బంగార్రాజు భలే నాయనా | soggade chinni nayana movie starts on pre productions | Sakshi
Sakshi News home page

బంగార్రాజు భలే నాయనా

Published Thu, Mar 14 2019 3:38 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

soggade chinni nayana movie starts on pre productions - Sakshi

సోగ్గాడే చిన్ని నాయనా.. బొమ్మ అదిరింది నాయనా అని సినిమా చూసినవాళ్లు అన్నారు. మూడేళ్ల క్రితం సంక్రాంతికి సోగ్గాడిగా సందడి చేసిన బంగార్రాజుని మళ్లీ చూపించనున్నారు చిత్రదర్శకుడు కల్యాణ్‌ కృష్ణ. ఫస్ట్‌ పార్ట్‌లో నాగార్జున మాత్రమే సందడి చేశారు. రెండో భాగంలో కొడుకు నాగచైతన్య కూడా కలుస్తున్నారు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ తాతామనవళ్లలా కనిపించనున్నారు. తొలి భాగంలో నాగ్‌ సరసన నటించిన రమ్యకృష్ణ మలి భాగంలోనూ ఉంటారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట.

కథ బాగా కుదిరిందని, ప్రతి పాత్ర ఆడి యన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా కల్యాణ్‌ కృష్ణ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారని తెలిసింది. అంటే ఈసారి బంగర్రాజు భలే నాయనా అనిపిస్తాడన్నమాట. ప్రీ–ప్రొడక్షన్‌ పనులను త్వరలోనే కంప్లీట్‌ చేసి సినిమాను జూన్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మన్మథుడు’ సినిమా సీక్వెల్‌ చేయడానికి నాగార్జున గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా కాకుండా బాలీవుడ్‌లో ‘బ్రహ్మాస్త్ర’ అనే పీరియాడికల్‌ మూవీలో నాగార్జున ఓ కీ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement