
భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె 'వసుంధర ఓస్వాల్' ఉగాండాలో జైలు పాలైన దాదాపు నాలుగు నెలల తర్వాత.. అక్కడ తాను అనుభవించిన కొన్ని కష్టాలను వివరించింది. తనను ఐదు రోజుల పాటు నిర్బంధించారని.. ఆహారం, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించలేదని పేర్కొంది. ఆఖరికి స్నానం చేయడానికి కూడా నిరాకరించారని వెల్లడించింది.
ఇంటర్‌పోల్‌కు వెళ్లడానికి తాను అయిష్టత చూపినప్పుడు.. ఒక పురుష అధికారి తనను ఎత్తుకుని వారి వ్యాన్‌లో పడేశారని వసుంధర ఓస్వాల్ ఆరోపించింది.

వసుంధర (26)పై గత సంవత్సరం తన తండ్రి పంకజ్ ఓస్వాల్ మాజీ ఉద్యోగి ముఖేష్ మెనారియా కిడ్నాప్ & హత్య కేసులో తప్పుడు అభియోగం మోపబడింది. తరువాత అతను టాంజానియాలో సజీవంగా కనిపించాడు. అయితే ఈమెను 2024 అక్టోబర్ 1న అరెస్టు చేశారు. అదే నెలలో (అక్టోబర్ 2) బెయిల్ మంజూరు చేశారు.

నన్ను ఐదు రోజులు నిర్బంధించారు, మరో రెండు వారాల పాటు జైలులో పెట్టారని.. వసుంధర ఓస్వాల్ పేర్కొంది. ఆ సమయంలో వారు స్నానం చేయనివ్వలేదు. ఆహారం & నీరు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. నాకు ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరా కోసం నా తల్లిదండ్రులు న్యాయవాదుల ద్వారా పోలీసు అధికారులకు లంచం ఇవ్వవలసి వచ్చిందని పేర్కొంది.
ఇదీ చదవండి: గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?
ఒక విధమైన శిక్షగా వాష్‌రూమ్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని వసుంధర ఓస్వాల్ ఆరోపించారు. పోలీసులు వారెంట్ లేకుండా తన ఇంటిని సోదా చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment