ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: వెంకయ్య | We are prepared for polls in Delhi: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: వెంకయ్య

Published Tue, Oct 28 2014 1:58 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: వెంకయ్య - Sakshi

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: వెంకయ్య

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయ బేరసారాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని ఆయన అన్నారు. ఎన్నికలంటే బీజేపీ భయం లేదన్నారు.
 
ఒకవేళ గెలుస్తామని బీజేపీకి నమ్మకం ఉంటే గత 5 నెలల్లో ఎన్నికలకు వెళ్లి ఉండేది అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు స్పందించారు.  పూర్తి మెజారిటీతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీకి ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement