చందానగర్లో దారుణ హత్య | murder in chanda nagar for old women jewellary | Sakshi
Sakshi News home page

చందానగర్లో దారుణ హత్య

Published Fri, Sep 9 2016 7:40 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

చందానగర్లో దారుణ హత్య

చందానగర్లో దారుణ హత్య

హైదరాబాద్: చందానగర్లో దారుణ హత్య జరిగింది. అక్కడి లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఇంటి యజమానిని పనిమనిషి హత్య చేసింది. నగలకోసమే ఆమె ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. చందానగర్ లోని లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఉమాదేవి(65) అనే వృద్ధురాలు ఉంటోంది.

ఆ ఇంట్లో పక్కనే మరో ఇంట్లో ఉంటున్న వసుంధర అనే మహిళ పనిమనిషిగా చేస్తోంది. ఆ వృద్ధురాలి నగలపై కన్నేసిన ఆమె ఉమాదేవీని కత్తితో పొడిచి తలుపులు వేసుకొంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో నిందితురాలు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పనిమనిషిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement