సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో, రోడ్ల మధ్యలో గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక, తాజాగా చందానగర్‌లో రోడ్డు మధ్యలో ఒక్కసారిగా భారీ గుంత పడింది. దీంతో, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
వివరాల ప్రకారం.. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీ నుంచి ధర్మపురి క్షేత్రం మార్గంలో శాంతినగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో కుంగి భారీ గుంత ఏర్పడింది. దీంతో, ఈ ఘటనపై స్థానికులు.. జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులకు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
అయితే, రోడ్డు కుంగి గుంత ఏర్పడిన చోట తాగునీటి పైపు లైన్, డ్రైనేజీ పైపు లైన్లు ఉన్నాయి. దీంతో రహదారి మధ్యలో గుంత ఏర్పడి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులు అటు వైపు వచ్చి ప్రమాదాలు బారిన పడకుండా గుంత చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment