horse-trading
-
సీతారామన్ టంగ్ స్లిప్: కేటీఆర్ కౌంటర్, వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుర్రపు పందాలపై జీఎస్టీ అంశం గురించి మాట్లాడుతున్నపుడు నిర్మలా సీతారామన్ పొరపాటున హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్టీ అన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో రెబల్ ఎమ్మెల్యేల రగడ, బేరసారాలు, రాజకీయ సంక్షోభం రగులుతున్న నేపథ్యంలో దీన్ని అవకాశంగా తీసుకున్న నెటిజన్లు ఒక రేంజ్లో విమర్శిస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురురాజకీయనాయకులు, నెటిజన్లు ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ వ్యంగ్యంగా కమెంట్ చేస్తున్నారు. ఫ్రూడియన్ స్లిప్, మనసులో మాట అంటూ కొందరు విమర్శించారు. అంతేకాదు హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్టీ అనేదే నిజమైతే.. బీజేపీనే ఎక్కువ టాక్స్ కట్టాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అసలు సామాన్య ప్రజలు ఇక పన్నులు కట్టాల్సిన అవసరమే లేదంటూ పేర్కొంటున్నారు. ఈ కోవలో తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కూడా నిలిచారు. దీన్నే ఇంగ్లీషులో ఫ్రూడియన్ స్లిప్ అని హిందీలో మన్‌కీ బాత్ అంటారు అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా జీఎస్టీ కౌన్సిల్ ప్రెస్ మీట్ (జూన్ 29 బుధవారం) సందర్భంగా 'హార్స్ రేసింగ్'పై జీఎస్టీకి బదులుగా 'హార్స్-ట్రేడింగ్'పై జీఎస్టీ అన్నారు నిర్మలా సీతారామన్. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌పై జీఎస్టీ గురించి ఆమె మాట్లాడారు. In English, this is called the Freudian slip of tongue In Hindi, it’s called “Mann Ki Baat” 😁#GSTonHorseTrading https://t.co/m2CGG23Sp0 — KTR (@KTRTRS) June 30, 2022 -
బీజేపీ కొత్త తరహా కుట్రలు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ బేరసారాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో బీజేపీ 'హార్స్-ట్రేడింగ్'కు పాల్పడిందని విమర్శించింది. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 'ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. డెమొక్రసీ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాడుతుంద'ని ట్విటర్ లో కాంగ్రెస్ పోస్ట్ చేసింది. 'ముందుగా అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ సర్కారును పడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కుట్రలతో నరేంద్ర మోదీ సర్కారు నిజస్వరూపం వెల్లడవుతోంద'ని ట్వీట్ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతినడంతో ఇలాంటి కొత్త తరహా కుట్రలకు బీజేపీ పాల్పడుతోందని ధ్వజమెత్తింది. హార్స్ ట్రేడింగ్, అధికారం, డబ్బు దుర్వినియోగంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ పెడుతోందని ఆరోపించింది. పీపీఎఫ్, పొదుపు ఖాతాల వడ్డీ రేట్లు భారీగా తగ్గించి సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందని పేర్కొంది. ఉత్తరాఖండ్ లో సిగ్గులేకుండా రాజకీయ బేరసారాలు సాగిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు దుయ్యబట్టారు. -
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: వెంకయ్య
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయ బేరసారాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని ఆయన అన్నారు. ఎన్నికలంటే బీజేపీ భయం లేదన్నారు. ఒకవేళ గెలుస్తామని బీజేపీకి నమ్మకం ఉంటే గత 5 నెలల్లో ఎన్నికలకు వెళ్లి ఉండేది అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు స్పందించారు. పూర్తి మెజారిటీతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీకి ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.