saptagiri
-
భవనమ్లో థ్రిల్
సప్తగిరి, ధనరాజ్, ‘షకలక’ శంకర్, అజయ్, మాళవికా సతీషన్, స్నేహా ఉల్లాల్ ముఖ్య తారలుగా రూ΄÷ందిన చిత్రం ‘భవనమ్’. బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో ఆర్బీ చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న విడుదల చేయనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది. ‘‘సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూ΄÷ందించిన ఈ చిత్రంలో మంచి వినోదం ఉంది. కీలక తారాగణం పండించే కామెడీ బాగుంటుంది. అన్ని వర్గాలవారూ ఎంజాయ్ చేసేలా ఆసక్తికరమైన కంటెంట్‌తో తెరకెక్కించిన ‘భవనమ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బ్రహ్మానందం, రఘుబాబు మరియు సప్తగిరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి
-
ఇకపై నవ్వించే సినిమాలే చేస్తాను
‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో ‘అన్‌స్టాపబుల్’ చేశాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకున్నామంటూ ఫోన్ చేస్తున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఇచ్చిన తీర్పే రియల్ బ్లాక్ బస్టర్.. ఇకపై నేను అన్నీ నవ్వించే సినిమాలే చేస్తాను’’ అని డైరెక్టర్ ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా తీసి, థియేటర్లో రిలీజ్ చేయడం తేలికైన విషయం కాదు. రజిత్ రావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశారు’’ అన్నారు. ‘‘అన్‌స్టాపబుల్ 2’ని రత్నబాబు దర్శకత్వంలోనే చేస్తున్నాం’’ అన్నారు రజిత్ రావు. -
ఈవీవీ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి
‘‘ఒకే సినిమాలో ఇంతమంది నటీనటులను చూస్తుంటే ఈవీవీగారి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ‘అన్‌స్టాపబుల్’ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, ఆక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి అతిథిగా ΄ాల్గొన్నారు. సప్తగిరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో సన్నీ, డైమండ్ రత్నబాబులకు విజయం రావాలి’’ అన్నారు. ‘‘కుటుంబం అంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది. డైమండ్ రత్నబాబు మంచి హిలేరియస్ కథ రాశారు’’ అన్నారు సన్నీ. ‘‘మా సినిమా ΄ోస్టర్ చూసిన వారు ఈవీవీగారి సినిమాలాంటి అనూభూతి కలుగుతుందని చెప్పడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ షో ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడ ఓ సీట్‌ను ఈవీవీగారి కోసం ఉంచుతాం. ఇది ఆయనకు మేం ఇచ్చే ఓ చిరు కానుక’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘క్వాలిటీ కామెడీ ఉన్న ఈ ఫిల్మ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అన్నారు రజిత్ రావు. -
కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు.. అవి సహజమే: డైరెక్టర్
‘‘ప్రతి రచయిత, దర్శకుడు వారి బలాలు ఏమిటో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. రచయితగా ‘పిల్లా నువ్వులేని జీవితం’ (కొన్ని కామెడీ సన్నివేశాలు), ‘సీమశాస్త్రి’, ‘ఈడోరకం ఆడోరకం’లాంటి నవ్వించిన సినిమాలే నాకు ఇండస్ట్రీలో పేరు తెచ్చాయి. దర్శకుడిగా నేను చేసిన రెండు సినిమాలు (బుర్రకథ, సన్నాఫ్ ఇండియా) ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో నా బలం కామెడీ అని నమ్మి ‘అన్‌స్టాపబుల్’ మూవీ చేశాను. ఇకపై ప్రతి ఏడాది నా నుంచి ఓ నవ్వించే సినిమా వస్తుంది. ఒకవేళ ప్రయోగాలు చేయాలనుకుంటే ఓటీటీలో చేస్తా’’ అన్నారు డైమండ్ రత్నబాబు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సా ఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కల్యాణ్ పాత్రలో సన్నీ, జిలానీ రాందాస్‌గా సప్తగిరి నటించారు. చాలామంది హాస్యనటులు నటించారు. ఇక ‘అన్‌స్టాపబుల్’ సినిమా కాన్సెప్ట్‌ని చెప్పలేను. కానీ ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో అన్ని పాత్రలు ఓ పాయింట్‌కు కలుస్తాయి. ఈ అంశాలను థియేటర్స్‌లోనే చూడాలి. సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో రజిత్‌రావు రాజీ పడకుండా నిర్మించారు. నిజం చెప్పాలంటే.. యాక్షన్, ఫ్యామిలీ తరహా సినిమాలను తీయడం కంటే కామెడీ సినిమాలు తీయడం కత్తిమీద సాము వంటిది. కానీ ఈ విషయంలో జంధ్యాల, ఈవీవీ, రేలంగి, ఎస్వీ కృష్ణారెడ్డిగార్లు సక్సెస్ అయ్యారు. నేను రచయితగా ఎలా అయితే నవ్వించానో దర్శకుడిగానూ నవ్వించే సినిమాలే చేస్తాను. ఏ రచయిత అయినా కెప్టెన్ ఆఫ్ ది షిప్ (డైరెక్టర్) కావాలనుకుంటాడు. నేను అలానే రచయిత నుంచి దర్శకుడిని అయ్యాను. నేను రచయితగా ఉన్నప్పుడు కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు వచ్చి ఉండొచ్చు. మన కుటుంబాల్లో ఉన్నట్లు ఇండస్ట్రీలో కూడా అలాంటివి సహజమే. అయినా ఇప్పుడు ప్రతి రచయితలోనూ ఓ దర్శకుడు ఉన్నాడు. తమిళ పరిశ్రమలో ఎవరైతే కథ రాస్తారో వాళ్లకే దర్శకత్వం చేసే చాన్స్ కూడా ఉంటుంది. తెలుగులో కూడా అది మొదలైనట్లుంది’’ అని అన్నారు. -
కొత్త వాళ్లను ప్రోత్సహించాలి
‘‘జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాల్లో తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్లీ ఇంతమందిని (దాదాపు 50 మంది) ఒక్క దగ్గరికి చేర్చి ‘అన్‌స్టాపబుల్’ లాంటి మంచి వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలని యువ దర్శకులు, నటులు ప్రోత్సహించాలి.. అప్పుడే చిత్ర పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అన్‌స్టాపబుల్’లో నటించిన వారందరూ ఒక బ్రహ్మానందం కావాలి’’ అన్నారు. ‘‘డైమండ్ రత్నబాబులాంటి దర్శకులు సక్సెస్ అయితే మాలాంటి వాళ్లకు మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ మూవీతో ప్రేక్షకులను నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘అన్‌స్టాపబుల్’ పై ఉన్న నమ్మకంతో రిలీజ్‌కి ముందే నాకు కారుని బహుమతిగా ఇచ్చారు నిర్మాత రజిత్ రావు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘ఫ్యామిలీతో చూసే చిత్రం ఇది’’ అన్నారు రజిత్ రావు. -
రాహుల్ సిప్లిగంజ్ పాడిన బుల్..బుల్.. సాంగ్ విన్నారా?
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘బుల్ బుల్ అన్‌స్టాపబుల్..’ అనే తొలి పాటని హీరో గోపీచంద్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్‌తో కలసి భీమ్స్ పాడారు. ‘‘ఈ పాటలో సన్నీ, సప్తగిరి మాస్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
బిగ్‌బాస్ ఫేం వీజే సన్నీ హీరోగా కామెడీ చిత్రం
‘బిగ్ బాస్’ తెలుగు 5 సీజన్ విజేత వీజే సన్నీ హీరోగా కొత్త సినిమా ఆరంభమైంది.టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వైవిధ్యమైన కథలను చిత్రీకరించడంలో పేరు పొందిన వి. జయశంకర్ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది. ‘‘చక్కని వినోదం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. శుక్రవారమే రెగ్యులర్ షూటింగ్ ఆరంభించాం.. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి, రేఖ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ రెడ్డి, సంగీతం: మదీన్, దర్శకత్వ పర్యవేక్షణ: వి. జయశంకర్. -
‘అన్‌స్టాపబుల్’ టీజర్‌ను విడుదల చేసిన నాగార్జున
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. అన్ లిమిటెడ్ ఫన్ అన్నది ఉపశీర్షిక. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ‘అన్‌స్టాపబుల్’ టీజర్‌ను హీరో నాగార్జునతో విడుదల చేయించారు. ‘ట్విస్టులకే టీషర్టు వేసినట్లుండే ఇద్దరు ఇలఖత మఫిలియా గురించి మీకు చెప్తా’ అంటూ 30 ఇయర్స్ పృథ్వీ వాయిస్ ఓవర్‌తో టీజర్ సాగుతుంది. ‘‘డైమండ్ రత్నబాబు తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను నవ్వించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లే రసవత్తరంగా ఉంటుంది. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ అసెట్. రఘుబాబు, బిత్తిరి సత్తి, షకలక శంకర్, పాత్రలు నవ్వులు పంచే విధంగా ఉంటాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: వేణు మురళీధర్, కో ప్రొడ్యూసర్: షేక్ రఫీ, బిట్టు, రాము ఉరుగొండ. -
పక్కా కమర్షియల్.. బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతు దొరికిపోయిన కమెడియన్!
గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ టికెట్స్‌ను బ్లాక్‌లో అమ్ముతూ దొరికిపోయాడు కమెడియన్ సప్తగిరి. సప్తగిరి ఈ చిత్రంలో తన కమెడియన్గతో నవ్వించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సప్తగిరి బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ మారుతికి అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం సప్తగిరి మారుతి చివాట్లు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇదంత నిజం కాదండోయ్. చదవండి: ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వెనక్కి నెట్టిన కన్నడ చిత్రాలు జూలై 1న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ రేట్స్‌పై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. పక్కా కమరయల్ టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయనా అని ప్రతి ఒక్కరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ రేట్స్‌పై క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర బృందం ఇలా కొత్తగా ప్లాన్ చేసింది. గీతా ఆర్ట్స్ వారు తమ యూట్యూబ్ చానల్లో షేర్ చేసినీ ఈ వీడియోలో సప్తగిరి బ్లాక్ టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ మారుతికి దొరికపోయాడు. ఏంటి.. టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతున్నావా? అని మారుతి అడగ్గా... అవును సర్.. సినిమాల్లోకి రాకముందే చిరంజీవి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అని బదులిస్తాడు. అయితే ఒక టికెట్‌ను ఎంతకు అమ్ముతున్నావని అడగ్గా.. 150 రూపాయలకు అంటాడు. దీనికి కౌంటర్లో కూడా ఇదే రేట్‌కు ఇస్తున్నారు కదా! అంటాడు మారుతి. అది విని షాక్ అయిన సప్తగిరి అంటే పాత రేట్స్‌కే సినిమాను ప్రదర్శిస్తున్నారా? అని ప్రశ్నిస్తాడు. చదవండి: మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్ దీంతో మారుతి అవునయ్యా.. ఈ సినిమాను నాన్ కమర్షియల్ రెట్స్‌కే అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్మాత బన్నీ వాసు మూవీ ప్రమోషన్లో చెబుతున్నాడు కదా! అది వినలేదా? అని చెప్పగా. అవునా సర్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు సప్తగిరి. ఇక మూవీ టికెట్ రేట్స్‌పై వివరణ ఇస్తూ మరుతి.. ‘మా పక్కా కమర్షియల్ సినిమా మిమ్మిల్ని మళ్లీ పాత థియేటర్ల వైభవం రోజులకు తీసుకెళ్లడానికి సందడిగా హ్యాపీగా నవ్వుతూ మూవీని ఎంజాయ్ చేసేందుకు పాత రెట్స్‌కే() ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాను థియేటర్లోనే చూడండి. గ్రూపులు వచ్చి మా సినిమాను ఎంజాయ్ చేయండి. పాత టికెట్స్ రెట్స్‌కే మా సినిమాను థియేటర్లో ప్రదర్శించబోతున్నాం’ అంటూ డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చాడు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే -
సప్తగిరి హీరోగా కొత్త సినిమా, నవ్వులు ఫుల్!
సప్తగిరి హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఇందులో శ్రుతి పాటిల్ హీరోయిన్. సురేష్ కోడూరి దర్శకత్వంలో నూక రమేశ్ కుమార్ నిర్మాణ సారథ్యంలో మురళీమోహన్ నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టారు. నైన్టీస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ఈ చిత్రానికి శ్రీదర్ నార్ల సినిమాటోగ్రఫీ. చిరంజీవి(గోపి) మాటలు అందిస్తున్నారు అన్నారు సురేష్ కోడూరి. -
సప్తగిరి కొత్త సినిమా షురూ
సప్తగిరి హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ‘యజ్ఞం’, ‘పిల్లా... నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన ఏయస్ రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రిగ్వేద క్రియేషన్స్‌పై ఎ.ఎస్. రిగ్వేద చౌదరి నిర్మించనున్నారు. ఈ సందర్భంగా రిగ్వేద చౌదరి మాట్లాడుతూ– ‘‘వినూత్న కథాంశంతో నిర్మించనున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయి. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం మనోహర్, సహనిర్మాత: దేవినేని రవి. -
'అతిథి దేవో భవ’ మూవీ రివ్యూ
టైటిల్ : అతిథి దేవోభవ నటీ,నటులు: ఆది సాయికుమార్, నువేక్ష, రోహిణి, సప్తగిరి తదితరులు నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల దర్శకత్వం : పొలిమేర నాగేశ్వర్ సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: అమర్నాథ్ బొమ్మిరెడ్డి విడుదల తేది: జనవరి 7, 2022 ‘ప్రేమ కావాలి’,‘లవ్లీ’ సినిమాల తర్వాత యంగ్ హీరో ఆది సాయికుమార్ ఖాతాలో మరో హిట్ లేదు. వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు ఆది. తాజాగా ఈ యంగ్ హీరో 'అతిథి దేవో భవ’ అంటూ శుక్రవారం(జవవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అభి అలియాస్ అభయ్‌రామ్(ఆది సాయికుమార్) చిన్నప్పటి నుంచి మోనో ఫోబియాతో బాధపడుతుంటాడు. ఒంటరిగా ఉండలేదు. ఎక్కడికి వెళ్లినా తోడు ఉండాల్సిందే. ప్రతిసారి స్నేహితుడిని తోడుగా తీసుకు వస్తున్నాడని ఓ అమ్మాయి బ్రేకప్ కూడా చెబుతుంది. దీంతో తనకు ఉన్న లోపం గురించి ఎవరికి చెప్పకుండా దాచేస్తాడు. తర్వాత అతని లైఫ్‌లోకి మరో అమ్మాయి వైష్ణవి(నువేక్ష) వస్తుంది. మరి అభయ్ తన సమస్యను వైష్ణవితో చెప్పాడా?లేదా? మోనోఫోబియా వారి ప్రేమకి ఏవిధంగా అడ్డంకిగా మారింది? అభయ్ ఫ్లాట్‌కి వచ్చిన ప్రియ ఎవరు? ఆమె వల్ల తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తనకున్న భయాన్ని అభయ్ ఎలా అధిగమించాడు?అనేదే మిగతా కథ. ఎలా చేశారంటే..? అభయ్ పాత్రకి న్యాయం చేశాడు ఆది సాయికుమార్. నటనలో కొత్తదనం ఏమీ లేదు. వైష్ణవి పాత్రలో నువేక్ష చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తల్లిగా రోహిణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. హీరో స్నేహితుడిగా సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇమ్మాన్యుయేట్, అదుర్స్ రఘు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' సినిమాల్లో మాదిరే.. ఈ మూవీలో కూడా హీరో ఓ మాససిక రుగ్మతతో(మోనో ఫోబియా) బాధపడుతుంటాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..తెరపై చూపించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. గతంలో వచ్చిన ఆ రెండు చిత్రాలు వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించాయి. ఈ మూవీలో ఆ రెండూ లేవు. ఫస్టాఫ్ అంతా కామెడీగా నడిపించే ప్రయత్నం చేశాడు.. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. సప్తగిరితో వచ్చే కామెడీ సీన్స్ తెచ్చిపెట్టినట్లు ఉంటాయే తప్ప అంతగా హాస్యాన్ని పండించవు. ఇక సెకండాఫ్‌లో కాసేపు థ్రిల్ ఇవ్వాలని ట్రై చేశాడు. అదీ కూడా వర్కౌట్ కాలేదు. సినిమా మొత్తం సాగదీసినట్లు ఉంటుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. సప్తగిరి డ్రంక్డ్రైవ్లో దొరికిన సీన్ కానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌తో వచ్చే సీన్ కానీ సినిమాకు అతికించినట్లు ఉంటాయే తప్ప.. పెద్దగా నవ్వించవు. క్లైమాక్స్‌లో కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇక సాంకెతిక విషయానికొస్తే.. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన 'బాగుంటుంది నువ్వు నవ్వితే' పాట సినిమాకే హైలెట్. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. అమర్నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సప్తగిరి ‘గూడుపుఠాణి’ మూవీ మోషన్ పోస్టర్ విడుదల
సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘గూడుపుఠాణి’ చిత్రం టైటిల్‌ని సప్తగిరి హీరోగా నటించిన తాజా చిత్రానికి ఫిక్స్ చేశారు. కుమార్ కె.ఎం. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్గా నటించారు. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ని కృష్ణ విడుదల చేశారు. ‘‘కృష్ణగారు మా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయడం హ్యాపీ’’ అన్నారు సప్తగిరి. ‘‘గూడుపుఠాణి’ సినిమాకి దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది’’ అన్నారు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు’’ అన్నారు కుమార్ కె.ఎం. ఈ చిత్రానికి ప్రతాప్ విద్య సంగీతం అందిస్తున్నాడు. -
గజదొంగల నవ్వులు
‘‘హౌస్ అరెస్ట్’ సినిమా స్టార్ట్ కావడానికి కారణం అనూప్ రూబెన్స్. చిన్నపిల్లల సినిమా ఫుల్ కామెడీతో చేయాలని చెప్పాడు. అలా ఈ స్క్రిప్ట్ అనుకున్నాను. పిల్లల దృష్టి కోణంలో సాగే ఈ చిత్రంలో ఆరంభం నుంచి చివరి వరకు నవ్వులు ఉంటాయి. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇది’’ అని డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు ప్రధాన పాత్రల్లో ‘90ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకులు చంద్రమహేష్, ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్మాత అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, ‘హౌస్ అరెస్ట్’ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘హౌస్ అరెస్ట్’ సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇందులో సప్తగిరి, నేను, రఘు, రమేష్ గజదొంగలుగా నటించాం. కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ‘‘లాక్డౌన్ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రమిది. కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అన్నారు సప్తగిరి. -
ఇంట్లో అరెస్ట్ అయ్యారు
హాస్యనటులు సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి హీరోలుగా ‘హౌస్ అరెస్ట్’ అనే సినిమా ప్రారంభమైంది. ‘90 ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బాబీ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులకు విభిన్నమైన, చక్కని వినోదాన్ని అందించే సినిమాలు అందిస్తూ భవిష్యత్తులో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో మా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కంపెనీ అడుగులు వేస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె. యువరాజ్. -
‘సిటీని అద్భుతంగా తీర్చిదిద్దే వారికే ఓటు’
సాక్షి, హిమాయత్‌నగర్ : వేగంగా విస్తరిస్తున్న మన హైదరాబాద్ సిటీలో మరిన్ని కొత్త కట్టడాలు రావాల్సిన అవసరం ఉంది. విదేశాల్లోని సిటీల్లా, రీసెంట్గా ప్రారంభించిన దుర్గం చెరువు ఫ్లైఓవర్ లాంటివి ఏర్పాటు చేస్తే సిటీ కొత్త కొత్తగా ఉంటుంది. టెక్నాలజీతో పాటు, శానిటేషన్ వంటి వాటిలో కూడా మార్పులు ఎంతో అవసరం. ఈ ఎన్నికల్లో సిటీని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే వారికి ఓటువేసి ఎన్నుకుందాం. - సుహాసిని, బుల్లితెర నటి ఓటు వేస్తేనే భారతీయుడు లక్డీకాపూల్: ఓటు ప్రజల హక్కు.. తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి. ఏ పార్టీ వారికైనా కానివ్వండి.. కానీ ఓటు మాత్రం కచ్చితంగా వేయాలి. ఓటు వేసినప్పుడే ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఓటు వేస్తేనే మనం భారతీయులం.. ఓటు వేయని వాళ్లు భారతీయులే కాదన్నది నా అభిప్రాయం. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్కి వెళ్తే ఏదో అబ్రాడ్‌లో ఉన్నట్లు ఉంటుంది. సిటీలో రోడ్లపై దృష్టి పెట్టాలి. రోడ్లను వెడల్పు చేసి ట్రాఫిక్ని తగ్గించగలిగితే ఇంకా గొప్ప సిటీ అవుతుంది. – సప్తగిరి, సినీనటుడు -
సప్తగిరి ఛానెల్లో పాఠ్యాంశాలు ప్రసారం
సాక్షి, అమరావతి: దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా రాష్ట్రంలోని 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనను పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష కొనసాగిస్తున్నాయి.సెప్టెంబర్ మాసానికి సంబంధించిన పాఠ్యాంశాల బోధన ప్రణాళికను సోమవారం విడుదల చేశాయి. ► లాక్డౌన్ సమయంలో, ఆ తరువాత కూడా విద్యాశాఖ టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి సన్నద్ధతకు వీలుగా పాఠాలను దూరదర్శన్ ద్వారా రోజూ 2 గంటలపాటు ప్రసారం చేయించింది. ► తరువాత ఇతర తరగతుల విద్యార్థులకు బ్రిడ్జికోర్సు, విద్యావారథి పేరిట పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారాలను కొనసాగించింది. ► అన్‌లాక్ 4లో సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలను బోధించాలని కేంద్రప్రభుత్వం సూచించడంతో ఆమేరకు ఏర్పాట్లు చేశారు. ► ఈ మేరకు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రయినింగ్ (సీమ్యాట్) డైరెక్టర్ వీఎన్ మస్తానయ్య మెమో జారీచేశారు. ► సెప్టెంబర్ 10 వరకు రోజువారీగా ఆయా తరగతులకు బోధన జరిగే అంశాల షెడ్యూల్‌ను ప్రకటించారు. వారంలో అయిదు రోజుల పాటు ఈ ప్రసారాలు ఉంటాయి. ప్రతి రోజూ ఆరుగంటలపాటు ప్రసారం చేస్తారు. -
బాధ్యులను ఉపేక్షించేది లేదు
-
ఆ ఘటన వెనుక రాజకీయ కుట్రకోణం..
సాక్షి, విజయవాడ: సప్తగిరి మాసపత్రికపై రాజకీయ కుట్రకోణం దాగుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గతంలోనూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘గతంలో ఆర్టీసీ బస్సుల్లో అన్యమత ప్రచారం, తిరుమల కొండల్లో సిలువ పెట్టారని సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ఎవరు చూస్తున్నారో.. వారి ఇంగిత జ్ఞానానికి వదిలి వేస్తున్నాం. మధ్యలో ఎవరైనా కవర్లు మార్చారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. టీటీడీ కార్యాలయంలో అన్యమత పుస్తకాలు ఎందుకు ఉంటాయి? దేవుడిపైనే నింద వేయాలని చూస్తున్నారని’’ ఆయన ధ్వజమెత్తారు. (ఇది దురుద్దేశ చర్య: టీటీడీ) గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ సమయంలో ప్రజలను కాపాడమని సుందరకాండ, వేద పారాయణం టీటీడీ తరపున చేశామని, భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత కష్ట కాలంలో రాజకీయ దురుద్దేశ్యం తో చేస్తున్న ఆరోపణలు సరికావని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. -
కంచిలో షురూ
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, సమర్పిస్తున్న చిత్రం కంచిలో మంగళవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ‘హరేరామ్’ ఫేమ్ హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. రెయిన్బో మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శైలేష్ వసందాని నిర్మిస్తున్నారు. ప్రియాంక అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు.శైలేష్ మాట్లాడుతూ–‘‘కామాక్షి అమ్మవారి దీవెనలతో కంచిలో మా సినిమాని లాంఛనంగా ప్రారంభించాం. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, విజయేంద్రప్రసాద్, హర్షవర్థన్, శైలేష్‌తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: సంతోష్ శానమొని. -
‘వజ్ర కవచధర గోవింద’ మూవీ రివ్యూ
టైటిల్ : వజ్ర కవచధర గోవింద జానర్ : కామెడీ డ్రామా తారాగణం : సప్తగిరి, వైభవీ జోషి, జస్పర్, అర్చన, విరేన్ తంబిదొరై సంగీతం : బల్గానిన్ దర్శకత్వం : అరుణ్ పవర్ నిర్మాత : నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన సప్తగిరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా వజ్ర కవచధర గోవింద. సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాను తెరకెక్కించిన అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడి స్టార్‌ను మాస్ హీరోగా మార్చిందా..? హీరో పాత్రకు సప్తగిరి ఎంతవరకు న్యాయం చేశాడు..? కథ : సోమల అనే చిన్న గ్రామంలో ఉండే గోవింద్(సప్తగిరి) తన గ్రామ ప్రజలు పడే కష్టాలు చూడలేక దొంగగా మారతాడు. ఊళ్లో ఒక్కొక్కరు క్యాన్సర్‌తో చనిపోతుండటంతో వారిని కాపాడేందుకు చాలా డబ్బు కావాలనే ఉద్దేశంతో ఓ నిధిని వెతికేందుకు కొంతమందితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ ప్రయత్నంలో వారికి 150 కోట్ల విలువైన మహేంద్ర నీలం అనే వజ్రం దొరుకుతుంది. ఆ వజ్రాన్ని అమ్మి పంచుకోవాలనుకుంటారు గోవింద్ అండ్ బ్యాచ్. అయితే వజ్రాన్ని ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టిన గోవింద్ ఓ ప్రమాదంలో గతం మర్చిపోతాడు. వజ్రాన్ని దాచిన చోటు కూడా మర్చిపోతాడు. చివరకు గోవింద్‌కు గతం గుర్తుకు వచ్చిందా..? వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చాడా..? ఈ కథతో బంగారప్పకు ఉన్న సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : కమెడియన్‌గా ఆకట్టుకున్న సప్తగిరి హీరోగా ప్రేక్షకులను కన్విన్స్ చేయలేకపోయాడు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో సప్తగిరి నటన తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు ఏ మాత్రం సూట్ అయినట్టుగా అనిపించదు. కామెడీ సీన్స్‌లో ఆకట్టుకున్నా.. అది పూర్తిగా సినిమాను నిలబెట్టే స్థాయిలో లేదు. హీరోయిన్ పాత్రకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేకపోవటంతో వైభవీ జోషికి నటనకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. లుక్ పరంగానూ వైభవీ ఆకట్టుకోలేకపోయారు. విలన్‌గా జస్పర్ లుక్ బాగుంది. ఇతర పాత్రలో అర్చన, టెంపర్ వంశీ, జాన్ కొట్టోలి, విరేన్ తంబిదొరై తమ పరిధి మేరకు పరవాలేదనిపించారు. విశ్లేషణ : సప్తగిరికి మాస్ ఇమేజ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు అరుణ్ పవార్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాడు. సప్తగిరి ఇమేజ్ను పట్టించుకోకుండా ఇంట్రో సాంగ్, స్లోమేషన్ షాట్స్, యాక్షన్ సీన్స్‌తో సినిమాను తెరకెక్కించాడు. కథా కథనాల విషయంలోనూ దర్శకుడు తడబడ్డాడు. హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు, అసలు కథ మొదలయిన తరువాత కూడా కథనాన్ని నెమ్మదిగా నడిపించాడు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోగా అసలు కథకు బ్రేకులు వేస్తూ విసిగిస్తాయి. సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. సంగీతం, ఎడిటింగ్, నిర్మాణ విలువలు నిరాశపరుస్తాయి. ప్లస్ పాయింట్స్ : కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కథా కథనాలు దర్శకత్వం ఎడిటింగ్ నిర్మాణ విలువలు - సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
అదిరిపోయిందిరా బాబు అంటారు
సప్తగిరి హీరోగా అరుణ్ పవార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వజ్ర కవచధర గోవింద’. ఇందులో వైభవీ జోషి కథానాయికగా నటించారు. నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ– ‘‘సినిమా పట్ల బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమాపై చాలా పాజిటివ్ వైబ్ ఉంది. దాదాపు 300 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమా పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ దైవస్థానంలో ఉంటారని అంటారు. ఆ స్థానంలో ఉండి మాకు సహకరించిన నిర్మాతలకు ధన్యవాదాలు. హీరోయిన్గా వైభవి జోషి బాగా నటించారు. ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలి. అలాగే మా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన శ్రీకాంత్ అన్నకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కామెడీతోపాటు మంచి ఎమోషన్ అంతకు మించిన బలమైన కథ ఉంది. మంచి క్లైమాక్స్ కుదిరింది. నిర్మాతలు సపోర్ట్ చేశారు. వారికి రెండు రోజుల్లోనే డబ్బులు వస్తాయి. సినిమా చూసిన వారు అదిరిపోయిందిరా బాబు అని అంటారు’’ అన్నారు అరుణ్ పవార్. ‘‘కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు జీవీఎన్ రెడ్డి. హీరోయిన్ వైభవి జోషి, నిర్మాత నరేంద్ర, నటులు మంజు, రాజేంద్రన్, రాజేష్, ప్రసాద్ పాల్గొన్నారు. -
వజ్రానికి కవచంలా...
‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవీ జోషీ కథానాయికగా నటించారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బేబీ శస్త్ర సమర్పణలో శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్, ప్రత్యేక పాటను హైదరాబాద్‌లో విడుదల చేసారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రాల తర్వాత నన్ను నేను కొత్తగా ఎలా చూపించుకోగలను అని ఎదురుచూస్తున్న సమయంలో అరుణ్ పవార్ ఈ కథ చెప్పారు. ‘లక్ష్యం గొప్పదైనా వెళ్లే మార్గం మంచిది అయితేనే ఆ దేవుడి సహకారం ఉంటుంది’ అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నేను హీరోగా కాకుండా మంచి కమెడియన్‌గా ఎంటర్టైన్ చేస్తాను. ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. సినిమాని మేలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అరుణ్ పవార్ మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అప్పుడు నోట్ల రద్దు ఉన్నా కూడా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు చూశారు. అంతకంటే మంచి పేరు, డబ్బులు రావాలనే కసితో ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా తెరకెక్కించాం. సినిమా చాలా బాగా వచ్చింది. వజ్రం కోసం సప్తగిరి ఎలా కవచంలా నిలబడ్డాడు అనేది కథ’’ అన్నారు. ‘‘టైటిల్ ప్రకటించగానే మా సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అటెన్షన్ బాగా పెరిగింది. నరేంద్ర అన్నగారు ఈ సినిమాకు ఎంతో సహకారం అందించారు. మా సినిమా టీజర్ చూసి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేసేందుకు ముందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్యగారికి నా కృతజ్ఞతలు’’ అన్నారు జీవీఎన్ రెడ్డి. నటుడు రాఘవ, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి, డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, ఎడిటర్ కిషోర్ మద్దాలి మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు. -
సప్తగిరి హీరోగా.. ‘వజ్ర కవచధర గోవింద’
అతని పేరు గోవిందు. ఫన్నీ దొంగ. అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే `వజ్ర కవచధర గోవింద` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు సప్తగిరి. కమెడియన్ సప్తగిరి ఫన్నీ దొంగగా నటిస్తున్న సినిమా `వజ్ర కవచరధర గోవింద`. ఈ సినిమాకు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ `నా దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నటించిన `సప్తగిరి ఎక్స్ ప్రెస్` విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా రూపొందిస్తున్న `వజ్ర కవచధర గోవింద` అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో కృషి చేస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. సప్తగిరి వ్యావహారిక శైలికి పర్ఫెక్ట్గా సూటయ్యే కథ ఇది. మా కథకు అనుగుణంగానే పవర్‌ఫుల్‌గా `వజ్ర కవచధర గోవింద` అనే టైటిల్ పెట్టాం` అని అన్నారు. వైభవీ జోషి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .