య‌థార్థ సంఘ‌ట‌న‌లతో తెరకెక్కిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ | Premalo Movie Streaming In OTT Now | Sakshi
Sakshi News home page

య‌థార్థ సంఘ‌ట‌న‌లతో తెరకెక్కిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌

Jul 13 2024 9:40 AM | Updated on Jul 13 2024 11:19 AM

Premalo Movie Streaming In OTT Now

చందు కోడూరి హీరోగా నటించి స్వీయదర్శకత్వంలో తీసిన సినిమా 'ప్రేమలో'. చరిష్మా శ్రీకర్ హీరోయిన్. ట్రైలర్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం.. ఈ ఏడాది జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలోకి వచ్చేసింది.

తెలుగులో లవ్ స్టోరీ సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. 'ప్రేమలో' సినిమా కూడా పేరుకు తగ్గట్లే మొత్తం ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. రాజమండ్రి బ్యాక్ డ్రాప్‌లో పూర్తిస్థాయి గోదావరి యాసలో ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సినిమా విజయం సాధించింది. అయితే, సైలెంట్‌గా శుక్ర‌వారం అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. లవ్‌స్టోరీతో పాటు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా థియేటర్స్‌ ప్రేక్షకులను భారీగానే మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలో ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాల్సి ఉంది.

హీరో కమ్ డైరెక్టర్ చందు కోడూరి తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు. హీరోగా, ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఇదే మొద‌టి సినిమా.. అయినా, ఎక్కడ కూడా అలాంటి ఫీలింగ్‌ కనిపంచదు. య‌థార్థ సంఘ‌ట‌న‌ల  స్ఫూర్తిగా తీసుకుని ద‌ర్శ‌కుడు చందు ఈ  క‌థ రాసుకున్నాడు. ప్రస్తుతం సోష‌ల్ మీడియా లో ఎక్కువగా  ఫేక్ వీడియోలు వస్తుంటాయి. వాటి కార‌ణంగా కొంద‌రు అమాయ‌కులు చాలా  ఇబ్బందులు ప‌డుతున్నారు. అదే పాయింట్‌తో 'ప్రేమ‌లో' మూవీని తెర‌కెక్కించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement