‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ హాలీవుడ్ చరిత్రలోని అద్భుతాల్లో ఒకటి. ఈ ఫిల్మ్ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. అలాగే అవార్డులను కూడా సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా వెబ్ సిరీస్ ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ పేరుతో 2022లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అందులో కూడా సత్తా చాటింది. పేరుకే వెబ్ సీరిస్ కానీ, భారీ బడ్జెట్‌తో పార్ట్ 1 తెరకెక్కించారు మేకర్స్. సినిమాటిక్ కోసం ఏమాత్రం విలువలు తగ్గకుండా అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించి విడుదల చేసింది.
ఇప్పుడు పార్ట్ 2 ఈ ఏడాది ఆగష్టు 29న విడుదల కానుంది. అందుకు సంబంధించిన 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. జేఆర్‌ఆర్ టోకిన్స్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాల్ని నిర్మిస్తున్నారు.‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ప్రీక్వెల్ కోసం అమెజాన్ రూ. 3250 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ. 1500 కోట్లు కేవలం కథ రైట్స్ కోసమే వెచ్చించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన సిరీస్, అంత రిటర్న్స్ తెచ్చుకుంటుందా? సినిమాల్లోలానే టీవీ సిరీస్‌లోనూ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రికార్డులు సృష్టిస్తుందా? చూడాలి.
ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' ఆగష్టు 29న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఇందులోని గ్రాఫిక్స్ దృశ్యాలు, పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. శతాబ్దాల కాలం నాటి రాచరిక యుగానికి తీసుకెళ్తున్నట్టుగా ఆకట్టుకునే విధంగా విజువల్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment