Swathi
-
దృశ్యం సినిమాను తలపించిన స్వాతి కేసు
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: జిల్లాలో ఓ మహిళ మిస్సింగ్ కేసు కాస్త విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన స్వాతి అనే మహిళ.. ముక్కలై గోనె సంచిలో తేలింది. దృశ్యం సినిమాను తలపించిన ఈ కేసులో ప్రియుడే ఆమెను దారుణంగా హతమార్చగా.. డబ్బే అందుకు ప్రధానకారణమని తేలింది.జూలూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన వీరభద్రం.. స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వీరభద్రం భార్యతో స్వాతికి గొడవ జరిగింది. ఇందుకు సంబంధించి చుంచుపల్లి పీఎస్‌లో స్వాతిపై కేసు నమోదైంది. అయితే ఈ విచారణలో భాగంగా స్వాతి కోసం పోలీసులు ఆరా తీయగా.. ఆమె కనిపించడం లేదనే విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో వీరభద్రంను విచారించిన జూలూరుపాడు పోలీసులు.. అతని నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో విచారించగా.. స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం నేరం ఒప్పుకున్నాడు. ఈపై ఆమెను చంపి పాతిపెట్టిన గోనె సంచిని తవ్వి తీసి పోలీసులకు అప్పగించాడు. మొత్తం డబ్బు తనకే ఉండాలని.. గతంలో జూలూరుపాడు మండలానికి చెందిన ఓ జంటకు.. సింగరేణిలో ఉద్యోగాలిప్పిస్తామని స్వాతి నమ్మబలికింది. వాళ్ల దగ్గరి నుంచి రూ.16 లక్షల దాకా వసూలు చేసి వీరభద్రం చేతికి అప్పగించింది. అయితే ఎంతకీ వాళ్ల నుంచి బదులు లేకపోవడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించారు ఆ భార్యభర్తలు. అయినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. ఆ డబ్బు మొత్తం తానే అనుభవించాలనే ఉద్దేశంతో స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. -
తాను అత్తారింటికి వెళ్లిపోతే అమ్మకు కష్టమని, బిడ్డ షాకింగ్ నిర్ణయం
కాకినాడ క్రైం: కాకినాడలో తల్లీకుమార్తెల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథపురం పెంకేవారి వీధిలో శ్రీదుర్గానివాస్ పేరుతో జీప్లస్ వన్ భవనం ఉంది. దానిలోని కింద అంతస్తులో ఆకాశం సరస్వతి (60), ఆమె కుమార్తె స్వాతి (28) ఉంటున్నారు. సరస్వతి భర్త 16 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వివాహిత అయిన పెద్ద కుమార్తె విశాఖపట్నంలో ఉంటోంది. చిన్న కుమార్తె స్వాతి టైలరింగ్ చేస్తూ సరస్వతిని పోషిస్తోంది. కాగా.. వీరి ఇంటి నుంచి మంగళవారం దుర్వాసన రావడంతో పైఅంతస్తులో ఉన్నవారు గమనించి ఇంటి యజమాని గుర్రాల శ్రీనివాస్‌కు చెప్పారు. ఆయన సమాచారంతో సీఐ నాగదుర్గారావు, బృందం అక్కడికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల సరస్వతి మంచంపై పడి చనిపోయి ఉంది. స్వాతి ఉరివేసుకుని కనిపించింది. వీరిద్దరూ కలిసి ఉరి వేసుకోగా, బరువుకు చీర తెగిపోయి సరస్వతి మంచంపై ఉండి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నాగదుర్గారావు తెలిపారు.తల్లికి అనారోగ్యంసరస్వతి కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. స్వాతి ఆమెను కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి వైద్యం చేయించింది. తల్లి ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుండడంతో స్వాతి మనోవేదనకు గురయ్యేది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లి ఏమైపోతుందోనని బాధపడుతూ ఉండేది. ఈ కారణంతోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. కాగా.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో పొరుగున ఉన్న మహిళ దుస్తులను కుట్టించుకునేందుకు స్వాతి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తల్లీకుమార్తెలిద్దరూ నవ్వుతూనే మాట్లాడారు. ఆదివారం పాలు వేసే వ్యక్తి వచ్చి తలుపు తట్టినా తీయలేదు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
నవ్వుతూ.. నవ్విస్తూ..
నలుగురితో నారాయణ అని కాకుండా నలుగురిలో నేను వేరయా అన్నట్లు ఆర్జేలలో ఆర్జే స్వాతి వేరయా అని నిరూపిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో అటు ఆర్జేగా ఇటు సోషల్‌మీడియా సెలబ్రిటీగా మరోవైపు ఇంట్లో ఇల్లాలిగా, పిల్లల ఆలనాపాలనతో పాటు పలు షోలను చేస్తూ తన సత్తాచాటుతోంది. ఆర్జేగా చేశామా అనేది కాకుండా కొంగొత్త థీమ్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ.. తన గెటప్స్‌తో అదరగొడుతున్నారు. నవ్వించడం చాలా కష్టం.. అందులో ఎదుటువారిమీద జోక్వేసి నవ్వించడం ఒకతీరైతే.. తనమీద తానే జోక్స్ వేసుకొని డిఫరెంట్ గెటప్స్‌తో నవ్వించడం మరోతీరు. ఈ కోవకే చెందుతారు ఆర్జే స్వాతి. పేరడీ, రీమిక్స్‌తో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తూ.. సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తున్న ఆర్జే స్వాతి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. టిపికల్ మిడిల్‌క్లాస్ ప్యామిలీ.. టిపికల్ మిడిల్‌క్లాస్, స్ట్రిక్ట్ ప్యామిలీ.. మాది. పుట్టింది వరంగల్.. అక్కడే స్కూలింగ్ చేశాను. హైదరాబాద్ రామాంతపూర్‌లో డిగ్రీ చేసి బీపీఓలో ఉద్యోగం చేసేదానిని. మొదట్లో హైదరాబాద్ కల్చర్‌ను అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ త్వరగా మేలుకొని అలవాటయ్యాను. నాకు మాట్లాడటం అలవాటు.. ఎదుటివారితో కలిసిపోవడం, నవి్వంచడం చాలా ఇష్టం. బీపీఓలో గడగడా మాట్లాడుతూ కస్టమర్ కేర్‌లో గడసరిగా పేరుతెచ్చుకున్నాను. అలా 2013లో ఆర్జేగా మీరు కూడా అవ్వొచ్చు అనే అడ్వర్టైజ్మెంట్ రావడంతో ఇంట్లో చెప్పకుండా ఆర్జే ఆడిషన్స్‌కి వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ రేడియో మిర్చి వారికి నచ్చి నన్ను ఆర్జేగా తీసుకున్నారు.ఇమిటేషన్, కొత్త థీమ్స్ ఇంటర్వ్యూలు.. అందరిలా ఆర్జే చేయడం కన్నా కొద్దిగా సరికొత్తగా చేయడం ఇష్టం. అలా గురు సినిమా హీరో వెంకటేష్‌తో హీరోయిన్ మాదిరి ఇమిటేషన్ ఇంటర్యూ చేయడం ఆయనకు నచి్చంది. సందర్భానుసారం మట్లాడుతూ, మిమిక్రీ చేస్తూ, సినిమా ఇంటర్యూలలో ఆ సినిమా తాలూకూ థీంని తీసుకొని ఇంటర్యూ చేసేదానిని. అలా ఆర్జేగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.ఇన్స్టాగ్రామ్ వీడియోలకు స్పందన.. సోషల్ మీడియా వచ్చాక ఇన్స్టాగ్రామ్ వేదికగా నవ్వించే వీడియోలు చేశాను. కానీ సరికొత్తగా చేయాలనే తపనతో రీమిక్స్ గెటెప్ల వైపు మొగ్గాను. ట్రెండింగ్‌లోని వీడియోలకు అచ్చం అలాగే గెటప్స్ వేసి రీమిక్స్ వీడియోలు చేయడం ప్రారంభించాను. నెటిజన్ల నుండి అనూహ్య స్పందన లభించింది. ట్రెండింగ్ వీడియోస్‌లోని వారిని అనుకరించడానికి వారి గెటప్స్‌కి పేరడీగా ఇంట్లో వంట వస్తువులు, కూరగాయలు, నూడిల్స్, మా కుంటుబసభ్యుల దుస్తులు వాడతాను. అలా చేయడం నెటిజన్లను మరింత ఆకర్షించింది. దీంతో రీమిక్స్‌కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాలో లక్షాపదివేల మంది ఫాలోవర్స్ వచ్చారు. కొంగొత్త కంటెంట్‌తో నవి్వంచడం నా కర్తవ్యం. ఓ రోజు మా స్టూడియోకి మాజీ మంత్రి కేటీఆర్ వచి్చనపుడు ర్యాప్ సాంగ్ పాడాను. ఆయనకు చాలా నచ్చి మీరు ర్యాపరా కూడానా అని మొచ్చుకున్నారు.లేడీ కమెడియన్ అవ్వాలి.. నేటితరంలో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉన్నారు. కోవై సరళలాగా తనమీద తనే జోకులు వేసుకుంటూ చేసే కామెడీని చేయాలన్నది నా కోరిక. లేడీ కమెడియన్‌గా అడుగులు వేస్తున్నాను. పలు టీవీ షోల వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో ఆర్జేగా, సోషల్ మీడియాతో పాటు బుల్లితెర, వెండితెరలలో నవ్వులు పూయించాలన్నదే నా ఆకాంక్ష.. నవ్వూతూ బ్రతకాలిరా.. నవ్వుతూ చావాలిరా.. నా చివరి శ్వాస వరకూ ప్రేక్షకులను నవి్వంచడానికి ప్రయతి్నస్తూనే ఉంటాను.. ఇట్లు.. మీ ఆర్జే స్వాతి. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
పటాన్చెరు టౌన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్నకొడుకునే హత్య చేసిందో తల్లి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ రవీందర్ రెడ్డి, పటాన్చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా పుల్కంపేటకు చెందిన స్వాతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో భర్త కుమార్ మృతి చెందాడు. వీరికి విష్ణువర్ధన్ (8)అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో స్వాతి ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్‌తో కలసి ఉంటోంది. మూడు నెలల నుంచి వీరు పాత రామచంద్రపురంలో నివాసం ఉంటున్నారు. అయితే తల్లి వ్యవహార శైలిపై కొడుకు నిలదీసేవాడు. ఈ క్రమంలో 10వ తేదీన తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కొడుకు తమకు అడ్డుగా ఉన్నాడని కోపం పెంచుకున్న స్వాతి తాగిన మైకంలో కొడుకు గొంతు నులిమి హత్య చేసింది. అనిల్‌కు తన కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నమ్మబలికింది. ఇద్దరూ కలసి మృతదేహాన్ని అదేరోజు రాత్రి పటాన్చెరు మండలం ముత్తంగి సర్వీస్ రహదారి పక్కన పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మృతుడు పాత రామచంద్రపురానికి చెందిన బాలుడని తేలడంతో పోలీసులు స్వాతి ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల భయంతో స్వాతి, అనిల్ శుక్రవారం రాత్రి వారు ఉంటున్న గదిని ఖాళీ చేసేందుకు రాగా పటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో కొడుకును తానే హత్య చేసినట్లు విచారణలో స్వాతి ఒప్పుకోవడంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. -
కళసాకారం..
ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువ ఆర్టిస్ట్ విజయ్,స్వాతి జంట. పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో లార్జ్‌స్కేల్ ఆర్ట్ వర్క్స్ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్ స్టార్ట్ అయింది. అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది. మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్ వర్క్ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్ మూమెంట్స్‌ని క్యాప్చర్ చేసి వాటినే ఆర్ట్ వర్క్స్‌గా మలిచాం. తద్వారా పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్ ఆర్ట్ వర్క్‌లో చూసుకుని థ్రిల్ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్‌కి, ఫ్రెండ్స్‌కీ చూపించే సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్ మాస్టర్, టీచర్లు, స్టాఫ్.. మా స్కూల్‌కు బెస్ట్ ఆర్ట్ వర్క్ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్ ఏరియా స్కూల్స్‌లో చేశాం. ప్రతీ స్కూల్లో వర్క్ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. – సత్యార్థ్ నాడు అలా.. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి. నేడు ఇలా.. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. -
తల్లీకూతుళ్లు రోడ్డు దాటుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు!
మంచిర్యాల: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రార్థనల్లో చర్చికి వెళ్తున్న తల్లీకూతురుపైకి లారీ మృత్యువు రూపంలో దూసుకువచ్చింది. జాతీయ రహదారి దాటుతుండగా ఇద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లాలోని నస్పూర్‌కు చెందిన వేల్పుల నిర్మల(44), వేల్పుల స్వాతి(21) ప్రార్థనల కోసం కాసిపేట సమీపంలోని కల్వరి బయల్దేరారు. చర్చి సమీపంలో రాత్రి వాహనం దిగి రోడ్డు దాటుతుండగా మందమర్రి నుంచి బెల్లంపల్లి వైపునకు వెళ్తున్న బొలేరో వ్యాన్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ చర్చి సమీపంలోనే ఘటన జరుగడంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారిని 108లో బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుల వద్ద ఉన్న బ్యాగ్‌లో లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా మృతులు నస్పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఇదిలా ఉండగా ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు సీఐ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవి చదవండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా? -
మహిళా కానిస్టేబుల్ మృతి! భర్తే హత్య చేశాడా?
ఖమ్మం: ఖమ్మం 4వ డివిజన్ బాలాజీనగర్‌లో నివాసముంటూ భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మీగడ స్వాతి (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం అర్బన్ ఎస్ఐ పి.వెంకన్న కథనం ప్రకారం.. స్వాతి రెండేళ్ల కిందట ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న సమయాన రాజీవ్‌నగర్‌గుట్టకు చెందిన కారుడ్రైవర్ ప్రవీణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని నెలలు పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగింది. వీరికి 19 నెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వరకట్నం తీసుకురావాలని ప్రవీణ్ వేధిస్తుండడంతో స్వాతి అప్పు చేసి రూ.9 లక్షలు, తండ్రి నుంచి మరో రూ.14 లక్షలకు పైగా ఇప్పించింది. అయినా సంతృప్తి చెందని ప్రవీణ్ మద్యం సేవిస్తూ ఏపని చేయకుండా నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో స్వాతి, ప్రవీణ్ ఘర్షణ పడినట్లు తెలుస్తుండగా పెద్దగా శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. దీంతో సమీపంలోనే ఉండే స్వాతి సోదరి కవిత వచ్చేసరికి స్వాతి కిందపడుకుని, ఉందని, ఏమైందని ఆరా తీస్తే ఉరి వేసుకుందని ప్రవీణ్ చెప్పాడని కవిత వెల్లడించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. కాగా, ప్రవీణ్ ఉరి వేసి స్వాతిని హత్య చేసినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని కవిత ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇవి చదవండి: కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్లనివ్వకుండా నిర్బంధం -
సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది?
సాక్షి, కడప: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామంలో సీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రవీంద్రబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లెల గ్రామానికి చెందిన బలక రమేష్, సునీత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పొలం పనులు చేసుకుని పిల్లలను చదివించేవారు. పెద్ద కుమార్తె స్వాతి (21) గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ కళాశాలలో సీఏ చదువుతుండగా, రెండో కుమార్తె బీటెక్, చిన్న కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సీఏ చదువు పూర్తి చేసుకున్న పెద్ద కుమార్తె స్వాతి గుంటూరు నుంచి 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ తరుణంలో గురువారం సాయంకాలం నీ చదువు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం, పరీక్షలు బాగా రాశావా తల్లీ, గతంలో లాగా కాకుండా, ఈ సారైనా పాస్ అవుతావా అని కన్నవాళ్లు స్వాతిని ప్రశ్నించారు. లేకుంటే మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తామని సున్నితంగా సూచించారు. సదరు యువతి ఏమనుకుందో ఏమో, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో, లేదా కన్నవాళ్ల ఆశలు నెరవేర్చలేనేమో అని అనుకుందో గాని క్షణికావేశంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: తమ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధరాత్రివేళ కిరాతకంగా మారిన అన్న.. -
చిన్నారిని చిదిమేసిన కారు.. శోకసంద్రంలో తల్లిదండ్రులు..
రాజన్న సిరిసిల్ల: మండలంలోని గాజులపల్లిలో ఆరేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు చిదిమేసింది. ఈ ప్రమాదంలో చుట్టపుచూపుగా వచ్చిన చిన్నారి మృతితో గాజు లపల్లిలో విషాదం నిండింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన కొట్టెం పద్మ–రామారావు దంపతుల కూతురు స్వాతి(6)తో కలిసి గాజులపల్లిలో ఉంటున్న సమీప బంధువుల ఇంటికి ఆదివారం వచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ ప్రముఖుడు తన కారులో సిరిసిల్ల నుంచి మండల కేంద్రానికి వస్తుండగా రోడ్డు దాటుతున్న స్వాతిని అతివేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల పగిలిపోవడంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్సై రమాకాంత్ అక్కడికి చేరుకొని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం స్వాతి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ కుటుంబీకులు, గ్రామస్తులు సిరిసిల్ల–కామారెడ్డి రోడ్డుపై ధర్నా చేశారు. -
నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి
నటనపై విమర్శలు చేస్తే స్వీకరిస్తా కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పర్సనల్ విషయాలపై ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రసారం తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అని హీరోయిన్ స్వాతి అన్నారు. నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. శుక్రవారం (అక్టోబర్ 6) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్‌పై దర్శకుడు అసహనం వ్యక్తం చేశారు. ‘మా సినిమా చూసి కొంతమంది మంచి రివ్యూలు రాశారు. మా వర్క్ ఎక్కడ బాగుంది? ఎక్కడ బాలేదు అనేది చక్కగా వివరించారు. కానీ కొంతమంది మాత్రం విమర్శలు చేస్తూ రాశారు. లైఫ్‌లో ఎవరైతే ఓపెన్‌గా ఉండరో మా సినిమా వాళ్ల కోసం కాదు. అలాంటి వాళ్లు దయ చేసి మా సినిమాకు రావొద్దు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొవాలి అనే వాళ్ల కోసమే ఈ సినిమా’ అని దర్శకుడు అన్నారు. ఇదే ప్రెస్ మీట్లో స్వాతి మాట్లాడుతూ.. కొంతమంది జర్నలిస్టులు నా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. అవి చదివి ఎంతగానో బాధపడ్డా. ముఖ్యంగా కొన్ని కథనాలు చదివి చాలా కుమిలిపోయా. నా గురించి తెలియని వాళ్లు ఆ వార్తలు చదివి అదే నిజం అనుకుంటారు. చాలా మంది నమ్మారు కూడా. ఒక నటిగా నేను విమర్శలు తీసుకుంటా. ఎందుకంటే అది నా వృత్తి కాబట్టి. దానిపై మీరు(జర్నలిస్టులు)విమర్శకులు చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాస్తే తట్టుకోవడం కష్టంగా ఉంది’అని స్వాతి చెప్పుకొచ్చింది. -
సాయి ధరమ్ తేజ్ మరియు కలర్ స్వాతి క్యూట్ మూమెంట్స్
-
'చనిపోకముందే.. చనిపోయిందని చప్పడంతో'.. ప్రేమికులిద్దరూ తీవ్ర నిర్ణయం..!
మహబూబ్‌నగర్: మండలంలోని మిరాసిపల్లికి చెందిన స్వాతి(15) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం మోట్లంపల్లికి చెందిన మహేష్(19), స్వాతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో స్వాతి కుటుంబ సభ్యులు మహేష్‌కు ఫోన్ చేసి స్వాతి చనిపోకముందే చనిపోయిందని, మా అమ్మాయి చావుకు నీవే కారణం నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపుతామని చెదిరించారు. దీంతో మహేష్ తన తండ్రికి విషయాన్ని చెప్పడంతో మాట్లాడుదాము నీవేమి బెంగపెట్టుకోవద్దని సర్దిచెప్పాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మహేష్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న స్వాతి ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్వాతి తండ్రి కుర్మయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కాగా స్వాతి స్థానిక జెడ్పీహెచ్‌లో 10వ తరగతి చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
సమంత, నిహారిక బాటలో కలర్స్ స్వాతి? విడాకులు తీసుకోబోతోందా ?
-
‘పంచత్రంతం’ మూవీ రివ్యూ
టైటిల్: పంచతంత్రం నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి, నరేశ్ ఆగస్త్య,శివాత్మిక రాజశేఖర్, ఉత్తేజ్ తదితరులు నిర్మాణ సంస్థలు:టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు కథ, స్క్రీన్‌ప్లే: దర్శకత్వం: హర్ష పులిపాక సంగీతం:ప్రశాంత్ ఆర్ విహారి సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి ఎడిటర్:గ్యారీ బి హెచ్ విడుదల తేది: డిసెంబర్ 9 , 202 బాల్యంలో మనం పంచతంత్ర కథలు పుస్తకం చదువుకుని... వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. అలాంటి కథల ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన యాంథాలజీ చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ..కథనం ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి రిటైర్డ్ అయిన వేదవ్యాసమూర్తి(బ్రహ్మానందం)రైటర్‌గా ఎదగాలనుకుంటాడు. కానీ అతని కూతురు డాక్టర్ రోషిణి(స్వాతి)మాత్రం వయసును గుర్తు చేస్తూ తండ్రిని నిరుత్సాపరుస్తుంది. ఇప్పటి యువతను కథలతో మెప్పించడం సాధ్యం కాదంటూ తండ్రిని ఎగతాళి చేస్తుంది. అయితే వ్యాస్ మాత్రం కూతురి మాటలు పట్టించుకోకుండా స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్‌కు వెళతాడు. అక్కడ ఐదు కథలు చెబుతాడు.దానికి పంచేంద్రియాలు అని పేరు పెడతాడు. దృశ్యం, రుచి, స్పర్శ, వాసన, వినికిడి అంశాల ఆధారంగా ఈ ఐదు కథలు సాగుతాయి. ఇందులో మొదటి కథ సాగర తీరాన్ని(బీచ్) చూడాలనుకునే ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ది. ఇందులో నరేశ్ అగస్త్య, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రలు పోషించారు. విహారి(నరేష్ అగస్త్య) సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గా పని చేస్తూ స్నేహితులతో సరదాగా గడుపుతాడు.అతని ఒక్కసారి కూడా బీచ్‌కి వెళ్లలేదు. స్నేహితుల మాటల్లో సాగరతీరం ఎలా ఉంటుందో విని.. ఒక్కసారైనా బీచ్‌ని చూడాలని తపన పడతాడు. మరి తన కోరిక ఎలా నేరవేరిందనేదే మిగతా స్టోరీ. ఇది కాస్త నెమ్మదిగా, చప్పగా సాగుతుంది. ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు. రెండోది చిన్నప్పుడు ఇష్టపడిన అమ్మాయి జ్ఞాపకాలను తడిమి చూడాలనుకునే ఓ యువకుడిది. ఈ స్టోరీ లో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సుభాష్(రాహుల్ విజయ్)కి ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. అయితే ఏ అమ్మాయి అతనికి నచ్చదు.చివరకు తల్లి కోసం లేఖ(శివాత్మిక)తో పెళ్లికి ఓకే చెబుతాడు. పెళ్లికి ముందు వాళ్లిద్దరు కలిసి మాట్లాడుకునే క్రమంలో ఇష్టమైన ప్రదేశం..చిన్నప్పటి లవ్‌స్టోరీని షేర్ చేసుకుంటారు. . ఒక అమ్మాయి లేదా అబ్బాయి పెళ్ళికి ఓకే చేసినప్పుడు అది పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఎలా చెప్పగలం? అసలు ఒక అమ్మాయి, అబ్బాయికి ఉండాలిసింది ఏంటి? అనేది ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ గా చూపించారు. ఇక మూడోది మానసిక రోగానికి గురైన ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌ది. రామనాథం(సముద్ర ఖని) ఉద్యోగవిరమణ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. మరో పక్షం రోజుల్లో కూతురికి డెలివరీ ఉందనగా..అతనికి ఓ వింతవ్యాధి సోకుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పటికీ అతనికి మాత్రం బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది.తన ప్రవర్తనతో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తాడు.అసలు అతనికి మాత్రమే చెడు వాసన ఎందుకు వస్తుంది? ఆ అరుదైన మానసిక వ్యాధి అతనికి ఎలా సోకింది? చివరకు ఆ వ్యాధి నుంచి రామనాథం ఎలా భయటపడ్డాడు అనేదే మిగతా కథ. ఇందులో సముద్రఖని తనదైన నటనతో అదరగొట్టేశాడు. నాలుగో కథ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులది. కొత్తగా పెళ్లైన దంపతులకు ఊహించని కష్టం వస్తుంది. ఆ సమయంలో వీరిద్దరు ఒకరికొకరు ఎలా తోడుగా నిలిచారనేదే ఈ కథ సారాంశం. ప్రాణాలు పోయినా సరే విడిపోకుండా కలిసి ఉండే ఓ అనోన్యమైన యవజంట కథ ఇది. కష్టం వచ్చినప్పుడు తుంచుకోడం కాదు...పంచుకోవాలి అనే సందేశాన్ని ఇచ్చే ఈ కథకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది.ఈ స్టోరీ లో దివ్య శ్రీపాద, వికాస్ ఇద్దరు అన్యోన్య దంపతులు గా చక్కగా నటించారు. ఇక ఈ యాంథాలజీలో చివరిది 5వ కథ చాలా స్పూర్తిదాయకమైనది.ఇందులో స్వాతి ప్రధాన పాత్ర పోషించింది. లియా( స్వాతి) ఒక ఎంట్రప్రినర్. ప్రతి రోజు పాడ్ కాస్టింగ్ లో లియా స్టోరీస్ చెప్తుంటుంది. ఆ పాడ్ కాస్ట్ విని లియా ని ఎంతగానో అభిమానించే చిన్నారులు ఉంటారు. ఆ క్రమంలో పాడ్ కాస్టింగ్ ప్రోగ్రామ్ ఎండ్ చేసి, నెస్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ, రూపా అనే చిన్నారి వల్ల, ఆ పాడ్ కాస్టింగ్ కి మరింత వెయ్యి రేట్లు ప్రాణం పోస్తుంది. అసలు ఆ చిన్నారి ఎవరు? ఏం చేసింది? ఆ పాప ప్రాముఖ్యత ఏంటి? అనేదే మిగతా స్టోరీ. ఇది చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.క్లైమాక్స్ హర్ట్‌ని టచ్ చేస్తుంది. మొత్తంగా ఈ ఐదు కథలుగా తెరకెక్కిన ఈ ‘పంచతంత్రం’.. మంచి సందేశాన్ని ఇచ్చింది. ఒక్కో కథలో ఓక్కో నీతి ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథలు... వాటిని నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి. కాకపోతే కొన్ని ఎపిసోడ్స్‌లో అక్కడక్కడ సాగదీత గా అనిపిస్తుంది. ‘కెరియర్ అంటే 20ల్లోనే కాదు 60ల్లోనూ మొదలు పెట్టొచ చ్చు’, ‘కష్టం వచ్చినప్పుడు తుంచుకోడం కాదు...పంచుకోవాలి’, 'వదులుకోవడం ఎంత సేపు? క్షణం పట్టదు' లాంటి డైలాగ్స్ హృదయాలు హత్తుకుంటాయి. బ్రహ్మానందం అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ విహారి పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పనితీరు పర్వాలేదు. ఇలాంటి చిత్రాలను నిర్మించాలంటే అభిరుచి ఉండాలి. కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు ఈ సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ఎలాంటి అశ్లీలత, ద్వందార్థాలకు చోటులేకుండా తెరకెక్కిన ఈ ‘పంచతంత్రం’ ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. - అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
సాధనతోనే కీర్తికిరీటం... విశాఖ స్వాతి విజయ ప్రస్థానం
‘నేను ఒక సగటు భారతీయ మహిళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పెళ్లయ్యి, పిల్లలున్న నాకు అందాల సుందరిగా పట్టాభిషేకం చేయడం భారతదేశం నలుమూలల్లో ఉన్న అద్భుతమైన మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పారు స్వాతి పాల. ఈ యేడాది హాట్ మండే మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేత కిరీటాన్ని ఇటీవల స్వాతి పాల అందుకున్నారు. విశాఖపట్టణంలో పుట్టి పెరిగిన స్వాతి, హైదరాబాద్‌లో మీడియా రంగంలోనూ పని చేశారు. కెనడాలో బిజినెస్ అనలిస్ట్‌గా, ఇద్దరు పిల్లలు తల్లిగా, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న గృహిణిగా, తన కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్న సాధకురాలిగా స్వాతి ఎన్నో సంగతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ఈ ఏడాది ప్రయాణం నాకు చాలా అపురూపమైనది. వివాహిత మహిళల కోసం అత్యంత గౌరవనీయమైన, ప్రసిద్ధి చెందిన ఈ అందాల పోటీలు దుబాయ్‌లోని రస్ అల్ ఖైమాలోని హిల్టన్ గార్డెన్ ఇన్ లో జరిగింది. ఈ ఫైనల్స్‌లో దేశ దేశాల నుంచి 20 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో నేను అగ్రగామిగా నిలవడం ఎంతో గొప్పగా, ఆనందంగా అనిపించింది. నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం, భూమిని సూచించేలా నన్ను ఎలిమెంట్స్ క్వీన్‌గా ప్రకటించారు. మాది వైజాగ్. అక్కడే ఆంధ్రా యూనివర్శిటీలో ఎంబీయే చేశాను. హైదరాబాద్‌కి ఉద్యోగరీత్యా వచ్చాక సాక్షి’ టీవీ ప్రారంభం నుంచి నాలుగేళ్లు హెచ్.ఆర్ విభాగంలోనూ, క్రియేటివ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గానూ వర్క్ చేశాను. మా వారి జాబ్ నేవీ కావడంతో తనకు కెనడాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో నేనూ కెనడా వెళ్లాను. అక్కడే బిజినెస్ అనలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఆన్లైన్లో అప్లై మా వారు ఆన్లైన్లో ఈ అందాల పోటీల గురించి చూసి, నన్ను ప్రోత్సహించారు. అప్లై చేయించారు. 50 వేల అప్లికేషన్స్‌లో 110 మందిని ఎంపిక చేశారు. అలా ఎంపిక అయిన వారిలో నేనున్నాను. అప్లై చేసిన దగ్గర నుంచి ఏడాదిగా చాలా సెషన్స్ అయ్యాయి. వాటిలో రకరకాల టాస్క్‌లు దాటుకుని దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాను. మూడు రోజుల పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 20 మందితో పోటీ పడి ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచాను. కష్టమైనా ఇష్టంతో.. ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఈ పోటీలో పాల్గొడానికి చేసిన కృషి చాలా కష్టమైనది. రోజూ జిమ్‌కి వెళ్లడం, సరైన పోషకాహారం తీసుకోవడం, గ్రూమింగ్ సెషన్స్ తీసుకోవడం, ర్యాంప్ వాక్, వెయిట్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం క్లాసులు .. ప్రతిసారీ టాస్క్ అనిపించింది. ఉద్యోగంతో పాటు ఈ హార్డ్ వర్క్ చేయగలనా.. అని సందేహం కలిగింది. కానీ, ప్రారంభించాక మెల్ల మెల్లగా మామూలు అయిపోయింది. అయితే, ఈ క్లాసులన్నీ దాదాపు ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇండియా నుంచి కోచ్‌లుగా ఉన్న రితిక రామ్త్రీ మొదటి ఆరు నెలలు, తర్వాత శైలజ సూచి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండియా టైమింగ్స్‌ను బట్టి నైట్ టైమ్‌లోనూ కోచింగ్ తీసుకున్నాను. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను అనే ఉత్సాహంతో ఈ ప్రయాణం నడిచింది. క్లాసికల్ డ్యాన్సర్ ముందు కష్టం అనుకున్నది మెల్లగా మెల్లగా నా దినచర్య మార్చుకోవడంతో ట్రైనింగ్ సులువుగా మారిపోయింది. సెషన్స్‌లో ‘మిమ్మల్నే మిసెస్ ఇండియాగా ఎందుకు సెలక్ట్ చేయాలి?’ అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనుకున్నాను. చిన్నప్పుడు శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ తీసుకున్నాను. దీంతో డ్యాన్స్‌లో నాకు సులువు అనిపించింది. పిల్లలే ప్రోత్సాహం కిరీటం వచ్చిందా లేదా అనేది తర్వాతి విషయం. శిక్షణ ఎంత బాగా తీసుకుంటామో ఫైనల్ పోటీలలో ప్రతిఫలిస్తుంది. కానీ, నాలో నాకే చాలా గొప్ప మార్పులు కనిపించాయి. నా పెద్ద కొడుకు తనీష్‌కి పదకొండేళ్లు. వాడు నా ఫొటోలు తీసి, సోషల్ మీడియా పేజీలో అప్లోడ్ చేసేవాడు. చిన్నవాడు రేయాన్ ఫుడ్ తీసుకోవడంలో చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు. ‘నువ్వే గెలవాలి’ అనే వారి తాపత్రయం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. రాబోయే పోటీలు 12వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. కెనడాలో వచ్చే నెలలో జరగబోయే ఆడిషన్స్‌లో నేను జ్యూరీ మెంబర్‌గా ఉన్నాను. అయితే, ఫైనల్స్ ఎక్కడ జరుగుతాయో తెలియాల్సి ఉంది’ అని వివరించారు ఈ మిసెస్ ఇండియా. – నిర్మలారెడ్డి -
ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..
తిరువళ్లూరు (చెన్నై): ప్రియురాలికి కానుక ఇచ్చేందుకు ఓ ప్రియుడు దొంగగా మారాడు. ఏకంగా భార్య, తల్లి బంగారు నగలు చోరీ చేసి, వాటి నుంచి వచ్చిన సొమ్ముతో ప్రియురాలికి కారును బహుమతిగా ఇచ్చాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. తిరువళ్లూరు జిల్లా పూనమల్లి ముత్తునగర్‌కు చెందిన శేఖర్(40) స్వీట్‌స్టాల్, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మనస్పర్ధల కారణంగా కొద్దిరోజుల క్రితం అతని భార్య మల్లిక పుట్టింటికి వెళ్లింది. బంధువులు రాజీ కుదిర్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన మల్లిక బీరువాలో ఉంచిన 300 సవర్ల బంగారు నగలను పరిశీలించగా అవి మాయమయ్యాయి. అలాగే శేఖర్ తల్లికి చెందిన మరో 200 సవర్ల బంగారు నగలు, రెండు బంగారు బిస్కెట్లు కనిపించలేదు. దీనిపై శేఖర్, అతడి సోదరుడిని ఆరాతీయగా తనకు నగలు విషయం అస్సలు తెలియదని చెప్పడంతో బాధితులు పూందమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి దొంగల పనే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బీరువాను పరిశీలించారు. తాళాలు పగలగొట్టకుండా నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి దొంగలే చేతివాటాన్ని ప్రదర్శించి ఉంటారని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. మొదట శేఖర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. విచారణలో కుటుంబ సభ్యులకు చెందిన బంగారు నగలను దొంగతనం చేసి ప్రియురాలు స్వాతికి ఇచ్చినట్లు అంగీకరించాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు శేఖర్, ప్రియురాలు వేళచ్చేరికి చెందిన స్వాతిని అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కీలేడీ మల్లిక పుట్టింటికి వెళ్లిన సమయంలో శేఖర్‌కు స్వాతి పరిచయమైంది. వీరి స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి చెన్నైలోని ప్రైవేటు హాటల్లో తరచూ కలుసుకునే వారు. ఈ క్రమంలో శేఖర్ వద్ద స్వాతి లక్షల్లో డబ్బు స్వాహా చేసింది. ఈ క్రమంలో బంగారు నగలు, కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని స్వాతి కోరడంతో వేరే మార్గం తెలియని శేఖర్ ఇంట్లో నగలను దొంగిలించి కొంత కానుకగా ఇచ్చాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిప్ట్గా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో నిర్ధారించారు. శేఖర్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్, స్వాతిలను అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కాగా స్వాతికి ఇదివరకే పలువురు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం యువతిని విచారణ చేస్తున్నారు. శేఖర్‌ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. -
హీరోయిన్ పాయల్ ఇలా మారిపోయిందేంటి?
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా పాయల్ రాజ్‌పుత్ నటించనుంది. ఈ సినిమాలో ఆమె పచ్చళ్ల స్వాత్రి అనే పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా పాయల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను షేర్ చేసుకుంది. ప్రస్తుతం తిరుపతిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఏవీఏ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) -
Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది.విడుదలైన రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇక ఆయన భార్య స్వాతి ఎవరు, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్న వివరాలపై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కల్యాణ్‌రామ్‌కు 2006 ఆగస్టు 10న స్వాతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి చూపుల్లోనే స్వాతిని చూసి ఇష్టపడిన కల్యాణ్ రామ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారట. ఇక ఆమె వృత్తిరీత్యా డాక్టర్. కల్యాణ్ రామ్ భార్య ఫ్యామిలీ విషయానికి వస్తే వారిదీ సంపన్న కుటుంబమే. ఆమె తండ్రికి ఫార్మా రంగంతో పాటు పలు పరిశ్రమలు ఉన్నాయట. ఇక స్వాతి కూడా బిజినెస్ రంగంలోనే ఉన్నారు. ఆమెకు సొంతంగా వీఎఫ్ఎక్స్ సంస్థ ఉంది. బింబిసార సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ శాతం ఈ సంస్థలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్‌రామ్-స్వాతి దంపతులకు అదైత, శౌర్యరామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: 'బింబిసార' సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. ట్వీట్ వైరల్ -
ఆకట్టుకుంటున్న ‘కన్నుల్లోన...’ సాంగ్
మహేశ్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్ధార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘స్వ’. మను పీవీ దర్శకత్వం వహించారు. జి.ఎం.ఎస్ గాలరీ ఫిల్మ్స్ సంస్థలో జి.ఎం. సురేష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. కరణం శ్రీ రాఘవేంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కన్నుల్లోన..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. వినోద్ శర్మ, నాదప్రియ పాడారు. జీ.ఎం. సురేష్ మాట్లాడుతూ–‘‘మా చిత్రం ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నుల్లోన..’ పాట బాగా అలరిస్తోంది. ‘స్వ’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఏపీ గిరిజన కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా శోభ స్వాతి ప్రమాణం
-
తాళి కట్టేముందు ఆ కన్నడ హీరో కాబోయే భార్యను ఏం అడిగాడంటే!
బెంగళూరు : ప్రతి ఒక్కరి జీవితంలో ఓ లవ్‌స్టోరీ ఉంటుంది. కన్నడ హీరో రిషి లైఫ్‌లో కూడా ఓ అందమైన ప్రేమకథా చిత్రం ఉంది. ‘పరేషన్ అలమేలమ్మ’ సినిమతో శాండిల్‌వుడ్‌కు పరిచయమైన రిషి 2019లో స్వాతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరి లవ్ కహానీ ఎలా మొదలైంది? ఎవరు ముందు ప్రపోజ్ చేశారు వంటి విషయాలను స్వాతి ఇటీవలె షేర్ చేసుకుంది. 'నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లాను. సిటీ కొత్త కదా సరదాగా ఓరోజు థియేటర్‌కు వెళ్లాం. అక్కడే మొదటిసారిగా రిషిని చూశాను. హీరోగా అతడి మొదటి సినిమా అది. అంత మంది జనాల మధ్య రిషి హైట్, తన స్మైల్ నన్ను ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్లో తనను కలవడానికి వెళ్లా. మీరు డ్యాన్స్ చాలా బాగా చేశారు అని చెబుతుంటే బ్లష్ అయిపోయాడు. అది నన్ను మరింత అట్రాక్ట్ చేసింది. మరుసటి రోజు రిషి ప్రొఫైల్ ఫేస్బుక్లో దొరికొంది. దీంతో మెసేజ్ చేశా. అటువైపు నుంచి రిప్లై రావడంతో ఇద్దరం చాటింగ్ చేసేకునేవాళ్లం ఓ రోజు రిషి కాఫీకి రమ్మని పిలిచాడు. అలా సరదాగా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. ఓ రోజే నేను నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేశా..దీంతో రిషి నేను ఇదే చెప్పాలనుకున్నాను అనడంతో ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నాం. అదేరోజు సాయంత్రం ఫోన్లో ఇద్దరం ఐ లవ్యూ చెప్పుకున్నాం. రిషి సినిమాల్లో ఉండటం, నాకు 9-5 జాబ్ కావడంతో వారానికి ఒకసారి కంటే ఎక్కువ కలిసేవాళ్లం కాదు. కానీ ఉన్నంతసేపు చాలా మాట్లాడుకునేవాళ్లం. తను నా కోసం బుక్స్ గిఫ్ట్‌గా ఇచ్చి అందులో నువ్వు నా లైఫ్‌ని మరింత అందంగా మార్చేశావు అంటూ ఎంతో క్యూట్ కొటేషన్స్ రాసి ఇచ్చేవాడు. ఇక నేను కూడా వీలు కుదిరినప్పుడల్లా తనకు సెట్స్‌లో సర్ప్రైజ్ ఇచ్చేదాన్ని. ఇక రిషి ఫస్ట్ మూవీ ‘పరేషన్ అలమేలమ్మ’ హిట్ కావడంతో ఇక పెళ్లిచేసుకుందామా అని రిషి అడిగాడు. నేను కూడా ఎస్ చెప్పాను. వెంటనే మా నిశ్చితార్థం జరిగింది. ఇక తమిళ, కన్నడ సంప్రదాయాల ప్రకారం మా పెళ్లి జరిగింది. ఆరోజు తాళి కట్టే ముందు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ రిషి అడగడంతో ..ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని నువ్వు అనుకోవట్లేదా అని చెప్పిన వెంటనే తాళి కట్టేశాడు. ఇదే విషయంపై అప్పుడప్పుడూ రిషిని ఏడిపిస్తుంటాను. ఇక పెళ్లి తర్వాత హనీమూన్‌కు ఎక్కడికీ వెళ్లలేకపోయాం. కరోనా కావడంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక రిషి తన ప్రాజెక్టు గురించి చెబుతూ ఉంటాడు. ఈ ప్యాండమిక్ పూర్తైన వెంటనే ఓ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి' అంటూ తన లవ్‌స్టోరీ బయటపెట్టింది. ఇక సర్వజనికారిగే సువర్ణవాకాష అనే చిత్రంలో రిషి చివరిసారిగా కనిపించాడు. చదవండి : నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే.. కత్రినా ఇంట్లో విక్కీ, వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు -
స్వాతి అసోసియేట్ ఎడిటర్ మణిచందన కన్నుమూత
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): స్వాతి వీక్లీ అసోసియేట్ ఎడిటర్, ఎడిటర్ వేమూరి బలరాం కుమార్తె మణిచందన (48) సోమవారం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కొద్దిరోజుల కిందట పరిస్థితి విషమించడంతో ఆమెను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్వాతి వారపత్రిక నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న మణిచందన భర్త అనిల్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మణిచందన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. -
సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?
సాక్షి, శ్రీకాకుళం (వజ్రపుకొత్తూరు): బహిర్భూమి కోసం వెళ్లి శుక్రవారం రాత్రి దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నపల్లివూరు గ్రామానికి చెందిన వివాహిత రచ్చ స్వాతి (24) ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉన్న ఉద్దానం ఉలిక్కిపడింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివాహితతో సన్నిహితంగా ఉన్నట్టు భావిస్తున్న ఉద్దానం రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో ఐదారుగురుని కూడా పోలీసులు స్టేషన్‌కు రప్పించి విచారణ చేపడుతున్నారు. స్వాతి వాడిన సెల్ ఫోన్ మాత్రం లభ్యం కాలేదు. ఫోన్ దొరికి.. కాల్ డేటా పరిశీలిస్తే నిందితులు పట్టుబడే అవకాశం ఉంది. చదవండి: (పెళ్లింట విషాదం.. భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం) సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి తెలగల రాధమ్మ, మోహనరావుల పెద్ద కుమార్తె స్వాతికి చిన్నపల్లివూరుకు చెందిన రచ్చ అప్పన్న, నీలవేణి కుమారుడు దినేష్‌తో 2017 ఆగస్టులో వివాహమైంది. వీరికి సుమారు మూడేళ్ల కుమారుడు సమర్పణ్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఆస్పత్రికని వెళ్లిన స్వాతి మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి చేరుకుంది. గొర్రెలు, ఆవులను మేత కోసం తీసుకొని వెళ్లిన ఆమె అత్తమామలు సాయంత్రం ఆరున్నర గంటలకు ఇంటికి చేరగా.. అప్పటికే పొయ్యిపై అన్నం వండుతున్న స్వాతి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించి మందలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న కాశీబుగ్గ సీఐ శంకరరావు, ఎస్సై గోవిందరావు అనంతరం బహిర్భూమికి వెళతానని చెప్పి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలోని తిమ్మల రాములమ్మతోటలోకి స్వాతి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడం, కుమారుడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో మామ అప్పన్న స్థానికులతో కలిసి తోటలో గాలించగా.. రక్తపు మడుగులో స్వాతి కనిపించింది. వెంటనే 108 వాహనంలో రాత్రి 9.30 గంటల సమయంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..) సెల్‌ఫోన్ మాయం స్వాతి తల్లి రాధమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తులోకి దిగారు. స్వాతి బహిర్భూమి కోసం వెళ్లిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ కనిపించిన స్వాతి బంగారు చెవి దిద్దులు, చెప్పులు, జడ క్లిప్ సేకరించారు. అక్కడకు కాసింత దూరంలో రక్తపు మరకలతో పాటు ఖాళీ క్వార్టర్ మద్యం సీసాను కూడా క్లూస్ టీమ్ సీజ్ చేసి స్థానిక ఎస్సై కూన గోవిందరావుకు అందించారు. అయితే హత్య జరిగిన స్థలంలో ఉండాల్సిన స్వాతి సెల్‌ఫోన్ మాత్రం కనిపించలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మరోవైపు పోలీసులు కాల్ డేటా సేకరించే పనిలో పడ్డారు. పోలీసులు ఏమన్నారంటే.. శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరకున్న వజ్రపుకొత్తూరు ఎస్సై కూన గోవిందరావు, కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు, క్లూస్ టీం వివరాలు సేకరించారు. క్రైమ్ జరిగిన ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి మామ అప్పన్న ఆడపడుచు, అనుమానితులను విచారించారు. హంతకుల ఆనవాలు దొరకలేదని, డాగ్ స్క్వాడ్ పరిశీలించినా ఫలితం లేకపోయిందని, అత్యాచారం జరిగినట్లు ఆనవాలు కూడా దొరకలేదని తెలిపారు. రిమ్స్‌లో పోస్టుమార్టం చేపట్టాక పూర్తి నివేదిక వస్తేనే వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ది బిగ్ ఎలిగేషన్
-
తుపాకుల స్వాతికి కేటీఆర్ చేయూత
ఖమ్మం, నేలకొండపల్లి: ఓ ప్రమాదం కారణంగా మహిళకు రెండు చేతులు పని చేయడం లేదు. ఒక కాలు సగం వరకు తీసేశారు. వారి గోడును ఓ ట్రస్టు సభ్యుడు కేటీఆర్‌కు ట్విటర్లో వివరాలను తెలిపాడు. స్పందించిన మంత్రి కేటీఆర్ వైద్య ఖర్చుల కోసం రూ.లక్షను మంజూరు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన తుపాకుల స్వాతి 9 నెలల కిందట విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమెకు రెండు చేతులు చచ్చుబడ్డాయి. నిరుపేద కుటంబం కావడంతో కష్టాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న నేలకొండపల్లి వెల్ఫేర్ డెవలప్మెంట్ ట్రస్టు సభ్యుడు శ్రావణ్ విషయాన్ని రెండు రోజుల కిందట మంత్రి కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా తెలిపాడు. కేటీఆర్ స్పందించి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.లక్ష మంజూరు చేయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సదరు యువకుడికి శుక్రవారం ఫోన్ వచ్చింది. మహిళకు వైద్యం చేయించేందుకు రూ.లక్ష మంజూరు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో హైదరాబాద్‌లోని వి.కేర్ వైద్యశాలలో చేర్పించాలని సూచించారు. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన శ్రావణ్‌ను పలువురు అభినందించారు. స్వాతి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్‌కు చికిత్స కోసం వెళ్లేందుకు బాధిత మహిళకు ఆర్థిక సాయం చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం సభ్యుడు, స్థానిక ఎమ్మేల్యే కందాల ఉపేందర్‌రెడ్డిని కలిసి కోరారు. వెంటనే కొంత ఆర్థిక సాయం చేశారు. ఆమెకు పింఛన్ అందించాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పసుమర్తి శ్రీనివాస్, గండికోట వెంకటలక్ష్మి, వున్నం బ్రహ్మయ్య, కోటి సైదారెడ్డి ఉన్నారు.