
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుర్రపు పందాలపై జీఎస్‌టీ అంశం గురించి మాట్లాడుతున్నపుడు నిర్మలా సీతారామన్ పొరపాటున హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్‌టీ అన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో రెబల్ ఎమ్మెల్యేల రగడ, బేరసారాలు, రాజకీయ సంక్షోభం రగులుతున్న నేపథ్యంలో దీన్ని అవకాశంగా తీసుకున్న నెటిజన్లు ఒక రేంజ్‌లో విమర్శిస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పలువురురాజకీయనాయకులు, నెటిజన్లు ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ వ్యంగ్యంగా కమెంట్ చేస్తున్నారు. ఫ్రూడియన్ స్లిప్, మనసులో మాట అంటూ కొందరు విమర్శించారు. అంతేకాదు హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్‌టీ అనేదే నిజమైతే.. బీజేపీనే ఎక్కువ టాక్స్ కట్టాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అసలు సామాన్య ప్రజలు ఇక పన్నులు కట్టాల్సిన అవసరమే లేదంటూ పేర్కొంటున్నారు. ఈ కోవలో తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కూడా నిలిచారు. దీన్నే ఇంగ్లీషులో ఫ్రూడియన్ స్లిప్ అని హిందీలో మన్‌కీ బాత్ అంటారు అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా జీఎస్‌టీ కౌన్సిల్ ప్రెస్ మీట్ (జూన్ 29 బుధవారం) సందర్భంగా 'హార్స్ రేసింగ్'పై జీఎస్‌టీకి బదులుగా 'హార్స్-ట్రేడింగ్'పై జీఎస్‌టీ అన్నారు నిర్మలా సీతారామన్. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌పై జీఎస్‌టీ గురించి ఆమె మాట్లాడారు.
In English, this is called the Freudian slip of tongue
— KTR (@KTRTRS) June 30, 2022
In Hindi, it’s called “Mann Ki Baat” 😁#GSTonHorseTrading https://t.co/m2CGG23Sp0