
ఆమె నో అంది ... ఈమె సై అంది
గ్రీకు వీరుడు నాగార్జున సరనస ఏ పాత్రలోనైనా నటించేందుకు ఏ హీరోయిన్ అయిన ఎగిరి గంతేస్తారు. అది మరదలి పాత్ర అయితే మరో మాట కూడా మాట్లాడరు. కలర్ స్వాతికి ఆ అదృష్టం 'సొగ్గాడే చిన్న నాయనా' చిత్రం ద్వారా దూసుకువచ్చింది. అందుకోసం ఆ చిత్ర దర్శకులు ఆమెను సంప్రదించి... చిత్రంలోని ఆమె పాత్రను స్వాతికి వివరించారు. ఆ పాత్ర కూడా స్వాతికి తెగ నచ్చేసింది. అయితే ఆ అదృష్టం తనకీ లేదని తెగ ఫీలైపోయిందని సమాచారం.
ఎందుకంటే ఈ అమ్మడు తమిళ, మలయాళ చిత్రాలతో మహాబిజీగా ఉంది. ఈ చిత్ర షూటింగ్కి తమిళ, మలయాళ చిత్ర షూటింగ్ ఒకే సారి వచ్చాయి. సదరు చిత్రాలకు స్వాతి డేట్స్ ఇచ్చేసింది. దాంతో నాగ్ మరదలిగా నటించే అదృష్టం జస్ట్ మిస్ అయింది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ నటించిన అడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో త్రిష సోదరిగా అమాయక పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన విషయం విదితమే. సొగ్గాడే చిన్ననాయినా చిత్ర దర్శకుడు బుల్లితెరను ఓ విధంగా 'జబర్దస్త్' చేస్తున్న అనసూయను సంప్రదించారు. దీంతో ఆమె ఎగిరి గంతేసి.... నాగ్ మరదలిగా నటించేందుకు తెగ సంబరపడిపోతూ ఒప్పుకుందటా.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించేందుకు విముఖత వ్యక్తం చేశారు. కానీ సొగ్గాడే చిన్ని నాయన' అనసూయ నటిస్తున్న రెండో సినిమా. అడవి శేషు హీరోగా రవికాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'క్షణం' ఆ చిత్రంలో అనసూయ ప్రస్తుతం నటిస్తోన్న సంగతి తెలిసిందే.