Vasundhara
-
వసుంధరా రాజేను మెచ్చుకున్న కాంగ్రెస్ ఎంపీ
ఒక పార్టీకి చెందిన నేత మరో పార్టీ నేతను మెచ్చుకుంటే అది ఆసక్తికరంగా మారుతుంది. దీనివెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. సరిగ్గా ఇటువంటిదే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రాజస్థాన్‌లోని చురు నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన రాహుల్ కశ్వాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ మహిళా నేత వసుంధరా రాజేకు వీరాభిమానినని పేర్కొన్నారు. ఆమెను తాను నూటికి నూరు శాతం అభిమానిస్తానని అన్నారు. బీజేపీని వీడిన తర్వాత కూడా తనకు వసుంధర రాజేపై పూర్తి గౌరవం ఉందని అన్నారు. రాజస్థాన్‌లో వసుంధరకు అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, ఆమె అద్భుతమైన నాయకురాలని పేర్కొన్నారు.తామంతా వసుంధర నాయకత్వంలో ముందుకు సాగామని, ఆమె రాష్ట్రానికి పలువురు సమర్థవంతమైన నేతలను అందించారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తాము వేర్వేరు పార్టీలలో ఉన్నామని, ప్రతిపక్ష ఎంపీగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని రాహుల్ తెలిపారు. ఇదిలావుండగా రాహుల్ బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ తీరుపై విరుచుకుపడ్డారు. ఆయన పలువురి రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారారని ఆరోపించారు.తనకు లోక్‌సభ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి టిక్కెట్ రాకపోవడానికి రాజేంద్రే కారణమని ఆరోపించారు. రాథోడ్ మొండి వైఖరికి వ్యతిరేకంగా తాను గళం విప్పానన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ కశ్వాన్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తదనంతరం చురు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. -
ఆకట్టుకున్న వల్లభనేని వంశీ కుమార్తె భరతనాట్య ప్రదర్శన
-
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్‌పై కోటంరెడ్డి దాడి చేసిన ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని ప్రొఫెసర్ వసుంధర అన్నారు. డోలేంద్రపై దాడి చేసిన అనంతరం తనను, మరో మహిళను కోటంరెడ్డి కారులో ఎత్తుకెళ్లాడని తెలిపారు.సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మోసానికి, కపటానికి ప్యాంటు, షర్టు వేసి చేతిలో బీరు బాటిల్ పెడితే అతడే కోటంరెడ్డి అని.. కోటంరెడ్డి పైకి మాత్రం వేదాలు వల్లిస్తాడంటూ మండిపడ్డారు.‘‘కోటంరెడ్డి సోదరులు నియోజకవర్గంలో అనేక దందాలకు, అరాచకాలకు పాల్పడ్డారు. ఎంపీడీఓ సరళపై దాడికి పాల్పడి, ఆ దాడి నేనే చేయించానని కోటంరెడ్డి ఫోన్ చేసి మరీ ఆమెకు చెప్పారు. తిరుమల నాయుడు సహా అనేక మందిపై దాడులు జరిపారు. కోటంరెడ్డి లాంటి నీచుడికి ఓటు వేయొద్దు’’ అని వసుంధర పేర్కొన్నారు.‘‘రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దుకాణాల వరకూ మామూళ్లు వసూలు చేశారు. మహిళల జీవితాలను నాశనం చేశారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు ఉంది. నెల్లూరు రూరల్ ప్రజలంతా ఆదాలకు ఓటు వేయాలి’ అని వసుంధర విజ్ఞప్తి చేశారు. -
డ్రైఫ్రూట్స్ నగల ధగధగలు
ఫంక్షన్లో పదిమంది దృష్టి పడేలా ప్రత్యేకంగా కనిపించాలనుకోవడం సహజం. మేకప్ ఆర్టిస్ట్ వసుంధర మరింత ప్రత్యేకంగా కనిపించాలని డిసైడై ‘డ్రై ఫ్రూట్స్ జ్యూలరీ’ ధరించింది. యూనిక్ లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో బజ్ క్రియేట్ చేసింది. మాంగ్ టిక్క, గాజులు, జూకాలు, వడ్డాణం... ఇలా అన్నీ డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసినవే. ఫంక్షన్ తరువాత డ్రైఫ్రూట్స్‌ను రీయూజ్ చేస్తారా, పారేస్తారా అనేది మాత్రం తెలియదు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది లైక్‌లతో వైరల్ అయింది. ‘భలే ఉన్నారు’ అనే ప్రశంసలతో పాటు ‘వేస్టేజ్ ఆఫ్ ఫుడ్’లాంటి కామెంట్స్ కనిపించాయి. -
ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు?
భారతీయ జనతాపార్టీ(బీజేపీ) కొత్తగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో నాయకత్వాన్ని మార్చి, నూతన నేతలకు బీజేపీ అధికారాన్ని అప్పగించింది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం నేపధ్యంలో పార్టీలోని సీనియర్ నేతలు వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌ల భవిష్యత్ ఏమిటనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీనికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ మీడియా కార్యక్రమంలో సమాధానమిచ్చారు. ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు బీజేపీ సీనియర్ నేతలని, వారి స్థాయికి అనుగుణంగా భవిష్యత్తులో పార్టీ వారికి తగిన హోదా కల్పిస్తుందని అన్నారు. తమ పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని, ప్రతిచిన్న కార్యకర్తకు కూడా పార్టీ తగిన స్థానం ఇస్తుందని అన్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఆ సీనియర్లకు మరో పనిని అప్పగిస్తామన్నారు. వారి సేవలను పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రశ్నకు సమాధానం కొన్ని పదాలలో వివరించడం కష్టమని, ఇటువంటి పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు అని మాత్రమే కాకుండా ప్రతి కార్యకర్త గురించి కూడా పార్టీ ఆలోచిస్తుందని నడ్డా తెలిపారు. వారు చేపట్టిన కార్యక్రమాలు, వారి చరిత్రకు సంబంధించిన డేటా బ్యాంక్ తమ వద్ద ఉందని, వాటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటామన్నారు. ఎన్నికలు ప్రకటించగానే మన నాయకుడెవరు? ప్రతిపక్షంలో కూర్చోగల తగిన నాయకుడు ఎవరు? అనే అంశంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని, ఈ ఎంపిక చాలా జాగ్రత్తగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మాస్క్ మళ్లొచ్చింది.. సింగపూర్‌లో షురూ! -
ఇప్పటివరకు ఒక లెక్క ఇకమీదట ఒక లెక్క అంటున్న హీరోయిన్
వైవిధ్యభరిత పాత్రలతో సత్తా చాటుతున్న నటి వసుంధర. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించిన పేరాన్మై చిత్రంలో జయంరవితో కలిసి నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఈ భామ ఒకరు. ఈ సినిమా తరువాత పలు చిత్రాల్లో కథానాయికగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా విభిన్న కథా చిత్రాల దర్శకుల ప్రాజెక్టుల్లోనూ నటించేలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. అలా ఈ ఏడాది కన్నై నంబాదే, తలైకూత్తల్ అనే రెండు సినిమాలతో పాటు మోడ్రన్ లవ్ చెన్నై అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. కాగా వసుంధర ఇప్పుడు మళ్లీ బిజీ నటిగా మారారు. ఇప్పటి వరకు సెలక్టివ్ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చిన ఈమె ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు. ఇక నుంచి పాత్రల ఎంపికలో తన నిబంధనలను మార్చుకుంటున్నానంటున్నారు. ఇంతకుముందు ప్రతి నాయికగా నటిస్తే ప్రేక్షకుల్లో చెడు ఇమేజ్ క్రియేట్ అయ్యేదని, మారుతున్న కాలంలో అలాంటి పాత్రలను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అందుకు తన అభిమాన నటి రమ్యకృష్ణనే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆమె ఇటీవల పాజిటివ్, నెగెటివ్ పాత్రల్లోనూ సత్తా చాటుతున్నారన్నారు. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలతో బోర్ కొడుతోందని, విలనిజంతో నటనా ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందన్నారు. తాను ఇప్పుడు అలాంటి చాలెంజింగ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలా ప్రస్తుతం ఒక మల్టీస్టారర్ చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. ఇది మహిళల ఇతివృత్తంతో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పబ్ గోవా వెబ్‌సీరీస్ ఫేమ్ లక్ష్మీనారాయణన్రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. దీనితో పాటు ఒక భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. తన పుట్టిల్లు తమిళనాడు అని, అయితే ఇకపై తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Vasundhara (@ivasuuu) చదవండి: నటి విచిత్రను ఇబ్బంది పెట్టిన తెలుగు హీరో ఎవరు.. కమల్ ఈ సాహసం చేయగలరా? -
టీఆర్ఎస్ నాయకురాలు వసుంధర కన్నుమూత
ముషీరాబాద్ : టీఆర్ఎస్ నాయకురాలు బుసమల్ల వసుంధర (57) మంగళవారం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. తెలంగాణ పోరాటంలో ముందు భాగంలో నిలబడడమే కాకుండా కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి వంటి సీనియర్ నేతలతో ఆమె కలిసి పని చేసినట్లు వసుంధర సోదరి సంధ్య తెలిపారు. ఆమె భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ సీఎస్ఐ డయాసిన్ ఆఫీస్ లో సందర్శనార్థం ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు కార్ఖానాలోని సీఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారన్నారు. -
నందమూరి వసుంధర సంతకం ఫోర్జరీ
బంజారాహిల్స్: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి హెచ్డీఎఫ్ బ్యాంక్ బంజారాహిల్స్ బ్రాంచ్‌లో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ను తయారు చేసిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–2లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బంజారాహిల్స్ బ్రాంచ్ మేనేజర్లు ఫణింద్ర, శ్రీనివాస్ ఈ నెల 13న ఆమె ప్రతినిధి వెలగల సుబ్బారావుకు ఫోన్ చేసి నందమూరి వసుంధర మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమె అకౌంట్ నంబర్ కూడా చెప్పి అకౌంట్‌ను యాక్టివేట్ చేయమంటారా? అంటూ ప్రశ్నించారు. తాము మొబైల్‌బ్యాంకింగ్ అప్లికేషన్ ఇవ్వలేదని, అసలు దరఖాస్తే చేసుకోలేదని చెబుతూ ఈ విషయాన్ని వసుంధర దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కూడా తాను ఎలాంటి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. బ్యాంకు అధికారులు ఆరా తీయగా కొత్తగా వచ్చిన అకౌంటెంట్ కొర్రి శివ ఇటీవల వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇచ్చినట్లుగా తేలింది. దీనిపై శివను నిలదీయగా మొబైల్ బ్యాంకింగ్ కోసం తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తు చేసినట్లుగా అంగీకరించాడు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు కూడా వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా వెల్లడించారు. సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొర్రి శివపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మిస్ ఎబిలిటీ
డిజ్ఎబిలిటీని ‘మిస్ ఎబిలిటీ’గా మార్చిన వసుంధర అనే యువతి మహా సంకల్ప బలం ఇది. జీవితమంతా పోరాటంతోనే గడిపి, చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో పడలేక రాజీనామా చేసి, సొంతంగా ఒక సంస్థను నెలకొల్పి దివ్యాంగుల సంక్షేమం కోసం తన వంతుగా కృషి చేస్తున్న వసుంధర.. అందాల పోటీలను కూడా నిర్వహించి.. అందం కేవలం దేహ సౌందర్యానికే పరిమితం కాదనీ, ప్రతిభలోనూ అందం ఉంటుందని చాటి చెప్పారు. హెచ్ఎస్బిసిలో పనిచేస్తున్న రేఖారాణి ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్‌తో లేరు. వేదిక మీద ఆమె తన శరీరం గురించి, తనకున్న లోపాల గురించి పట్టించుకోలేదు. గ్లామరస్‌గా లేరు, జీరో సైజు కూడా కాదు, కాని ప్రత్యేకమైన అందం కలిగిన అమ్మాయి. ర్యాంపు మీద వీల్ ఛెయిర్‌లోనే తన గాంభీర్యాన్ని, తన ప్రతిభను ప్రదర్శించి, పోటీలో పాల్గొన్న పదహారు మందిలో ‘మిస్ ఎబిలిటీ’ టైటిల్ గెలిచారు. గతంలో ‘కాగ్నిజెంట్’లో పనిచేసిన లక్ష్మీ సుందరి కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. 2011లో అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో లక్ష్మీ సుందరి వీల్ చైర్‌కే పరిమితమైపోయినా, ఈ ‘మిస్ ఎబిలిటీ’ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. ‘‘మేం ఎంత ప్రత్యేకమో ప్రపంచానికి తెలియజేయడానికే మా ప్రయత్నం’’ అంటారు ఈ ఈవెంట్‌ను నిర్వహించిన ‘వేవ్ మీడియా’ సంస్థ సిఈవో వసుంధర కొప్పుల. ఈ ఏడాది ఏప్రిల్ 1న ‘వేవ్ మీడియా’ అందాల పోటీలు జరిగాయి. దివ్యాంగురాలైన వసుంధర, దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వున్నారు. తమ్ముడు మోసుకెళ్లేవాడు వసుంధర స్వగ్రామం అనంతపురం జిల్లా సెట్టూరు. తల్లి ప్రమీల, తండ్రి ఆనందరావు, తమ్ముడు రాజేంద్రప్రసాద్. వసుంధర చిన్నపిల్లగా ఉన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. తల్లి గార్మెంట్స్ బిజినెస్ చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫారమ్స్ తయారుచేసి సప్లయి చేస్తున్నారు. వసుంధరకు రెండేళ్ల వయసులో వేసిన పోలియో వ్యాక్సిన్ వికటించి ఆమె రెండు కాళ్లూ బలహీనమయ్యాయి. వసుంధరకు ఏడు సంవత్సరాలు వచ్చేవరకు ఎంతోమంది వైద్యులకి చూపించింది తల్లి. నయం కాలేదు. చందమామ వంటి పుస్తకాలు చదవడానికైనా ఉంటుందని వసుంధరను స్కూల్లో వేశారు. స్కూల్లో టీచర్లు, స్నేహితులు అందరూ వసుంధరను తమతో సమానంగానే చూశారు. స్పెషల్ కిడ్లాగ ఏ ఒక్కరూ చూడలేదు. వసుంధర తమ్ముడు కూడా అదే స్కూల్లో చదువుకుంటూ, అక్కను ఒక క్లాసు నుంచి మరొక క్లాసుకి ఎత్తుకుని తీసుకువెళ్లేవాడు.‘అమ్మ వద్దన్నా.. బయటికొచ్చేశాను’ వసుంధర చక్రాల బండికే పరిమితమైపోయినా, మానసికంగా కుంగిపోలేదు. పట్టుపట్టి బికామ్ పూర్తి చేశారు. సి.ఏ. చేస్తూ మధ్యలో వదిలేసి, ఎం.ఏ. మాస్ కమ్యూనికేషన్ చదివారు. ‘‘మీడియాలో ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఒక్కర్తినే ఉంటానంటే అమ్మ వద్దన్నా, ఆమె మాటను కాదని, బయటకు వచ్చేశాను’’ అంటున్న వసుంధర, తనకు అమ్మ వల్లే ఇంత శక్తి వచ్చిందంటున్నారు. తనలాంటి వందమందిని కలిసి వారి సమస్యల గురించి వినతి పత్రం తయారుచేసి, అబ్దుల్ కలామ్‌కి అందచేశారు వసుంధర. ఆయన తక్షణమే దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటయ్యేలా అధికారులను ఆదేశించారు. వసుంధర నిర్వహించిన అందాల పోటీలో ‘మిస్ ఎబిలిటీ’ టైటిల్ విన్నర్ రేఖారాణి, రన్నరప్ లక్ష్మీ సుందరిలతో వసుంధర ఆత్మాభిమానంతో రాజీనామా! చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్లడానికి తల్లి అంగీకరించనప్పుడు.. ‘‘నేనేమీ అడవిలోకి వెళ్లట్లేదు’’ అని ఆమెను ఒప్పించిన వసుంధర ఒక సంవత్సరం పాటు ఒక టీవీ చానెల్లో ఉద్యోగం చేశారు. అక్కడ వివక్షకు గురయ్యారు. ఆమె పనిచేసినా పనిచేయకపోయినా జీతం ఇచ్చేయమని మేనేజ్మెంట్ అన్నట్లు తెలిసి ఆమె ఆత్మాభిమానం దెబ్బతింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో తన సొంత సంస్థ ‘వేవ్ మీడియా’ ప్రారంభించారు. ఆ తర్వాత ‘అంధుల క్రికెట్’ నిర్వహించారు. వారి సంస్థ తరఫున 2015లో ‘మిస్ ఎబిలిటీ’ కార్యక్రమం ఏర్పాటు చేద్దామనుకుంటే, 2018 ఏప్రిల్ నాటికి కార్యరూపం దాల్చింది. ‘‘మాతో పనిచేయాలంటే సెన్సిబుల్‌గా ఉండాలి. అది నాలాంటి వాళ్లకి మాత్రమే తెలుస్తుంది’’ అంటారు వసుంధర. తలా ఒక చెయ్యేస్తే చాలు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పోరాడుతున్నారు వసుంధర. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నిటినీ ఒంటరిగానే అధిగమిస్తున్నారు. అంతేకాదు, తనలాంటివారికి అండగా నిలుస్తున్నారు, వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు వసుంధర. ‘‘దివ్యాంగులకు బ్యాంకులు లోన్లు ఇవ్వాలంటే వారిని నమ్మి గ్యారంటీ ఇచ్చేవారు ఉండరు. చదువుకోనివారు సైతం లోన్ తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు వీరికి ఎందుకు ఇవ్వకూడదు? ప్రభుత్వం వీరి తరఫున నిలబడి లోన్లు ఇప్పించాలి’’ అంటున్నారు వసుంధర. వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేవారు, వీరి గురించి ఆలోచించి, వీరు చేసేవాటికి కూడా పెట్టుబడులు పెట్టవచ్చు కదా అంటారు వసుంధర. ‘‘పెద్ద పెద్ద కంపెనీలు మా తరఫున ప్రచారం చేయొచ్చు కదా’’ అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, దివ్యాంగులు అన్నిరకాల వస్త్రాలు ధరించలేరు కనుక వారికి అనుగుణంగా అందమైన వస్త్రాల ను ప్రత్యేకంగా బొటిక్వారు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేసే మొత్తంలో ఐదు శాతం దివ్యాంగుల సంక్షేమానికి వినియోగించాలని, ఏడాదికి వందమందినైనా ఉద్యోగాలకు ఆహ్వానించాలని కోరుతున్నారు. అవార్డులు.. పురస్కారాలు ►లేడీ లెజెండ్ అవార్డు – 2018 (ట్యూటర్స్ ప్రైడ్ ఆర్గనైజేషన్) ►విశిష్ట సేవా పురస్కార్ 2018 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి) ►ఇండియన్ అడ్వాంటేజ్ ఉమెన్ అవార్డు 2018 (దేశవ్యాప్తంగా వచ్చిన 19,300 అప్లికేషన్లలో 25 మందిని ఎంపిక చేయగా వారిలో ఒకరు). ►2013లో జరిగిన ‘మిస్ వీల్ చెయిర్’ ప్రోగ్రామ్‌లో ‘మోస్ట్ వోటెడ్ గర్ల్ ఆఫ్ ద నేషన్’ అవార్డు (ఆంధ్రప్రదేశ్ నుంచి) ►తెలుగు రక్షణ సమితి, హైదరాబాద్ వారి నుంచి 2013 ఉత్తమ కవయిత్రి బహుమతి. – వైజయంతి పురాణపండ వసుంధర మెయిల్ ఐడీ:koppulavasundhara@gmail.com -
అక్రమాల ఘ(గ)ని!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టు పనులు భామిని మండలంలో 87 ప్యాకేజీ, కొత్తూరు మండలంలో 88వ ప్యాకేజీ పనులతో పాటు హిరమండలం జలాశయం పనులు జరుగుతున్నాయి. కానీ తొలుత 87, 88వ ప్యాకేజీ పనులను శ్రీనివాస కంపెనీ చేపట్టింది. వాస్తవానికి ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో ఎక్కడా నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ కోసం క్వారీలు, ఇసుక రీచ్‌లు కేటాయించాలన్న షరతులేవీ లేవు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస కంపెనీ పనులు మందగమనంతో చేస్తున్న కారణంగా ఒప్పందం రద్దు చేసింది. 87 ప్యాకేజీ పనులను టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థకు, 88వ ప్యాకేజీ పనులను శ్రీసాయిలక్ష్మీ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించింది. అయితే వంశధారతో ముడిపడిన జిల్లా ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి క్వారీ, ఇసుక రీచ్‌లు కేటాయించాలని నిర్ణయించారు. అధికారుల కళ్లుగప్పి... భామిని మండలం చిన్నదిమిలి పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 284లో దాదాపు 43.65 ఎకరాల విస్తీర్ణంలో కొండ ఉంది. దీనిలో 7.41 ఎకరాలు (3 హెక్టార్లు) క్వారీయింగ్ కోసం అధికారులు అప్పగించారు. అయితే ఇది నిర్ణీత ప్రక్రియ ప్రకారం జరగలేదు. ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేయాలనే కారణంతో వంశధార ఎస్ఈ పేరుతో అనుమతులు ఇచ్చారు. వాస్తవానికి కాంట్రాక్టరు సంస్థదీ ప్రైవేట్ వ్యాపార కార్యకలాపం కిందకే వస్తుంది కాబట్టి సుమారు పది వరకూ ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతి (నో అబ్జెక్షన్ సరిఫికెట్లు) తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు క్వారీయింగ్ కోసం కేటాయించిన కొండ ఇంకా కొండలాగే ఉంది. ఆ పక్కన గతంలో చదును చేసిన భూమిలోనే క్వారీయింగ్ కార్యకలాపాలను కాంట్రాక్టు సంస్థ మొదలెట్టేసింది. అనుమతి ఒకచోట తీసుకొని, మరొక చోట క్వారీయింగ్ చేస్తున్నా అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. పేలుళ్లతో పరిసరాల్లో హడల్... గనుల్లో రాయి పేలుళ్ల కోసం పలు విభాగాల నుంచి అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసు శాఖ నుంచి అనుమతి ప్రధానంగా ఉండాలి. అంతకుమించి అక్కడ మైనింగ్ కార్యకలాపాల కోసం స్థానిక పంచాయతీ తీర్మానం కూడా అవసరం. కానీ ఇప్పటివరకూ చినదిమిలి పంచాయతీ తీర్మానం చేయలేదని విశ్వసనీయ సమాచారం. కానీ క్వారీలో పేలుళ్లకు మాత్రం కాంట్రాక్టు సంస్థ తెగబడింది. ఈ పేలుళ్లతో వచ్చిపడుతున్న రాళ్ల వల్ల తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని, ప్రాణాపాయం పొంచి ఉందని పెద్ద దిమిలి, చిన్నదిమిలి ప్రజలు ఇటీవల ఆందోళన చేసినా అరణ్యరోదనే అయ్యింది. కాంట్రాక్టు సంస్థ కేవలం వరద కాలువ నిర్మాణం కోసం తవ్వకాల్లో అడ్డంగా తగిలే రా>ళ్లను తొలగించడానికి మాత్రమే బ్లాస్టింగ్స్‌కు అనుమతి తీసుకుంది. దీన్ని కారణంగా చూపించి తీసుకొస్తున్న పేలుడు పదార్థాలను క్వారీలో రాళ్ల తవ్వకాల కోసం వినియోగించడం చట్టవిరుద్ధం. దీనికి పోలీసుశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా అవేవీ ఇక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. అవసరానికి మించి తవ్వకాలు.... అనుమతి ప్రాంతంలో క్వారీయింగ్ అయినా సరే అవసరానికి మించి తవ్వకాలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి 88వ ప్యాకేజీ కాంక్రీట్ పనులకు 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల పిక్కరాయి అవసరం ఉంటుంది. 40 ఎంఎం, 20 ఎంఎం, 10 ఎంఎం సైజ్ రాయిపిక్కను వరద కాలువ లైనింగ్, వంతెనల నిర్మాణంలో వినియోగిచాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ సుమారు 12 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని క్వారీ నుంచి అక్రమంగా తవ్వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థ ఆ కొండ పక్కనే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి లీజుకు తీసుకొని, అక్కడ భారీ క్రషర్‌ను ఏర్పాటు చేసింది. దీనికి గంటకు 250 టన్నుల రాయిని క్రషింగ్ చేయగల సామర్థ్యం (250 టీపీహెచ్) ఉంది. ఈ క్రషర్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతి మాత్రమే ఉంది. మిగతా ప్రభుత్వ విభాగాల నుంచి ఇంకా ఎన్వోసీలు లభించలేదని తెలిసింది. కనీసం ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ వద్ద కూడా నమోదు చేయించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతి లేనిచోట క్వారీయింగ్ చేస్తూ పెద్ద ఎత్తున క్రషింగ్ చేస్తున్న రాయిపిక్కలు (మెటీరియల్) పక్కదారి పడుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
రేణుకా చౌదరికి మాతృ వియోగం
హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, రాజ్యసబ సభ్యురాలు రేణుకా చౌదరికి మాతృ వియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రేణుకా చౌదరి తల్లి వసుంధర (84) బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మ కడుపు చల్లగా
అమ్మ కడుపు చల్లగా ఎప్పుడుంటుంది? కొడుక్కి ఏ కీడూ కలగకుండా గొప్ప ప్రయోజకుడైతే నలుగురికి మంచి చేసేవాడైతే... నలుగురూ మెచ్చేవాడైతే అమ్మ కడుపు చల్లగా ఉంటుంది. అంటే.. అమ్మ చల్లగా ఉండాలంటే పిల్లలు ప్రయోజకులు కావాలి బిడ్డలు సంతోషంగా ఉంటే అమ్మ సంతోషంగా ఉంటుంది ఇది తల్లి నిస్వార్థ ప్రేమకి చిహ్నం. అమ్మకి ఏదైనా తెచ్చిస్తే సంతోషపడుతుందో లేదో తెలియదు కానీ కన్న బిడ్డ ఏదైనా సాధిస్తే అమ్మ సంతోషంగా ఉంటుంది. కూతుళ్లు – కొడుకులు చల్లగా ఉంటే అమ్మ కడుపు చల్లగా ఉంటుంది ♦ మదర్స్ డే స్పెషల్ ఏంటి ? శర్వా: మదర్స్ డే అంటూ ప్రత్యేకంగా ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు. ప్రతిరోజు మదర్స్ డేలానే అనుకుంటాను. అమ్మను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ♦ చిన్నప్పుడు మీ అబ్బాయి చేసిన అల్లరి గురించి చెబుతారా? వసుంధర: శర్వాకి స్కూల్‌కి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. ఎలాగోలా రెడీ చేసి, రిక్షా ఎక్కించేవాళ్లం. అందులోంచి దూకేసేవాడు. కారు ఎక్కిస్తే, డోర్ ఓపెన్ చేసుకుని దూకడానికి ట్రై చేసేవాడు. థర్డ్ వరకు ఇదే తంతు. పోనీ స్కూల్ మార్చితే వెళతాడేమోనని మార్చాం. పూర్తిగా మారలేదు, కానీ... అంతగా మొండికేసేవాడు కాదు. మార్కులు ఎక్కువగా రాకపోయినా పాస్ అయ్యేవాడు. తొమ్మిదో తరగతి నుంచి పేచీ పెట్టకుండా స్కూల్కెళ్లాడు. ♦ లంచ్ బాక్స్ ఖాళీ చేసేవారా.. అలాగే ఇంటికి తీసుకెళ్లేవారా? శర్వా: మా అమ్మ చాలా టేస్టీగా వండుతుంది. బిర్యానీ సూపర్బ్. చైనీస్ వంటకాలకు వంక పెట్టడానికి లేదు. లంచ్‌కి చికెన్ డ్రమ్‌స్టిక్స్, చైనీస్ స్పెషల్ ఐటమ్స్ పంపించేది. హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకునే రోజుల్లో నా లంచ్ బాక్స్ అందరికీ స్పెషలే. స్కూల్ ఫ్రెండ్సే కాకుండా బయటి ఫ్రెండ్స్‌కి కూడా మా అమ్మగారి వంటలు ఇష్టమే. ♦ మీ స్నేహితుల్లో ఒకరైన రామ్‌చరణ్‌కి కూడా ఇష్టమేనా? శర్వా: చరణ్‌కి నువ్వు చేసే రసం ఇష్టం కదమ్మా... వసుంధర: ఊ... చరణ్‌కి రసం అంటే చాలా ఇష్టం. ♦ మీ అమ్మగారి కోసం ఎప్పుడైనా వండి పెట్టారా? శర్వా: అమ్మ నన్ను వంటింట్లోకి అడుగు పెట్టనివ్వదు. నాకు ఆమ్లెట్ మాత్రమే వచ్చు. ఈ మధ్య అక్క దగ్గర యూఎస్‌లో మూణ్నెల్లు ఉన్నాను. తన దగ్గర చికెన్ కర్రీ, రసం నేర్చుకున్నా. ఇక్కడికొచ్చి మర్చిపోయా. ♦ శర్వాకు ఓ అన్నయ్య (కల్యాణ్) కూడా ఉన్నారు కదా.. వీళ్లిద్దరూ బాగా అల్లరి చేసేవాళ్లా? వసుంధర: పెదబాబుకి, శర్వాకు మధ్య గ్యాప్ ఎనిమిదేళ్లు. ఆటల్లో తనను కలుపుకోవడంలేదని శర్వా గొడవ చేసేవాడు. పెదబాబు దాచుకున్న వస్తువులన్నీ తీసేసేవాడు. దాంతో ఇద్దరు గొడవపడేవారు. ఆ గొడవ చూసి, ‘రామ–లక్ష్మణుల్లా ఉండాలనుకున్నాను. వీళ్లేంటి ఇట్లా పోట్లాడుకుంటున్నారు’ అనుకునేదాన్ని. శర్వా చాలా పెంకి. కోపం వస్తే, తలను నేలకేసి కొట్టుకునేవాడు. చాలాసార్లు బొప్పి కట్టింది కూడా. మెల్లగా ఆ అల్లరి తగ్గిపోయింది. నేను కోరుకున్నట్లే అన్నదమ్ములిద్దరూ రామ–లక్ష్మణుల్లా ఉంటున్నారు. నన్ను బాగా చూసుకుంటారు. షూటింగ్ కోసం శర్వా ఎక్కడెక్కడికో వెళతాడు. ఫోన్ చేసి, మాట్లాడుతుంటాడు. బేసిక్‌గా శర్వాకి లేడీస్ అంటే గౌరవం. అమ్మని కాబట్టి నన్ను ఎలానూ బాగా చూసు కుంటాడు. వాళ్ల అక్క, వదినల విషయంలోనూ కేర్ తీసుకుంటాడు. ♦ పెద్దయ్యాక ఏమవుతావని శర్వాని అడిగితే ఏమని చెప్పేవారు? వసుంధర: టెలివిజన్‌లో యాక్ట్ చేస్తానని, సినిమాల్లోకి వెళతానని అనేవాడు. మా నాన్నగారికి సినీ ఫీల్డ్‌తో కాస్త టచ్ ఉంది. ‘కృష్ణావతారం’ లాంటి సినిమాలు తీశారాయన. అయినా నాకు, శర్వా వాళ్ల నాన్న (ఎమ్.ఆర్.వి ప్రసాద్)గారికీ సినిమా ఫీల్డ్ అంటే అంత ఇష్టం లేదు. ఒకసారి మా అన్నయ్యగారి అబ్బాయి జాతకం చెప్పించుకోవడానికి వెళ్లాం. అక్కడ శర్వా పుట్టిన తేదీని చూసి హీరో అవుతాడని జాతకం చెప్పారు. శర్వాకు ఆ విషయం తెలిస్తే, అదే మనసులో పెట్టుకుని సినిమాల్లోకి వెళ్లే తీరతానంటాడని దాచేశాం. ఆ తర్వాత ఆ విషయం తెలిసి, ఎందుకు చెప్పలేదంటూ గొడవ చేశాడు. ఇంటర్లోకి వచ్చాక సినిమాల్లోకి వెళతానన్నాడు. డిగ్రీ చేశాక, వెళుదువు అన్నారు వాళ్ల నాన్నగారు. అలాగే చేశాడు. ♦ పిల్లలను పెంచడానికి అమ్మానాన్న ఎంతో కష్టపడతారు. వాళ్ల భవిష్యత్తు గురించి కలలు కంటారు. అంతలా పెంచే మీ అమ్మగారికి ఇచ్చిన గిఫ్ట్స్ గురించి? వసుంధర: శర్వా పదో తరగతిలో ఉన్నప్పుడు ఓసారి అమెరికా పంపించాం. అప్పుడు సూట్‌కేసు నిండా వంటింటి సామాన్లు తీసుకొచ్చి, నాకు గొప్పగా చూపించాడు. ఏదో ఒకటి కొని తెస్తుంటాడు. ‘అందరి బంధువయా’ షూటింగ్ అప్పుడు నాకు, తన వదినకు, వదిన అక్కకు చీరలు తెచ్చాడు. చాలా సంతోషంగా ఫీలయ్యాం. ఆ తర్వాత మా షష్టిపూర్తికి కృష్ణుడి బొమ్మను కానుకగా ఇచ్చాడు. ఆ గోడకు ఉన్న కృష్ణుడి బొమ్మ శర్వా ఇచ్చిందే.. ♦ మీ అమ్మగారు మీకిచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? శర్వా: అమ్మ ఫిలాసఫీయే నాకు గిఫ్ట్. ‘ఎవరినీ మోసం చేయకు, ఇచ్చిన మాటను నిలబెట్టుకో, ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండు’ అని నా చిన్నప్పుడే చెప్పింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ చెబుతూనే ఉంటుంది. అవి నా మనసులో నాటుకుపోయాయి. అమ్మ చెప్పే నీతి, విలువలు... వాటికన్నా గొప్ప బహుమతులు ఏం ఉంటాయి? ♦ మీ అమ్మగారి నుంచి ఇంకా ఏమేం నేర్చుకున్నారు? శర్వా: అమ్మ నాకెప్పుడూ రాముడి గురించి చెప్పేవారు. ఒకటే మాట. ఒకటే బాణం. నా లైఫ్‌లో ఇప్పటì æవరకు నేను ఒకరికి ఇచ్చిన మాటను తప్పలేదు. ఒకరి దగ్గర చేయి చాచి అడగకూడదు అని కోరుకుంటాను. వర్క్ మినహా ఇంకేం విషయంలో నేను చేయి చాచి అడిగే పరిస్థితులు రాకూడదని అనుకుంటున్నాను. ‘ఎవర్నీ మోసం చేయకు’ అని అమ్మ చెప్పిన విషయాన్ని జీవితాంతం పాటిస్తాను. ‘కో అంటే కోటి’ సినిమా నిర్మాతగా నాకు పెద్ద నష్టం తెచ్చింది. పెట్టుబడి పెట్టినప్పుడు లాభం రావచ్చు. నష్టం రావచ్చు. కానీ, ఆ టైమ్‌లో ఎవరో ఏదో అన్నారు. దాంతో నాకు నష్టం వచ్చినా ఫర్వాలేదనుకుని, మొత్తం డబ్బు వెనక్కి ఇచ్చేశాను. ఆ సినిమా మిగిల్చిన నష్టం నా మీద ఏ రేంజ్లో ఎఫెక్ట్ చూపించిందంటే అప్పటి నుంచి నేను ఓ కారు, ఇల్లు.. ఏదీ కొనుక్కోలేదు. ♦ పిల్లలు నష్టపోతే తల్లిదండ్రుల బాధ చిన్నది కాదు. శర్వా నష్టపోయినప్పుడు మీకేమనిపించింది? వసుంధర: అప్పటివరకూ కష్టపడి సంపాదించిన మొత్తం డబ్బునీ శర్వా పోగొట్టుకున్నాడు. చాలా బాధ అనిపించింది. అయితే ఏదో పాఠం నేర్చుకోవాలనే ఆ దేవుడు ఇలాంటి పరిస్థితులను కలగజేశాడని అనుకున్నాను. అది నిజం కూడా. తను ఆ సంఘటన నుంచి చాలా నేర్చుకున్నాడు. ♦ మీ కష్ట సుఖాలన్నింటినీ అమ్మతో షేర్ చేసుకుంటారా? శర్వా: పని గట్టుకుని చెప్పను. పిల్లల బాధను పేరెంట్స్ ఆటోమేటిక్‌గా అర్థం చేసుకుంటారు. మన ఫీలింగ్స్, మన ప్రవర్తన అమ్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి. మన ఒంట్లో కొంచెం నలతగా ఉన్నా అమ్మ ఇట్టే పసిగట్టేస్తుంది. ఎందుకంటే తను అమ్మ కాబట్టి. మా అమ్మానాన్నలది ఒకటే ఫిలాసఫీ. ‘నీ లైఫ్ నీది. ఒకర్ని మోసం చేయకుండా, హాని కలిగించకుండా ఏదైనా చెయ్యి.’ అనేవాళ్లు. కొడుకుగా అది పాటిస్తే వాళ్లు ఆనందపడతారు. ♦ మరి... అమ్మకు చిన్న కోడలిని ఎప్పుడు తెస్తారు? శర్వా: ఇంకా ఏమీ అనుకోలేదు. వసుంధర: పెళ్లి చేసుకోమని చెబుతూనే ఉన్నాం. ♦ మీకెలాంటి కోడలు రావాలనుకుంటున్నారు? వసుంధర: శర్వాను సంతోషంగా ఉంచే అమ్మాయి, తన మనసును అర్థం చేసుకుని, ప్రేమగా చూసుకునే అమ్మాయి వస్తే చాలు. అంతకు మించిన కోరికలు లేవు. ♦ శర్వా ప్రేమ వివాహం చేసుకుంటే మీకు ఇష్టమేనా? వసుంధర: ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటే మంచిదే. మా సెలక్షన్ ఎలా ఉంటుందోనని కాస్త భయం. తను సరైన నిర్ణయం తీసుకుంటాడని మా నమ్మకం. ♦ అమ్మను బాగా చూసుకునే అమ్మాయినే సెలెక్ట్ చేస్తారా? శర్వా: అంతే కదండీ. నాకు నచ్చిన అమ్మాయి, అమ్మను బాగా చూసుకోవాలి. ఆ విలువ ఉండాలి. అలా లేకపోతే నేను ఉండలేను. ♦ ఇంతకీ మీరు అమ్మ కూచీయేనా? చిన్నప్పుడు ప్యాకెట్ మనీ కోసం అమ్మతో నాన్నకు రికమండ్ చేయించుకునేవారా? శర్వా: నేను అమ్మ కూచిని. అవసరాన్ని బట్టి నాన్నకూచిగా కూడా మారతాను (నవ్వుతూ). ప్యాకెట్ మనీ విషయంలో అమ్మ రికమండేషన్ అవసరం ఉండేది కాదు. నేను వెయ్యి అడిగితే నాన్న రెండువేలిచ్చేవారు. ♦ మీ అబ్బాయిని ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫులూ అడుగుతుంటారు కదా. అప్పుడు ఎలా అనిపిస్తుంది? వసుంధర: ఆనందగానే ఉంటుంది. అయితే చుట్టూ జనాలు ఉంటే తనెక్కడ ఇబ్బందిపడతాడో అనిపిస్తుంది. శర్వా ఆడియో ఫంక్షన్స్ మిస్సవ్వను. లైవ్ చూస్తుంటాను. శర్వా: ఈ మధ్య ఇంటర్నెట్ కూడా నేర్చుకుంది. అంతకుముందు త్వరగా నిద్రపోయేది. ఇప్పుడు లేట్‌గా నిద్రపోతోంది (అమ్మవైపు కొంటెగా చూస్తూ).. ♦ ఇంటర్నెట్లో సెలబ్రిటీల గాసిప్స్ వస్తుంటాయ్.. మీ అబ్బాయి గురించిన వార్తలు చదివినప్పుడు ఫీలవ్వరా? వసుంధర: అసలా వార్తల గురించి శర్వాను మేం అడగం. తన మీద మాకంత నమ్మకం. శర్వా ఏం చేసినా కరెక్ట్‌గా చేస్తాడనుకుంటాం. ఒకవేళ ఏమైనా ఉంటే మాతో చెబుతాడు. ♦ అమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకుంటారా? శర్వా: అన్నయ్య దగ్గరుండి అమ్మను ఆస్పత్రికి తీసుకెళతాడు. నేను ఆరోగ్యం గురించి తెలుసుకుంటానంతే. వసుంధర: శర్వాకి హాస్పిటల్‌కి రావడం ఇష్టం లేక కాదు. తను వస్తే అందరూ తన చుట్టూ మూగిపోతుంటారు. అది హాస్పిటల్ వాళ్లకీ ఇబ్బందే కదా. నాతో రాకపోయినా.. ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటాడు. ♦ శర్వా అయ్యప్ప మాల వేసుకుంటారు కదా.. చిన్నప్పటి నుంచి తనకు దైవభక్తి ఉందా? వసుంధర: చిన్నప్పుడు తిరుపతి అవీ తీసుకెళ్లాం. దేవుడంటే సృష్టి కర్త. అందరూ సమానమే. నాకో గురువుగారు ఉన్నారు. ఆయన దగ్గర నాలెడ్జ్ తీసుకున్నాను. 1990లో ఆయన దగ్గర ఇన్నర్పీస్ గురించి తెలుసుకున్నా. అంతకు ముందు కొందరు స్వామీజీల దగ్గరకు వెళ్లాను. అయితే ఆ గురువుగారు చెప్పినవాటి మీద నమ్మకం కుదిరింది. రోజూ ఓ గంట ధ్యానం చేస్తా. చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నాడు కదా. అందుకే శర్వాకూ దైవభక్తి ఉంది. శర్వా: నేను పొట్టలో పడినప్పటి నుంచే అమ్మకు దైవభక్తి మొదలైంది. నాకా విషయం చాలాసార్లు చెప్పింది. వసుంధర: అవునండి. నేను గర్భవతిగా ఉన్నప్పుడు మంత్రం తీసుకున్నాను. మామూలుగా అయితే అలాంటప్పుడు మంత్రం తీసుకోకూడదంటారు. కానీ అప్పుడే మంచిదని కొందరన్నారు. లోపల ఉన్న బిడ్డకు కూడా మంచిదని చెప్పారు. తను కడుపులో ఉన్నప్పుడు మా చెల్లి భగవద్గీత చదివి, వినిపించేది. మూడు నాలుగేళ్ల వయసులో శర్వా తాను ధ్యానం చేస్తానని ధ్యానముద్రలో కూర్చునేవాడు. నాకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అది తెలుసు కాబట్టే, మా çషష్టిపూర్తికి కృష్ణుడి బొమ్మను బహుమతిగా ఇచ్చాడు. ‘రాధ’ సినిమాలో కృష్ణుణ్ణి ఇష్టపడే అబ్బాయిగా శర్వా నటించడం నాకు చాలా ఆనందం అనిపించింది. కృష్ణుడి మీద డైలాగ్స్ ఉండటం నాకు బాగా నచ్చింది. యాక్టింగ్ కూడా బాగుంది. ♦ ఫైనల్లీ మదర్స్ డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? శర్వా: అందరూ అమ్మను బాగా చూసుకోవాలి. ఆ ఒక్కరోజూ ప్రత్యేకం అనేం కాదు. నిత్యం అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులను చూడటం పిల్లల బాధ్యత. ఆ బాధ్యతను వదిలించుకోవాలనుకోకూడదు. ♦ బంధువులు, స్నేహితులు మీ అబ్బాయి ‘మంచి హీరో’ అని పొగుడుతుంటే ఏమనిపిస్తుంది? వసుంధర: కష్టపడి పైకి వచ్చాడు. ఒక తల్లిగా ఆనందమే. అయితే నాకా అభినందనలేవీ మనసుకి ఎక్కవు. శర్వా ప్రశాంతంగా ఉంటే చాలు. హీరో అయినా తను ముందు నా కొడుకు. అప్పుడప్పుడూ నైట్ షూటింగ్స్ చేస్తాడు. రెస్ట్ ఉండదు. దానివల్ల ఒక్కోసారి ఆరోగ్యం పాడవుతుంది. ‘గమ్యం’ టైమ్‌లో చాలా ఇబ్బందిపడ్డాడు. అలాంటప్పుడు బాధగా ఉంటుంది. ♦ శర్వా నటించిన సినిమాల్లో మీకు నచ్చినవి? వసుంధర: ‘అమ్మ చెప్పింది’ సినిమా చాలా ఇష్టం. ఒక్కసారే చూశాను. మళ్ళీ చూడాలనుకోలేదు. ‘వెన్నెల’ కూడా ఇష్టమే. కానీ, ఆ సినిమాని కూడా రెండోసారి చూడాలనుకోలేదు. ఎందుకంటే వాటిలో శర్వా పాత్ర ట్రాజెడీతో ఎండ్ అవుతుంది. శర్వా: ఆ సినిమాలు చూశాక, ‘ఇంకెప్పుడూ చనిపోయే క్యారెక్టర్లు చేయకురా’ అంది అమ్మ. అది సినిమాయే అయినా అమ్మకు నన్నలా చూడటం నచ్చదు. అందుకే అలాంటి క్యారెక్టర్లు మానేశా. వసుంధర: ‘శతమానం భవతి’, ‘రన్ రాజా రన్’ సినిమాలు బాగా నచ్చాయి. శర్వా గెటప్స్ సరిగా ఉండటం లేదని అనుకునేవాళ్లం. ‘రన్ రాజా రన్’ని చాలా ఎంజాయ్ చేశాం. ఆ సినిమాలో రౌడీ టైప్ గెటప్ నచ్చింది. ♦ యంగ్ హీరోల్లో వరుస హిట్లతో మీ అబ్బాయి దూసుకెళుతున్నారు.. ఎలా అనిపిస్తోంది? వసుంధర: తక్కువ టైమ్‌లో వరుస హిట్స్ వస్తాయని అనుకోలేదు కానీ, ఏదో ఒక రోజు సాధిస్తాడన్న నమ్మకం ఉండేది. శర్వా కష్టానికి ఆ భగవంతుని కృప తోడైంది. అందుకే ఇంత సక్సెస్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి శర్వాకు పట్టుదల ఎక్కువ. ఏదైనా అనుకుంటే అది సాధించేవరకు వదిలి పేట్టే రకం కాదు. – డి.జి. భవాని -
వివాహిత ఆత్మహత్య
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని జంతులూరులో ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు జంతులూరు గ్రామానికి చెందిన యంగప్ప, నారాయణమ్మల కుమార్తె వసుంధర (22) ముదిగుబ్బ మండలం పాల్యం గ్రామానికి చెందిన హరికి ఇచ్చి ఆరునెలల క్రితం పెళ్లి చేశారు. అయితే వసుంధరకు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఇందులో భాగంగానే తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శుక్రవారం కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చందానగర్‌లో దారుణ హత్య
హైదరాబాద్: చందానగర్‌లో దారుణ హత్య జరిగింది. అక్కడి లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఇంటి యజమానిని పనిమనిషి హత్య చేసింది. నగలకోసమే ఆమె ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. చందానగర్ లోని లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఉమాదేవి(65) అనే వృద్ధురాలు ఉంటోంది. ఆ ఇంట్లో పక్కనే మరో ఇంట్లో ఉంటున్న వసుంధర అనే మహిళ పనిమనిషిగా చేస్తోంది. ఆ వృద్ధురాలి నగలపై కన్నేసిన ఆమె ఉమాదేవీని కత్తితో పొడిచి తలుపులు వేసుకొంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో నిందితురాలు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పనిమనిషిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. -
మాజీ సీఎంకి స్వైన్‌ఫ్లూ
జైపూర్: రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా గెహ్లాట్ ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడి నుంచి జనవరి 30 న తిరిగి రాజస్తాన్ చేరుకున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో అస్పత్రికి వెళ్లి ఆదివారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హెచ్1ఎన్1 వైరస్ నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తెలినట్లు గెహ్లాట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ముందుగానే వ్యాధిని గుర్తించి మెరుగైన చికిత్స అందించడంతో ఆరోగ్యం నిలకడగానే ఉందని గెహ్లాట్ వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు. రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వం స్వైన్‌ఫ్లూని అరికట్టడంలో వైఫల్యం చెందిందని గెహ్లాట్ ట్వీట్ చేశారు.