Akkineni Nagarjuna And Naga Chaitanya Begain Bangarraju Shoot In Mysore - Sakshi
Sakshi News home page

Nagarjuna Bangarraju Movie: మైసూర్‌లో బంగార్రాజు

Published Mon, Sep 6 2021 5:33 AM | Last Updated on Mon, Sep 6 2021 11:06 AM

Nagarjuna, Naga Chaitanya Bangarraju movie shooting starts at mysore - Sakshi

‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో నాగార్జున– దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌ షెడ్యూల్‌ ముగించుకున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది. నాగార్జున–నాగచైతన్యలు పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది.

అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట కల్యాణ్‌ కృష్ణ. ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీలో నాగార్జున పక్కన గ్రేస్‌ఫుల్‌గా కనిపించిన రమ్యకృష్ణ ‘బంగార్రాజు’ లోనూ నటిస్తున్నారు. నాగచైతన్య సరసన ‘ఉప్పెన’ ఫేమ్‌ కృతీ శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తుండగా, సత్యానంద్‌ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. యువరాజ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement