ఏషియన్ పెయింట్స్ కంపెనీ రూ.13.83 కోట్ల జీఎస్టీ, రూ.1.38 కోట్ల పెనాల్టీ చెల్లించాలని కేంద్ర పన్నుల డిప్యూటీ కమిషనర్ డిమాండ్ నోటీసు పంపినట్లు సంస్థ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో తేడాలపై 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈ డిమాండ్ నోటీసు వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ నోటిసుకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఏషియన్ పెయింట్స్ కంపెనీ చేసిన సరఫరాలపై ఐటీసీని పొందడానికి వర్తించే అన్ని పన్నులను చెల్లించినట్లు కంపెనీ చెప్పింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 సంబంధిత నిబంధనల ప్రకారం ఈ నోటీసులు వచ్చినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు..
ఏషియన్ పెయింట్స్ కంపెనీను 1942లో చంపక్‌లాల్ చోక్సీ, చిమన్‌లాల్ చోక్సీ స్థాపించారు. 1965 వరకు ఏషియన్ ఆయిల్ అండ్ పెయింట్ కంపెనీ ఉన్న సంస్థ పేరును ఏషియన్ పెయింట్స్‌గా మార్చారు. ఇండియాలో మొత్తం 10 తయారీ కేంద్రాలున్నాయి. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని పటాన్‌చెరు, విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment