మాజీ సీఎంకి స్వైన్ఫ్లూ | Ex-Rajasthan CM Ashok Gehlot down with swine flu, slams Vasundhara govt for outbreak | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంకి స్వైన్ఫ్లూ

Published Sun, Feb 1 2015 7:40 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

మాజీ సీఎంకి స్వైన్ఫ్లూ

మాజీ సీఎంకి స్వైన్ఫ్లూ

జైపూర్:
 రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వైన్ఫ్లూ బారిన పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా గెహ్లాట్ ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడి నుంచి జనవరి 30 న తిరిగి రాజస్తాన్ చేరుకున్నారు.  జలుబు, దగ్గు, జ్వరంతో అస్పత్రికి వెళ్లి ఆదివారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
 హెచ్1ఎన్1 వైరస్ నిర్ధారణ పరీక్షలో పాజిటివ్గా తెలినట్లు గెహ్లాట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ముందుగానే వ్యాధిని గుర్తించి మెరుగైన చికిత్స అందించడంతో ఆరోగ్యం నిలకడగానే ఉందని గెహ్లాట్ వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.  
రాజస్తాన్లో ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వం స్వైన్ఫ్లూని అరికట్టడంలో వైఫల్యం చెందిందని గెహ్లాట్ ట్వీట్ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement