నవ్వించడానికి చేసిన సినిమా ఇది | Saptagiri new movie pelli kani prasad | Sakshi
Sakshi News home page

నవ్వించడానికి చేసిన సినిమా ఇది

Published Thu, Mar 20 2025 6:02 AM | Last Updated on Thu, Mar 20 2025 6:09 AM

Saptagiri new movie pelli kani prasad

సప్తగిరి

‘‘మా కథకి పర్ఫెక్ట్‌ టైటిల్‌ ‘పెళ్లి కాని ప్రసాద్‌’. ఈ పేరు డైరెక్టర్‌ అభిలాష్‌ ఫిక్స్‌ చేశారు. ఆ టైటిల్‌ వెయిట్‌ని కాపాడేలా మా సినిమా ఉంటుంది. వినోదం చాలా అద్భుతంగా కుదిరింది. ప్రమోషన్స్‌కి వెళ్లినప్పుడు ఇప్పటికే కొంతమంది నన్ను ‘పెళ్లి కాని ప్రసాద్‌’ అని పిలుస్తున్నారు. అందరూ అలా పిలిస్తే మా సినిమా ప్రేక్షకులకు బాగా చేరువ అయినట్టే. అంతకంటే ఆనందం ఏముంటుంది’’ అని సప్తగిరి తెలిపారు. అభిలాష్‌ రెడ్డి గోపిడి దర్శకత్వంలో సప్తగిరి, ప్రియాంకా శర్మ జోడీగా నటించిన చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్‌’. 

చాగంటి సినిమాటిక్‌ వరల్డ్‌ సమర్పణలో కేవై బాబు, భానుప్రకాశ్‌ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్‌ గౌడ్, వైభవ్‌ రెడ్డి ముత్యాల నిర్మించారు. నిర్మాత ‘దిల్‌’ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రేపు (శుక్రవారం) ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి కెరీర్‌లో ఐకానిక్‌ క్యారెక్టర్‌ పెళ్లి కాని ప్రసాద్‌ (‘మల్లీశ్వరి’ చిత్రంలో). ఆయన పాత్రతో నా పాత్రని ఏ మాత్రంపోల్చుకోను. 

మా సినిమా ట్రైలర్‌ వెంకటేశ్‌గారు విడుదల చేసి.. ‘కంటెంట్‌ చాలా పాజిటివ్‌గా ఉంది.. సినిమా హిట్‌ సాధించాలి’ అని ఆశీర్వదించారు. మా సినిమాకి సపోర్ట్‌ చేసిన హీరోలు ప్రభాస్, వెంకటేశ్, దర్శకులు మారుతి, అనిల్‌ రావిపూడి, నిర్మాతలు ‘దిల్‌’ రాజు, శిరీష్‌ గార్లకు కృతజ్ఞతలు. ఈ మూవీలో ఎలాంటి సందేశం లేదు.. ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన సినిమా. 

ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూశాక మా నిర్మాతలూ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నారు. శేఖర్‌ చంద్ర మ్యూజిక్, నేపథ్య సంగీతం బాగుంటుంది. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలు చేస్తున్నాను. హీరోగా కూడా కొన్ని కథలు విన్నాను’’ అని చె΄్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement