న్యూఢిల్లీ: చేనేత వస్త్రాలపై పన్నులు పెంచే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. జీఎస్‌టీ పెంపు నిర్ణయం వెలువడినప్పటి నుంచి దేశం నలుమూలల విమర్శలు రావడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. దీంతో చేనేత వస్త్రాలపై జీఎస్‌టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే విషయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది.
వాయిదా
న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం 2021 డిసెంబరు 31 జరుగుతోంది. ఈ సమావేశంలో జీఎస్‌టీ కౌన్సిల్ సభ్యులందరూ టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ పెంచడం సరికాదంటూ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షలు జీఎస్‌టీ పెంపుపై విమర్శలు ఎక్కు పెట్టాయి. దీంతో టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ పెంపు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
On behalf of the #Telangana Govt, I hereby once again request Hon'ble Union Finance Minister & Head of GST Council Smt @nsitharaman Ji to immediately withdraw the plans of revising GST from 5 per cent to 12 per cent on Textiles and Handlooms sector from January 1, 2022
— KTR (@KTRTRS) December 30, 2021
1/n
Comments
Please login to add a commentAdd a comment