన్ తెలిపారు. -
ఆ వస్తువులు, సేవలు మరింత ప్రియం..
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ రాబడులను పెంచడం, దీటైన పన్ను వ్యవస్థగా మలచడం కోసం ఏర్పాటైన అధికారుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. విలాసవంతమైన వస్తువులపై అధిక పన్ను విధించాలని, జీఎస్టీలో ప్రస్తుతమున్న5 శాతం, 12, 18, 28 శాతం శ్లాబ్‌ల స్ధానంలో కొత్తగా 10 శాతం, 20 శాతంతో రెండు శ్లాబులనే తీసుకురావాలని సిఫార్సు చేసింది. కాస్మెటిక్స్, గ్యాంబ్లింగ్, రిక్రియేషనల్ సేవల వంటి వాటిపై సెస్ విధింపు, పాఠశాల విద్య, అత్యున్నత వైద్య సేవలు, ఏసీ ప్రజా రవాణాలకు ఇచ్చే మినహాయింపులను ఉపసంహరించాలని సూచించింది. జీఎస్టీ కౌన్సిల్‌కు గత వారం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో అధికారుల కమిటీ ఈ మార్పులను సూచించింది. ఇక లగ్జరీ వస్తువులపై ఎంత శాతం పన్ను విధిస్తారనే దానిపై కమిటీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతమున్న 28 శాతం శ్లాబ్‌ను వీటికి వర్తింపచేయబోరని సమాచారం. సెస్రేట్లను పెంచాలని సైతం ఈ కమిటీ సూచించింది. తాము చేసిన సూచనలపై చర్చించి జీఎస్టీ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ వ్యవస్థను సమర్ధంగా రూపొందేలా కమిటీ పలు సూచనలు చేసిందని, జీఎస్టీ లొసుగులతో ఏటా రూ 20,000 కోట్లకు పైగా వాటిల్లుతున్న నష్టాలను అధిగమించేలా దీటైన సిఫార్సులు చేసిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగమనంతో వినిమయం తగ్గడం వల్లే పన్ను రాబడులు గణనీయంగా తగ్గాయని జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, జీఎస్టీ అధికారులు కొందరు చెబుతున్నారు. సెస్ ఫండ్ చాలినంత లేకపోవడంతో అక్టోబర్, నవంబర్‌లకు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని కేంద్రం చెల్లించలేదని సమాచారం. -
చింతపండుపై జీఎస్టీని మినహాయించాం
సాక్షి, ఢిల్లీ: ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయించాని విజ్ఞప్తి చేస్తూ జూలై 24న కేంద్ర ఆర్థిక శాఖకు వైఎస్సార్ సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై సెప్టెంబర్ 20న పనాజీలో జరిగిన జీఎస్టీ 37వ మండలి సమావేశంలో విస్తృతంగా చర్చించి ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వేమిరెడ్డికి అనురాగ్ ఠాకూర్ గురువారం ప్రత్యుత్తరం పంపారు. సెప్టెంబర్ 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. -
ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 15న ఢిల్లీలో జరగనున్న ఐదో నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి నీతి ఆయోగ్ సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం ఆహ్వానించింది. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం శుక్రవారం రాత్రి కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి రానున్నారు. కాగా, ఈ నెల 20న ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హోదాలో హాజరు అయ్యేందుకు మరోసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. -
జీఎస్టీ ఎగవేతదారులపై సుప్రీంకోర్టు కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతదారులపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఎగవేతదారుల అరెస్టు విషయమై జీఎస్టీ అథారిటీలకు ఉన్న అధికారాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు తాజాగా అంగీకారం తెలిపింది. నాలుగు వారాల తర్వాత ఈ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎగవేతదారుల అరెస్టులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని వెకేషన్ ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. పన్ను ఎగవేతదారులను జీఎస్టీ అథారిటీ అరెస్టు చేయవచ్చునని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో వివిధ రాష్ట్రాల హైకోర్టులు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం, ఎగవేతదారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్న నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని విచారించనుంది. త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు వెలువడేవరకు ఎగవేతదారుల పిటిషన్లపై విచారణ సమయంలో తమ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఎగవేతదారుల అరెస్టును సమర్థించిన విషయాన్ని గుర్తించాలని వివిధ రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. -
సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం
సాక్షి, హైదరాబాద్: రాజధాని కేంద్రంగా మరో నకిలీ ఇన్వాయిస్ రాకెట్ వెలుగులోనికి వచ్చింది. సరుకులు తయారీ, రవాణా చేయకుండానే రూ.133 కోట్ల వ్యాపారం చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన 5 కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడటంతో పాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రూపంలో రూ.22.64 కోట్లను ప్రభుత్వం నుంచి అక్రమంగా పొందాయి. ఈ బాగోతాన్ని మేడ్చల్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు వెలుగులోకి తెచ్చారు. నకిలీ ఇన్వాయిస్ల సృష్టికి కలకత్తా పెట్టింది పేరు. బోగస్ వ్యాపారులకు అవసరమైన నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి ఇవ్వడానికి అక్కడ ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు ఉంటాయి. ఇలాంటి ఓ సంస్థ నుంచి మేడ్చల్ జీఎస్టీ కమిషనరేట్‌కు ఓ సమాచారం అందింది. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన అధికారులు ఐదు కంపెనీల అక్రమాలను గుర్తించారు. కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన హిందుస్తాన్ ఏఏసీ ప్రొడక్ట్స్, ఐత్రి ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ లిమిటెడ్, శ్రీకృష్ణా క్యాస్టింగ్స్, శ్రీ మెటల్స్, ఆవ్యా ఎంటర్ ప్రైజెస్‌లు ఎంఎస్, కాపర్, మెటల్ తుక్కు పదార్థాల తయారీ, రవాణా వ్యాపారాలు చేస్తున్నాయి. ఈ ఐదూ 2017 జూలై నుంచి నకిలీ ఈ–వే బిల్లులు సృష్టించడం మొదలెట్టాయి. నకిలీ ఇన్వాయిస్ల సాయంతో ఈ కాలంలో మొత్తం రూ.131 కోట్ల మేర వ్యాపారం చేశామని రికార్డులు సృష్టించాయి. దీనికి సంబంధించి చెల్లించాల్సిన రూ.22.64 కోట్ల జీఎస్టీని ఐటీసీ కింద చూపిస్తూ వచ్చాయి. ఫలితంగా ఆయా సంస్థలు చేస్తున్న వ్యాపారానికి రూ.131 కోట్ల అదనంగా చేసినట్లు రికార్డులు తయారుచేశాయి. దీనికితోడు చెల్లించాల్సిన పన్నులో రూ.22.64 కోట్లు ప్రభుత్వం నుంచే తీసుకున్నాయి. అయితే కలకత్తా నుంచి వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన జీఎస్టీ కమిషనరేట్ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారని, అసలు సరుకు తయారీ రవాణా కాలేదని నిర్థారించారు. దీంతో ఆ ఐదు సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఈ సంస్థలను నలుగురు నిర్వహిస్తున్నారని తేలింది. ప్రాథమికంగా నేరం నిరూపణ కావడంతో ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. స్కూటర్లపై సరుకు రవాణా చేశారట! జీఎస్టీ అధికారులు జరిపిన దర్యాప్తులో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలిశాయి. సాధారణంగా సరుకు తయారీ సంస్థలు వాటి రవాణా కోసం ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ వాడుతాయి. అయితే నకిలీ ఈ–వేబిల్స్ సృష్టించిన ఈ ఐదు సంస్థల్లో వాటిపై సరుకు రవాణా వాహనాల నంబర్లు అంటూ కొన్నింటిని పొందుపరిచాయి. అయితే అసలు సరుకే లేనప్పుడు ఇక రవాణా ఏమిటని అనుమానం వచ్చిన జీఎస్టీ అధికారులు ఆ కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆయా రిజిస్ట్రేషన్ నంబర్లతో సరుకులు రవాణా చేసే వాహనాలు లేవని, ప్రయాణికులను చేరవేసే వాహనాలు, స్కూటర్లు, ట్రాక్టర్ల నంబర్లను వినియోగించారని బయటపడింది. రూ.20 లక్షల నగదుతో పాటు 4,150 అమెరికన్ డాలర్లు, ఇతర నకిలీ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు మేడ్చల్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు. -
గృహ కొనుగోలుదారులకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం గృహ కొనుగోలుదారులకు తీపికబురు అందించింది. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాల విక్రయంపై విధించే జీఎస్టీని ప్రస్తుత 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. అందుబాటు గృహాల కేటగిరీలో లేని అన్ని గృహాలకూ తగ్గించిన జీఎస్టీ వర్తిస్తుంది. ఇక అందుబాటు గృహాలపై ఇప్పటివరకూ విధిస్తున్న 8 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గిస్తూ ఆదివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కాగా తగ్గించిన రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.గృహ విక్రయాలపై జీఎస్టీని భారీగా తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాటు దిగివచ్చిన వడ్డీరేట్లతో సగటు జీవి సొంతింటి కల నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈ నిర్ణయంతో దేశీయ నిర్మాణ రంగంలో ఉత్తేజం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
జీఎస్టీ కౌన్సిల్ వాయిదా : గడుపు పెంపు
రియల్ ఎస్టేట్ రంగంలో విధించాల్సిన జీఎస్టీపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే జీఎస్టీ కౌన్సిల్ మావేశం ముగిసింది.తదుపరి సమావేశాన్ని ఫిబ్రవరి 24 ఆదివారానికి వాయిదా వేసింది. అలాగే జీఎస్టీ 3బి ఫాంల సమర్పణకు గడువును పొడిగించింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రియల్టీ, లాటరీరంగాలపై విధించే జీఎస్టీ పై ఇంకా చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదావేశామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫిబ్రవరి 24 ఆదివారం ఢిల్లీలో జరిగే కౌన్సిల్ దీనిపై సమగ్రంగా చర్చించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో జనవరి మాసానికి సంబంధించిన అమ్మకాల రిజిస్ట్రేషన్ల (జీసీటీఆర్ 3బి) ఫైలింగ్‌కు గడువును అన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 22 శుక్రవారం వరకు పొడిగించినట్టు తెలిపారు. జమ్ము కశ్మీర్ వాసులకు పిబ్రవరి 28 వరకు సమయాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. కాగా నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ నేతృత్వంలోని మంత్రుల బృందం అభిప్రాయపడింది. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లపై (పూర్తయినట్టు ధ్రువీకరణ జారీ చేయని వాటిపై) ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయంతో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
సినిమా టి‘కేటుగాళ్ల’పై నజర్
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ఆసరాగా చేసుకుని సినిమా టికెట్ల పేరుతో ప్రేక్షకుల నుంచి ఎక్కువ ధరలను వసూలు చేస్తున్న థియేటర్ యాజమాన్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాస్తవానికి రూ.100 కన్నా ఎక్కువ ఉన్న సినిమా టికెట్లపై మొదట్లో 28 శాతం జీఎస్టీ విధించారు. కానీ, గత కౌన్సిల్ సమావేశంలో ఈ మొత్తాన్ని 18 శాతానికి తగ్గించి ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చారు. అయితే, కొన్ని థియేటర్ల యాజమాన్యాలు టికెట్లపై 28 శాతం జీఎస్టీ అని ముద్రించి ప్రేక్షకుల నుంచి వసూలు చేసిన తర్వాత ప్రభుత్వానికి మాత్రం 18 శాతమే చెల్లిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు హైదరాబాద్‌లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొన్ని థియేటర్లు తగ్గించిన జీఎస్టీని వసూలు చేస్తుండగా, మరికొన్ని పాత జీఎస్టీ ప్రకారమే వసూలు చేస్తున్నాయని తేలింది. దీంతో ఎక్కువ మొత్తంలో జీఎస్టీని వసూలు చేస్తున్న థియేటర్ యాజమాన్యాలపై సాక్ష్యాలతో కేసు నమోదు చేసిన అధికారులు విచారించే ప్రక్రియను యాంటీ ప్రాఫిటరింగ్ విభాగానికి బదిలీ చేశారు. ఈ మేరకు ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌పై విచారణ జరిపేందుకు గాను హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆదేశాలిచ్చారు. దీంతో పాటు నగరంలోని పలు థియేటర్లను తనిఖీలు చేసి సినిమా టికెట్ల రూపంలో ఎక్కువ మొత్తాలను వసూలు చేస్తున్న థియేటర్ల యాజమాన్యాలపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పుడు 12 శాతమే.. సినిమా టికెట్లపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గిందని, తాజా బడ్జెట్లో ఆ వ్యత్యాసాన్ని కూడా తీసేసి ధరతో సంబంధం లేకుండా ప్రతి సినిమా టికెట్‌పై కేవలం 12 శాతమే జీఎస్టీ ఉంటుందని ప్రకటించారు. దీంతో ఇక నుంచి సినిమా టికెట్లపై 12 శాతం జీఎస్టీ మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని జీఎస్టీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత జీఎస్టీ కన్నా ఎక్కువ వసూలు చేసే థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని జీఎస్టీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇందుకోసం యాంటీ ప్రాఫిటరింగ్ విభాగాన్ని రంగంలోకి దించుతామని, ఉల్లంఘనలకుపాల్పడి ప్రజల సొమ్మును దోచుకుని ప్రభుత్వానికి పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. -
గుడ్‌న్యూస్ : జీఎస్టీ రేటు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ తాజా సమావేశంలో పన్ను రేటు తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ స్లాబుల్లో మార్పులకు ఆమోదం తెలిపింది. 33 అంశాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేటులను తగ్గించింది. 28శాతం జీఎస్టీ ఉన్న సుమారు ఏడింటిని 18శాతం శ్లాబులోకి తీసుకొచ్చింది. అలాగే మరో 26 వస్తువులను 18శాతం శ్లాబు నుంచి 12శాతం, 5శాతం శ్లాబులకు మార్చాలని నిర్ణయించారు. 28 విలాసవంతమైన వస్తువులపై 28శాతం జీఎస్టీ వసూలు యథాతథంగా ఉంటుంది. అయితే సిమెంట్‌పై జీఎస్టీ 18 శాతానికి కోతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారికి నిరాశే మిగిలింది. 33 వస్తువులపై జీఎస్టీ తగ్గించేందుకు కౌన్సిల్ నిర్ణయించిందని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి వివరించారు. ముఖ్యంగా టీవీలు కంప్యూటర్లు, ఆటో పార్ట్స్ తదితరాల ధరలు దిగి రానున్నాయని ఉత్తరాఖండ్ ఆర్తికమంత్రి ప్రకాశ్ పంత్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 31వ సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. అనంతరం జైట్లీ సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశంలో వివరాలను ప్రకటించారు. వందలాది వస్తువులపై జీఎస్టీ కోత -జైట్లీ వందలకొద్దీ వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించామని అని అరుణ్ జైట్లీ చెప్పారు 28శాతం జీఎస్టీ వసూలు చేసే 34 స్తువుల నుంచి ఆరు అంశాలను తొలగించినట్టు చెప్పారు. మూడు వస్తువులపై జీఎస్టీని 18శాతంనుంచి 12శాతానికి తగ్గించినట్టు చెప్పారు. ఈ నిర్ణయంతో దాదాపు 55వేల కోట్ల రూపాయల భారం పడునుందని, తగ్గించిన జీఎస్టీ రేట్లు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయని జైట్లీ వెల్లడించారు. అలాగే సాధారణ పొదుపు ఖాతాలు, జనధన్ సేవింగ్స్ బ్యాంక్స్ ఖాతాలపై బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి జీఎస్టీ వుండదని పేర్కొన్నారు. దీంతోపాటు కేంద్రీకృత అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ ఏర్పాటునకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని అరుణ్ జైట్లీ ప్రకటించారు.ఈ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నామని ఆర్థికమంత్రి తెలిపారు. ఎయిర్ కండిషనర్లు, 32 అంగుళాల టీవీలు, టైర్లు, లిథియం బ్యాటరీల పవర్ బ్యాంక్స్ 18శ్లాబులోకి దివ్యాంగులకు సంబంధించిన పలు ఉత్పత్తులపై 18నుంచి అతితక్కువగా 5శాతానికి తగ్గింపు వంద రూపాయిలలోపు వున్న సినిమా టికెట్లపై 18 శాతంనుంచి 12శాతానికి రూ.100 పైన ఉన్న టికెట్లపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు థర్డ్ పార్ట్ ఇన్సూరెన్స్‌పై వసూలు చేసే జీఎస్టీ18 -12 శాతానికి తగ్గింపు తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు సంబంధించిన ప్రత్యేక విమానాలపై ప్రీమియం పన్ను వసూలు ఉండదు. ఎకానమీ 5, బిజినెస్ 12శాతం వుంటుంది. జనవరిలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో రియల్ ఎస్టేట్ సెక్టార్‌పై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. -
జీఎస్టీ స్లాబులు తగ్గించే అవకాశం
సాక్షి, కోలకతా: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో నేడు (శనివారం) వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 29వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ కీలక నిర్నయాలు తీసుకుంది. ముఖ్యంగా రూపే కార్డు, భీమ్ ద్వారా డిజిటల్ లావాదేవీలకు పైలట్ ప్రాతిపదికన ప్రోత్సాహకాలను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. మరోవైపు జీఎస్టీ స్లాబులను రానున్న కాలంలో మూడుకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశ పన్నుల విధానాన్ని మరింత సరళీకృతం చేసేందుకు మినహాయింపు కేటగిరీతో పాటు, జీఎస్టీ స్లాబులను తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ మంత్రి ప్రధాన ఆర్థిక సలహాదారు సజీవ్ సన్యాల్ శనివారం చెప్పారు. భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో సంజీవ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 5, 12, 18 , 28 శాతం నాలుగు స్లాబులకు బదులుగా, మూడు స్లాబులుగా( 5, 15, 25 శాతం) రేటు ఉండవచ్చారు. కేంద్రం జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత పన్ను సేకరణ గణనీయంగా పెరిగిందనీ, చాలా మంది ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తున్నారన్నారు. ప్రత్యక్ష పన్నుల ఆదాయంపన్ను ఆదాయం బాగా కొనసాగితే రేట్లను తగ్గింపు ఉంటుందని సన్యాల్ తెలిపారు. కాగా ఎంఎస్ఎంఈ రంగ సమస్యల పరిష్కారం కోసం ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతోపాటు చట్టం, సంబంధిత సమస్యలను కేంద్రం , రాష్ట్ర పన్ను అధికారుల న్యాయ కమిటీ పరిశీలిస్తుంది. పన్నుల సంబంధిత సమస్యలను ఫిట్మెంట్ కమిటీ చూస్తుందని చెప్పారు.కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబర్ 28-29 తేదీల్లో గోవాలో జరుగనుంది. -
జీఎస్టీ రిటర్న్ ఇకపై మరింత సులువు
సాక్షి, న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జిఎస్టీ)లో కీలకమైన జీఎస్టీఎన్ను ఇకపై ప్రభుత్వ ఆధీన సంస్థగా మార్చేందుకు జిఎస్టీ కౌన్సిల్ అంగీకారం తెలిపింది. అంతేకాదు జీఎస్టీ రిటర్న్‌లను సరళీకృతం చేసే రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్టు 27వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కౌన్సిల్ వెల్లడించింది. అలాగే చక్కెరపై పన్ను విధించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసింది. డిజిటల్ చెల్లింపులపై 2శాతం ప్రోత్సాహమిచ్చే అంశాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించినట్టు తెలిపింది. కొత్త 27 వ సమావేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ పై అధికార నిర్ణయం తీసుకునే సంస్థ ప్యానెల్,జీఎస్టీఎన్ ను మార్చడానికి ప్రతిపాదనకు అంగీకరించినట్టు తెలిపారు. ప్రైవేటు సంస్థల వాటాను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు కౌన్సిల్ అంగీకరించిందనీ, కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తుందన్నారు. మిగతా వాటా రాష్ట్రాలదని స్పష్టంచేశారు. జిఎస్టీ నెట్ వర్క్ లేదా జిఎస్‌టీఎన్లో ప్రస్తుతం 24.5 శాతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదని జైట్లీ పేర్కొన్నారు. మిగిలిన 51శాతం ఐదు (హెచ్ఎఫ్సీ లిమిటెడ్, హెచ్ఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్, ఎన్ఎస్ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కో, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్సిట్యూట్లదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.జీఎస్టీ ఫైలింగ్‌ను మరింత సరళీకృతం చేయనున్నట్టు వెల్లడించారు. ఆరునెలల్లో ఒకే నెలవారీ రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తోందని ఆర్థికశాఖ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిత్రా మాట్లాడుతూ దాదాపు అయిదు రాష్ట్రాలు సుగర్‌పై లెవీకి అనుకూలంగా లేవని అన్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా చక్కెరపై లెవీని వ్యతిరేకించారు. ఇది సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతుందన్నారు. -
ఆ రాష్ట్రాలకు చేయూతనివ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు నిదర్శనంగా, సహకార సమాఖ్య స్ఫూర్తికి అద్దంపట్టేలా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ప్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఈటల అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు రూ.40 వేల కోట్ల ఖర్చుతో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. రూ.85 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోందని పేర్కొన్నారు. భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించడమే కాకుండా ఈ పథకానికి రూ.19,205 కోట్ల నిధులు ఇవ్వాలని, చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకానికి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కోరామని చెప్పారు. గొప్ప ఆవిష్కరణలతో పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలకు సహకారం ఇచ్చేలా కేంద్రం బడ్జెట్ రూపొందించాలని సూచించారు. అలాగే విభజన చట్టంలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐరన్ ఓర్ పరిశ్రమ, గిరిజన, హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణకు ప్రకటించిన ఎయిమ్స్‌కు నిధులు, వ్యవసాయ పెట్టుబడి పథకానికి నిధులివ్వాలని కోరామని వివరించారు. డ్రిప్ ఇరిగేషన్‌పై పన్ను తగ్గింపు.. జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశంలో వివిధ వస్తువులపై పన్ను తగ్గింపునకు ఫిట్మెంట్ కమిటీ అంగీకరించింది. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న డ్రిప్ ఇరిగేషన్‌పై గతంలో విధించిన 18 శాతం పన్నును 12 శాతానికి తగ్గించింది. బీడీలపై పన్ను తగ్గింపును మాత్రం ఫిట్మెంట్ కమిటీ పట్టించుకోలేదు. ఈవే బిల్లుల విషయంలో పాత విధానాన్ని అమలు చేసుకొనే అధికారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు కోరాయని ఈటల తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదు నెలలు పూర్తయిన నేపథ్యంలో పేద ప్రజలకు భారంగా పరిణమించిన వివిధ వస్తువులపై పన్ను స్లాబ్‌లను పున:సమీక్షించాలని కోరినట్లు చెప్పారు. పన్ను ఎగవేతలకు ఆస్కారం ఇవ్వకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని, అందుకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని సూచించామన్నారు. ఇక తెలంగాణకు జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్)లో కేంద్రం సభ్యత్వం ఇచ్చింది. అది కామన్‌సెన్స్‌కు సంబంధించిన విషయం.. హైదరాబాద్‌లో పన్ను చెల్లిస్తున్న 40 శాతం మంది ఆంధ్రా ప్రజలే అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఈటలను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందింస్తూ.. ‘అమెరికాలో ఉన్న వారు అమెరికాలో పన్ను చెల్లిస్తారు. ఢిల్లీలో ఉన్న వారు ఢిల్లీలో కడతారు. హైదరాబాద్‌లో ఉన్న వారు హైదరాబాద్‌లోనే చెల్లిస్తారు. ఆయన వ్యాఖ్యలు కామన్ సెన్స్‌కు సంబంధించినవి. అంత ఉన్నత వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై మనం ఏం మాట్లాడతాం’అని వ్యాఖ్యానించారు. -
బీడీలకు మోక్షం లభించలేదు : ఈటల
న్యూఢిల్లీ : బీడీలపై జీఎస్టీ తగ్గించాలని కోరినా.. కౌన్సిల్ ఆమోదించలేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సిగరెట్లతో సమానంగా అంటే 28 శాతం పన్నును బీడీ ఉత్పత్తులపై విధించడం సరికాదని కోరినప్పటికీ, ఫిట్మెంట్ కమిటీ ఒప్పుకోలేదని చెప్పారు. అయితే డ్రిప్ ఇరిగేషన్ వస్తువులకు మాత్రం జీఎస్టీ రేటు 18 శాతం నుంచి 12 శాతం తగ్గింపుకు ఆమోదం లభించిందన్నారు. నేడు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశంలో పన్ను ఎగవేత లేకుండా ఈ-వే బిల్లు అమలు చేయడంపై చర్చ జరిగినట్టు చెప్పారు. జీఎస్టీ చట్టాల సవరణలపై తదుపరి మీటింగ్‌లో చర్చ ఉంటుందని తెలిపారు. అంతేకాక పెట్రోల్, డీజిల్, రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై నేడు(గురువారం) చర్చ జరుగలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రతిపాదించిన అభ్యర్థనలు... ప్రోగ్రెసివ్ రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలి యువతకు ఉపాధి కల్పించే వ్యవసాయం, చిన్నమధ్య తరహా పరిశ్రమలపై దృష్టిపెట్టాలి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులకు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.10వేల కోట్ల బడ్జెట్ కోరాం హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి నిధులు ఇవ్వాలని కోరాం ప్రతి ఎకరానికి, ప్రతి పంటకు పెట్టుబడి చేయూత పథకం కోసం ఆర్ధికంగా సహాయం, కరెన్సీ నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు -
జూన్ నుంచి ఈ–వే బిల్లింగ్
న్యూఢిల్లీ: ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు రవాణా కోసం వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు లేదా ఈ–వే బిల్లు వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకుంది. ఐటీ నెట్వర్క్ సంసిద్ధతపై సమీక్ష తర్వాత దేశవ్యాప్తంగా 2018 జూన్ 1 నుంచి ఈ–వే బిల్లింగ్ వ్యవస్థను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 24వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అడ్డంకులు మొదలైన అంశాలపై చర్చించిన అనంతరం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 16 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకు రవాణాకు ఈ–వే బిల్లులను వినియోగించడం ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరి అని స్పష్టం చేసింది. జీఎస్టీకి ముందు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) అధికారులు సరుకు రవాణాకు సంబంధించి వే బిల్లులను జారీ చేసేవారు. జీఎస్టీఎన్ పోర్టల్ ద్వారా ఈ–వే బిల్లులను జనరేట్ చేస్తారు. రూ.50 వేలకు మించిన సరుకు రవాణాకు ఈ–వే బిల్లు తప్పనిసరి. ఈ–వే బిల్లును జనరేట్ చేసిన తర్వాత ఏకీకృత ఈ–వేబిల్లు నంబర్ ఇస్తారు. ఇది సప్లయర్, ట్రాన్స్పోర్టర్, సరుకు అందుకునే వారికి అందుబాటులో ఉంటుంది. -
ఫిబ్రవరి 1నుంచే ఇ-వే బిల్లు
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్ను పరిధిలో ఇ-వే బిల్లు విధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం జరిగిన ఈ సమావేశంలో ఇ-వే బిల్లు విధానాన్ని తప్పని సరిచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంట్రా-స్టేట్ ఇ-వే బిల్లు జూన్ 1 నుంచి తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వస్తువుల అంతర్ రాష్ట్ర ఇ-వే బిల్లు మాండేటరీ అని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. దీన్ని ట్రయల్ రన్ కోసం జనవరి 16నాటికి సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇ-వే బిల్లు విధానం, ఇన్వాయిస్ మ్యాచింగ్ తదితర అంశాలపై చర్చించిన 24వ జీఎస్టీ మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రూ. 50వేల విలువకంటే ఎక్కువ వస్తువులను రవాణా చేస్తే తప్పనిసరిగా ఇ-వే బిల్లు, రాష్ట్రంలో 10 కి.మీ లోపు వస్తువులను రవాణా చేస్తే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు ఉండాలి. కొన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 1 నుంచి స్వచ్ఛంద ప్రాతిపదికన ఇంటర్-స్టేట్ , ఇంట్రాస్టేట్ ఇ-వే బిల్లును అమలు చేస్తాయని కౌన్సిల్ తెలిపింది. అయితే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు విధానం మాత్రం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా అంతర్ రాష్ట్ర వస్తువుల రవాణా, పన్నుల ఎగవేత నిరోధాన్ని ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 1 నుంచి దశలవారీగా..ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. దీనిపై రివ్యూ నిర్వహించిన మండలి ఈ నిర్ణయం అమలు ఫిబ్రవరికి ప్రీ పోన్ చేసింది. అలాగే నవంబరులో గువాహటిలో జరిగిన గత మండలి సమావేశంలో 178 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. -
జీఎస్టీ:రెస్టారెంట్లపై భారీ ఊరట
గౌహతి: రెస్టారెంట్లపై వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని హోటల్స్‌పై (స్టార్ హోటల్స్‌తప్ప) జీఎస్టీ రేటును 5శాతంగా నిర్ణయించింది. గౌహతిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీ స్లాబ్ రేట్ల వివరాలను మీడియాకు వివరించారు. జీఎస్టీ భారాన్ని హోటల్స్‌పై భారీగా తగ్గించినట్టు చెప్పారు. అలాగే దాదాపు 178 వస్తువులకు 28శాతం జీఎస్టీ నుంచి మినహాయింపు నిచ్చామనీ, 6 అంశాలను 5శాతంనుంచి జీరో శాతానికి తెచ్చామని చెప్పారు. హోటల్స్‌పై జీఎస్టీ కౌన్సిల్లో బాగా చర్చ జరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. ఇప్పటివరకు 18శాతం ఉండగా, ఇపుడు 5శాతంగా నిర్ణయించామన్నారు. టర్నోవర్, ఏసీ, నాన్‌ఏసీతో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై జీఎస్టీ రేటు 5శాతంగా ఉంటుందని తెలిపారు. ఏసీ, నాన్ ఏసీ తేడా లేకుండా..అలాగే టర్నోవర్‌తో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై 5శాతం టాక్స్‌ను వినియోగదారులు చెల్లించాలి. అలాగే రూ. 7,500 రూము రెంట్ వసూలు చేసే స్టార్‌హోటల్స్‌పై 18శాతం జీఎస్టీ (ఐటీసీతో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. ఔట్ డోర్ కేటరింగ్‌పై 18శాతం (విత్ ఐటీసీ)గా ఉంటుంది. అయితే ఐటీసీ(ఇనపుడ్ టాక్స్ క్రెడిట్)లో కొన్నిసవరణలు చేసినట్టు చెప్పారు. ఇన్పుట్ క్రెడిట్‌ను హోటల్ యాజమాన్యం వినియోగదారులకు పాస్ చేయడం లేదనీ తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకే రెస్టారెంట్ల ఇండస్ట్రీకి ఐటీసీ లభించదని స్పష్టం చేశారు. ఈ కొత్త రేట్లు నవంబరు 15నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. అలాగే జీఎస్టీ లేట్ ఫైలింగ్ ఫీజును కూడా భారీగా తగ్గించింది. రోజుకు రూ.200 నుంచి రోజుకు రూ.20లకు తగ్గించడం విశేషం. -
జీఎస్టీ రేట్ కట్: చౌకగా 177 వస్తువులు
సాక్షి, గౌహతి: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో అసోంలో జరిగిన జీఎస్టీ 23వ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ రేట్ల స్లాబ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. గౌహతిలో శుక్రవారం జరిగిన మండలి సమావేశంలో నిత్యావసరమైన పలు వస్తువులపై జీఎస్టీని తగ్గించింది. ఇప్పటి వరకు 227 వస్తువులపై 28శాతం పన్ను రేటు వుండగా ప్రస్తుతం కేవలం 50 వస్తువులపై మాత్రమే 28శాతం పన్ను నిర్ణయించినట్టు బిహార్ ఆర్థికమంత్రి సుశీల్ మోడీ ప్రకటించారు. పొగాకు, లగ్జరీ వస్తువలపై మాత్రమే అధిక రేట్లను నిర్ణయించామని చెప్పారు. చూయింగ్ గమ్స్, చాకోలెట్స్, ఆఫ్టర్ షేవ్, వాషింగ్ పౌడర్ తదితర వస్తువులపై జీఎస్టీని 18 శాతంగా నిర్ణయించింది. టెక్నాలజీ సంబంధిత అంశంపై వడ్డీరేటును నిర్ణయించేందుకు ఐదుగురు సభ్యుల మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మోడీ అత్యధిక పన్నుల స్లాబ్ 28శాతం కేటగిరీ లో 177 వస్తువుల ధరలను తగ్గించేందుకు కౌన్సిల్ అంగీకరించినట్టు తెలిపారు. నాన్ ఎసీ రెస్టారెంట్లపై 18శాతం నుంచి జీఎస్టీ పన్నులను 12శాతానికి తగ్గించింది. వ్యాపారులు, తయారీదారులు & వినియోగదారులకు అనుకూలంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఇప్పటికే దాదాపు 200 వస్తువులపై పన్ను రేటును 28 శాతం నుంచి 18శాతానికి తగ్గించే నిర్ణయం తీసుకున్నామన్నారు. -
వీటి ధర తగ్గే ఛాన్స్..
సాక్షి,న్యూఢిల్లీ: రోజువారీ ఉపయోగించే పలు వస్తువులపై జీఎస్టీ భారాన్నితగ్గించేందుకు కసరత్తు సాగుతోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరగనున్న 23వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశంలో 28 శాతం పన్ను పరిథిలో ఉన్న పలు వస్తువులను ఆ జాబితా నుంచి కుదించడంతో పాటు రోజువారీ ఉపయోగించే షాంపూలు, ఎలక్ట్రిక్ స్విచ్‌లు, ప్లాస్టిక్ ఉత్పుత్తులు, ఫర్నిచర్ వంటి వాటిపై పన్ను రేటును తగ్గిస్తారని భావిస్తున్నారు. జీఎస్టీ రిటన్స్ దాఖలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న మధ్యతరహా వ్యాపారులకూ ఊరట ఇచ్చేలా పలు నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. కాంపోజిషన్ స్కీమ్ కింద రూ కోటి లోపు టర్నోవర్ కలిగిన వ్యాపారాలపై పన్నును ఒక శాతానికి తగ్గించడం, నాన్ ఏసీ రెస్టారెంట్లపై తక్కువ పన్నురేట్ల వర్తింపు ప్రతిపాదనలపైనా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. -
జీఎస్టీని కలిపే ఎమ్మార్పీని ముద్రించాలి
న్యూఢిల్లీ: కచ్చితంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ను కలుపుకునే ఒక వస్తువు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)ను ముద్రించాలని జీఎస్టీ సవరణలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం సూచించింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలు, నీళ్ల బాటిళ్లు తదితర ఎలాంటి వస్తువులనైనా మాల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు వంటి ఏ దుకాణంలోనైనా సరే ఎమ్మార్పీకి మించి అమ్మితే నేరంగా పరిగణించి కేసు నమోదు చేయాలని మంత్రివర్గ సంఘం స్పష్టం చేసింది. వస్తువు అసలు ధర ఎంత, దానిపై పడుతున్న పన్ను ఎంత, మొత్తం ధర ఎంత అనే విషయాలను వాణిజ్య సంస్థలు బిల్లుల్లో స్పష్టంగా ముద్రించాలనీ, వస్తువుపై ఉన్న ఎమ్మార్పీకన్నా మొత్తం ధర ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా ఉండటానికి వీల్లేదని పేర్కొంది. అలాగే పన్ను రిటర్నుల దాఖలులో జాప్యమైతే ప్రస్తుతం జరిమానాగా రోజుకు రూ.100 విధిస్తుండగా, దానిని రూ.50కి తగ్గించాలని సిఫారసు చేసింది. నవంబర్ 10న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి గువాహటిలో సమావేశం కానుంది. మంత్రివర్గం సిఫారసులను ఆ భేటీలో జీఎస్టీ మండలి పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. అమలును వికేంద్రీకరించండి: బిమల్ దేశంలో పేద, ధనిక రాష్ట్రాల ప్రాథమ్యాలు వేరుగా ఉంటాయనీ, కాబట్టి జీఎస్టీ అమలును వికేంద్రీకరించాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ బిమల్ జాలాన్ పేర్కొన్నారు. జీఎస్టీ సరిగ్గా అమలవ్వడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. జీఎస్టీ విధానంలో తక్కువ పన్ను వర్తించే వస్తువులను ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు తక్కువ ఆదాయం, ఎక్కువ పన్ను వర్తించే వస్తువులను ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం వస్తుందని బిమల్ చెప్పారు. -
జీఎస్టీ మినహాయింపు వాళ్లకు మాత్రమేనట!
న్యూఢిల్లీ : దేశమంతటినీ ఏకీకృత పన్ను వ్యవస్థలోకి తీసుకొస్తూ గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం ఆమోదించిన జీఎస్టీ బిల్లు మినహాయింపులను జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడానికి టర్నోవర్ పరిమితిని రూ.20లక్షలుగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అదేవిధంగా ఈశాన్య, కొండ ప్రాంతాల్లో ఈ మినహాయింపు లిమిట్ రూ.10 లక్షలని కౌన్సిల్ పేర్కొంది. జీఎస్టీ బిల్లు ఆమోదం తర్వాత తొలిసారిగా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల పాటు సమావేశమైంది. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మినహాయింపులపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించింది. ప్రామాణిక జీఎస్టీ రేటు, డ్రాప్ట్ నిబంధనలను తర్వాతి భేటీలో ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుందని ఆర్థికమంత్రి తెలిపారు. సెప్టెంబర్ 30న, అక్టోబర్ 17-19 తేదీల్లో ఈ కౌన్సిల్ మరోసారి సమావేశం కానుంది. అక్టోబర్ 17,18,19 తేదీల్లో జరిగే మీటింగ్‌లో జీఎస్టీ రేటును స్లాబ్స్‌ను నిర్ణయిస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. జీఎస్టీ రేటుపై కేంద్ర, రాష్ట్రాల అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఇక అన్ని సెసీలు జీఎస్టీ కిందకు వస్తాయని తెలిపారు. టర్నోవర్ పరిమితులతో పాటు మినహాయింపు ఐటమ్స్‌ను కూడా 300ల నుంచి 90కు తగ్గించింది. దీంతో జీఎస్టీ మినహాయింపులపై తెగ ఆశలు పెట్టుకున్న వారికి కొంత నిరాశే ఎదురైనట్టైంది.