వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో మెరుగ్గానే నమోదయ్యాయి. సమీక్షా నెలలో 8.5 శాతం పురోగతితో (2023 ఇదే నెలతో పోలిస్తే) రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ 9.4 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై పన్ను ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 6 శాతం పెరిగి రూ.42,591 కోట్లకు చేరుకుంది.
రిఫండ్స్ రూ.19,259 కోట్లు
నవంబర్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1,82 కోట్లలో రూ.19,259 కోట్ల రిఫండ్స్ జరిగాయి. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 8.9 శాతం క్షీణతను నమోదు చేసింది. రీఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ.1.63 లక్షల కోట్లకు చేరాయి.
విభాగాల వారీగా..
→ మొత్తం వసూళ్లు రూ.1,82 కోట్లు
→ సెంట్రల్ జీఎస్‌టీ రూ.34,141 కోట్లు
→ స్టేట్ జీఎస్‌టీ రూ.43,047 కోట్లు
→ ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్‌టీ విలువ రూ.91,828 కోట్లు
→ సెస్ రూ.13,253 కోట్లు.
ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!
డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
మరోవైపు డిసెంబర్ 21న జైసల్మేర్‌లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కౌన్సిల్ మొదట నవంబర్‌లో సమావేశం కావాలని నిర్ణయించారు. కానీ మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు శీతాకాల సమావేశాల కారణంగా వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment