prequel
-
మళ్లీ వస్తున్నాడు లయన్ కింగ్
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్’ (2019) కు ప్రీక్వెల్ రానుంది. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ టైటిల్‌తో రానున్న ఈ ప్రీక్వెల్ ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుందని సమాచారం. ‘ది లయన్ కింగ్’ సినిమాకు జోన్ ఫావ్రూ దర్శకత్వం వహించగా, ప్రీక్వెల్‌ను ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ బార్రీ జెన్కిన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక ‘ది లయన్ కింగ్’ సినిమాలో ముఫాసా పాత్ర ఓ దశలో చనిపోతుంది. ముఫాసా కొడుకు సింబా, అతని సోదరుడు, శత్రువు స్కార్ల దృష్టి కోణంలో ఈ చిత్రకథ సాగుతుంది. కానీ ముఫాసా రాజుగా ఎలా ఎదిగాడు? ఆ సమయంలో అతని సోదరుడు స్కార్ ఎలాంటి పన్నాగాలు పన్నాడు? అనే అంశాల నేపథ్యంలో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా కథ ఉంటుందని హాలీవుడ్ టాక్. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. ‘ది లయన్ కింగ్’కు రచయితగా చేసిన జెఫ్ నాథన్సన్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’కూ వర్క్ చేస్తున్నారు. ముఫాసా పాత్రకు ఆరోన్ పైర్రీ, స్కార్ పాత్రకు కెల్విన్ హార్రిసన్ వంటివారు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని హాలీవుడ్ టాక్. -
కన్నడ సెన్సేషన్ కాంతార-2 వచ్చేస్తోంది.. కానీ సీక్వెల్ కాదట
కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద హిట్ అయ్యింతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిన్న సినిమాగా రూ. 16కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. అంతేకాకుండా ఆస్కార్‌కు నామినేషన్స్ ఎంట్రీలోనూ చోటు సంపాదించుకుంది కాంతార. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు పార్ట్-2 తెరకెక్కిస్తున్నట్లు హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ తెలిపారు. అయితే ఇది సీక్వెల్ కాదని, ప్రీక్వెల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. -
Nagarjuna Bangarraju Movie: మైసూర్లో బంగార్రాజు
‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున– దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతోంది. నాగార్జున–నాగచైతన్యలు పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట కల్యాణ్ కృష్ణ. ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీలో నాగార్జున పక్కన గ్రేస్‌ఫుల్‌గా కనిపించిన రమ్యకృష్ణ ‘బంగార్రాజు’ లోనూ నటిస్తున్నారు. నాగచైతన్య సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సత్యానంద్ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
ఈ సినిమాలు ఆగిపోలేవు..
ఉందా? లేదా? లేదట.... కాదు.. కాదు.. ఉందట! ఈ మధ్య కొన్ని చిత్రాల గురించి జరిగిన చర్చ ఇది. ‘ఆగిపోయింది’ అంటూ ఆ చిత్రాలపై వచ్చిన వార్తలకు స్పందించి... ‘ఉందండోయ్’ అని చిత్రబృందం స్పష్టం చేసింది. ఆ చిత్రాలేంటో చూద్దాం. బంగార్రాజు వస్తాడు ఐదేళ్ల క్రితం సంక్రాంతి పండగకి నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. బంగార్రాజుగా పంచె కట్టుకుని, ‘సోగ్గాడే చిన్ని నాయనా.. ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..’ అంటూæ అమ్మాయిలతో నాగ్ వేసిన స్టెప్పులు అదుర్స్. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016)లో బంగార్రాజు, రాము పాత్రల్లో నటించారాయన. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ని ఎప్పుడో ప్రకటించారు. ప్రీక్వెల్ అంటే.. ముందు జరిగిన కథ అన్నమాట.. ‘సోగ్గాడే..’లో బంగార్రాజు చనిపోతాడు... అసలు బంగార్రాజు కథేంటి అనేది ప్రీక్వెల్. అయితే ‘సోగ్గాడే..’ వచ్చి ఐదేళ్లు కావడంతో ప్రీక్వెల్ ఇంకా మొదలుపెట్టలేదు కాబట్టి, ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ, ఆగలేదు. ఈ విషయాన్ని ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్స్ అప్పుడు నాగార్జున స్వయంగా చెప్పారు. సో... ‘బంగార్రాజు ఈజ్ బ్యాక్’. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించే అవకాశం ఉంది. ఆన్‌లోనే ఉంది హీరో అల్లు అర్జున్–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఎప్పుడో రూపొందాల్సింది కానీ, ఇప్పటివరకూ జరగలేదు. ఇక ఈ కాంబినేషన్ లేనట్లే అని ఈ మధ్య చాలామంది ఫిక్సయ్యారు. దానికి కారణం ‘పుష్ప’ పూర్తి చేశాక కొరటాల శివ సినిమాలోనే అల్లు అర్జున్ చేయాలి. కానీ ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వం వహించే సినిమా తెరపైకి వచ్చింది. దాంతో బన్నీ–కొరటాల సినిమా లేనట్లే అని ఎవరికివారు ఫిక్సయ్యారు. కానీ, ‘ప్రాజెక్ట్ ఆన్‌లోనే ఉంది’ అని నిర్మాణ సంస్థ యువసుధ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఈ సినిమా ఆరంభం అవుతుంది. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్ లేదనే వార్తలు వచ్చాయి కానీ, ‘ఐకాన్’ ఉంటుందని ఇటీవల ‘దిల్’ రాజు పేర్కొన్నారు. మారలేదు ‘ప్లాన్ మారలేదు.. ముందు అనుకున్న ప్రకారమే ముందుకు వెళతాం’ అంటూ ఇటీవల ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ ప్రకటించింది. విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమా గురించే ఈ ప్రకటన. ఈ సినిమా లేదంటూ వచ్చిన వార్తలకే ‘ఉంది’ అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’లో నటిస్తున్నారు. సుకుమార్ ‘పుష్ప’ తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరూ తమ చిత్రాలు పూర్తి చేశాక.. వీరి కాంబినేషన్ సినిమా ఆరంభమవుతుంది. భారతీయుడు ఆగడు! కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (భారతీయుడు) ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం వచ్చిన పాతికేళ్లకు ‘ఇండియన్ 2’కి శ్రీకారం చుట్టారు కమల్–శంకర్. కొన్నాళ్లు షూటింగ్ కూడా జరిగింది. షూటింగ్లో జరిగిన ప్రమాదం వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల కోసం కమల్ బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి, ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో రామ్‌చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమా ప్రకటించడం, అలాగే రణ్వీర్ సింగ్‌తో ‘అన్నియన్’ (అపరిచితుడు) రీమేక్ ప్రకటించడంతో ‘భారతీయుడు 2’ ఏమైంది? అనే టాక్ మొదలైంది. ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ లైకా కూడా కూడా శంకర్ ఈ సినిమాని మధ్యలో వదిలేయడం సరికాదని కోర్డుకెక్కింది. ‘‘నేనేం వదల్లేదు.. ‘భారతీయుడు ఆగడు’. దీనికి విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. అలాగే కమల్ డేట్స్ ఇస్తే.. నేను షూట్‌కి రెడీ’ అని శంకర్ విన్నవించుకున్నారు. చిన్న బ్రేక్.. అంతే! కరణ్‌జోహార్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ నటిస్తున్న కొత్త సినిమా కూడా ఆగిపోలేదట. గత ఏడాది ఫిబ్రవరిలో తన దర్శకత్వంలో ‘తక్త్’ అనే సినిమాని ప్రకటించారు కరణ్ జోహార్. దానిలో జాన్వీకపూర్‌ది ఓ కీలకపాత్ర. కానీ ఆ చిత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, భూమీ పెడ్నేకర్ తదితర భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ‘తక్త్’ ఆగిందనే వార్తలకు స్పందిస్తూ – ‘‘ఆగలేదు... చిన్న బ్రేక్ పడింది.. అంతే’’ అని కరణ్ జోహార్ అన్నారు. ‘ఖిలాడి’గా రవితేజను, ‘టక్ జగదీష్’గా నానీని, ‘వరుడు కావలెను’లో నాగశౌర్యను ఇదివరకే చూశాం. పలు సందర్భాల్లో ఈ చిత్రం పోస్టర్లు విడుదలయ్యాయి, శ్రీరామ నవమికి కూడా ఈ చిత్రాల ఫొటోలు విడుదలయ్యాయి. రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక, హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు, నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్రా నికి లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. -
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కోసం ఆత్రుతగా ఉన్నా: స్మృతి ఇరానీ
కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా.. పరిపాలన,రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా స్మృతి ఇరానీ మాత్రం తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అంతేకాకుండా ట్రెండింగ్ విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తారు. వ్యంగ్యాస్త్రాలతోపాటు, ఫన్నీ పోస్ట్‌లతో తన ఫాలోవర్స్‌ను ఎప్పటికప్పుడు అలరిస్తారు. అయితే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కి 300 ఏళ్ల ముందు ప్రీక్వెల్ సెట్ చేసి గ్రీన్ లైటింగ్ చేస్తున్నట్టుగా హెచ్‌బీఓ ప్రకటించింది. అయితే దీనిపై స్పందించిన స్మృతి.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అభిమానుల్లో తాను ఒకరినని పేర్కొన్నారు. అందులో జోన్ స్నో నటించిన ఒక సన్నివేశానికి సంబంధించిన మీమ్‌ను తన ఇస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ మీమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ జోన్ స్నోకు ఎవరైనా చెప్పారా? గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కి ప్రీక్వెల్ చేస్తున్నారని, అతని ముఖం సంతోషంతో నృత్యం చేస్తున్నట్టు ఉంది’ అని పేర్కొన్నారు. ఆమె ఇటీవల దీపావళి రోజు తిన్న మిఠాయిలు, తాను రోజు తీసుకునే ఆహారం.. వాటి మధ్య తేడాలు గమనించుకొని ఒకరినొకరు చూసి నవ్వుకున్నట్టు ఉన్న మీమ్‌ను పెట్టడంతో అది కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. -
త్వరలో సెట్స్ మీదకు బాహుబలి ప్రీక్వెల్
తెలుగు సినిమా మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డలు సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో నిర్మించటమే కాదు అదే స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించి సినిమా ఘనవిజయం సాధించేందుకు తమవంతుగా కష్టపడ్డారు. తాజాగా బాహుబలి 2 చైనాలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ సందర్బంగా తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్న నిర్మాతలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. త్వరలో బాహుబలికి ప్రీక్వెల్‌ను నిర్మించనున్నట్టుగా తెలిపారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆన్లైన్ సీరీస్‌గా ఈ ప్రీక్వెల్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులోనే చిత్రీకరణ ప్రారంభించేందుకు రెడీ సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న మాహిష్మతి సెట్‌తో పాటు మరికొన్ని సెట్స్‌ను రూపొందించి శివగామి చిన్నతనం నుంచి జరిగే కథతో ఈ ప్రీక్వెల్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రీక్వెల్‌లో అంతా కొత్త నటీనటులు కనిపించనున్నారు. ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది లాంటి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇప్పటికే ఆనంద్ నీలకంఠన్ ద రైజ్ ఆఫ్ శివగామి పేరుతో బాహుబలికి ముందు జరిగే కథను నవలగా విడుదల చేశారు. ఇప్పటికే బాహుబలి థీమ్‌తో వచ్చిన కామిక్ బుక్స్, ఏనిమేషన్ సిరీస్, మర్చెంట్ డైస్‌లకు మంచి ఆదరణ లభించటంతో ఆన్లైన్ సిరీస్ కూడా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. -
మూడువేల కోట్ల బడ్జెట్...
‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ హాలీవుడ్ చరిత్రలోని అద్భుతాల్లో ఒకటి. ఈ ఫిల్మ్ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ను దోచేసుకొని ఇంటికి తీసుకెళ్లాయి. అలాగే అవార్డులను కూడా. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్‌గా టీవీ సిరీస్ వస్తోంది. నిజమే. సినిమా కాదు.. టీవీ సిరీస్. గత దశాబ్ద కాలంలో హాలీవుడ్లో టీవీ సిరీస్ బిజినెస్ అమాంతంగా పెరిగిపోవడంతో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు బడ్జెట్ స్థాయిని కూడా ఎంతంటే అంత పెంచేస్తున్నాయి. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ప్రీక్వెల్ కోసం అమెజాన్ 500 మిలియన్ డాలర్లు (సుమారు మూడువేల రెండొందల యాభై కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తోందట. ఇందులో 250 మిలియన్ డాలర్లు కేవలం కథ రైట్స్ కోసమే వెచ్చించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ టీవీ సిరీస్ ఉంది. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన సిరీస్, అంత రిటర్న్స్ తెచ్చుకుంటుందా? సినిమాల్లోలానే టీవీ సిరీస్‌లోనూ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రికార్డులు సృష్టిస్తుందా? చూడాలి. -
ఖిలాడీ ఐడియా గురూ..!!
-
ఖిలాడీ ఐడియా గురూ..!!
‘తాప్సీ బేబీ యాక్షన్ భలే ఇరగదీసింది బాసూ’ - హిందీ సినిమా ‘బేబీ’ చూసిన తర్వాత ప్రేక్షకులతో పాటు విమర్శకులూ చెప్పిన మాట ఇది. అక్షయ్ కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బేబీ’. అందాల బొమ్మగా మాత్రమే కాదు, అవకాశం వస్తే యాక్షన్ సీన్లలోనూ తడాఖా చూపగలనని ‘బేబీ’తో తాప్సీ నిరూపించుకున్నారు. గతేడాది విడుదలైన ఈ సినిమాలో తాప్సీ పాత్ర (ప్రియా) నిడివి తక్కువే అయినప్పటికీ, యాక్షన్ గాళ్‌గా మంచి పేరొచ్చింది. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా ఓ హిట్ సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీస్తే, హీరో క్యారెక్టర్ బేస్ చేసుకుని తీస్తుంటారు. ‘బేబీ’లో తాప్సీ యాక్షన్ చూసిన తర్వాత ప్రియా క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ప్రీక్వెల్ తీస్తే బాగుంటుందని అక్షయ్ కుమార్ స్వయంగా దర్శకుడు నీరజ్ పాండేకి ఐడియా ఇచ్చారట. ఈ ఖిలాడీ కుమార్ ఇచ్చిన ఐడియాతో ఫీమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా కోసం రచయిత శివమ్ నాయర్ కథ రాయడం ప్రారంభించారు. ఈ చిత్రానికి నీరజ్ పాండే, శివమ్ నాయర్లలో ఎవరో ఒకరు దర్శకత్వం వహిస్తారట. ‘మీరా’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్, మలయాళ నటుడు పృథ్వీ హీరోలుగా నటించనున్నారని బి-టౌన్ టాక్. అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో కనిపిస్తారట. ‘బేబీ’ కోసం తాప్సీ ఇజ్రాయెల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకునే పనిలో పడ్డారట. -
అల్లూరి పాత్రలో గౌతమ్.?
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్ర సమర యోథుడు అల్లూరి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది. కృష్ణ తరువాత మరే నటుడు అల్లూరి పాత్రలో నటించేందుకు సాహసించని స్థాయిలో సూపర్ స్టార్ అల్లూరి పాత్రకు జీవం పోశాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్నేళ్ల తరువాత అదే నేపథ్యంతో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు బాల్యం, అతడు మన్యం వీరుడిగా మారటానికి దారి తీసిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గులాబి, అనగనగా ఒక రోజు లాంటి థ్రిల్లర్ సినిమాలకు కథ అందించిన నడిమింటి నరసింగరావు, అల్లూరి సీతారామరాజు ప్రీక్వల్కు కథ రెడీ చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మనవడు, మహేష్ బాబు కొడుకు గౌతమ్‌ను లీడ్ రోల్లో నటింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే వన్ నేనొక్కడినే సినిమాలోతండ్రితో కలిసి తెరను పంచుకున్న గౌతమ్, తాత చేసిన అల్లూరి పాత్రలో కనిపిస్తాడో లేదో చూడాలి. -
సూర్య 24కు ప్రీక్వల్
సూర్య హీరోగా, విలన్‌గానే కాక నిర్మాతగానూ మారి తెరకెక్కించిన భారీ చిత్రం 24. కాలంలో ప్రయాణించటం అనే కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచిటాక్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్లో కూడా సత్తా చాటి భారీ వసూళ్లను రాబడుతోంది. సూర్య కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు ప్రీక్వల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రీక్వల్లో.., అసలు కాలంలో ప్రయాణించే వాచ్ తయారు చేయాలన్న ఆలోచన సైంటిస్ట్‌కు ఎందుకు వచ్చింది. ఆ వాచ్ గురించి ఆత్రేయ ఎలా తెలుసుకున్నాడు. దాన్ని సొంతం చేసుకోవాడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడో చూపించనున్నారట. ఇప్పటికే స్క్రీప్ట్ కూడా రెడీగా ఉన్న ఈ ప్రీక్వల్ను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేది మాత్రం వెల్లడించలేదు. విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తుండగా తరువాత మహేష్ బాబు హీరోగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి రెండు సినిమాల తరువాత 24 ప్రీక్వల్ సెట్స్ మీదకు వెళుతుందా..? లేక ముందే వెలుతుందా.? చూడాలి.