వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 53వ సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జూన్ 22న దిల్లీలో నిర్వహించనున్నట్లు ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.
కౌన్సిల్ అక్టోబర్ 2023లో చివరిసారిగా సమావేశం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరిగి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ఇటీవల ఎన్నికల పలితాలు వెలువడి మంత్రిత్వశాఖలు కేటాయించడంతో జూన్ 22న తిరిగి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పింది. ఎన్నికల తరుణంలో ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి పూర్తికాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జులైలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జూన్ 22న జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారనుంది. ఏయే వస్తువులపై ఏమేరకు ట్యాక్స్‌లో మార్పులుంటాయో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: తెలుగు వెబ్‌సిరీస్ తొలగించాలని కోర్టులో పిటిషన్
కౌన్సిల్ సమావేశపు ఎజెండా ఇంకా వెలువడలేదు. ఈసమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సెక్రటరీలు హాజరవుతారు. ఇదిలాఉండగా, గత పదేళ్లుగా చేపట్టిన సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని కేంద్ర ఆర్థికమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనను వేగవంతం చేసే దిశగా చర్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, జీవనాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు వెలువడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment