
బిడ్డల అనారోగ్యంతో కలత చెందిన కన్న తల్లి.. ఓ పాపతో సహా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన చందానగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. తల్లి స్వాతితో పాటు తొమ్మిది నెలల పాప శాన్వీ కూడా మృతి చెందడం స్థానికులను కలచివేసింది.
చందానగర్: పుట్టిన ఇద్దరు చిన్నారులు తరచూ ఆనారోగ్యానికి గురవుతుండడంతో కలత చెందిన ఓ తల్లి తొమ్మిది నెలల చిన్నారితో సహా భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వేణుకుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా, హుజురాబాద్‌కు చెందిన ప్రదీప్‌కుమార్, స్వాతి (30) దంపతులు. సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ కుటుంబంతో సమా చందానగర్ కేఎస్‌ఆర్ ఎన్‌క్లేవ్‌లోని సాయిపెరల్ రెసిడెన్సీలో ఉంటున్నాడు.
సాయిపెరల్ రెసిడెన్సీ ,తల్లీబిడ్డల మృతదేహాలు
వీరికి కుమారుడు అరుశురాం(5), శాన్వీ (9 నెలలు) ఉన్నారు. చిన్నారులిద్దరూ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండటంతో స్వాతి మానసికంగా బాధపడుతుండేది. అరుశురాం అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. సోమవారం ఉదయం స్వాతి, చిన్నారి శాన్విని తీసుకొని తమ అపార్ట్‌మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన స్థానికులు బాధితులను మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment