Chanda Nagar
-
ప్రాణం తీసిన కుక్క భయం .. అసలేం జరిగిందంటే?
-
ప్రాణం తీసిన కుక్క భయం
హైదరాబాద్, సాక్షి: చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుక్క తరమడంతో మూడో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ ప్రైడ్ హోటల్లో ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తపడటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చిన తెనాలికి చెందిన ఉదయ్(23) రామచంపురం అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే.. ఆదివారం తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు చందానగర్‌లోని వీవీ ప్రైడ్ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. స్నేహితులతో కలిసి హోటల్లోని మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే అక్కడే ఉన్న ఓ వారిని తరిమింది. దీంతో భయాందోళనకు గురై హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోని కిటికీ నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాల పాలైన ఉదయ్‌ను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఉదయ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు.. గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. సీసీటీవీ కెమెరాలలో ప్రమాదం దృశ్యాలు రికార్డు అయ్యాయి. అసలు హోటల్ మూడో అంతస్తులోకి కుక్క ఎలా వచ్చింది? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేసు నమోదు చేసుకుని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: మూసీపై సీఎంది పూటకోమాట: హరీశ్‌రావు -
HYD: ఒక్కసారిగా కుంగిన భూమి.. నడిరోడ్డుపై భారీ గుంత
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో, రోడ్ల మధ్యలో గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక, తాజాగా చందానగర్‌లో రోడ్డు మధ్యలో ఒక్కసారిగా భారీ గుంత పడింది. దీంతో, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.వివరాల ప్రకారం.. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీ నుంచి ధర్మపురి క్షేత్రం మార్గంలో శాంతినగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో కుంగి భారీ గుంత ఏర్పడింది. దీంతో, ఈ ఘటనపై స్థానికులు.. జీహెచ్ఎంసీ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులకు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.అయితే, రోడ్డు కుంగి గుంత ఏర్పడిన చోట తాగునీటి పైపు లైన్, డ్రైనేజీ పైపు లైన్లు ఉన్నాయి. దీంతో రహదారి మధ్యలో గుంత ఏర్పడి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులు అటు వైపు వచ్చి ప్రమాదాలు బారిన పడకుండా గుంత చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు -
HYD: లలితా జ్యువెలరీ చోరీ కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ జ్యువెలరీ స్టోర్ లలితాలో జరిగిన చోరీ మిస్టరీ వీడింది. సేల్స్‌మెన్ దృష్టి మళ్లించి ఓ మహిళ నగలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ మిస్టరీని పోలీసులు చేధించారు. ఆ కిలాడీ లేడీని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నగరంలోని చందానగర్ లలితా జ్యువెలరీ స్టోర్ బ్రాంచ్‌లో డిసెంబర్ 31వ తేదీన నగలు కనిపించకుండా పోయాయి. దీంతో చోరీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. స్టోర్‌లో పలువురిని విచారించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా.. తొలుత లాభం లేకపోయింది. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. అయితే పదే పదే ఫుటేజీలను గమనించిన క్రమంలో.. మెరుపు వేగంతో నగలు మాయం చేసిన ఓ మహిళ కనిపించింది. ఖతర్నాక్ కిలాడీ ఈ కేసులో చోరీకి పాల్పడిన మహిళను సరూర్ నగర్‌కు చెందిన గౌతమిగా గుర్తించారు. విశేషం ఏంటంటే.. గౌతమి నగరంలో 13 చోరీ కేసుల్లో నిందితురాలు. రద్దీగా ఉండే జ్యువెల్లరీ షాపులే లక్ష్యంగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తూ వస్తోంది. క్షణాల్లో దొంగతనాలు చేసి మాయమైపోవడంలో దిట్ట అయిన గౌతమిని మొత్తానికి పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. -
HYD: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు బాలిక ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు ఓ బాలిక 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్ కుటుంబంతో కలిసి 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 4 నెలల క్రితం నల్లగండ్లలోని అపర్ణ సరోవర్‌లోని ఈ–104 ఫ్లాట్‌కు మారారు. సందీప్‌కు ఒక కుమార్తె ఆహానా (12) తెల్లాపూర్‌లోని గ్లెండేల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మ్యాథ్స్ ట్యూషన్ కోసం అదే అపార్ట్మెంట్లోని హెచ్–1501లో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వెళ్తుంది. అయితే ఆహానా తనకు ట్యూషన్ ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. అయిప్పటికీ వారు ట్యూషన్‌కు వెళ్లాలంటూ కూతురిని బలవంతం చేశారు. దీంతో చిన్నారి యాధా విధిగా శుక్రవారం స్కూల్ నుంచి 3.30 గంటలకు వచ్చి సాయంత్రం 4.50 గంటలకు 15వ అంతస్తులోని బాల్కనీ కిటికీ తీసుకుని కిందకు దూకేసింది. కింద పడటంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులు ఈ ఘటనపై చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
చందానగర్‌లోని థియేటర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లోని జేపీ సినిమాస్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అయిదు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతోంది. థియేటర్లో మూడు స్క్రీన్స్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. -
అనుమతులు లేకుండా ఐస్‌క్రీములు తయారుచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్
-
బీ అలర్ట్! హైదరాబాద్‌లో హానికర రసాయనాలతో ఐస్‌క్రీమ్‌లు..
సాక్షి, హైదరాబాద్: ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వీటికున్న క్రేజ్ వేరు. రోడ్లపై ఐస్‌క్రీం కనపడితే కొనిచ్చేంత వరకు పిల్లలు మారాం చేస్తుంటారు. ఇక వేసవి వచ్చిందంటే చాలు.. హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్‌గా ఐస్‌క్రీం తినాలనిపిస్తుంది. అందుకు ఈ సీజన్లో ఐస్క్రీంలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు దీన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. హానికరమైన రసాయనాలతో ఐస్క్రీంలను తయారీ, నకిలీ ఐస్‌క్రీంలపై బ్రాండెడ్ స్టిక్కర్లతో అమ్మకాలు జరుపుతున్నారు. ప్రజలు ప్రాణాల పణంగా, లాభాలే ప్రధాన అజెండాగా వ్యాపారం చేస్తున్నారు. భారీగా లాభాలు ఆర్జించేందుకు కల్తీ దారిని ఎంచుకుంటున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా చిన్న పిల్లలు తినే ఐస్ క్రీం ను కూడా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడో వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లోని చందానగర్‌లో వెలుగులోకి వచ్చింది. హానికరమైన రసాయనాలతో నకిలీ ఐస్‌క్రీమ్‌లను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ముఠా గుట్టు రట్టైంది. పోలీసులు జరిపిన దాడిలో బ్రాండెడ్ పేర్లతో నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో షాపులోని సరుకు సీజ్ చేసి నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తస్మాత్ జాగ్రత్త భాగ్యనగర ప్రజలారా! -
విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్: చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. మస్కిట్ లిక్విడ్ తాడి ఏడాదిన్నర బాలుడు మృత్యువాతపడ్డాడు. వివరాలు.. తారానగర్‌లో నివాసముంటున్న జుబేర్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కొడుకు జాకీర్ ఉన్నాడు. శనివారం బాలుడు ఇంట్లో ఆడుకుంటూ.. పొరపాటున అలౌట్ లిక్విడ్ తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తల్లిదండ్రులు బాలుడి బట్టలపై అలౌట్ లిక్విడ్ వాసన రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. -
Hyderabad: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని..
సాక్షి, మియాపూర్: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని, తన నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నాగేశ్వర్రావు వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం ఆరూర్ గ్రామానికి చెందిన చెల్మెడ అఖిల్(28) పటాన్‌చెరులోని శ్రీనగర్‌కాలనీలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 16న చందానగర్‌లోని ఓయో హోటల్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉన్నాడు. మరుసటి రోజు ఎంతకూ అఖిల్ బయటకు రాకపోవడంతో యాజమాన్యం కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో పరిశీలించగా అతడి మెయిల్లో ఓ సూసైడ్ నోట్‌ను గుర్తించారు. అందులో ‘ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. గత కొన్ని రోజులుగా తనతో మాట్లాడకుండా తన ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని.. రాసి ఉంది. మృతుడి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విషమిచ్చి.. ఆపై కత్తెరతో పొడిచి..
చందానగర్: భాగ్యనగరంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య, ఇద్దరు పిల్లలను అత్యంత పాశవికంగా చంపిన భర్త ఆపై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందానగర్ సీఐ క్యాస్ట్రో కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా కోహీర్కు చెందిన రామలింగస్వామి, శకుంతలమ్మ దంపతుల చిన్న కుమారుడు మడపతి నాగరాజు (42)కు మెదక్ జిల్లా పోల్కంపల్లికి చెందిన సుజాత (36)తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి సిద్ధార్థ్ (10), రమ్యశ్రీ (8) పిల్లలు ఉన్నా రు. నాగరాజు కుటుంబం కొంతకాలం కిందట నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో ఉన్న రా జీవ్ గృహకల్పలో నివాసం ఉంటోంది. నాగరాజు కిరాణా షాపులకు మాసాలాలు, ఇతర గృహావసర వస్తువులను సరఫరా చేస్తుండేవాడు. సుజాత ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ వడ్డీకి డబ్బులు ఇచ్చేది. గత కొన్నాళ్లుగా సుజాతపై అనుమానం పెంచుకున్న నాగరాజు.. ఆమెతో గొడవపడేవాడు. అతను కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో శుక్రవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యా, పిల్లలను చంపాలనుకున్న నాగరాజు ముందుగా వారికి విషమిచ్చి ఉంటాడని.. అయినా వారు బతికి ఉండొచ్చన్న అనుమానంతో ఇంట్లో ఉన్న టైలరింగ్ కత్తెరతో భార్యను తల, మెడపై పొడవగా కుమారుడు సిద్ధార్థ్‌ను కడుపులో, కూతురు రమ్యశ్రీని వీపు వెనుక భాగంలో పొడిచాడని పోలీసులు భావిస్తున్నారు. అనంత రం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు కిటికీలోంచి చూడగా ఇద్దరు పిల్లలు రక్తపుమడుగులో నిర్జీ వంగా కనిపించారు. దీంతో వారు వెంటనే చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సుజాత తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నాగరాజు సైకోగా మారి హత్యలు చేశాడా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనాస్థలిని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐ క్యాస్ట్రో పరిశీలించారు. తరచూ గొడవ పడేవారు: స్థానికులు నాగరాజు ఇరుగుపొరుగు వారితో మాట్లాడేవాడు కాదని... కానీ పిల్లలను మంచిగా చూసుకొనే వాడని స్థానికులు తెలిపారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చెప్పారు. నాగరాజు భార్య సుజాతతో శుక్రవారం మధ్యాహ్నం మాట్లాడినట్లు పొరుగింట్లో ఉండే లక్ష్మి, సుజాత స్నేహితురాలు మంజుల వివరించారు. శనివారం తాను ఉద్యోగానికి వెళ్లే క్రమంలో సుజాత ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయని మంజుల పేర్కొంది. తాను సుజాతకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో ఊరికి వెళ్లి ఉంటారని భావించి తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పింది. -
హైదాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి
చందానగర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. బుధవారం రాత్రి ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోఓగి అక్కడికక్కడే మృతి చెందాడు. చందానగర్ ఎస్ఐ శ్రీధర్ తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మూలపల్లి చంద్రమోహన్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దిలీప్ (27) నెల క్రితం ఓ సాప్ట్వేర్ కంపెనీలో చేరాడు. అమీన్పూర్లో బావ రాకేష్ ఇంటిలో నివాసముంటూ గచ్చిబౌలికి ఉద్యోగానికి వెళ్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటలకు దిలీప్ కుమార్ అతని స్నేహితుడు సూర్యతో కలిసి ఫల్సర్ బైక్‌పై అమీన్పూర్ నుంచి చందానగర్ వైపు భోజనం చేసేందుకు వెళ్తున్నారు. దారిలో రెయిన్బో స్కూల్ వద్దకు చేరుకోగానే ఆటో టీటీడీ లాజిస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్ త్రివీర్ వాహనం వేగంగా వచ్చి దిలీప్‌కుమార్ వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న దిలీప్ కుమార్ సూర్య కిందపడగా దిలీప్‌కుమార్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు దిలీప్‌కుమార్‌ను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పీఆర్కే ఆస్పత్రికి తరలించారు. చదవండి: సైబరాబాద్: ఖాకీలపై మూడో కన్ను గచ్చిబౌలిలో.. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్‌కు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలయ్యాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా జిల్లాకు చెందిన బోయపాటి అశోక్ కుమార్(26) గువా రెసిడెన్సీ, మియాపూర్‌లో నివాసం ఉంటూ మాస్ మ్యూచ్‌వల్ కంపెనీలె సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అదే రెసిడెన్సీలో నివాసం ఉంటే మదన్ మోహన్ రెడ్డి(24) జావా ఎజ్డీ బైక్‌పై వెళ్లి బధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒంటి గంటకు అశోక్ పికప్ చేసుకున్నారు. విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ట్రిపుల్ ఐటీ సబ్‌స్టేషన్ వద్ద ఫుట్‌పాత్‌ను అతి వేగంగా ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయాలై వెనక కూర్చున్న అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడిపిస్తున్న మదన్ మోహన్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటçపడి ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం రామాంజనేయులు దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
Hyderabad: పెళ్లి రోజే విషాదం.. భర్త, కొడుకుతో బైక్‌పై వెళ్తుండగా
సాక్షి, హైదరాబాద్: పెళ్లి రోజు భార్యభర్తలు తమ రెండేళ్ల కుమారుడితో నగరానికి వచ్చి సంతోషంగా గడిపి ద్విచక్ర వాహనంపై తిరిగి వె ళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన మేరకు.. ఆర్సీపురం మండలం వెలిమెల గ్రామానికి చెందిన మందమోళ్ల ప్రభాకర్ (28), ప్రసన్న (25) దంపతులకు రెండేళ్ల కుమారుడు జశ్విత్ ఉన్నాడు. గురువారం పెళ్లి రోజు కావడంతో ద్విచక్ర వాహనంపై ముగ్గురూ ఫోరంమాల్‌కు వచ్చి సంతోషంగా గడిపారు. సాయంత్రం గ్రామానికి తిరిగి వెళ్తుండగా చందానగర్‌లోని కేప్రీ హోటల్ వద్ద కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నపై బస్సు వెళ్లింది. ప్రభాకర్ కుడి చెయ్యిపై వెళ్లడంతో తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్, జశ్విత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్ ఓ ప్రైవేటు పాఠశాలలో గార్డెనింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం -
హైదరాబాద్‌లో విషాదం.. భర్త, మేనమామతో గొడవ.. న్యాయవాది ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్త, మేనమామ వేధింపులు భరించలేక ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ క్యాస్ట్రో తెలిపిన మేరకు.. శేరిలింగంపల్లిలోని లక్ష్మీ విహార్ ఫేజ్ –1 ఢిపెన్స్ ఎంప్లాయిస్ కాలనీలో మల్లికార్జున్‌రెడ్డి, శివాణి(24) దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. శివాణి జూనియర్ అడ్వకేట్‌గా పనిచేస్తూ శేరిలింగంపల్లిలో స్టాంప్ వెండర్ ఆఫీస్ నిర్వహిస్తోంది. శనివారం రాత్రి మల్లికార్జున్‌రెడ్డి, శివాణి మేనమామ రఘు, శివాణిల మధ్య స్టాంప్ పేపర్ల విషయంలో గొడవ జరిగింది. రాత్రి 11.30 గంటల సమయంలో గొడవ జరుగుతుండగా మనస్తాపం చెందిన శివాణి పక్కనే భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. శివాణీ తల్లి హేమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మేనమామ రఘు, భర్త పె కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం మేనమామ స్టాంపు పేపర్లు తీసుకెళ్లడంతోపాటు శివాణిని చదివించిన డబ్బివ్వాలని అడుగుతున్నాడని, దీనికితోడు శివాణి తల్లి ఆస్తిలో భాగం కావాలని భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదులోపేర్కొన్నారు. తెల్లవారితే కుమారుడి పుట్టినరోజు.. శివాణీ మూడేళ్ల కుమారుడు అనిరుధ్ పుట్టిన రోజు ఆదివారం కావడంతో వేడుకలకు ఏర్పాటు పూర్తి చేశారు. శనివారం రాత్రి జరిగిన గొడవతో శివాణి ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
హైదరాబాద్: నవ వధువు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. డొయెన్స్ కాలనీ ఉంటున్న ఫాతిమా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఫాతిమా తన భర్త, అత్తమామల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందని వివాహిత తల్లి తండ్రుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి -
పెళ్లైన మరునాడే.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో బుధవారం ఏడుగురు మృత్యువాతపడ్డారు. కీసర ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా.. సాగర్ హైవే సర్వీస్ రోడ్డులో ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని బోర్వెల్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శేరిలింగంపల్లి నేతాజీనగర్‌కు చెందిన నవదంపతులు బెంగళూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. పెళ్లైన మరునాడే.. సాక్షి, చందానగర్: నగరానికి చెందిన నవదంపతులు పెళ్లి అయిన మరునాడే రోడ్డు ప్రమాదానికి గురై విగతజీవులుగా మారారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్‌లో నివసించే పార్శి మురళీకృష్ణ, అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాసులు(38) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి చెన్నైకి చెందిన కనిమొళి(33)తో తిరుపతిలో ఆదివారం వివాహమైంది. సోమవారంరాత్రి 8.30 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఐ 10 వాహనంలో నవదంపతులతోపాటు ఇద్దరు బంధువులు చెన్నైకి ప్రయాణమయ్యారు. చదవండి: క్రిప్టో కరెన్సీ’ చేతికి రాలేదని.. ‘స్వాతీ.. పిల్లలు జాగ్రత్త.. అర్థం చేసుకో’ బెంగళూరు నుంచి 120 కి.మీ. దూరంలో రాత్రి 12 గంటల సమయంలో కారును నడుపుతున్న శ్రీనివాసులు ఆగివున్న లారీని ఢీకొట్టడంతోఅతను అక్కడికక్కడే మృతి చెందాడు. కోమాలోకి వెళ్లిన కనిమొళి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వారితో ప్రయాణిస్తున్న నవవధువు సోదరి, శ్రీనివాసులు కోడలు తీవ్ర గాయాలపాలయ్యా రు. శ్రీనివాసులు మృతదేహాన్ని బుధవారం ఉద యం నేతాజీనగర్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆగి ఉన్న లారీని ఢీకొని... సాక్షి, కీసర: పేట్ బషీరాబాద్‌లోని శ్రీని అవెన్యూ గేట్–3లో నివసించే సుమంత్‌రెడ్డి (20) తన సోదరుడిని ఖమ్మంలోని నీట్ కోచింగ్ సెంటర్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు అల్వాల్‌కు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(21), డ్రైవర్ శంకర్‌రెడ్డి(39)తో కలసి కారులో బుధవారం తెల్లవారుఝామున బయలుదేరారు. తిరుగుప్రయాణంలో ఉదయం 11.30 గంటల సమయంలో కీసర ఓఆర్ఆర్ ప్లాజాకు రెండు కిలోమీటర్ల దూరంలో కారు బ్రేక్‌డౌన్ అయింది. డ్రైవింగ్ చేస్తున్న సుమంత్‌రెడ్డి కారును అకస్మాత్తుగా ఎడమ వైపునకు మళ్లించగా, అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో సుమంత్‌రెడ్డి, శంకర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, పవన్‌కుమార్‌రెడ్డి (21)కి తీవ్రగాయాలయ్యాయి. కీసర పోలీసులు వచ్చి పవన్‌కుమార్‌రెడ్డిని ఈసీఐఎల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో పది నిమిషాలలోపు శామీర్‌పేట జంక్షన్ వద్ద రోడ్డు దిగి అల్వాల్‌కు చేరుకునే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. చదవండి: బస్ డ్రైవర్ నిర్లక్ష్యం..యువతి మృతి సాగర్ రహదారి సర్వీస్ రోడ్డుపై ప్రమాదానికి కారణమైన బోర్వెల్ వాహనం బోర్వెల్ లారీ ఢీకొని.. హస్తినాపురం: బోర్వెల్ వాహనం ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన విశాల్(21), నగరంలోని హబ్సిగూడకు చెందిన రోహిత్‌రెడ్డి (21), గౌతంరెడ్డిలు బీఎన్‌రెడ్డి నగర్లో నివసిస్తూ ఇబ్రహీంపట్నం సమీపంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. కాలేజీ వదిలిన వెంటనే వీరు స్కూటీపై నగరానికి బయలుదేరారు. సాగర్ రహదారి సమీపంలోని సర్వీస్ రోడ్డుపై సాగర్ కాంప్లెక్స్ వద్ద స్కూటీని, వెనుక నుంచి వేగంగా వచ్చిన బోర్వెల్ లారీ ఢీకొట్టడంతో విశాల్, రోహిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గౌతంరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. -
Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..
సాక్షి, చందానగర్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ తేదీన యువతి ఆత్మహత్య కేసులో అనేక విషయాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవిడికి చెందిన నాగచైతన్య(24) ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రియుడు గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన కోటిరెడ్డి(29) ప్రియురాలిని హత్య చేసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. చదవండి: ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్‌కి వచ్చి కత్తితో పొడుచుకుని.. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు అనేక విషయాలు తెలిశాయి. ఒంగోలులోని జిన్స్ హాస్పిటల్లో నాగచైతన్య నర్సు. అక్కడే కోటిరెడ్డి మేనేజర్‌గా పనిచేసేవాడు. వీరిద్దరి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. నాగచైతన్య తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోటిరెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కోటిరెడ్డి ప్లాన్ వేశాడు. 23వ తేదీ ఉదయం సిటిజన్ ఆస్పత్రి వరకు వచ్చిన అతను సాయంత్రం వరకు అక్కడే ఉండి నాగచైతన్యను ఎస్వీఆర్ గ్రాండ్ హోటల్లోని ఓయో రూమ్‌కు తీసుకెళ్లాడు. చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! ఓడ్కా తాగి రాత్రి అక్కడే బస చేసిన అతను స్విగ్గీలో ఇద్దరికీ భోజనం ఆర్డర్ చేశాడు. 24 తేదీ ఉదయం 11 గంటలకు హోటల్ గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతను నాగచైతన్యను హత్య చేసి ట్రైన్లో ఒంగోలుకు చేరుకున్నట్లు తెలిసింది. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా నాగచైతన్య రక్తపు మడుగులో మృతి చెందింది. కత్తి, తాడు కొనుగోలు.. 23న నగరానికి వచ్చిన కోటిరెడ్డి ఓ సూపర్ మార్కెట్లో కత్తి, తాడు కొనుగోలు చేశాడు. ఓయో రూమ్‌కు తీసుకెళ్లిన కోటిరెడ్డి ముందుగానే ఓడ్కా బాటిల్, కత్తి, తాడు తన బ్యాగ్‌లో తీసుకెళ్లాడు. రూమ్‌కు వెళ్లిన కొద్ది సేపటికే బయటకు వెళ్లి కూల్‌డ్రింక్స్ తీసుకొచ్చాడు. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. స్విగ్గీ బాయ్ నుంచి ఫుడ్ డెలివరీ తీసుకున్న అతను రూమ్‌లోకి వెళ్లి మరుసటి రోజు ఉదయం వరకు బయటకు రాలేదు. దీంతో పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. రాత్రి ఇరువురు ఓడ్కా సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. అనంతరం వివాహం విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకొని ఉంటుందని ఆ క్రమంలోనే ప్రియురాలిని కత్తితో గొంతుకోసి హత్య చేసి ఉంటాడని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరం ఫ్యాన్‌కు ఉరి వేసేందుకు చున్నీ ప్రయత్నించి ఉంటాడని పోలీసులు వెల్లడించారు. కులాంతరమే హత్యకు కారణమా? కోటిరెడ్డి రెడ్డి సామాజిక వర్గం కావడంతోనే నాగచైతన్యను వివాహం చేసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించి ఉంటారని తెలుస్తోంది. దళిత కులానికి చెందిన యువతి కావడంతో కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా ఒంగోలుకు వెళ్లిన సిటీ పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. -
హైదరాబాద్‌లో విషాదం: గాలిపటం ఎగురవేస్తూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడీ కాలనీలో చోటుచేసుకుంది. మంగళవారం నాడు అరవింద్(7) అనే చిన్నారి ఇంటి సమీపంలో గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. అయితే కొద్దిసేపటికి బాలుడు కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు చుట్టుపక్కలా వెతికారు. అయినప్పటికి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ? అయితే ఈ రోజు ఉదయం సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఉన్న బాలుడిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘బిజినెస్ పనిపై వచ్చాం’.. ఇంట్లోకి చొరబడి యువకుడిపై దాడి
సాక్షి, చందానగర్: ఇంట్లోకి చొరబడ్డ ఇద్దురు దుండగులు ఓ యువకుడిని కట్టేసి చితకబాదిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన శ్రీహర్ష(28), నెల్లూర్ పట్టణానికి చెందిన సాయిరాం(30) నాలుగు నెలలుగా చందానగర్‌లోని ఇంజినీర్ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శ్రీహర్ష సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, సాయిరాం సోలార్ టెక్నికల్ పనులు చేస్తున్నాడు. గురువారం రాత్రి 7.30కి వీరింట్లోకి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. శ్రీహర్ష ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ‘సాయిరాంతో బిజినెస్ పనిపై వచ్చాం.. అతను వచ్చే వరకు ఉంటాం’ అని అన్నారు. కొద్దిసేపటి తర్వాత మంచినీళ్లు కావాలని అడిగారు. నీళ్లు తెచ్చేందుకు కిచెన్‌లోకి వెళ్తున్న శ్రీహర్షపై వారిలో ఒకడు దాడి చేయడంతో నుదుటిపై గాయమైంది. ఇద్దరు అతడిని కుర్చీలోకి తోసి కాళ్లుచేతులు కట్టేసి, అరవకుండా నోట్లో గుడ్డ పెట్టి దాడి చేశారు. అనంతరం వెనుక డోర్ నుంచి పారిపోయారు. రాత్రి 9.30కి ఇంటికి వచ్చిన సాయిరాం కట్లును విప్పాడు. తర్వాత చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయని, వారిలో ఒకడి పేరు మల్లి అని బాధితుడు తెలిపాడు. బాధితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా ఎవ్వరూ రాలేదని తేలిందని ఎస్ఐ తెలిపారు. మరే మార్గంలో వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పగతోనే దాడి? ఈ నెల 16న శ్రీహర్ష, సాయిరాంలకు వారి ఇంటి పరిసరాల్లో ఉండే తాళ్లపల్లి సౌరబ్గౌడ్(28)తో గొడవ జరిగిందని, చిన్న గొడవ కావడంతో మందలించి వదిలేశామని పోలీసులు తెలిపారు. శ్రీహర్ష, సాయిరాంలు సిగరెట్ తాగుతుండగా సౌరబ్ గౌడ్ వారిని హెచ్చరించడమే కాకుండా ఇంటికి వెళ్లి దాడి చేశాడని, అనంతరం కాలనీ కమిటీ సభ్యులు ఇరువురినీ పిలిచి సర్ధిచెప్పి పంపేశారన్నారు. కాగా, సౌరబ్గౌడ్ ప్రతీకారంతోనే ఇద్దరు వ్యక్తులను పంపించి దాడి చేశాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతడిని పిలిచి విచారిస్తున్నారు. -
Hyderabad: బిర్యానీ పాషా అరెస్టు
చందానగర్: ఏ దొంగతనానికి వెళ్లినా సెంటిమెంట్‌గా ఒకే కారు వాడడం ఆ దొంగ ప్రత్యేకత. రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. బంగారు దుకాణాలు, ఫర్టిలైజర్ దుకాణాలు, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం చందానగర్ పోలీస్ స్టేషన్లో డీసీపీ వేంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణప్రసాద్ ఈ వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా రాంనగర్‌కు చెందిన సయ్యద్ మహబూబ్ పాషా అలియాస్ బిర్యానీ పాషా (39) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ అదే జిల్లాలోని సత్తాపూర్ గ్రామంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. చోరీ చేయాలనుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహించి ఓయో రూమ్ బుక్ చేసుకొని చోరీ చేసేవాడు. గడ్డపారలతో తాళం బద్దలు కొట్టి అక్కడ ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు దొంగతనం చేసేవాడు. వచ్చిన డబ్బులతో కార్లు కొనుగోలు చేసి జల్సాగా తిరుగుతుండేవారు. ఈ క్రమంలో పట్టుబడి జైలుకు కూడా వెళ్లివచ్చాడు. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా.. పీడీ యాక్ట్ నమోదైనా మారలేదు. ఈనెల 9న ఉదయం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్ తుల్జా భవానీ మందిర్ వద్ద ఉన్న తన జ్యువెలరీ దుకాణంలో చోరీ జరిగినట్లు సయ్యద్ పర్వీనా రెహన్ గుర్తించారు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుకాణంలో రూ.3.50 లక్షల నగదు, 15 తులాల బంగారం, 10 కేజీల వెండి ఆభరణాలు పోయాయని ఫిర్యాదు చేసింది. మంగళవారం లింగంపల్లి గుల్ మొహర్ పార్కు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా సయ్యద్ మహబూబ్ పాషా కారులో వస్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతనిని రిమాండ్‌కు తరలించి అతనివద్ద 3.5 తులాల బంగారం, 10 కిలోల వెండి వస్తువులు, రూ.35 వేల నగదు, నాలుగు కార్లు, సిగరెట్ ప్యాకెట్లుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: 2007లో కేసు నమోదు.. అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీనివాసరావు -
రోడ్డుపై గుంత: చందానగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు
చందానగర్: రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా తన వెన్నెముకకు గాయమైందని ఓ వ్యక్తి చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవవడంతో బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని చందానగర్ ఇన్స్పెక్టర్కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్‌కు చెందిన వంగల వినయ్ గత ఏడాది డిసెంబర్ 3న జాతీయ రహదారిపై తన ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై గంగారం వద్ద రోడ్డుకు అడ్డంగా తవ్వి వదిలేసిన గుంతలో బైక్ పడటంతో వినయ్ వెన్నెముకకు గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం..రహదారి పర్యవేక్షణ లేకపోవడంతో తనకు గాయమైందని దీనికి కారణమైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 6న ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు పరిశీలించి ఘటన జరిగిన ప్రాంతం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. ఫిర్యాదును చందానగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్లో కూడా వినయ్ మళ్లీ ఫిర్యాదు చేశారు. 15 రోజులైనా ఫిర్యాదుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి 2న హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో శనివారం చందానగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు జారీ చేసింది. జూన్ 21న హెచ్ఆర్సీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ( చదవండి: నగరంలో ముగ్గురు బాలికల అదృశ్యం ) -
వివాహిత ఆత్మహత్య.. భర్తపై ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : భవనంపై నుంచి దూకి ఓ వివాహిత శ్రీవిద్య (27) ఆత్మహత్యకు పాల్పడటం నగరంలోని చందానగర్‌లో కలకలం రేపింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆరు నెలల క్రితం వరంగల్‌కు చెందిన శబరిష్ అనే యువకుడితో కరీంనగర్‌కు చెందిన శ్రీవిద్యకు వివాహం జరిగింది. భర్త శబరిష్ ఉద్యోగరిత్యా బెంగళూర్‌కు వెళ్లడంతో ఆమె చందానగర్‌లోని వారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం భర్త శబరిష్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఏదో విషయంపై ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే ఏమైందో ఏమోగానీ ఐదో అంతస్తు భవనం నుంచి దూకారు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు గాయాల పాలైన శ్రీవిద్యను హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. శ్రీవిద్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అయితే భర్త శబరిష్ వేధింపులే కారణంగానే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
అసలు తప్పెవరిది?
-
హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?
పోలీసుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందా..? ప్రేమ వివాహం చేసుకొని..భార్యవైపు బంధువుల చేతుల్లో హతమైన హేమంత్ ఉదంతాన్ని పరిశీలిస్తే ఈప్రశ్నలే ఉదయిస్తున్నాయి. హేమంత్‌ను కిడ్నాప్ చేసిన కారును..వారి గొడవలను గమనించిన కొందరు స్థానికులు అడ్డుకోకపోగా సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయడంలో మునిగిపోయారు. కనీసం పోలీసులకూ సమాచారం ఇవ్వలేదు. ఇక సరైన సమాచారం అందినా..పోలీసులు వేగవంతంగా స్పందించ లేదని, సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అందువల్లే ఓ యువకుడి నిండుప్రాణాలు గాల్లో కలిశాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో : గచ్చిబౌలిలో కిడ్నాప్ అయి..సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ శివారు కిష్టాయిగూడెం వద్ద విగత జీవిగా మారిన హేమంత్ కుమార్ హత్యోందంతం ఇటు పౌరుల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతూ...అటు పోలీసింగ్ విధానం మారాలనే పాఠాన్నీ చెబుతోంది. గోపన్‌పల్లి తండా చౌరస్తా వద్ద కార్లు ఆగడం..వాటిలో పెనుగులాట జరిగిన తతాంగాన్ని సెల్ఫోన్లో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేందుకు ఆసక్తి చూపిన జనాలు..కాస్త మానవత్వం ప్రదర్శించి..అడ్డుకుని..పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఈ దారుణ ఘటన జరిగి ఉండేది కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3.42 గంటల ప్రాంతంలో మూడు కార్లు ఆగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వాటిని పరిశీలిస్తే అవంతి రెడ్డి కుటుంబ సభ్యుల వద్ద ఎటువంటి దాడి చేసే ఆయుధాలు లేవు. అయితే అక్కడ జరిగిన గలాటాను జనాలు చూశారే తప్ప ఎవరూ ఆపేందుకు ప్రయత్నించకపోవడంతో వారు మరింత రెచ్చిపోయారు. ఇలా దాదాపు 20 నిమిషాలకు పైగానే గడబిడ జరగడం..హేమంత్పై చేయిచేసుకోవడం జరిగింది. ఎలాగోలాగూ వారి నుంచి తప్పించుకొని హేమంత్ కుమార్ తెల్లాపూర్ రోడ్డువైపు పరుగులు తీశాడు. దీంతో అప్పటికే కిరాయి హంతకులు బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణలు కూర్చొని ఉన్న స్విఫ్ట్ కారు (టీఎస్08 ఈటీ 3031)ను డ్రైవ్ చేసిన అవంతి రెడ్డి మేనమామ యుగంధర్ రెడ్డి చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఆ తర్వాత కారులో ఎక్కించుకొని తెల్లాపూర్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎక్కి పటాన్చెరు వద్ద ఆగి అటు నుంచి జహీరాబాద్ వెళ్లారు. (చదవండి : హేమంత్ రిమాండ్‌లో సంచలన విషయాలు) ఇంతవరకు బాగానే ఉన్నా 3.50 గంటల ప్రాంతంలో అవంతి మామ (హేమంత్ తండ్రి) డయల్ 100కు కాల్చేస్తే 4.30 గంటలకు పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరొచ్చే 10 నుంచి 15 నిమిషాల ముందే హేమంత్‌ను కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకెళ్లారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే గోపన్‌పల్లి తండా చౌరస్తా వద్ద 11 మందిని అదుపులోకి తీసుకొని, అవంతిని, ఆమె అత్తమామలను ఠాణాకు తీసుకెళ్లారు. ఇక్కడా హేమంత్‌ను కారులో బలవంతంగా తీసుకెళ్లారని తెలిసిన పోలీసులు అటువైపుగా దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సమన్వయం చేసి ఉంటే బాగుండేది... అయితే అక్కడ పట్టుకున్న 11 మందిని విచారించారే తప్ప కిడ్నాప్ అయిన హేమంత్పై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బలవంతంగా లాక్కొని పారిపోయారని హేమంత్ భార్య అవంతిరెడ్డి చెప్పినా మరుక్షణమే పోలీసులు ఆ కారు నంబర్‌ను చుట్టుపక్కల ప్రాంత పోలీసులకు చేరవేసి ఉంటే దొరికి ఉండేది కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 4.15 గంటల ప్రాంతంలో కిడ్నాప్ అయిన హేమంత్‌కుమార్‌ను దాదాపు మూడు గంటలకుపైగా కారులో తిప్పడంతో ఎక్కడోఒక్క దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది. కేవలం యుగంధర్‌రెడ్డి, హేమంత్‌కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేసింగ్‌పైనే ప్రధానంగా దృష్టి సారించడం...ప్రత్యామ్నాయలుగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను సాధ్యమైనంత తొందరగా పరిశీలించకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. హేమంత్ కుమార్‌ను తీసుకెళ్లిన కారు వెళ్లిన మార్గంలో గస్తీ వాహనాలు ఉండి కూడా పట్టుకోకపోవడం పోలీసుల సమన్వయ లోపాన్ని వేలెత్తి చూపుతోంది. ‘హేమంత్ కుమార్‌ను తీసుకెళ్లిన కారు తెల్లాపూర్ వైపు వెళ్లిందని మాత్రమే తెలుసు. అటు నుంచి ఓఆర్ఆర్ మీదుగా పటాన్చెరు నుంచి జహీరాబాద్ వెళ్లిన విషయం తెలియదు. నిందితుడు యుగంధర్‌రెడ్డి నోరు విప్పితేనే కారు ఏయే మార్గంలో వెళ్లిందో తెలిసింద’ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. (చదవండి : ‘అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’) నోరు విప్పని లక్ష్మారెడ్డి హేమంత్ కుమార్‌ను చంపేందుకు సుపారీ ఇచ్చిన విషయాన్ని అవంతి రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసులకు చెప్పలేదు. అతన్ని 4.30 గంటలకు పట్టుకుని..కొన్ని గంటలపాటు విచారించినా అసలు ఏ విషయం తెలపలేదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఒకవేళ అతడు నోరు విప్పి ఉంటే ఇంకాస్త సీరియస్‌గా తీసుకొని హేమంత్ ఆచూకీ కోసం వెతికేవాళ్లమని గచ్చిబౌలి ఠాణాలోని ఓ అధికారి పేర్కొన్నారు. మామూలుగా గొడవలతో తీసుకెళ్లి ఉంటారని అనుకున్నామనే చెప్పుకొచ్చారు. ‘హేమంత్..ఒక్కసారి కళ్లు తెరు’ శేరిలింగంపల్లి : కిడ్నాప్‌నకు గురై కిరాతకంగా హత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు శేరిలింంపల్లి తారానగర్‌లోని శ్మశాన వాటికలో అశ్రునయనాల మధ్య శనివారం నిర్వహించారు. అంతకుముందు హేమంత్ మృతదేహాన్ని భద్రపరిచిన కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి తారానగర్‌లోని హేమంత్ నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే హేమంత్ భార్య అవంతిరెడ్డి, ఆయన తల్లిదండ్రులు లక్ష్మీరాణి, మురళీకృష్ణలు బోరున విలపించారు. ‘ఒక్కసారి కళ్ళు తెరువు...హేమంత్..’అంటూ అవంతిరెడ్డి భర్త మృతదేహంపై పడి రోదిచడం...అరేయ్... తమ్ముడూ అంటూ ఒక్కసారి పిలువురా. పిలువు.... వాడొచ్చాడురా...చూడురా....వాడి మొహం చూడరా..అంటూ హేమంత్ తల్లి లక్ష్మీరాణి కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. అంతకుముందు లండన్ నుంచి హేమంత్ తమ్ముడు సుమంత్ రావడంతో అతన్ని చూడగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం తారానగర్‌లోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు తండ్రి మురళీకృష్ణ నిర్వహించారు. హేమంత్ స్నేహితులు ‘అమర్ హై హేమంత్’అంటూ నినాదాలు చేశారు. (చదవండి : వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి) రెండు రోజుల క్రితమే ఫోన్లో మాట్లాడా: సుమంత్ హేమంత్ హత్యకు కారణమైన వారికి నూరు శాతం శిక్ష పడాలని అతని తమ్ముడు సుమంత్ డిమాండ్ చేశారు. తారానగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకుంటే చంపుతారా...? అని ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటి వరకు కేసు విషయంలో బాగా చేశారని, డబ్బు ఆశ చూపినా పట్టించుకోకపోవడంతో వారు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం పెరిగిందని, సీఐ ఎవరో...నాకు తెలియదు...కానీ భవిష్యత్‌లో కూడా ఈ కేసు విషయంలో న్యాయం చేస్తారనుకుంటున్నామన్నారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చు అనే ధీమాలో హంతకులు ఉన్నారన్నారు. రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడాను. చిన్నతనం నుంచి అన్నీ నాకు వాడే...వాడిని నాకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భవిష్యత్తును నాశనం చేసిన వారికి శిక్ష పడాలి : అవంతిరెడ్డి హేమంత్‌తో వివాహమైన నాలుగు నెలలకే ఈ విధంగా చేయడం ఏంటి? అని హేమంత్ సతీమణి అవంతిరెడ్డి ప్రశ్నించారు. 15 మంది కలిసి నా భర్తను హత్య చేస్తారా..? నాపై ప్రేమ ఉంటే నేనుప్రేమించిన వ్యక్తిని చంపుతారా? అని ప్రశ్నించారు. నా భవిష్యత్‌ను నాశనం చేసి ఈ హత్యలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శిక్షపడాలన్నారు. యుగంధర్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ : అవంతి
సాక్షి, హైదరాబాద్ : కులాంతర వివాహం చేసుకున్న పాపానికి హత్యకు గురైన హేమంత్ సోదరుడు సుమంత్ యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. అన్న మృతి తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. వదిన అవంతిని పట్టుకుని బోరున విలపించాడు. తన అన్నను చంపిన వారిని ఎవరిని వదలనని, వారందరినీ కఠినంగా శిక్షించాలని సుమంత్ డిమాండ్ చేశాడు. హత్య జరిగే రెండు రోజుల ముందు అన్నయ్య తనకు ఫోన్ చేశాడని, బిజినెస్ సంబంధించిన పలు అంశాలపై చర్చించామని తెలిపాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకే తన అన్నను అతి కిరాతంగా హత్య చేశాడని, చెప్పులతో కొట్టుకుంటూ మరీ తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని చందానగర్ శ్మశాన వాటికలో శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. (మరో ‘పరువు’ హత్య) అంత్యక్రియల సమయంలో హేమంత్ భార్య అవంతి, తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. తన కొడుకు కన్నా ముందు నన్ను పాడె మీద పడుకోబెట్టండి అంటూ హేమంత్ తల్లి పాడే మీద పడుకోబోయింది. ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ అంటూ భార్య అవంతి రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మరోవైపు ఈ హత్యలో ప్రధాన సూత్రధారి యుగేందర్ రెడ్డితోపాటు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి కిరాయి హంతకుడితో ఆమె భర్త ప్రణయ్‌ను హత్య చేయించిన ఘటన మరువకముందే.. మరో పరువు హత్య జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
హేమంత్ కేసులో 13మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : చందానగర్‌కు చెందిన హేమంత్ కుమార్ హత్యకేసులో మొత్తం 13మందిని అదుపులోకి చేసినట్లు మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులను వైద్య పరీక్షలు నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ హేమంత్ హత్యకేసులో అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి ప్రధాన నిందితుడని వెల్లడించారు. హేమంత్ తల్లిదండ్రులు ఫోన్ చేయగానే తాము స్పందించామని, అతడి ఆచూకీ కోసం అన్నివిధాల ప్రయత్నించామన్నారు. (హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం) కేసు వివరాల గురించి డీసీపీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... చందానగర్‌లోని తారానగర్‌లో అవంతి రెడ్డి, హేమంత్ కుమార్ ఉండేవాళ్లు. అవంతి బీటెక్ చేయగా, హేమంత్ డిగ్రీ పూర్తి చేసి బిజినెస్ చేస్తున్నాడు. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ 11న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చందానగర్ పోలీసులు ఇద్దరు తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కౌన్సిలింగ్ తర్వాత హేమంత్, అవంతి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. నిన్న మీతో మాట్లాడాలంటూ అవంతి కుంటుంబ సభ్యులు మూడు కార్లులో గచ్చిబౌలిలోని హేమంత్ ఇంటికి వచ్చారు. (మమ్మల్ని నమ్మించి మోసం చేశారు: అవంతి) చందానగర్ వెళ్లాలంటూ వారిద్దరినీ కారులో తీసుకెళ్లుతుండగా అనుమానం రావడంతో అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. వెంటనే కారులో నుంచి తప్పించుకుని అవంతి తన అత్తమామలకు ఫోన్ చేసింది. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డితో పాటు మరికొందరు హేమంత్‌ను మరో కారులో తీసుకు వెళ్లారు. హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తం అయ్యారు. హేమంత్ ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. నిన్న రాత్రి గోపన్‌పల్లిలో తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకున్నాం. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హేమంత్‌ను సంగారెడ్డిలో హత్య చేసి, మృతదేహాన్ని అక్కడే పడేసినట్లు ఒప్పుకున్నాడు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నాం.’ అని తెలిపారు. నిందితుల వివరాలు.. 1.లక్ష్మారెడ్డి 2.సందీప్ రెడ్డి 3.రంజిత్ రెడ్డి 4. రాకేష్ రెడ్డి 5.సంతోష్ రెడ్డి 6.విజేందర్‌రెడ్డి 7.యుగేందర్ రెడ్డి 8.స్వప్న 9.రజిత 10.స్పందన 11.అర్చన 12.సాహెబ్ పటేల్ (డ్రైవర్) మూడు కార్లు స్వాధీనం హేమంత్ హత్యకు వినియోగించన మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. బ్రీజా, ఐ20,షిఫ్ట్ కార్స్ మూడింటిని కిడ్నాప్ హత్యకు నిందితులు వినియోగించారు. హత్యకు మందే పక్కా పథక రచన చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య
-
హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక అల్లుడిని అతి కిరాతంగా హత్య చేయించాడో తండ్రి. చందానగర్‌కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి మనుషులతో హేమంత్‌ను నిన్న మధ్యాహ్నం కిడ్నాప్ చేయించి, సంగారెడ్డిలో హత్య చేయించాడు. కాగా హేమంత్ భార్యతో కలిసి ఉండగానే కిరాయి హంతకులు గురువారం మధ్యాహ్నం వారిద్దరినీ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతి మాత్రం కారులో నుంచి తప్పించుకుని 100కి సమాచారం ఇచ్చింది. తన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు హేమంత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి యువతి తల్లిదండ్రులతో పాటు తొమ్మిదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో లభ్యమైన హేమంత్ మృతదేహం యువతి తండ్రి ఇచ్చిన సమాచారంతోనే సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని కనుగొన్నారు. గచ్చిబౌలి పోలీసులు నిన్న అర్థరాత్రి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఈ హత్యకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు సంగారెడ్డి క్లూస్ టీమ్ కిష్టాయాగూడెం వెళ్లింది. -
చందానగర్‌లో దారుణం..
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లోకి రానివ్వనందుకు ఓ యువతి వాచ్మన్ని చితకొట్టింది. ఈ సంఘటన చందానగర్‌లోని సిరి అపార్ట్మెంట్లో మంగళవారం చోటు చేసుకుంది. కారులో వచ్చిన ఓ యువతి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అనుమతి లేకుండా అపార్ట్మెంట్లోకి వెళ్లకూడదంటూ వాచ్‌మ్యాన్ ఆమెను అడ్డుకున్నాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి కారు దిగి వచ్చి వాచ్‌మన్ మీద విచక్షణారహితంగా దాడి చేసింది. పిడి గుద్దులు కురిపించడమే కాక కాలితో తన్నింది. అక్కడితో ఆగకుండా చెప్పుతో ఇష్టమొచ్చినట్టు కొట్టింది. ఈ దృశ్యాలన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. (చదవండి: మద్యం మత్తులో యువతుల హల్చల్) -
వాచ్‌మ్యాన్‌ని చితక్కొట్టిన యువతి
-
ఏ తల్లి కన్నబిడ్డో... ఎందుకు వదిలేసిందో
సాక్షి, చందానగర్ : ఏ తల్లి కన్నదో...ఎందుకు వదిలేసిందో తెలియదు...పుట్టిన కొద్ది గంటల్లోనే ఓ పసికందును రోడ్డుపై వదిలేశారు. స్థానికులు ఆ పసికందును చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్లితే.. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహా కల్ప బ్లాక్ నెం. 26,27 మధ్య రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్న ఒక మగ శిశువును వదిలేశారు. మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చలికాలం కావడంతో ఆ బాలుడు గుక్క పెట్టి ఏడవంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం స్థానికులను విచారించారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం కొండాపూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌లో బాలుడ్ని అప్పగించినట్టు సీఐ రవీందర్ తెలిపారు. ∙ -
చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఒకే విధమైన సేవలను అందించేవిధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బాధితులు ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చందానగర్ పోలీసులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని, ప్రజలను భాగస్వాములను చేస్తూ నేరాల అదుపునకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలలో భద్రతా భావాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఇక్కడి సిబ్బంది స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించుకొని సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ని అనుసరిస్తూ, కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులను ఎప్పడికప్పుడు క్లియర్ చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లలో ఉన్న పనులను 16 విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగానికి ఒక్కో అధికారిని నియమించి వారికీ బాధ్యతలు అప్పజెప్పి నూతన టెక్నాలజీ సహకారంతో నేరస్థులకు శిక్షలు పడేలా చేస్తున్నామన్నారు. ప్రజలే-పోలీసులు, పోలీసులే-ప్రజలు అనే భావన కలిగించిన చందానగర్ పోలీసుల పనితీరుకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు చందానగర్ పీఎస్‌ను ఆదర్శవంతంగా తీసుకొని పనిచేయాలన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభత్వం ఒకేసారి 18 వేల పోలీస్ సిబ్బంది నియామకాలు చేపట్టడం గొప్ప విషయమని డీజీపీ చెప్పారు. -
స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మంజీర డైమండ్ టవర్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఈ నెల 4న జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన రోజునే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా.. ఈ విషయాన్ని పోలీసులు నేటి వరకు గోప్యంగా ఉంచారు. బాలుడు మృతి పై తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. గేటెడ్ కమ్యూనిటిలో ఉన్న స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్త చేశారు. యాజమాన్యంపై వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నయోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా.. బాధ్యులపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు తమ కుమారుడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
4 గంటల నరకయాతన.. లిఫ్ట్ గోడలు పగలగొట్టి..
సాక్షి, హైదరాబాద్ : చందానగర్ పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లో మూడేళ్ల బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకున్నాడు. సుమారు నాలుగు గంటలపాటూ నరకయాతన అనుభవించాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 ఉద్యోగులు శ్రమించి బాలుడిని సురక్షితంగా రక్షించడంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. దీంతో స్థానికులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. స్వగృహలో అపార్ట్మెంట్లోని బ్లాక్ నంబర్ ఈఏ2లో నివాసం ఉండే ఫనీంద్ర చారి కుమరుడు సౌర్యన్ ఆడుకుంటూ లిఫ్ట్ ఎక్కాడు. పై వరకు వెళ్లిన లిఫ్ట్ సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. దీంతో సౌర్యన్ అరవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లిఫ్ట్ గోడలు పగలగొట్టి బాలుడుని రక్షించడంతో నాలుగు గంటల ఉత్కంఠకు తెర పడింది. -
గోపన్‌పల్లిలో విషాదం
హైదరాబాద్: చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి గోపన్‌పల్లిలోని బెల్లా విస్తా విల్లాస్ ఆర్చ్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. పిల్లర్ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. శుక్రవారం రాత్రి బేబీ అమ్ములు(6), ప్రవల్లిక(3) అనే ఇద్దరు అక్కా చెల్లెల్లు ఆరుబయట ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ పిల్లర్ కూలి చిన్నారులపై పడటంతో తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. చిన్నారుల తండ్రి దస్తగిరి లేబర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ ఏటీఎమ్‌లలో చోరి!
సాక్షి, క్రైమ్ : నగరంలోని చందానగర్ ఏరియాలోని ఏటీఎమ్‌లలో చోరి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీఐసీఐకి చెందిన మూడు ఏటీఎమ్‌లలో ఈ దొంగతనం జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చోరి అయిన సంగతి గుర్తించిన ఏటీఎమ్ సిబ్బంది... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ముసుగు వేసుకుని వచ్చి.. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎమ్‌లను కాల్చి దాదాపు 13లక్షల వరకు దోపిడి చేశారు. పోలీసులు సీసీటీవి పుటేజీ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
వంటింటి వ్యర్ధాలతో బయోగ్యాస్
గచ్చిబౌలి: కిచెన్ నుంచి నిత్యం వచ్చే వేస్ట్‌ను వృథాగా పడేయకండి. ఆ వ్యర్థాలతో ఎంచక్కా గ్యాస్ ఉత్పత్తి చేసుకోండి. పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌తో ఇట్టే వండుకోండి. మిషన్ నుంచి వెలువడే ద్రవ పదార్థాన్ని మొక్కల ఎరువుగా వాడుకోండి. కిచెన్ వ్యర్థాలు బయట పడేసేందుకు ఇక స్వస్తి పలకండి. జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ అధికారులు బయోగ్యాస్ మిషన్‌లో కిచెన్ వ్యర్థాలు వేసి గ్యాస్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎవరికి వారు కిచెన్‌లో ఫోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను అమర్చుకోవచ్చు. ఇప్పటికే చందానగర్ సర్కిల్లో పోర్టబుల్ బయోగ్యాస్‌పై డెమో నిర్వహించారు. ప్రయోజనాలెన్నో.. బహుళ ప్రయోజనాలు కల్గిన పోర్టబుల్ బయో గ్యాస్‌ను జీహెచ్ఎంసీలో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం సన్‌గ్రీన్ ఆర్గానిక్ వ్యవస్థాపకురాలు అరుణ శేఖర్ చందానగర్ సర్కిల్–20లో పోర్టబుల్ బయో గ్యాస్‌పై అవగాహన కల్పించారు. దీనిపై వేస్ట్ 500 గ్రాముల తడి చెత్త నుంచి 100 కిలోల తడి చెత్త వెలువడే మిషన్లను అమర్చుకోచ్చు. ఇలా పని చేస్తుంది.. పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను కిచెన్ బాల్కనీలో పెట్టి పైపును కిచెన్‌లో ఉంచుతారు. మిషన్‌తో పాటు స్టౌ కూడా ఉంటుంది. మిషన్ వెంట వచ్చిన బయో కల్చర్‌తో పాటు ఆవు పేడను గుజ్జుగా కలిపి డబ్బాలో వేస్తారు. ఆ తర్వాత మిగిలిపోయిన అన్నం, పండ్లు, కూరగాయల తొక్కలు, సాంబారు, బియ్యం కడిగిన నీళ్లు, మిగిలిపోయిన బోన్ లెస్ మాంసం ముక్కలను అందులో వేయాలి. 24 గంటల అనంతరం గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. మిషన్‌కు మూత ఉండటంతో ఎలాంటి దుర్వాసన రాదు. నిత్యం వాడితే కొద్దిమొత్తంలో వేస్టేజ్ బయటకు వస్తుంది. దానిని పూలు, కూరగాయలు, చెట్లకు ఎరువుగా వాడవచ్చు. 2 కిలోల తడి చెత్త సామర్థ్యం కలిగిన ఫోర్టబుల్ బయో గ్యాస్ మిషన్ విలువ రూ.40,000 ఉంటుంది. రెండు కిలోల చెత్తతో రోజు అర గంట నుంచి గంట సేపు గ్యాస్‌ను ఉపయోగించుకోవచ్చు. కాఫీ, టీతో పాటు ఇతర వంటలు చేసుకునే వీలుంది. -
అనుమానం అంతం చేసింది
సాక్షి, హైదరాబాద్: ప్రేమ అన్నాడు. సహజీవనం చేశాడు. ఓ కుమార్తె జన్మకు కారణమయ్యాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం.. ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉండటంతో ప్రేమికురాలిని దారుణంగా చంపాడు. కుమార్తెను, ప్రేమికురాలి తల్లిని కూడా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో శనివారం జరిగిన ఈ మూడు హత్యల ఉదంతం సోమవారం ఉదయం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన గుడూరి జయమ్మ(50)కు కుమార్తె అపర్ణాదేవి(33), కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు. అపర్ణ అమ్మమ్మ ఊరు పాలకొల్లు మండలం ఉల్లంపర్రు. అదే గ్రామానికి చెందిన రావాడ మధు కేపీహెచ్బీలో సెల్ఫోన్లు రిపేర్ చేస్తుంటాడు. అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు పదేళ్ల క్రితం మధుతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే తనకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారన్న విషయాన్ని దాచి అపర్ణతో సహజీవనం చేయసాగాడు. వీరికి ఐదేళ్ల వయస్సున్న పాప కార్తీకేయ కూడా ఉంది. చందానగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఎల్జీ ప్రమోటర్‌గా పనిచేస్తున్న అపర్ణ ప్రస్తుత ఫ్లాట్‌లో రెండున్నర నెలలుగా తల్లి, కుమార్తెతో కలసి ఉంటోంది. దుర్వాసన రావడంతో వెలుగులోకి ... బయట నుంచి తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని నారాయణరావు అనుమానం వచ్చి వెనక వైపు కిటికీలో నుంచి చూశాడు. హత్యకు గురైన అపర్ణ కాళ్లు కనిపించాయి. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. కిచెన్‌లో రక్తపు మడుగులో పడి అపర్ణ మృతి చెంది ఉంది. బెడ్‌పై జయమ్మ, కార్తికేయ తనువు చాలించి ఉన్నారు. అపర్ణ తలపై బలంగా కొట్టి చంపినట్టుగా అనవాళ్లు ఉన్నాయని చెప్పిన పోలీసులు చెప్పారు. జయమ్మ, కార్తికేయ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. క్లూస్ టీం, ప్రత్యేక డాగ్ స్క్వాడ్లు ఘటనాస్థలాన్ని పరిశీలించాయి. ఘటనాస్థలిని సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ పరిశీలించారు. షానవాజ్ ఖాసీమ్ మాట్లాడుతూ ‘అపర్ణను తలపై రోకలిబండతో మోది కిచెన్‌లో హత్య చేశారు. బెడ్‌పై పడుకున్న జయమ్మ, కార్తికేయను గొంతుకు పిసికి చంపి ఉండొచ్చు. లేదంటే విషమిచ్చి చంపి ఉండవచ్చ’న్నారు. హత్య చేసిన అనంతరం బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయాడన్నారు. సీసీటీవీ కెమెరాల పరిశీలన... హత్య ఎప్పుడు, ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేముకుంటలోని ఫ్లాట్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అపర్ణ సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. చందానగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి శనివారం 2.48 గంటలకు విధుల్లో నుంచి బయటకు వస్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డయింది. భోజనం చేసి వస్తానని చెప్పి వెళ్లిన అపర్ణ రాకపోవడంతో 3.30 గంటలకు సహచర ఉద్యోగి ఫసీయుద్దీన్ ఫోన్ చేయగా కలవలేదు. రెండు నెలలుగా గొడవ... అపర్ణతో సహజీవనం చేస్తున్న మధు తరచూ వేముకుంటలోని నివాసానికి వస్తుండేవాడు. అయితే, అపర్ణను వదిలేయంటూ మొదటి భార్య నుంచి ఒత్తిడి ఎక్కువ కావడం, అదే సమయంలో పెళ్లి చేసుకోవాలంటూ అపర్ణ కూడా బలవంతం చేస్తుండడంతో ఇద్దరి మధ్య రెండు నెలల నుంచి గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ హత్యలు చోటుచేసుకున్నాయి. అయితే, అపర్ణతో తాను సహజీవనం చేస్తున్నానని, మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. శనివారం మధ్యాహ్నం అపర్ణ ఇంటికి రాగానే తలుపు తీశానని, వెంటనే ఆమె తలను గోడకేసి బాది చంపానని నిందితుడు అంగీకరించినట్లు తెలిసింది. -
ట్రిపుల్ మర్డర్: అపర్ణ భర్త లొంగుబాటు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని శేరలింగపల్లిలో ఓ కుటుంబం హత్య గురికావడం కలకలం రేగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అపర్ణ అనే మహిళకు కూకట్‌పల్లికి చెందిన మధు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రముఖ ఎలక్ర్టానిక్ కంపెనీలో అపర్ణ సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుండగా.. ఆమెతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఉంటోంది. రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం.. ఇంటి నుంచి వాసన రావాడాన్ని సోమవారం ఉదయం గమనించిన వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బలమైన గాయాలతో.. రక్తపు మడుగులో అపర్ణ కిచెన్‌లో.. ఆమె తల్లి, కుమార్తె ఒక గదిలో హత్యకు గురయ్యారు. అయితే మధు ఇది వరకే జరిగిన పెళ్లిని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఇటీవల అపర్ణకు, భర్త మధుకు మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇరువురు చందానగర్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధు.. అపర్ణను, కుమార్తెను సరిగా చూసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా మధు మొదటి భార్య కుటుంబం, అపర్ణను బెదిరించినట్టు కూడా చెబుతున్నారు. తన భర్తను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అపర్ణపై, మొదటి భార్య కుటుంబ సభ్యులు ద్వేషం పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణాలతో అపర్ణ, ఆమె తల్లి, కుమార్తె హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు అపర్ణ భర్త మధు ఇవాళ మధ్యాహ్నం చందానగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య
-
తల్లడిల్లిన తల్లిగుండె
బిడ్డల అనారోగ్యంతో కలత చెందిన కన్న తల్లి.. ఓ పాపతో సహా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన చందానగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. తల్లి స్వాతితో పాటు తొమ్మిది నెలల పాప శాన్వీ కూడా మృతి చెందడం స్థానికులను కలచివేసింది. చందానగర్: పుట్టిన ఇద్దరు చిన్నారులు తరచూ ఆనారోగ్యానికి గురవుతుండడంతో కలత చెందిన ఓ తల్లి తొమ్మిది నెలల చిన్నారితో సహా భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వేణుకుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా, హుజురాబాద్‌కు చెందిన ప్రదీప్‌కుమార్, స్వాతి (30) దంపతులు. సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ కుటుంబంతో సమా చందానగర్ కేఎస్ఆర్ ఎన్‌క్లేవ్‌లోని సాయిపెరల్ రెసిడెన్సీలో ఉంటున్నాడు. సాయిపెరల్ రెసిడెన్సీ ,తల్లీబిడ్డల మృతదేహాలు వీరికి కుమారుడు అరుశురాం(5), శాన్వీ (9 నెలలు) ఉన్నారు. చిన్నారులిద్దరూ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండటంతో స్వాతి మానసికంగా బాధపడుతుండేది. అరుశురాం అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. సోమవారం ఉదయం స్వాతి, చిన్నారి శాన్విని తీసుకొని తమ అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన స్థానికులు బాధితులను మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
జన పథం - చందానగర్
-
నెలలో పెళ్లి.. ఎంత పని చేసింది!
చందాగనర్: అమ్మా.. అని పిలుస్తూనే వృద్ధురాలి నగలపై పనిమనిషి కన్నేసింది... అదను కోసం ఎదురు చూసింది.. అన్నం తింటున్న ఆమెపై దాడి చేసి కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతురాలి మెడలోని బంగారు నగలు, చేతి గాజులు తస్కరించింది. పోలీసులు పట్టుకోవడానికి రావడంతో కత్తితో పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. మానవత్వం మంటగలిసిన ఈ దారుణ ఘటన చందానగర్ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ తిరుపతిరావు కథనం ప్రకారం... శేరిలింగంపల్లి లక్ష్మీ విహార్ ఫేజ్ –2లో 95 నెంబర్ గల ఇంట్లో నివాసముండే శ్రీనివాస్, సునీత దంపతులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. శ్రీనివాస్ తల్లి ఉమాదేవి (65) ఇంట్లోనే ఉంటోంది. వీరి పక్కింటి పనిమనిషి వసుంధర లక్ష్మి(21) రోజూ ఉమాదేవిని అమ్మా.. అని పలకరిస్తూ కబుర్లు చెప్పేది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలు కాజేయాలని ఆమె పథకం వేసింది. శుక్రవారం ఉదయం శ్రీనివాస్, సునీత దంపతులు ఆఫీసుకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉమాదేవి మధ్యాహ్నం 1.50కి భోజనం చేస్తోంది. అదే సమయంలో పనిమనిషి తలుపు తట్టింది. ఉమాదేవి వెళ్లి తలుపు తీసి.. మళ్లీ అన్నం తింటోంది. ముందే వేసుకున్న పథకం ప్రకారం ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అన్నం తింటున్న వృద్ధురాలిపై వసుంధర లక్ష్మి దాడి చేసి కత్తితో గొంతుకోసింది. వృద్ధురాలి అరుపులు విని 94 నెంబర్ ఇంట్లో ఉండే రామ్మోహన్ వచ్చి చూడగా ఇంటికి గడియపెట్టి ఉంది. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన వెంటనే పోలీసులకు, ఉమాదేవి కుమారుడు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చాడు. పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వంటగదిలో వసుంధరలక్ష్మి తచ్చాడుతూ కనిపించింది. పోలీసులు ఇంట్లోకి వస్తే వారిపై చల్లేందుకు కారంపొడి పట్టుకొని కిటికీ వద్ద నిలుచుంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ అనుమతితో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా వృద్ధురాలు ఉమాదేవి రక్తపుమడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె మెడలోని నగలను, గాజులను కాజేసిన పనిమనిషి వసుంధరలక్ష్మి వాటిని దేవుడి గదిలో దాచింది. తన ను పట్టుకోవడానికి వస్తున్న పోలీసులను చూసి కూరగాయలు కోసే కత్తితో పొట్టలో పొడుచుకుంది. పోలీసులు అంబులెన్స్‌లో ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఉమాదేవి మృతి చెందింది. నిందితురాలు చికిత్స పొందుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల్లో పెళ్లి .. లక్ష్మీ విహార్ ఇంటి నెం. 69లో ఉండే కర్నూలు జిల్లాకు చెందిన అనుపమ ఇంట్లో వసుంధరలక్ష్మి నాలుగేళ్లుగా పని చేస్తూ ఇక్కడే ఉంటోంది. నెల రోజుల్లో పెళ్లి చేస్తామని, తమ కూతురిని ఊరుకు పంపాలని అనుపమను వసుంధరలక్ష్మి తల్లి కోరగా.. తనకు పని మనిషి దొరకగానే పంపిస్తామని చెప్పింది. శుక్రవారం ఉదయం 8.30కి అనుపమ ఉద్యోగానికి వెళ్తూ కొత్త పనిమనిషి దొరికిందని, వారం రోజుల్లో నిన్ను మీ ఊరుకు పంపిస్తానని వసుంధర లక్ష్మికి తెలిపింది. అంతలోనే ఈ దారుణానికి ఒడిగట్టింది. -
చందానగర్‌లో దారుణ హత్య
హైదరాబాద్: చందానగర్‌లో దారుణ హత్య జరిగింది. అక్కడి లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఇంటి యజమానిని పనిమనిషి హత్య చేసింది. నగలకోసమే ఆమె ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. చందానగర్ లోని లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఉమాదేవి(65) అనే వృద్ధురాలు ఉంటోంది. ఆ ఇంట్లో పక్కనే మరో ఇంట్లో ఉంటున్న వసుంధర అనే మహిళ పనిమనిషిగా చేస్తోంది. ఆ వృద్ధురాలి నగలపై కన్నేసిన ఆమె ఉమాదేవీని కత్తితో పొడిచి తలుపులు వేసుకొంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో నిందితురాలు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పనిమనిషిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. -
చిన్నారి కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో బుధవారం ఉదయం చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంట్లో ఆడుకుంటున్న ఏడు నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు పదిహేను రోజుల క్రితం నగరానికి వచ్చి లింగంపల్లిలోని పాత మున్సిపల్ ఆఫీసు వద్ద నివాసముంటున్నారు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులు ఇంటి పనుల్లో బిజీగా ఉండగా ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత చిన్నారి కనిపించడం లేదని గుర్తించిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
శునకం... ఓ ఫుల్ మీల్స్
చాలామంది తాము జంతు ప్రేమికులమని చాటుకోవడానికి గొప్ప గొప్ప జాతి శునకాలను పెంచుకోవడం ప్రస్తుతం స్టేటస్ సింబల్‌గా చలామణీలో ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ, పలువురిని నేను దగ్గరి నుంచి పరిశీలించినప్పుడు వాటి పట్ల ఆయా యజమానులకు ఉన్న ‘ప్రేమ’ కళ్లకు కట్టింది. తాము తిని వదిలేసిన, మిగిలిపోయిన ఆహారాన్ని తమ పెంపుడు శునకాలకు పెట్టడం చూశాను. శునక ప్రేమికులకు నేను చెప్పేది ఒక్కటే.. ‘వాటిని పోషించే స్థోమత లేకుంటే, వాటికి సరైన తాజా ఆహారాన్ని పెట్టలేకుంటే వాటిని పెంచుకోకండి. పెంచుకునేటట్టయితే వాటికి సంబంధించిన ఆహార నియమాలను పాటించండి’. నేను ఒకసారి చందానగర్ గంగారంలోని సరస్వతి కర్రీ పాయింట్లో మధ్యాహ్నం భోజనం చేసి.. నేను తిన్న విస్తరిని బయట వేశాను. అంతలో ఒక శునకం అక్కడకు వచ్చి ఆ విస్తరిలో ఆత్రుతగా తలదూర్చింది. వెంటనే ఒక భోజనం పార్శిల్ కొని దాని ఎదుట ఉంచాను. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తి ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించాడు. శునకం విశ్వాసపాత్రమైన జంతువు. దానిని తక్కువగా చూడొద్దు. - ఏరువ ఆరోగ్యరెడ్డి ఆగపేట గ్రామం, నర్మెట్ట, వరంగల్ జిల్లా -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను బలిగొన్న ఆర్టీసీ బస్సు
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉసురుతీసింది. చందానగర్ ఏఎస్సై జాఫర్ అలీ కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు నవీన్‌కుమార్ (25) మదీనాగూడలోని కృష్ణా రెసిడెన్సీలో ఉంటూ గచ్చిబౌలిలోని టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 12.30కి బైక్‌పై గచ్చిబౌలి వైపు వెళ్తుండగా... లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ వద్ద హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు నవీన్‌బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. తలకు తీవ్రగాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్ స్నేహితుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.