Movie
-
తిరుమలలో సినీ ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
Divya Arundati : అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
అమెరికాలో ల్యాండ్ అయిన 'గేమ్ ఛేంజర్' టీమ్ (ఫొటోలు)
-
పాక్‌లో ఇండియన్ సినిమాల కోసం ఆరాటం.. ఏకంగా!
చుట్టమల్లే చుట్టేసి వెళ్లిపోయినట్లుంది 2024. మొన్నే ప్రారంభమైందనుకునేలోపే గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయిపోయింది. కానీ ఈ ఏడాది ఎప్పటిలాగే బోలెడన్ని సినిమాలు రిలీజయ్యాయి. అందులో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న చిత్రాలతో పాటు మనసులు కదిలించే కథలు కూడా ఉన్నాయి. అయితే మన సినిమాలు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవల్లో ప్రాచుర్యం ఉందాయి. అందుకు ఇదే బెస్ట ఎగ్జాంపుల్.టాప్ 10లో ఎనిమిది మనవే!పాకిస్తాన్లో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా/వెబ్ సిరీస్‌ల జాబితాను గూగుల్ రిలీజ్ చేసింది. ఆశ్చర్యంగా టాప్ 10లో ఎనిమిది మన భారతీయ చిత్రాలే కాగా రెండు మాత్రమే పాక్ దేశానికి సంబంధించినవి. హీరామండి వెబ్ సిరీస్ మొదటి స్థానంలో ఉండగా 12th ఫెయిల్ రెండో స్థానంలో ఉంది. యానిమల్, మీర్జాపూర్ 3(వెబ్ సిరీస్), స్త్రీ 2 తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.బిగ్‌బాస్‌కూ క్రేజ్ఆరవ స్థానంలో పాక్ సినిమా ఇష్క్ ముర్షీద్ చోటు దక్కించుకుంది. తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాలు, షోలే హవా చాటాయి. ఏడో స్థానంలో భూల్ భులయ్యా 3, ఎనిమిదో స్థానంలో డంకీ, తొమ్మిదో స్థానంలో హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్ పాగా వేశాయి. చివరగా పాక్ డ్రామా కభీ హమ్ కభీ తుమ్ పదో స్థానంలో నిలిచింది.చదవండి: తొలి స్థానంలో స్త్రీ2... రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ -
Pushpa-2: అస్సలు తగ్గేదే లే..! తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..!
‘అస్సలు తగ్గేదేలే... పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేషనల్’ అంటూ సినిమాలో ఉన్నట్లు విడుదలైన అన్ని చోట్లా పుష్పరాజ్ మ్యానియా భారీగా కనిపించింది. సినిమా మొత్తం అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే జాతర సీన్ కి థియేటర్లు ఈలలు కేకలతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ కార్మికుడి నుంచి స్మగ్లింగ్ కింగ్‌పిన్ గా ఎదిగిన పుష్పరాజ్ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీతగా ఎదిగిన అల్లు అర్జున్ ... తొలి భాగాన్ని మించిపోయి రెండో భాగంలో తన సత్తా చూపాడని ప్రేక్షకులు కీర్తిస్తున్నారు.అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబరు 4 రాత్రి 9 గంటల 30 నిమిషాలకే పుష్పగాడి రూలింగ్ (ప్రీమియర్స్) మొదలైంది.‘పుష్ప: ది రూల్’ తొలి రోజునే భారీ టాక్ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్ జోష్‌గా ఉంది. గురువారం సాయంత్రం నిర్మాతలు వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు సుకుమార్, సీఈవో చెర్రీలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి, తమ ఆనందం పంచుకున్నారు. తొలి రోజు రూ. 250 కోట్లు?బాక్సాఫీస్ నివేదికల ప్రకారం ‘పుష్ప 2’ ఇప్పటికే ‘పుష్ప: ది రైజ్’తో సహా పలు చిత్రాల కలెక్షన్లను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. తొలి రోజు దాదాపు రూ. 250 కోట్ల వసూళ్లు ఖాయం అని గురువారం వసూళ్లను బట్టి అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రం అంచనాలకు అందని విధంగా అనేక రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. దక్షిణాదిలో మాత్రమే కాకుండా, హిందీ మాట్లాడే ప్రేక్షకులు సైతం తొలి పార్ట్‌ని మించి ‘పుష్ప 2: ది రూల్’కి జేజేలు పలుకుతున్నారు.జాతరే జాతర..‘పుష్ప 2’ని డాల్బీ, ఐమ్యాక్స్, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ వెర్షన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్‌లో విడుదల చేసి, ఆశ్చర్యపరిచారు మేకర్స్. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా విడుదలైన అన్ని ప్రాంతాల్లో థియేటర్లు జాతరను తలపిస్తుండడం విశేషం. బాక్సాఫీస్ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ పుష్ప కలెక్షన్ల వేట సాగుతోంది. బన్నీ (అల్లు అర్జున్) దెబ్బకు పాత రికార్డ్స్ బద్దలైపోతున్నాయి. బుక్ మై షోలో ఒక గంటలో అత్యధికంగా 95.71వేల టికెట్లు విక్రయించిన రికార్డు ఇప్పటిదాకా ప్రభాస్ ‘కల్కి’ పేరిట ఉండగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ దీన్ని అధిగమించింది.కేవలం ఒక గంటలో 97.74 వేల టికెట్లను విక్రయించడం ద్వారా కొత్త ఆల్–టైమ్ రికార్డును నెలకొల్పింది. మరో విశేషం ఏంటంటే వారాంతపు రోజుల్లో ‘కల్కి’ ఈ రికార్డును సాధించగా, ‘పుష్ప 2’ సాధారణ వారపు రోజున దానిని సాధించడం. ఆల్ ఇండియా బాక్సాఫీస్ వసూళ్ల వివరాలను అందించే సాక్నిక్ ప్రకారం... ‘పుష్ప 2’ భారతదేశంలో 2,51,9266 టికెట్లను అడ్వాన్స్ బుకింగ్‌లో విక్రయించడం ద్వారా రూ. 73 కోట్లు వసూలు చేసి ‘బాహుబలి 2, జవాన్, ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ల అడ్వాన్స్ బుకింగ్‌ను అధిగమించింది.చదవండి: షారుఖ్నే దాటేసిన బన్నీ.. నిజంగా ఇది విధ్వంసమే!ఉత్తర అమెరికాలో ప్రీ–సేల్స్ 2.5 మిలియన్లను అధిగమించడం కూడా రికార్డే. ప్రస్తుత టాక్ని బట్టి సినీ పరిశ్రమ వర్గాలు ‘పుష్ప 2’ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్‌ని అంచనా వేస్తున్నారు. ఇదే వేగంతో మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే వసూళ్లు మొత్తంగా రూ. 800– 1,000 కోట్ల కలెక్షన్లు దాటేసినా ఆశ్చర్యం లేదని పీవీఆర్ ఐనాక్స్ ప్రతినిధి గౌతం దత్తా అంటున్నారు.ఉత్తరాదిన కూడా వీర విహారం‘పుష్ప 2: ది రూల్’ ఉత్తరాదిన కూడా వీర విహారం చేస్తోంది. ఈ సినిమా చూసిన ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కునాల్ కోహ్లీ అల్లు అర్జున్, సుకుమార్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘అల్లు అర్జున్ మాస్టర్ క్లాస్ పెర్ఫార్మెన్స్ కోసం ‘పుష్ప 2’ చూడండి. రష్మిక ఫ్యాబ్యులెస్. కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్‌కు అర్థం చెబుతూ సుకుమార్ ఒక కంప్లీట్ మసాలా ఎంటర్టైనర్ని అందించారు. అల్లు అర్జున్ నటనతో ఈ సినిమా బాక్సాఫీస్‌లో కొత్త చరిత్ర లిఖించనుంది’’ అని ఆయన పొగడ్తలతో ముంచెత్తడం ఉత్తరాదిలో ఈ సినిమా ప్రభంజనానికో నిదర్శనం. చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా.. ఫట్టా?పుష్ప: ది ర్యాంపేజ్‘పుష్ప 2’కి కొనసాగింపుగా ‘పుష్ప: ది ర్యాంపేజ్’ రానుంది. అయితే ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్‌లకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాకే ‘పుష్ప: ది ర్యాంపేజ్’ పనులు మొదలవుతాయని ఊహించవచ్చు. ఇక ‘పుష్ప 2’ భారీ విజయంతో ‘పుష్ప 3’ పై భారీ అంచనాలు ఉండటం సహజం. -
కలసి తింటే.. కలదు సుఖం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలతో పాటు నగర విందు వైవిధ్యభరితంగా ఉంటుంది. అమెరికన్, మెక్సికన్, ఇటాలియన్ సహా పాశ్చాత్య వంటకాలు, క్లాసిక్ చైనీస్ వంటకాలు ఇక్కడ డిమాండ్‌లో ఉన్నాయి. మరోవైపు సుసంపన్నమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందింది మన నగరం. దీంతో రెస్టారెంట్ల సంఖ్యలో వృద్ధితో పాటే సిటీ జనుల ఆహారపు అలవాట్లలో వేగవంతమైన మార్పును చవిచూస్తోంది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఇండియా ఫుడ్ సరీ్వసెస్ రిపోర్ట్ (ఐఎఫ్ఎస్ఆర్) 2024 ప్రకారం, సిటీజనులు నెలకు సగటున ఏడు సార్లు బయటే భోజనం చేస్తారు లేదా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఇది జాతీయ సగటు 8కి అతి దగ్గరగా ఉంది. ఇంకా ఈ ఐఎఫ్ఎస్ఆర్ నివేదిక తెలిపిన అంశాల్లో మరికొన్ని ఇలా.. సరికొత్త వంటకాలు.. రెస్టారెంట్ల అన్వేషణ.. సామాజిక సమూహాలు, కుటుంబాలు, స్నేహితులతో సమావేశాలు సిటీలో డైనింగ్ కల్చర్‌ను ప్రభావితం చేస్తున్న ముఖ్యాంశాలు. హైదరాబాదీలు కూడా విహారయాత్రలతో పాటు సినిమాలను చూడటం దాకా రెస్టారెంట్ల సందర్శనను కూడా జత చేస్తారు. అంతేకాక కొత్త వంటకాలు సరికొత్త రెస్టారెంట్లను అన్వేషించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటారు. అవుట్‌సైడ్ ఫుడ్.. రీజన్స్ ఇవే.. బయటి ఆహారం తినడానికి కుటుంబం, స్నేహితులతో గెట్– టుగెదర్ 28.9 శాతం మందికి ప్రధాన కారణంగా ఉంది. అదే విధంగా థియేటర్లో సినిమా చూడడానికి ముందు, ఆ తర్వాత 19.3 శాతం మంది బయటే తింటున్నారు. అలాగే పండగ లేదా నేషనల్ హాలిడేస్ వచి్చనప్పుడు 19.3 శాతం మంది, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రమోషన్లు వంటి ఆనందకరమైన సందర్భాలను సెలబ్రేట్ చేసుకోవడానికి 19.3 శాతం మంది, కొత్త అవుట్‌లెట్స్, రెస్టారెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఉందో చూడడానికి అని13.3 శాతం మంది బయటి ఫుడ్‌కి ఓటేస్తున్నారు. దేశంలోనే 5వ స్థానంలో... నగరంలో అన్ని సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్నవి కలిపితే 74,000 పైగా ఆహార విక్రయశాలలు ఉన్నాయి. నగరం వ్యవస్థీకృత రంగాన్నే తీసుకుంటే రూ. 10,161 కోట్ల విలువ చేస్తుందని అంచనా. మన భాగ్యనగరానిది దేశంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్. నగరం 40 వేలకుపైగా రెస్టారెంట్లు కలిగి ఉంది. వీటిలో క్లౌడ్ కిచెన్‌లూ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇవి మొత్తం మార్కెట్లో 40 శాతం వాటా కలిగి ఉండడం క్లౌడ్ కిచెన్ల వృద్ధికి అద్దం పడుతోంది. అనారోగ్యాలకూ ఆహ్వానం.. సిటీలో అవుట్‌సైడ్ ఫుడ్ తినడం అనేది పెరగడం ఆరోగ్యపరమైన సవాళ్లను తెచి్చపెడుతోంది. కొన్నిచోట్ల అపరిశుభ్ర నిల్వ పద్ధతులు, నాసిరకం వంట పద్ధతులు ప్రమాణాలు పాటించని విధానాలు సిటీజనులకు రోగాలను కొని తెచ్చిపెట్టుకున్నట్టుగా చేస్తున్నాయి. అంతేకాకుండా.. కేలరీలు అధికంగా ఉండే రెస్టారెంట్ ఫుడ్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, స్థూలకాయం సంబంధిత ఆరోగ్య సమస్యలకు దోహదపడవచ్చు. వీటిని గుర్తించి అవగాహనతో మాత్రమే అవుట్‌సైడ్ డైనింగ్‌ను ఆస్వాదించాల్సి ఉంది. -
పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్’ను వీక్షించనున్న మోదీ
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా హిందీ చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు(సోమవారం) వీక్షించనున్నారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు సభ్యులతో మోదీ ఈ చిత్రాన్ని చూడనున్నారు. మోదీతో పాటు విక్రాంత్ మాస్సే, చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ కూడా చిత్రాన్ని వీక్షించనున్నారు.ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన ఆధారంగా రూపొందించిన ది సబర్మతి రిపోర్ట్’లో నటులు విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశి ఖన్నా ప్రధాన పాత్రాలుగా నటించారు. బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా తెరకెక్కించగా.. ఏక్తా కపూర నిర్మించారు. నవంబర్ 15న ఈ సినిమా విడుదలైంది.కాగా పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టడంతో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గుజరాత్లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. కాగా ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. -
అల్లు అర్జున్, ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
‘సబర్మతి రిపోర్ట్’ సినిమాపై ప్రధాని మోదీ కీలక ట్వీట్
న్యూఢిల్లీ:తాను సీఎంగా ఉన్నప్పుడు జరిగిన గుజరాత్ అల్లర్లను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నిజాలు బయటకు వస్తున్నాయన్నారు.కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని,సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఈ సినిమానుద్దేశించి ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్‌పై ప్రధాని ఆదివారం ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ సంచలనం రేపిన విషయం తెలిసిందే.2002 ఫిబ్రవరి 27న పంచమహాల్ జిల్లాలోని గోద్రా నగరంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా తెరకెక్కించారు. విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. నవంబర్ 15న సినిమా విడుదలైంది. Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y— Narendra Modi (@narendramodi) November 17, 2024 -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' టీజర్ HD స్టిల్స్ (ఫొటోలు)
-
ఓటీటీకి జై
వినోదం అంటే దాదాపు అందరికీ ఫస్ట్ ఛాయిస్ సినిమానే! ఇతర ఎంటర్టైన్మెంట్లు ఎన్ని ఉన్నా ఇప్పటికీ సినిమా క్రేజ్ తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలు చూసేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చూసే విధానం మారుతోంది. థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతూ ఓటీటీల్లో వీక్షించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటర్నెట్ యుగంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలు దూసుకురావడంతో ఎంటర్టైన్మెంట్ తీరు పూర్తిగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక సినిమాకు ఒక ఫ్యామిలీ వెళ్తే అయ్యే ఖర్చుతో రెండు ఓటీటీ యాప్‌లలో ఏడాది పాటు సినిమాలు చూడొచ్చు. వీడియో, ఆడియో థియేటర్ క్వాలిటీతో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ‘ఎంటర్టైన్మెంట్’ ఇంట్లోనే ఆస్వాదించే అవకాశం ఉండటంతో అధికశాతం మంది ఓటీటీకి జై కొడుతున్నారు. – సాక్షిప్రతినిధి, కర్నూలు వెండితెర!... సినిమా స్క్రీన్కు సినీ ప్రియులు పెట్టిన పేరు! 50 ఏళ్ల కిందట వినోదం అంటే డ్రామాలు, సినిమాలు! అభిమాన హీరో సినిమా వస్తోందంటే చెప్పలేని హడావుడి. అయితే ప్రస్తుతం ప్రేక్షకుడి తీరు మారింది. థియేటర్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం ఖర్చు పెరగడమే! మలి్టఫ్లెక్స్ల రాకతో వెండితెర సగటు ప్రేక్షకుడికి అందనంత దూరం వెళ్లింది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం సినిమాకు వెళ్లాలంటే రిక్లైనర్సీట్లకు రూ.295 చొప్పున రూ.1180. ట్యాక్స్‌లతో కలిపి రూ.1312.16 అవుతుంది. అదే కొత్త సినిమా అయితే ఒక్కో టిక్కెట్ రూ.400పైమాటే! దీనికి బ్రేక్ టైంలో స్నాక్స్ ఖర్చు అదనం. సామాన్య ప్రజలు ఇంత డబ్బు ఖర్చు చేయాలంటే కష్టమే! దీంతో సినిమా కూడా సామాన్యులకు అందకుండా ఖరీదైన వినోదం అయిపోయింది. అయితే అదే సమయంలో సినిమా చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇదేంటి అనుకుంటున్నారా...అవును ఓటీటీ స్ట్రీమింగ్! ఓటీటీల ఎంట్రీతో ‘ఎంటర్టైన్మెంట్’ ‘షో’ పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు వీలైతే, అప్పుడు ‘సినిమా’!.. వీడియో, ఆడియో క్వాలిటీని ఎంజాయ్ చేయాలంటే థియేటర్లోనే సినిమా చూడాలనుకునేవాళ్లం. ఇప్పుడు 4కే, క్యూ ఎల్ఈడీ లాంటి టీవీలు వచ్చాయి. అందులోనూ 65, 75 ఇంచుల్లో పెద్ద టీవీలూ ఉన్నాయి. కొన్ని థియేటర్ల కంటే ఈ టీవీల్లో ఆడియో, వీడియో క్వాలిటీ బాగుంటోంది. దీంతో ఇంట్లో కూడా ‘థియేటర్ ఎక్స్పీరియన్స్’ వస్తోంది. పైగా ఇప్పుడు ‘హోం థియేటర్ కల్చర్’ పెరిగింది. కొత్తగా నిరి్మంచే ఇళ్లలో చాలామంది ‘హోంథియేటర్’ నిరి్మస్తున్నారు. థియేటర్‌కు వెళ్లాలంటే నిర్దేశిత సమయం కేటాయించాలి. ఉద్యోగస్తులు, వ్యాపారులకు సినిమాపై కోరిక ఉన్నా వీలుండదు. వీరంతా ఓటీటీ కేటగిరీలో ఉన్నారు. కొందరు ఒకే సినిమాను రోజూ కొద్ది కొద్దిగా 2–3 రోజుల్లో చూస్తున్నారు. ఇలా ఓటీటీ ప్లాట్‌ఫాం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఎంటర్టైన్ మెంట్‌ను మార్చేసిన కోవిడ్ కోవిడ్ సమయంలో థియేటర్‌కు వెళ్లడం తగ్గింది. ఒకదశలో ‘సినిమా’ మనుగడ కష్టమే! అనే చర్చ నడిచింది. ఈ విపత్తు నుంచి పుట్టుకొచ్చిందే ఓటీటీ ప్లాట్‌ఫాం! అంతకు ముందు కూడా ఉన్నా, కోవిడ్ నుంచి ఓటీటీ సంఖ్య, స్ట్రీమింగ్ పెరిగాయి. అమెజాన్ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సన్‌నెక్ట్స్, జీ5, సోనీలివ్‌తో పాటు దేశవ్యాప్తంగా 46 ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. వీటి స్ట్రీమింగ్ ఖర్చు కూడా చాలా తక్కువ. అమెజాన్ ప్రైమ్ ఏడాది స్ట్రీమింగ్ రూ.1499. ఆహా గోల్డ్ ఏడాది సబ్‌్రస్కిప్షన్ రూ.699. రెండు కలిపినా రూ.2,198! ఒక ఫ్యామిలీ, ఒక సినిమాకు వెళ్లే ఖర్చుకంటే తక్కువ! దాదాపు అన్ని ఓటీటీ ఏడాది సబ్‌్రస్కిప్షన్ రేట్లు కూడా రూ,.1500లోపే ఉన్నాయి. దీంతో ప్రజలు థియేటర్‌కు వెళ్లడం తగ్గించి, ‘టీవీ రిమోట్’ చేతిలో పట్టుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారం, సినిమాను థియేటర్లో చూసేవారి సంఖ్య కంటే, ఆ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత చూసేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు పెద్ద హీరోలు కూడా రియాలీ్టషోల్లో నటించి, వాటిని ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. చివరకు క్రికెట్‌తో పాటు ఇతర స్పోర్ట్స్ కూడా ఓటీటీల్లో లైవ్ ఇస్తున్నారు. దీన్నిబట్టే ఓటీటీ ఏస్థాయికి వెళ్లిందో తెలుస్తోంది. 2022తో పోల్చితే 2023లో 13.8శాతం ఓటీటీ సబ్స్క్రైబర్స్ పెరిగితే, 2024లో ఇప్పటివరకూ 21 శాతం పెరిగారు. 5జీతో పెరిగిన ఇంటర్నెట్ వేగం! 5 జీ రాకతో ఇంటర్నెట్ వేగం కూడా పెరిగింది. పైగా రూ.351కే 40ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అందుతోంది. ఓటీటీల విస్తృతికి ప్రధాన కారణం ఇంటర్నెట్ వినియోగమే! టీనేజర్ల నుంచి పెద్దల దాకా దాదాపు అందరూ ‘స్మార్ట్‌ఫోన్’ యూజర్లే! వీరంతా ఇంటర్నెట్ యూజర్లు కూడా! దీంతో మొబైల్లో ఓటీటీయాప్ల ద్వారా వినోదం చూస్తున్నారు. ఓటీటీలపై అవగాహన ఉన్న వారంతా రెండు ఓటీటీయాప్లకు తక్కువ లేకుండా చూస్తున్నారు. కేబుల్రంగంలో ఇంటర్నెట్ హవా పెరిగింది. ఎక్కువగా వైఫై ద్వారానే కేబుల్ ప్రసారాలు చేస్తున్నారు. వెబ్సిరిస్లపై ఆసక్తి!.. ప్రస్తుతం సినిమాకు ధీటుగా ‘వెబ్‌సిరీస్’ లు వచ్చాయి. పెద్ద దర్శకులు, పేరున్న నటులు వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నారు. పైగా సినిమా 2.30గంటలు చూడాలి. వెబ్‌సిరీస్ 40 నుంచి 60 నిమిషాలే. పైగా ఇవి ఓటీటీ రిలీజ్లు. దీంతో ఎక్కువమంది వెబ్‌సిరీస్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య 82.5శాతం ఉంటే, వెబ్‌సిరీస్‌లు చూసేవారి సంఖ్య 68.7శాతం ఉంది. అంటే వెబ్‌సిరిస్ కంటే సినిమాలు చూసే వారి సంఖ్య కేవలం 13.8 శాతం మాత్రమే అధికం! 2022లో హిందీలో 72, తెలుగులో 56 వెబ్‌సిరీస్‌లు విడుదలయ్యాయి. ఈ సంఖ్య ఈ ఏడాది 3 నుంచి 5 రెట్లు పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అంచనా. ఓటీటీల రాకతో పైరసీలకు చెక్‌పడింది. -
ఇంట్లోనే వెండితెర
సాక్షి, భీమవరం: వెండితెర వినోదం కొత్త పుంతలు తొక్కుతోంది. టూరింగ్ టాకీస్ రోజుల్లో కొత్త సినిమాలు పట్టణాల్లో మాత్రమే విడుదలయ్యేవి. అప్పట్లో ఎడ్ల బళ్లు కట్టుకుని మరీ ఇంటిళ్లపాది వెళ్లి చూసి వచ్చేవారు. కాలం మారింది. ఇప్పుడు ఎంత పెద్ద హిరో సినిమా అయినా నెలరోజుల్లోనే ఓవర్ ది టాప్ (ఓటీటీ)లో వస్తుంటే ఆధునిక పరిజ్ఞానం హోమ్ థియేటర్ల రూపంలో వెండితెరను ఇంటికే తెస్తోంది. థియేటర్లో చూసిన అనుభూతిని అందిస్తోంది. కొన్నాళ్లు నగరాలకే పరిమితమైన ఈ హోమ్ థియేటర్ కల్చర్ ఇప్పుడు అన్నిప్రాంతాలకూ విస్తరిస్తోంది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూతపడగా ఇళ్లకే పరిమితమైన జనానికి ఓటీటీనే ఏకైక వినోద సాధనమైంది. సినిమాలు నేరుగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీహాట్‌స్టార్, ఆహా, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ కావడం మొదలైంది. చౌక ప్లాన్లు, ఇంటిళ్లిపాది చూసే అవకాశం ఉండటంతో కొద్ది రోజుల్లోనే వీటికి ఆదరణ అమాంతం పెరిగిపోయింది. ఇంట్లోనే థియేటర్ అనుభూతి గతంలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే కనిపించే హోమ్ థియేటర్ కల్చర్ ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. సంపన్న వర్గాలతో పాటు కాస్తోకూస్తో డబ్బున్న వారు కూడా వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు. హోం థియేటర్ సెట్ చేయడానికి కనీసం 10 గీ 15 అడుగుల విస్తీర్ణం కలిగిన హాల్ ఉండాలి.నాణ్యమైన సౌండ్ సిస్టమ్, స్క్రీన్, అభిరుచికి తగ్గట్టుగా సిట్టింగ్, ఇంటీరియర్ డికరేషన్ను బట్టి హోం థియేటర్‌కు రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చవుతుంది. స్క్రీన్, ప్రొజెక్టర్, యాంప్లిఫయర్, స్పీకర్స్, సౌండ్ ప్రూఫింగ్ తదితరాలను అమర్చుతారు. అధికశాతం మంది రూ.5 లక్షల వరకు వెచ్చిస్తుండగా, కొందరు రూ.10 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు టెక్నీషియన్స్ చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో 300కు పైగా హోమ్ థియేటర్లు ఉన్నాయంటున్నారు. తాజాగా ఏలూరు సమీపంలోని 150 విల్లాల్లో కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా హోం థియేటర్లు సిద్ధం చేస్తున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఒక హోం థియేటర్స్ అధినేత ఆర్ఎస్ఎస్ మూర్తి తెలిపారు. ప్రైవేట్ థియేటర్లకు పెరుగుతున్న ఆదరణ వినోదానికి ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో సినిమాలు చూసేందుకు, ఈవెంట్స్, ప్రత్యేక వేడుకల కోసం మినీ థియేటర్లకు ఆదరణ పెరుగుతోంది. పది మంది లేదా కుటుంబ సభ్యులతో నిర్వహించే బర్త్‌డే పార్టీలు, ఇతర వేడుకలకు ఇవి అనువుగా ఉంటున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో ఇవి ట్రెండింగ్‌గా మారాయి. స్క్రీన్, సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, పది మంది కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్, ఇంటీరియర్‌తో ఆకర్షణీయంగా వీటిని తయారుచేస్తున్నారు. 30 X 20 చ.అడుగులు మొదలుకొని కొంత స్థలంలో మినీ హోం థియేటర్లు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ఔత్సాహిక యువత ఉపాధి పొందుతున్నారు. ఇటీవల ఈ తరహా మినీ థియేటర్లు భీమవరంలో ఐదు వరకు వచ్చాయి. సీజన్‌ను బట్టి గంటకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు వీటికి అద్దె ఉంటుంది. మరో పక్క యువతను ఆకర్షించేందుకు జ్యూస్, ఐస్‌క్రీం పార్లర్లు, హోటళ్లలోను హోం థియేటర్ల ఏర్పాటుకు వ్యాపారులు ప్రాధాన్యమిస్తున్నారు. ఈవెంట్ల కోసం ఇటీవల కాలంలో ప్రైవేట్ థియేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. భీమవరంలోని మా మ్యాజిక్ పిక్చర్ ల్యాండ్‌లో ఏర్పాటుచేసిన మినీ థియేటర్‌కు ఆదరణ బాగుంది. గంటల చొప్పున థియేటర్‌ను రెంట్‌కు ఇస్తుంటాం. –జి.కృష్ణంరాజు, మ్యాజిక్ పిక్చర్ ల్యాండ్, భీమవరం -
సైన్సు సినిమా.. అక్టోబర్ స్కై
‘అక్టోబర్ స్కై’ 1999లో విడుదలైన హాలీవుడ్ సినిమా. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో కోల్ వుడ్ అనే ఓ చిన్న గ్రామంలో జరిగిన నిజజీవిత కథ ఆధారంగా తీశారు. ఆ గ్రామానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ ఇది. కథ జరిగిన కాలం 1957. పెద్దగా సౌకర్యాలు లేని ఓ కుగ్రామానికి చెందిన ఆ కుర్రాళ్లకి కొన్ని కారణాల వల్ల రాకెట్ తయారు చెయ్యాలని ఆలోచన వస్తుంది. ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి ఎంతో వ్యతిరేకతని ఎదుర్కొని చివరికి చిన్న రాకెట్ తయారు చేస్తారు. ఆ రాకెట్‌ని ఓ జాతీయస్థాయి సైన్స్ ప్రాజెక్ట్ పోటీలో ప్రదర్శించి మొదటి స్థానంలో విజయం సాధిస్తారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ కథలో ముఖ్య పాత్ర పేరు ‘హోమర్ హికమ్’. ఆ హోమర్ హికమ్ ఆ తర్వాతి కాలంలో తన రాకెట్ తయారీ అనుభవాన్ని ‘రాకెట్ బోయ్స్’ పేరుతో పుస్తకం రాశాడు. యూనివర్సల్ స్టూడియోస్ వారు పుస్తకం హక్కులు కొని ‘అక్టోబర్ స్కై’ పేరుతో సినిమాగా విడుదల చేసి హిట్ సాధించారు. పుస్తకం పేరు ‘రాకెట్ బోయ్స్’ను యథాతథంగా సినిమాకు కూడా పెడితే ‘ముప్పై ఏళ్లు నిండిన స్త్రీలు ససేమిరా చూడరు’ అని యూనివర్సల్ స్టూడియోస్ వారు అభిప్రాయపడడం చేత Rocket Boys అని మార్చవలసి వచ్చింది. ఇక్కడ తమాషా ఏంటంటే 'Rocket అన్న పదజాలంలోని అక్షరాలని తారుమారు చేస్తే అది 'October Sky' అవుతుంది. ఈ కథ పిల్లలకి ఎంత స్ఫూర్తి దాయకంగా ఉంటుందంటే ఈ పుస్తకాన్ని అమెరికాలో ఎన్నో బళ్లు పిల్లలు తప్పనిసరిగా సిలబస్‌లో పెట్టాయి. -
ఘనంగా అవార్డుల వేడుక
తమిళసినిమా: అవార్డులు అనేవి ప్రతిభకు గుర్తింపునే కాకుండా వర్తమాన కళాకారులకు ఎంతో ప్రోత్సాహకారంగా నిలుస్తాయి. వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడతాయి. ఇక సామాజిక సేవకులకు ఈ అవార్డులు వారి సేవలకు ఫలితంగానూ, గౌరవాన్ని పెంచే విధంగాను ఉంటాయి. అలాంటి ప్రోత్సాహంగా అవార్డుల వేడుకలను అనురాధ జయరామన్‌కు చెందిన మహా ఆర్ట్స్ సంస్థ, కలైమామణి, డాక్టర్ నైల్లె సుందరాజన్కు చెందిన యునైటెడ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థ కలిసి చాలా ఏళ్లుగా సమర్థంగా నిర్వహిస్తున్నారు.అదేవిధంగా శనివారం సాయంత్రం స్థానిక వడపళని, కుమరన్ కాలనీలోని శిఖరం ఆవరణలో ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విశ్రాంతి హైకోర్టు న్యాయమూర్తి జ్ఞానప్రకాశం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటి శ్రీవిద్య తదితర కళాకారులతోపాటు, సైకిల్ ఛాంపియన్ డాక్టర్ ఎం ఆర్ సౌందర్య రాజన్, సెన్సార్ బోర్డు సభ్యుడు డాక్టర్ వీకే. వెంకటేశన్ మొదలగు పలువురు సామాజిక సేవకులకు విశ్రాంతి న్యాయమూర్తి జ్ఞాన ప్రకాశం చేతుల మీదగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతల కళా, సామాజిక సేవలను విశ్రాంతి న్యాయమూర్తి జ్ఞాన ప్రకాశం అభినందించారు. అలాగే సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. -
సింగరేణి తంగలాన్..!
‘కేజీఎఫ్’, ‘తంగలాన్ ’ సినిమాలతో కర్నాటకలోని కోలార్ గోల్డ్ఫీల్డ్లో బంగారం అన్వేషణ ఎలా జరిగిందో చూపించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన కార్మికులు కొలార్ గనుల్లో ఎలా దగాపడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే అంశాలను మ్యాజిక్ రియలిజం ధోరణిలో ‘తంగలాన్’ సినిమా చూపించింది. బంగారు గనులపై గుత్తాధిపత్యం కలిగిన నియంతలకే రాకీ అనే యువకుడు ఎలా భాయ్‌గా మారాడనే అంశాన్ని వాస్తవ ఆధారిత కల్పితాలుగా ‘కేజీఎఫ్’ సినిమాలో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు లేకపోయినా, నల్ల బంగారంగా పిలుచుకునే సింగరేణి గనులు ఉన్నాయి. బొగ్గు తవ్వకాల కోసం గనుల యజమానులు కార్మికులను ఎలా రప్పించారో, కార్మికుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో, వారి ఆగడాలను కార్మికులు ఐక్యంగా పోరాడి ఎలా సాధించుకున్నారో ఓసారి చూద్దాం...మనదేశంలో బొగ్గు తవ్వకాలను బ్రిటిషర్లు ప్రారంభించారు. తొలి బొగ్గు గని 1774లో పశ్చిమ బెంగాల్‌లోని రాణీగంజ్‌లో మొదలైంది. మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 1889లో సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు గని మొదలైంది. స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇల్లెందు, బెల్లంపల్లి (1928), కొత్తగూడెం (1938)లలో బొగ్గు గనులు మొదలయ్యాయి. 1914, 1942లలో జరిగిన మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి బొగ్గు అవసరం బాగా పెరిగింది. దీంతో గనుల్లో పని చేసే కూలీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను నియమించింది. కాంట్రాక్టర్ల తరఫున ఏజెంట్లు పల్లెల్లో తిరుగుతూ, ప్రజలను సమీకరించి కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి గ్రామాలకు తీసువచ్చేవారు. అయినా, కూలీలు సరిపోకపోవడంతో అప్పటికే బొగ్గు గనుల రంగంలో అనుభవం ఉన్న బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ కార్మికులను ఇక్కడికి రప్పించేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ల పేరుమీదుగానే బొగ్గు గనుల ప్రాంతంలో సన్యాసి బస్తీ, గాజుల రాజంబస్తీ, గంగా బిషన్ బస్తీ, కూలీ లైన్, బర్మా క్యాంప్, మథుర బస్తీ, నాగయ్య గడ్డ, పంజాబ్ గడ్డ, కొత్తూరు రాజం బస్తీ, బాబు క్యాంపు, రడగంబాల బస్తీ తదితర పేర్లతో కాలనీలు ఏర్పాటయ్యాయి.చావుతో చెలగాటం..గాలి, వెలుతురు, నీరు వంటి కనీస సౌకర్యాలు కరువైన గనుల్లో పని చేయడమంటే చావుతో చెలగాటం ఆడటమే! 1928 మార్చి 12న ఇల్లెందులోని స్ట్రట్‌పిట్ మైన్ లో మీథేన్ లాంటి విషవాయువులు వెలువడటంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకేసారి 43 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత బెల్లంపల్లి, కొత్తగూడెంలోని బర్లిపిట్ గనిలో ఈ తరహా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు గనుల్లో మాడిమసైపోయారు.రక్తాలు కారుతుండగా..బొగ్గు వెలికి తీయడానికి కార్మికులు దొరక్కపోవడంతో మహిళలు, పిల్లల చేత కూడా పని చేయించేవారు. చెప్పులు లేకుండా బొగ్గు పెళ్లల మీదుగా నడుస్తూ, బావుల్లోకి దిగాల్సి వచ్చేది. గనిలోకి వెళుతుంటే పైకప్పు నుంచి నీరు కురిసేది. నీటితో పాటు వచ్చే బొగ్గు రజను చర్మానికి ఒరుసుకుపోయి గాయాలయ్యేవి. గాయాల బాధను భరిస్తూనే, పనిముట్లతో బొగ్గు బండలను కొట్టి చిన్న ముక్కలుగా చేసి తట్టల్లో నింపుకుని నెత్తిపై మోస్తూ పనిచేయాల్సి వచ్చేది. గనిలో విషవాయులు ఎప్పుడు వెలువడుతాయో, గని పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని దారుణ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కార్మికులు పనిచేసేవారు. ఇక కటిక చీకటితో ఉండే గనిలో దారి తప్పి అదృశ్యమైన వారి సంఖ్యకు అంతేలేదు.కాంట్రాక్టర్ల దోపిడీ..కార్మికులకు అరకొర జీతాలు చెల్లిస్తూ, వారితో కాంట్రాక్టర్లు బండెడు చాకిరీ చేయించే వారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా, పిల్లాపాపలు, మహిళలతో సహా బొగ్గు గనుల్లో రేయింబగళ్లు పనిచేయించేవారు. గనుల్లో ప్రమాదాలు, మరణాలు నిత్యకృత్యం. ఇక్కడ పని చేయలేక పారిపోయేందుకు ప్రయత్నించే వారిని కాంట్రాక్టర్ల గుండాలు వెతికి పట్టుకుని, చిత్రహింసలు పెట్టేవారు. ఇక మహిళలపై జరిగే అకృత్యాలకు అంతేలేదు.కాంట్రాక్టర్లకే నిజాం మద్దతు..బొగ్గు తవ్వకాల బాధ్యతలు చూస్తు్తన్న బ్రిటిషర్లకు, కార్మికులను అందిస్తున్న కాంట్రాక్టర్లకు రక్షణగా నిజాం పోలీసు వ్యవస్థ పనిచేస్తూ, కార్మికులను పీడించే కాంట్రాక్టర్లకు వెన్నుదన్నుగా నిలిచేది. కార్మికులు ఎటూ పారిపోకుండా రైల్వే స్టేషన్లలోను, ఊరి పొలిమేర్లలోను నిఘా పెట్టేది. తమకు జరిగే అన్యాయాలపై ఎవరైనా నోరు విప్పినా, పట్టించుకునే నాథులు ఉండేవారు కాదు. కాంట్రాక్టర్ల చేతిలో చిక్కి వెట్టిచాకిరి చేసే కార్మికులను ఆదుకునే వారూ ఉండేవారు కాదు.సాయుధ పోరాటం..రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక నిజాం రాజ్యంలో సాయుధ రైతాంగ పోరాటానికి అడుగులు పడ్డాయి. అదే సమయంలో సింగరేణిలో కార్మిక సంఘాలు పురుడు పోసుకున్నాయి. అలా నిజాం రైల్వే యూనియన్ (హైదరాబాద్), అజాంజాహీ మిల్ వర్కర్స్ (వరంగల్) యూనియన్ల తర్వాత 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ పేరుతో మూడో యూనియన్ ఏర్పడి, గనుల్లో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తు్తన్న నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.ప్రశ్నించిన శేషగిరి..నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో 1918 సెప్టెంబరు 24న జన్మించిన దేవనూరి శేషగిరిరావు అక్కడే విద్యాభాస్యం పూర్తి చేసుకుని ఉపాధి కోసం సింగరేణిలో అకౌంటంట్గా చేరి, కొత్తగూడేనికి మకాం మార్చారు. ఇక్కడి కార్మికుల కష్టాలు, కాంట్రాక్టర్ల దోపిడీని దగ్గరగా చూశారు. అన్యాయానికి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నారు. పొద్దంతా హెడాఫీసులో పని చేస్తూ, సాయంత్రం వేళ కార్మికవాడలకు వెళ్లి, వారితో కలసిపోయి, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, హక్కుల కోసం పోరాడేలా తయారు చేశారు. 1947లో రహస్య జీవితం గడుపుతున్న శేషగిరిని నిజాం పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక కేసు విచారణ కోసం అక్కడి నుంచి ఇల్లెందుకు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో డోర్నకల్‌లో ఆగారు. అక్కడ పోలీసుల నుంచి తప్పించుకున్న శేషగిరి విజయవాడ చేరుకున్నారు. అక్కడ గెరిల్లా యుద్ధతంత్రాలు నేర్చుకుని, వాటిని సింగరేణి ప్రాంతంలో అమల్లోకి తెచ్చారు. చివరకు 1948 ఫిబ్రవరి 15న భద్రాచలం సమీపంలో నెల్లిపాక దగ్గర జరిగిన ఎన్ కౌంటర్లో శేషగిరితో పాటు పాపయ్య, రంగయ్య అనే విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు.యూనియన్ కొమరయ్య..కొమరయ్య 1928లో ఇల్లెందులో జన్మించారు. కొత్తగూడెంలోని మెయిన్ వర్క్‌షాప్‌లో 1940లో టర్నర్‌గా చేరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 1947లో అరెస్టయి, సుమారు ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత 1948లో జైలు నుంచి విడుదలయ్యాక 1949 వరకు అజ్ఞాత జీవితం గడిపారు. ఇండియాలో నిజాం స్టేట్ విలీమైన తర్వాత చివరి శ్వాస వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారు. దీంతో ఆయన పేరే యూనియన్ కొమరయ్యగా కార్మికుల గుండెల్లో నిలిచిపోయింది. దేవనూరి శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యల తరహాలోనే సర్వదేవభట్ల రామనాథం, డాక్టర్ రాజ్‌బహదూర్, పర్సా సత్యనారాయణ, పులిపాక రాజయ్య, మఖ్దూం మొíహియుద్దీన్, వంగా రాజేశ్వరరావు, కారపెల్లి రాఘవరావు వంటి నాయకులు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారు.హక్కుల సాధన..కార్మికులు ఐక్యంగా సాగించిన పోరాటాల ఫలితంగా గనుల్లో కాంట్రాక్టు వ్యవస్థ రద్దయ్యింది. రోజుకు పన్నెండు గంటల పని స్థానంలో ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. బాలలతో పనులు చేయించడం ఆపించారు. మహిళలకు గనుల్లో కాకుండా ఉపరితలంలోనే పనులు ఇచ్చేలా మార్పులు తెచ్చారు. గనుల్లోకి కిరోసిన్ దీపాలు తీసుకుని వెళ్లడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సేఫ్టీ ల్యాంప్స్‌ను ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చారు. వేతనాలు పెరిగాయి. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణం/అంగవైకల్యం సంభవిస్తే నష్టపరిహారం ఇచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సాధించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన రాజకీయ పార్టీలకు అనుబంధంగా అనేక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పని చేశాయి.ప్రస్తుతం ఇలా..ఆరేడు దశాబ్దాలుగా కార్మికులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ప్రస్తుతం 39 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరి సగటు వేతం రూ. 70 వేలు ఉండగా, వీరిలో ప్రారంభ జీతం రూ.60 వేలు మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు అందుకునేవారు ఉన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నారు. చివరిసారిగా రూ. 2,220 కోట్లను కార్మికులకు అందించారు. సంస్థ పరిధిలో 40 వేల క్వార్టర్లు, 12 ఆస్పత్రులు, 20 వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. సర్వీసులో సింగరేణి కార్మికుడు అకస్మాత్తుగా చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది. సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు బీమా మొత్తం రూ. 30 లక్షలుగా ఉంది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షిప్రతినిధి, కొత్తగూడెంఇవి చదవండి: అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్! -
ఇండియా లో ఉన్న హీరోలు అంతఈ సినిమాలో ఉన్నారుగా..
-
ఓటీటీపై.. ఓ లుక్కు!
సాక్షి, సిటీబ్యూరో: చేతిలో రిమోట్ పట్టుకుంటే చాలు కళ్ల ముందు చిత్రాల వెల్లువ, సిరీస్‌ల సముద్రం.. షోల ఫ్లో.. మరి ఎంచుకోవడం ఎలా? ఎవరిని అడగాలి ఏవి చూడాలి? మన సబ్‌స్క్రిప్షన్‌కి ఎలా న్యాయం చేయాలి? ఇవి నగరవాసులకు రోజువారీ సందేహాలుగా మారాయి. సమాధానాల కోసం విభిన్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఓటీటీ వీక్షణలో తమదైన శైలిని ఏర్పరచుకుంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న సినిమాల్లో కొన్ని మాత్రమే ఆసక్తికరమైన వాటిని ఎంచుకుని, చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.ఓటీటీ వేదికలంటే.. ఇంటి పట్టునే ఉండి కొత్త కొత్త సినిమాలను ఆస్వాదించడంతో పాటుగానే ఇప్పటి జీవన శైలిలో ఇదో నిత్యకృత్యంగా మారింది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, ఆహా, సోనీ లివ్, హాట్ స్టార్, జీ స్టూడియోస్ ఇలా లెక్కకు మించి ఆదరణ పొందుతున్న ఓటీటీ వేదికల్లో సినిమా చూసే ముందు, ఆ సినిమా విశేషాలను సంక్షిప్తంగా తెలియజేసే షార్ట్ స్టోరీ (సినాప్సిస్) ఉంటుంది. సాధారణంగా ప్రేక్షకులు ఈ సమాచారంతోనే సినిమా చూడాలా వద్దా అనే నిర్ణయానికి వస్తున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లోని సినిమాలు ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నారు. లేదా ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో విడుదల చేస్తున్నారు. ఈ కారణంతో ఏ భాష వారైనా సరే.. అన్ని భాషల్లోని ఉత్తమ సినిమాలను చూడగలుగుతున్నారు. ఇందులో ఈ షార్ట్‌స్టోరీ డి్రస్కిప్షన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఎంటర్టైన్మెంట్ షోలకు కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగు ఓటీటీ ఛానల్ ‘ఆహా’ వేదికగా ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడెల్ వంటి షోలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు.ఐఎండీబీ రేటింగ్..విడుదలైన మూవీ ఎలా ఉందని తెలిపే సినిమాల రివ్యూలాగే ఓటీటీ సినిమాలకు కూడా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) రేటింగ్ ఉంది. ఇది సినిమాలు, టెలివిజన్ సిరీస్, ట్రెండింగ్ కంటెంట్ తదితరాలకు ఆన్లైన్ రేటింగ్‌ను అందిస్తుంది. ఈ రేటింగ్‌లో భాగంగా పదికి 9 శాతం కన్నా ఎక్కువ ఉన్న వాటిని ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 5 శాతం కన్నా తక్కువ రేటింగ్ ఉంటే మాత్రం ఆ వైపు వెళ్లట్లేదు. 7, 8 శాతం రేటింగ్ ఉంటే చూడాల్సిన సినిమాగానే ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ట్రెండింగ్‌గా మారిన కొన్ని సినిమాలను చూడటం కోసమే ఆ ఓటీటీ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్న వారూ ఉన్నారు. ఒక్కో సినిమాకు వంద మిలియన్ల సీయింగ్ మినిట్స్ రావడం విశేషం. సోషల్ మీడియా ప్రమోషన్..ఓటీటీ సినిమాలకు సంబంధించి సోషల్ మీడియా ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటీటీ సబ్‌స్రై్కబర్లకు అదే వేదిక ద్వారానే ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రమోషన్ జరుగుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికల్లోనూ మీమ్స్, రీల్స్, ఆసక్తికర క్రియేటివ్స్తో ప్రచారం చేస్తున్నారు. బాగా క్లిక్ అయిన డైలాగ్, సాంగ్ తదితరాలతో ఈ ప్రచారం ఊపందుకుంటోంది. ఈ మధ్య కాలంలో గామీ, కమిటీ కుర్రాళ్లు, నిందా, ధూమం, శాకాహారి, గరుడన్, మ్యూజిక్ షాప్ మూర్తి, గోట్ లైఫ్, అహం రీబూట్, ఖాదర్ ఐజాక్ వంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి.ఓటీటీలో హిట్.. థియేటర్లో ఫట్..ఎన్నో అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు థియేటర్లో ప్రేక్షకాదరణ పొందలేక డిజాస్టర్లుగా నిలిచిపోతాయి. ఇది సినిమా రంగంలో సర్వసాధారణం. అయితే థియేటర్లో అంతంత మాత్రమే ఆడిన సినిమాలు ఓటీటీల్లో మాత్రం సూపర్ డూపర్ హిట్లుగా ఆదరణ పొందుతున్నాయి. అదేవిధంగా థియేటర్లో హిట్ టాక్ పొంది, అదే అంచనాలతో భారీ ధరకు కొనుగోలు చేసి ఓటీటీ వేదికల్లో విడుదల చేయగా.. ఆ అంచనాలకు చేరకపోగా, కనీసం ప్రేక్షకాదరణ పొందని సినిమాలు సైతం ఎన్నో ఉన్నాయి. థియేటర్ కల్చర్‌లో స్టార్ హీరోలు, మంచి క్యాస్టింగ్ ఉన్న సినిమాలనే ఎక్కువ ఇష్టపడే వారు జనాలు. కానీ ప్రస్తుతం ఆసక్తికర కథ, కథనం, మేకింగ్ ఉంటే చాలు. అది ఎవరి సినిమా ఐనా, చిన్న సినిమా ఐనా సరే.. విపరీతంగా చూస్తున్నారు. -
ఓటీటీలో కల్కి.. బీటీఎస్ పిక్స్ చూశారా? (ఫోటోలు)
-
ప్రభాస్ - హను రాఘవపూడి సినిమా..ఓపెనింగ్ ఫోటోలు వైరల్
-
.........
తమిళసినిమా: చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు జయం రవి. ప్రస్తుతం ఈయన బ్రదర్, జీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో బ్రదర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా నటుడు జయం రవి 2016లో కథానాయకుడిగా నటించిన చిత్రం మిరుదన్. నటి లక్ష్మీమీనన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని శక్తి సౌందర్‌రాజన్ తెరకెక్కించారు. నటి అనికా సురేందరన్ నటుడు జయం రవికి చెల్లెలిగా నటించగా, నటి లక్ష్మీమీనన్ ఆయన్ని ప్రేమించే నాయకిగా నటించారు. ఆమె జోంబీ బారిన పడడంతో తనను కాపాడే ప్రయత్నంలో పోలీస్ అధికారి అయిన జయం రవి కూడా జోంబీగా మారే ఇతి వృత్తంతో రూపొందిన చిత్రం మిరుదన్. కాగా ఈ తరహా జోంబీల ఇతి వృత్తంతో ఆంగ్లంలోనే వచ్చాయి. అలా తొలిసారిగా దక్షిణాదిలో జోంబీల ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మిరుదన్. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా మిరుదన్ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆయన మొదలెట్టేశారట. వచ్చే ఏడాది ప్రఽథమార్థంలో మిరుదన్ 2 చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్నందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో నటుడు జయం రవి హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే హీరోయిన్గా నటి లక్ష్మీమీనన్‌నే నటింపజేస్తారా? లేక మరెవరినైనా ఎంపిక చేస్తారా? అన్నది వేచి చూడాలి. అయితే ఇటీవల నటి లక్ష్మీమీనన్‌కు సరైన అవకాశాలు లేవన్నది గమనార్హం. దీంతో మిరుదన్ 2 చిత్రంలో మరో నటి నాయకిగా నటించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. -
రైలు దొంగ.. సినిమాల్లో సీన్లు చూసి..
చీరాల రూరల్/నెల్లూరు (క్రైమ్): విలాసాలు, వ్యసనాలకు బానిసయిన ఓ యువకుడు ఇంటర్నెట్లో సినిమాలు చూసి “రైలు దొంగ’గా అవతారమెత్తి.. కటకటాలపాలయిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే డీఎస్పీ సి.విజయభాస్కర్‌రావు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ అలియాస్ వెంకటేష్ వ్యసనాలకు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. కూలీ ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు సరిపోకపోవడంతో ఈజీ మార్గంలో మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు చూసి ప్రేరణ పొంది దొంగగా అవతారమెత్తాడు.రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్‌లు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను అపహరించేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు అధికం కావడంతో గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాల మేరకు.. ఒంగోలు జీఆర్పీ సీఐ కె.భుజంగరావు ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్.కొండయ్య తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారంపై నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
యథార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్
చందు కోడూరి హీరోగా నటించి స్వీయదర్శకత్వంలో తీసిన సినిమా 'ప్రేమలో'. చరిష్మా శ్రీకర్ హీరోయిన్. ట్రైలర్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం.. ఈ ఏడాది జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.తెలుగులో లవ్ స్టోరీ సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. 'ప్రేమలో' సినిమా కూడా పేరుకు తగ్గట్లే మొత్తం ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. రాజమండ్రి బ్యాక్ డ్రాప్లో పూర్తిస్థాయి గోదావరి యాసలో ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సినిమా విజయం సాధించింది. అయితే, సైలెంట్‌గా శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. లవ్‌స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ ప్రేక్షకులను భారీగానే మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలో ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాల్సి ఉంది.హీరో కమ్ డైరెక్టర్ చందు కోడూరి తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు. హీరోగా, దర్శకుడిగా అతడికి ఇదే మొదటి సినిమా.. అయినా, ఎక్కడ కూడా అలాంటి ఫీలింగ్ కనిపంచదు. యథార్థ సంఘటనల స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు చందు ఈ కథ రాసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కువగా ఫేక్ వీడియోలు వస్తుంటాయి. వాటి కారణంగా కొందరు అమాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే పాయింట్‌తో 'ప్రేమలో' మూవీని తెరకెక్కించారు. -
నగరంలోని చిన్నారులకై.. 15 నుంచి కుంగ్ ఫూ పాండా–4
మైక్ మిచెల్, స్టెఫానీ స్టైన్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ సంచలనం కుంగ్ ఫూ పాండా 4వ భాగం రానుంది. నగరంలోని చిన్నారులను, టీనేజర్లతో పాటు యానిమేషన్ చిత్రాలను ఇష్టపడే ప్రతి ఒక్కరినీ అలరించే సాహస దృశ్యాలు, అలాగే సునిశిత హాస్యంతో కూడిన ఈ చిత్రం... ఈ నెల15న జియో సినిమా ప్రీమియమ్‌లో ప్రసారం కానుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ డ్రాగన్ వారియర్ ఇంగ్లి‹Ù, హిందీతో పాటు, తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లోనూ అలరించనుందని వివరించారు.లామాకాన్‌లో ఒలక్లంత్ కా సర్..కళలు, సాహిత్యం, థియేటర్‌కు వేదికైన లామకాన్‌లో ‘ఒలక్లంత్ కా సర్’ అనే మరాఠీ థియేటర్ ప్లే శుక్రవారం ప్రదర్శితమవ్వనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమై గంట పాటు సాగనుంది. ఇందులో సౌరభ్ ఘరీపురీకర్, అదితీ ఇనామ్దార్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ ప్లేను యోగేశ్ సోమన్ రచించగ, సౌరభ్ ఘరీపురీకర్ దర్శకత్వం వహించనున్నారు. సౌరభ్ జోషి సంగీతం అందించనున్నారు. జాగిల్ ఫిన్‌టెక్ లీడర్ ఆఫ్ ద ఇయర్..మాదాపూర్‌లోని జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సరీ్వసెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజ్ ఎన్‌కు ప్రతిష్టాత్మకమైన ‘ఫిన్‌టెక్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. వినూత్న శైలి సామర్థ్య నిర్వహణతో ఫిన్‌టెక్ పరిశ్రమాభివృద్ధికి తోడ్పడినందుకు అవార్డు లభించిందని జాగిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్‌తో సహా క్రాస్–ఫంక్షనల్ టీమ్‌లతో కలిసి పని చేయడం ద్వారా బహుళ వ్యాపార కార్యక్రమాలను అమలు చేయగల సామర్థ్యానికి ప్రశంసగా.. ఇటీవల నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఫిన్‌టెక్ కా క్లేవ్–అవార్డ్స్ 2024లో ఈ పురస్కారం దక్కిందని వివరించారు.ఇవి చదవండి: 'ది ఫస్ట్ డిసెన్‌డెంట్'.. ఇదొక హైక్వాలిటీ గ్రాఫిక్స్ గేమ్!