‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ హాలీవుడ్ చరిత్రలోని అద్భుతాల్లో ఒకటి. ఈ ఫిల్మ్ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ను దోచేసుకొని ఇంటికి తీసుకెళ్లాయి. అలాగే అవార్డులను కూడా. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్‌గా టీవీ సిరీస్ వస్తోంది. నిజమే. సినిమా కాదు.. టీవీ సిరీస్. గత దశాబ్ద కాలంలో హాలీవుడ్‌లో టీవీ సిరీస్ బిజినెస్ అమాంతంగా పెరిగిపోవడంతో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు బడ్జెట్ స్థాయిని కూడా ఎంతంటే అంత పెంచేస్తున్నాయి.
‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ప్రీక్వెల్ కోసం అమెజాన్ 500 మిలియన్ డాలర్లు (సుమారు మూడువేల రెండొందల యాభై కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తోందట. ఇందులో 250 మిలియన్ డాలర్లు కేవలం కథ రైట్స్ కోసమే వెచ్చించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ టీవీ సిరీస్ ఉంది. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన సిరీస్, అంత రిటర్న్స్ తెచ్చుకుంటుందా? సినిమాల్లోలానే టీవీ సిరీస్‌లోనూ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రికార్డులు సృష్టిస్తుందా? చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment