Textiles workers
-
మర్రిచెట్టు తండా అమెరికాకు అలంకరణ
జర్మనీ లేదా అమెరికాలో తయారైన కళాకృతులు, వస్త్రాలు మారుమూల మర్రిచెట్టు తండాలో కనిపించడం విశేషం కాకపోవచ్చు. అయితే మర్రిచెట్టు తండాలో తయారైన కళాకృతులు జర్మనీ, అమెరికాలాంటి ఎన్నో దేశాల్లో కనిపించడం కచ్చితంగా విశేషమే. ‘గిరిజన’ అనే మాటతో ప్రతిధ్వనించే శబ్దం... కళ. ఆ కళ ఆటలు, పాటలు, వస్త్రాలు, కళాకృతుల రూపంలో వారి దైనందిన జీవితంలో భాగం అయింది. ప్రపంచీకరణ ప్రభావంతో ‘అత్యాధునికత’ అనేది పురా సంస్కృతులు, కళలపై కత్తిలా వేలాడుతుంది. ఆ కత్తి వేటు పడకుండా తమ సంప్రదాయ కళలను రక్షించుకోవడమే కాదు... ‘ఇది మా కళ’ అని ప్రపంచానికి సగర్వంగా చాటుతుంది మర్రిచెట్టు తండా...నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని మరిచ్రెట్టు తండా... ఒక కేక వేస్తే తండా మొత్తం వినిపించేంత చిన్న తండా. వ్యవసాయపనులు, బయటి ఊళ్లల్లోకి వెళ్లి కూలిపనులు చేసుకునేవాళ్లే తండాలో ఎక్కువమంది ఉన్నారు.వ్యవసాయం అయినా, కూలిపనులు అయినా శ్రమతో కూడుకున్నవి. ఇంటికి వచ్చిన తరువాత తండాలోని మహిళలకు ఆ శ్రమభారాన్ని తగ్గించేవి కళలు. అందులో ప్రధానమైనవి చేతివృత్తుల కళలు. తాతముత్తాతల నుంచి పరంపరగా వస్తూ తమ చేతికి అందిన ఈ కళలు వారికి మానసిక ఆనందం ఇవ్వడమే కాదు నాలుగు డబ్బులు సంపాదించుకునేలా చేస్తున్నాయి.అద్దాలు, దారాలు, గజ్జెలు, పూసలు వంటి వాటిని ఉపయోగిస్తూ ఇంటికి అవసరమైన అలంకరణ వస్తువులను, గిరిజన సంప్రదాయ దుస్తులను రూపొందిస్తున్నారు. ఈ తండావాసుల హస్తకళలు నాబార్డ్ దృష్టిలో పడడంతో కొత్త ద్వారం తెరుచుకుంది. తండావాసులు తయారు చేసిన కళాకృతులు, దుస్తులను మార్కెటింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని నాబార్డ్ ముందుకు వచ్చింది. నాబార్డు నిర్వహించే ఎగ్జిబిషన్లలో మర్రిచెట్టు తండావాసుల స్టాల్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవాళ్లు.నాబార్డ్ చొరవతో తండాకు మాత్రమే పరిమితమైన కళాకృతులు లోకానికి పరిచయం అయ్యాయి. సంప్రదాయ గిరిజన దుస్తులు, వస్తువులను వ్యాపారులు కొనుగోలు చేసి రాజస్థాన్, హరియాణా, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మర్రిచెట్టు తండా మహిళలు తయారు చేస్తున్న పన్నెండు రకాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా పురుషులు అలంకరణగా ధరించే ‘విరేనాపాటో’కు మంచి ఆదరణ ఉంది.తమ కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా గొప్ప విజయం సాధిస్తే వారిని ఈ ‘విరేనాపాటో’తో సత్కరిస్తారు. దీంతోపాటు దర్వాజా తోరణం, చేతి సంచులు, కోత్లో (పైసలు దాచే సంచి), పులియాగాల (తలపై బుట్ట ధరించేది), గండో(మేరమ్మ అమ్మ వారి ప్రతీక), దాండియా డ్రెస్, కవ్య (పెళ్లయిన గిరిజన మహిళలు ధరించేవి), దడ్ప (ఫ్రిజ్ కవర్లు) మొదలైన వాటిని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.‘మేము తయారు చేస్తున్న వస్తువులతో రాబడి వస్తోందనే సంతోషం కంటే వాటి గురించి ఎక్కడెక్కడి వాళ్లో మెచ్చుకోవడం మరింత సంతోషంగా అనిపిస్తోంది. బట్టలు కూడుతున్నప్పుడో, బుట్టలు చేస్తున్నప్పుడో పని చేస్తున్నట్లుగా ఉండదు. హుషారుగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఏ పని లేనప్పుడు ఈ పనులు చేసేవాళ్లం. ఇప్పుడు ఈ పనే మాకు పెద్ద పని అయింది’ అంటుంది నేనావత్ చాంది.‘బయట ఊళ్లకు పోయినప్పుడు మాది మర్రిచెట్టు తండా అని గర్వంగా చెప్తా. పనుల కోసం తండా వదిలి ఎక్కడెక్కడికో వెళ్లిన వాళ్లు ఇక్కడే ఉండొచ్చు’ అంటూ ఉపాధి కోసం దూరప్రాంతాలకు వెళ్లిన వాళ్లను అమ్మలాంటి తండాకు తిరిగి రావాలని కోరుకుంటుంది బాణావత్ పద్మ. వారికోసం హస్తకళలు ఎదురుచూస్తున్నాయి.‘ఇప్పుడు మేము చేస్తున్నవే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి’ అంటుంది నేనావత్ సుబ్బులు. గిరిజన కళాకృతులలో ఎన్నో మరుగునపడిపోయాయి. వాటి గురించి తెలిసిన వారు ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారు. అలాంటి వారితో మాట్లాడితే తెరమరుగైపోయిన ఎన్నో కళాకృతులు మళ్లీ కొత్త కాంతులతో వెలుగుతాయి.నేనావత్ చాంది, నేనావత్ సుబ్బులు, బాణావత్ పద్మ... వీరు మాత్రమే కాదు మర్రిచెట్టు తండాలోని 150 మంది మహిళలు చేతివృత్తుల కళాకారులే కాదు చరిత్ర చెప్పే ఉపన్యాసకులు కూడా! ‘విరేనాపాటో’ నుంచి ‘గండో’ వరకు వాటి తయారీ గురించి మాత్రమే కాదు వాటి వెనుక చరిత్ర కూడా ఈతరానికి తెలియజేస్తున్నారు. ఇంతకంటే కావాల్సింది ఏముంది!– చింతకింది గణేశ్, సాక్షి, నల్లగొండ,కుటుంబానికి ఆసరాగా...తండాలో దాదాపు 150మందికి పైగా మహిళలం చేతి అల్లికల ద్వారా సంప్రదాయ వస్త్రాలు, వస్తువులను తయారు చేస్తున్నాం. ఏ కొంచెం తీరిక దొరికినా ఎవరి ఇండ్లలో వాళ్లం వీటిని తయారు చేస్తుంటాం. ఒక్కో వస్తువు తయారు చేసేందుకు వారం రోజులు పడుతుంది. వీటిని అమ్మగా వచ్చే డబ్బుతో కుటుంబానికి ఆసరాగా ఉంటుంది.– బాణావత్ పద్మవిదేశాల నుంచి వస్తున్నారుమేము తయారు చేసే అల్లికలను చూడడం కోసం మా తండాకు విదేశాల నుండి కూడా ఎంతో మంది వస్తున్నారు. ఇంటి దగ్గర ఉంటూ మా పనులు చేసుకుంటూనే సంప్రదాయ పద్ధతిలో చేతితో అల్లికలు అల్లుతున్నాం. తీజ్ వేడుకల్లో గిరిజనులు ధరించే విరేనాపాటోతో పాటు పులియాగాల(తలపై ధరించేది)వంటి అలంకరణ వస్త్రాలు తయారు చేస్తున్నాం.– నేనావత్ సుబ్బులుసబ్సిడీ ఇవ్వాలిసంప్రదాయ దుస్తులతో పాటు ఇంట్లోకి అవసరమయ్యే అలంకరణ వస్తువులను 30 ఏళ్లుగా తయారు చేస్తున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లినా తీరిక వేళల్లో వీటిని తయారు చేస్తాం. మేము తయారు చేసిన వాటిని కొనేందుకు పట్టణాల నుంచి చాలామంది వస్తుంటారు. కొనడమే కాదు వాటి గురించి అడిగి తెలుసుకుంటారు. అల్లికలకు ఉపయోగించే వస్తువులపై సబ్సిడీ ఇవ్వడంతోపాటు, పట్టణాల్లో స్టాళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ్రపోత్సహించాలి.– నేనావత్ చాంది -
ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ..!
మానవ పరిణామంలోని తొలి నాగరిక కళ చేనేత. నాగరికతల ప్రస్థానంలో ఇది పడుగు పేకల పోగుబంధం. ఇది తరతరాల చేనేత కళాకారుల రంగుల కళ. ఆచ్ఛాదనతో అందానికి మెరుగులు దిద్దే అరుదైన కళ. ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ. ఒంటికి హత్తుకుపోయే చేనేత వస్త్రాల సుతిమెత్తదనాన్ని ఆస్వాదించాలనుకోవడం ఒక రంగుల కల.నాగరికతకు తొలి గుర్తు వస్త్ర«ధారణ. వస్త్రాలను తయారు చేసే చేనేత తొలి నాగరిక కళ. చేనేత వెనుక సహస్రాబ్దాల చరిత్ర ఉంది. పత్తి నుంచి నూలు వడికి వస్త్రాలను నేయడం క్రీస్తుపూర్వం 3000 నాటికే విరివిగా ఉండేది. ఉన్ని కంటే పత్తితో వస్త్రాలు నేయడం సులువు కావడంతో వివిధ ప్రాచీన నాగరికతల ప్రజలు చేనేత వస్త్రాలవైపే మొగ్గు చూపేవారు. సింధులోయ నాగరికత వర్ధిల్లిన మొహెంజదారో శిథిలాల్లో ప్రాచీన చేనేతకు సంబంధించిన ఆనవాళ్లు, నాణ్యమైన నూలు దారపు పోగులు, అద్దకానికి ఉపయోగించే రంగుల అవశేషాలు ఉన్న కుండలు దొరికాయి.ఇవి మన దేశంలో చేనేత కళ ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత మరమగ్గాల వినియోగం పెరిగినప్పటి నుంచి చేనేత ప్రాభవం కొంత తగ్గుముఖం పట్టిందేగాని, అదృష్టవశాత్తు కొన్ని ఇతర ప్రాచీన కళల మాదిరిగా అంతరించిపోలేదు. చేనేతకు మన దేశంలో ఇప్పటికీ అద్భుతమైన ఆదరణ ఉంది. కొన్ని నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేతకు చిరునామాగా తమ ఉనికి చాటుకుంటున్నాయి. ప్రభుత్వాలు కూడా చేనేతను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీ కోసం...మన దేశంలో వారణాసి, చందేరి, జైపూర్, సూరత్, పానిపట్, లక్నో, భదోహీ, అల్మోరా, బాగేశ్వర్, కోటా, మహేశ్వర్, చెన్నై, కంచి, కన్నూర్, కాసర్గోడ్, మైసూరు, మంగళూరు, భాగల్పూర్, బంకా, ముర్షిదాబాద్, బిష్ణుపూర్, ధనియాఖలి, సంబల్పూర్, బరంపురం వంటి ఎన్నో నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేత కళను, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. తమ ప్రత్యేకతను చెక్కుచెదరకుండా నిలుపుకుంటూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2019–20లో విడుదల చేసిన లెక్కల ప్రకారం మన దేశవ్యాప్తంగా 35.22 లక్షల మంది చేనేత కార్మికులు పూర్తిగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. చేనేత రంగంపై ఆధారపడి పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారిని కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 43 లక్షలకు పైగానే ఉంటుంది. చేనేత రంగంలో నేత, అద్దకం, నేతకు సంబంధించిన ఇతర పనులను చేసే ఈ కార్మికుల్లో దాదాపు 70 శాతం మహిళలే! దేశవ్యాప్తంగా దాదాపు 16 వేల చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేరవేయగలగడమే కాకుండా, తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతున్నారు.ఫ్యాషన్లలోనూ చేనేత ముద్ర..యంత్రాల ద్వారా తయారయ్యే వస్త్రాల్లోని యాంత్రికతకు భిన్నంగా ఉండటమే చేనేత వస్త్రాల ప్రత్యేకత. అందుకే, ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా, చేనేత వస్త్రాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటూనే వస్తున్నాయి. చేనేత కార్మికుల కళానైపుణ్యం, ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కే వారి సృజనాత్మకత కారణంగా కూడా ఆధునిక ఫ్యాషన్ల పోటీని చేనేత వస్త్రాలు సమర్థంగా తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. రంగులు, డిజైన్లు, అద్దకం పద్ధతుల్లో చేనేత కార్మికులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మన దేశంలో తయారయ్యే చేనేత చీరలు, పంచెలు, తువ్వాళ్లు, దుప్పట్లు, ఇతర వస్త్రాలకు విదేశాల్లో కూడా బాగా గిరాకీ ఉంది.మన దేశం నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లండ్స్, గ్రీస్, పోర్చుగల్, స్వీడన్, యూఏఈ, మలేసియా, ఇండోనేసియా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ఇరవైకి పైగా దేశాలకు చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మన దేశం నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్ డాలర్లు (రూ. 93,931 కోట్లు) విలువ చేసే చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల కంటే 6.71 శాతం ఎక్కువ. ఆధునిక ఫ్యాషన్ల హవాలోనూ చేనేత వస్త్రాలకు ఆదరణ ఏమాత్రం తగ్గకపోగా, పెరుగుతూ వస్తోందనడానికి ఈ లెక్కలే నిదర్శనం.తెలుగు రాష్ట్రాల్లో చేనేత చిరునామాలు..మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేనేతకు చిరునామాలైన ఊళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పొందూరు మొదలుకొని వెంకటగిరి వరకు, తెలంగాణలో పోచంపల్లి మొదలుకొని గద్వాల వరకు చేనేత కళలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఊళ్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు పట్టణం ఖద్దరు చేనేతకు చిరకాలంగా ప్రసిద్ధి పొందింది. పొందూరు ఖద్దరు హోదాకు చిహ్నంగా గుర్తింపు పొందింది. పొందూరు ఖద్దరు పంచెలను అమితంగా ఇష్టపడేవారిలో మహాత్మాగాంధీ సహా ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు, అక్కినేని నాగేశ్వరరావు వంటి సినీ ప్రముఖులు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు ఎందరో ఉన్నారు. పొందూరు ఖద్దరు నాణ్యత చూసి ముచ్చటపడిన గాంధీజీ, ఆ నేత మెలకువలను నేర్చుకునేందుకు తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పొందూరు చేనేత కళాకారులు బల్ల భద్రయ్య, జల్లేపల్లి కాంతమ్మ గత ఏడాది ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.కాకినాడ జిల్లా ఉప్పాడ చేనేత కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని ఉప్పాడ పరిసరాలకు చెందిన ఎనిమిది గ్రామాల్లోని చేనేత కార్మికులు సంప్రదాయ జాంధానీ చీరల నేతలో అత్యంత నిష్ణాతులు. ఈ గ్రామాల్లో తయారయ్యే చీరలు ఉప్పాడ జాంధానీ చీరలుగా ప్రసిద్ధి పొందాయి. బంగారు, వెండి జరీ అంచులతో రూపొందించే ఉప్పాడ జాంధానీ చీరలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించింది. కర్నూలు జిల్లా కోడుమూరు చేనేత కార్మికులు గద్వాల చీరల నేతకు ప్రసిద్ధి పొందారు. ఇదే జిల్లా ఆదోనిలో చేనేత కార్పెట్లు, యోగా మ్యాట్లు వంటివి తయారు చేస్తున్నారు.అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు ప్రాచీన కాలంలోనే అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన ఘనత సాధించారు. ఇక్కడి చీరలకు కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) దక్కింది. బంగారు తాపడం చేసిన జరీతో రూపొందించిన ధర్మవరం చీరలకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో శరవేగంగా వస్తున్న మార్పులకు దీటుగా ఇక్కడి చేనేత కళాకారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తూ, తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్నారు. తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి పొందింది. ఇక్కడి ఇక్కత్ చీరలు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగేటే మెక్రాన్‌కు పోచంపల్లి ఇక్కత్ చీరను ప్రత్యేకంగా బహూకరించారు. పోచంపల్లిలో తయారయ్యే పట్టు, నూలు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, దుప్పట్లు, రజాయిలు, స్టోల్స్ స్కార్వ్స్, కర్టెన్లు వంటి వాటికి సూడాన్, ఈజిప్ట్, ఇండోనేసియా, యూఏఈ వంటి దేశాల్లో మంచి గిరాకీ ఉంది. పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు రాపోలు రామలింగం 2015లో జాతీయ చేనేత దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడకు వచ్చినప్పుడు పోచంపల్లి చేనేత కళాకారులు భోగ బాలయ్య, సరస్వతి దంపతులు తాము స్వయంగా నేసిన భారత చిత్రపటం గల వస్త్రాన్ని బహూకరించారు.నల్లగొండ జిల్లా పుట్టపాక గ్రామం తేలియా రుమాల్ వస్త్రాల తయారీకి ప్రసిద్ధి పొందింది. నేతకు ముందుగా దారాన్ని నువ్వుల నూనెలో నానబెట్టి తయారు చేసే ఈ వస్త్రాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు కూడా లభించింది. పుట్టపాక గ్రామం తేలియా రుమాల్ వస్త్రాలతో పాటు దుపియన్ చీరలకు కూడా అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది. పుట్టపాక వస్త్రాలు ఎందరో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల మనసు దోచుకున్నాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వంటివారు పుట్టపాక వస్త్రాలకు ఫిదా అయిన వారే! ఇక్కడి తేలియా రుమాల్ వస్త్రాలు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, లండన్ మ్యూజియంలోనూ చోటు సంపాదించుకోవడం విశేషం. పుట్టపాక చేనేత కళాకారులు గజం గోవర్ధన్, గజం అంజయ్య ‘పద్మశ్రీ’ అవార్డు పొందారు. ఇక్కడకు సమీపంలోని ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశం ఆసు యంత్రం తయారీకి గుర్తింపుగా ‘పద్మశ్రీ’ పొందారు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు చేనేత కళాకారులు ‘పద్మశ్రీ’ అవార్డు పొందడం దేశంలోనే అరుదైన విశేషం.మన దేశంలో 5000 ఏళ్ల చరిత్ర!మన దేశంలో చేనేతకు ఐదువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. సింధులోయ నాగరికత కాలం నుంచి ఇక్కడి జనాలు వస్త్రాలను నేసేవారు. ప్రాచీన భారత దేశంలో ప్రతి గ్రామంలోనూ చేనేతకారుల కుటుంబం కనీసం ఒక్కటైనా ఉండేది. పదహారో శతాబ్ది నాటికి చేనేత ఉత్కృష్టమైన కళ స్థాయికి ఎదిగింది. మంచి నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులకు రాజాదరణ ఉండేది. ఎందరో రాజులు తమ విజయగాథల చిత్రాలను చేనేత వస్త్రాలపై ప్రత్యేకంగా నేయించుకునేవారు. మొగల్ పరిపాలన కొనసాగినంత కాలం మన దేశంలో చేనేతకు అద్భుతమైన ఆదరణ ఉండేది.బ్రిటిష్ హయాంలో మరమగ్గాలు ప్రవేశించడంతో చేనేతకు గడ్డురోజులు మొదలయ్యాయి. బ్రిటిష్‌వారు ఇక్కడి నుంచి నూలును ఇంగ్లండ్‌కు తరలించి, అక్కడి మిల్లుల్లో తయారయ్యే వస్త్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అమ్మేవారు. ఈ పరిస్థితి కారణంగానే ఖద్దరు ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మారాయి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ‘స్వదేశీ ఉద్యమం’ 1905 ఆగస్టు 7న కలకత్తాలో మొదలైంది. స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఆగస్టు 7ను కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. స్వదేశీ ఉద్యమంలో భాగంగా అప్పట్లో మహాత్మాగాంధీ స్వయంగా రాట్నం నుంచి నూలు వడికేవారు.అప్పట్లో ఊరూరా ఎంతోమంది స్వాతంత్య్ర సమర యోధులు గాంధీజీ పంథాలోనే రాట్నంపై నూలు వడికి, ఆ నూలుతో నేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. బ్రిటిష్ పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమ తిరిగి పుంజుకోవడం ప్రారంభమైంది. సంప్రదాయ కుటీర పరిశ్రమగా చేనేత పరిశ్రమ ఈనాటికీ కొనసాగుతోంది. వస్త్రధారణలో వస్తున్న మార్పులను, జనాల అభిరుచుల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, తనను తాను నవీకరించుకుంటూ చేనేత పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.దేశవ్యాప్తంగా ఉన్న 16 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), 28 చేనేతకారుల సేవా కేంద్రాలు ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటాయి. పలుచోట్ల చేనేత వస్త్రాల ప్రదర్శనలను నిర్వహిస్తాయి.చేనేతలో మన ఘనత..– చేనేత చీరలు కేవలం చీరలు మాత్రమే కాదు, ఏ చీరకు ఆ చీరను ఒక కళాఖండంగా పరిగణిస్తారు ఫ్యాషన్ నిపుణులు. అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు తమ సేకరణలో భారత్ చేనేత చీరలను తప్పకుండా చేర్చుకోవడమే మన చేనేత ఘనతకు నిదర్శనం.– ప్రపంచవ్యాప్తంగా వినిగించే చేనేత వస్త్రాల్లో మన దేశంలో తయారైనవి 95 శాతం వరకు ఉంటాయి. చేనేతలో ఇప్పటికీ మనది తిరుగులేని స్థానం.– చేనేత వస్త్రాల తయారీలో బెనారస్ మొదలుకొని కంచి వరకు ఏ ప్రాంతానికి చెందిన వైవిధ్యం ఆ ప్రాంతానికే సొంతం. చేనేత కళలోని ఈ వైవిధ్యం కారణంగానే వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపును సాధించగలిగాయి.– చేనేత పరిశ్రమ మన దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. వస్త్రాల రూపకల్పన శైలిలో సంప్రదాయ పరంపర, ప్రాంతీయ వైవిధ్యం, సృజనాత్మకత, అసాధారణ నైపుణ్యం ఫలితంగా మన చేనేత కళాకారులు అంతర్జాతీయంగా కూడా మన్ననలు పొందగలుగుతున్నారు.– భారత గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తున్నది చేనేత రంగమే!– మన దేశం నలుమూలలకు చెందిన 65 చేనేత ఉత్పత్తులకు, ఆరు ఉత్పత్తి చిహ్నాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ఉంది. ఇన్ని ఉత్పత్తులకు జీఐ లభించడం చేనేత పరిశ్రమ వైవిధ్యానికి నిదర్శనం. -
టెక్స్టైల్స్ టెక్నాలజీతో మంచి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగం జౌళి పరిశ్రమ. జౌళి రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ వేగంగా పురోగమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔళి పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నప్పటికీ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా జౌళి మిల్లులు ఉన్నాయి. వీటికి ఏటా వందలాది మంది నిపుణులు అవసరం. అయినా ఏడాదికి 50 మంది కూడా దొరక ట్లేదు. భవిష్యత్తులో జౌళి రంగంలో విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, ఎగుమతుల విభాగాల్లో అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని గవర్న మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ సంస్థ జౌళి రంగ నిపుణులను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సు టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సులు చదివిన వారికి మంచి జీతభత్యాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాధారణ డిప్లొమా కోర్సు మూడేళ్లు ఉంటే.. టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సు మాత్రం మూడున్నరేళ్లు ఉంటుంది. ఈ కోర్సు అభ్యసించిన వారికి స్పిన్నింగ్, వీవింగ్, కెమికల్ ప్రాసెసింగ్, టెస్టింగ్, ఆధునిక టెక్నికల్ టెక్స్టైల్, అపారల్ మాన్యుఫాక్చరింగ్ వంటి విభాగాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కోర్సు పూర్తి చేసిన వెంటనే స్థానికంగా ప్రారంభ వేతనం కనీసం రూ.20 వేలు ఉంటుంది. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం సైతం ఇండస్ట్రీ కనెక్ట్ విధానాన్ని అమలు చేస్తూ సిలబస్‌ను ఆధునీకరించింది.ఇందులో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక పారిశ్రామిక శిక్షణనిస్తూ నెలకు రూ.7 వేల వరకు స్టైపెండ్ ఇస్తోంది. ‘పూర్వ విద్యార్థుల ద్వారా ప్రేరణ సదస్సులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కి సగటున మూడు సంస్థల్లో రూ.20 వేలకు పైగా జీతభత్యాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. 8 నుంచి 10 ఏళ్ల అనుభవంతో కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు’ అని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ శాఖాధిపతి కె.మహమ్మద్ తెలిపారు. గుంటూరులోని టెక్స్టైల్స్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని ప్రముఖ పరిశ్రమల్లో సుమారు రూ.3 లక్షల జీతంతో జనరల్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, మిల్ మేనేజర్, గ్రూప్ మేనేజర్ హోదాల్లో రాణిస్తుండటం విశేషం. ఇది మంచి అవకాశం గుంటూరులో 1986లో స్థాపించిన ఈ కాలేజీ 1997కి స్వయం ప్రతిపత్తి సాధించింది. 2023 పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరొచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చేసి ప్రముఖ విద్యా సంస్థల్లోనూ అధ్యాపకులుగా, పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా రాణించవచ్చు. ఇందులో అత్యధిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అవగాహన లేమితో విద్యార్థులు నష్టపోతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన, ప్రాక్టికల్స్, ఇండ్రస్టియల్ ట్రైనింగ్, పరిశ్రమ ప్రముఖుల ద్వారా సెమినార్స్ ద్వారా సమగ్ర శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలు, వివరాలకు 9848372886, 8500724006 నంబర్లను సంప్రదించవచ్చు. – కేవీ రమణ బాబు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ, గుంటూరు -
టెక్స్‌టైల్స్‌లో రూ.19,000 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద.. 61 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి రూపంలో రూ.19,077 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు ప్రకటించింది. ఫలితంగా రూ.1,84,917 కోట్ల టర్నోవర్ నమోదు అవుతుందని.. 2.40 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. పీఎల్ఐ కింద మొత్తం 67 ప్రతిపాదనలు అందాయని టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ వెల్లడించారు. గిన్ని ఫిలమెంట్స్, కింబర్లీ క్లార్క్, అరవింద్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఆమోదం పొందిన వాటిల్లో ఉన్నాయి. పీఎల్ఐ పథకం కింద ఎంఎంఎఫ్ (మానవ తయారీ) వస్త్రాలు, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తులు తదితర వాటి తయారీపై ఐదేళ్ల కాలంలో రూ.10,683 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. దేశీయంగా టెక్స్టైల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎగుమతులను మరింత విస్తరించుకోవడం ఈ పథకం లక్ష్యాలుగా ఉన్నాయి. పార్ట్–2 కింద ఎక్కువ దరఖాస్తులు మొత్తం 67 దరఖాస్తుల్లో పార్ట్1 కింద 15 రాగా, పార్ట్2 కింద 52 వచ్చాయి. పార్ట్1 కింద కనీసం రూ.300 కోట్లను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పీఎల్ఐ కింద ప్రోత్సాహకాలు పొందాలంటే రూ.600 కోట్ల టర్నోవర్ నమోదు చేయాలి. పార్ట్2 కింద కనీస పెట్టుబడి పరిమితి రూ.100 కోట్లు. కనీసం రూ.200 కోట్ల టర్నోవర్ నమోదు చేస్తే ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. గిన్ని ఫిలమెంట్స్, అవ్‌గోల్ ఇండియా, గోవా గ్లాస్ ఫైబర్, హెచ్‌పీ కాటన్ టెక్స్టైల్స్ మిల్స్, కింబర్లీ క్లార్క్ ఇండియా, మధుర ఇండస్ట్రియల్ టెక్స్టైల్స్, ఎంసీపీఐ ప్రైవేటు లిమిటెడ్, ప్రతిభ సింటెక్స్, షాహి ఎక్స్‌పోర్ట్స్, ట్రిడెంట్, డోనియర్ ఇండస్ట్రీస్, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, అరవింద్ లిమిటెడ్ ఉన్నాయి. ఇందులో అరవింద్ లిమిటెడ్ రూ.170 కోట్లు, గిన్ని ఫిలమెంట్స్ రూ.180 కోట్లు, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ రూ.143 కోట్లు, కింబర్లీ క్లార్క్ ఇండియా రూ.308 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఆమోదం పొందిన 61 ప్రతిపాదనల్లో ఏడు విదేశీ కంపెనీలకు సంబంధించి ఉన్నాయి. మరిన్ని ఎగుమతులు.. అంతర్జాతీయంగా మానవ తయారీ ఫైబర్, టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో భారత వాటా పెరిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని యూపీ సింగ్ తెలిపారు. టెక్నికల్ టెక్స్టైల్స్ ఎగుమతులను 2 బిలియన్ డాలర్ల నుంచి 8–10 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్‌టెల్స్ పార్క్స్ (మిత్రా) పథకం గురించి సింగ్ మాట్లాడుతూ.. 13 రాష్ట్రాల నుంచి 17 ప్రతిపాదనలు వచ్చినట్టు చెప్పారు. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి నాలుగు, కర్ణాటక నుంచి రెండు ఉన్నట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పథకం కింద ఏడు పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వీటి కోసం రాష్ట్రాల ఎంపికకు ప్రత్యేక విధానాన్ని అనుసరించనున్నట్టు చెప్పారు. -
చేనేతకు ఊరట.. జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా
న్యూఢిల్లీ: చేనేత వస్త్రాలపై పన్నులు పెంచే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. జీఎస్టీ పెంపు నిర్ణయం వెలువడినప్పటి నుంచి దేశం నలుమూలల విమర్శలు రావడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. దీంతో చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే విషయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. వాయిదా న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 2021 డిసెంబరు 31 జరుగుతోంది. ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సభ్యులందరూ టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ పెంచడం సరికాదంటూ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షలు జీఎస్టీ పెంపుపై విమర్శలు ఎక్కు పెట్టాయి. దీంతో టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. On behalf of the #Telangana Govt, I hereby once again request Hon'ble Union Finance Minister & Head of GST Council Smt @nsitharaman Ji to immediately withdraw the plans of revising GST from 5 per cent to 12 per cent on Textiles and Handlooms sector from January 1, 2022 1/n — KTR (@KTRTRS) December 30, 2021 -
వస్త్రాల్లో ఆర్గానిక్ ట్రెండ్
సాక్షి, అమరావతి: ఆర్గానిక్ అనగానే వంటలకు సంబంధించిన వస్తువులే గుర్తుకువస్తాయి. కానీ దుస్తుల్లోనూ ఇప్పుడు ఆర్గానిక్ ట్రెండ్ వచ్చేసింది. ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా సాగు చేసిన పత్తిని సేకరించి.. దానినుంచి నూలు ఒడుకుతున్నారు. ఆ నూలుకు సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను అద్ది ఆర్గానిక్ వస్త్రాలను నేస్తున్నారు. చేనేత వస్త్రాల్లో ఇప్పుడిదే కొత్త ట్రెండ్. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా ఇసుకపల్లి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట తదితర ప్రాంతాల్లో నేతన్నలు ఆర్గానిక్ వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లోనూ ఆర్గానిక్ వస్త్రాల ఉత్పత్తికి ఊతమిచ్చేలా ఆప్కో చర్యలు చేపడుతోంది. రంగులు అద్దుతారిలా... ► చెట్ల బెరడు, పూలు, పండ్లు, కాయలు, ఆకులను సేకరించి.. నీటిలో ఉడికించి సహజసిద్ధ రంగుల్ని తయారు చేస్తున్నారు. ► ఆయా రంగుల్లో ముంచి ఆరబెట్టిన ఆర్గానిక్ నూలు(యార్న్)తో మగ్గంపై కలర్ ఫుల్ బట్టలను నేస్తున్నారు. ► దానిమ్మ కాయ బెరడుతో పసుపు, ముదురు ఆకుపచ్చ రంగులు, కరక్కాయ, జాజి, అల్జీరిన్‌తో ఎరుపు, కరక్కాయ, కరక పువ్వుతో బంగారు పసుపు (గోల్డెన్ ఎల్లో), మోదుగ పూలతో ముదురు పసుపు రంగుల్ని తయారు చేస్తున్నారు. చామంతి పువ్వులతో లేత పసుపు రంగు (లెమన్ ఎల్లో), ఇండిగో ఆకుల నుంచి నీలం రంగు, ఉల్లి పైపొరతో లేత గులాబీ, పాలకూర ఆకుల నుంచి లేత ఆకుపచ్చ, నల్ల బెల్లం, నీరు, కాల్చిన ఇనుము కలిపిన మిశ్రమం నుంచి నలుపు రంగుల్ని తీస్తున్నారు. ► వీటిని తుమ్మ జిగురుతో కలిపి బట్టలకు రంగులు బాగా పట్టేలా చేస్తున్నారు. ఈ వస్త్రాల తయారీకి ఖర్చు ఎక్కువే అయినా.. క్రేజ్ పెరుగుతోంది. ప్రయోజనాలివీ.. ► ఆర్గానిక్ వస్త్రాల వినియోగంతో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. ► ఆర్గానిక్ వస్త్రాల్లో రసాయనాలు లేవు కాబట్టి చర్మ సంబంధ వ్యాధులు, రసాయనాలు పీలిస్తే వచ్చే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు. -
చిక్కిపోతున్న చేనేత
-
అరవింద్ లాభం రూ.67 కోట్లు
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ దిగ్గజం అరవింద్ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.115 కోట్ల నికర లాభం వచ్చిందని అరవింద్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,863 కోట్ల నుంచి రూ.1,879 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అరవింద్ కంపెనీ నుంచి బ్రాండెడ్ దుస్తుల వ్యాపార విభాగాన్ని అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ పేరుతో గత ఏడాది నవంబర్‌లో విడదీశామని (డీమెర్జ్), అందుకని అప్పటి, ఇప్పటి ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని కంపెనీ వివరించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 7–8 శాతం వృద్ధిచెందగలదన్న అంచనాలున్నాయని కంపెనీ పేర్కొంది. కంపెనీ డైరెక్టర్, గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జయేశ్ కె. షాను నియమించామని, ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని తెలిపింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీ)ల జారీ ద్వారా రూ.300 కోట్లు సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అర్వింద్ షేర్ 2.6 శాతం లాభంతో రూ.74 వద్ద ముగిసింది. -
రుణమాఫీపై చేనేతల ఆశలు
మాఫీ అమలైతే 5,600 మంది కార్మికులకు లబ్ధి సాక్షి, అనంతపురం : టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న రుణమాఫీ హామీపై చేనేత కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. ఆదివారం గుంటూరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలతో పాటు చేనేతల రుణ మాఫీ ఫైలుపైనా సంతకం చేస్తారని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 2012 నుంచి 2014 వరకు 5,600 మంది చేనేత కార్మికులకు సంబంధించి రూ.35 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. రైతు రుణాలపైనే ఇప్పటి వరకు సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో చేనేతల రుణమాఫీ ఏ మేరకు అమలవుతుందన్న దానిపై ఇటు చేనేతలు, అటు బ్యాంకు అధికారుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. పూర్తి స్థాయి రుణాలు రద్దు చేస్తారా? లేక నిర్ణీత కాలవ్యవధిలో తీసుకున్న చేనేత రుణాలు రద్దవుతాయా? సొసైటీల ద్వారా తీసుకున్న రుణాలు రద్దుచేస్తారా? లేక వ్యక్తిగత రుణాలు మాత్రమే రద్దు చేస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. రుణమాఫీ అమలైతే జిల్లాలోని 5,600 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. అప్పుల ఊబిలో చేనేత కార్మికులు జిల్లాలో వ్యవసాయం తరువాత చేనేత అతిపెద్ద రంగం. పట్టు చీరలకు ధర్మవరం పెట్టింది పేరు. ప్రస్తుతం ధర్మవరంలో 18 వేల మగ్గాలు ఉన్నాయి. హిందూపురం (ముదిరెడ్డిపల్లి), సోమందేపల్లి, ఉరవకొండ, యాడికి, రాప్తాడు, సీకేపల్లి ప్రాంతాల్లోనూ పది వేల మగ్గాలు ఉన్నాయి. 11 రకాల చేనేత రిజర్వేషన్లను తుంగలో తొక్కిన పవర్‌లూమ్స్ యజమానులు వాటిని మరమగ్గాలపై తయారు చేసి.. తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దీంతో మగ్గంపై నేసిన పట్టుచీరలకు డిమాండ్ తగ్గుతూ వచ్చింది. పట్టుచీరల తయారీకి అవసరమై వార్పు, సప్పూరి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. రెండేళ్ల క్రితం కిలో వార్పు రూ.2 వేలు ఉండగా ప్రస్తుతం రూ.3,600 చేరుకుంది. సప్పూరి రూ.2,100 నుంచి రూ.3,500కు చేరుకుంది. ఒక పట్టుచీర చేనేత మగ్గంపై నేయాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది. ఒక చీర తయారీకి కూలి రూ.450 నుంచి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్లలో ముడిపట్టు, కూలి ధరలు పెరిగినా మార్కెట్లో పట్టుచీరల ధరలు మాత్రం పెరగలేదు. దీంతో చేనేతలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక వందలాది మంది చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. చాలా మంది చీరలు నేయడానికి పెట్టుబడుల కోసం వివిధ వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈక్రమంలో రుణాలు రెండేళ్ల కాలానికి పెరిగి పెరిగి రూ.35 కోట్లకు చేరుకున్నాయి. -
బతికేది ఎలా?
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రెండు నెలలుగా పింఛన్లు అందకపోవడంతో ఎలా బతకాలో అర్థంకాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. పంపిణీ ప్రక్రియలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తా జాగా సంస్కరణలను తెరపైకి తెచ్చారు. కాని లబ్ధిదారుల ఇబ్బందులను ప రిగణలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాలో 2,62,023 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు 1,24,670 మంది, వికలాంగులు 30,909 మంది, వితంతువులు 90,042 మంది, చేనేత కార్మికులు 4,843 మంది, కల్లుగీత కార్మికులు 676 మంది, అభయహస్తం కింద 10,876 మంది లబ్ధిదారులు నెలనెలా పింఛన్ పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు రూ.200, వికలాంగులు, అభయహస్తం లబ్ధిదారులకు రూ.500 చొప్పున పింఛన్ మంజూరవుతోంది. వీరికి ప్రభుత్వం రూ.5 కోట్ల 65 లక్షల మొత్తాన్ని నెలనెలా మంజూరు చేస్తోంది. ఫినో సంస్థ అక్రమాల వల్లే.. పింఛన్ల పంపిణీ గతంలో ఫినో సంస్థ చేపట్టింది. ఈ సంస్థ చేపట్టిన పింఛన్ల పంపిణీలో చాలా వరకు అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తాజాగా ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. బయోమెట్రిక్ విధానం వల్ల అక్రమాలకు చెక్ పెట్టొచ్చన్న ఆలోచనతో ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి వేలిముద్రల సేకరణ ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియ జాప్యం జరగడంతో జిల్లాలో దాదాపు 55,917 మందికి పింఛన్లు ఆగిపోయాయి. వచ్చే అరకొర పింఛన్లపై రకరకాల ఆంక్షలు పెట్టడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు పింఛన్ల విడుదలలో జాప్యం జరిగింది. గత రెండు నెలలుగా ఎన్నికల నేపథ్యంలో అధికారులు బిజీ కావడం, గవర్నర్‌పాలన కొనసాగడంతో నిధుల విడుదలలో సమస్యలు తలెత్తాయి. బయోమెట్రిక్‌పై అవగాహన ఏదీ? గ్రామాల్లో చాలా మందికి బయోమెట్రిక్ పద్ధతిపై అవగాహన లేకపోవడంతో ఈ ప్రక్రియలో వేలాది మంది పాల్గొనలేదు. గ్రామాల్లో ఇంట్రాక్ట్ సంస్థ ద్వారా, మున్సిపాల్టీ, కార్పొరేషన్లలో మణిపాల్ ఏజెన్సీ ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. జిల్లాలోని 46 మండలాల్లో మొత్తం 33,881 మంది బయోమెట్రిక్ ప్రక్రియలో పాల్గొనలేదు. నెల్లూరు నగరంలో దాదాపు 22,036 మంది అంటే మొత్తం పింఛన్‌దారులు బయోమెట్రిక్ విధానంలో పాల్గొనలేదు. దీంతో వీరికి పింఛన్ల పం పిణీ నిలిచిపోయింది. 4వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ జిల్లాలో వేలాది మంది స్మార్ట్ కార్డు ఎన్రోల్మెంట్ ప్రక్రియలో పాల్గొనలేదు. దీనివల్ల పింఛన్లు నిలిచిపోయాయి. గ్రామాల్లో ఇంట్రాక్ట్ సంస్థ, మున్సిపాల్టీ, కార్పొరేషన్లలో మణిపాల్ ఏజెన్సీ ద్వారా వేలిముద్రలు సేకరణ చేపట్టనున్నాం. ఇందుకోసం నెల్లూరులో 39 కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఈ నెల 15లోగా వేలిముద్రల సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించాం. చంద్రమౌళి, డీఆర్డీఏ పీడీ -
పురం.. ఎవరి పరం ?
ఒకప్పుడు పరిశ్రమల ఖిల్లాగా, వాణిజ్య కేంద్రంగా భాసిల్లిన హిందూపురం లోక్‌సభ స్థానం ఇప్పుడు బోసిపోయింది. పునర్వైభవం సాధించేందుకు సమర్థవంతమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. ఇది రాజకీయ ముఖచిత్రంలోనూ సమూల మార్పులు సూచిస్తోంది. సాగునీరు అందించి బంజరు భూములను మాగాణులు చేసే... పరిశ్రమలు స్థాపించి చేతినిండా పని కల్పించే నేతకే పట్టం కడతామని ఇక్కడి ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి - అనంతపురం: హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో సిటింగ్ ఎంపీ, టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పవర్‌లూమ్స్ యజమానులకు దన్నుగా నిలిచి సొంత సామాజిక వర్గమైన చేనేతల పొట్టకొట్టిన నిమ్మలపై ప్రజావ్యతిరేకత కన్పిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్ బాటలు వేయడం, ముస్లింలు, చేనేత, ఇతర సామాజిక వర్గాల ప్రజలు బాసటగా నిలుస్తోండటంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి రేసులో ముందున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అవడంతో ఆ పార్టీ అభ్యర్థి చిన్న వెంకటరాముడు కనీస ప్రభావం కూడా చూపే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్థానం నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య నెలకొంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ కొనసాగింది. పీఆర్పీ అభ్యర్థి కడపల శ్రీకాంత్‌రెడ్డి లక్షకుపైగా ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఖాసీంఖాన్పై టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 22,835 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కడపల శ్రీకాంత్‌రెడ్డి బరిలో లేకుండా ఉంటే నిమ్మల కిష్టప్ప గెలుపొందే వారు కాదని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో అభిప్రాయపడ్డారు. నిమ్మలపై ప్రజావ్యతిరేకత సిటింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పను టీడీపీ మరోసారి బరిలోకి దింపింది. ఐదేళ్లలో ఎంపీగా ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలనూ చేపట్టలేకపోయారు. కదిరి-పుట్టపర్తి, పుట్టపర్తి-చిక్‌బళ్లాపూర్ రైలుమార్గాలను సాధిస్తానని చెప్పి.. చివరకు చేతులెత్తేశారు. హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నహామీని నెరవేర్చలేదు. ఎంపీ ల్యాడ్స్ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. హిందూపురం మండలం ముద్దిరెడ్డిపల్లిలో బినామీ పేర్లతో పవర్‌లూమ్స్ నిర్వహిస్తున్నారని చేనేత వర్గం నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ధర్మవరం, సోమందేపల్లి, హిందూపురం పరిసర ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. ఐదేళ్లలో హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని 58 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క కుటుంబాన్నీ నిమ్మల పరామర్శించిన దాఖాలాలు లేవు. దీంతో సొంత సామాజికవర్గంలోనే ఆయన పట్ల సానుకూలత లేదు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థులు కూడా నిమ్మల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. చివరకు హిందూపురం నుంచి పోటీచేస్తోన్న నందమూర్తి బాలకృష్ణ కూడా వ్యతిరేకిస్తోండటం గమనార్హం. అన్ని వర్గాలూ వైఎస్సార్ సీపీ వైపే లోక్‌సభ స్థానం పరిధిలో కురుబ, బోయ, చేనేత సామాజిక వర్గాల ప్రజలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు గెలుపోటములను నిర్దేశిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కురుబలకు చోటిస్తామని, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బోయలకు కేటాయిస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వడంతో ఆ రెండు సామాజిక వర్గాలూ పార్టీకి దన్నుగా నిలుస్తున్నాయి. చేనేత సంక్షేమం కోసం వైఎస్ అమలు చేసిన పథకాలను కొనసాగిస్తానని వైఎస్ జగన్ ప్రకటించడం ఆ వర్గాలను పార్టీకి చేరువ చేసింది. ముస్లిం మైనార్టీలు ఇప్పటికే వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారు. వారు టీడీపీ-బీజేపీ పొత్తుపై మండిపడుతున్నారు. నియోజకవర్గాన్ని వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో యువ పారిశ్రామికవేత్త దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డిని వైఎస్సార్ సీపీ బరిలోకి దించింది. ఐదేళ్లలో లక్ష మందికి తగ్గకుండా ఉపాధి కల్పించకపోతే.. 2019 ఎన్నికల్లో పోటీచేయనని శ్రీధర్‌రెడ్డి చేస్తోన్న వాగ్దానంపై జనం సానుకూలంగా స్పందిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేనేతలకు అందుబాటులో తేవడం ద్వారా చేనేతలను ఆదుకుంటానన్న హామీపై కూడా సానుకూలత వ్యక్తమవుతోంది. హంద్రీ-నీవా రెండో దశను పూర్తిచేసి.. 2.34 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని, చెరువులను నింపి సేద్యానికి ఊపిరిపోస్తానని శ్రీధర్‌రెడ్డి హామీ ఇస్తున్నారు. ఇదీ చరిత్ర హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. తొలి సార్వత్రిక ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ (కేఎంపీపీ) అభ్యర్థి కేఎస్ రాఘవాచారి కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రావుపై విజయం సాధించారు. 1952, 1962 ఎన్నికల్లో కేవీఆర్ రెడ్డి (కాంగ్రెస్) విజయకేతనం ఎగురవేశారు. 1967లో నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన కేంద్ర మంత్రివర్గంలోనూ స్థానం దక్కించుకున్నారు. 1971, 1977, 1980లో పాముదుర్తి బయపరెడ్డి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. టీడీపీ ఆవిర్భవించాక 1984లో నిర్వహించిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కె.రామచంద్రారెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సానిపల్లి గంగాధర్ వరుసగా రెండు సార్లు (1989, 1991) పార్లమెంటుకు వెళ్లారు. 1996 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్.రామచంద్రారెడ్డికి ప్రజలు అవకాశమిచ్చారు. ఆ తర్వాత 1998లో నిర్వహించిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సానిపల్లి గంగాధర్‌ను విజయం వరించింది. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కర్నల్ నిజాముద్దీన్ గెలుపొందారు. 2009లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పకు విజయం దక్కింది. హిందూపురం: లోక్‌సభ నియోజకవర్గం తొలి ఎంపీ : కేఎస్ రాఘవాచారి (కేఎంపీపీ) ప్రస్తుత ఎంపీ : నిమ్మల కిష్టప్ప (టీడీపీ) రిజర్వేషన్ : జనరల్ ప్రధాన అభ్యర్థులు వీరే దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ) నిమ్మల కిష్టప్ప (టీడీపీ) చిన్న వెంకట్రాముడు (కాంగ్రెస్) హిందూపురం లోక్‌సభ స్థానం ఓటర్ల సంఖ్య 14,45,742 మహిళలు 7,11,655 పురుషులు 7,34,020 ఇతరులు 67 అసెంబ్లీ సెగ్మెంట్లు 1. రాప్తాడు 2. ధర్మవరం 3. కదిరి 4. పుట్టపర్తి 5. పెనుకొండ 6. మడకశిర 7. హిందూపురం నియోజకవర్గ ప్రత్యేకతలు - నియోజకవర్గ కేంద్రమైన హిందూపురం పట్టణం బెంగళూరుకు సమీపంలో ఉండ టంతో పారిశ్రామికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. - నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లు కర్ణాటకతో సరిహద్దును పంచు కుంటున్నాయి. - గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించిన తిమ్మమ్మమర్రిమాను కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉంది. - అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి, ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ఆలయం ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్లు .. బలాబలాలు రాప్తాడు పాత కాపులే మళ్లీ పోటీ పడుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, టీడీపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే పరిటాల సునీత బరిలోకి దిగారు. పరిటాల సునీత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. ఇదే సమయంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా వందలాది బోరు బావులు తవ్వించి ప్రజల దాహార్తి తీర్చారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా రమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ధర్మవరం తాజా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన నియోజకవర్గాన్ని రూ.850 కోట్లతో అభివృద్ధి చేశారు. దీంతో ప్రజల్లో సానుకూలత ఉంది. టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరి ఫ్యాక్షన్ నేపథ్యమున్న నేత కావడంతో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. టీడీపీ వర్గ విభేదాలూ ఆయనకు మైనస్. కాంగ్రెస్ అభ్యర్థి రంగన అశ్వర్థనారాయణ చేనేత ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. కదిరి ఇక్కడ ముస్లింల ఓట్లు అధికం. అత్తార్ చాంద్‌బాష వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా, తాజా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కందికుంట నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దీనికితోడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో మైనార్టీలు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరామ్‌నాయక్ బంజారాల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. పుట్టపర్తి ఇద్దరు విద్యావేత్తల మధ్య పోరు సాగుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి సి.సోమశేఖరరెడ్డి ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ప్రజాప్రతినిధిగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సామకోటి ఆదినారాయణ ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి కన్పించడం లేదు. పెనుకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎం.శంకరనారాయణ, కాంగ్రెస్ తరఫున ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి, టీడీపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టీడీపీలోని పరిటాల వర్గం రఘువీరాకు అనుకూలంగా పని చేస్తున్నట్లు విమర్శలున్నాయి. మడకశిర ఏపీసీసీ చీఫ్ రఘువీరా సొంత నియోజకవర్గమైన మడకశిరలో కాంగ్రెస్ అభ్యర్థి కె.సుధాకర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీడీపీ అభ్యర్థి ఈరన్నకు అసమ్మతి వెంటాడుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎం.తిప్పేస్వామికి ఆదరణ కన్పిస్తోంది. వైఎస్ హయాంలో వక్కలిగ సామాజికవర్గం వారిని బీసీ జాబితాలో చేర్చడం, మడకశిరను అభివృద్ధి చేయడం వైఎస్సార్ సీపీ అభ్యర్థికి లాభిస్తాయని ప్రజలు భావిస్తున్నారు. హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు పార్టీలో వర్గ విభేదాలు, స్థానికేతర వివాదం, టీడీపీ ఎమ్మెల్యేల పాలనలో అభివృద్ధి జరగకపోవడం వంటివి ప్రతికూలాంశాలుగా మారాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్‌కు మాస్‌లీడర్‌గా పేరుంది. ఇక్కడ ఎక్కువగా ఉన్న మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు ఆయనకు దన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంహెచ్ ఇనయతుల్లాను మైనార్టీ వర్గాలే వ్యతిరేకిస్తున్నాయి. జీవనాడి: కూలికెళ్లిన మావాడు.. ఏఈ అయ్యాడు! మాది పేద కుటుంబం. కూలీనాలీ చేసి మా కొడుకు కళ్యాణ్‌రెడ్డిని పదో తరగతి వరకు చదివించాం. ఆ తర్వాత అనంతపురం పాలిటెక్నిక్ కాలేజీలో చేర్పించాం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. సుమారు ఏడాది పాటు కూలీ నాలీ చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు.ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో కళ్యాణ్ మళ్లీ కాలేజీకి వెళ్లాడు. పాలిటెక్నిక్, ఆ తర్వాత మదనపల్లి మిట్స్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. రీయింబర్స్మెంట్ ఉన్నందున ఫీజుల సమస్యే తలెత్తలేదు. చదువు పూ ర్తవగానే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్నాడు. వైఎస్సే లేకపోతే మా బిడ్డ కూలి పనులకే పరిమితమయ్యే వాడు.’’ - హేమలత, ఈశ్వరరెడ్డి, చిప్పలమడుగు, కదిరి మండలం ప్రగతి పరిశీలన సమాధి రాళ్లు : - ఆత్మకూరులో జూలై 9, 1999న హంద్రీ-నీవా పథకం కోసం చంద్ర బాబు పునాదిరాయి వేశారు. శిలాఫలకానికి కుడివైపున మూడు మీటర్ల మేర మాత్రమే కాలువ తవ్వించి..తర్వాత పట్టించుకోలేదు. - ఎగువన కర్ణాటక చేపట్టిన నాగలమడక ప్రాజెక్టును అడ్డుకోక పోవడంతో రామగిరి మండలంలోని పేరూరు డ్యాం ఒట్టిపోయింది. - బాబు నిర్లక్ష్యం వల్ల హిందూపురంలో 26 పరిశ్రమలు మూతపడ్డాయి. - పరగోడు రిజర్వాయర్(కర్ణాటక)ను అడ్డుకోకపోవడంతో చిత్రావతి నది పరీవాహక ప్రాంతంలో 35 వేల ఎకరాల ఆయకట్టు బీడుపడింది. - తన హయాంలో మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప పవర్‌లూమ్స్‌ను ప్రోత్సహించి...చేనేతల పొట్టగొట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. అభివృద్ధికి ఆనవాళ్లు - హిందూపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.6,850 కోట్లతో హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. - హిందూపురం, మడకశిర ప్రాంతాలకు తాగునీటి కోసం రూ.560 కోట్లతో నీలకంఠాపురం శ్రీరామరెడ్డి పథకాన్ని పూర్తి చేయించారు. - ధర్మవరం, కదిరి మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.170 కోట్లతో పథకాలను చేపట్టారు. - మడకశిర నియోజకవర్గాన్ని రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశారు. హార్టికల్చర్, వెటర్నరీ పాలిటెక్నిక్‌లు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయించారు. - హిందూపురం పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక ఐఐఎస్సీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్) రెండో క్యాంపస్‌ను ఏర్పాటు చేయించడానికి 2008లో కేంద్రాన్ని ఒప్పించారు. వైఎస్ హఠాన్మరణంతో ఆ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది.